WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Kitchen Health Tips. Show all posts
Showing posts with label Kitchen Health Tips. Show all posts

Sunday, 7 February 2016

TELUGU AYURVEDIC KITCHEN HEALTH TIPS


చిన్న జబ్బులకు ఇంటి చిట్కాలు

జలుబు కాగానే మెడికల్‌ షాప్‌కు, తలనొప్పి రాగానే వీధి చివర ఆర్‌ఎంపీ డాక్టర్‌ దగ్గరకు పరిగెత్తుతుంటారు. ఇలాంటి చిన్న చిన్న జబ్బులకు ఇంటి వైద్యంతోనే చెక్‌ పెట్టేయొచ్చు. 

• అలాంటి కొన్ని చిట్కాలు..

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఓ 10 ఆకులతో పేస్ట్‌ తయారు చేసి మజ్జిగలో క లిపేసుకుని రోజూ తాగితే కాలేయం వ్యర్థపదార్థాల నుంచి రక్షణ పొందుతుంది. రోజూ ఓ 8 ఆకుల్ని మిర్యాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి.

వేపాకు, యాంటీ సెప్టిక్‌గానూ, ఇన్‌సెక్టిసైడ్‌గానూ బాగా పనిచేస్తుంది. వేపాకు పొడిని నీళ్లల్లో కలిపి చల్లితే ఎన్నో రకాల క్రిమి కీటకాలు ఇంటికి దూరంతా వెళ్లిపోతాయి. వే పాకుల్ని నీటిలో వేసి మరగించి స్ర్పే చేస్తే దోమల బెడద తప్పుతుంది. వేపాకు పొడిని పేస్ట్‌గా చేసి వాడితే పలు రకాల చర్మ సమస్యలు, మొటిమలు, ఎక్జీమాల బాధలు తప్పుతాయి.

తులసి ఆకులు, వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చేయడమే కాదు, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఓ ఐదారు ఆకుల కషాయాన్ని మరగించి టీ మాదిరి చేసుకుని తాగితే, దగ్గు, జలుబు, ఆస్తమా అదుపులోకి వస్తాయి.
రోజూ రెండు మూడు మెంతి ఆకుల్ని నమిలి చప్పరిస్తే, జీర్ణశ క్తి పెరిగి, కడుపు ఉబ్బరం, తే న్పులు తగ్గుతాయి. శ్వాసకోశాల శక్తి పెరుగుతుంది.

పసుపును పేస్ట్ ‌గా రోజూ ముఖానికి వాడితే, ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంటు కాబట్టి రోజు మొత్తంలో ఒక టీ స్పూను దాకా కడుపులోకి తీసుకోవచ్చు.

మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ బాగా సాయమవుతుంది. ఒక కప్పు నీటిలో ఒక పూవు చొప్పున వేసి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది.

కలమంద గుజ్జు ఇదొక సహజసిద్ధమైన కండీషనర్‌. మాయిశ్చరైజర్‌ కూడా. ఈ గుజ్జును చర్మం మీద, కపాలం మీద రుద్దితే, చుండ్రు సమస్యలు, చర్మ వ్యాధులు చాలా వరకు తగ్గుతాయి. ఈ గుజ్జుతో కాలిన గాయాలు కూడా త్వరగా మానిపోతాయి.

గోరింటాకు, జుత్తుకు సహజసిద్ధమైన రంగుగానే కాకుండా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ నివారణలోనూ బాగా తోడ్పడుతుంది. వెంట్రుక కుదుర్లను పటిష్టం చేయడం ద్వారా ఇది చుండ్రును, జుత్తు రాలడాన్ని నివారిస్తుంది.

అల్లం, జీర్ణశక్తిని పెంచడంతో పాటు క డుపులోని వికారాన్ని తగ్గిస్తుంది. అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, ఆకలి పెరుగుతుంది.

