WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Skin Care Health Tips. Show all posts
Showing posts with label Skin Care Health Tips. Show all posts

Wednesday, 6 July 2016

Turmeric Powder - Health and beauty Benefits - skin care with turmeric powder

పసిడికాంతులకు పసుపు

సహజ ఔషధ గుణాలెన్నో కలిగిన పసుపుతో అరోగ్యపరమైన ప్రయోజనాలే కాదు. అందాన్ని మెరుగుపరుచుకునే సుగుణాలూ ఉన్నాయి. 

వంటింట్లో తప్పనిసరిగా ఉండే దీనితో సౌందర్య పోషణ ఎలాగో చూద్దామా...!

చెంచా పసుపు, రెండు చెంచాల గంధం పొడికి తగినన్ని పాలను చేర్చి మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేయాలి. పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే చాలు...ఇలా కనీసం ఓ నెలరోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే యాక్నే, మొటిమలు వాటి తాలూకు మచ్చలు వంటివి దూరమవుతాయి. పసుపులో ఉండే యాంటీసెప్టిక్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు మొటిమలకు దారితీసే కారకాలతో పోరాడతాయి.

* కాలం ఏదైనా సరే కొందరి ముఖం ఇట్టే జిడ్డుకారుతుంది. ఇలాంటప్పుడు పరిష్కారంగా పసుపుతో ఈ పూతను ప్రయత్నించి చూడండి. రెండు చెంచాల గంధం పొడి, చిటికెడు పసుపుకి రెండు టేబుల్‌ స్పూన్ల కమలాఫల రసం కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసుకుని ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే సమస్య దూరమవుతుంది. పసుపు చర్మంలో ఉత్పత్తి అయ్యే సీబమ్‌ని నియంత్రిస్తుంది.

* ముప్ఫైలకు చేరుకుంటున్నామనేప్పటికి ముఖంపై సన్నటి గీతలూ కనిపిస్తుంటాయి. కప్పు బియ్యప్పిండిలో చిటికెడు పసుపు, కాసిని పచ్చిపాలు, రెండు టేబుల్‌ స్పూన్ల టొమాటో రసం కలిపి మరీ గట్టిగా కాకుండా ముద్దచేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుని నలుగులా పెట్టుకోవాలి. ఆపై మరో పది నిమిషాలు అలానే ఆరనిచ్చి ముఖం కడిగేసుకుంటే సరి. ముడతలు, మృతకణాల వంటివి పోయి చర్మం నునుపుగా, కాంతిమంతంగా తయారౌతుంది. క్రమం తప్పకుండా చేస్తుంటే చర్మం చాయ మెరుగుపడుతుంది.

Monday, 16 May 2016

SKIN CARE BEAUTY TIPS WITH HONEY

తేనెతో చర్మం కాంతివంతం

చర్మం కాంతివంతంగా ఉండడానికి తేనె ఎంతో ఉపయోగపడుతుంది. తేనెలో యాంటిబ్యాక్టీరియల్‌ ప్రాపర్టీస్‌ పుష్కలంగా ఉన్నాయి. అందువల్లే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు రావు. తేనెను నేరుగా చర్మం మీద పూసుకోవచ్చు. అది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చటి నీళ్లతో చర్మాన్ని కడిగేసుకోవాలి. తేనెలోని నీరు చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అంతేకాదు స్కిన్‌ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. ఇలా రోజూ చేయొచ్చు లేదా రోజు విడిచి రోజు చేయొచ్చు. అలాగే రెండు టీస్పూన్ల పాలు, ఒక టీస్పూను తేనెలో ఒక టీస్పూను శనగపిండి కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖం ఎంతో కాంతివంతమవుతుంది.

Sunday, 24 January 2016

PIGMENTATION REMOVAL TIPS IN TELUGU

ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, ఒక చెంచా నిమ్మరసం, 

ఒక చెంచా తేనె మూడింటిని మిక్స్ చేయాలి. 

