WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Recipes `n' Recipes. Show all posts
Showing posts with label Recipes `n' Recipes. Show all posts

Wednesday, 6 July 2016

MASALA FRIED FISH RECIPE


మసాలా ఫ్రైడ్ ఫిష్

కావలసిన పదార్థాలు:

చేప : 1
ఉల్లిపాయ : 1
అల్లంవెల్లుల్లి ముద్ద : 1tbsp
ఎండుకొబ్బరి: అర చెక్క,
గసాలు: 1tsp
ధనియాల పొడి : 2tsp
జీలకర్ర పొడి: 1tsp
గరంమసాలా: 2tsp
కారం: 2tsp
పసుపు: కొద్దిగా
ఉప్పు: రుచికి తగినంత
నూనె : కావలసినంత

తయారుచేయు విధానం:

1. చేపని శుభ్రంగా కడిగి పొలుసు తీసేయాలి. చేప పొట్ట భాగంలో కోసి లోపలిభాగం కూడా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు చేపకి రెండు వైపులా కత్తితో గాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

2. మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద , ఎండుకొబ్బరి ముక్కలు, గసాలు, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

3. తర్వాత రుబ్బుకొన్న పేస్ట్ లో చేపని వేసి రెండు వైపులా మసాలా పట్టేలా చేయాలి. ఓ పావుగంట సేపు నానాక స్టౌ మీద మందపాటి గిన్నెలేదా పాన్ పెట్టి సరిపడా నూనె వేసి బాగా కాగాక చేపని అందులో వేసి రెండు వైపులా ఎర్రగా వేగించాలి. అంతే ఫ్రైడ్ ఫిష్ రెడీ.

CHILLI EGG IDLI RECIPE


చిల్లీ ఎగ్‌ ఇడ్లీ

* కావలసినవి:
చిట్టి ఇడ్లీలు: 15(లేదంటే 8 పెద్ద ఇడ్లీలు), ఉడికించిన గుడ్లు: 2, ఉల్లిపాయ: ఒకటి, అల్లం: అంగుళం ముక్క, వెల్లుల్లిరెబ్బలు: 3, పచ్చిమిర్చి: 2, కరివేపాకు: రెబ్బ, క్యాప్సికమ్‌: ఒకటి, చిల్లీసాస్‌: టేబుల్‌స్పూను, షెజువాన్‌ సాస్‌: టేబుల్‌స్పూను, టొమాటో కెచప్‌: టేబుల్‌స్పూను, ఉల్లికాడల తురుము: కొద్దిగా, కొత్తిమీర తురుము: కొద్దిగా, నూనె: టేబుల్‌స్పూను, ఉప్పు: రుచికి సరిపడా

* తయారుచేసే విధానం:
ఇడ్లీలను కావలసిన సైజులో ముక్కలుగా చేయాలి. చిట్టి ఇడ్లీలను కూడా రెండు ముక్కలుగా చేయాలి. ఉడికించిన కోడిగుడ్లలో పచ్చసొనను తీసేసి తెల్లసొనను మాత్రం చిన్నముక్కలుగా కోయాలి.బాణలిలో నూనె వేసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లిముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చితురుము వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు వేసి వేగాక క్యాప్సికమ్‌ ముక్కలు, ఉప్పు కూడా వేసి వేయించాలి. అవి వేగాక చిల్లీ సాస్‌, టొమాటో కెచప్‌, షెజువాన్‌ సాస్‌ వేసి కలపాలి. తరవాత ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలపాలి.చివరగా తెల్లసొనముక్కలు వేసి, ఉల్లికాడల తురుము, కొత్తిమీర తురుము వేసి అందించాలి.

THAI BAJJI RECIPE


థాయ్‌ బజ్జీ

* కావలసినవి 

దోరగా పండిన అరటిపండ్లు: నాలుగు, బియ్యప్పిండి: కప్పు, 
మైదాపిండి: కప్పు, పంచదార: అరకప్పు, కొబ్బరితురుము: అరకప్పు,
ఉప్పు: రుచికి కొద్దిగా, బేకింగ్‌సోడా: టీస్పూను, నువ్వులు: టేబుల్‌స్పూను,
నూనె: వేయించడానికి సరిపడా

- తయారుచేసే విధానం

* అరటిపండ్లు తొక్క తీసి కాస్త మందంగా పొడవాటి స్లైసులుగా కోయాలి.

* బేకింగ్‌సోడాలో ముప్పావుకప్పు నీళ్లు పోసి కలపాలి.

