WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Health tips for Women. Show all posts
Showing posts with label Health tips for Women. Show all posts

Saturday, 10 September 2016

LIST OF FOOD ITEMS TO BE TAKEN BY WOMEN REGARDING HER HEALTH DISORDERS


సాధారణంగా మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ. ముఖ్యంగా నెలసరి సమస్యలు. ఈ సమస్య ప్రతి స్త్రీ తప్పక ఎదుర్కోవాల్సిందే. తప్పదు అది సృష్టి. సో ఇప్పుడు మనం స్త్రీలు, ఏ ఆరోగ్య సమస్యకు ఏ ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఆరోగ్య సమస్య ————— తినాల్సిన పదార్దాలు
నెలసరి తిమ్మిరులు ————— అధిక పైబర్ వున్న పదార్దాలు, హోల్ గ్రైన్స్, కూరగాయాలు, లెగ్యూమ్స్, నట్స్ ,సీడ్స్ ,పండ్లు
నిద్రలేమి ————— ఫైనాపిల్,నారింజపండు,అరటిపండ
ఒత్తిడి –————– ఆస్పాగారస్, చేపలు,బ్లూబెర్రీస్....
తలనొప్పి ————— ఒక కప్పు కాఫీ గాని టీ గాని, భోజనంలో స్ఫీనాచ్ తినడం.
కండరాల నొప్పి –————– అరటి పండు, అవకాడో,చెర్రీలు,అల్లం.పసుపు, ఆకుకూరలు

పైన చెప్పినవి నిపుణుల అభిప్రాయం ప్రకారం సూచించబడినవి.

Thursday, 17 December 2015

Thyroid Problem IN WOMEN - HEALTH TIPS


థైరాయిడ్‌ అనేది ఒక గ్రంథి. ఇది థైరాక్సిన్‌ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ థైరాక్సిన్‌ హార్మోను గర్భిణులకు ఎంతగానో ఉపయోగిస్తుంది. గర్భస్థ శిశువు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. శిశువు శరీరంలో మెదడు, ఎముకలు, ఇతర అవయవాలు చక్కగా నిర్మాణం అవటానికి థైరాక్సిన్‌ సాయపడుతుంది. అంతేకాకుండా శిశువు ఎదుగుదలకు, గర్భిణులలో ఉండే హార్మోను ఎంతో అవసరమవుతుంది. థైరాయిడ్‌ గ్రంథి ఆనారోగ్యం పాలయినా, థైరాయిడ్‌ హార్మోను ఉత్పత్తిలో అస్తవ్యస్తత ఏర్పడినా, ఎక్కువ తక్కువలయినా స్త్రీలలో అనారోగ్యం ఏర్పడు తుంది. థైరాక్సిన్‌ హార్మోను ఎక్కువయితే హైపర్‌థైరాయిడ్‌ అని, తక్కువైతే హైపోథైరాయిడ్‌ అని వైద్యులు నిర్ధారిస్తారు. ఈ థైరాయిడ్‌గ్రంథి సమస్య అన్నది సాధారణంగా ఇరవై సంవత్సరాలు దాటిన వారిలో ఏర్పడే అవకాశం ఉంటుంది. వయసు పెరుగుతూంటే థైరాయిడ్‌ అనారోగ్యం క్రమక్రమంగా బయటపడుతుంది. మెనోపాజ్‌ స్థితికి చేరుకున్నప్పుడు, నెలసరి రుతుకార్యక్రమం ఆగిపోయిన సమయంలో ఈ అనారోగ్యం స్త్రీలలో ఏర్పడవచ్చు. చిన్నపిల్లలలో కూడా థైరాయిడ్‌ సమస్య కొందరిలో రావచ్చు. ఆ పిల్లలలో శారీరక ఎదుగుదల సరిగా ఉండదు. బుద్ధిమాంద్యం కూడా ఏర్పడవచ్చు. మాట స్పష్టంగా పలకలేక పోవడం, తడబడటం లాంటి లక్షణాలు ఏర్పడ తాయి. పెద్దలు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా, ఆ లక్షణాలు కనపడగానే థైరాయిడ్‌ పరీక్ష చేయించడం అవసరం. యుక్తవయసులో అమ్మాయిలలో నెలసరిలో కొంత మార్పులు వస్తాయి. అధిక రక్తస్రావం కావచ్చు లేదా రుతుక్రమంలో అస్తవ్యస్తత ఏర్పడవచ్చు. ఇటువంటి లక్షణాలకు కారణం థైరాయిడ్‌ ఆరోగ్యలోపం కావచ్చు. అందువల్ల డాక్టరుకు చూపించి, అవసరమయిన మందులను వాడాలి. వివాహితులకు థైరాయిడ్‌ అనారోగ్యం కలిగితే, సంతానం కలగటానికి అవరోధం ఏర్పడుతుంది. గర్భం ధరించినప్పటికీ గర్భవిచ్ఛిత్తి జరగడం లాంటివి థైరాయిడ్‌ అనారోగ్య సమస్యలు. ఇటువంటి ఇబ్బందులు గర్భవతుల్లో ఏర్పడు తున్నప్పుడు వైద్యపరీక్షలు చేయించడం ఎంతో అవసరం. తగిన చికిత్సను జరిపించకపోతే సంతానలేమి కలుగుతుంది. థైరాయిడ్‌గ్రంథికి అనారోగ్యం కలిగితే జ్ఞాపకశక్తి మందగిస్తుంది. వెంట్రుకలు అధికంగా రాలిపోతూ, జుట్టు పలచ బడుతుంది. స్థూలకాయం ఏర్పడుతుంది. అకారణంగా బరువు తగ్గిపోతారు లేదా బరువు పెరుగుతారు. బాగా చిక్కిపోతారు. 

