WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Telugu Devotional Stories. Show all posts
Showing posts with label Telugu Devotional Stories. Show all posts

Wednesday, 9 December 2015

INFORMATION ABOUT KRISHNA GANAPATHI ACCOURDING TO HINDU PURANALU


కృష్ణ గణపతి

బ్రహ్మ వైవర్త పురాణంలో గణపతి ఖండమను అధ్యాయమున్నది .దానిలో గణపతి చెందిన పెక్కు విషయాలున్నవి . కృష్ణ పరమైన ఆ పురాణంలో గణపతి కృష్ణుని అంశలోనే జన్మించినట్లు చెప్పబడింది .
పార్వతి పుత్రకాంక్షతో శివునితో కూడ రతి క్రీడలో వున్న సమయంలో దేవతలు రతి గృహ ద్వారం వద్దకు వచ్చి మొరపెట్టుకొన్నారు.సంభోగ మధ్యమున వెలుపలికి వచ్చిన శివుని వీర్యం భూమిపై పడింది .దానివల్ల షణ్ముఖుడు అవతరించాడు.
కానీ పార్వతికి తనకు సంతానము కలుగ లేదన్న వ్యధ ప్రారంభమయింది . శ్రీ కృష్ణుని సూచన మేరకు శివుడు పుత్రప్రాప్తి కొరకు పుణ్యక వ్రత మాచరించునట్లు చెప్పినాడు .ఆ వ్రతాన్ని చేసిన తరువాత శ్రీ కృష్ణుడు గోప కిశోరరూపమున ఆమెకు దర్శన మిచ్చినాడు.కోటి కందర్ప లావణ్య మనోహరుడగు కృష్ణుని వంటి పుత్రుడు తనకు కావాలని ఆశించి యిష్టార్ధ సిద్ధిని పొందింది .
తరువాత పుత్రాకాంక్షతో పరమ శివునితో రతి క్రీడలో నున్న సమయంలో విష్ణువు మాయరూపంలో వచ్చి ద్వారం వద్ద నిలిచి ‘భిక్షాందేహి ‘అన్నాడు . మాయా భిక్షువు పలుకులు విన్న శివుడు సంభోగ మధ్యంలో లేవగా అతని రేతస్సు అట్లే శయ్య పడెను.శివపార్వతులు ఖిన్న వదనులై వెలుపలికి వచ్చి గృహస్థ ధర్మము మేరకు ఆ బ్రాహ్మణుని సత్కరించి సంతృప్తిని గావించినారు .ఆ బ్రాహ్మణుడు ‘శ్రీ కృష్ణుడు వ్రత కల్పమునకు గణేశునిరూపంలో మీ కుమారుడుగా జన్మించును’అని ఆశీర్వదించి అంతర్ధానమై రతి గృహములో ప్రవేశి౦చి శిశురూపమున శివుని వీర్య స్థలనమైన చోట పోరలాడి,నవజాత శిశువలె పండుకొని వుండినాడు .అశరీర వాణి యొక్కటి ‘ఓ పార్వతి, కృష్ణ పరమాత్మా శిశు రూపమున నీ మందిరమున వున్నాడు ‘అని పలికి౦ది. శివపార్వతులీద్దరూ లోపలికి వెళ్ళి ఆనందంతో ఆ శిశువును ఎత్తుకొని ముద్దాడారు. ఆ శిశువే ‘గణపతి’ అయినాడు .
దేవాధి దేవతలందరూ వచ్చి ఆ శిశువును చూచి అతడు సిద్దిదాయకుడు,అగ్రపూజార్హుడు అగునట్లు , అనుకూలవతియగు భార్య లభించునట్లు,కవితాశక్తి ,వివేచనాశక్తులు కల్గి వేదజ్ఞాన సంపన్నుడై కృష్ణభక్తుడై, ధర్మపరిపాలకుడై, విఘ్నరహితుడు ,విఘ్ననాశకుడు అగుగాక అని ఆశీర్వదించిరి.

