WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Lord Sri Maha Vishnu Stories and Articles. Show all posts
Showing posts with label Lord Sri Maha Vishnu Stories and Articles. Show all posts

Wednesday, 15 June 2016

ANUVU - SRI MAHA VISHNUVU


అణువు
(వైకుంఠపాళీ - ముందుమాట ..విశ్వనాథుడు.)

విశాలమైన ఈ ప్రపంచాన్ని విడగొట్టి చూస్తే మిగిలేది అణువే. 
మిణుగురు వెలుగూ అణువంతనే. మనసులోని వెలుగూ అణువంతనే! 
అప్పుడే పుట్టిన పసిపాప కూడా అణువంతనే! అణువులోని మహత్తు అణువుకే తెలుసు!
సముద్రపుటొడ్డున ఇసుకరేణువులు. ఒక్కొక్కటీ అణుమాత్రం.
ఒక్కక్కటే కూడితే అనంతం. అణువులో అనంతం.
అనంతానంత అణువులు. పేర్చుకొంటూ….కూర్చుకొంటూ...
ఒక అణువు మరొకదాన్ని ఢీకొడుతుంది.
ఒకటి + ఒకటి = ప్రళయం. ఇది నమ్మలేని నిజం.
అణువు సామాన్యమైనది కాదు.
ఈ విశాల విశ్వంలో భూమి ఎంత చిన్న పరమాణావో!
వేలెడంత మానవుల్లో ఎన్ని కోట్ల అణువులో!
ఒక్కో అణువునూ కదిపి, కుదిపి, నడిపించే “అహం” పరమాణువా? మహత్తా?
..
ఆ జగన్నాటక సూత్రధారి…అదిగో…ఆ అణువులోను అక్కడే ఉన్నాడు.
అక్కడొక్కచోటేనా?
ఆహా…ఆ ప్రక్కనా ఉన్నాడు. ఈ ప్రక్కనా ఉన్నాడు.
అంతేనా!
.
జగన్మాతలో ఉన్నాడు. బ్రహ్మలో ఉన్నాడు.
అక్కడ నిండిన వాయువులో ఉన్నాడు.
ఇంద్రాది సమస్త దేవతల్లోనూ, గంధర్వాదుల్లో మనోనేత్రమై, ఋషుల హృత్కమలాల్లో మెరుస్తూ, మునుల మనోవీధుల్లో సంచరిస్తూ, మానవుల మస్తిష్కాల్లో కనబడీ కనబడక,
జంతుజాలాల్లో ప్రేరకుడై, చెట్లల్లో రసమై, పర్వతాల్లో శిఖరమై,
చివరకు గడ్డిపోచల్లోని అమాయక సౌందర్యసిక్త అస్తిత్వంలోనూ…
ఆ మహావిష్ణువే…అలరారుతున్నాడు.

Wednesday, 3 February 2016

BRIEF INFORMATION ABOUT 5TH WEAPON USED BY LORD SRI MAHA VISHNU - SUDARSANA CHAKRAM


సుదర్శనచక్రం.5 {పంచాయుధాలు}

దీని పుట్టుకను గురించి మూడుకథలున్నాయి. 

01. సూర్యభగవానుడు విశ్వకర్మపుత్రిక అయిన సంజ్ఞను పరిణయమాడతాడు. సూర్యతేజాన్ని భరించలేనని సన తన తండ్రి విశ్వర్కర్మతో చెబుతుంది. అప్పుడు విశ్వకర్మ ఒక యంత్రం ద్వారా సూర్యతేజస్సును తగ్గిస్తాడు. యంత్రంలో సూర్యుని పెట్టి త్రిప్పిన సందర్భాన రాలిన రజం వల్ల విశ్వకర్మ చక్రాన్ని తయారు చేస్తాడు. ఇది విష్ణువుకు ఇవ్వబడుతుంది. (విష్ణుపురాణం – 3వ ఆంశం – అధ్యాం 2).

02. ఇంద్రుడు వర్షాన్ని వర్షించడంవల్ల ఖాండవదహనాన్ని అడ్డుకుంటాడు. ఆ సందర్భాన సుదర్శనాన్ని, గాంఢీవాన్ని కృష్ణార్జులకు అగ్నిదేవుడు ప్రసాదిస్తాడు. అందువల్ల సుదర్శనానికి అగ్నేయం అని కూడా పేరు. ఖాండవదహనం పూర్తయ్యాక ఈ ఆయుధాలు తిరిగి గ్నికి ఇవ్వబడతాయని కూడ ఒకచోట వ్రాయబడింది.

03. సుదర్శనాయుధాన్ని శివుడు కృష్ణునికి ఇచ్చినట్లు కూడ మహాభారతంలో ఉంది. నీటిలో నివసించే ఒకానొక దైత్యుని సమ్హరించేందుకు గాను చక్రన్ని శివుడు విష్ణువుకు ఇస్తాడు. దానిని శివుడు సుదర్శనచక్రం అని పిలుస్తాడు.

సుదర్శనానికి సంబంధించి వివిధ పురాణలలో చాలా గాథలున్నాయి. కృష్ణావతారానికి పూర్వమే సుదర్శనం విష్ణువు దగ్గర ఉంది. విష్ణువు దుష్టసంహారణార్థం సుదర్శనాన్ని కృష్ణావతారానికి ముందు కూడా ప్రయోగించినట్లు పురాణగాథల వల్ల తెలుస్తోంది.