థైరాయిడ్‌ అనారోగ్య సమస్య ఏర్పడినప్పుడు వైద్యులు పరీక్ష చేసి అది హైపో, హైపరా అని నిర్ధారణచేసి, ఆ తర్వాత చికిత్స జరిపిస్తారు. వైద్యసలహాతో మందులను వాడాలి. రక్తపరీక్ష చేయించుకుని, వారంతటవారే మందులు మార్చి వాడకూడదు. థైరాయిడ్‌ అనారోగ్యం హెచ్చినా, తగ్గినా ఆ విషయాన్ని డాక్టరుకు తెలిపి రిపోర్టు చూపించాలి. థైరాయిడ్‌ సమస్య వల్ల ఏర్పడే అనారోగ్యాలను నివారించటానికి, వైద్యసలహాతో యాంటీథైరాయిడ్‌ మాత్రలను వాడవలసి ఉం టుంది. డాక్టరు సూచించిన ప్రకారంగా అశ్రద్ధ చేయకుండా మందులను వాడాలి. థైరాయిడ్‌ అనారోగ్యం ఏర్పడినప్పుడు మందులు వాడక పోతే, ఇతర అనారోగ్యాలు మరికొన్ని ఏర్పడ తాయి. అందువల్ల థైరాయిడ్‌ అనారోగ్య లక్షణా లను గుర్తించి, డాక్టరు రాసిచ్చిన మందులను జీవితాంతం వాడవలసిఉంటుంది. 

Wednesday, 16 December 2015

SIDE EFFECTS OF USING HIGH HEELS BY WOMEN


అమ్మాయిలూ హై హీల్స్‌ (ఎత్తు మడ మల చెప్పులు) వాడుతున్నారా? 