దీన్ని ముఖానికి అప్లై చేయి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . 

ఈ ఫేస్ ప్యాక్ ను వారానికొకసారి, 

4వారాల పాటు వేసుకోవడం వల్ల pigmentation నివారించుకోవచ్చు.

CARROT FACE MASK FOR BEAUTIFUL SHINY FAIR SKIN

ఫెయిర్ స్కిన్ పొందడానికి క్యారెట్ మాస్క్: 

15రోజుల్లో బ్రైట్ అండ్ ఫెయిర్ స్కిన్ పొందడానికి రోజువిడిచి రోజూ తప్పనిసరిగా క్యారెట్ మాస్క్ ను వేసుకోవాలి. ఇలా కనీసం 15-16డేస్ చేస్తే మంచిది. ఒక చెంచా క్యారెట్ పేస్ట్, ఒక చెంచా శెనగపిండి, ఒక చెంచా రోజ్ వాటర్, ఒక చెంచా కీరదోసకాయ పేస్ట్ ను బాగా మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి 15-30 mins తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

Wednesday, 16 December 2015

WOMEN SKIN CARE TIPS IN TELUGU

శరీరంలో అన్నిటికన్నా ముఖ్యమైన భాగం ఏది? 

ప్రాణాలు నిలిపేది గుండె కాబట్టి అదే అంటారు ఏమో...! దానితో పాటు అందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. మనల్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే చర్మం అన్నిటికన్నా జాగ్ర త్తగా కాపాడుకోవలసిన అంశం అంటే అతిశ యోక్తి కాదు. చిన్న పిల్లల నుండీ పెద్ద వాళ్లవ రకూ చర్మాన్ని సౌందర్యవంతంగా ఉంచేం దుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. పుట్టడం తోనే చక్కని చర్మంపొందడం కుదరని విష యం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యు పరమైన మార్పుల కారణంగా చర్మం అనేక మార్పులు చెంది మనకు చుట్టుకుని ఉంటుం ది. ఎవరికైనా కూడా పూర్తి ఆరోగ్యవంతమైన చర్మం ఉందని చెప్పలేం. చర్మం యొక్క రంగు వారసత్వంపై కూడా ఆధారపడవచ్చు. కానీ చర్మం యొక్క స్థితిని మార్చలేం అని వది లేయక్కర్లేదు. అనేక జాగ్రత్తలు తీసు కోవడం ద్వారా మన చర్మాన్ని ఆరోగ్య వంతంగా, ఆకర్షణీయంగా ఉంచవచ్చు. ప్రస్తుతం ఎంతో మంది శుభ్రతను పాటిస్తూనే మరింత ఆకర్షణీయంగా ఉండడం కోసం అనేక రకాల క్రీములను వాడుతూ ఉంటారు. అలాగే చర్మంలో కూడా పలు రకాలు ఉం టాయి. వాటికి తగిన మందులను ఎంచు కోవడంలోనే ఎంతో మంది అవాస్తవాలను ఎదుర్కొంటున్నారు. ఏ విధమైన పదార్థాలను వాడాలో తెలియక సతమతం అవుతున్నారు. క్రీముల ద్వారా కొందరు లాభపడుతుంటే మరికొందరు అదే క్రీముల వలన నష్ట పోతున్నారు. దానికి కారణం ఆ క్రీములలో వాడే పదార్థాలు ఎటువంటి చర్మానికి సరిపోతాయి అనే విషయంపై సరైన అవగాహన లేకపోవడమే. వీటిపై అనేక అవాస్తవాలనూ, వాటి వెనక ఉండే నిజాలనూ ఒక సారి వీక్షిద్దాం...
అపోహ: మన చర్మంలో మార్పుల ప్రక్రియ తల్లిదండ్రుల చర్మంయొక్క మార్పులతో సమానంగా ఉంటుంది.
వివరణ: ఖచ్చితంగా తల్లిదండ్రుల జన్యుపరమైన మార్పులే పిల్లల చర్మానికి కూడా రావడానికి అధికశాతం అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సమానత బాహ్య ప్రపంచంలోకి రావడం వరకే. తరువాత కాలంలో పిల్లల చుట్టూ ఉండే వాతావరణం మరియు వారి అలవాట్లే చర్మంలోని మార్పులకు కారణం అవుతాయి. కొన్ని సార్లు జన్యుపరమైన విషయాలను కూడా అలవాట్లు మార్చగలుగుతాయి. ముఖ్యంగా ఎండలో తిరిగే సమయం, ఎండ తీవ్రత, సిగరెట్‌, ఒత్తిడి, నిద్ర వంటి విషయాలే ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటి వల్లనే మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడుతాయి.
అపోహ: సన్‌లోషన్లపై ఉండే ూూఖీ సంఖ్య మనకు ఎంత రక్షణ కల్పిస్తుందో వివరిస్తుంది.