* వెడల్పాటి గిన్నెలో మైదా, బియ్యప్పిండి, ఉప్పు, పంచదార, కొబ్బరితురుము, నువ్వులు వేసి కలపాలి. తరవాత బేకింగ్‌సోడా కలిపిన నీళ్లు పోసి కలపాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి పిండిని కాస్త జారుగా కలుపుకోవాలి.

* బాణలిలో నూనెపోసి బాగా కాగాక అరటిపండు స్లైసుల్ని పిండిలో ముంచి తీసి నూనెలో వేసి వేయించాలి. రెండుమూడు చొప్పున అన్నీ వేయించుకుని తీసి బ్లాటింగ్‌పేపర్‌తో అద్ది అందించాలి.

NAATU KODI PALAV RECIPE


నాటు కోడి పలావ్‌

* కావలసినవి 
బాస్మతిబియ్యం: అరకిలో, నాటుకోడిమాంసం: అరకిలో, ఉల్లిపాయలు: రెండు, పచ్చిమిర్చి: ఆరు, అల్లంవెల్లుల్లి: 4 టీస్పూన్లు, కారం: 4 టీస్పూన్లు, గరంమసాలా: టీస్పూను, నూనె: 4 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, పుదీనా: 2 కట్టలు, కొత్తిమీర: కట్ట, టొమాటో: రెండు, పసుపు: అరటీస్పూను, అనాసపువ్వు: చిన్నముక్క, జాజికాయ పొడి: పావు టీస్పూను, జాపత్రి: ఒకటి, కొబ్బరి పాలు: అరలీటరు, నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు

* తయారుచేసే విధానం
కోడి మాంసాన్ని కడిగి, ఉప్పు, కారం, సగం అల్లంవెల్లుల్లి కలిపి నానబెట్టాలి. బియ్యం కడిగి నానబెట్టాలి. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ముద్దగా చేయాలి. ఓ గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయల్ని వేయించాలి. పచ్చిమిర్చి, మిగిలిన అల్లంవెల్లుల్లి, గరంమసాలాపొడి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకుముద్ద వేసి బాగా వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన మాంసం వేసి మూతపెట్టి ఉడికించాలి. మాంసం ఉడికాక టొమాటో ముక్కలు, కొబ్బరిపాలు వేసి మూతపెట్టి ఓ రెండు నిమిషాలు మరిగించాలి. ఉప్పు సరిచూడాలి. ఇప్పుడు బాగా నానిన బియ్యం వేసి మూతపెట్టి సన్నని మంట మీద ఉడికించాలి. దించేముందు అనాసపువ్వు, జాజికాయపొడి, నెయ్యి వేసి కలిపి వడ్డించాలి.

BEERAKAYA GARELU RECIPE


బీరకాయ గారెలు

* కావలసినవి:
బీరకాయలు: పావుకిలో, మినప్పప్పు: 200గ్రా., పండుమిర్చి:నాలుగు, పచ్చిమిర్చి: మూడు, ఉప్పు: రుచికి సరిపడా, కరివేపాకు: రెబ్బ, అల్లం తురుము: 2 టేబుల్‌స్పూన్లు,జీలకర్ర: టీస్పూను, నూనె: తగినంత

* తయారుచేసే విధానం:
మినప్పప్పుని రాత్రే నానబెట్టాలి.బీరకాయ తొక్కుతీసి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి.పండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలుగా కోయాలి. వీటికి అల్లంతురుము, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర చేర్చి మిక్సీలో రుబ్బాలి. తరవాత బీరకాయ ముక్కలు, నానబెట్టిన పప్పు వేసి మెత్తగా రుబ్బాలి.మిశ్రమాన్ని గారెల మాదిరిగా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.

MAZZIGA IDLI - IDLI WITH BUTTERMILK RECIPE


మజ్జిగ ఇడ్లీ

* కావలసినవి: 
బొంబాయిరవ్వ: రెండున్నర కప్పులు, మజ్జిగ: 4 కప్పులు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు,
ఉప్పు: రుచికి సరిపడా, మినపప్పు: టీస్పూను, సెనగపప్పు: టీస్పూను, ఆవాలు: టీస్పూను, తాజా కొబ్బరితురుము: 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు(సన్నగా తరగాలి), కరివేపాకు: 2 రెబ్బలు, ఇనో ఫ్రూట్‌ సాల్ట్‌: టేబుల్‌స్పూను.

* తయారుచేసే విధానం:

* ఓ గిన్నెలో బొంబాయిరవ్వ, మజ్జిగ, 2 టేబుల్‌స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి అరగంటసేపు పక్కన ఉంచాలి.