అయితే మీరు ఈ హీల్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే.. అందం కోసం అప్పుడప్పుడూ వాడితే ఫర్లేదు కానీ అదే అలవాటు అయిందనుకోండి ఆ అలవాటు ఆరోగ్యంపై దుష్ప్రభావాల ను చూపిస్తుంది మరి! ఇంకో మాట లో చెప్పా లంటే ముని వేళ్ళమీద నడవటం. ఇది చూడ డానికి బాగానే వుంటుంది. కానీ ఇది చూపించే దుష్ప్రభావాలు కూడా అలాగే వుంటాయి. మునివేళ్ల మీద నడ వటం వల్ల ఒత్తిడి పెరిగి పోవడం, పాదాలు దెబ్బతినడం, గోళ్ల ఇన్‌ఫెక్షన్‌ రావడం వంటి ప్రమాదాలు న్నాయని ఆర్థోపెడియన్‌ (ఎముకలు డాక్టర్‌) లు అంటు న్నారు.మడమ ఎత్తు కారణంగా మోకాలి జాయింట్లపై ఒత్తిడి పెరిగి తొడ భాగంలోని కండరాలపై తీవ్ర ప్రభా వం చూపుతాయి. తద్వారా కండ రాల కదలిక భారమై మోకాలి జాయింట్లు అరిగిపోయే ప్రమాద ముంది. ఒక్కోసారి శాశ్వతంగా నడకను కూడా కోల్పోయే ప్రమాద ముందని నిపుణులు చెపుతున్నారు. హై హీల్స్‌ వాడకం ద్వారా వచ్చే నొప్పులను వదిలించుకోవడానికి దాదాపు 12 నుంచి 15వేల రూపా యల వరకు ఖర్చు ఉంటుంది.మన శరీర భారాన్నంతా మోసేది మన కాళ్లేకదా! మరి వాటి కోసం మనం జాగ్రత్తలుతీసు కోమా? పోనీ మీకు హీల్స్‌ వేసుకోవాలని మరీ కోరికగా ఉంటే డాక్టరును సంప్రదిం చి ఎంత ఎత్తు వరకు హీల్‌ వాడవచ్చో అనేవిషయాన్ని ధృవీకరించుకొని వాడితే మంచిది. 

Tuesday, 8 December 2015

EXCLUSIVE HEALTH TIPS TO WOMEN ONLY IN TELUGU


ప్రతి రోజూ రెగ్యులర్ గా అరటిపండు తినడం వల్ల వైజినల్ డిశ్చార్జ్ ను నివారించుకోవచ్చు . ఇందులో యాంటీ ఇన్ఫెక్టివ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది వైజినల్ డిశ్చార్జ్ కు కారణం అయ్యే హానికరమైన బ్యాక్టీరియాను నివారిస్తుంది.

స్త్రీకి అందం కంటే మించినది మరొకటి లేదు. అందుకే మహిళలు అందానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. కానీ అందం అనేది ఏ ఒక్కరి సొంతం కాదు. మన అందాన్ని మనకు కావల్సిన రీతిలో మనమే తీర్చిదిద్దుకోవచ్చు. సమయానికి పోషకాహారం తీసుకోవడంతో పాటు, కొన్ని సౌందర్యచిట్కాలను పాటిస్తే వయస్సు పెరిగినప్పటికీ తరగని అందం మన సొంతమవుతుందంటున్నారు సౌందర్యనిపుణులు. ఎలాంటి అందమైనా ఎక్కువ కాలం కాపాడుకోవడానికి ఇంటిలోనే కొంత సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. అలా చేస్తే కళ్లు తిప్పుకోలేని అందం మీ సొంతం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు బ్యూటీ ఎక్స్ పర్ట్స్ అందంలో ముఖ్య పాత్రను పోషించేది చర్మం. వయస్సుని తొందరగా గుర్తు పట్టేలా చేసేది చర్మం. చర్మంలో ముడుతలవల్లే నిగారింపు, యవ్వనం, అందం మటు మాయమౌతాయి. వయస్సుతో సంబంధం లేకుండా కేవలం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఇలా జరుగుతుంటుంది. కొంత మందిని కొన్ని సందర్భాల్లో చూసి వాళ్ళు అమ్మ, కూతుళ్ళా లేకా అక్కా చెల్లెళ్ళా అని అనుకుంటారు. దానికి కారణం అందానికి తగినటువంటి కేర్‌ తీసుకోవడమే. ఆ జాగ్రత్తలు మీరు తీసుకుంటే మీరూ అందంగా...ఆకర్షనీయంగా కనిపిస్తుంటారు.

