WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Beauty Tips for Women. Show all posts
Showing posts with label Beauty Tips for Women. Show all posts

Wednesday, 6 July 2016

HEALTH AND BEAUTY BENEFITS WITH ROSEMARY


అందం.. ఆరోగ్యాల రోజ్‌ మేరీ!

రోజ్‌మేరీ పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన చిన్నపొద. వంటల్లో కొత్తిమీరలాగ దీన్ని ఎక్కుగా విదేశీ వంటల్లో వాడతారు. ప్రధానంగా మాంసాహార వంటల్లో సువాసనకు వాడినా, శాకాహార వంటల్లోనూ, బ్రెడ్‌లు, సూపుల తయారీలోనూ సలాడ్లలోనూ కూడా విరివిగా వాడతారు. హెర్బల్‌టీ కూడా తయారు చేస్తారు.

రోజ్‌మేరీ శాస్త్రీయనామం రోజ్‌మారినస్‌ అఫిషినాలిస్‌. బూడిద రంగు కొమ్మలు, ఆకుపచ్చని సూదుల్లాంటిసన్నని ఆకులతో, సుకుమారమైన సువాసనగల ప్రకాశవంతమైన నీలిరంగుపూలతో అందంగా ఉంటుంది. దాదాపు మూడు అడుగుల ఎత్తువరకూ పెరిగే ఈ చిన్నపొద ఇది. నీరు నిలవని ఇసుకనేలల్లో, చల్లటి వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. దీనికి ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు ప్రకాశవంతమైన వెలుతురు అవసరం. అలాని ఎండ తీవ్రత ఎక్కువ ఉండకూడదు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. మన దగ్గర సూటిగా ఎండ పడనిచోట నాటుకుంటే మంచిది. మట్టి మిశ్రమంలో ఇసుక, కోకోపీట్‌ పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎండాకాలంలో కొబ్బరిపీచుతో మొక్క చుట్టూ కప్పితే తేమ ఉండి వేళ్లకు చల్లగా ఉంటుంది.
రెండు రకాల్లో... రోజ్‌మేరీ నెమ్మదిగా పెరుగుతుంది. ఆకు పచ్చిదైనా, ఎండినదైనా కూడా వంటల్లో వాడతారు. ఆకు కోసేటప్పుడు గ్రీవంపైన తుంచుకుంటే చిగుళ్లు త్వరగా వస్తాయి. దీన్ని నచ్చిన ఆకృతిలో కత్తిరించుకోవచ్చు. ఒకసారి నాటిన మొక్క చాన్నాళ్లపాటు నిలిచి ఉంటుంది. రోజ్‌మేరీలోని రెండు రకాల్లో అఫిషినాలిస్‌ పొదలాగా పెరిగితే, ప్రోస్ట్రేటస్‌ కొద్దిగా తీగలాగా సాగుతుంది. ప్రోస్ట్రేటస్‌ రకం రాక్‌ గార్డెన్లలోనూ, వేలాడే తొట్లలోనూ పెంచుకోవడానికి కూడా బాగుంటుంది. వంటలో వాడటానికి మాత్రం రెండూ ఒకేలా ఉంటాయి.

* సేంద్రియ ఎరువులు వాడితే...

రోజ్‌మేరీ ఆకులు పసుపు పచ్చగా మారుతుంటే, కుండీ మార్చే సమయం దగ్గరపడిందని సంకేతం. ఏడాదికోసారి కుండీ మార్చుకోవాలి. దీన్ని వంటల్లో వాడతాం కనుక వర్మీకంపోస్టు, ఆముదం, వేరుసెనగ పిండి వంటి సేంద్రియ ఎరువుని మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. దీనికి రసం పీల్చే పురుగులు, పిండి, పొలుసు పురుగుల బెడద ఎక్కువే. అలాగే బూడిద తెగులు, వేరుకుళ్లు కూడా ఆశించవచ్చు. నీరు నిలవని మట్టి మిశ్రమంలో నాటి, గాలి సరిగా తగిలేలా చూసుకుంటే మంచిది. వేప, వెల్లుల్లి, మిరపవంటి కషాయాలు చల్లుతూ ఉండాలి. జిగురుగా ఉండే స్టిక్కీ ట్రాపులను(మార్కెట్‌లలో దొరుకుతాయి) మొక్కల మధ్య తగిలిస్తే వీటిని నివారించవచ్చు.

* ఔషధ గుణాలెన్నో...

రోజ్‌మేరీకి ఔషధగుణాలు ఎక్కువే. తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులకు నివారణంగా వాడతారు. ఈ నూనెను తలకు మర్దన చేస్తే బట్టతల వచ్చే అవకాశం తగ్గుతుందట. రోజ్‌మేరీని కలపడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు ఉండే నూనెలు(అవిసె నూనె) వంటివి త్వరగా పాడైపోకుండా ఉంటాయట. దీన్ని రూమ్‌ఫ్రెష్‌నర్‌గానూ, పెర్‌ఫ్యూమ్‌ల్లోనూ వాడతారు. జ్ఞాపకానికీ, ప్రేమకూ సంకేతంగా భావిస్తారు కూడా. రోజ్‌మేరీని కత్తిరింపుల ద్వారా సులభంగా ప్రవర్థనం చేయవచ్చు. గింజలతో పెంచడం కొంచెం కష్టం. ఈ మొక్క మన దగ్గర కంటే పూణె, బెంగళూరు వంటి నగరల్లోని నర్సరీల్లో సులువుగా దొరుకుతుంది.

CHINA WOMEN BEAUTY TIPS WITH RICE WATER - PESALU - GREEN TEA - PUDINA


అందానికి చైనా సూత్రాలు ....!

చైనా అమ్మాయిలు తమ సౌందర్య పోషణకు సహజ సిద్ధమైన పదార్థాలనే ఎక్కువగా వాడతారు. మార్కెట్లలో లభించే రకరకాల క్రీముల కంటే వీటికే ప్రాధాన్యమిస్తారు..

* బియ్యం నీళ్లు: ముఖం అందంగా కనిపించాలంటే.. ముందు అది పరిశుభ్రంగా ఉండాలి. అందుకోసం ఖరీదైన ఉత్పత్తులేవీ వాడరు. బియ్యం నీళ్లనే టోనర్‌గా ఎంచుకుంటారు. అదెలాగంటే పాలిష్‌ చేయని బియ్యాన్ని ముందుగా నీళ్లలో నానబెడతారు. కాసేపటికి నీళ్ల రంగు తెల్లగా పాలలా మారుతుంది. ఆ నీటిలో దూదిని ముంచి తుడుచుకుంటే ముఖం పరిశుభ్రంగా... ప్రకాశవంతంగా తయారౌతుంది.

* పెసలు: వీటిని కొన్ని శతాబ్దాలుగా ముఖానికి పూతలా వాడుతున్నారు చైనీయులు. బాగా నానబెట్టిన పెసల్ని మెత్తగా రుబ్బి ముఖానికి పూతలా వేసుకుంటారు. అరగంటయ్యాక కడిగేసుకుంటారు. ముఖం నిగారింపు సంతరించుకోవడమే కాదు, మొటిమలు కూడా తగ్గుతాయి.

* గ్రీన్‌ టీ: దీన్ని చర్మ, కేశసంరక్షణకు మాత్రమే కాదు... పొద్దునే లేచి మూడు, నాలుగుకప్పులు తాగేస్తారు.. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు వార్థక్యపు ఛాయల్ని నివారిస్తాయి. జీవక్రియల వేగాన్నీ పెంచుతాయి.

* మర్దన: మనం మర్దనని కేవలం విశ్రాంతికీ, ఒత్తిడి నివారణ కోసమనే అనుకుంటాం. కానీ చైనీయులు మాత్రం మర్దన వల్ల శరీరానికి రక్తప్రసరణ సజావుగా సాగుతుందనీ, శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయనీ భావిస్తారు. అందుకే తరచూ మర్దనకు ప్రాధాన్యం ఇస్తారు.