ఈ శివ పుత్రుని దర్శనార్ధమై అందరూ దేవతలవలె శనైశ్చరుడు వచ్చినాడు కానీ తలయెత్తి బిడ్డను చూడలేదు .ఎందుకు చూడలేదని పార్వతి ప్రశ్నించగా తాను కనులార చూచిన వస్తువు నాశనమగినట్లు తనకు శాపమున్నదిని వివరించాడు . శ్రీ కృష్ణా౦షాతో జన్మించిన యీ శిశువు నున్ను చూచి భయపడుట కళ్ళ అని పార్వతి అతనిని ఒత్తిడి చేయడంతో శని ఆ బిడ్డను చూచినాడు .వెంటనే ఆ బిడ్డ తల కత్తిరింపబడి క్రిందపడినది. ఈ విషాద సంఘటన ఫలితముగా పార్వతి దేవీ ,కైలసమందున్న యితర దేవతలందరూ ముర్చితులైనారు.వెంటనే శ్రీహరి గరుడారూఢుడై వెడలి ఉత్తర దిశలో పుష్పభద్ర తీరమున రత్యాయాసంతో అలసిపోయిఉత్తర శిరస్సు చేసి పండుకొన్న మగ ఏనుగు తలను ఖండించి తీసికొనివచ్చి మొండానికి తనే అతికించినాడు.తనే మొదట వినాయకుని పూజించి అతనికి సకల సిద్ధులను అనుగ్రహించుటయే కాక,విఘ్నేశ,గణేశ,హేరంబ,గజానన,లంబోదర,ఏకదంత,శూర్పకర్ణ,వినాయక అను ఎనిమిది పేర్ల నుంచి ఆశీర్వది౦చాడు.
కృష్ణ గణపతి బ్రహ్మ వైవర్త పురాణంలో గణపతి ఖండమను అధ్యాయమున్నది .దానిలో గణపతి చెందిన పెక్కు విషయాలున్నవి . కృష్ణ పరమైన ఆ పురాణంలో గణపతి కృష్ణుని అంశలోనే జన్మించినట్లు చెప్పబడింది . పార్వతి పుత్రకాంక్షతో శివునితో కూడ రతి క్రీడలో వున్న సమయంలో దేవతలు రతి గృహ ద్వారం వద్దకు వచ్చి మొరపెట్టుకొన్నారు.సంభోగ మధ్యమున వెలుపలికి వచ్చిన శివుని వీర్యం భూమిపై పడింది .దానివల్ల షణ్ముఖుడు అవతరించాడు. కానీ పార్వతికి తనకు సంతానము కలుగ లేదన్న వ్యధ ప్రారంభమయింది . శ్రీ కృష్ణుని సూచన మేరకు శివుడు పుత్రప్రాప్తి కొరకు పుణ్యక వ్రత మాచరించునట్లు చెప్పినాడు .ఆ వ్రతాన్ని చేసిన తరువాత శ్రీ కృష్ణుడు గోప కిశోరరూపమున ఆమెకు దర్శన మిచ్చినాడు.కోటి కందర్ప లావణ్య మనోహరుడగు కృష్ణుని వంటి పుత్రుడు తనకు కావాలని ఆశించి యిష్టార్ధ సిద్ధిని పొందింది . తరువాత పుత్రాకాంక్షతో పరమ శివునితో రతి క్రీడలో నున్న సమయంలో విష్ణువు మాయరూపంలో వచ్చి ద్వారం వద్ద నిలిచి ‘భిక్షాందేహి ‘అన్నాడు . మాయా భిక్షువు పలుకులు విన్న శివుడు సంభోగ మధ్యంలో లేవగా అతని రేతస్సు అట్లే శయ్య పడెను.శివపార్వతులు ఖిన్న వదనులై వెలుపలికి వచ్చి గృహస్థ ధర్మము మేరకు ఆ బ్రాహ్మణుని సత్కరించి సంతృప్తిని గావించినారు .ఆ బ్రాహ్మణుడు ‘శ్రీ కృష్ణుడు వ్రత కల్పమునకు గణేశునిరూపంలో మీ కుమారుడుగా జన్మించును’అని ఆశీర్వదించి అంతర్ధానమై రతి గృహములో ప్రవేశి౦చి శిశురూపమున శివుని వీర్య స్థలనమైన చోట పోరలాడి,నవజాత శిశువలె పండుకొని వుండినాడు .అశరీర వాణి యొక్కటి ‘ఓ పార్వతి, కృష్ణ పరమాత్మా శిశు రూపమున నీ మందిరమున వున్నాడు ‘అని పలికి౦ది. శివపార్వతులీద్దరూ లోపలికి వెళ్ళి ఆనందంతో ఆ శిశువును ఎత్తుకొని ముద్దాడారు. ఆ శిశువే ‘గణపతి’ అయినాడు . దేవాధి దేవతలందరూ వచ్చి ఆ శిశువును చూచి అతడు సిద్దిదాయకుడు,అగ్రపూజార్హుడు అగునట్లు , అనుకూలవతియగు భార్య లభించునట్లు,కవితాశక్తి ,వివేచనాశక్తులు కల్గి వేదజ్ఞాన సంపన్నుడై కృష్ణభక్తుడై, ధర్మపరిపాలకుడై, విఘ్నరహితుడు ,విఘ్ననాశకుడు అగుగాక అని ఆశీర్వదించిరి. ఈ శివ పుత్రుని దర్శనార్ధమై అందరూ దేవతలవలె శనైశ్చరుడు వచ్చినాడు కానీ తలయెత్తి బిడ్డను చూడలేదు .ఎందుకు చూడలేదని పార్వతి ప్రశ్నించగా తాను కనులార చూచిన వస్తువు నాశనమగినట్లు తనకు శాపమున్నదిని వివరించాడు . శ్రీ కృష్ణా౦షాతో జన్మించిన యీ శిశువు నున్ను చూచి భయపడుట కళ్ళ అని పార్వతి అతనిని ఒత్తిడి చేయడంతో శని ఆ బిడ్డను చూచినాడు .వెంటనే ఆ బిడ్డ తల కత్తిరింపబడి క్రిందపడినది. ఈ విషాద సంఘటన ఫలితముగా పార్వతి దేవీ ,కైలసమందున్న యితర దేవతలందరూ ముర్చితులైనారు.వెంటనే శ్రీహరి గరుడారూఢుడై వెడలి ఉత్తర దిశలో పుష్పభద్ర తీరమున రత్యాయాసంతో అలసిపోయిఉత్తర శిరస్సు చేసి పండుకొన్న మగ ఏనుగు తలను ఖండించి తీసికొనివచ్చి మొండానికి తనే అతికించినాడు.తనే మొదట వినాయకుని పూజించి అతనికి సకల సిద్ధులను అనుగ్రహించుటయే కాక,విఘ్నేశ,గణేశ,హేరంబ,గజానన,లంబోదర,ఏకదంత,శూర్పకర్ణ,వినాయక అను ఎనిమిది పేర్ల నుంచి ఆశీర్వది౦చాడు.


Friday, 13 November 2015

PURANA TELUGU STORY ABOUT LORD SRI VENKATESWARA'S WIFE - B.B.NANCHARAMMA


అసలు బీబీ నాంచారమ్మ ఏవ్వరు. ...?

ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వారుండరు. అలాగే చాలామందికి బీబీ నాంచారమ్మ గురించి చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఈ బీబీ నాంచారమ్మ ఎవరు? ఆమె నిజంగానే ముస్లిం వనితయా? ఆమె దైవస్వరూపం ఎలా అయ్యారు? ఆమె కధ ఏమిటో చూద్దాం.

బీబీ నాంచారమ్మ! `నాచియార్` అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంటే భక్తురాలు అని అర్థమట. ఇక `బీబీ` అంటే భార్య అని అర్థం. బీబీ నాంచారమ్మ గాథ ఈనాటిది కాదు. కనీసం ఏడు వందల సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచి ఉంది. పురాతన కధ ప్రకారం బీబీ నాంచారమ్మ, మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె. ఆమె అసలు పేరు సురతాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ, మాలిక్ కాఫిర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫిర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం, భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతోంది. పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసిన కాఫిర్ కళ్లు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనం వస్తుంది కదా అనుకున్నాడు. అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని హస్తిన కి బయలుదేరాడు.

హస్తిన కి చేరుకున్న తరువాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వాటన్నింటి మధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు, తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది. ఆ విగ్రహం తనచేతికి అందిందే తడవుగా, దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం… అలా తనకు తెలయకుండానే ఒక ఉత్సవ మూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. ఆ విగ్రహంతో ఒకో రోజూ గడుస్తున్న కొద్దీ దాని మీదే సురతాని మనసు లగ్నం కాసాగింది. మరో పక్క రంగనాథుని ఉత్సవ మూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో, రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులూ, పూజారులు అంతే బాధలో మునిగిపోయారు. చివరకి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫిర్నే వేడుకునేందుకు హస్తిన కి ప్రయాణమయ్యారు.

రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులు భక్తుల విన్నపాలు చూసి మాలిక్ కాఫిర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆపాటికే రంగనాథుని మీద మనసుపడిన సురతాని మాత్రం విగ్రహం ఇవ్వటానికి ఇష్టపడలేదు, అయితే అర్చకులు, ఆమె ఆదమరిచి నిదురించే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు. సురతాని ఉదయాన్నే లేచి చూస్తే విగ్రహం కనుమరుగైంది. ఎవరు ఎంత ఒదార్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుకుతూ తాను కూడా శ్రీరంగానికి పయనమైంది. శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు.

మరొక కధ ఏమిటంటే…ఆ విగ్రహం రంగనాథునిది కాదు. మెల్కోటే (కర్నాటక)లో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు. దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు. కలియుగదైవమైన వేంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకనే తిరుపతిలోనూ బీబీనాంచారమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఆమె ముసల్మాను స్త్రీ అన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదు. ఎందుకంటే తుళుక్క నాచియార్ అంటే తమిళంలో తురష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలామంది ముసల్మానులు సైతం వేంకటేశ్వరునికి సతిగా భావిస్తారు. కర్నాటకను హైదర్ఆలీ అనే రాజు పాలించే కాలంలో, అతను ఓసారి తిరుమల మీదకు దండయాత్రకు వచ్చాడట. అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెలుసుకుని వెనుతిరిగాడట. ఇదీ బీబీ నాంచారమ్మ కథ !