దానిమ్మ గింజలను మెత్తగా పేస్ట్ చేసి అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించి 30 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫెయిర్ స్కిన్ పొందడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

EXCLUSIVE HEALTH TIPS TO WOMEN IN THOSE DAYS


కొన్ని ఎండిన ఫిగ్ ను నానబెట్టి , రాత్రంతా నీటిలోనే నానబెట్టుకోవాలి. ఉదయం నిద్రలేవగానే, నీటితో పాటు పేస్ట్ చేసి కాలీ పొట్టతో త్రాగాలి . ఇది యోని డిశ్చార్జ్ కు కారణం అయ్యే హానికరమైన బ్యాక్టీరియాను శరీరం నుండి తొలగొస్తుంది .

ఆమ్లా లేదా ఉసిరికాయ ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది . వైజనాలోని బ్యాక్టీరియాను నాశనం చేసి, ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. రెగ్యులర్ గా ఆమ్లా తినడం ద్వారా వైజినల్ డిశ్చార్జ్ ను మరియు చెడువవాసనను నివారించుకోవచ్చు

ఆరెంజ్ లో విటమిన్ బి9, ఫొల్లెట్ అధికంగా ఉంటాయి . ప్రెగ్నేన్సీ సమయంలో ఈ రెండు విటమిన్స్ ముఖ్య పాత్రపోషిస్తాయి . ప్రతి రోజూ ఆరెంజ్ జ్యూస్ ను క్రమం తప్పకుండా త్రాగడం వల్ల బేబీ పుట్టుకలో లోపాలను నివారిస్తుంది . ఆరెంజ్ జ్యూస్ రెగ్యులర్ త్రాగడానికి ఇది ఒక గ్రేట్ రీజన్ .

మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తరచుగా యూరిన్ కి వెళ్తే.. మూత్రం ద్వారా బ్యాక్టీరియా బయటకు వెళ్తుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లు కనీసం గంటకు ఒకసారి ఒక గ్లాసు నీళ్లు తాగడం మంచిది.

గర్భనిరోధకమాత్రలు కొన్నిరకాల గర్భనిరోధక మాత్రలు హాని కలిగిస్తాయి. ఇవి మేలుచేసే బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. డాక్టర్ సలహా తీసుకోవాలి.

Saturday, 29 March 2014

LIST OF WOMEN HEALTHY FOOD ITEMS FOR WOMEN HEALTHY GROWTH



మహిళలకు ప్రత్యేక ఆహారం

- ఆహారం తీసుకోవడంలో మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోజువారీ జీవితంలో శరీరానికి తగినన్ని పోషకాలు, ఖనిజాలు అవసరం.

-వీలైనంత ఎక్కువ ఆకుకూరలు తినాలి. విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం శరీరానికి అందాలంటే పాలకూరను తీసుకోవాలి. దీనివల్ల ఇనుము లభిస్తుంది. బరువు పెరగరు.

- బ్రెస్ట్‌క్యాన్సర్ బారిన పడకూడదంటే ఒమెగాప్యాటీ ఆసిడ్స్, ఆంటీయాక్సిడెంట్స్ అవసరం. కాల్షియం, మెగ్నీషియం, పోలిక్‌యాసిడ్స్ తప్పనిసరి. ఇవన్నీ గింజల్లో ఎక్కువగా ఉంటాయి.

- ఈ గింజలను కూరల్లో కాని, ఉడికించి కాని తినాలి.

- మహిళలను ఎక్కువగా వేధించేది హార్మోన్ల సమస్య. హార్మోన్ల సమతుల్యత లోపిస్తే అధికరక్తపోటు, తలనొప్పి, మనోవికలత, డిప్రెషన్ చుట్టుముడతాయి. ఇవి దరిచేరకుండా ప్రత్యేక ఆహారపదార్థాలతోపాటు ఓట్స్ తింటే ప్రయోజనం ఉంటుంది. వీటిలోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది.