* పుదీనా: చైనా అమ్మాయిల అందానికి కారణం పుదీనానే. వీరు గుప్పెడు పుదీనా ఆకుల్ని ముద్దలా చేసి ముఖానికి రాసుకుంటారు. కాసేపయ్యాక కడిగేస్తారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తారు.
పసుపు: మన దేశంలో సౌందర్య సంరక్షణలో ఎక్కువగా పసుపు వాడుతుంటాం. చైనీయులు కూడా దీనికి అంతే ప్రాధాన్యం ఇస్తారు. చర్మంపై ముడతల్ని నివారించేందుకు, శరీరఛాయను మెరుగుపరిచేందుకు పసుపును ఎంచుకుంటారు. రెండు చెంచాల పసుపులో చెంచా తేనె, కాసిని బాదం పాలు చేర్చి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుంటారు. పదిహేను నిమిషాల తరవాత కడిగేస్తారు. ఇలాంటి చిన్నచిన్న చర్యల ద్వారానే వారు తమ చర్మ సౌందర్యాన్ని పెంచుకుంటారు.

BEAUTY HELATH BENEFITS WITH MENTHI


మెరిపించే మెంతి

కాస్త కంటికి నదురుగా....తాజాగా కనిపించడం కోసం అస్తమానం బ్యూటీపార్లర్లకే వెళ్లాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉండే మెంతులు, మెంతి ఆకులతో అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. 

కూరల్లో ఉపయోగించే దీన్ని సౌందర్య పోషకంగా ఎలా వాడాలి అంటారా? 

* మెంతిలో అధిక మోతాదులో లభించే ప్రొటీన్‌ జుట్టు రాలడాన్ని నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులోని నికోటినిక్‌, లెసిథిన్‌ కుదుళ్లు బలంగా మారేందుకు, జుట్టు ఎదగడానికీ సాయం చేస్తాయి. ఇక ఇందులోని పొటాషియం చిన్నవయసులోనే శిరోజాల రంగు మారడాన్ని అరికడుతుంది. ఈ ఫలితాలు అందాలంటే గుప్పెడు మెంతుల్ని ఓ రోజంతా నానబెట్టాలి. ఆ నీటిని వడకట్టి జుట్టుని తడపండి. జుట్టుని అలాగే మూడు నాలుగు గంటలపాటు ఆరనివ్వండి. ఆపై గోరువెచ్చని నీటితో స్నానం చేసి చూడండి. ఇలా వీలైతే రోజూ చేయండి.

* తాజాగా ఉండే మెంతిఆకులను ఎంచుకుని శుభ్రంగా కడిగి మెత్తగా మిక్సీ పట్టాలి. ఆ ముద్దకు ఓ రెండు చెంచాల నిమ్మరసం కలిపి తలకు పెట్టుకోవాలి. అరగంటాగి స్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.

* పావుకప్పు మెంతుల్ని నాలుగైదు గంటల ముందు పెరుగులో నానబెట్టుకోవాలి. దాన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే రుబ్బుకోవాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించి బాగా నలుగు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగిపోతాయి. చర్మంపై పేరుకున్న దుమ్ము,ధూళి, మురికి వదిలిపోతాయి. చర్మం నునుపుగా తయారవుతుంది. ఇలా కనీసం వారంలో ఒకసారి చేస్తే యుక్తవయసు అమ్మాయిల్లో మొటిమల సమస్య తగ్గుతుంది.

BEAUTY WITH HOT WATER


 అందానికి గోరువెచ్చని నీళ్లు

ముఖాన్ని అందంగానే కాదు, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఇంతకీ అవేంటంటే..

* వాతావరణం ఏ మాత్రం చల్లగా ఉన్నా.. వేణ్నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటూ ఉంటాం. అలాగే ఏ మాత్రం ఎండగా అనిపించినా చల్లనినీళ్లను ముఖంపై చల్లుకుంటాం. నిపుణుల ప్రకారం రెండూ సరికావు. మరీ వేడిగా, అలాగని చల్లగా కాకుండా ఏ రుతువులోనైనా గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవడం శ్రేయస్కరం.

* సున్నితమైన చర్మాన్ని అదేపనిగా రుద్దడం వల్ల ఎర్రగా కందిపోతుంది. చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగించేందుకు అదేపనిగా రుద్దాలని లేదు. కేవలం మునివేళ్లతో మర్దన చేసుకుని, తరవాత కడిగేస్తే చాలు.

* ముఖంలో పేరుకున్న మురికీ, క్రిములు పూర్తిగా తొలగిపోవాలంటే ముందుగా మేకప్‌ని పూర్తిగా తుడిచేయాలి. క్లెన్సర్లు మేకప్‌ని తొలగించవు కాబట్టి మేకప్‌ రిమూవర్‌ని ఎంచుకుంటే మంచిది. ఆ తరవాతే ముఖాన్ని కడుక్కోవాలి.

* సబ్బులు చేతులూ, శరీరానికి మేలు చేస్తాయి కానీ, ముఖానికి కాదు. వాటి గాఢత చర్మం బరకగా మారేలా చేస్తుంది. అందుకే ముఖానికి మాత్రం ఫేషియల్‌ క్లెన్సర్‌ని వాడాల్సి ఉంటుంది. అది కూడా మన చర్మతత్వానికి నప్పేదై ఉండాలి.

* ముఖాన్ని శుభ్రం చేసుకునే ముందు చేతుల్ని కడుక్కోవాలి. లేదంటే చేతుల్లోని మురికీ, క్రిములు ముఖంలోకి చేరతాయి. దాంతో మొటిమలు మొదలవుతాయి.

* కొందరు రోజంతా అదేపనిగా ముఖాన్ని కడుక్కుంటూ ఉంటారు. కానీ అది సరైన పనికాదు. అలా చేయడం వల్ల చర్మం పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అతిగా శుభ్రం చేయడం వల్ల కూడా చర్మంలో అధిక నూనెలు విడుదలై ఇబ్బంది పెడతాయి.

Wednesday, 25 May 2016

REMOVE UNWANTED HAIR WITH SENAGAPINDI


కొన్ని వందల సంవత్సరాల నుండి శెనగపిండిని బ్యూటీ ప్రొడక్ట్ గా ఉపయోగిస్తున్నారు.

 ఫేషియల్స్ కోసం ఉపయోగిస్తున్నారు . 

శెనగపిండిలో కొద్ది పసుపు, సరిపడా నీరు పోసి పేస్ట్ చేసి 

అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేసి మర్ధన చేయాలి. 

15నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

Thursday, 28 January 2016

BEAUTY AND HEALTH BENEFITS WITH MANDHARAM FLOWER


ముగ్ధ మందారం! 

ఆహ్లాదాన్నిచ్చే అందం మందార పూల సొంతం. పూలే కాదు ఆకులూ, వేళ్లూ ...ఇలా అన్నింటిలోనూ ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అందాన్ని మెరుగుపరిచే సుగుణాలూ అధికమే. 

మరి వాటిని ఉపయోగించుకుని ఎలా మెరిసిపోవచ్చో తెలుసుకుందామా?

వార్థక్య లక్షణాలను నిలువరించే శక్తిమంతమైన మొక్క మందారం. అందుకే దీన్ని బొటాక్స్‌ ప్లాంట్‌ అనికూడా పిలుస్తారు. ఈ మొక్కలో చర్మానికి సాగే గుణాన్ని అందించి యవ్వనశోభతో మెరిసిపోయేలా చేసే లక్షణాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా దీనిలోని యాంటీ-యాక్సిడెంట్‌లు దుమ్మూధూళీ. అతినీలలోహిత కిరణాల దుష్ప్రభావం నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. మందార పువ్వు రేకల్ని ఎండబెట్టి పొడిగా చేసి వాటిని నీళ్లలో వేసి మరిగించి ఆ నీటితో ముఖం కడుక్కుంటే అలసిన చర్మానికి ఉపశమనం ఉంటుంది.