Friday, 6 November 2015

ARTICLE ABOUT INFORMATION OF LORD SIVA'S DHAKSHINAMURTHY AVATHAR IN TELUGU AND PUJA INFORMATION


దక్షిణామూర్తి

దక్షిణామూర్తి పరమశివు ని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువు లు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.
బ్రహ్మదేవుడు తన సృష్టి ని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత మరియు సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.
ఇక ఈ నలుగురూ గురువు కోసం వెదుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ మరియు పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ మరియు పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.
పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, అతని తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు.
శ్రీ దక్షిణా మూర్తి దీక్ష
ధనుర్మాసం లో ఆర్ద్రా నక్షత్ర ఉత్సవానికి ముందు నలభై రోజుల పాటు వేలాది భక్తులు శ్రీ మేధా దక్షిణా మూర్తి దీక్షను స్వీకరిస్తారు .దీనికే ‘’కోటప్ప దీక్ష ‘’అని పేరు .నియమ నిష్టలతో భక్తీ విశ్వాసాలతో శివనామ స్మరణ శివ పంచాక్షరీ జపాల తో అభిషేకాలతో సంత్సంఘాలతో ఉపవాసాలతో ఆలయం పులకించిపోతుంది ‘’దక్షినానన దక్షినానన దక్షినానన పాహిమాం –త్రికోటేశ్వర త్రికోటేశ్వర త్రికోటేశ్వర రక్షమాం ‘’అని శివ స్మరణ చేస్తూ ఆలయం అపర కైలాసాన్ని స్పురణ కు తెస్తుంది .మేధా దక్షిణా మూర్తి భక్త సమాజం వారు 46 రోజుల పాటు 35 మంది వేద పండితులతో ‘’మహా రుద్ర యాగ పూర్వా కోటి బిల్వార్చన’’,నిరతాన్న దానాలు ,గోస్టులు , సాంస్కృతిక కార్యకలాపాలతో కళకళ లాడుతుంది ప్రాంగణం అంతా .కోరిన కోర్కేలనుతీర్చేకోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి ని దర్శించి తరిద్దాం .
ఈ దీక్ష స్వీకరించే వారు ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం వచ్చే ముందు 40 రోజుల ముందు సోమవారం లేదా గురువారం స్వీకరిస్తారు. ఇది కోటప్ప కొండ గుడిలో కానీ లేదా దగ్గరలో శివాలయంలో కానీ, శ్రీ దక్షిణామూర్తి ఆలయంలో కానీ లేదా ఒక మఱ్రి చెట్టు క్రింద కానీ ఎవరైనా స్వీకరించవచ్చు.
స్ఫటిక మాల-54 లేదా 108 పూసలు గలది శ్రీ దక్షిణామూర్తి లేదా శివుని రూపుతో ఉన్నది ధరించటం జరుగుతుంది.ఇరుముడి 3 టెంకాయలు,మూడు రకాల పండ్లు,విభూతి,గంధం,కర్పూరం,తేనె,పటికె బెల్లం,మూడు గుప్పెళ్లు బియ్యం తో కట్టుకుంటారు.
దీక్షలోని నియమాలు విధిగా ఏ బ్రహ్మచర్య దీక్షలో ఉండే నియమాలే:
1. తల్లి దండ్రుల,దేవ బ్రాహ్మణాది పెద్దల పట్ల గౌరవ ప్రపత్తులు కలిగి యుండాలి.ప్రాత:కాలమున లేవగానే తల్లిదండ్రుల లేదా గృహ పెద్దల పాదములకు నమస్కరించాలి.
2. ప్రతి దినము ఉదయం,మధ్యాహ్నం,సాయం కాలం మూడు పూటలా చన్నీటి స్నానం శిరస్నానం విధిగా చేయాలి.
3. విభూతి రేఖలు దిద్దుకుని గంధము కుంకుమలతో గుండ్రని బొట్టు భ్రూస్థానం లో పెట్టుకోవాలి.
4. స్వామిని సర్వకాల సర్వావస్థలయందు ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమ: అని జపిస్తూ ఉండాలి.
5. మద్య,మాంస,ధూమపానాదులను త్యజించాలి.సాత్వికాహారాన్ని భుజిస్తూ ఉల్లి, మసాలాలు, వేపుడులు మానివేయాలి.
6. త్రికరణ శుధ్ధిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి.స్త్రీలను పవిత్ర దృష్టితో చూడాలి.
7. మాల ధరించిన పిదప తన హృదయములో స్వామికి నివాసమేర్పడిందని భావించి శ్రధ్ధా భక్తులతో వినయ విధేయతలతో మెలగాలి.
8. క్షురకర్మ చేయించుకొనుట,చేతి గోళ్లు తీయుట చేయకూడదు.
9. భూశయనము చేయాలి.నేల మీద శుభ్రమైన వస్త్రాన్ని పరచుకొని విశ్రమించాలి.లేదా చాప వేసుకోవచ్చు.
10.ఒక పూట మాత్రమే భోజనం చేయాలి.రాత్రి పూట పండ్లు భుజించి పాలు సేవించాలి.
11. మూత్ర విసర్జనానంతరం కాళ్లు, చేతులు కడుక్కొని నీటితో ఏడు సార్లు పుక్కిలించి ఉమిసివేయాలి.కాలకృత్యాల అనంతరం స్నానమాచరించి ఉతికి ఆరవేసిన వస్త్రాలను ధరించాలి.
12. ప్రతి సోమ,గురువారాలలో స్థానిక దేవాలయాన్ని సందర్శించాలి.
13. సాధ్యమైనంతవరకూ పురాణ కాలక్షేపం గానీ సత్సాంగత్యం లో గానీభజనలో పాల్గొనటం గానీ చేయాలి.
14. చెప్పులను వాడకూడదు. తప్పనిసరి అయినప్పుడు తోలు చెప్పులు కాని వాటిని ధరించాలి.
15. త్రికాలములందు శ్రీ దక్షిణామూర్తి పూజలు చేయాలి.
16. తెల్లని వస్త్రములు మాత్రమే ధరించాలి.చేతి రుమాలు సైతం తెల్లనిదయి ఉండాలి.రంగు అంచు ఉండకూడదు.అవసరమైతే ఆకుపచ్చ అంచు ఉండవచ్చు.
17. ప్రతి రోజూ ఒక గంట మౌనం పాటించాలి (నిర్విరామంగా)
18. సినిమాలు చూడటం,అశ్లీల సాహిత్యం చదవటం చేయకూడదు.దీక్ష స్వీకరించిన వారు మానసిక శారీరిక స్థితులయందు సమతుల్యతతో మరియు మనోవాక్కాయకర్మలయందు పవిత్రతతో సమాజమునకు ఆదర్శప్రాయులుగా ఉండాలి.
పై నియమాలతో పాటు ప్రవర్తనా దోషాలను పరిహరించి సన్నియమాలను ఆచరించటం ద్వారా అందరూ శ్రీ మేధా దక్షిణామూర్తి అపార కరుణా కటాక్ష వీక్ష ణాలకు పాత్రులై సుఖ శాంతులని,అష్టైశ్వర్య విభూతిని పొందుదురు గాక!
ఓం తత్ సత్!