సుదర్శనశక్తి అద్భుతమైంది. ఇది శత్రువులను అగ్నివలె దహిస్తుంది. శత్రుసంహారం కోసం విష్ణువు ఎప్పుడైతే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో, అప్పుడు అది సూర్య తేజో విరాజితమవుతుంది. శత్రుసంహారం చేసి తిరిగి భగవానుని చేరుకుంటుంది.

* మహాభారతం ఆదిపర్వం 16వ ఆధ్యాయంలో సుదర్శన చక్రాన్ని గురించిన వర్ణన ఉంది.

శ్రీవైష్ణవ సంప్రదాయంవారు సుదర్శనాన్ని చక్రత్తాళ్వార్ అని కూడా పిలుస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపునాడ్ జరిగే చక్రస్నానం/అవబృదస్నానం చక్రత్తాళ్వార్ కే చేస్తారు.నిగమాంతమహాదేశికులవారు సుదర్శనం గొప్పతననాన్ని చాటి చెప్పారు. తమిళనాడు – చెంగల్పట్టు జిల్లాలోని తిరుపుళ్కుషి గ్రామంలో ఒకానొకప్పుడు ప్రజలు తీవ్రజ్వరంతో బాధపడుతుంటారు. ఆ సందర్భాననిగమాతదేశికులవారు సుదర్శనాన్ని ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తారు. తను రచించిన రమణీయమైన సుదర్శనాష్టకాన్ని పఠిస్తారు. అప్పుడు ఆ గ్రామస్తులు జ్వరపీడ నివృత్తులై ఆరోగ్యవంతులవుతారు.

చక్రత్తాళ్వార్లు సర్వకాల సర్వావస్థలయందు కూడ భగవానుని సన్నిధానంలోనే ఉంటారు. పెరుమాళ్ళు హిరణ్యాక్షుని సంహరించిన సందర్భంలోచక్రత్తాళ్వార్లు వరహాస్వామివారి కోరలరూపంలో ఉన్నారని విశసించబడుతోంది. హిరణ్యాక్షుని చీల్చిన నరసింహుని పదివేళ్ళకు ఉండే నఖాలరూపంలో సుదర్శనుడు ఉన్నాడంటారు.

పరశురామావతారంలో సుదర్శనం పరశువుగా మారినట్లు చెప్తారు. రామావతారంలో సుదర్శనం ఒక జ్యోతి ఆకారంలో రాముని అంటిపెట్టుకొని ఉండేదట. రాముని విల్లు అంబులుగా సుదర్శనం అవతరించిందని కూడా చెప్తారు. వామనావతారలో సైతం సుదర్శనం పెరుమాళ్ళుకు సహాయంగా ఉందంటారు. దీని ఆధారంగా పెరియాళ్వార్లు రచించిన ఓ పాశురంలో కమండలం ద్వారా నీరు రాకుండా తేనెటీగ రూపంలో అడ్డూడిన శుక్రుని, సుదర్శనుడు దర్భరూపంలో ఉండి తొలగించినట్లు చెప్పబడింది. ఒకానొక సందర్భాన శివపార్వతులు కైలాసంలో రత్న సింహాసనాసీనులయి ఉంటారు. పార్వతి ఏమంత్రాన్ని జపిస్తే కార్యసిద్ధి కలుగుతుందని శివుని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమశివుడు పార్వతికి ప్రేమతో సుదర్శన మహామంత్రానికి అంతటిశక్తిని కలిగి ఉందని తెలియజేస్తాడు.

సుదర్శనం మహావిష్ణువునకు అయుధంకాగా సుదర్శనానికి పదునారు (16) ఆయుధాలు ఉండటం విశేషం. నిగమాంతదేశికులవారు సుదర్శనాయుధ స్తోత్రాలలో ఆ 16 ఆయుధాలను అభివర్ణించారు. ఆ స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల సర్వ భయాలు తొలిగిపోతాయని నమ్మకం.

* సుదర్శనం ధరించే 16 ఆయుధాల వివరాలు

కుడివైపు పైనుంచి వరుసగా చక్ర, పరశు, కుంట, దండ, అంకుశ, అగ్ని, నిస్త్రింశ, శక్తి; కాగా వామహస్తాలలో పైనుంచి క్రమంగా పాంచజన్య, శార్ జ్గ, పాశ, సీర, వజ్ర గధ, ముసల, త్రిశూల ఆయుధాలు. శత్రుశంహారం కోసం కృష్ణుడు ప్రయోగించిన సుదర్శనాయుధానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలు చాలా ఉన్నాయి.

గజేంద్రమోక్షంలో మకరసంహారం; శిశుపాలవధ, జయద్రధ సంహారం కోసం కృష్ణుడు సుదర్శనాన్ని సూర్యునికి అడ్డుపెట్టిన సందర్భం, అంబరీషుని దగ్గర అహం ప్రదర్శించిన దుర్వాసుని తరిమిన సందర్భం, పౌండ్రకవాసుదేవ సంహారం మొదలయిన ఘట్టాలలో సుదర్శన ప్రయోగం జరుగుతుంది. ఈ గాథలన్నీ సుదర్శనం గొప్పతనాన్ని వెల్లడిస్తాయి.

తమిళనాడు – త్రిప్లికేన్ (తిరువళిక్కేణి) చెన్నైలోని పార్థసారధి స్వామి వారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవ సందర్భాన వర్దరాజ పెరుమాళ్ళు మకర సంహారార్థం సుదర్శనాన్ని ప్రయోగించే భంగిమ నేటికీ బ్రహ్మోత్సవాల సందర్భాన ప్రదర్శితమౌతుంది.