Monday, 11 January 2016

KITCHEN TIPS IN TELUGU - DALCHINA CHAKKA - INDIAN SPIECES HEALTH TIPS


మనం ఇంటిలో వాడుకు వంటింటి వస్తువుల్లో చాలా వరకు అద్భుతమైన ఔషదాలు దాగి ఉన్నాయి. పసుపు, అల్లం,వెల్లుల్లి,లవంగాలు,దాల్చిన్ చెక్క లాంటి చాలావాటిలో ఔషదాలు దాగి ఉన్నాయి. దాల్చిన చెక్క అనగానే మషాలా వెంటనే జ్ఞాపకమొస్తుంది. బిరియాని తయారీలోనూ, మషాలా కూరలు తయారీలలో వినియోగిస్తారు. దాల్చినచెక్క వల్ల ఎన్ని ఉపయోగాలో …
దాల్చిన చెక్క ఫైతోలు చేదుగా సువాసనగా తీక్షణమైనదిగా ఉంటుంది. ఇది పొట్టలోని క్రిములను నాశనం చేస్తుంది.

అంగబలహీనతకు పురుషుల యవ్వన శక్తిని ఎల్లపుడు కాపాడగల అనేక మూలికలలో దాల్చినచెక్క అతి ముఖ్యమైంది. ఇది శరీరంలోనికి వెళ్ళిన వెంటనే చిన్న చిన్న పరమాణువులగా మారిపోయి రక్తంలో కలిసిపోయి శరీరమంతా వ్యాపించి అవయవాల క్రియలను క్రమబద్దం చేస్తూ ఉంటుంది. కామశక్తి పెరగడానికి, కామేంద్రీయానికి, ఉత్తేజం పొందడానికి కూడా ఇది దివ్య ఔషధమే. కొంచెము దాల్చిన చెక్క ముక్కను నోటిలో వేసుకుని చప్పరించి ఆ రసాన్ని మర్మాంగంపై లేపనం చేసుకుని అది ఆరిపోయిన తరువాత రతిలోలో పాల్గొంటూ ఉంటే మర్మాంగం మద్యలో పడిపోకుండా ఉండి ఇద్దరికీ సంతృప్తి కలిగిస్తుంది.

ముఖం నునుపుగా ఉండాలంటే దాల్చిన చెక్కను మంచినీటితో అరగదీసి ఆ గంధాన్ని మొటిమలు, మచ్చలు, గుంటలు వీటిపైన లేపనం చేసి ఆరిపోయిన తరువాత చల్లని నీటితో కడుగుతూ ఉంటే చర్మం నునుపుగా తయారవుతుంది.

తలనొప్పికి దాల్చిన మూలికల తైలం మార్కెట్లలో దొరుకుతుంది.దాన్ని తలనొప్పి వచ్చినప్పుడు ఒకటి రెండు చుక్కల తైలాన్ని నుదిటిపైన లేపనం చేసుకుంటూ ఉంటే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది.

జలుబు సమస్యకు దాల్చిన చెక్కపొడి ఒక గ్రాము, లవంగంపొడి అర గ్రాము, శొంఠిపొడి ఒక గ్రాము ఈ మూడింటిని ఒక లీటర మంచి నీటిలో వేసి పావులీటరు మిగిలే వరకు మరిగించి వడపోసి దాన్ని మూడు బాగాలు చేసి ప్రతిరోజూ మూడుపుటలా సేవిస్తూ ఉంటే తీవ్రమయిన జలుబు తగ్గిపోతుంది.

కడుపు ఉబ్బరము (గ్యాస్) దాల్చిన చెక్కపొడి ఒక గ్రాము, ఏలకుల పొడి ఒక గ్రాము, శొంఠిపొడి ఒక గ్రాము కలిపి భోజనానికి ముందు సేవిస్తూ ఉంటే కడుపు ఉబ్బరం తగ్గిపోయి మందాగ్ని హరించి బాగా ఆకలి పుడుతుంది.

పిప్పిపళ్ళ భాధకు దూదిపైన ఒక చుక్క దాల్చిన తైలం వేసి ఆ దూదిని గుండ్రంగా చుట్టి నొప్పి ఉన్న పంటి దగ్గర నొక్కిపెట్టి ఉంచితే వెంటనే లోపల ఉన్న పురుగు చనిపోయి బాధ తగ్గిపోతుంది.

చెవిలో నొప్పికి దాల్చిన తైలం రెండు చుక్కల మోతాదులో రెండు పుటల చెవులలో వేస్తూ ఉంటె చెవి బాధ వెంటనే తగ్గిపోతుంది.