Tuesday, 16 December 2014

TELUGU PURANA STORY ABOUT VYTHARANI NADHI - VYTHARANI RIVER FLOWS IN HELL



వైతరణీ నది

వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉన్నది. పాపములు చేసిన వారు చని పోయిన పిమ్మట ఈ నది దాటే వెళ్ళాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహించును. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గూండా లోనికి వస్తారని ఇందులో పేర్కొన బడినది.

1. వర్ణన

ఈ నది అతి భయంకరమైనది, దీంట్లో నుండి వెళ్ళె సమయములో వచ్చే భాదకు పాపాలన్ని గుర్తుకు వస్తాయని పెర్కొనబడినది. ఈ నది కొన్ని వేల మైళ్ళా వెడల్పు కలిగి ఉన్నది. ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉండును. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మరియు మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు వుండడము వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో వుండే మాంసహారులన్ని వుండును.

వైతరణీ నదీ వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86 వేల ఆమడల దూరంలో ఉంది ఆమడ అంటే యోజనం. నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు(మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఖఃద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురాలు దాటుకుని యమపురికి చేరుతాడు. ఊనషాణ్మాసికం (171 వ రోజు) పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి.

గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరుగాని, లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే, ఆ పాపాత్ముని నోట ముల్లు గుచ్చి, చేపను పైకి లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. శీతాడ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రధమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు.

హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ద కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలసి యమపురి చేరతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట.

2. దాటడానికి మార్గాలు

ఈ నదిని దాటుటకు కొన్ని విభిన్న మార్గాలు గలవు. ఐతే ఒక విషయం గమనించవలసింది ఏమిటంటే కేవలము పాపాలు చెసినవారు మాత్రమే ఈ నది గూండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అనగా ఏ ఒక్క పాపము చెయ్యని వారు, మంచి కర్మలను చేయువారు ఈ మార్గము అనగా దక్షిణ ద్వారము గూండా రారు, ఇంకా చెప్పలంటే యమ లోకనికే రారు.

3. నది దాటాక

ఈ నది దాటిన పిమ్మట పాపులు దక్షిణ ద్వారము నకు చేరుకొందురు.
అబద్ధమాడిన వారు నరకాన్ని చవి చూడాల్సిందే
ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరణి ఎదురైంది. దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండటమేమిటి? అన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమన్నాడు. అశ్వత్థామ హతః అని పెద్దగా అని, కుంజరః అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచించిన పాపానికి, ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు. అబద్దమాడిన వారికే నరకం తప్పకపోతే, నరహత్య చేసే వాళ్లకు ఎలాంటి శిక్షలుంటాయో?

KNOW THE CHARACTER OF THE GREAT WARRIOR BHISHMA - MAHABHARATHA STORIES COLLECTION


భీష్మ ....ధర్మ పరిరక్షణ, నిత్య సంఘర్షణ.

సౌశీల్యం అంటే ఏమిటో అర్థం కాక, దానికుండాల్సిన లక్షణాలెలా వుంటాయో దానికోసం ఏ ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాలనో అని అనుకునే వాడిని, కాని సౌశీల్యం అనేది ఒకే ఒక్క లక్షణం మీద ఆధారపడి వుంటుందన్న విషయం అదృష్టం కొద్దీ తెలిసింది.
ఆ ఒక్క లక్షణమే "మాట మీద నిలబడడం".

రాముడి తర్వాత చక్కగా సౌశీల్యం కనపడేది ఒక్క భీష్ముడిలోనే.

ధర్మ పరిరక్షణం కోసం ’నిత్య సంఘర్షణ’ భీష్మునిది .

జీవితమంతా కష్టాలే. అయినా ఎక్కడా నిరాశని, కర్తవ్యవిముఖతని దరిజేరనీయక, విరక్తికీ, వైరాగ్యానికి ఉండే తేడాని స్పష్టంగా చూపిన అవిశ్రాంత వైరాగ్యం భీష్మునిది.
అంతా తనవారైనా, తామరాకుపై నీటిబిందువులా ’సమూహంలో ఏకాంతం ’ భీష్మునిది.
తనవారు తనకేం చేసారన్న కనీస స్పృహ కూడా లేకుండా, నిరంతరం తనేంచేయాలో ఆలోచించే ’నిజమైన పెద్దరికం ’ భీష్మునిది.

కనీసం తన ఆక్రందనని కూడా ఎవ్వరిదగ్గరా వెలిబుచ్చుకోని సంపూర్ణ ’ఆత్మనిర్భరత’ భీష్మునిది.

ప్రతిజ్ఞ అంటే 'భీష్మప్రతిజ్ఞ' అనేలా ప్రతిజ్ఞకే వన్నెతెచ్చిన ఆదర్శం జీవితం భీష్మునిది.
అయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణున్ని సైతం ఆయుధం పట్టేలా చేసిన ’ధీరత్వం ’ భీష్మునిది.

భగవాన్ పరశురాముని శిష్యునిగా కదనరంగం లో సాక్షాత్ శివునిసైతం ఎదురొడ్డి నిలబడగల ’పరాక్రమం’ భీష్మునిది.

ధర్మం కోసం గురువు పరశురామునితోనే తలపడి విలువిద్యలో గురువుతోనే మెప్పు పొందిన ’గొప్పతనం’ భీష్మునిది.అర్జునుడంతటి వాడు తనని చంపలేక, శారీరకంగా, మానసికంగా అలిసి, తననే శరణు వేడిన అర్జునినికి తన మరణరహస్యాన్ని, వాత్సల్యం తో తనే చెప్పుకున్న ’త్యాగం’ భీష్మునిది.

ధర్మరాజే ఉత్కృష్టమైన ధర్మమంటే ఏంటో తెలుసుకోవడానికి భీష్మున్నే శరణు వేడిన ఉత్తమమైన ’ధర్మ పరాయణత్వం’ భీష్మునిది..

స్త్రీ ని శతృవుగా చేసుకున్నాకూడా ’చిరంజీవి గా మృత్యువుని శాసించి, మృత్యువుని వాయిదా వేయగలిగిన ’ వీరత్వం భీష్మునిది.

