WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Modern Science Secrets. Show all posts
Showing posts with label Modern Science Secrets. Show all posts

Sunday, 12 October 2014

KAMALA JUICE TASTE CHANGES AFTER BRUSHING WHY


రుచి మారిపోతుంది

పళ్లు తోముకోగానే కమలా పండు జ్యూస్‌ తాగితే నిమ్మకాయ కొరికిన రుచి ఉంటుంది. అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ అనే స్వచ్ఛందసంస్థ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ‘‘టూత్‌ పేస్ట్‌లో ఉండే సోడియం లౌరల్‌ సల్ఫేట్‌ అనే రసాయనమే ఇందుకు కారణం. ఈ రసాయనం టాయిలెట్‌లు శుభ్రం చేసే ఉత్పత్తుల్లో కూడా ఉంటుంది. టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముకున్నాక ఈ రసాయనం రుచి మొగ్గలపై నిలిచి ఉంటుంది. అదలా ఉన్నప్పుడు కమలాపండు రసం తాగడం వల్ల ఇందులో ఉండే విటమిన్‌సితో రసాయనం కలిసి నిమ్మకాయను కొరికినప్పటి రుచి వస్తుంది’’ అని వివరించారు పరిశోధకులు.

Friday, 5 September 2014

SECRET OF COMPASS WORKING


దిక్సూచి మర్మం
విద్యుత్‌ ప్రవాహాలు అయస్కాంత తత్వాన్ని జనింపజేస్తాయని కనుగొన్నది డానిష్‌ శాస్తవ్రేత్త హాన్స్‌ క్రిస్టియన్‌ ఒరెస్టడ్గ (1777-1867). దిక్సూచికి దగ్గరలో విద్యుత్‌ ప్రవాహం జరిగినప్పుడు దానిలోని ముల్లు చలించడాన్ని ఆయన గుర్తించాడు. 1831లో ఇంగ్లీష్‌ దేశ శాస్తవ్రేత్త మైఖైల్‌ ఫారడే (1791-1867) ఈ అనుబంధం వ్యతిరేక దిశలో కూడా పనిచేయగలదని కనిపెట్టాడు.ఓ తీగ చట్టు మధ్యలో అయస్కాంతాన్ని వేగంగా తిప్పిగే తీగల్లో విద్యుత్‌ జనిస్తుందని గుర్తించాడు.