వివరణ: సూర్యుని నుండి వచ్చే ప్రమాదకర కిరణాలను అతినీలలోహిత కిరణాలు అంటారు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఖహూ కిరణాలు చర్మం వదులుగా అయ్యేలా చేస్తాయి. ఖVదీ కిరణాలు చర్మంలో ఉండే కణాలను కాల్చివేస్తాయి. సాధారణంగా అన్ని సన్‌లోషన్లూ ఖVదీ కిరణాలను మాత్రమే అడ్డుకుంటాయి. అలాగే దాని ూూఖీ సంఖ్య ఖVదీ కిరణాలను ఆపగల గరిష్టస్థాయిని మాత్రమే వివరిస్తుంది. అందువల్లనే ఎంతో మంది ఖరీదైన సన్‌లోషన్‌ వాడుతున్నప్పటికీ చర్మం వదులుగా అవుతుంది. సన్‌లోషన్‌ను వాడదలిచిన వారు ఖVదీ కిరణాలను మాత్రమేగాక ఖహూ కిరణాలను అడ్డుకొనగల క్రీములను ఎంచుకోవాలి. జింక్‌, అవెబెన్‌ జోన్‌ వంటి పదార్థాలు ఖహూ కిరణాలను అడ్డుకొనగలుగుతాయి. అందువలన సన్‌లోషన్లలో జింక్‌ మరియు అవెబెన్‌జోన్‌ కూడా ఉండే క్రీములను ఎంచుకోవాలి.

అపోహ: సన్‌స్క్రీన్‌ లోషన్‌ మరియు మాయిశ్చరైజర్లను విడివిడిగా వాడాలి.

వివరణ: ఏ క్రీమ్‌ అయినా చర్మం యొక్క రకాన్ని బట్టే ఎంచుకోవాలి. సన్‌స్క్రీన్‌ లోషన్‌ అనగా సూర్యుని అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మంపై ప్రభావం చూపకుండా నివారిస్తాయి. మాయిశ్చరైజర్‌ క్రీములు చర్మంలో ఉండే తేమ స్థాయిని పెంచుతాయి. ప్రస్తుతకాలంలో ఏ సన్‌స్క్రీన్‌ లోషన్‌ అయినా చర్మానికి తేమ అందించే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. కనుక జిడ్డుగా ఉండే చర్మం కలవారు మళ్లీ మాయిశ్చరైజర్‌ వాడడం వల్ల నిగారింపును కొల్పోతారు. అందువలన అందరికీ మాయిశ్చరైజర్‌ అవసరం ఉండదు. ఒక వేళ రెండూ వాడాలని అనుకుంటే ముందుగా మాయిశ్చరైజర్‌ను వాడి నీటితో శుభ్రపరిచి, ఆరిన తరువాత మాత్రమే సన్‌స్క్రీన్‌ లోషన్‌ను వాడాలి.