వాత రోగాలలో, పిత్తరోగములలో ఇది బాగా సహాయపడుతుంది. కంఠములో తడి అరిపోవటం, వాతనాడులలో మంటలు పుట్టడం అతిసారము, వంటి దురద, గుదద్వారము వద్ద కలిగే సమస్యలు, మొలలు, హృదయ వికారములు మొదలైన సమస్యలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

Friday, 8 January 2016

KITCHEN TIPS REGARDING CURD ONION MIRCHI ETC



  • ఇంగువను మెత్తగా పొడి చేసి అందులో కొద్దిగా ఉప్పు కలిపి సీసాలో భద్రపరుచుకుంటే వాసన తగ్గకుండా ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది.
  • పెరుగు పుల్లగా ఉంటే ఈ విధంగా చేసి చూడండి. దాన్ని పలుచటి బట్టలో కట్టి నీటిలో నాలుగైదు సార్లు జాడిస్తే పులుపు తగ్గుతుంది.
  • ఉల్లిపాయను తరిగేముందు కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తరువాత తరిగితే కళ్ళ వెంట నీరు రాదు.
  • పచ్చిమిరపకాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఇలా చేసి చూడండి. ఓ పాత్రలో పచ్చిమిరపకాయలను ఉంచి వాటి మీద కొద్దిగా పసుపు చల్లి ఫ్రిజ్‌లో పెడితే సరి. ఎంతకాలమైనా తాజాగా ఉంటాయి.

Tuesday, 22 December 2015

OLIVE OIL HEALTH TIPS IN TELUGU


ఆలివ్ ఆయిల్‌తో ఎంతో మేలు జరుగుతుందని ప్రముఖ పాకశాస్త్ర నిపుణురాలు నితా మెహతా అంటున్నారు. భారతీయ వంటకాల్లో ఆలివ్ నూనెను చేర్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నాంటున్నారు.
వంటకాల్లో ఆలివ్ నూనెను వాడటం ద్వారా కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని "ఇండియన్ కుకింగ్ విత్ ఆలివ్ ఆయిల్" అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కుకరీ ఎక్స్‌పోర్ట్ నితా మెహతా చెప్పుకొచ్చారు.
ఆలివ్ ఆయిల్ వాడకంతో వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని, హృద్రోగ సమస్యలకు ఆలివ్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుందట. దేశంలో వంద మిలియన్ మంది ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని, ఇందులో 40 శాతం నగర వాసులేనని తేలింది. అయితే ఆలివ్ ఆయిల్ వాడకంతో శరీరంలోని వ్యర్థ కొవ్వు పదార్థాలు ఆరోగ్యంలో చేరబోవని మెహతా చెప్పారు.
ఇతర నూనెల కంటే ఆలివ్ ఆయిల్‌ను వంటల్లో ఉపయోగించడం ద్వారా మధుమేహం, హృద్రోగసమస్యలకు చెక్ పెట్టవచ్చునని చెప్పారు. హై కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులతో ఆలివ్ ఆయిల్ పోటీ పడుతుందని, క్యాన్సర్, డయాబెటిస్ వ్యాధులకు ఆలివ్ ఆయిల్ ఔషధంలా పనిచేస్తుందని ఆసిన్ కుక్ బుక్ అవార్డు విజేత అయిన మెహతా అన్నారు.


Saturday, 12 December 2015

USE KITCHEN ITEMS - FOR REGULAR GOOD HEALTH EVER AND FOREVER


మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాని మనం పాటించం. 