కూరనారాయణా జీయర్ స్వామి వారు ఓ గొప్ప సుదర్శన భక్తుడు. వారు ప్రసిద్ధమైన సుదర్శనశతకాన్ని సంస్కృతంలో రచించారు. శ్రీరంగంలో తిరువాయ్ మొళిని పాడే ఓ వ్యక్తి ఒకానొకప్పుడు ‘ కంఠమాల ‘ అనే జబ్బుతో చాల బాధపడుతుంటాడు. ఆయన సుదర్శనాళ్వారును అతడి జబ్బును నయం చేయమని ప్రాథిస్తారు. ఆ సందర్భాననే కూరనారాయన స్వామి వారు సుదర్శన శతకాన్ని రచించాడని చెబుతారు.

* శ్రీనాథకవిసార్వభౌముడు భీమేశ్వరపురాణంలో పంచాయుధాలను గొప్పగా వర్ణించారు.

నరకాసుర సంహార సందర్భాన నరకుని చేతులు సుదర్శనం బంధిస్తుంది. బాణాసురవధలో కృష్ణుడు సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. తిరువయ్ మోళిలోని (4-1-8) పాశురంలో పెరియాళ్వారు జయద్రధ సంహారంలో సుదర్శనపాత్రను అభివర్ణించారు.

కొన్ని దేవస్థానాలలో ప్రత్యేకించి సుదర్శన సన్నిధులు కూడా ఉన్నాయి. తిరుక్కోవలూరు, తిరుమహీంద్రపురం, తిరుక్కుడందై (కుంభకోణం), కందియార్, శ్రీవిల్లిపుత్తూర్, వానమామలై, ఆళ్వార్ తిరునగరి, తిరుక్కురునంగుడి, శ్రీరంగము, వరదరాజపెరుమాళ్ కోయిల్, కాంచీపురం తిరుమోగూర్ లలోని దేవస్థానాలలో సుదర్శన సన్నిధులు ఉన్నాయి.

చక్రం ప్రగతికి చిహ్నం, ప్రగతికి సాధనం. ప్రపంచం సర్వత్రా చక్రమే కనిపిస్తుంది మనకు. ఈ విషయాన్ని ఏనాడో మన పూర్వులు గ్రహించారు. వారు “తతశ్చక్ర మయం సర్వం జగత్ స్థావర గంగమం” అని తెలియ చేశారు. సర్వ ప్రపంచమంతా చక్రమయమే. అట్టి చక్రం మహావిష్ణుస్వరూపం. ఈ అంశాన్ని కూడా మనపెద్దలు ఇలా తెలిపారు.

చక్రాంభోజే సమాసీనం
చక్రాధ్యాయుధ ధారిణం
చక్రరూపం మహావిష్ణుం
చక్ర్ మంత్రేణ చింతయేత్;
-సౌలభ్యచూడామణీస్తోత్రం

సుదర్శనవాజ్ఞ్మయం చాల ఉంది. అయితే అది చెల్లాచెదురుగా మరుగున ఉంది. నేడున్నా కొందరు మహనీయులు సుదర్శనోపాసకులు ఉన్నారు. వారి దగ్గర సుదర్శన వాజ్ఞ్మయం లభిస్తుంది. తెలియవచ్చినంతలో సుదర్శన వాజ్ఞ్మయాన్ని నామమాత్రంగా ప్రస్తావించు కుందాం. “సుదర్శనవాద:” అనే గ్రంథాన్ని వేదాంతదేశిక విహారసభా, పరకాలమఠం – మైసూరువారు ప్రచురించారు. చెన్నైలోని అడయార్ లైబ్రరీ 2 గ్రంథలిపిలో “సుదర్శనమీమాంస” అనే బృహత్ గ్రంథం ఉంది. సుదర్శనోపాసకులయిన కూరనారాయణజీయరుస్వామివారు “సుదర్శన శతకాన్ని” 101 వృథ్వీవృత్తాలలో సంస్కృతంలో రచించారు. ఈ శతకంలో సుదర్శనజ్వాల 24, నేమి 14, ఆర్ 12, నాభి 11, అక్షం 13, పురుష 26 మొత్తం 100 శ్లోకాలు ఉన్నాయి. బీజక్షర సంపుటితమైన ఈ సోత్రశతకానికి సంస్కృతాంధ్రాలలో వ్యాఖ్యానాలు వెలూడ్డాయి. ఉభయ వేదాంత సభ వారు శ్రీసుదర్శన శతకాన్ని వెలువరించారు. దానితోపాటు కొన్ని సుదర్శన స్తోత్రాలు కూడా చేర్చారు.

