WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Dry Fruits Health and Beauty Benefits and Tips. Show all posts
Showing posts with label Dry Fruits Health and Beauty Benefits and Tips. Show all posts

Tuesday, 17 May 2016

KHAZOOR HEALTH KHAZANA


ఘనమైన చరిత్ర 

ఖర్జూరాలు ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఉత్పత్తవుతాయి. ఉత్తర ఆఫ్రికా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ఇవి పుట్టాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఖర్జూరాల్లో ఔషధగుణాలు మెండుగా ఉన్నాయని గుర్తించిన ఈజిప్టియన్లూ, అరబ్బులూ ఈ చెట్లను విరివిగా పెంచారు. సుమారు నాలుగు వేళ ఏళ్ల చరిత్ర వీటిది. పామ్‌ కుటుంబానికి చెందిన ఈ ఫలాలు ఈజిప్ట్‌, సౌదీ అరేబియా, ఇరాన్‌, యూఏఈ, పాకిస్తాన్‌, లిబియా దేశాల్లో అధికంగా లభిస్తాయి.

• శక్తినిచ్చే ఫలాలు 

ఖర్జూరాల తీపికి ఎవరైనా పరవశం అవ్వాల్సిందే. వీటిలో మినరల్స్‌, అధిక మోతాదులో కార్బొహైడ్రేట్స్‌ ఉంటాయి. వీటిని తినటం వల్ల ఇన్‌ఫెక్షన్లు తట్టుకునే శక్తి కలుగుతుంది. రక్తస్రావాన్ని అరికడతాయి. ఉద్వేగాన్ని తగ్గించడంలోనూ ఇవి పనితనం కనబరుస్తాయి. వీటిని తిన్న వెంటనే శరీరంలో శక్తి పుంజుకుంటుంది. అందుకే ఉపవాస దీక్ష పూర్త య్యాక చాలామంది ఖర్జూరాల్ని తీసుకుంటారు.

• ఉపయోగాలివే ...!

ఖర్జూరాల్లో ఔషధగుణాలెక్కువ. ప్రతిరోజూ ఇవి తింటే కొలెసా్ట్రల్‌ తగ్గుతుంది. గుండె సమస్యలు దూరమవుతాయి. బ్లడ్‌ ప్రెషర్‌ను నియంత్రిస్తాయి. ఎముకల పటుత్వాన్ని పెంచుతాయి. వీటిని తినడం వల్ల అనీమియాతో పాటు అలర్జీలు తగ్గిపోతాయి. రక్తహీనత సమస్య తొలిగిపోతుంది. కంటి చూపు మెరుగవుతుంది. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. గర్భిణిలు ప్రసవానికి నాలుగువారాల ముందు నుంచి రోజూ కనీసం నాలుగు ఖర్జూరాల్ని తింటే ప్రసవం సులువుగా అవుతుందని పరిశోఽధకులు చెబుతున్నారు.

• వైద్యంలో ఖర్జూరాలు 

ఎండాకాలంలో ఖర్జూరాల్ని నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. వీటిలోని టానిన్‌ పెద్దపేగులోని సమస్యలకు చెక్‌పెడుతుంది. ఖర్జూరాల నుంచి తీసిన గుజ్జును తీసుకుంటే జలుబు, శ్లేష్మం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోతాయి. కిడ్నీలోని రాళ్లను కరిగిస్తాయి. యూరినల్‌ ఇన్‌ఫెక్షన్లను నియంత్రిస్తాయి. 

• ఆహా.. ఏమిరుచి! 

ఖర్జూరాలతో తయారు చేసిన కేక్స్‌, సలాడ్స్‌ రుచికరంగా ఉంటాయి. చిప్స్‌, బిస్కెట్స్‌, చాక్లెట్స్‌ను కూడా వీటితో తయారు చేస్తున్నారు. హల్వా, లడ్డూలు, పాయసం చేసుకుని ఆరగించవచ్చు. అరబ్‌ దేశాలతో పాటు యూరప్‌ దేశాల్లోఖర్జూరాలతో నోరూరించే వంటకాలు తయారు చేస్తుంటారు. 


ఖర్జూరాల ఖజానా
ఖర్జూరాల్లో పోషక విలువలు ఎక్కువ. కాల్షియం, ఐరన్‌, పాస్ఫరస్‌, విటమిన్‌ ఎ, విటమిన్‌ బి పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్‌గా వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రుచితో పాటూ ఆరోగ్యాన్నిచ్చే ఖర్జూరాల గురించి తెలుసుకుందాం...!
ఖర్జూరాల్ని ప్రొటీన పవర్‌హౌస్‌ అంటారు. ఈ ఎడారి పళ్లకు ఓ విశిష్టత ఉంది. ఏ పండైనా మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తియ్యగా ఉంటుంది. ఇదో సంప్రదాయఫలం. ఖర్జూరాలతో తయారు చేసే ఆహార పదార్థాలు రంజాన్‌ సమయంలో ముస్లింలు ఇష్టంగా తీసుకుంటారు. ప్రపంచంలో చాలామంది ఖర్జూర ప్రియులే.


పచ్చి ఖర్జూరాల్ని తింటారా? 

ఎండు ఖర్జూరాలే కాదు పచ్చి ఖర్జూరాలునూ తినొచ్చు. వీటినే మార్కెట్లో తాజా ఖర్జూరాలు అని పిలుస్తారు. ఇవి తియ్యగా, కరకరలాడుతూ ఉంటాయి. ఇవి ఎండు ఖర్జూరాల్లా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. పైగా ఎండు ఖర్జురాల్లో ఉన్నన్ని ఔషధ గుణాలు వీటిలో ఉండవు.