WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Gayathri Mantram Stories and Articles. Show all posts
Showing posts with label Gayathri Mantram Stories and Articles. Show all posts

Wednesday, 2 December 2015

SPIRITUAL IMPORTANCE OF GAYATHRI MANTRAM AND THE POWER OF PUJA OF GAYATHRI DEVI


గాయత్రీ మంత్రం గొప్పదనం మరియు శక్తి సామర్ధ్యాలు

 శక్తివంతమైన మంత్రాలలో ప్రథమ స్థానం గాయత్రీ మంత్రానికి ఉంది. గాయత్రీ మంత్రంలో అత్యద్భుతమైన స్వస్థతను ప్రసాదించే శక్తి ఉంది. మానవులలో మూడు రకాలుగానున్న చైతన్య వ్యవస్థపై ఈ మంత్రం చూపించే ప్రభావం అనిర్వచనీయం. నిద్రావస్థ, స్వప్నావస్థ, మేలుకుని ఉన్నప్పుడు ఇలా మూడు రకాల చైతన్య వ్యవస్థలపై గాయత్రీ మంత్ర ప్రభావం ఎంతో ఉంది. మంత్రం.....
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి దియోయోనః ప్రచోదయాత్
భావం......
మాలోనున్న అంతరఃచైతన్యాన్ని మేల్కొలపడానికి ఆధ్యాత్మిక జ్ఞానం అనబడే అత్యంత ప్రకాశవంతమైన దైవికమైన, పూజ్యమైన సూర్యకాంతిలో ధ్యానం చేస్తున్నాము' అని అర్థం. గాయత్రీ మంత్రం యొక్క ప్రాముఖ్యతను 'గాయత్రీ' అనే పదమే వివరిస్తుంది. సంస్కృత భాషలో 'గయంతం త్రియతే ఇతి' అనే పదం నుంచి గాయత్రీ అనే పదం ఉద్భవించింది. ఈ మంత్రాన్ని చదివిన వారు అనేక రకాల బాధల నుంచి విముక్తులవుతారని ఈ పదానికి అర్థం. గాయత్రీ మంత్రంలోని ప్రతి పదానికి అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఓం - ఓ బ్రహ్మ లేదా ఓ దైవమా

భూహ్ - కీలక ఆధ్యాత్మిక శక్తి స్వరూపిణి

భువః - బాధలను నశింపచేసే

స్వః - ఆనంద స్వరూపులు

తత్ - ఆ

సవితుర్ - సూర్యుడి వంటి ప్రకాశవంతమైన

వరేణ్యం - అత్యున్నత

భర్గో - పాపాలను నశింపచేసే

దేవస్య - దైవికమైన

ధీమహి - ఇమిడించుకొని

ధియో - తెలివి

యో - అయిన

నః - మన

ప్రచోదయాత్ - స్ఫూర్తి గాయత్రీ మంత్రం పఠించడం వల్ల కలిగే లాభాలు

ఈ మంత్రాన్ని ఉచ్ఛరించడం వల్ల కలిగే స్పందనలు ఎన్నో లాభాలను చేకూరుస్తోంది

1. అడ్డంకులను తొలగిస్తుంది

2. ప్రమాదాల నుంచి రక్షిస్తుంది

3. అజ్ఞానాన్ని తొలగిస్తుంది

4. ఆలోచనలకు పవిత్రతనిస్తుంది

5. సంభాషణా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది

6. మనో నేత్రాన్ని తెరిపిస్తుంది గాయత్రీ మంత్రంలోనున్న హీలింగ్ పవర్స్

గాయత్రీ శక్తి అనే శక్తి కేంద్రం తేజం, విజయం, విజ్ఞానం అనే మూడు ముఖ్య శక్తులకు కేంద్రబిందువు. గాయత్రీ మంత్రాన్ని ఉచ్ఛరించినప్పుడు ఈ మూడు రకాల శక్తులు మీలో స్పష్టంగా కనిపిస్తాయి. మీకు దీవెనలు అందించే శక్తిని ప్రసాదిస్తుంది. మీరు ఎవరినైతే దీవిస్తారో వారికి కూడా ఈ శక్తి ప్రాప్తిస్తుంది. మీ తెలివితేటలకు పదును పెట్టి మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. గాయత్రీ మంత్రాన్ని పఠించడానికి ఉషోదయం మరియు సంధ్యాసమయం ఉత్తమమైనవి. ఈ సమయాలలో వెలుగు, చీకటి పూర్తిగా ఉండవు. ఈ వేళలలో మనస్సు ఒక రకమైన అపస్మారక స్థితికి చేరుతుంది. మన ఆత్మపై మనం దృష్టి సారించడానికి అనుకూల వేళలివి. మనస్సు త్వరగా గందరగోళస్థితికి చేరుతుంది. ఈ సమయంలో గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా బద్దకాన్ని వదిలించుకుని, నిశ్చలస్థితికి చేరుకోవచ్చు. తద్వారా ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. క్రమం తప్పకుండా గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మీలో సానుకూల పరిస్థితి పెంపొందుతుంది. తద్వారా, ఎల్లవేళలా ఉత్సాహవంతంగా, ఉల్లాసంగా ఉంటారు.

Friday, 12 December 2014

IMPORTANCE OF GAYATHRI MANTRAM - PUJA AND PERFORMANCE OF GAYATHRI MANTRAM


 గాయత్రీ మంత్రం

గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలలో 24 దేవతలున్నారన్నది మన పెద్దలమాట. గాయత్రీమంత్రం పరబ్రహ్మ స్వరూపం. మోక్షపదాన్ని ఇస్తుంది. అందుకే గాయత్రీమంత్రానికి అంతటి ప్రాముఖ్యత.

ఓం భూర్భవస్సువ: తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోన: ప్రచోదయాత్

గాయత్రీమంత్రం 24 అక్షరాలలో -

1. “తత్” - గణేశుడు ,
2. “స” - నృసిం హస్వామి,
3. “వి” - విష్ణు,
4. “తు” - ఈశ్వరుడు,
5. “వ” - శ్రీకృష్ణ,
6. “రే” - రాధాదేవి,
7. “ణి” - లక్ష్మీదేవి,
8. “యం” - అగ్నిదేవుడు,
9. “భ” – ఇంద్రుడు,
10. “గో” – సరస్వతీదేవి,
11. “దే” – దుర్గాదేవి,
12. “వ” - హనుమాన్,
13. “స్య” - భూదేవి,
14. “ధీ” - సూర్యభగవానుడు,
15. “మ” - శ్రీరామచంద్రుడు,
16. “హి” - సీతాదేవి,
17. “ధి” - చంద్రుడు,
18. “యో” - యమధర్మరాజు,
19. “యో” - బ్రహ్మదేవుడు,
20. “న:” - వరుణదేవుడు,
21. “ప్ర” - నారాయణుడు,
22. “చో” – హయగ్రీవుడు,
23. “ద” - హంసదేవత,
24. “యత్” - తులసీమాత.

ఇందులో ఎవరి ఇష్టదేవతను వారు ఆ దేవత గాయత్రీ మంత్రంతో జపించి ఆ దేవతా అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు చొప్పున 40 రోజులపాటు ఆ దేవతాచిత్రం ముందు కూర్చుని ధూప, నైవేద్యాలతో పూజించి, ఆ దేవత మంత్రాలను 108 సార్లు జపించితే అనుకున్న కోరికలు నెరవేతురాయి.