WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Sweet Corn Health Benefits. Show all posts
Showing posts with label Sweet Corn Health Benefits. Show all posts

Wednesday, 6 July 2016

HEALTH BENEFITS WITH TAKING SWEET CORN REGULARLY


 పోషకాలు నిండుగా

ఉడికించి కొద్దిగా ఉప్పూ, కారం, మిరియాలపొడి చల్లిన స్వీట్‌కార్న్ ‌ని చూస్తే ఎవరికి మాత్రం నోరూరదు ఈ వానాకాలంలో. దాన్నితరచూ తీసుకోవడం వల్ల ఒనగూడే ప్రయోజనాలేంటో చూద్దామా.

* ఇందులో కెలొరీలు తక్కువ. సుమారు వందగ్రాముల స్వీట్‌కార్న్‌ తీసుకుంటే 86 కెలోరీలు అందుతాయి. ఈ గింజల్లో ఆహారసంబంధిత పీచూ, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లోని ఫెరులిక్‌ ఆమ్లం కొన్నిరకాల క్యాన్సర్లను నివారించడమే కాదు, వార్థక్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది.

* స్వీట్‌కార్న్ ‌లోని ప్రత్యేకమైన బి విటమిన్లు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది తియ్యగా ఉంటుంది కాబట్టి.. తీపిశాతం ఎక్కువేమో అనే అపోహ వద్దు. కానీ ఒక యాపిల్‌తో పోలిస్తే.. ఇందులో ఉండే తీపి శాతం తక్కువే. కాబట్టి మోతాదు మించకుండా వీటిని నిత్యం తీసుకోవచ్చు.

* స్వీట్‌కార్న్‌ తీసుకుంటే జీర్ణక్రియ తీరు మెరుగుపడుతుంది. అందుకు కారణం ఇందులో ఉండే పీచే. అలాగే మేలు చేసే బ్యాక్టీరియా కూడా పుష్కలంగా ఉంటుంది. పైగా ఇది గ్లూటెన్‌ రహిత పదార్థం కూడా.

* స్వీట్‌కార్న్ ‌లో పుష్కలంగా ఉండే ఫొలేట్‌ గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని థయామిన్‌ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

* వయసు పెరిగేకొద్దీ కంటి చూపు మందగించడంతో పాటూ మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటి ప్రభావాన్ని తగ్గించడంలో స్వీట్‌కార్న్‌ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే జియాగ్జాంథిన్‌ అనే ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్‌ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.