వేదాంతదేశికులవారు కూడా ఒక సుదర్శనశతకం రచించినట్లు తెలుస్తుంది. దానికి కూడా వ్యాఖ్య రచించబడిందట. దానిని ఖగేంద్రాచార్యగారి సంపాదకత్వాన హజారిమల్ సోమాని స్మారకట్రస్ట్ – బొంబాయివారు 1967 దేవనాగరిలో ప్రచురించినట్లు సమాచారం ఉంది. కుంభకోణంలోని గోపాలవిలాస ప్రెస్ లో కూడా భారద్వాజ గోపాలచార్య, శ్రీనివాసగోపాల తాతాహార్య వివరణ వ్యాఖ్యానాలతో వేదాంత దేశికులవారి సుదర్శనశతకం ప్రచురించినట్లు తెలుస్తోంది. సుదర్శనాష్టోత్తర శతనామస్తోత్రాలు రెండు లభిస్తున్నాయి. సుదర్శన సహస్రనామ స్తోత్రం, హేతిపుంగవస్తవ:, సుదర్శనషట్కం, సుదర్శనాష్టకం, సుదర్శనకవచం, షోడశాయుధస్తోత్రం, అంబరీషకృత సుదర్శన స్తోత్రం, సౌలభ్యచూడామణిస్తోత్రం, చక్రరాజమంగళం, అపరాధస్తవం మొదలయినవి సుదర్శన స్తోత్రవాజ్ఞ్మయానికి సంబంధించిన రచనలు. ఇవికాక ఇంకా ఉన్నాయి.

సుదర్శన షడక్షరమంత్రం, సుదర్శనా ష్టాక్షరీమంత్రం, సుదర్శన నారసిమ్హ మంత్రం, సుదర్శన నరసింహ మంత్రం (మరోపత్థతి), జ్వాలా సుదర్శనం, ఆత్మరక్షాకర సుదర్శనం, పరవిద్యాభేదన సుదర్శనం, అస్త్రమంత్రసుదర్శనం, సుదర్శన హృన్మంత్రం, ఆకర్షణ సుదర్శనం, సుదర్శానమాలామంత్రం, మొదలయినవి మంత్ర శాస్త్ర సంబంధితాలు. సాధకులు నియమనిష్ఠలతో ఆయా మంత్రాలను అనుష్టిస్తే, ఆయా ఫలితాలు ఉంటాయని పరంపర విశ్వాసం. ఇక సుదర్శన యంత్రమును బహువిధాలుగా వినియోగిస్తుంటారు. దాని ఉపయోగాలు చాలా ఉన్నాయి.

జ్యోతిశ్శాస్త్రరీత్యా గ్రహపీడ కలిగిన వారు ఆయా గ్రహాలను పూజించి నవగ్రహాది జపాలను చేస్తుండటం అద్వైతాది మతాలలో కనిపిస్తుంది. అయితే విశిష్టాద్వైతులు మాత్రం ఆయా బాధల నివారణార్థం సౌలభ్య చూడామణి స్తోత్రం, సుదర్శన కవచం, సుదర్శనశతకం, సుదర్శన నారసింహం, సుదర్శనాష్టోత్తర శతనామస్తోత్రాలను జపించటం, పారాయణం చేయటం సంప్రదాయంగా వస్తోంది. వైష్ణవ సంప్రదాయ పూర్వ వర్తమాన పంచాంగాలను పరశీలిస్తే కూడా ఈ విషయం స్పష్టమౌతుంది. అందుకే కేవల విశిష్టాద్వైత సంప్రదాయ దేవాలయ పరిధులలో నవగ్రహాది ప్రతిష్టలు కానరావు, సుదర్శన ప్రతిష్టలు దర్శనమిస్తాయి. సుదర్శన విగ్రహాలకు ముందువైపు సుదర్శనుడు దర్శనమివ్వగా వెనుకవైపు నారసింహుడు దర్శనమిస్తాడు.

దుర్మాంత్రికుల బెడదను నివారించేందుకు శ్రీరంగ క్షేత్రంలో శీసుదర్శన నారసింహమూర్తి ప్రష్టించబడిందని పెద్దలమాట. నేడు కూడా శత్రుభయ నివారణార్థం సుదర్శన నారసింహ మంత్రాన్ని పారాయణం చేయటం ఉంది. పరవిద్యాభేదనం, వశీకరణం, ఆకర్షణం, సంమోహనం అనే పేరుతో లభిస్తున్న వివిధ సుదర్శన మంత్రాల ప్రయోజనం, వాటి పేరే సూచిస్తున్నాయని వేరుగా చెప్పనవసరం లేదు. చక్రాంకనం కానివాడు శ్రీవైష్ణవుడే కాదు అని విశిష్టాద్వైత సంప్రదాయ గ్రంథాలు తెలుపుతున్నాయి. సర్వపీడానివారణకూ,సర్వఫలప్రదాలకూ సుదర్శన చక్రరాజ మహామంత్రం మహోన్నతమైనదని మహనీయుల మాట. మంత్రశాస్త్రంలో చక్రషట్కం (ఆరుచక్రాలు) చెప్పబడింది. అవి కాలచక్రం, పురుషచక్రం, ప్రకృతిచక్రం , మహాచ్చక్రం, అహంకార చక్రం జగచ్చక్రం.

ఏదైనా బాగా జరుగుబాటు వుండె చక్రం బాగా తిరుగుతూ ఉందని అంటుంటాం. జరుగుబాటు లేకుంటె చక్రం ఆగి పోయిందని అంటుంటాం. అంటే మనకు తెలియకనే మన జీవితచక్రంలో చక్రం చోటు చేసుకుంది.

భీజాక్షరసంపుటితమైన మహా సుదర్శన మంత్రాన్ని నియమనిష్ఠలతో గురుముఖత: అభ్యసించి జపిద్దాము, సుదర్శనమంత్రాని పూజిద్దాము. “సర్వ ధర్మే నిధనం శ్రేయ: పరధర్మోభయావహా:” అనే గీతాచార్యుని ఉందేశం అనుష్ఠేయం కదా!