కుళ్ళిన శవాలతో ,
స్మశాన సమానంగా మారిన కురుక్షేత్రంలో,
దుమ్ము ధూలిలో,
పగలూ రేయిలో,
ఆపాదమస్తకం ఆయిధ గాయాలతో,
శరీరమంతా శరాలతో,
ఆరునెలల అంతిమ గడియలు,
పశ్చాత్తాపం తో పరితపించిన ’పరిణతి’ భీష్మునిది. విష్ణువు ముందే విష్ణువు ఆధ్వర్యంలోనే పాండవులకి ’విష్ణుసహాస్రనామాన్ని’ భొధించిన ’ఘనత’ భీష్మునిది.
ఎలా జీవించాలో మాత్రమే కాకుండా ఎలా మరణించాలో కూడా నేర్పిన ’సచ్చరిత్ర ’ భీష్మునిది.

Friday, 12 December 2014

IMPORTANCE OF WRITING "SRI" - WHAT IS SRIKARAM - ARTICLE IN TELUGU


* ఏదైనా రాసేటప్పుడు పేపరుపైన “శ్రీ” కారం రాస్తారెందుకు?

“శ్రీ” లక్ష్మీ ప్రదమైనది. మంగళకరమైనది మరియు మోక్ష దాయకమైనది. “శ్రీ” కారమున “శవర్ణ”, “రేఫ”, “ఈ” కారములు చేరి, “శ్రీ” అయినది. అందు “శవర్ణ” , “ఈ” కారములకు, “లక్ష్మీ దేవి” ఆధిదేవత, “రేపము” నకు, అగ్ని దేవుడు దేవత.

“శ్రియ మిచ్దేద్దు తాశనాత్!” అను పురాణ వచనానుసారముగా “అగ్నీ లక్ష్మీ ప్రదుడే, శుభకరుడే. ఈ ఇధంగా “శ్రీ” లోగ మూడు వర్ణములకు శుభదేవతలే కారకులు.

మరియు, “శ” వర్ణమునకు గ్రహము “గురుడు”, “రేఫ “ఈ” కరములకు గ్రహములు “గురుడు”, “శుక్రుడు” గురు, శుక్ర గ్రహములు రెండూ శుభకరులే కావున “శ్రీ” శుభాన్ని సూచిస్తుంది. శుభాన్ని కోరుతుంది.
నిఘంటువులో, “కమలా శ్రీర్హరి ప్రియా” అని ఉండటంతో, లక్ష్మీ నామలలో “శ్రీ” ఒకటి అని తెలియుచున్నది. కావున శుభకరమైంది.

ఇన్ని విధాలుగా “శ్రీ” సర్వశ్రేష్టవాచకమైనది. ప్రతి శుభకార్యానికి, “శ్రీ” కారం తలమానికమై వెలుగొందుచున్నది. “శ్రీ” శుభసూచికయేకాదు, గౌరవప్రదమైనది కూడా. ఏ మతమందైననూ, ఏ ప్రాంతమందైననూ, ఏ భాషయందైననూ, “శ్రీ” అను పదము గౌరవ సూచకముగా, శుభసూచకముగా వాడుతుంటారు.

Tuesday, 9 September 2014

GANADHIPATHI SRI VIGNESWARA - STORY OF LORD VIGNESWARA GANADHIPATYAM IN TELUGU



శ్రీ వినాయక శ్రీ గణేశం గణాధిపత్యం-

ఏవరైతే భూప్రదక్షిణం చేసి అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందుగా తిరిగి వస్తారో వారికే గణాధిపత్యం లభిస్తుంది అని పందెం పెట్టాడు పరమ శివుడు. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం మీద బయలుదేరాడు. వినాయకుడు అక్కడే ఉండి తల్లి తండ్రులకు ప్రదక్షిణం చేస్తూ నారాయణ గాయత్రి జపించాడు. దాని ప్రభావంతో కుమార స్వామి ఏ నదికి వెళ్ళితే అక్కడ తన కంటే ముందు స్నానం చేసి వస్తున్న వినాయకుడు కనిపించాడు కథ ను గమనిస్తే.

సమస్త గణములను పాలించేందుకు, నడిపించేందుకు మాకో అధిపతి కావాలి, అందుకు తగినవాడిని మీరే చూడాలి అని కోరారు. చాలా పుస్తకాల్లో విఘ్నాధిపత్యం అని ఉంది, కానీ వినాయకుడు దేవతాగణాలతో, రుద్రగణాలతో పొరాడి, శివుడి త్రిశూలానికి తలతెగి క్రింద పడిన తరువాత, ఆయన శక్తియుక్తుల్ని చూసి, దేవతలు వినాయకుడికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారు. కనుక అప్పుడు ఉమాపుత్రుడు విఘ్నేశ్వరుడయ్యాడు. కానీ దేవతలు ఇక్కడ గణాధిపత్యం గురించి అడిగారు. సృష్టి, స్థితి, లయ కారకులు బ్రహ్మావిష్ణుమహేశ్వరులు. బ్రహ్మ పంచభూతాలకు, సృహ్స్టికి ఆధారమైన గణాలకు అధిపతి, విష్ణువు ఇంద్ర, అగ్ని, వరుణ మొదలైన అష్టదేవతలకు, వారి అనుచరులకు, ఆయా గణములకు అధిపతియై పోషణమును చేస్తున్నాడు, శివుడు లోకాలను సహరించు రుద్ర గణాలకు, భూతప్రేతపిశాచాది గణాలను నియంత్రిస్తూ విశ్వమును నడిపిస్తున్నాడు. ఈ ముగ్గురి బాధ్యతను స్వీకరించి, సమస్త గణాలను అదుపాజ్ఞాల్లో ఉంచేవాడు గణాధిపతి కాగలడని చెప్పిన పరమశివుడు, మీలో ఎవరు సమర్ధులో చెప్పండి అన్నారు దేవతాగణాలతో. ఇంత పెద్ద బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించడం కష్టమని ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో అక్కడికి కుమారస్వామి తన మయూరవాహనం మీద వేగంగా వచ్చి, వాహనం దిగి శివపార్వతులకు నమస్కరించి కూర్చున్నాడు. అక్కడున్న కొన్ని గణాలు కుమారస్వామికే గణాధిపత్యాన్ని ఇవ్వాలని జయజయధ్వానాలు చేశారు. ఇంతలో తన ఎలుక వాహనం మీద గణపతి చేరుకుని, సభాసదులందరికి నమస్కరించాడు. అంతే, అందరూ విఘ్ణేశ్వరుడే గణాధిపత్యానికి తగినవాడని జయము జయము అంటూ అరిచారు. కుమారస్వామి వైపునున్న సైన్యం 'మా స్వామిని జయించిన వారు ఆ ఆధిపత్యమును స్వీకరించవచ్చు' అని చెప్పగా, గణపతి వైపు ఉన్న శక్తులు గణపతిని సమర్ధిస్తూ, రుద్రగణాలను, దేవేంద్రాదిదేవతాగణాలను చితగొట్టిన ఘనులు మా ప్రభువైన విఘ్నేశ్వరుల వారే. ఎందరో రాక్షసుల పీచమణిచారు. వారికి సమానామైన వారు ఎవరైనా ఉన్నారా? అంటూ గణపతికే ఆధిపత్యం ఇవ్వమని చెప్పారు.

