WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Guava Fruit - Jamapandu Health Benefits. Show all posts
Showing posts with label Guava Fruit - Jamapandu Health Benefits. Show all posts

Wednesday, 7 September 2016

REDUCE HEART ATTACK CHANCES BY EATING GUAVE FRUIT REGULARLY


గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. జామకాయలో ఉండే పొటాషియం గుండె జబ్బులు, బీపి పెరగకుండా చేస్తాయి. అంతే కాకుండా జమకాయలో బీ కాంప్లెక్స్ విటమిన్స్ (బీ6 , బీ9 ) , ఈ , కె విటమిన్స్ ఉంటాయి. ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.

జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు. ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు.

జామపండు చెట్టులోని ఆకులను (కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.