మంగళం చక్రరాజాయ
మహనీయ గుణాబ్దయే
పద్మనాభ కరాంభోజ
పరిస్ఖారాయ మంగళం||
జాలాజ్వాలా విభూషాయ
సహస్రాదిత్య తేజసే
సర్వాఘ హరినే విష్ణో:
చక్రరాజాయ మంగళం||

శాంతాకారం భుజగశయనం – పద్మనాభాం సురేశం
విశ్వాకారం గగనసదృశం – మేఘవర్ణం శుభాంగం,
లక్ష్మీకాంతం కమలనయనం – యోగిహృద్ద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహారం – సర్వలోకైకనాథం ||

INFORMATION ABOUT FOURTH WEAPON USED BY LORD SRI MAHA VISHNU


శార్ జ్గము.4 {పంచాయుధాలు}

శార్ జ్గము విష్ణువుధనువు. దీనికి సంబంధించిన వివరాలు మహాభారతంలో ఉన్నాయి. కౌరవసభలో కృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించినపుడు, ఒక హస్తంలో శార్ జ ధనువు కలిగి ఉంటాడు. (ఉద్యోగపర్వం – 131 ఆధ్యాయం – 10 శ్లోకం). కృష్ణుని శార్ జ్గం ఇంద్రుని విజయధనువుతో సమానమైనది అని కూడా మహాభారతంలో చెప్పబడింది. (ఉద్యోగపర్వం – 158 ఆధ్యా – 5 శ్లో). శార్ జ్గం బ్రహ్మచే నిర్మించబడింది. (అనుశాసనిక పర్వం 141 ఆధ్యాయం).

DETAILED INFORMATION ABOUT LORD SRI MAHA VISHNU'S WEAPONS - THREE NANDHAKAM - THE SWORD


 నందకం.3 {పంచాయుధాలు} 

ఒకానొక సందర్భాన బ్రహ్మదేవుడు స్వర్గంగా తీరాన యజ్ఞం చేస్తుంటాడు. బ్రహ్మ ద్యానాని భగ్నం చేసేందుకు లోహాసురుడు అనేవాడు వస్తుంటాడు. వెంటనే బ్రహ్మ ధ్యానం నుంచి ఒక పురుషుడు వస్తాడు. ఆ పురుషునికి దేవత ల ఆశీస్సులు లభిస్తాయి. అతడు వెంటనే నందక అనే కత్తిగా మారిపొతాడు. నందకం అంటే ఆనందం కలిగించేది అని అర్థం. దేవతలకు ఆనందం కలిగించినందులకు ఆ కత్తి నందక అనే పేరు కలిగింది. దేవతల కోరికమేరకు నందకం ఖడ్గం విష్ణువుచే గ్రహించబడుతుంది. లోహాసురుడు నల్లని ముఖంతో వెయ్యి చేతులతో ఉంటాడు. అతడు తన చేతులతో దేవతలను గుంపు కూడనీయక చెల్లాచెదురు చేస్తుంటాడు. మహావిష్ణువు లోహాసురుని సహస్ర హస్తాలను నరికివేసే ప్రయత్నం చేస్తాడు. నందకం తగలగానే లోహాసురుని చేతులు లోహంగా మారిపోతాయి. అది గమనించి విష్ణువు అసురుని సంహరిస్తాడు. అప్పుడు నందకం స్వచ్చమైన ఆయుధంగా అవతరించెనని పురాణగాథ.

Lord Vishnu holds a padma (lotus flower) in his lower left hand, the Kaumodaki gada (mace) in his lower right hand, the Panchajanya shankha (conch) in his upper left hand and the discus weapon considered to be the most powerful weapon according to Hindu Religion Sudarshana Chakra in his upper right hand.


LORD SRI MAHA VISHNU'S WEAPONS LIST INFORMATION - TWO Kaumodaki gada (mace)


 శ్రీ మహావిష్ణువు గధ (కౌమోదకి).2 {పంచాయుధాలు}

శ్రీ మహావిష్ణువు తన ఎడమ కింది చేతిలో గధను ధరించి ఉంటారు. ఈ గధ స్వామివారికి ఎలా చేరిందో తెలియ చెప్పే వివిధ ఘట్టాలు మనకు కనిపిస్తాయి. 

* గధ అనే పేరు ఎలా వచ్చింది?

పూర్వం గధ అనే ఒక రాక్షసుడు ఉండే వాడు. అతడు దైవ, మానవుల కు భయం కలిగిస్తూ ఉండే వాడు. ఐతే అతనిలో కల మంచి సుగుణం సత్యవాక్య పరిపాలన. తన వద్దకు వచ్చి ఎవరు ఏది అడిగినా వెంటనే ఇచ్చే వాడు.

దేవ, మానవుల కష్టాలు గమనించిన ఆ శ్రీ మహా విష్ణువు గధ వద్దకు వెళ్లి తన ఎముకలు కావలసినది గా కోరారు. అప్పుడు ఆ గధ తన ఎముకలు తానే విరచి ఆ శ్రీమహావిష్ణువు చేతిలో పెట్టారు. ఆ ఎముకలను తీసుకున్న విష్ణువు పరమ దయతో ఆ ఎముకలకు ఒక ఆకారాన్ని ఇచ్చి ఎల్లప్పుడూ తనతో నే ఉంచుకున్నరు. అప్పుడు ఆ మహావిష్ణువు ఆ ఎముకలకు ప్రసాదించిన ఆకారాన్ని మనం ఈ నాటికీ గధ అనే పిలుస్తున్నాం.