అపోహ: సూర్యకాంతి వలన 18ఏళ్ల వయస్సులోనే అధికంగా చర్మము సమస్యలకు గురి అవుతుంది.
వివరణ: ఇప్పటి వరకూ జరిపిన సర్వేల ప్రకారం 18ఏళ్ల వయస్సు వరకూ కేవలం 18 నుండీ 23 శాతం వరకూ మాత్రమే చర్మంలో సౌరశక్తి వల్ల సమస్యలు ఉత్పన్న మవుతాయి. కనుక ఒక వేళ ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోనంత మాత్రాన జీవితాం తం బాధపడాలి అనే అపోహను నమ్మరాదు. ఎంత వయస్సు వచ్చిన వారైనా తగిన మందులను తీసు కోవడం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోగలుగుతారు.

అపోహ: కాస్మటిక్‌ క్రీములు మీ పూర్వపు అందాన్ని తీసుకురాగలవు.
వివరణ: ఇది ఏమాత్రం నమ్మకూడదని డాక్టర్లు చెప్తున్నారు. వయస్సు పెరుగుతున్న కొలదీ చర్మంలోని పటిష్టత, కొవ్వు తరుగుదల జరుగుతూనే ఉంటుంది. వానిపై ఎంత క్రీమ్‌ రాసిననూ వాటిని తిరిగి రానివ్వడం చాలా వరకూ సాధ్యపడదు. కాస్మిటిక్‌ క్రీములు కేవలం కొద్ది సమయం మాత్రమే చర్మాన్ని పటిష్టంగా ఉంచగలవు. అది కూడా మన చర్మపు ఆరోగ్యంపై ఆధారపడిఉంటుంది.

అపోహ: మొటిమలు వచ్చినప్పుడు మందులు వాడితే సరిపోతుంది.
వివరణ: మొటిమలు బాహ్యచర్మంపై తయార వ్వడానికి రెండు వారాల ముందు నుంచే లోపలి కణాలను బలహీనపరుస్తుంది. అందు వలన మొటిమలు వచ్చిన తరువాత అవి తగ్గడం కోసం మందులు వాడినప్పటికీ పైకి కనపడుతున్న మొటిమలను తగ్గించగలుగు తామే తప్ప లోపలి కణాలను బలహీన పరచ డాన్ని కూడా తగ్గించాలి అంటే నిర్ణీత కాలం వాడుతూనే ఉండాలి. డాక్టర్లు మొటిమలు వ్యాప్తి చెందడంలోని తీవ్రతను బట్టి మందు లు వాడవలసిన కాలాన్ని నిర్థారిస్తారు. 

Saturday, 26 July 2014

HOW TO TAKE CARE OF YOUR BEAUTIFUL SKIN IN RAINY SEASON

వర్షాకాలంలో మీకోసం స్పెషల్ స్కిన్ కేర్ టీప్స్

ఆవిరి పట్టుడం:

చర్మంలో రంధ్రాలు తెరుచుకొని, చర్మంలోపల చేరిన దుమ్ముధూళి నిర్మూలించడానికి ముఖానికి ఆవిరి పట్టడం చాలా అవసరం. ఆవిరి పట్టిన తర్వాత, కొన్ని నిముషాలు అలాగే ఉండే, తర్వాత ఐస్ ముక్కలతో ముఖం మీద మర్దన చేసుసుకోవాలి. ఇలా చేయడం వల్ల తెరచుకొన్న చర్మ రంధ్రాలు, మూసుకోబడుతాయి.

వారానికి రెండు సార్లు ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవాలి:

చర్మంలోని అన్నింటికంటే పైపొర వర్షాలకు పొడిగా మారుతుంది. ఈ సమస్యను నివారించడానికి ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల చర్మం నిర్జీవంను మరియు పిగ్మెంటేషన్ నివారించడానికి ఎక్స్ ఫ్లోయేట్ ఒక ఉత్తమ మార్గం. అందుకు వారానికి రెండు సార్లు బీడ్స్ తో స్ర్కబ్ చేయాలి. మరియు కెమికల్ గ్లైకోలిక్ పీల్ నెలకు రెండుసార్లు చేసుకోవడం వల్ల, ఆరోగ్యకరమైన మరియు కాంతి వంతమైన చర్మం అందిస్తుంది
.
పుదీనా ఫేషియల్ మంచి ఉపాయం:

ఈ సీజన్ లో మీ చర్మానికి పుదీనా లేదా బొప్పాయి ఫేషియల్ ఉత్తమం. పుదీనా మీ ముఖానికి కూలింగ్ ఎపెక్ట్స్ ఇవ్వడం మాత్రమే కాదు, మీ ముఖానికి చల్లని ప్రభావాన్ని కలిగిస్తుంది, చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది, దాంతో చర్మ రంద్రాల పరిమాణం తగ్గుతుంది. పొడి చర్మం ఉన్నవారికి బొప్పాయి గొప్పగా సహాయపడుతుంది.

Friday, 28 February 2014

HOW TO TAKE CARE OF YOUR BEAUTIFUL SKIN WITH CHERRY FRUITS - CHERRY FRUIT FACIAL

చెర్రీస్ తో సహజ చర్మ సంరక్షణ

చెర్రీ రసం చర్మ సౌందర్య మరియు డార్క్ మచ్చల తొలగింపు కోసం ఉపయోగపడుతుందని భావిస్తారు. దానిలో శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన మొటిమల రూపంలో ముక్కు,నుదురు,బుగ్గల మీద సాధారణంగా వ్యాపించే చర్మ వ్యాధిని నివారిస్తుంది. అదనంగా,చెర్రీస్ చర్మంనకు తేమ మరియు దెబ్బతిన్న చర్మంనకు ఉపశమనానికి సహాయపడుతుంది. 

ఈ రుచికరమైన పండ్లలో వివిధ రకాల చర్మ ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే విటమిన్ ఎ,విటమిన్ సి, పొటాషియం,జింక్,ఇనుము,రాగి,మాంగనీస్ మొదలైనవి సమృద్దిగా ఉన్నాయి.

అంతే కాకుండా,చెర్రీస్ తినడం వలన తలనొప్పి మరియు నిద్రలేమి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పండు సాధారణ వినియోగం వలన ఆరోగ్యకరమైన గుండె నిర్వహణ మరియు న్యూరాన్లు ఆక్సీకరణ నష్టం,మెమరీ నష్టంను నిరోధిస్తుంది.

ఇంటిలో తయారుచేసుకొనే చెర్రీ ఫేషియల్ మాస్క్

1. ప్రతి రోజూ మీ ముఖం మీద మెత్తని చెర్రీస్ (గుంటలను తొలగించి) రాస్తే మీ చర్మం మృదువుగా మరియు సున్నితముగా మారుతుంది. మీరు ఒక ఫోర్క్ సహాయంతో చెర్రీస్ మాష్ చేయవచ్చు.

మీరు మీ చర్మంపై ఈ పండుని రాయటానికి ముందు మీ ముఖంను కడగడం మరియు శుభ్రంగా ఉందని నిర్ధారించుకోండి. మీరు ఒక జిడ్డుగల చర్మం కలిగి ఉంటే,అప్పుడు పుల్లని చెర్రీస్ వాడండి.

2. చెర్రీస్ గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ తేనే మరియు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఒక సులభమైన చెర్రీ ఫేషియల్ మాస్క్ సిద్ధం చేసుకోండి.

మీ ముఖం మరియు మెడ మీద ఈ పేస్ట్ ను రాసి,15-20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మొటిమల రూపంలో ముక్కు,నుదురు,బుగ్గల మీద సాధారణంగా వ్యాపించే చర్మ వ్యాధి నయం అవుతుంది.

3. చెర్రీస్ గుజ్జులో రెండు టేబుల్ స్పూన్స్ తేనే కలిపి మీ ముఖానికి రాసి,20 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. అప్పుడు ముడుతలకు మరియు ఫైన్ లైన్లు క్షీనత కోసం అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే డార్క్ స్పాట్స్ తొలగించడానికి సహాయపడుతుంది.

