WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Cartoons and Jokes. Show all posts
Showing posts with label Cartoons and Jokes. Show all posts

Friday, 30 September 2016

DEATH STRIKE - SALOON WORKING DEAR

అలసత్వానికి మారుపేరైన సుబ్బారావుకు తీవ్రం గా జబ్బు చేసింది.
చాలా కాలం తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకున్నాడు.
డాక్టర్ రాసి ఇచ్చిన టెస్టులను బద్ధకించి ఇంకొక రెండు నెలల తర్వాత
చేయించుకొని ,ఇంకొక నెల తర్వాత వాటిని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు.
రిపోర్టులను చూసిన తర్వాత డాక్తర్” సుబ్బారావు గారు, మీకొక బాడ్ న్యూస్.మీరు ఎక్కువ కాలం బతకరు” అని అన్నాడు.
ఆ మాటలు విన్న సుబ్బారావుకు తల దిమ్మెక్కిపోయింది. “ఏమిటి డాక్టర్ గారు మీరు చెప్పేది ? ఇంకా ఎంత కాలం నేను బతుకుతాను ?” అని అడుగగా ఆ డక్తర్ “పది” అని చెప్పాడు.
“ఏమిటి పది డాక్టర్ ? సంవత్సరాలా?నెలలా?వారాలా?సరిగ్గా చెప్పండి? గద్దించాడు సుబ్బారావు.
“తొమ్మిది, ఎనిమిది,ఏదు” లెఖ పెట్టడం ప్రారంభించాడు డాక్టర్.

###

” ప్రియా , నీ చెంపలు ఎంతో నున్నగా వున్నాయి,రోజుకు ఎన్ని సార్లు షేవింగ్ చేస్తావు?” మత్తుగా అడిగింది రజని.
“ ఒక ఇరవై సారులు చేస్తాను”
“ నీకేమైనా పిచ్చి గానీ పట్టిందా, రోజుకు ఇరవై సార్లు షేవింగా ?” ఆశ్చర్యంగా అడిగింది రజని.
“ అవును, నేను సెలూన్ లో పని చేస్తాను” అసలు సంగతి చెప్పాడు గణేశ్.

GO 2 HELL - CAR BREAKS FAIL - TELUGU JOKES

" ఏమిటండీ ఈ రోజు ఇంత త్వరగా ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసారు ?" మూడు

 గంటలకే ఇంటికి చేరుకున్న భర్త గణేశ్ ను అడిగింది భార్య కమల.

" ఫైలు తీసుకెళ్ళి ఆఫీసరు గారి ముందు పెడితే కోపం గా నాలుగు తిట్లు తిట్టీ గో టు 

హెల్ 
అన్నాడు. వెంటనే ఇంటికి అదే నా హెల్ కు వచ్చేసాను" అసలు సంగతి చెప్పాడు 

గణేశ్.

***

ఏమిటండీ కారు అంత స్పీడుగా డ్రైవ్ చేస్తున్నారు? ఇంటికి వెళ్ళడానికి ఎవరో 

తరుముకొస్తునట్టు ఎందుకంత తొందర ?” అడిగింది భార్య.

“ అదేం కాదు! కారు బ్రేకులు ఫెయిలయ్యాయి. యాక్సిడెంట్ జరిగే లోపల ఇల్లు 

చేరుకుందామని స్పీడుగా పోనిస్తున్నాను” అసలు సంగతి చెప్పాడు భర్త,

LIFE IS FULL OF MISERY - TELUGU JOKES

" మా ఆయన ఈ మధ్య బాగా మారిపోయారు తెలుసా ?" ఏడుస్తూ అంది రాధ.

" ఏమయ్యిందో చెప్పవే,నాకు తోచిన సలహా ఇస్తాను" అనునయం గా అంది అనురాధ.

" పెళ్ళి కాకముందు ప్రేమిస్తున్నానంటూ వెంటబడే రోజులలో నువ్వు లేకుండా 

బ్రతకలేనంటూ హుషారుగా పాత సినిమాలలో శోభన్ బాబులా సినిమా డైలాగులు 

చెప్పేవారు. ఈ మధ్య జీవితమే నరకం, జీవితం మూణ్ణాళ్ళ ముచ్చటే అంటూ మజ్ఞూ లా

 విషాదం గా పాటలు పాడుతున్నారు" ముక్కు చీదుతూ అసలు సంగతి చెప్పింది రాధ.