- కాల్షియం సమస్యను తగ్గించుకోవాలంటే రోజుకు రెండుసార్లు పాలను తాగడం శ్రేయస్కరం. విటమిన్ డి కూడా లభిస్తుంది. రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది.

Friday, 28 February 2014

HEALTHY MOODS - HEALTHY FOOD HABITS



మూడ్‌ని బట్టే ఆరోగ్యం

భోజనం చేసేటప్పుడు మూడ్స్ ఎలా ఉన్నాయన్నది కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం వంటబట్టాలన్నా, ఆరోగ్యానికి ఉపయోగపడాలన్నా భోజనం దగ్గర మన మూడ్స్ ఎలా ఉన్నాయన్నది కూడా ముఖ్యమని, ఆరోగ్యమైనా, అనారోగ్యమైనా మన మూడ్స్‌ను బట్టే ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఆరోగ్యం పైన మనసు ప్రభావం చాలా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల మందులు వేసుకున్నా, భోజనం చేస్తున్నా, చివరికి స్నానం చేస్తున్నా, నిద్రపోతున్నా, ఏ పనైనా చక్కగా పూర్తి చేయాలన్నా దాని మీద శరీర ప్రభావమే కాక, మనసు ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

భోజనం విషయానికి వస్తే, చాలా మంది భావోద్వేగంతోనే భోజనాన్ని పూర్తి చేస్తుంటారని డెలవేర్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ గార్డ్‌నర్ తెలిపారు. ఆబగా, అనాలోచితంగా, ఆశగా తినడం, రుచి కోసం తినడం వంటివి సాధారణంగా మనకు కనిపించే భోజన రీతులు. వీటన్నిటితో పాటు, భోజనం చేసేటప్పుడు సంతోషంగా ఉన్నామా, విచారంగా ఉన్నామా, కోపంగా ఉన్నామా, క్రోధంగా ఉన్నామా, మానసిక ఒత్తిడిలో ఉన్నామా లేక హడావిడిలో ఉన్నామా అన్నవి కూడా చాలా వరకూ ఆహార పదార్థాల మీద పనిచేస్తుంటాయని ఆయన ఆధ్వర్యంలో 'ఆరోగ్యానికి, భోజనం తినే విధానానికి ఉన్న సంబంధం'పై అధ్యయనం చేసిన నిపుణులుచెబుతున్నారు.

ఏ మూడ్స్‌లో ఉన్నప్పుడు ఆహారం తీసుకోకూడదు, ఏ మూడ్స్‌లో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవాలి అన్న దాన్ని ఈ నిపుణులు పరిశీలించి, వాటిని వ్యాసాల రూపంలో వివిధ అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య సంబంధమైన మేగజైన్లలో ప్రచురించారు. ఎంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను పళ్లెంలో పెట్టుకున్నా మనసు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటే ఆ భోజనం ఇచ్చే శక్తి చాలా తక్కువగానే ఉంటుందట. భావోద్వేగంతో భోజనం తిన్నా అది గుండె మీదా, రక్త ప్రసారం మీదా దుష్ప్రభావాన్ని కలగజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. భోజనమే కాదు, అల్పాహారం తీసుకునేటప్పుడు, స్నాక్స్ తీసుకునేటప్పుడు, మద్య సేవనం చేస్తున్నప్పుడు పండ్లు తినేటప్పుడు, చివరికి మందులు తీసుకునేటప్పుడు కూడా మనసును ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలని వారు సూచిస్తున్నారు.

