WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Home Decoration Tips. Show all posts
Showing posts with label Home Decoration Tips. Show all posts

Friday, 27 November 2015

TIPS TO MAKE AND CREATE organdy cloth flowers AND DECORATION WITH ORGANDY CLOTHER FLOWERS


ఫ్లవర్‌వాజ్‌లో ప్లాస్టిక్‌ పూలను ఎక్కువగా అలంకరిస్తుంటాం. కాని ఆర్గండీ క్లాత్‌ గులాబీ పువ్వులతో ఫ్లవర్‌వాజ్‌ని అలంకరించి హాలులో పెడితే చాలా అందంగా ఉంటుంది. ఈ పువ్వులను తక్కువ ఖర్చుతో తయారుచేసుకోవచ్చు కూడా. ఇవి ఎలా తయారు చేయవచ్చో తెలుసుకుందాం -
- మీకు నచ్చిన రంగు ఆర్గండీ బట్టను తీసుకుని రెండు సెంటీ మీటర్ల పొడవు వెడల్పుతో చతురస్రాకారం ముక్కలు ఎనిమిది, మూడు సెంటీమీటర్ల పొడవు-వెడల్పు ఉన్న ముక్కలు ఐదింటిని కత్తిరించుకోవాలి.
- ఈ చతురస్రాకారపు ముక్కల్ని, ఎదురెదురు మూలలు ఒకదగ్గరికి చేర్చితే ట్రయాంగిల్‌ వస్తుంది. అన్నిటికీ ఈ విధంగా మడవాలి. రెండు చివర్లు చేత్తో పట్టుకున్న వైపుకు మడిస్తే, తిరిగి చతురస్రాకారం వస్తుంది. అన్నిటినీ ఇలాగా మడవాలి.
- బైండింగ్‌ వైర్‌ చివర అరసెంటీమీటర్‌ లోపలికి మడిచి, దీని చుట్టూ నాలుగు మడతలుగా చేసిన ఆర్గండి క్లాత్‌ను చుట్టి దారంతో కట్టాలి.
- చిన్న సైజు ముక్కలు మూడింటిని మొగ్గలా తయారుచేసి పెట్టుకున్న దానిచుట్టూ బైండింగ్‌ వైర్‌కు దారంతో చుట్టాలి.
- మడతలు పువ్వురేకులకు అడుగున వచ్చేలా చూసుకోవాలి.
- మూడు పువ్వురేకుల చుట్టూ మరో ఐదు చిన్న సైజు ముక్కల్ని తీసుకొని బైండింగ్‌ వైర్‌కు కట్టాలి. రెండు వరుసలు అయిపోయిన తరువాత, ఇక మూడవ వరుసలో పెద్ద సైజులో కత్తిరించుకున్న ముక్కలు తీసుకుని పువ్వు ఆకృతి అందంగా కనిపించేలా ఒక్కొక్క పువ్వురేకునూ బైండింగ్‌ వైర్‌కు కడితే గులాబీ పూర్తయిపోతుంది.
- గ్రీన్‌ వెల్‌వెట్‌ క్లాత్‌ని గులాబీ ఆకుల ఆకృతిలో కత్తిరించుకుని, మూడేసి ఆకులుగా బైండింగ్‌ వైర్‌కు అతికించి అలంకరించవచ్చు. గులాబీ సైజు మీకు పెద్దగా కావాలనుకున్నప్పుడు బట్టముక్కల్ని మరికాస్త పెద్ద సైజులో కత్తిరించుకోవాలి. అర మీటరు బట్టతో సుమారుగా పది పువ్వుల వరకూ తయారు చేసుకోవచ్చు.