వారి వాదనలని విన్న శివుడు వారితో చిరునవ్వుతో ' పిల్లలారా! మీలో ఎవరూ ముందుగా ముల్లోకాల్లోని నదుల్లో స్నానం చేసి నా వద్దకి వస్తారో వారిని గణాధిపత్యానికి అర్హులుగా నిర్ణయించి, వారికా ఆధిపత్యాన్నిస్తాను. వెంటనే బయలుదేరండి' అని పలికాడు. ఆ మాటలు వినీ వినగానే కుమారస్వామి నెమలినెక్కి ఆ పనిమీద రివ్వున బయలుదేరాడు. కూమారస్వామి వాహనం నెమలి, చాలా వేగంగా వెళుతుంది, ఎగరగలదు. గణపతి వాహనం చిన్న ఎలుక, ఎగరలేదు, గణపతి పెద్దవాడు. వెంటనే గణపతి ఏమాత్రం దిగులు చెందకుండా తాపీగా నడుచుకుంటూ తన తల్లిదండ్రుల ముందుకు వెళ్ళి, చేతులు జోడించి నమస్కరించి "జననీజనకులారా ....... ఈ లోకంలో ఎవరైనా భక్తితో వారి తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే, వారు ముల్లోకల్లోని మూడుకోట్ల యాభైలక్షల పుణ్యతీర్ధాల్లో స్నానం చేసిన పుణయం పిందుతారని వేదశాస్త్రాలు ఘోషితున్నాయి. కనుక వేదమూర్తులు, నా తల్లిదండ్రులైనమీ చుట్టు ప్రదక్షిణం చేస్తున్నానని మూడు ప్రదక్షిణలు చేశాడు. చెప్పి గణపతి మూడు ప్రదక్షిణలు చేయగా, కుమారస్వామి 3 లోకాల్లో నదికి వెళ్ళినా, ప్రతి నది దగ్గర గణపతి తనకంటే ముందు స్నానం చేసి, వెళ్ళిపోవడం చూశాడు.

మొదటగా కుమారస్వామి గంగానదికి వెళ్ళగా, అప్పటికే గంగలో స్నానం ముగించి, ఎదురొస్తున్న అన్నయ్య గజాననుడు ఎదురుపడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. కుమారస్వామి మూడుకోట్ల ఏభై లక్షల నదుల్లో స్నానానికి వెళ్ళినా, గజాననుడు స్నానం చేసి ఎదురు రావడం కుమారస్వామికి కనిపించసాగింది. ఆఖరి స్నానం కూడా పూర్తిచేసి, ఎంతో ఆశ్చర్యంగా కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరికి వెళ్ళెసరికి గణపతి కనిపించాడు. అప్పుడు షణ్ముకుడు పశ్చాత్తాపంతో ' నాన్నగారూ! అన్నగారి మహిమనాకు తెలియలేదు. నన్ను అహం కమ్మేసింది. అందుకే అలా ప్రవర్తించాను. నాకు అన్నగారే ఒకప్పుడు మయూరవాహనం ఇచ్చారు. బుద్ధిలో అన్నయ్యే నాకంటే అధికం.. నా కన్నా అన్నయ్యే అన్ని విధాలా సమర్ధుడు కనుక గజాననుడినే గణాధిపతిని చేయండి' అన్నాడు.

ఈ ప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు పరమేశ్వరుడు గజాననుడికి గణాధిపత్యం వేడుకని జరిపించాడు. ఈ వృత్తాంతం ద్వారా గణపతి లోకానికి తల్లిదండ్రుల విలువను చాటి చెప్పారు. తల్లిదండ్రులే సమస్త పుణ్యతీర్ధాలు, వృద్ధాప్యలో ఉన్న తల్లిదండ్రులను వదిలి, ఎవరు తీర్ధయాత్రలు చేస్తారో, వారు పుణ్యం పొందకపోగా, అతిమకాలంలో నరకానికి వెళతారని శాస్త్రం చెప్తోంది. మన ముందు కనిపించే దైవస్వరూపాలు తల్లిందండ్రులు. అందుకే వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణంతో మహాగణపతి అయినాడు.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ ప్రతి కార్యక్రమం ప్రారంభంలో గణపతి తలుచుకుంటాము. గణపతికి సంప్రదాయంలో, మానవజీవన విధానంలో విశిష్టవంతమైన స్థానం ఉంది. గణపతి ఆదిపూజ్యుడు, ముందు మొక్కులవాడు. అందుకే పురాతన కాలం నుంచి ఆధునిక కాలం వరకు గణపతి ఆరాధన ఎంతో గొప్పగా జరుగుతోంది. వినాయకుడికి గణాధిపత్యం ఇచ్చి, గణధిపతిని చేశారు. గణాలంటే చీమలు మొదలు బ్రహ్మ వరకు ఉన్న వివిధ వర్గాలు. గణం అంటే సమూహం, గుంపు, వర్గం అని అర్దం. ఈ సమస్త సృష్టిని వర్గాలుగా విభజించవచ్చు. మానవులు ఒక గణం, దేవతలు ఒక గణమ, రాక్షసులు ఒక గణం, చెట్లు ఒక గణం, జంతువులు ఒక గణం. మళ్ళి ప్రతి గణాన్ని ఇంకా విభజించవచ్చు. ఉదాహరణకు చెట్లను తీసుకుంటే పుష్పించే చెట్లు ఒక గణం, పెద్ద పెద్ద వృక్షాలు ఒక గణం, పండ్లు అందించే మొక్కలు ఇంకో గణం, లత్లు, తీగలు, కందలు, కూరగాయలు వెర్వేరు గణాలు. మళ్ళీ వీటిలో ఇంకా గణాలు ఉన్నాయి. ఎర్రని పూలు పూసే మొక్కలు ఒక గణం, తెల్లనివి ఇంకో గణం. మనుష్యుల్లో కూడా మంచివాళ్ళు ఒక గణం, చెడు వాళ్ళు ఇంకో గణం, తెలివైనవారు ఒక గణం. ఇలా ఎన్నో విధాలుగా విభజించబడిన ఈ సృష్టి మొత్తం, వివిధ గణాల మధ్య సయోధ్య కారణంగా సక్రమంగా సాగుతోంది. ఒక పదిమంది కలిస్తేనే, అందులో ఎన్నో అపోహలు, అపనమ్మకాలు, విమర్శలు, గొడవలు వస్తాయి. ఇంత పెద్ద సృష్టి, అనేక కోటి బ్రహ్మాండాలలో ఇన్నిన్ని సమూహలను ఏక తాటిపైకి తీసుకురావడం ఎంతో కష్టతరం. అసలు వీటి మధ్య కనుక బేధాభిప్రాయం ఏర్పడితే, ఎంతో గందరగోళం ఏర్పడుతుంది. ఇలా గందరగోళం ఏర్పడకుండా, చిన్న అణువు, కణం నుంచి బ్రహాండాల వరకు సమస్త గణాలకు నాయకులు ఉన్నారు. అలా ప్రతి గణానికి ఉన్నా పరబ్రహ్మ నాయకత్వం వహించి, వాటిని నిర్ణీత మార్గంలో నడిపిస్తున్నారు. ప్రతి గణానికి ఉన్న నాయకునికి గణపతి అని పేరు. తంత్రశాస్త్రం ప్రకారం సృష్టిలో అనేకమంది గణపతులు ఉన్నారు.