మూడ్స్ బాగా లేనప్పుడు అంటే, విషాదం, భావోద్వేగం, ఒత్తిడి, భయం, ఆందోళన, కోపం, పగ, ప్రతీకారం వంటివి ఆలోచనలను ముప్పిరిగొని ఉన్నప్పుడు ముందుగా కొద్దిగా మంచినీళ్లు తాగి, కాళ్లు కడుక్కుని, కొద్దిగా మనసు శాంతించిన తరువాత భోజనం ముందు కూర్చోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. మన సు అలజడితోనో, కల్లోలంగానో ఉన్నప్పుడు, అంటే ప్రశాంతంగా లేనప్పుడు తినే భోజనమంతా రక్తాన్ని దోషభూయిష్ఠం చేసే ప్రమాదం ఉంటుంది. రక్త ప్రసారంలో తేడాలు చోటు చేసుకుంటాయి. దానివల్ల, గుండె కొట్టుకోవడంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. వీటి ప్రభావం దీర్ఘకాలంలో కాలేయం, మూత్రపిండాలు, మెదడు వంటి కీలక అవయవాల మీద కూడా పడుతుంది. కొద్ది కాలంలోనే చిత్ర విచిత్రమైన అనారోగ్యాలు శరీరాన్ని పీడించడం ప్రారంభిస్తాయి.

ఆవేశకావేషాలతో భోజనం చేస్తే ఒకటి రెండు రోజుల్లోనే తలనొప్పి, రక్తపోటు, గుండె దడ వంటివి ప్రారంభమైపోతాయి. కోప తాపాలలో ఉన్నప్పుడు భోజన పదార్థాల ఎంపికలో కూడా తేడాలు వస్తాయని, శరీరానికి ఏది పడదో అటువంటి పదార్థాన్నే ఎంపిక చేసుకునే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే భోజనం చేయడం ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి ఎంతో మంచిదని వారు సలహా ఇస్తున్నారు. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసినా, జోక్స్ వేసుకుంటూ తిన్నా, సంతోషంగా తిన్నా, చివరికి భవిష్యత్తు గురించి కలలు గంటూ ఆహారం తీసుకున్నా దాని ప్రభావం శరీరం మీద, ఆరోగ్యం మీదా సానుకూలంగా ఉంటుందని, శరీరానికి అదనపు శక్తి సమకూరుతుందని వారు సూచిస్తున్నారు.

విచిత్రమేమిటంటే, మూడ్స్ బాగా లేనివారే ఎక్కువగా జంక్ ఫుడ్‌ను తీసుకుంటూ ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మనసు సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నవారు చక్కటి ఆహార పదార్థాలు, పండ్లు, పచ్చి కూరలు, రసాలతో భోజనం చేస్తారట. మనసు బాగా లేనివారు ఆరోగ్యకరమైన పదార్థాల కంటే ఉత్తేజపరిచే లేక కిక్ ఇచ్చే పదార్థాల కోసం చూసుకుంటారు. రుచులకు ప్రాధాన్యం ఇస్తారు. మనసు హాయిగా ఉల్లాసంగా ఉన్నవారు కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం మీదే దృష్టి పెడతారు. అందువల్ల మూడ్స్ మీదే ఆహార పదార్థాల ఎంపిక, సేవనం ఆధారపడి ఉంటాయనేది నిర్వివాదాంశం. 

మూడ్స్‌ను ఉల్లాసంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే దీర్ఘకాలంలో ఆరోగ్యం పుష్టిగా మారుతుంది. దాని మీదే ఆయుర్దాయం కూడా ఆధారపడి ఉంటుంది. సారాంశం ఏమిటంటే, జీవితాన్ని ప్రతి క్షణం ఉల్లాసంగా, ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నిస్తే రోగ భయం లేని దీర్ఘాయువు మీ సొంతం అవుతుంది.

Thursday, 5 December 2013

WHAT IS THE REASON BEHIND NO CHILDREN - WOMEN PROBLEMS FOR PREGNANCY ETC - TIPS FOR WOMEN IN CONNECTION WITH PREGNANCY


సంతానలేమికి ఆయుర్వేదమే .....

సరైన వైద్యం .....!

సంతాన ప్రాప్తితోనే దాంపత్య జీవితం ధన్యవుతుందన్నది స్త్రీ పురుషుల్లో అనాదిగా ఉన్న భావన. అయితే ఇటీవలి కాలంలో పలు కారణాల వల్ల ఎక్కువ మంది సంతాన లేమి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో పిల్లలు పుట్టక పోవటానికి తల్లిదండ్రుల యొక్క శుక్ర, శోణితాలు అందులోని దోషాలే ముఖ్య కారణాలని ఆయుర్వేద పండితులు ఎప్పుడో చెప్పారు. అయినా, సంతానలేమికి ఇప్పటికీ చాలామంది స్త్రీలలోనే లోపం ఉందని చెపుతుంటారు. కారణాలు ఏవైనా ఏడాది పాటు ఆయుర్వేద చికిత్స తీసుకోవటం ద్వారా సంతానలేమి సమస్యను పరిష్కరించవచ్చంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ మనోహర్.