4. ఐదు చెర్రీస్ మరియు మూడు స్ట్రాబెర్రీలు తీసుకోని మెత్తగా చేసి,మీ ముఖం మరియు మెడ మీద రాసి 5 నిముషాలు ఉంచితే మీ చర్మం యవ్వనంగా కనిపించటానికి సహాయపడుతుంది. ఇంకా అదనపు ప్రయోజనం కొరకు రోజ్ వాటర్ ను కలపవచ్చు.

5. కొన్ని చెర్రీస్ తీసుకోని మెత్తగా చేసి,దానికి 2 లేదా 3 స్పూన్స్ సాదా పెరుగు కలిపి మీ చర్మంపై రాసి 20-30 నిమిషాలు తర్వాత తొలగించాలి.

డల్ గా వుండే చర్మంను ఉత్తేజపరుస్తుంది. అంతేకాక మీ చర్మం ప్రకాశవంతముగా ఉంటుంది. దీనికి అదనంగా ముతక చక్కెర జోడించి స్క్రబ్ గా ఉపయోగిస్తే ఎక్స్ ఫ్లోట్ తగ్గుతుంది.

6. మీరు రెండు టేబుల్ స్పూన్స్ చెర్రీ రసం,ఒక స్పూన్ వోట్మీల్ కలపడం ద్వారా మరో ఎక్స్ ఫ్లోట్ చెర్రీ ఫేస్ మాస్క్ ను సిద్ధం చేయవచ్చు.

మీ చర్మంపై పేస్ట్ రాసిన తర్వాత ఐదు నిమిషాలు వదిలివేసి,ఆతర్వాత శుభ్రం చేస్తే చనిపోయిన చర్మ కణాలు తొలగించడానికి సహాయపడుతుంది.

7. ఒక పీచ్ పండు మరియు ఎనిమిది లేదా తొమ్మిది చెర్రీస్ లను తీసుకోని ఒక బ్లెండర్ లేదా ఆహార ప్రాసెసర్ ద్వారా గుజ్జుగా చేయాలి. ముడుతలను తగ్గించేందుకు 20 నిమిషాల పాటు మీ చర్మంపై ఈ పేస్ట్ ను రాయాలి.

ఈ మాస్క్ పొడి చర్మం వారికీ చాలా బాగుంటుంది. చర్మంనకు మరింత పోషణ కొరకు ఒక స్పూన్ అదనపు వర్జిన్ ఆలివ్ నూనెను జోడించవచ్చు.

8. ఒక గుడ్డు తెల్ల సొనలొ 2 స్పూన్స్ మొక్కజొన్న పిండి,ఒక స్పూన్ తేనే,10 చెర్రీస్ పండ్ల గుజ్జు కలిపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడకు రాయండి. చివరగా,20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఇది జిడ్డు చర్మం గల వారి కోసం బాగుంటుంది.