ఒక వ్యక్తి ఎంత రాక్షసుడైన తనలో ఉన్న ఏదో ఒక చిన్న మంచి తనం తో, చేసిన త్యాగం తో అంతకు ఎన్నో రెట్ల భగవత్ అనుగ్రహాన్ని పొందగలడు అనటానికి ఇది ఒక ఉదాహరణ.

ఈ గద ఉరుము మెరుపులను పుట్టించి ఏ దైత్యులనైనా చంపే సామర్థ్యం కలిగి ఉంటుంది.

* కౌమోదకి శ్రీ కృష్ణునికి ఎవరు ఇచారు ? ఎందుకు?

శ్రీకృష్ణునికి కౌమోదకి ని అగ్ని దేవుడు ఖాండవ వన దహన సమయం లో ఇచ్చాడు.


Lord Vishnu's holds a padma (lotus flower) in his lower left hand, the Kaumodaki gada (mace) in his lower right hand, the Panchajanya shankha (conch) in his upper left hand and the discus weapon considered to be the most powerful weapon according to Hindu Religion Sudarshana Chakra in his upper right hand.

LORD SRI MAHA VISHNU'S WEAPONS LIST - ONE Panchajanya shankha


పాంచజన్యం(శంఖం).1 {పంచాయుధాలు}

ఓ బలవంతుడయిన అసురుడు శంఖంలో నివసిస్తుంటాడు. అందువల్ల అతనిని పంచజనుడు అని పిలుస్తారు. సాందీపుని ఆశ్రమంలో శ్రీకృష్ణుడు, బలభద్రుడు విద్యాభ్యాసం చేస్తుంటారు. వారి విద్యాభ్యాసం పూర్తి అవుతుంది. ఆ సంధర్భాన పంచజనరాక్షసుడు ప్రభాత తీర్థం దగ్గర స్నానం చేస్తున్న సాందీపుని పుత్రుని ఎత్తుకొని వెళతాడు. అసురుడు ఆ బాలుని తాను నివసించే శంఖంలో బంధిస్తాడు. తన పుత్రుని గురుదక్షిణగా తెమ్మని సాందీపుడు బలరామకృష్ణులను కోరతాడు. వారు నదీతీరానికి వెళ్ళీ వరుణుని ప్రార్థిస్తారు. వరుణుడు బలరామకృష్ణులకు ప్రత్యక్షమౌతాడు. వరుణుని సాయంతో బలరామకృష్ణులు పంచజనుని చంపి దక్షిణగా గురుపుత్రుని సాందీపునికి సమర్పిస్తారు. అసురుడు నివసించిన శంఖాన్ని కృష్ణుడు జ్ఞాపికగా గ్రహిస్తాడు. పంచజన సబంధితమైన శంఖం కాబట్టి దానికి పాచజన్య అనే పేరు వ్యవహారంలో నిలిచింది (భాగవతం – దశమస్కందం) .

గోదాదేవి “నాచ్చియార్ తిరుమొళి” లోని పదిపాశురాలలో శంఖ సౌందర్యాన్ని వర్ణించింది. ధ్రువుని చెక్కిలిని భగవానుడు తన శంఖంతో స్పృశించటం విష్ణుపురాణంలో చెప్పబడింది. శ్రీ కౄష్ణుని సుందర మృదు మధురాధర స్పర్శను అనుభవించిన శంఖానిదే మహద్భాగ్యమని – ఎందరో భాగవతులు మధురభక్తి తన్మయులై తమ కవితల్లో పాంచజన్యాన్ని అభివర్ణించారు.

Lord Vishnu holds a padma (lotus flower) in his lower left hand, the Kaumodaki gada (mace) in his lower right hand, the Panchajanya shankha (conch) in his upper left hand and the discus weapon considered to be the most powerful weapon according to Hindu Religion Sudarshana Chakra in his upper right hand.

Tuesday, 16 December 2014

LORD SRI MAHA VISHNU AVATHARS STORIES IN TELUGU - ABOUT NARASIMHA AVATHAR, VAMANA AVATHAR, PARASURAMA AVATHAR, VEDAVYSYA AVATHARS


నరసింహ, వామన, పరశురామ, వేదవ్యాస అవతారాలు

01. నరసింహ అవతారం

చతుర్దశమ్ నారసింహమ్ బిభ్రత్ దైత్యేంద్రమూర్జితమ్ |
దదార కరజైరూరౌ ఏరకామ్ కఠకృద్ యథా ||

తరువాత పద్నాల్గవ రూపం నరసింహ అవతారం. ఇది హిరణ్యకశపుడి బలిసిన దేహాన్ని చీల్చి ప్రహ్లాదుణ్ణి కాపాడటం కోసం "దదార కరజైరూరౌ ఏరకామ్ కఠకృద్ యథా", గడ్డిని కత్తితో కోసిపడేసినట్లుగా తన గోర్లతో హిరణ్యకశపుడి దేహాన్ని చీల్చిపారేసాడు.

02. వామన అవతారం

పఙ్చదశమ్ వామనకమ్ కృత్వాగాద్ అధ్వరమ్ బకేః |
పదత్రయమ్ యాచమానః ప్రత్యాదిత్సుః త్రిపిష్టపమ్ ||

స్వర్గాన్ని తిరిగి ఇవ్వాలని దాన్ని లాగేసుకున్న బలిచక్రవర్తి నుండి, ఆయన దగ్గర ధాతృత్వం అనే గుణం ఉందికదా అని దానికి తగినట్లుగా ఒక యాచక అవతారాన్ని ధరించి ఆ బలి చక్రవర్తి యాగం చేస్తున్నటువంటి చోటికి వెళ్ళి మూడడుగుల స్థలం కావాలని కోరి స్వర్గాన్ని తిరిగి దేవతలకి ఇచ్చాడు. అలా వచ్చిన వామన స్వరూపం పదహైదవ అవతారం.