గణపతి ఆరాధన యొక్క తత్వం కూడా ఇక్కడే దాగి ఉంది. గ్రహాలు అనుకూలించకుంటే వాటిని మచ్చికచేసుకోవాలి. ప్రకృతి సహకరించకుంటే, ప్రకృతికి సంబంధించిన దేవతను మెప్పించాలి. దేవతలు ఆగ్రహంతో ఉంటే, వారిని పుజించాలి. మన జీవితంలో నిత్యం ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. వాటిన్నిటిని దాటాలంటే ఎంత మందిని మచ్చిక చేసుకోవాలి? అంత మందిని ఒప్పించేలోపు జీవితం కాస్త ముగిసిపోతుంది. అందుకే పరమేశ్వరుడు గణపతికి గణాధిపత్యాన్ని ఇచ్చాడు. ప్రతి గణానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆయన గణపతి. గణం గణం కలిస్తే, మహాగణం. దానికి నాయకుడు మహాగణపతి.

ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంటే, దానికి ఎంతో మంది సహాయసహాకారాలు కావాలి. సాయం మానవుల నుంచే కాదు, అణువుల దగ్గరి నుంచి దేవతల వరకు, అందరు మనకు సానుకూలంగా మారాలి, సహాకారం అందించాలి. ఇంత వైవిధ్యమైన సృష్టిలో, ఇంతమంది సహాయాన్ని ఒక్కసారి అర్ధించడం చాలా కష్టం. అందరిని సంప్రదించడం కష్టం, అయినా అంతమందిని ఏక తాటిపకి తీసుకురావడం, ఏకాభిప్రాయం ఏర్పరచడం ఇంకా కష్టం. సృష్టిలో ఇన్ని గణాలు ఉన్నా, అన్నిటికి ఒకడే నాయకుడై ఉన్నాడు. ఆయనే వినాయకుడు. వినాయకుడంటే విశిష్టవంతమైన నాయకుడని, నాయకుడే లేనివాడని అర్ధాలున్నాయి. మొత్తం సృష్టి ఆయన చేతిలో ఉన్నది కనుక, ఆయన చెప్పినట్టే వింటుంది. అందుకే ఏదైన పని ప్రారంభించే ముందు మహాగణపతిని స్మరిస్తే, సమస్త జగత్తు ఒక్కసారిగా ‘అలర్ట్’ అవుతుంది, అన్నీ పనులు పక్కనబెట్టెసి, విశ్వనాయకుడైన వినాయకుడి మాట వింటుంది. దాంతో ప్రారంభించే పనిలో ఏ ఆటంకాలు రావు. అందుకే గణపతికి ప్రధమ పూజ. ఇక గణపతి విశ్వగణాలకు నాయకుడు కనుక గణపతిని స్మరిస్తే, సమస్త బ్రహ్మాండాలను స్మరించినట్టే., గణపతిని తెలుసుకోవడమంటే సమస్త బ్రహ్మాండం గురించి తెలుసుకోవడమే. అందుకే ప్రతి కార్యానికి ముందు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని వినాయకుడిని స్మరిస్తాం.

అట్లాగే ప్రతీసారీ కండబలం ఉంటే సరిపోదు, బుద్ధిబలం కూడా ఉండాలని చెప్తుందీ వృత్తాంతం. కొంతమంది Management నిపుణులు ఈ కధను Crisis Management లో భాగంగా చెప్తారు. కష్టాలను బుద్ధిబలంతో ఎదురుకున్నవాడే అసలైన ప్రజ్ఞావంతుడని చెప్తున్నదీ వృత్తాంతం.