NO KISS DEAR



 నేను ఈ రోజు నుండి నీ దగ్గర ఏమీ దాచదలచుకోలేదు. 
ఫ్రాంక్ గా అన్నీ నిజాలనే చెప్పెస్తాను. నేను ముద్దు పెట్టుకున్న మొదటి అమ్మాయివి
నువ్వు మాత్రం కాదు” శొభనం రోజున భార్యతో ఆవేశంగా చెప్పాడు రాజేష్.


“మీ ఫ్రాంక్ నెస్ నాకు నచ్చింది. నేనూ ఈ రోజు నుండి
మీ దగ్గర అన్నీ నిజాలే చెబుతాను. మీకు అమ్మాయిలను ముద్దు పెట్టుకోవడం రాదు”
తాపీగా చెప్పింది శొభన.

WEEKLY THREE TIMES - TELUGU JOKE


ఆ మాట అడిగితే ఎలాగా.
.
. “పాశ్చాత్య సంస్కృతిని ఒంట పట్టించుకున్న ఒక ఇరవై అయిదేళ్ళ అందాల భామ
ఒక కంపెనీలో సెక్రెటరీ పోస్టుకు అప్లయి చేసింది. 
పేరు, వయస్సు,విద్యార్హత,జాతీయత వగైరా వివరాలను అప్లికేషనులో పూర్తిచేసాక 
“సెక్స్” అనే కాలం వద్ద ఆగిపోయింది.
ఒకటి, రెండు నిమిషాలు సిగ్గుపడి చివరకు”వారానికి మూడు సార్లు మాత్రమే” అని రాసింది.

Thursday, 15 September 2016

WHERE R U GOING DOCTOR - GOING 2 HOSPITAL FOR TREATING SKELETON



ఒక డాక్టర్ తన జూనియర్స్ కి క్లాసు తీసుకోవడానికి 'అస్థిపంజరం' 

ఒకటి కార్ లోని వెనుక సీట్ లో పెట్టుకొని ఆసుపత్రికి బయలుదేరాడు.

దారిలో ఒక ట్రాఫిక్ పోలీస్ కారు ఆపాడు. వెనుక సీట్ లో అస్థిపంజరాన్ని చూశాడు.

"ఎక్కడికి తీసుకెళ్తున్నారు?" అడిగాడు పోలీస్.

"ఆసుపత్రికి" చెప్పాడు డాక్టర్.

"ఇప్పుడు తీస్కెళ్లినా బ్రతుకుతాడంటారా?" అనుమానంగా అడిగాడు పోలీస్

Saturday, 10 September 2016

GIFT 2 SOFT FELLOW TELUGU JOKE


బుద్ధిమంతుడికి ఓ బహుమతి!

ఓ పెద్ద కంపెనీలో ఉన్నతాధికారుల మీటింగ్ జరుగుతోంది.కంపెనీ చైర్మన్ ఒక కాన్ఫిడెన్షియల్ విషయం మాట్లాడాలని చెప్పి ముఖ్యులైన ఎనిమిది మంది అధికారులను మాత్రం ఉంచాడు.

చైర్మన్ గొంతు సవరించుకున్నాడు.

“ మన ఆఫీసులో రిసెప్షనిస్టు షీలా అందంగా ఉంటుందని, కాస్త ప్రెండ్లీ గా ఉంటుందనీ అందరికీ తెలుసు.మీలో కొందరు ఆ అమ్మాయితో బయట తిరుగుతున్నారని నాకు తెలియవచ్చింది. ఎవరెవరు ఆ అమ్మాయితో తిరుగుతున్నారో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. నిజాయితీగా చెప్పండి-మీలో ఎవరు ఆ అమ్మాయితో తిరుగుతున్నారు ? తిరిగే వాళ్ళు చేతులెత్తండి " అన్నాడు.

అందరూ మొహామోహాలు చూసుకున్నాక కాస్సేపుండి బెదురుతూ ఒక చేయి పైకెత్తాడు. అతన్ని చూసి ధైర్యం చేసి మరోడు.ఆ తర్వాత మరోడు.కాస్సేపటికి చూస్తే అప్పారావు తప్ప తక్కిన ఏడుగురూ చేతులెత్తారు.

చైర్మన్,అప్పారావు కేసి ఆశ్చర్యంగా చూశాడు.

“ నిజంగానే ఆ అమ్మాయితో నీకే సంబంధమూ లేదంటావా అప్పారావ్ ? ఉన్న విషయం ప్రాంక్ గా చెప్పు...ఫర్వాలేదులే " అన్నాడు.

“ అమ్మాతోడు సార్, ఆ అమ్మాయికేసి గట్టిగా చూడనుకూడా చూడలేడు నేను " అన్నాడు అప్పారావు నెత్తి మీదా చేయి పెట్టుకుని.