పెళ్లయి ఏళ్లు గడిచిపోతున్నా, సంతానమే కలగకపోతే దంపతులకు అది పెద్ద ఆందోళనకర విషయమే. ఆరోగ్యవంతులుగా కనిపించే దంపతులు కూడా చాలా మంది నే డు సంతాన లేమి సమస్యకు గురవుతున్నారు. అయితే చాలా మంది దంపతులు పెళ్లయి ఎంత కాలమయ్యిందని? నిదానంగా అవుతారులే అప్పుడే ఏం తొందర? అంటూ చాలా మంది దంపతులు కాలయాపన చేస్తారు. ఆరోగ్యవంతులైన దంపతులు ఏ విధమైన గర్భనిరోధక మాత్రలు లేకుండా ఏడాది నుంచి ఏడాదిన్నర సంవత్సరాల జీవితం గడపినా, పుల్లలు పుట్టకపోతే వారిని సంతానలేమిగా పరిగణించవచ్చు. వివాహం అయ్యాక 50 శాతం మంది స్త్రీలలో మొదటి మూడు నెలల్లో గర్భధారణ అవకాశాలు ఎక్కువ. 25 శాతం మందిలో ఆరు నెలల తర్వాత నెలతప్పే అవకాశం ఉంది. 10 నుంచి 15 శాతం మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.

కారణాలు అనేకం

సంతాన కాంక్ష ఎంత బలంగా ఉన్నా కొందరికి ఆ కోరికే తీరదు. దానికి పలు కారణాలు కనిపిస్తాయి. రుతుచక్రంలో మార్పులు, కొన్ని రకాల వ్యాధుల వల్ల అండం సరిగా విడుదల కాకపోవడం, ఉదాహరణకు నీటిబుడగలు, అండాశయం చిన్నదిగా ఉండటం, గర్భాశయం నిర్మాణంలో, ఆకృతిలో పుట్టుకతో వచ్చే లోపాలు, యోని పూర్తిగా లేకపోవడం, యోని మార్గం మూసుకొని పోవటం లేదా చిన్నదిగా ఉండటం, గర్భాశయ మార్గంలో కండరాలు పెరగటం, లేదా గర్భాశయ ముఖద్వారం వద్ద ఏర్పడిన ఇన్ఫెక్షన్‌లు, గర్భాశయంలో గడ్డలు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్‌ల వల్ల ట్యూబ్స్ మూసుకొని పోవటం, ట్యూబ్స్‌లో వాపు ఏర్పడటం లాంటివి సంతానలేమికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఆయుర్వేద శాస్త్రంలో రుతు, క్షేత్ర, అంబు, బీజం...అలాగే వాత, పిత్త, కఫ అనే త్రిదోషాలు ముఖ్యమైన అంశాలుగా తీసుకుంటారు.
గర్భ ధారణలో కీలకాంశాలు
రుతువు : అండాశయం నుంచి అండం విడుదల అయ్యేందుకు అనువైన కాలాన్ని రుతుకాలం అంటారు. దాన్నే ఆయుర్వేదంలో వావ్యులేషన్ పిరియడ్‌గా చెపుతారు. సాధారణంగా స్త్రీకి బహిష్టు మొదలైన 12వ రోజు నుంచి 16వ రోజు వరకు రుతుకాలంగా పరిగణిస్తాం. 12 నుంచి 16 రోజుల ఈ మధ్యకాలంలో ఎప్పుడు అయినా అండం విడుదల కావచ్చు. ఆ సమయంలో అండాశయం నుంచి అండం సక్రమంగా విడుదల అవ్వాలి అంటే అండాశయానికి సంబంధించి ఏ వ్యాధి ఉండకూడదు. అలాగే స్త్రీ యొక్క వయోపరిమితిని కూడా రుతుకాలంగా పరిగణిస్తాం. (సాధారణంగా 21 నుంచి 35 సంవత్సరాల వరకు)