03. పరశురామ అవతారం:

అవతారే షోడశమే పశ్యన్ బ్రహ్మ ద్రుహోనృపాన్ |
త్రిః సప్త కృత్వః కుపితః నిఃక్షత్రామ్ అకరోన్ మహీమ్ ||

పదహారవ అవతారం పరశురామ అవతారం. ఈ అవతారంలో లోకాన్ని నాశనం చేసే దుష్ట ప్రభువుల్ని తొలగించి భూమి భారాన్ని తగ్గించాలని "త్రిః సప్త", ఇరవై ఒక్కసార్లు భూని చుట్టాడట. ఎక్కడెక్కడ దుష్ట ప్రభువులుంటే వారిని సంహరించిపారవేసాడు. లోకంలో క్షత్రియులనే లేకుండా చేయాలని బయలుదేరిన అవతారం అది.

04. వేదవ్యాస అవతారం:

తతః సప్తదశే జాతః సత్యవత్యామ్ పరాశరాత్ |
చక్రే వేదతరోః శాఖా దృష్ట్వా పుంసోల్ప మేధసః ||

తరువాత పదిహేడవ అవతారం వేద వ్యాస అవతారం. ఈ లోకంలో ఉండే మనుష్యుల బుద్ధి పలచబడి పోతుంది అని ఒక్క మహా వృక్షంగా రాశీభూతమైన వేదాన్ని విభాగం చేసాడు. అట్లా 1131 శాఖలుగా విభజించాడు. అందుకు ఆయన పరాశర మహర్షి యొక్క కుమారుడిగా సత్యవతీ దేవికి అవతరించాడు.

STORIES OF LORD SRI MAHA VISHNU AVATHARS - SRI RAMA - BALARAMA - SRI KRISHNA - BUDDHA AND KALKI AVATHARS STORIES IN TELUGU


 రామ, బలరామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలు

01. రామావతారం:

నర దేవతమాపన్నః సురకార్య చికీర్షయా |
సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాణి అనేకషః ||

దాని తరువాత దేవతలందరికీ ఏర్పడ్డ కష్టాలని తొలగించటానికి మనిషిగా అవతరించాడు. ఏం ఆశ్చర్యకరమైన పనులు చేసాడు, సముద్రాన్ని కూడా కోపించి నియంత్రించాడు చెప్పడానికి వీలుకానన్ని కృత్యాలు చేసాడు. ఇది మానవ అవతారం. ఇది పద్దెనిమిదవ అవతారం రామావతారం.

02 బలరామ-కృష్ణావతారాలు:

ఏకోనవింశే వింశతిమె వృష్ణిషు ప్రాప్య జన్మని |
రామకృష్ణావితిభువః భగవాన్ అహరద్భరమ్ ||

పంతొమ్మిది ఇరవైయవ అవతారాలు ఆయన అన్నతమ్ములుగా వచ్చాడు. శ్రీకృష్ణ బలరాములుగా యాదవుల్లో అవతరించి దుష్టసంహారం చేసి భూముకు ఏర్పడ్డ క్లేషాలని తొలగించాడు. ఇందులో ఒకటి సాక్షాదవతారం, మరొకటి జీవుణ్ణి ప్రధానం చేసుకొని వచ్చిన అవతారం. శ్రీకృష్ణుడిగా వచ్చింది సాక్షాదవతారం. బలరాముడిగా వచ్చినది అనుప్రవేశ అవతారం.

03. బుద్ధావతారం:

తతః కలై సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషామ్ |
బుద్ధో నామ్నాఙ్జన సుతః కీకఠేషు భవిష్యతి ||

ఇరవై ఒకటవ అవతారం బుద్ధావతారం. ఈ విషయం చెప్పేప్పుడు ఇంకా ఈ అవతారం రాలేదు. అందుకే సూతులవారు "భవిష్యతి", ఇది కాబోతోంది అని చెప్పారు. అంటే సూతులవారు శౌనకాదులకి ఉపదేశం చేసేవరకు బుద్ధావతారం జరగలేదు. కలియుగం ప్రారంభం అయినతరువాత లోకంలో ఉండే వారికి సంమోహం కలిగించేందుకు కలి యొక్క ప్రభావాన్ని లోకంలో వ్యాపింపజేయడం కోసం ఆయన జినుడి కుమారునిగా బుద్ధుడిగా కీకట దేశాల్లో అవతరిస్తాడు అని చెప్పాడు.