“గుడ్...నువ్వొక్కడివే దొరికావ్ " అంటూ నిట్టూర్చాడు చైర్మన్.

అందరూ అయోమయంగా చూశారు.

“ ఆ అమ్మాయిని ఉద్యోగంలోంచి తీసేద్దామనుకుంటున్నాను. ఆ ఊస్టింగ్ అర్డర్ మీద నువ్వే సంతకం చెయ్యి.మా అందరికీ మా మా మొహమాటాలున్నాయి కదా " చెప్పాడు చైర్మన్.

JOKES BY SRI Vinjamuri Venkata Apparao GARU

పెళ్లాన్ని కొట్టిన ఒక ధీరోదాత్తుడి ని కోర్టులో ప్రవేశ పెట్టారు.
జడ్జి అతడిని ఈర్షగా చూస్తుండగా లాయర్ కోర్టుకి విన్నవించుకున్నాడు .
"ముద్దాయి సచ్చిలుడు , ఇదో క్షణిక ఆవేశం లో బార్య మీద చెయ్యి చేసుకున్నాడు .మొదటి తప్పుగా క్షమించి వదిలెయ్యవలసినదిగా కోర్టుకి విన్నవించుకుంటున్నాను."
జడ్జి గారు తాను చేయలేని పని చేసిన అతడిని లోపల మెచ్చుకున్నా, బయటకి మందలించి వదిలేశారు.

****

మూడో రోజు అదే దీరోదాత్తుడిని అదే కారణం తో అదే జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఈసారి జడ్జి గారు ఉపేక్షించ దలుచు కోలేదు.
అతడి కి శిక్ష విదించే లోపు " అయ్యా నేను ఏమయినా కోర్టుకి చెప్పు కోవచ్చా అని అడిగాడు "
కళ్ళజోడు లోంచి చూస్తూ " కానివ్వు " అన్నాడు జడ్జి .
"అయ్యా .. మొన్న మీరు వదిలేశారా ఆ ఆనందం తో కొద్దిగా ఒక్క బాటిల్ కొనుక్కుని, ఒక్క పెగ్గు తాగుదామని తాగానా?, దానివల్ల పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. అందుకని రెగ్యులర్ గా తీసుకునే మోతాదు తీసుకుని
ఇంటికి జగార్త గా వెళ్ళాను. "
జడ్జి శ్రద్దగా వినడం గమనించాడు దీరోదాత్తుడు .
"వాకిట్లోనే అందుకుందండి. బండ గొంతు వేసుకుని 'వచ్చావా ? మళ్ళీ తాగొచ్చవా? ఆ పనికి మాలిన తాగుడు మానవు గదా?' అని " నేనేమీ మాట్లాడ లేదండీ. గమ్మున లోపలికి వెళ్ళాను..
"పనికి మాలిన వెదవ, పని లేదు పాడు లేదు తాగటం , తిరగటం , సిగ్గా శరమా , దున్నపోతు మీద వాన కురిస్తే ఏమి? కుడితి పోస్తే ఏమి ?'
అప్పటికీ నేను ఏమి అనలేదు అయ్యా .. నా గదిలోకి పోతున్నాను ..
" ఆ జడ్గి గాడు ఒక పనికి మాలిన ఏబ్రాసి, సన్నాసి. వాడు సరయినోడు అయితే ఈ పాటికి నువ్వు జైల్లో ఉందువు. ఇత్తడి చెంబుకు జనప నార అతికించినట్లు వాడు వాడి మొఖం. ఎంగిలి బీడీలు ఎరుకుని తాగే యదవ,
వాడు కడుపుకి అన్నం తింటున్నాడా, పెంట ..................."
జడ్జి అతడిని ఆపి "ఇక నువ్వు వెళ్ళోచ్చు" అన్నాడు .
పోలీస్ వారి వైపు తిరిగి "ఈ సారి మర్డర్ చేసినా ఇతని మీద కేసు కట్టకండి"
కోర్టు వాయిదా పడింది