క్షేత్రం

క్షేత్రం అంటే భూమికి పర్యాయపదం. గర్భం ధరించటానికి స్త్రీకి గర్భాశయం, గర్భాశయ మార్గం, గర్భాశయ సంబంధిత భాగాలు ఆరోగ్యంగా ఉండాలి. ఒక వేళ అండాశయం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా అండం విడుదల అయినప్పటికీ వీర్యం కణంలో కలిసి ఫలదీకరణం చెందిన తర్వాత గర్భాశయ గోడలను ఆధారంగా చేసుకొని పిండం ఎదగాల్సి ఉంటుంది. కావున గర్భాశయం శక్తిమంతంగా, ఆరోగ్యంగా ఉండాలి. కొన్ని సార్లు గర్భాశయ మార్గాలను అవరోధించే కొన్ని వ్యాధుల కారణంగా శుక్రకణాలు అండాన్ని చేరలేక పోవచ్చు. కనుక విత్తనం మొలకెత్తటానికి భూమి సారవంతంగా ఉన్నట్లే గర్భాశయం మిగతా భాగాలు ఆరోగ్యంగా ఉండాలి.

అంబు : గర్భ పోషణకు ఉపయోగపడే పోషకాంశాలు, గర్భధారణకు ఉపయోగపడే హార్మోన్లను అంబు అని ఆయుర్వేద నిపుణులు వర్ణించారు. ఈ హార్మోన్లలో సమతుల్యత లేకపోతే గర్భం రాదు. సంతానలేమికి శుక్రధాతువు లోపాలు కూడా ప్రధానంగా ఉంటాయి. చివరిగా ఏర్పడే శుక్రధాతువును స్త్రీలలో అండంగాను, పురుషుల్లో వీర్యంగాను పరిగణిస్తారు.
బీజం : ఆయుర్వేదంలో స్త్రీలలో అండాశయం నుంచి విడుదల అయ్యే అండాన్ని పురుషుల్లోని వీర్యాన్ని బీజం అనే పదంతో సూచిస్తారు. అండం పరిమాణం, శక్తి, శక్ర కణంలోని కదలగలిగే సామర్థ్యం, శుక్ర కణం నాణ్యతపై గర్భధారణ ఆధారపడి ఉంటుంది.

సంతానలేమికి ఆయుర్వేద చికిత్స
ఆయుర్వేద శాస్త్రంలో త్రిదోషాల ప్రాధాన్యాన్ని బట్టి ఔషధ సేవన చేయాల్సి ఉంటుంది. ఇందులో రసాయనాలకు ప్రాధాన్యం ఉంది. ఈ రసాయనాలు స్త్రీ యొక్క జననేంద్రియాలకు సరైన పోషణను కలిగిస్తాయి. పంచకర్మలు ముఖ్యంగా స్నేహ, స్వేద, విరేచన, వస్తికర్మలు అవసరాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటే శిరోధార, హార్మోనల్ సమస్య ఉంటే నస్యకర్మ, తక్రధార, ట్యూబల్ బ్లాక్స్ లాంటివి ఉన్నట్లయితే ఉత్తరవస్తి, నీటి బుడగలు, కణితలు ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే యోనిపిచు, ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే యోని ప్రక్షాళన (ఔషధయుక్త కషాయాలతో) లాంటి శాస్త్రీయ చికిత్స విధానాలు చక్కని పరిష్కార మార్గాలుగా ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ఆయుర్వేద శాస్త్ర పద్ధతిలో సత్ఫలితాలు రావాలంటే క్రమం తప్పకుండా ఒక సంవత్సరం ప్రసూతి, స్త్రీ వైద్యనిపుణుల పర్యవేక్షణలో చికిత్స పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.