WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Laughing Buddha Stories and Articles. Show all posts
Showing posts with label Laughing Buddha Stories and Articles. Show all posts

Saturday, 6 February 2016

STORY ABOUT LAUGHING BUDDHA AND INSTRUCTIONS TO PUT LAUGHING BUDDHA STATUE IN HOMES


హ్యాపీ బుద్ధా..... లాఫింగ్‌ బుద్ధా

గుమ్మడికాయలా గుండ్రటి తలకాయ.. బానలాంటి పెద్ద బొజ్జ.. మనసారా నవ్వుతూ కనిపించే ముఖం.. ఈ బొజ్జదేవయ్య ఎక్కడుంటే అక్కడ సిరిసంపదలకు లోటుండదని విశ్వసిస్తారు హ్యాపీ బుద్ధా, లాఫింగ్‌ బుద్ధా, బుదాయ్‌గా చాలా ఇళ్లలో ఈ వింత రూపం కనిపిస్తూనే ఉంటుంది.

ఈ నిండుమనిషి గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి శతాబ్దం కిందట చైనాలో హొటై పేరుతో బౌద్ధ బిక్షువుగా తిరిగేవాడని చెబుతుంటారు భుజాన జోలె, చేతిలో బిక్షాప్రాతతో ఉండే ఆయన.. పిల్లలు ఏది అడిగినా జోలెలో నుంచి తీసిచ్చేవాడట ఉదయాన్నే ఆయన ముఖం చూస్తే.. ఆ రోజంతా హాయిగా గడిచిపోయేదట జపాన్‌లో లాఫింగ్‌ బుద్ధాను ఏడుగురు అదృష్ట దేవుళ్లలో ఒకరుగా భావించి పూజించేవారు థాయ్‌లాండ్‌లోనూ బుదాయ్‌కి బోలెడంత క్రేజ్‌ ఉంది ఇక మన దేశంలోనూ లాఫింగ్‌ బుద్ధను సాక్ష్యాత్తు బోధిసత్వుడి అవతారంగా భావిస్తారు సంస్కృతంలో మైత్రేయ అని సంబోధిస్తారు ఈ నవ్వే దైవం విగ్రహం ఎక్కడుంటే అక్కడ కష్టాలు ఉండవని విశ్వసిస్తారు అందుకే శుభకార్యాలకు లాఫింగ్‌ బుద్ధుడి ప్రతిమను బహుమతిగా ఇవ్వడం పరిపాటిగా మారింది అయితే విభిన్న రూపాల్లో ఉండే ఈ విగ్రహాలలో.. ఒక్కో రూపం ఒక్కో రకమైన అదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

* నిల్చుంటే ఆరోగ్యం..

రెండు చేతులు పైకెత్తి.. వాటిలో బంగారు బంతులు మోస్తూ కనిపించే బుదాయ్‌ ప్రతిమను ఆరోగ్యప్రదాతగా భావిస్తారు ఇలాంటి విగ్రహం ఇంట్లో ఉంటే ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు కలుగుతుందట అయితే ఈ ప్రతిమ తూర్పు దిశకు అభిముఖంగా ఉంచితే మంచిదని చెబుతున్నారు బుదాయ్‌ ఫాలోవర్స్‌ ప్రధాన హాల్‌లో పశ్చిమాభిముఖంగా కూడా ఉంచవచ్చు.

* సువర్ణావకాశం..

బంగారు నాణేల మీద తిష్టవేసి కూర్చున్న లాఫింగ్‌ బుద్ధా ఇంట్లో ఉంచితే అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందట. ఈ ప్రతిమ ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు.. సిరిసంపదలు సమృద్ధిగా కలిగిస్తుందట. కాసులపై కొలువుదీరిన హ్యాపీ బుద్ధాను వాయవ్య దిశలో.. ఉత్తరం లేదా దక్షిణాభిముఖంగా ఉంచాలని సూచిస్తారు వాస్తు పండితులు. బంగారు రంగులో నిగనిగలాడే బుదాయ్‌ ప్రతిమ నెగెటివ్‌ సిగ్నల్స్‌ను హరిస్తుందని, ఆదాయం పెంచే అవకాశాలను అందిస్తుందని చెబుతారు. వాయవ్యం దిశలో స్నానాల గది లేదా వంటిల్లు ఉంటే.. అప్పుడు ఈ ప్రతిమను ఆగ్నేయ దిశలో ఉంచితే మేలు.

* విన్స్‌ ద కెరీర్‌..

డ్రాగన్‌ టార్టాయి్‌సపై దర్జాగా కూర్చున్న హ్యాపీ బుద్ధా కెరీర్‌లో విశేషమైన మార్పులకు నాంది పలుకుతాడట. ఆదాయ మార్గాలనూ అమాంతంగా పెంచేస్తాడట. ఇలాంటి విగ్రహాన్ని ఆఫీసులో కూడా పెట్టుకోవచ్చు. ఆఫీస్‌ క్యాబిన్‌లో మీ కుర్చీకి వెనుకవైపు ఉంచితే కెరీర్‌ విజయవంతంగా సాగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంట్లో అయితే ఉత్తర దిశలో ఉంచాలి.

* పిల్లలకు పెన్నిధి..

చంటిపిల్లలను ఎత్తుకుని కనిపించే హ్యాపీ బుద్ధా ప్రతిమ చూడటానికి ఎంతో ముద్దుగా ఉంటుంది. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో తులతూగుతారని విశ్వసిస్తారు. పిల్లల అభివృద్ధి నిరాటంకంగా సాగుతుందట. ఈ ప్రతిమను హాల్‌లో గానీ, బెడ్‌ రూమ్‌లో గానీ దక్షిణ దిశలో ఉంచడం మంచిది.

* జ్ఞాన ప్రదాత..

క్రిస్టల్‌తో తయారు చేసిన లాఫింగ్‌ బుద్ధా జ్ఞానాన్ని పెంచుతుంది. ఈ ప్రతిమను స్టడీ రూమ్‌లో ఉంచితే దాని నుంచి వచ్చే పాజిటివ్‌ సిగ్నల్స్‌ పిల్లల మనసును ప్రశాతంగా ఉంచుతుందని నమ్ముతారు. తద్వారా వారి తెలివితేటలు ద్విగుణీకృతం అవుతాయని భావిస్తారు. ఇంటి యజమాని ఆదాయం పెరగాలంటే ఈ విగ్రహాన్ని హాల్‌లో ఈశాన్య దిశలో ఉంచాలి.