OH MY GOD - ITS GONE - WIFE AND HUSBAND JOKE


అప్పుడే స్నానం చేసి బెడ్ రూం లోకి వచ్చాడు భర్త.
మంచం మీద తాపీగా కూర్చుని వున్న భార్య ని చూసి... 
భర్త:- యేమిటీ! ఇంత ఆనందంగా వున్నావ్?
భార్య:- తీసేసానండీ. (నవ్వుతూ) 
భర్త:- ఏమి తీసేసావ్?
భార్య:-మీ సెల్ ఫోన్ వాట్సప్ లో మిమ్మల్ని "వైరస్" గ్రూప్ నుంచి తీసేసాను.
భర్త:- నీ బొంద అది “VIRUS” గ్రూప్ కాదే “VIRA’S” గ్రూప్. వీర రాఘవయ్య స్కూల్. అది మా టెంత్ క్లాస్ బ్యాచ్ మేట్స్ గ్రూప్.
భార్య:-ఏమో నాకేమి తెలుసు? మొబైల్ లో వైరస్ వుండకూడదు కదా! అందుకని తీసేసాను.
భర్త:-ఇంకా ఏమి తీసేసావ్?
భార్య:- “N.V.” గ్రూప్ నుంచి కూడా తీసేసాను.
భర్త:- ఓసి నీ మొఖం మండా !!! “N.V.” అంటే “నూకల వెంకటరత్నం కాలేజ్”. అది మా ఇంటర్ బ్యాచ్.
భార్య:-ఏమో నాకేమి తెలుసు? నాన్ వెజ్ జోకులు వుండకూడదు కదా! అందుకని తీసేసాను.
భర్త:-అంతేనా ఇంకా ఏమన్నా తీసేసావా?
భార్య:-"గాలి" గ్రూప్ నుంచి కూడా తీసేసాను.
భర్త:- ఓసి నీ అయ్యా అది !!! “గాలి చిన వెంకటేశ్వర్లు కాలేజ్”. అది మా ఇంజినీరింగ్ బ్యాచ్.
భార్య:-ఏమో నాకేమి తెలుసు? గాలి కబుర్లు చెప్పుకోకూడదు కదా! అందుకని తీసేసాను.
భర్త:-ఓసి నీ సిగ తరగా!!! అసలు ఇవన్నీ చేయటానికి నీకు నా మొబైల్ పాస్ వర్డ్ ఎలా దొరికింది?
భార్య:-మీ పేరు పెట్టా, నా పేరు పెట్టా, మీ అమ్మ పేరు పెట్టా, మీ నాన్న పేరు పెట్టా, మన అమ్మాయి పేరు పెట్టా, ఎన్ని ట్రై చేసినా కుదరలేదు.
భర్త:- మరి ఎలా తెరిచావే తల్లీ?
భార్య:-చివరి ప్రయత్నంగా మన పని మనిషి "సుందరి" పేరు నొక్కా!!! దెబ్బకి తెరుచుకుంది రా సచ్చినోడా 

Wednesday, 6 July 2016

DONT SHOUT - JOB GONE - JOKES

ఊడి పోతుందిరా...ఉద్యోగం గట్టిగ అరవకు...
.
ఒక నిరుద్యోగికి జూలో ఉద్యోగం వచ్చింది. వారు అతన్ని గొరిల్లా లాగా డ్రెస్ వేసుకుని 
గొరిల్లాలా నటిస్తూ ప్రజలను ఆకర్షించమని చెప్పారు. దీంతో అతను గొరిల్లా వేషం వేసుకుని వచ్చాడు.

మొదటిరోజు అతను ఎన్నో విన్యాసాలు చేశాడు. ప్రజలంతా అతన్నిచూసి కేరింతలు కొట్టారు. 

రెచ్చిపోయిన అతడు ఒకవైపు వేలాడుతూ పట్టుదప్పి సింహమున్న బోనులో పడ్డాడు. సింహాన్ని చూసి భయపడిపోయి అతడు రక్షించండి! రక్షించండి అని బిగ్గరగా అరవసాగాడు.

అప్పుడు సింహం మెల్లగా అతని వద్దకు వచ్చి బుద్ధిలేనోడా! నీవు గొరిల్లా వేషంలో వున్నావు. అరవడం ఆపు, జనం గుర్తుపట్టారంటే మనిద్దరి ఉద్యోగాలు ఊడిపోతాయి.

Tuesday, 31 May 2016

I WANT COOL DRINK DEAR

ఎండాకాలం

"ముసలోడా ఆగు ...'' అడవిదారిలో అడ్డుపడి అంది పులి. 

"ఈ దారిలో యువకులు చాలామంది వస్తుంటారు. వాళ్లది వేడి రక్తం'' తెలివిగా 

తప్పించుకోబోయాడు ముసలాయన. 

"నా కెందుకో ఈ రోజు కూల్‌డ్రింక్ తాగాలని ఉంది మరి'' చెప్పింది పులి.

(మల్లి జాజి శర్మ గారే.)

HELL 2 HELL PHONE CALLS FREE

నరకాలు

నరకంలో ఒహాయన : నా భార్యకి ఫోన్ చేసుకోవాలి " అన్నాడు 

అక్కడున్న చిత్రగుప్తుడు : "చేసుకో !" అని ఫోన్ ఇచ్చాడు. 