Monday, 8 September 2014

LORD KRISHNA'S PURANA STORY ABOUT "THE GREAT" IN THE WORLD


ఎవురు ధన్యులు?
ఒకాసారి ధుర్యోధనుడు ఒక గొప్ప యాగం చేశాడు. ఎందరెందరో రాజులు వచ్చారు. దానిని చూడడానికి శ్రీకౄష్ణుడు వచ్చాడు. చాల వైభవోపేతంగా జరిగిన ఆయజ్ణ్జాన్ని చూస్లి, కౄష్ణుడు ద్వారకకు మరలివచ్చాడు. ద్వారకలో శ్రీకౄష్ణుని సేవించాలని ఇంద్రుడు దేవతాబౄందంతో వచ్చాడు. స్వర్గరాజ్య లక్ష్మి, ద్వారకారజ్యలక్ష్మితో సరససంభాషణ చేస్తోంది. ద్వారకా రాజ్యలక్ష్మిని చూసి, ఇంద్రుడు ఆసూయపడ్డాడు. ఆశ్చర్యపడ్డాడు. ద్వారకా రాజ్యలక్ష్మిని చూడలని రాజన్యులంతా వచ్చారు. కౄష్ణస్వామి సభలో ‘సుధర్మాలో ఉన్నాడు. సంభాషణలు సాగుతున్నాయి. ఇంతలో పెద్ద ఈదురు గాలివీచింది. వాన వచ్చే సూచనలు కనిపించాయి. పెనుప్రళ్యంగా కురుస్తుందేమో నన్నట్లుగా ఉంది పరిస్థితి. దేవర్షి నారదుడు వచ్చాడు. గాలిచెదిరిపోయింది. వానా ఆగిపోయింది. అంటే దివ్యుల రాక భూమికిలా అనిపిస్తుందా? ఏమో!
‘శ్రీకౄష్ణా! ఈదేవతల మధ్యనునున్న నువ్వు ధన్యుడివయ్యా!’ అన్నాడు. కౄష్ణుడు ‘అదేమిటి? దక్షిణతోపాటు ధన్యత ఎలా నీకు? నీవే మావంటి వాళ్ళకు ధన్యత నిస్తావు. అలాంటి నీకు ధన్యతనిచ్చేది వేరొకటి ఉందా? అదీ సల్పమైన దక్షిణా? చాలా ఆశ్చర్యంగా ఉందే? ఏమిటి స్వామి, ఈవింత, సుంత వివరించవా?’ అన్నారు సభను అలంకరించిన వారంతా. అలవోకగా నవ్వాడు స్వామి. నారదుని వంక సాభిప్రాయంగా చూస్తూ – ‘నీవే దానిని వీరికి తెలియపరచూ అంటూ ఆనతిచ్చాడు. మందహాస వదనంతో నారదుడు అందరినీ కలియజూసి, స్వామి ఆనతిని శిరసావహించి ఆ ఉదంతాన్ని ఇలా చెప్పనారంభించాడు.
నేనొకసారి గంగాతీరంలో నడుస్తున్నాను, గంగా తరంగాల విన్యాసాలను అవలోకిస్తూ, ఆమె పాపాలను ఎలా పోగోడుతుందో, ప్రజలనెలా సంరక్షిస్తోందో ఆలోచిస్తున్నాను. గంగలోంచి ఒడ్డుకు వస్తోంది ఒక తాబేలు, దానిని చూసి చాలా ఆశ్చర్యపడ్డాను. ఇదేమి అదౄష్టం చేసుకున్నాదో కదా, నిత్యం గంగలోనే నివస్తుంది; అనుకొని – ‘తాబేలూ! నువ్వు నిజంగా ధన్యజీవివీ అన్నాను. తాబేలు ఫక్కున నవ్వి ‘నారదా! నావంటి జలచరాలకు ధన్యత నిస్తున్న గంగ మహాదేవి ఇంకెంతటి ధన్యమూర్తో కదా! ఆమె ధన్యతతో పోలిస్తే నాదేపాటి ధన్యతా అని నెమ్మదిగా నడుచుకుంటూ సాగిపోయింది. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. నిజమే! తాబేలు మాటల్లో సత్యముంది. గంగ చాల ధన్యురాలు, అనుకొని ఆమాటే ఆమెతో అన్నాను.
‘అమ్మా గంగభవానీ! నీవు నిజంగా ధన్యురాలివమ్మా! ఎందరెందరి కలుషాలని ఇట్టే కడిగిసి పుణ్యాన్ని ప్రసాదించే నీ ధన్యత నిజంగా ప్రశంచదగ్గది, తల్లీ!’
‘నారదా! అతిగా ప్రశంసించకు. నీవు చెప్పిన ఆ జనావళినీ నన్ను, నావంటి నదులనూ, ఇంకా ఎన్నో పర్వతాలనూ నిరంతరం మోస్తున్న ధరణి నాకంటే ధన్యురాలు కదయ్యా!’ అంది. ఔను నిజమే అనిపించింది. నేనా భూమి మీదనే అడుగులు మోపి నిలిచి ఉన్నా ఆమె గొప్పదనాన్ని గుర్తించనే లేకపోయానని ఒకింత సిగ్గుపడి భూమితో అన్నాను. ‘ఓ భూమాతా! నీ వెంతో ధన్యురాలివమ్మా!’ అని. భూమి పరిహాసపూర్వకంగా ఇలా అంది. నారదా నే నెలా ధన్యురాలినయ్యా? నన్ను కూడా మోస్తున్న పర్వతాలు ధన్యులు గానీ!. నాకు తల గిర్రున తిరిగినట్లయింది. ఇదేమిటి, ఒకరిని మించి ఓకరున్నారనుకొన్నాను. సరే, పర్వతాలనే అడుగుదామని – ‘ఓ పర్వతరాజముల్లారా! మీరు ధన్యులు, ఎందుకంటే భూమిని ధరించేది మీరే కదా!’ అన్నాను.
పర్వతాలన్ని తమ గుహలు ప్రతిధ్వనించేట్లు పకపక నవ్వాయి. ‘ఓ దేవర్షి నారదా! మే మెలా ధన్యులమవుతామయ్యా? మమ్మల్ని సౄజించినది ప్రజాపతి. మరి ఆయన ధన్యుడు గానీ, మేమా?’ అన్నాయి. ‘ఏమి వీరి నినయ మధురిమ?’ అనుకున్నాను. సరే, ఆ ప్రజాపతినే అడుగుదామని ఆయన్నే ప్రశ్నించాను. ‘ఓ సౄష్టికర్తా! ప్రజాపతి! నీవెంత ధన్యుడివయ్యా! ఇంతటి సంసారాన్ని సౄజిస్తున్నావు. నీ నియతిని అంతా నడిపిస్తున్నావు1 నీవు నిజంగా ధన్యుడివీ అన్నాను. ప్రజపతి నావంక అప్యాయంగా చూసాడు. ‘అబ్బాయి! నారదా! నేను చేసినదా ఈసౄష్టి? ఇదంతా నాప్రజ్ణ్జ అనే నీవనుకొంటున్నావ? వేదాలయ్యా కారణం. వేదాలు లేకపోతే నేనెందుకూ కొరగానివాడినే సుమా!’ అన్నాడు. ‘అహో, వేదాలన్న మాట ధన్యాలు. సరే, వాటినే అడిగి తెలిసికొందామని నేను వేదరాశులను ప్రార్ధించానూ. ‘ఓ వేదమాతలారా! మీరు ధన్యులు. బ్రహ్మగారు సైతం మీ సహాయంలేక ఏమి చేయలేడు. మీ ధన్యత చెప్పనలవి కానిదీ అన్నాను. వేదాలు జాలిగా నావైపు చూశాయి. ‘నారదా! నీ వింత అమాయంకంగా అడుగుతున్నావేమిటి? మా ఉనికినే మేము కాపాడుకోలేమే! ఒకటి రెండు పర్యాయాలు అలాంటి సందర్భాలు ఎదురయ్యయి. అప్పుడు మమల్ని కాపాడినదెవరు? ఆయనే వేదవేద్యుడు, పరమపురుషుడు, ఆయన ధన్యుడూ అన్నాయి.
ఇదీ జరిగింది. అందుకే అన్నాను. ఇందరు దేవతలూ, రాజన్యూలూ, భూసరులూ పరివేష్టించి ఉన్న ఈ సభలో వెలుగొందు తున్న స్వామిని ‘నీవు ధన్యుడి వయ్యా’ అని, కానీ స్వామి అంటాడు, తానొక్కడే కాదట, దక్షిణతో కూడిన తాను ధన్యుడట!
దేవతలంతా ఆశ్చర్యపోయారు శ్రీకౄష్ణుని మాటలకు. రజన్యులు అవాక్కయ్యరు. భూసురులంతా ప్రవిత్ర వేదమంత్రాలతో స్తుతించారు. నారదుడు ఆనందంతో నాట్యమే ఆడాడు. సామాన్య ప్రజ ఉన్నారు, పాపం తామెవరిమో తెలీయక, స్వామి ఆంతర్యమేమో ఎరుకపడక వంగివంగి వందనాలు చేశారి.
చిద్విలాసంగా శ్రీ కౄష్ణుడు తన హౄదయలక్ష్మిని స్పౄశించి నవ్వుకున్నాడు.


Tuesday, 29 July 2014

FESTIVAL ARTICLES IN TELUGU - SRI MANGALA GOWRI VRATHA KATHA IN TELUGU - TIPS TO PERFORM SRI MANGALA GOWRI VRATHAM - STEP BY STEP DETAILS



శ్రీ మంగళ గౌరీ వ్రతకథ 


పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. 
కానీ, వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు.


ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.

అనంతరం, వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు.

ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు. 

కాబట్టి, శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి.

* మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. 

* మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. * వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.


ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ.

పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. 
ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను 
* గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. 
* రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. 

* మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు.


ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది. ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు.

తరువాత, వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యారు . 

ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.


మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొన సాగించాలి.

చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.