* మందార ఆకులు జుట్టు ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. పొడిబారిన వెంట్రుకలకు తగిన పోషణనందించి మృదువుగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. మందార ఆకుల్ని మెత్తగా నూరి దానికి బాగా మగ్గిన అరటిపండునూ చేర్చి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట ఆగి గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుని చూడండి. జుట్టు పట్టులా మెరిసిపోతుంది.

* రెండు టేబుల్‌స్పూన్ల మందారపొడికి చెంచా తేనె, కాసిని పాలు కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి రాసుకుని మర్దన చేయాలి. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మారేలా చేస్తుంది. అలానే మందారంలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మొటిమల్ని తగ్గిస్తాయి. గాయాల తాలూకు మచ్చలు కూడా త్వరగా పోతాయి.

* పది నుంచి పదిహేను మందార ఆకుల్ని పావుకిలో కొబ్బరినూనెలో వేసి చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశంలో మూడు నుంచి ఆరువారాల పాటు ఉంచాలి. ఆ తరవాత ఆకులు తీసేసి ఆ నూనెతో తలకు మర్దన చేసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి. మందార ఆకులతో పాటు కాసిని కరివేపాకు ఆకుల్నీ చేర్చి వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, కుదుళ్లు బలపడి శిరోజాలు ఆరోగ్యంగా మారతాయి.


Wednesday, 27 January 2016

QUICK BEAUTY TIPS FOR WOMEN IN TELUGU


రాత్రి రాస్తే.. ఉదయాన్నే అందం...!

ఒక్కోసారి రాత్రికి రాత్రే అందం రెట్టింపు అయిపోతే బావుణ్ణు అనిపిస్తుంది. ఎందుకంటే ఉదయాన్నే ఏ పెళ్లి వేడుకకో, పార్టీకో వెళ్లాల్సి వస్తుంది. అందం అనేది రోజుల్లోనే మెరుగవ్వదు కాని.. ఇలా పొద్దున్నే వేడుకలకు వెళ్లాలనుకునే వాళ్లు.. ఆ ముందు రోజు రాత్రి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..
తక్కువ టైమ్‌లోనే ముఖ సౌందర్యాన్ని వెలుగులీనేలా చేసే గుణం అలొవీర సొంతం. జ్యూస్‌ లేదా జెల్‌ ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే ముఖం మీదున్న చిన్న చిన్న గాయాలు, మచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. జెల్‌ రాసుకున్న గంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అందరి ఇళ్లలో ఎప్పుడూ సిద్ధంగా ఉండే క్రీమ్‌ వాజెలిన్‌. రాత్రి పడుకోబోయే ముందు కాళ్లు, చేతులకు రాసుకోవాలి. మునివేళ్లతో మెల్లగా మసాజ్‌ చేసుకుని.. చేతులకు కాటన్‌బట్టతో తయారైన గ్లౌజులు, కాళ్లకు ఉతికిన సాక్సులు వేసుకుంటే తడి ఆరిపోదు. పొద్దున్నే చర్మం నిగనిగలాడుతుంది. చర్మం సున్నితంగా తయారవుతుంది.
శరీరంలోని అన్ని భాగాల గురించి మనం పట్టించుకుంటాం కాని కనురెప్పల గురించి పెద్దగా పట్టించుకోము. అందుకనే మీరు రాత్రి పడుకునే ముందు.. కనురెప్పలకు ఒక టేబుల్‌ స్పూన్‌ ఆముదం పట్టించుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా, బలంగా తయారవుతాయి. రాత్రి పడుకునే ముందు తాజా కొబ్బరినూనెను ముఖానికి పట్టించుకోవాలి. ముఖరక్తనాళాల్లో రక్తం సాఫీగా సాగేందుకు చిన్నపాటి మసాజ్‌ కూడా అవసరం. దీనివల్ల ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది. వయసుతో పాటు వచ్చే ముడతలు అంత త్వరగా రావు.
చలికాలం, వర్షాకాలంలో దప్పిక తక్కువ. కాబట్టి మంచినీళ్లు ఎక్కువగా తాగరు. దానివల్ల శరీరం మొత్తం డీ హైడ్రేట్‌ అవుతుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు మంచి నీళ్లను తప్పక తాగాలి. ఆ చిన్న అలవాటే శరీరాన్ని డీ హైడ్రేట్‌ కాకుండా చూస్తుంది.
ఆల్మండ్‌ ఆయిల్‌లోకి కాస్త నిమ్మరసం కలుపుకుని.. ముఖానికి, కళ్లకింది భాగంలో రాసుకుంటే బెటర్‌. దీనివల్ల ఉదయాన్నే ముఖం చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కళ్లు నీరసంగా కనిపించవు.

Friday, 8 January 2016

BEAUTY TIPS IN TELUGU TO INDIAN WOMEN


  • సంవత్సరమంతా సన్‌ప్రొటెక్షన్‌ కలిగిన మాయిశ్చరైజర్‌ వాడాలి. ఇది రాసుకోవడం వల్ల అల్ర్టావైలట్‌ కిరణాలు చర్మాన్ని దెబ్బతీయవు. చలికాలంలో సూర్యుడు పలకరించేదే తక్కువ ఇక యువి కిరణాలు ఏం చేస్తాయి అనుకోవద్దు. ఎందుకంటే ఈ సీజన్‌లో కూడా యువి కిరణాల ప్రభావం చర్మంపై ఉంటుంది. చర్మం యవ్వనంగా కనిపించాలంటే ఎస్‌పిఎఫ్‌ కలిగిన మాయిశ్చర్‌ లోషన్లు సంవత్సరమంతా వాడాల్సిందే
  • ఉదయం స్నానం చేసేముందు కొన్ని నిమిషాలు శరీరాన్ని బ్రష్‌తో రుద్దాలి. ఇది ప్రతిరోజూ చేయాలి. ఇలా చేస్తే చర్మం యవ్వనంగా ఉంటుంది. చర్మంపై ఉండే వ్యర్థాలు బయటికి వస్తాయి. రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. దాంతో శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు విడుదలవుతాయి. పొడి బ్రష్‌తో పొడి చర్మం మీద రుద్దాలి. చర్మం తడిస్తే సున్నితంగా ఉంటుంది. బ్రష్‌ స్ర్టోక్స్‌ పాదాల దగ్గర్నించి ఇవ్వాలి. పాదం నుంచి గుండె వైపుకి పైవైపుకి రుద్దాలి.
  • స్నానం చేశాక బాడీ మాయిశ్చరైజర్‌ను రాసుకోవడం తప్పనిసరి. పొడి చర్మం వాళ్లయితే స్నానం తరువాత మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మర్చిపోవద్దు. శీతాకాలంలో చల్లగా ఉందని వేడి వేడి నీళ్లు స్నానం చేస్తుంటారు కదా. అది సమస్యను జటిలం చేస్తుంది. శరీరం తేమను కోల్పోయేలా చేస్తుంది. అలాకాకుండా చర్మం మృదువుగా ఉండాలంటే అందుకు కాస్త సమయాన్ని కేటాయించాల్సిందే.
  • శరీరంలోని వ్యర్థాల్ని బయటకు పంపేందుకు రోజుకు రెండు లీటర్ల నీళ్లు తాగాలి. శరీరంలో నీటి శాతం తగ్గిన విషయం మూత్రం రంగును బట్టి తెలుసుకోవచ్చు. అది రంగు మారిందంటే శరీరంలో తగినంత నీరు లేనట్టే.
  • మేకప్‌ వేసుకునే అలవాటు ఉంటే ఇంటికి రాగానే మేకప్‌ తీసేయాలి. ఇది సౌందర్య ప్రపంచంలో తప్పక పాటించాల్సిన గోల్డెన్‌ రూల్‌. ముఖం మీదకు చేరిన దుమ్ము, ధూళితో నిద్రపోతే చర్మానికి మీరే హాని చేసినట్టు. అందుకని నిద్రపోబోయే ముందు మేక్‌పను తప్పక తుడిచేయాల్సిందే. క్లెన్సింగ్‌ లోషన్‌ లేదా ఫేస్‌వాష్‌ వాడి మేకప్‌ తీసేయొచ్చు. మేకప్‌ తీశాక మాయిశ్చరైజర్‌ లేదా నచ్చిన నైట్‌క్రీమ్‌ రాసుకోవాలి.