కాసేపు మాట్లాడి " ఎంతివ్వాలి " అన్నాడు చిత్రగుప్తుడితో హాయన.

చిత్రగుప్తుడు : " నరకం టు నరకం కాల్స్ ఉచితం " అన్నాడు

(సంగ్రహణ....జాజి శర్మ గారి వద్ద.)

WHAT HAPPENED TO ME DOCTOR

అప్ !
ఒకామె ఒంట్లో బాలేక డాక్టర్ దగ్గరకి వెళ్ళింది.
డాక్టర్ ఆమెను పరీక్షించి " మీరు ఈ ఎర్రగోలీ ఒక గ్లాసు నీళ్ళతో ఉదయమే పరగడుపున వేసుకోండి."
"అలాగేనండీ "
"మధ్యాహ్నం భోజనము కాగానే ఈ పచ్చగోలీ రెండు గ్లాసుల నీళ్ళతో వేసుకోండి"

"అలాగేనండీ"
" రాత్రి భోజనము కాగానే ఈ తెల్లగోలీ మూడు గ్లాసుల నీళ్ళతో వేసుకోండి."
ఆవిడ కంగారుగా " డాక్టర్ నాకేమైంది" అనడిగింది.
" మీరు మీ శరీరానికి కావలిసినన్ని నీళ్ళు తాగటంలేదు. అంతే "

Friday, 13 May 2016

WHERE IS LIFE BOY

సుబ్బులు: "లైఫ్ బాయ్ సబ్బు పెట్టాను", ఎక్కడండి?

ముత్యాల రావు: ఆరోగ్యానికి మంచిదని T.V లో చెబితే తినేశా!

MARRIAGE GIFT

బంటి (చంటి తో) : పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా.

చంటి : ఎందుకు?

బంటి : మా అమ్మాయి బంగారం అన్నారురా , అయితే తాకట్టు పెట్టుకోవచ్చా

 అని అడిగానంతే.

REAL FRIENDS

ఎంతైనా మన ఎఫ్బీ ఫ్ర్రెండ్స్ అండర్ స్టాండింగే వేరబ్బా.. 

అన్నం మాడి పోయినా , పాలు పొంగి అడుగంటినా ,
 
fb లో కామెంట్స్ పెడుతూ..కూర మాడి పోయిందని పోస్ట్ పెట్టినా .
.
వెంటనే లైక్స్ పెట్టి , 

" ఏం పర్లేదు .. మాకు రోజు ఇలాగే జరుగుతుందని " ధైర్యం చెప్పి , 

సంఘీభావం చెప్తూ , ఎంత వూరడిస్తారనీ ... హు.. ఇంట్లో వాళ్ళకి మాత్రం

బొత్తిగా సానుభూతి వుండదబ్బా ..

అస్సలు అర్ధం చేస్కోరూ .

32 TEETH 2 EAT

అప్పారావు (భార్యతో అంటున్నాడు): దేవుడు నీకు రెండు కళ్ళు ఇచ్చాడుగా 

అన్నంలో రాళ్ళు లేకుండా ఏరలేవా?

మణి (భర్తతో): దేవుడు మీకు కూడా 32 పళ్ళు ఇచ్చాడుగా .

 ఆ మాత్రం నమలలేరా.........!

EATING CHIPS DEAR

అప్పారావు:-- "ఇలా మనం పార్కులో కబుర్లు చెబుతూ ఈ చిప్స్ తింటుంటే నీకే మనిపిస్తోంది?"
.
ఐశ్వర్య :-- నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది!

SAMPLE DEAR

చింతామణి:(అప్పారావు తో): ఏమండీ శాంపిల్ అంటే ఏమిటి?

అప్పారావు: పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన వినయం లాటింది!

DIFFERENCE BETWEEN MEN AND WOMEN

ఇద్దరు స్నేహితురాళ్ళు ఇలా మాటలాడుకుంటున్నారు)

అమ్ములు: "మగవారి మీద నీ అభిప్రాయము ఏమిటి?

సుబ్బులు: "ఒక విషయం వారి చెవుల నుండి వెళ్తే ఆ విషయం 

మరొకరి నుండి బయటికి వస్తుంది".

సుబ్బులు:"మరి ఆడవారి మీద నీ అభిప్రాయం ఏమిటి?"

అమ్ములు:"ఒక విషయమ వారి రెండు చెవుల 

నుండి వెళ్లి వారి నోటి నుండి బయటకి వస్తుంది".