Saturday, 8 February 2014

MAINTAIN SKIN BEAUTY IN SUMMER SEASON - SUMMER SEASON BEAUTY CARE TIPS FOR SHINY SKIN IN NATURAL WAY EATING BADAMS ETC

మృదువుగా, ప్రకాశవంతంగా కనిపించాల్సిన చర్మం.. వేసవిలో నిర్జీవంగా మారిపోతుంది. అలాంటి చర్మానికి ఎప్పటి కప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చర్మం సహజంగా మెరిసేలా:
. ఐదారు బాదం గింజల్ని తీసుకుని పాలల్లో కనీసం నాలుగు గంట నానబెట్టుకోవాలి. ఆ తరువాత వాటిని మెత్తగా గ్రైండ్‌చేసుకోవాలి. ఆ మిశ్రమంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి పది నిమిషాలయ్యాక కడిగెయ్యాలి.
.కాచిన పాలమీగడ, తేనె కలిపిన మిశ్రమాన్ని రాసుకుని ఐదు నిమిషాలు మర్దన చేసి ఆ తరువాత కడిగితే, చర్మం చాలా తాజాగా తయారవు తుంది.
.ముఖం మృదు త్వాన్ని సంత రించు కోవాలంటే, బాదం పొడిలోనాలుగు చుక్కల వీట్‌ జెర్మ్‌ నూనె, అరచెంచా గులాబీ రేకుల పొడిని కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషా లయ్యాక కడిగేస్తే సరిపోతుంది. చర్మం తాజాదనాన్ని పొందు తుంది. వేసవి కాలంలో ప్రతిరోజు మంచి క్రీం రాసుకుని పాలమీగడతో మర్దన చేసుకోవటం చాలా మంచిది.
పొడిచర్మం వీడి ప్రకాశ వంతంగా:.చెంచా కలబంద గుజ్జులో గులాబీ నూనె, వీట్‌జెర్మ్‌ నూనె రెండు చుక్కలు, చొప్పునవేసి, చెంచా బాదం పొడి కలిపి పూతలా వేసుకోవాలి.
. చెంచా పాలపొడినిలో మోతాదులో తేనె, విటమిన్‌ ఇ క్యాప్యూల్‌ ఒకటి, అరచెంచా గులాబీ రేకల ముద్ద కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల య్యాక కడిగేస్తే పొడిచర్మం పోయి ప్రకాశవంతంగా మారుతుంది. 

Wednesday, 29 January 2014

HEALTHY SKIN CARE TIPS - ARTICLE ON SKIN CARE IN TELUGU

శరీరంలో అన్నిటికన్నా ముఖ్యమైన భాగం ఏది? ప్రాణాలు నిలిపేది గుండె కాబట్టి అదే అంటారు ఏమో...! దానితో పాటు అందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. మనల్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే చర్మం అన్నిటికన్నా జాగ్ర త్తగా కాపాడుకోవలసిన అంశం అంటే అతిశ యోక్తి కాదు. చిన్న పిల్లల నుండీ పెద్ద వాళ్లవ రకూ చర్మాన్ని సౌందర్యవంతంగా ఉంచేం దుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. పుట్టడం తోనే చక్కని చర్మంపొందడం కుదరని విష యం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యు పరమైన మార్పుల కారణంగా చర్మం అనేక మార్పులు చెంది మనకు చుట్టుకుని ఉంటుం ది. ఎవరికైనా కూడా పూర్తి ఆరోగ్యవంతమైన చర్మం ఉందని చెప్పలేం. చర్మం యొక్క రంగు వారసత్వంపై కూడా ఆధారపడవచ్చు. కానీ చర్మం యొక్క స్థితిని మార్చలేం అని వది లేయక్కర్లేదు. అనేక జాగ్రత్తలు తీసు కోవడం ద్వారా మన చర్మాన్ని ఆరోగ్య వంతంగా, ఆకర్షణీయంగా ఉంచవచ్చు. ప్రస్తుతం ఎంతో మంది శుభ్రతను పాటిస్తూనే మరింత ఆకర్షణీయంగా ఉండడం కోసం అనేక రకాల క్రీములను వాడుతూ ఉంటారు. అలాగే చర్మంలో కూడా పలు రకాలు ఉం టాయి. వాటికి తగిన మందులను ఎంచు కోవడంలోనే ఎంతో మంది అవాస్తవాలను ఎదుర్కొంటున్నారు. ఏ విధమైన పదార్థాలను వాడాలో తెలియక సతమతం అవుతున్నారు. క్రీముల ద్వారా కొందరు లాభపడుతుంటే మరికొందరు అదే క్రీముల వలన నష్ట పోతున్నారు. దానికి కారణం ఆ క్రీములలో వాడే పదార్థాలు ఎటువంటి చర్మానికి సరిపోతాయి అనే విషయంపై సరైన అవగాహన లేకపోవడమే. వీటిపై అనేక అవాస్తవాలనూ, వాటి వెనక ఉండే నిజాలనూ ఒక సారి వీక్షిద్దాం...