Wednesday, 16 December 2015

HOW TO MAINTAIN BEAUTYNESS TO NECK - NECK BEAUTY CARE TIPS FOR WOMEN


ముఖసౌందర్యంలో మెడ కూడా ఒక భాగమే

ముఖం అందంగా ఉం డాలని కోరుకునేవారు మెడను కూడా పట్టించుకుంటూ, మెడ సౌందర్యాన్ని కాపాడుకోవాలి. అందరి మెడలు ఒకే తీరుగా ఉండవు. కొంతమంది మెడ పొడవుగా ఉంటే, కొందరి మెడభాగం ఎత్తు తక్కువగా ఉంటుంది. కొందరు మెడ వెడల్పుగాఉండి, గుండ్రంగా ఉంటుంది. ఇంకొందరి మెడభాగం చాలా తక్కువగా కనిపిన్తుంది. ఒక్కొక్కరి మెడ ప్రాంతం రకరకాలుగా ఉంటుంది. తమ మెడ ఆకారాన్ని బట్టి స్త్రీలు జాకెట్ల నెక్‌కు ప్రాధాన్యతనివ్వాలి. పొడుగ్గా మెడ ఉండే స్త్రీలు మెడ చుట్టూ వెడల్పుగా ఉండే ఆభరణాన్ని ధరిస్తే బాగుంటుంది. మెడవెడల్పుగా ఉన్నవారు నెక్లస్‌ పెట్టుకుంటే మెడ ఆకర్షణీయం గా ఉంటుంది. మెడ చిన్నగా ఉన్నవారు సన్నని గొలుసును వేసుకోవచ్చు. మెడను పరిశుభ్రంగా ఉంచుకుంటే, మెడ కూడా అందంగా కనిపిస్తుంది.

1.    బయటకు వెళ్ళినప్పుడు చెమటపడుతుంది. ఆ చెమట తడిలో వాతా వరణంలోని దుమ్ము, దూళి అతుక్కుని మెడ అపరిశుభ్రంగానూ, నల్ల గానూ కనిపిస్తుంది. మెడచర్మపు ఛాయ బాగుండాలంటే, బయటనుంచి రాగానే ముఖం, కాళ్ళుచేతులతో పాటు మెడను కూడా నీటితో శుభ్రపరచుకోవాలి. 

2. గిల్టు నగలు కొందరికి ఎలర్జీ కలిగిస్తాయి. చర్మం వికారంగానూ, నల్లబడి అందవిహీనంగాను కనిపిస్తుంది. ఎలర్జీ వల్ల చర్మానికి సన్నని దద్దుర్లు ఏర్పడుతాయి. అటువంటి స్త్రీలు గిల్టునగలు ధరించకూడదు. మెడ చర్మపు సౌందర్యాన్ని పాడుచేయ కూడదు. 

3. జిడ్డు చర్మం ఉన్నవారు మెడ చర్మపు శుభ్రత, సౌందర్యం పట్ల మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. శిరోజాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా వారానికి రెండుసార్లు మాత్రమే వెంట్రుకలకు స్వల్పంగా నూనెను పట్టించాలి. 

4. జిడ్డుచర్మం తీరును మార్చలేకపోయినా, వేసవిలో తలలోని ఆయిల్‌, స్వేదం మెడ మీదకు చేరుకుని మెడ అపరిశుభ్రంగా, నల్లగా, జిడ్డుగా వికారంగా మారకుండా జాగ్రత్తపడాలి. వేసవిలో తలస్నానం ఎక్కువసార్లు చేస్తూ, వెంట్రుకలను శుభ్రపరచి, మెడశుభ్రతనూ అందాన్నీ కాపాడుకోవాలి. 

5.తలవెంట్రుకలు మెడపైనపడి, మెడచర్మం జిడ్డుగా మారుతుంది. మెడచర్మం జిడ్డుగానూ, అపరిశుభ్రంగానూ, నల్లగానూ మారకుండా పెరుగులో సున్నిపిండి, నిమ్మరసం, పసుపుపొడికలిపి ఆ పేస్టును మెడకుపట్టించి, పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మెడ చర్మాన్ని శుభ్రపరచాలి. 

6. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ను మెడకు రాయాలి. వేసవిలో స్నానమయిన తర్వాత ప్రిక్లీహీట్‌ పౌడరును మెడ చుట్టూతా చల్లుకోవాలి. 

7.చలికాలంలో మెడకు మాయిశ్చరైజర్‌ను రాయాలి. 

8.తలకు చుండ్రు రాకుండా జాగ్రత్తపడాలి. తలలో చుండ్రు ఏర్పడితే, మెడ చర్మం అపరిశుభ్రమవుతుంది. 

9. తలగడ గట్టిగానూ, మరీ ఎత్తుగానూ ఉండకూడదు. అందు వల్ల మెడకు బాధ కలగటమేకాక, చర్మానికి ముడుతలు వస్తాయి.

Tuesday, 8 December 2015

BEAUTY AND HEALTH TIPS TO ANDHRA WOMEN - EXCLUSIVE KITCHEN TIPS TO TELUGU WOMEN


రెండు చెంచాల పెసళ్ళ పౌడర్ మరియు చిటికెడు పసుపు తీసుకోవాలి . దీనికి కొద్దిగా పాలు జోడించి చిక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బంతిపువ్వుల యొక్క రేకులను మెత్తగా పేస్ట్ చేసి దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం మరియు మెడకు పట్టించి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇది ఒక బెస్ట్ హోం మేడ్ ఫేస్ ప్యాక్.

తాజాగా ఉండే పుదీనా ఆకులు మెత్తగా గ్రైండ్ చేసి, దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను మిక్స్ చేయాలి . తర్వాత అందులో కొద్దిగా ముల్తానీ మట్టి మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఒక టేబుల్ స్పూన్ గంధంలో చిటికెడు పసుపు మరియు కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి . ఈ పేస్ట్ ను ముఖానికి మరియు మెడకు పట్టించి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ ఫేస్ ప్యాక్ వల్ల నేచురల్ ఫెయిర్ ను పొందవచ్చు.