1. చక్కెరను నియంత్రించే దాల్చిన చెక్క :

దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొలెస్ట్రాల్, ట్రెగ్లీసెరైడ్ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
2. అల్లం పైత్యానికి విరుగుడు :
అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుందని, ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం గట్టిగా చెబుతోంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్ పెడుతుంది. గర్భవతులలో ఉదయం పూట వికారాన్ని, కెమోథెరపీతో పాటు ఎన్నో కారణాలవలన వచ్చే కడుపునొప్పిని అల్లం నివారిస్తుంది.
3. వెల్లుల్లి గుండెకు నేస్తం
పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో మెండుగా వున్నాయి.
4. కుంకుంపువ్వు అందం ఆరోగ్యం
ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దేశ విదేశాలలో ఆహార పదార్థాలలో రుచి, రంగు, సువాసనకోసం వాడే కుంకుమపువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు వున్నాయి.
5. లవంగాలు శ్వాసకు మేలు :
లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు దంత రక్షణనిస్తాయి. నోటిని, శ్వాసను తాజాగా వుంచుతాయి. హృదయానికి ఆరోగ్యాన్నిస్తాయి. యాంటిసెప్టిక్, యాంటీబయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు.
6. జీర్ణశక్తికి జీలకర్ర
జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రీయాశీలం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా వుంచుతుంది.
7. ఆవాలు
ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది.
8. నల్లమిరియాలు
ఘాటుగా వుండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. బ్లాక్ కాఫీలో మిరియాలపొడి వేసుకుని తాగితే ఋతుక్రమ సమయంలో ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తుంది.
9. పచ్చి ఏలకులు
ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి ఏలకులకు ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు ఏలకులు వేసిన పాలను తాగించాలి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది.
10 . పసుపు
రక్త శుద్ధికి, కాలేయం, కంటి వ్యా ధులకు, గాయాలు మానుటకు, వాపులతో కూడిన నొప్పులకు ఇలా ఎన్నో వాటికి ఔషధంలలో వాడతారు. ఎన్నో ఔషధాలలోనే వాడడమే కాకుండా ఇతర ఉపయోగాలు కూడ పసుపులో కనిపిస్తాయి. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు పొడి వేసి ఉద యం, సాయంత్రం తాగితే పడిశానికి మంచి మందు. పసుపును నీటిలో కలిపి ముద్ద చేసి లేదా లేత వేపాకు గుజ్టుతో కానీ కలిపి చర్మంపై రాస్తే ఎగి ్జను, ఇతర చర్మ వ్యాధులు తగ్గుతాయి. చర్మంపై దద్దుర్లు వచ్చినపుడు ను వ్వుల నూనెలో పసుపు రంగరించి పూసినా అవి పోతాయి. బెణికినపుడు నొప్పికి, గాయాలకు, కీళ్లవద్ద కొంచెం వాపు, నొప్పికి సున్నం, పసుపు కలిపి తేలికగా రుద్దితే మంచి ఉపశమనం కలుగుతుంది.

Saturday, 28 November 2015

CUMIN PLANT HEALTH TIPS - KITCHEN HEALTH TIPS - JEERA / JEELAKARRA HEALTH TIPS IN TELUGU - HEALTH WITH INDIAN SPECIES


వంటల్లో రుచి కోసం వాడే జీలకర్ర మన ఆరోగ్యానికి దివ్యౌషధంలా పనిచేస్తుంది. అజీర్తి, ఆస్తమా, వాంతి లక్షణాలు, కడుపునొప్పి, కొన్నిరకాల క్యాన్సర్లను నివారించడంలో ఇది ఎంతగానో దోహదపడుతుంది. మసాలా దినుసుగానే కాదు, ఆరోగ్యరీత్యా జీలకర్రను వాడడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ గ్లాసుడు నీటిలో కాస్త జీలకర్ర వేసుకుని తాగితే జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువ శాతంలో ఉంటుంది గనుక గర్భిణులు రోజూ కాస్త జీలకర్ర తింటే రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. దోరగా వేపిన జీలకర్రను తింటే జలుబు, ఆస్తమా తగ్గుముఖం పడతాయి. బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి శరీరాన్ని కాపాడుతుంది. సహజ సిద్ధమైన భేదిమందు అయినందున జీలకర్రను తినడం వల్ల మలబద్ధకం సమస్య క్రమంగా అంతరిస్తుంది. జీలకర్ర రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.

    Cumin Plant
    Cumin, sometimes spelled cummin, is a flowering plant in the family Apiaceae, native from the east Mediterranean to India. Its seeds are used in the cuisines of many different cultures, in both whole and ground form. Wikipedia
    Scientific nameCuminum cyminum
    RankSpecies