04. కల్కి అవతారం:

అథాసౌ యుగ సంధ్యాయామ్ దస్యు ప్రాయేషు రాజసు |
జనితా విష్ణు యశసః నామ్నా కల్కిర్ జగత్ పతిః ||

ఇరవై రెండవ అవతారం కూడా క్రమంగా వస్తుంది. ఈ కలియుగం అయిపోయాక యుగ సంధికాలంలో వస్తుంది. కలియుగం అయిపోయి కృత యుగం ప్రారంభం అవ్వాలి, అప్పుడు కల్కి అవతారం వస్తుంది. విష్ణు యశస్ అనే ఆయనకి పుడతాడు. కలియుగం మొత్తం నాలుగులక్షల ముప్పైరెండు వేల సంవత్సరాలు. ఇప్పుడు గడిచినది సుమారుగా ఐదువేల సంవత్సరాలు మాత్రమే. "యుగ సంధ్యాయామ్ దస్యు ప్రాయేషు రాజసు", అప్పుడు దేశాన్ని పాలించేవాళ్ళంతా దొంగలై పోతారు. ప్రజల్ని దోచుకు తింటారు. ఇప్పుడు ఇంకా అంతగా కాలం రాలేదు, ఇంకా మంచిగా పరిపాలన చేస్తాం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఆనాటికి తెలిసి తెలిసి భయం లేక దోచుకు తింటారు. కలి పెరిగితే తప్పు జరుగుతుంటే ఇది తప్పు అని ఎవరికీ అనిపించదు, ఇది తప్పు అనేవాడు ప్రక్కన ఉండడు. ఇది ధర్మమని కానీ ఇది దైవమని కానీ ఎక్కడా మాటనే వినిపించని స్థితిని కలి ఆరంభం అయినట్లు అర్థం. అలా కొన్ని అవతారాలి సూతులవారు వివరించారు.

HOW TO VIEW LORD SRI MAHA VISHNU IN MILK OCEAN - PALA KADALI LO UNNA PURUSHA SWAROOPANNI ETLA CHUDATAM


పాలకడలిలో ఉన్న పురుష స్వరూపాన్ని ఎట్లా చూడటం ?

ఈ సృష్టి చేసే చతుర్ముఖాదులనందరినీ వెలికి తీసిన ఆ పాలకడలిలో ఉన్న స్వామి స్వరూపం అది కేవలం విశుద్ధమైన సత్త్వ రూపం. ఎవరు చూసారు ఆ రూపాన్ని ? అంటే మీకూ మాకూ కనిపించే రూపం కాదది. అందులోంచి బయటకి వచ్చిన చతుర్ముఖునికి కూడా కనిపించదు. ఎప్పుడైన అవసరం ఏర్పడితే తాను విన్న వేదంలోంచి "సహస్ర శీర్షా పురుషః" అంటూ ఉపాసిస్తాడు. ఆ స్వరూపాన్ని ఆయన కూడా చూసాడో తెలియదు. ఎవరికీ ఎక్కడా కనిపించని దాన్ని ఉన్నది అని ఎట్లా అంటాం ? అట్లా ఎవరికీ కనిపించని దాన్ని తుచ్చము అంటారు, అలా తుచ్చమైన వాడు కాదు పరమాత్మ. ఎలా చూడటం అతణ్ణి ?

పశ్యంతి అదో రూపమ్ అదభ్ర చక్షుషా
సహస్ర పాదోరు భుజాననాద్భుతమ్ |
సహస్ర మూర్ధ శ్రవణాక్షి నాసికమ్
సహస్ర మౌల్యంబర కుండలోల్లసత్ ||

ఆయనని చూసిన వాళ్ళూ లేక పోలేదు. కళ్ళతో చూస్తేనే చూడటం అని కాదు అర్థం. కంటికి కనిపించేది మాత్రమే ఉన్నట్టని అర్థమా ? ఉప్పుని నీటిలో కలిపితే కంటికి కనిపిస్తుందా ? తెలుసుకోవాలంటే రుచి చూస్తే అది ఉందా లేదా తెలుస్తుంది. వాసనని చూడగలమా ? రుచిని చూడగలమా ? వాసనని కంటితో చూడలేం కనుక అది తెలిసేది ముక్కుకి. రుచిని చూసేది నాల్కతో. అలానే ఆ జగత్కారణమైన పరమాత్మనీ చూడవచ్చునా ? అంటే చూడవచ్చు. "అదో రూపమ్", ఆ అదోక్షజుడైన పరమాత్మ రూపాన్ని కూడా చూడ వచ్చును. ఎలా చూసేది ? మనస్సుతో చూడాలి.

ఆ మనస్సుతో ఎలా చూడాలి, ఏమిటి నియమం ? కంటి తో ఏవస్తువునైనా చూసేప్పుడు కంటికి ఏ అడ్డు ఉండనప్పుడు ఆ వస్తువు గోచరిస్తుంది. అట్లానే మనస్సుతో ఆ ఉన్న తత్త్వాన్ని చూడాలంటే మనస్సుని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ఇది నియమం. "అదభ్ర చక్షుషా", విశుద్ధమైన జ్ఞానంతో మాత్రమే "పశ్యంతి" చూడగలం. విశుద్ధమైన మానస్సుచే మాత్రమే కనిపిస్తాడు. అలా చూసే వాళ్ళు ఎలా చూస్తారంటే, "సహస్ర పాదః ఒరు భుజ ఆనన అద్భుతమ్ సహస్ర మూర్ధ శ్రవణాక్షి నాసికమ్ సహస్ర మౌల్యంబర కుండలోల్లసత్ " ఆయనకి ఎన్నెన్ని వేల వేల చేతులు, వేల వేల పాదాలు, వేల వేల శిరస్సులు, వేల వేల నేత్రాలు, వేల వేల నాసికలు, రకరకాల కిరీటాలు, రకరకాల కుండలాలు, రకరకాల ఆభరణాలు. "పల పలవే ఆభరణం పేరుమ్ పల పలవే పలపలవే శోడివడుమ్ పల్వినిల్" అని అంటారు నమ్మాళ్వార్. అలా ఉంటుంది భగవంతుని రూపం.