తులసి మరియు వేప ఫేస్ ప్యాక్: ఈ ఫేస్ ప్యాక్ ను కోసం తులసి ఆకులు మరియు కొద్దిగా వేప ఆకులు తీసుకొని పేస్ట్ లా చేయాలి. అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

BEAUTIFICATION WITH SANDAL WOOD - BADAM OIL - COCONUT OIL



ముఖంపై ఉండే మొటిమలు, సన్నని గీతలు, ముడతలు ఎక్కువగా ఉంటే.. చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. మేకప్‌తో కవర్ చేస్తే కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి సహజసిద్ధమైన శాండల్ఉడ్ ఆయిల్‌తో మర్దనా చేసుకోవడం ద్వారా చర్మం నిగారింపుగా మారుతుంది.
అలాగే బాదం ఆయిల్‌లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ పోషణకు సహాయపడుతుంది. అలర్జీలు రాకుండా, ప్రకాశవంతమైన చర్మానికి బాదం ఆయిల్‌తో అప్పుడప్పుడు మర్దనా చేసుకుంటూ ఉండాలి. కొబ్బరి నూనె చర్మ సంరక్షణకు పవర్ ఫుల్‌గా పనిచేస్తుంది. కొబ్బరినూనె జుట్టు పెరుగుదలతో పాటు చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది. కాబట్టి రాత్రిపూట లేదా స్నానానికి ముందు కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
ఆలివ్ నూనె చర్మంలో అంతర్గత తేమ నష్టాన్ని తగ్గిస్తుంది. అంతేగాకుండా సమర్థవంతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. వృద్ధాప్యఛాయలను తగ్గించడంలో ఆలివ్ ఆయిల్ పవర్ ఫుల్‌గా పనిచేస్తుంది.

Wednesday, 4 February 2015

STOMACH BEAUTY MASSAGE TIPS FOR WOMEN


కడుపు భాగంలో మడతలు మీ సాందర్యాన్ని నాశనం చేస్తున్నాయి, పలు క్రీములు వాడి విసిగిపోయారా, ఆందోళణ చెందకుండి. ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధ వనరులను సద్వినియోగం చేసుకుని నవయువ్వన్నంగా నిలవండి. హోర్మోన్లలో మార్పులు, శరీరం వాస్తవ బరువును కోల్పొయిన సందర్భాల్లో మడతలు ఏర్పడతాయి. అయితే వీటిని నియంత్రించి, మృదువైన చర్మాన్ని తిరిగి సొంతం చేసుకునేందుకు సమగ్ర ఆహార ప్రణాళికను పాటించాలి. 

ముఖ్యంగా విటమిన్‌ ‘సీ’, ‘ఏ’ పోషకాల గల ఆహారాన్ని ప్రణాళికాబద్ధంగా తీసుకోవాలి. ప్రకృతి ప్రసాదించిన ఔషుధాలతో శరీరానికి ‘మసాజ్‌’ చేస్తే శరీరం పై మడతలు తొలగిపోతాయి. ఈ ‘ఆయిల్స్‌’ కోసం మీరు ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సిన అవసరంలేదు. అన్ని మీ ఇంట్లో దొరికేవే... ఒంటికి ఆయిల్‌ మసాజ్‌ను పట్టించటం వల్ల చర్మ మృదత్వాన్ని సంతరించుకోవటంతో పాటు రక్త ప్రసరణ వృద్థి చెందుతుంది. ఈ ప్రభావంతో మీరు ఎప్పుడు ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనబడుతుంటారు. మహిళలకు వయసుతో నిమిత్తం లేకుండా ఈ మడతలు వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా మహిళల్లో ప్రసవం అనంతరం ఈ సమస్యలు వేధిస్తుంటాయి. వీటిని సులువుగా నియంత్రించుకునేందుకు అందుకోండి పలు చిట్కాలు.. రెండు టీ స్పూన్ల ‘బాదం’ నూనెలో 1 టీ స్పూన్‌ ‘వీట్‌ జర్మ్‌’ ఆయిల్‌ని కలిపి, ఈ మిశ్రమంలో 5 చుక్కులు ’గులాబీ’ నూనెతో పాటు ’ఆరెంజ్‌’ ఫ్లవర్‌ నూనెను జోడించి మడతల భాగంలో 20 నిమిషాల పాటు సుతి మెత్తంగా మర్ధనా చేయించుకోండి. 

10 చుక్కల ’రోజ్‌ మ్యారీ’ (దవనము చెట్టు నూనె)ను, 2 టీ స్పూన్ల ‘బాదాం నూనె’లో కలిపి మడతలకు పట్టించండి. నూనెను చర్మం పీల్చుకునేంతవరకు మసాజ్‌ చేస్తూనే ఉండండి. 
5 చక్కుల ‘లావెండర్‌’ ఆయిల్‌లో, తగినంత ‘ఆలివ్‌’ ఆయిల్‌ను కలిపి మసాజ్‌ చేసకుంటే ఫలితం లభిస్తుంది, అదేవిధంగా మూడు టీ స్పూన్ల ‘జోజో బా’ ఆయిల్‌లో. 5 చుక్కల ‘లావెండర్‌’ ఆయిల్‌ను కలిపి మడతల భాగంలో పావుగంట పాటు మసాజ్‌ చేస్తే మడతలు మటుమాయమవుతాయి.

Tuesday, 9 September 2014

BEAUTY AND BEAUTINESS - BEAUTY TIPS FOR WOMEN



అందం

చిన్న వయసులోనే కొందరికి ముఖంపై చర్మం ముడతలు పడుతుంది. అవి పోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి.

మామిడి ఆకులను పొడి చేయాలి. ఇందులో మినప పొడి, ముల్తాన్ 
మిట్టీలను సమాన పాళ్లలో కలిపి, ఓ డబ్బాలో వేసి పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, పాలతో కలిపి పేస్ట్‌లా చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. కొన్నాళ్లపాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముడతలు మాయమవుతాయి.

అది మాత్రమే కాదు. బంగాళదుంప గుజ్జు, టొమాటో రసం, అరటిపండు గుజ్జు కూడా ముడతలు పోయేలా చేస్తాయి.
క్యారెస్ రసంలో పాలు, బాదం పప్పు పేస్ట్ కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

కొన్నాళ్లపాటు వారానికి రెండు సార్లయినా ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది.

బాదం నూనెతో మర్దనా చేసినా కూడా ముడతలు పోతాయి.

Wednesday, 28 May 2014

HOW TO ATTAIN NATURAL BEAUTINESS - TIPS TO WOMEN TO REFRESH NATURAL BEAUTINESS



సహజమైన అందం కోసం....!

మేకప్ లేకుండా అందంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే కింద చెప్పిన టిప్స్ పాటించండి. సహజ అందంతో అందరినీ ఆకట్టుకోండి.

* మంచినీళ్లు బాగా తాగండి. నీరు ఎక్కువ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, వ్యర్థాలు బయటకు వచ్చేస్తాయి. దాంతో చర్మం నునుపు దేలి కాంతివంతంగా ఉంటుంది.

* ప్రమాదకరమైన రసాయనాలు లేని మాయిశ్చరైజర్స్‌ను వాడాలి. ఇవి చర్మాన్ని రక్షించడమే కాకుండా చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. ముఖ్యంగా మాయిశ్చరైజర్‌ను ముఖానికి, చేతులకు, పాదాలకు, మెడకు తప్పకుండా రాసుకోవాలి. ఎందుకంటే చర్మం తొందరగా వదులు అయ్యే భాగాలు ఇవే. ఇలా చేస్తే చర్మంపై ముడతలు ఏర్పడవు. వయసు కనపడదు.

* చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి ఫేస్ వాష్ బాగా ఉపయోగపడుతుంది. దుమ్ము, ధూళి చర్మంలో ఇట్టే చేరిపోతుంటాయి కాబట్టి రోజుకు రెండుసార్లు ఫేస్‌వాష్ చేస్తే ముఖం మీద చర్మం నిగ నిగలాడుతుంటుంది.

* చర్మం ఆరోగ్యంగా ఉండడానికి టోనర్ చాలా అవసరం. ఇది చర్మం రంగు దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మం బిగుతుగా ఉండేట్టు చేస్తుంది. ముడతలు పడనీయదు.

* వారానికి కనీసం మూడుసార్లు షాంపుతో తలస్నానం చేయాలి. అలా చేస్తే జుట్టు నిగ నిగలాడుతూ శుభ్రంగా ఉంటుంది. తలకు నూనె బాగా పట్టించవద్దు. అలా చేస్తే ముఖం జిడ్డోడుతూ కనిపిస్తుంది.

* బయటకు వెళ్ళేటపుడు తప్పనిసరిగా చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవాలి. లేకపోతే ఎండవేడిమికి చర్మం దెబ్బతింటుంది.

* ఉదయం లేచిన వెంటనే నిమ్మకాయ నీళ్లను తాగడం మరవొద్దు. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మకాయరసం పిండి ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి. చర్మం సహజసిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.

Tuesday, 25 March 2014

TELUGU ARTICLE ON PUDINA LEAVES - THE HEALTHY BENEFITS OF USAGE OF PUDINA IN DAILY LIFE


అద్భుత ఆరోగ్యానికి పుదీనా ఆకులు

1.పొట్టనొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుదీనా ఛాయ్ తాగితే, మలబద్దకం పోయి, పొట్ట శుభ్రపడటం, చర్మ సంబంధిత మొటిమలు నివారించబడుతాయి. 

2.పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మ మంటలకు పోగడుతాయి. పుదీనా శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. పుదీనా ఆకులను ఫేస్టు చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడుశ్వాస నివారించబడుతుంది. 

3.అజీర్ణం, కుడుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గడానికి పుదీనా రసం, నిమ్మరసం, తేనె ఒక్కొక్క చెంచా చొప్పున కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది

4.స్వరపేటిక ఆరోగ్యానికి పుదీనా రసం బహుబాగా పనిచేస్తుంది. అపస్మారక స్థితిలో వెళ్లినవారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు.

5.గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

6.గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలి పడితే సమస్య తొలగుతుంది. దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజూ పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది.

7.ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా అందాన్ని పెంచడానికీ ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్టు చేసి అందులో కొంచెం పసుపు కలపండి. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కున్నాక ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే ముఖం మౄఎదువుగా మారుతుంది.

8.గుడ్డులోని తెల్లసొనకు కొన్ని పుదీనా ఆకుల పేస్టు కలిపి దానిని ముఖానికి రాసుకున్నా మచ్చలూ, మొటిమలూ రాకుండా ఉంటాయి. పుదీనాలో ఉండే శాలిసైలిక్‌ ఆమ్లం మొటిమలు రాకుండా కాపాడుతుంది.పుదీనా రసానికి, బొప్పాయి రసం కలిపి చర్మ వ్యాధులు వచ్చిన చోట రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

9.పుదీనా చర్మం ముడతలు పడకుండా, త్వరగా వౄఎద్ధాప్య ఛాయలు రాకుండా చూడటంలో సాయపడుతుంది. చర్మం నునుపు దేలడానికి ఇది పాటించదగిన చిట్కా.పుదీనా ఆకులతో తయారుచేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఇది జుట్టు చక్కగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. చుండ్రు సమస్య నుంచి బయటపడేస్తుంది. మూడు మీద పొరలు పొరలుగా పొట్టు ఊడకుండా సంరక్షిస్తుంది.

Saturday, 22 February 2014

SIMPLE FACE CARE BEAUTY TIPS WITH NATURAL HONEY, OLIVE OIL ETC


ఇంట్లోనే ముడతలను తొలగించేందుకు అనువైన చిట్కాలు

ఒక చెంచా తేనెలో ఒక చెంచా బేసన్‌ పౌడర్‌, కాసింత పసుపు, 
5-6 చుక్కల ఆలివ్‌ నూనెను కలుపుకోండి. 
ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని ఈ మిశ్రమాన్ని పూసుకోండి. 
20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోండి.
రెండు చెంచాల పచ్చిపాలు, ఒక చెంచా బాదం పౌడర్‌, 
ఒక చెంచా ద్రాక్ష రసాన్ని కలుపుకుని పేస్ట్‌లా తయారు చేసుకోండి. 
ఈ మిశ్రమాన్ని ముఖానికి ఆప్లై చేయండి. 
ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయండి. 
ఆ తర్వాత ముఖాన్ని సుతిమెత్తగా చేతితో తపతపలాడించండి. 
దీంతో ముఖంపై ఏర్పడ్డ ముడతలు కొద్ది రోజుల్లోనే 
మటుమాయమౌతా యంటున్నారు సౌందర్య నిపుణులు.

Saturday, 8 February 2014

MAINTAIN SKIN BEAUTY IN SUMMER SEASON - SUMMER SEASON BEAUTY CARE TIPS FOR SHINY SKIN IN NATURAL WAY EATING BADAMS ETC



మృదువుగా, ప్రకాశవంతంగా కనిపించాల్సిన చర్మం.. వేసవిలో నిర్జీవంగా మారిపోతుంది. అలాంటి చర్మానికి ఎప్పటి కప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చర్మం సహజంగా మెరిసేలా:
. ఐదారు బాదం గింజల్ని తీసుకుని పాలల్లో కనీసం నాలుగు గంట నానబెట్టుకోవాలి. ఆ తరువాత వాటిని మెత్తగా గ్రైండ్‌చేసుకోవాలి. ఆ మిశ్రమంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి పది నిమిషాలయ్యాక కడిగెయ్యాలి.
.కాచిన పాలమీగడ, తేనె కలిపిన మిశ్రమాన్ని రాసుకుని ఐదు నిమిషాలు మర్దన చేసి ఆ తరువాత కడిగితే, చర్మం చాలా తాజాగా తయారవు తుంది.
.ముఖం మృదు త్వాన్ని సంత రించు కోవాలంటే, బాదం పొడిలోనాలుగు చుక్కల వీట్‌ జెర్మ్‌ నూనె, అరచెంచా గులాబీ రేకుల పొడిని కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషా లయ్యాక కడిగేస్తే సరిపోతుంది. చర్మం తాజాదనాన్ని పొందు తుంది. వేసవి కాలంలో ప్రతిరోజు మంచి క్రీం రాసుకుని పాలమీగడతో మర్దన చేసుకోవటం చాలా మంచిది.
పొడిచర్మం వీడి ప్రకాశ వంతంగా:.చెంచా కలబంద గుజ్జులో గులాబీ నూనె, వీట్‌జెర్మ్‌ నూనె రెండు చుక్కలు, చొప్పునవేసి, చెంచా బాదం పొడి కలిపి పూతలా వేసుకోవాలి.
. చెంచా పాలపొడినిలో మోతాదులో తేనె, విటమిన్‌ ఇ క్యాప్యూల్‌ ఒకటి, అరచెంచా గులాబీ రేకల ముద్ద కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల య్యాక కడిగేస్తే పొడిచర్మం పోయి ప్రకాశవంతంగా మారుతుంది. 

REMOVE PIMPLES AND BLACK HEADS IN NATURAL WAY


How-to-Forever-Rid-of-Blackheads-And-Pimples


టీీనేజ్‌లో మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌తో సమస్య అధికమై యాక్నెకు దారి తీస్తుంది. దీని వలన టీనేజ్‌ అమ్మాయిలు లేక అబ్బాయిలు బయటకు వెళ్లుటకు చాలా ఇబ్బంది పడుచుంటారు. కావున చర్మం తిరిగి క్లియర్‌గా అందంగా, ఆకర్షణీయంగా రావాలంటే ఇంట్లోనే చేసుకోదగిన సింపుల్‌ సూచనలు...
. పుదీనా ఆకుల్లో చెంచా తేనె, రెండు చుక్కల గ్లిజరిన్‌ కలిపి ముఖానికి రాసి పదినిమిషాలయ్యాక కడిగేయాలి. దీని వల్ల మచ్చలే కాదు.. మొటిమలు రాకుండా ఉంటాయి.
. ఆరేంజ్‌ పీల్‌ పౌడర్‌ను పన్నీటితో కాని మంచినీటితో కాని పేస్టులా కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. కమలాపండు తొక్కలను ఎండబెట్టి పొడిచేసుకుని నిల్వచేసుకుని వాడుకోవచ్చు లేదా మార్కెట్‌లో రెడీిమెడ్‌గా ఈ పౌడర్‌ దొరుకుతుంది. తాజా కమలాపండు తొక్కలను గ్రైండ్‌ చేసి కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ముఖంలోని మొటిమలు తగ్గి నునుపుగా మారి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
. రోజూ రెండు లీటర్లనీరు తాగడం, ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండటం, 6-7 గంటలు నిద్రపోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే శారీరక ఆరోగ్యం మెరుగుపడి ముఖారవిందం కాంతి వంతంగా తయారవుతుంది.
. తేనెలో రెండు చుక్కల నిమ్మరసం,సరిపడా సెనగపిండి కలిపి ముఖానికి పూతలా వేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మచ్చలు అదుపులోకి వచ్చేస్తాయి.
.దాల్చిన చెక్కను పొడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలు, మచ్చలు ఉన్న చోట మాత్రమే రాసి ఆరిన తర్వాత శుభ్రపరచాలి. దీనిని వారానికి మూడుసార్లు వేస్తుంటే ముఖంలోని మొటిమలే, మచ్చలు తగ్గుముఖం పడుతాయి. ఈ ప్యాక్‌ వేసినప్పుడు చర్మం కాస్త మండుతుంది. నొప్పితో కూడిన మొటిమలకు ఇది మంచి ట్రీట్‌మెంట్‌.
. ఒక టీ స్పూన్‌ శనగపిండి, 6,7 చుక్కల రోజ్‌ వాటర్‌, 6,7చుక్కల నిమ్మరసం, కొద్దిగా నీళ్ళు జారుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకొని15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. వారానికి మూడుసార్లు ఈ విధంగా చేసినట్లైతే ముఖంపై మచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ తొలగి పోయి తాజాగా ఉంటుంది.
. గులాబీ రెక్కలు ఐదు తీసుకొని అందులో నిమ్మరసం ఐదు చుక్కలు, శనగపిండి రెండు టీస్పూన్లు, ఛాయపసుపు చిటికెడు, నీళ్ళు కాస్త పోసి పేస్టులా తయారు చేసుకోవాలి. శుభ్రపరచిన ముఖానికి ఈ క్రీమ్‌ని అప్లైచేసి ఇరవై నిమిషాల తరువాత ముఖాన్ని పాలతోనూ, ఆ తరువాత నీటితోనూ శుభ్రపరచాలి. ఇలా 15రోజులకు ఒకసారి చేస్తే చర్మం నునుపు తేలడమే కాకుండా మొటిమలు, నల్లమచ్చలు మాయమైపోతాయి.
. వేరు శనగ నూనెలో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చన్నీటితో కడిగినచో ముఖం ప్రకాశవంతంగా మారును. 

Wednesday, 29 January 2014

HEALTHY SKIN CARE TIPS - ARTICLE ON SKIN CARE IN TELUGU



శరీరంలో అన్నిటికన్నా ముఖ్యమైన భాగం ఏది? ప్రాణాలు నిలిపేది గుండె కాబట్టి అదే అంటారు ఏమో...! దానితో పాటు అందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. మనల్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే చర్మం అన్నిటికన్నా జాగ్ర త్తగా కాపాడుకోవలసిన అంశం అంటే అతిశ యోక్తి కాదు. చిన్న పిల్లల నుండీ పెద్ద వాళ్లవ రకూ చర్మాన్ని సౌందర్యవంతంగా ఉంచేం దుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. పుట్టడం తోనే చక్కని చర్మంపొందడం కుదరని విష యం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యు పరమైన మార్పుల కారణంగా చర్మం అనేక మార్పులు చెంది మనకు చుట్టుకుని ఉంటుం ది. ఎవరికైనా కూడా పూర్తి ఆరోగ్యవంతమైన చర్మం ఉందని చెప్పలేం. చర్మం యొక్క రంగు వారసత్వంపై కూడా ఆధారపడవచ్చు. కానీ చర్మం యొక్క స్థితిని మార్చలేం అని వది లేయక్కర్లేదు. అనేక జాగ్రత్తలు తీసు కోవడం ద్వారా మన చర్మాన్ని ఆరోగ్య వంతంగా, ఆకర్షణీయంగా ఉంచవచ్చు. ప్రస్తుతం ఎంతో మంది శుభ్రతను పాటిస్తూనే మరింత ఆకర్షణీయంగా ఉండడం కోసం అనేక రకాల క్రీములను వాడుతూ ఉంటారు. అలాగే చర్మంలో కూడా పలు రకాలు ఉం టాయి. వాటికి తగిన మందులను ఎంచు కోవడంలోనే ఎంతో మంది అవాస్తవాలను ఎదుర్కొంటున్నారు. ఏ విధమైన పదార్థాలను వాడాలో తెలియక సతమతం అవుతున్నారు. క్రీముల ద్వారా కొందరు లాభపడుతుంటే మరికొందరు అదే క్రీముల వలన నష్ట పోతున్నారు. దానికి కారణం ఆ క్రీములలో వాడే పదార్థాలు ఎటువంటి చర్మానికి సరిపోతాయి అనే విషయంపై సరైన అవగాహన లేకపోవడమే. వీటిపై అనేక అవాస్తవాలనూ, వాటి వెనక ఉండే నిజాలనూ ఒక సారి వీక్షిద్దాం...
అపోహ: మన చర్మంలో మార్పుల ప్రక్రియ తల్లిదండ్రుల చర్మంయొక్క మార్పులతో సమానంగా ఉంటుంది.
వివరణ: ఖచ్చితంగా తల్లిదండ్రుల జన్యుపరమైన మార్పులే పిల్లల చర్మానికి కూడా రావడానికి అధికశాతం అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సమానత బాహ్య ప్రపంచంలోకి రావడం వరకే. తరువాత కాలంలో పిల్లల చుట్టూ ఉండే వాతావరణం మరియు వారి అలవాట్లే చర్మంలోని మార్పులకు కారణం అవుతాయి. కొన్ని సార్లు జన్యుపరమైన విషయాలను కూడా అలవాట్లు మార్చగలుగుతాయి. ముఖ్యంగా ఎండలో తిరిగే సమయం, ఎండ తీవ్రత, సిగరెట్‌, ఒత్తిడి, నిద్ర వంటి విషయాలే ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటి వల్లనే మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడుతాయి.
అపోహ: సన్‌లోషన్లపై ఉండే ూూఖీ సంఖ్య మనకు ఎంత రక్షణ కల్పిస్తుందో వివరిస్తుంది.
వివరణ: సూర్యుని నుండి వచ్చే ప్రమాదకర కిరణాలను అతినీలలోహిత కిరణాలు అంటారు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఖహూ కిరణాలు చర్మం వదులుగా అయ్యేలా చేస్తాయి. ఖVదీ కిరణాలు చర్మంలో ఉండే కణాలను కాల్చివేస్తాయి. సాధారణంగా అన్ని సన్‌లోషన్లూ ఖVదీ కిరణాలను మాత్రమే అడ్డుకుంటాయి. అలాగే దాని ూూఖీ సంఖ్య ఖVదీ కిరణాలను ఆపగల గరిష్టస్థాయిని మాత్రమే వివరిస్తుంది. అందువల్లనే ఎంతో మంది ఖరీదైన సన్‌లోషన్‌ వాడుతున్నప్పటికీ చర్మం వదులుగా అవుతుంది. సన్‌లోషన్‌ను వాడదలిచిన వారు ఖVదీ కిరణాలను మాత్రమేగాక ఖహూ కిరణాలను అడ్డుకొనగల క్రీములను ఎంచుకోవాలి. జింక్‌, అవెబెన్‌ జోన్‌ వంటి పదార్థాలు ఖహూ కిరణాలను అడ్డుకొనగలుగుతాయి. అందువలన సన్‌లోషన్లలో జింక్‌ మరియు అవెబెన్‌జోన్‌ కూడా ఉండే క్రీములను ఎంచుకోవాలి.
అపోహ: సన్‌స్క్రీన్‌ లోషన్‌ మరియు మాయిశ్చరైజర్లను విడివిడిగా వాడాలి.
వివరణ: ఏ క్రీమ్‌ అయినా చర్మం యొక్క రకాన్ని బట్టే ఎంచుకోవాలి. సన్‌స్క్రీన్‌ లోషన్‌ అనగా సూర్యుని అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మంపై ప్రభావం చూపకుండా నివారిస్తాయి. మాయిశ్చరైజర్‌ క్రీములు చర్మంలో ఉండే తేమ స్థాయిని పెంచుతాయి. ప్రస్తుతకాలంలో ఏ సన్‌స్క్రీన్‌ లోషన్‌ అయినా చర్మానికి తేమ అందించే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. కనుక జిడ్డుగా ఉండే చర్మం కలవారు మళ్లీ మాయిశ్చరైజర్‌ వాడడం వల్ల నిగారింపును కొల్పోతారు. అందువలన అందరికీ మాయిశ్చరైజర్‌ అవసరం ఉండదు. ఒక వేళ రెండూ వాడాలని అనుకుంటే ముందుగా మాయిశ్చరైజర్‌ను వాడి నీటితో శుభ్రపరిచి, ఆరిన తరువాత మాత్రమే సన్‌స్క్రీన్‌ లోషన్‌ను వాడాలి.
అపోహ: సూర్యకాంతి వలన 18ఏళ్ల వయస్సులోనే అధికంగా చర్మము సమస్యలకు గురి అవుతుంది.
వివరణ: ఇప్పటి వరకూ జరిపిన సర్వేల ప్రకారం 18ఏళ్ల వయస్సు వరకూ కేవలం 18 నుండీ 23 శాతం వరకూ మాత్రమే చర్మంలో సౌరశక్తి వల్ల సమస్యలు ఉత్పన్న మవుతాయి. కనుక ఒక వేళ ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోనంత మాత్రాన జీవితాం తం బాధపడాలి అనే అపోహను నమ్మరాదు. ఎంత వయస్సు వచ్చిన వారైనా తగిన మందులను తీసు కోవడం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోగలుగుతారు.
అపోహ: కాస్మటిక్‌ క్రీములు మీ పూర్వపు అందాన్ని తీసుకురాగలవు.
వివరణ: ఇది ఏమాత్రం నమ్మకూడదని డాక్టర్లు చెప్తున్నారు. వయస్సు పెరుగుతున్న కొలదీ చర్మంలోని పటిష్టత, కొవ్వు తరుగుదల జరుగుతూనే ఉంటుంది. వానిపై ఎంత క్రీమ్‌ రాసిననూ వాటిని తిరిగి రానివ్వడం చాలా వరకూ సాధ్యపడదు. కాస్మిటిక్‌ క్రీములు కేవలం కొద్ది సమయం మాత్రమే చర్మాన్ని పటిష్టంగా ఉంచగలవు. అది కూడా మన చర్మపు ఆరోగ్యంపై ఆధారపడిఉంటుంది.
అపోహ: మొటిమలు వచ్చినప్పుడు మందులు వాడితే సరిపోతుంది.
వివరణ: మొటిమలు బాహ్యచర్మంపై తయార వ్వడానికి రెండు వారాల ముందు నుంచే లోపలి కణాలను బలహీనపరుస్తుంది. అందు వలన మొటిమలు వచ్చిన తరువాత అవి తగ్గడం కోసం మందులు వాడినప్పటికీ పైకి కనపడుతున్న మొటిమలను తగ్గించగలుగు తామే తప్ప లోపలి కణాలను బలహీన పరచ డాన్ని కూడా తగ్గించాలి అంటే నిర్ణీత కాలం వాడుతూనే ఉండాలి. డాక్టర్లు మొటిమలు వ్యాప్తి చెందడంలోని తీవ్రతను బట్టి మందు లు వాడవలసిన కాలాన్ని నిర్థారిస్తారు. 

Monday, 9 December 2013

BEAUTY TIPS WITH CARROT JUICE - PAPAYA JUICE - BANANA'S ETC - ALL KITCHEN ITEMS WORKS AS NATURAL BEAUTICIANS - SO TRY IT



అందం మనిషికి ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. అందులోనూ మహిళలకు మరింత ద్విగుణీకృతమవు తుంది. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తను అందానికి మరింతగా మెరుగులు దిద్దు కుంటున్నారు. ప్రతి సందుకి, వీధికి ఒక బ్యూటీపార్లర్‌ వెలు స్తున్నాయంటే కారణం ఇదే. అయితే ఉద్యోగం చేసే మహి ళలకు, కొంతమంది గృహిణులకు ఇలా గంటల తరబడి బ్యూటీపార్లర్‌కు వెళ్ళే అవకాశం ఉండదు. మరి అలాంటి వారు ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో అందంగా కనిపించవచ్చు. దీనికి చేయవలసింది ఒక్కటే. ఒక పది లేదా పదిహేను నిముషాలు కేటాయించడం. చల్లటి టీలో ఒక కాటన్‌ బట్టను ముంచి, టీని కొద్దిగా పిండి, ఆ బట్టను కళ్ళపై పెట్టుకుంటే కళ్ళకు మెరుపు వస్తుంది. అలాగే రాత్రి పడుకునే ముందు రెండు కీరాదోస ముక్కలు పెట్టు కుంటే కళ్ళు చల్లబడి చుట్టూ ఉన్న నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి. అలాగే ముఖ వర్చస్సు కోసం క్యారెట్‌ను రసం తీసి ముఖానికి పట్టించి పదిహేను నిముషాల తర్వాత కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది. అలాగే బొప్పాయి గుజ్జును పదిహేను నిముషాలు ఉంచి కడిగినా కూడా ముఖ వర్చస్సు పెరుగుతుంది. మహిళలు ఎన్నో ఎన్నో రంగాలలో ముందుంటు న్నారు. అలాగే ప్రతి రంగంలో ఉన్న స్త్రీలు ఎన్నో విజయాలతో పాటు ఒత్తిడిని కూడా ఎదుర్కొం టున్నారు. అలా ఒత్తిడి పెరిగి చర్మం ఒడలిపోయిన ట్లుగా తయారయితే ఇలా చేసి చూడండి. బాగా పండిన అరటిపండును తీసుకొని దానిని బాగా గుజ్జులాగా మెత్తగా చేసి దానిలో తేనె ఒక చెంచా, కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి బాగా పట్టించి అరగంట తరువాత కడిగేస్తే ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి, ముఖంపై ఉన్న చర్మం బిగుతుగా తయారవు తుంది. అంతేకాకుండా మెరుస్తుంది కూడా. ఒక టీస్పూన్‌ శనగపిండిని తీసుకుని దానిలో కొంచెం పాలు, చిటికెడు పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత కడిగేస్తే ముఖం మిలమిలా మెరుస్తుంది. జిడ్డు ముఖం కలవారు అయితే రాత్రిళ్ళు గులాబి ఆకులను నీళ్ళల్లో వేసి ఉదయం ఆ నీళ్ళతో ముఖం కడుక్కుంటే తేటగా ఉంటుంది. ఇలా చిన్న చిట్కాలతో ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవటం మన చేతుల్లోనే ఉంది. మరి ఎందుకు ఆలస్యం? చేసి చూస్తే సరిపోతుంది.