* చిన్న పాన్‌లో మిగిలిన నూనె వేసి కాగాక, మినప్పప్పు, సెనగపప్పు, ఆవాలు వేసి వేయించాలి. ఇప్పుడు కొబ్బరితురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఓ నిమిషం వేయించి రవ్వ మిశ్రమంలో కలపాలి. ఇష్టమైతే క్యారెట్‌ తురుము, జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు. చివరగా ఫ్రూట్‌సాల్ట్‌ వేసి దానిమీద కొద్దిగా నీళ్లు పోయాలి. బుడగలు రాగానే పిండిమిశ్రమంలో కలిసేలా మృదువుగా కలపాలి.

ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్‌లో సుమారు 8 నుంచి 10 నిమిషాలు ఆవిరిమీద ఉడికించి దించాలి.

Wednesday, 25 May 2016

Bengali Style Fish Curry Recipe


కావల్సిన పదార్థాలు: రఘుఫిష్ (కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి) - 4 pieces బంగాళదుంపలు - 2 medium sized (cut into quarters) ఉల్లిపాయలు - 2 (finely chopped) టమోటోలు - 1 (finely chopped) నిమ్మరసం - 1 teaspoon పెరుగు - 1 teaspoon అల్లం పేస్ట్ - 2 teaspoon వెల్లుల్లిపేస్ట్ - 2 teaspoon పచ్చిమిర్చిపేస్ట్ - 2 teaspoon ఆవనూనె - 4-5 teaspoon టమోటో గుజ్జు - 1 teaspoon పసుపు - 1/4 teaspoon జీలకర్ర పొడి - 1 teaspoon కారం - According to taste ఉప్పు - According to taste పంచదార - 1 teaspoon గరం మసాలా - 1/2 teaspoon బిర్యానీ ఆకు- 2 మసాలా దినుసులు - (దాల్చిన చెక్క: 1 small piece, లంగాలు: 2, యాలకలు: 2) ఎండుమిర్చి - 1 (optional) ఫ్లేవర్ కోసం (జీలకర్ర, సోంపు, మెంతి, కలోంజి, ఆవాలు) - 1/4 teaspoon నెయ్యి - ½ TSP నీళ్ళు కొత్తిమీర గార్నిష్ కోసం

తయారుచేయు విధానం: 1. ముందుగా చేపముక్కలను బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. 2. తడి ఆరిన తర్వాత వాటికి ఉప్పు, పసుపు, పెరుగు, మరియు నిమ్మరసం చేర్చి బాగా మిక్స్ చేసి 20 నిముషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3. తర్వాత పాన్ లో ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను వేసి 5నిముషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 3.ఇప్పుడు బంగాళదుంపలను బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసి పెట్టుకోవాలి . 4. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. 5. ఇప్పుడు అందులోనే జీలకర్ర, సోంపు, మెంతి, కలోంజి, ఆవాలు, ఎండు మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. 6. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో పసుపు, జీలకర్ర, మరియు కారం , సరిపడా నీళ్ళు సోయాలి. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద బాయిల్ చేయాలి . తర్వాత అందులోనే టమోటో గుజ్జు కూడా వేసి ఉడికించుకోవాలి. దాంతో ఆయిల్ వేరుపడుతుంది. 7. ఈ మసాలాలతోనే బంగాళదుంప చేర్చి బాగా ఉడికించుకోవాలి . దాంతో మసాలన్నీ కూడా బంగాళదుంపలకు బాగా పడుతాయి . తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. 8. బంగాళదుంప మెత్తగా ఉడికిన తర్వాత 1/2 వాటర్ వేసి ఉడికించుకోవాలి. 9. బంగాళదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో చేపముక్కలు మరియు సన్నగా తరిగిన టమోటో ముక్కలు వేసి 5నిముషాలు ఉడికించుకోవాలి. 10.చేపముక్కలు మీడియంగా ఉడికినట్లు తెలియగానే స్టౌ ఆఫ్ చేయాలి . తర్వాత గరం మసాలా కొద్దిగా చిలకరించి బాగా మిక్స్ చేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బెంగాలి ట్రెడిషినల్ ఫిష్ కాలీ రిసిపి రెడీ.

Healthy Kesar Pista Milk Shake


కావల్సిన పదార్థాలు: పిస్తాచో(పిస్తాపప్పు)-1cupకేసర్(కుంకుమపువ్వు)- కొద్దిగా బాదం:1/2cup పంచదార: 11/2cup యాలకలు: 4-5 పాలు: 1ltr 

తయారుచేయు విధానం: 1. ముందుగా బాదం మరియు పిస్తాలను రెండు డిఫరెంట్ బౌల్స్ లో విడివిడిగా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2. 6 గంటల తర్వాత , గిన్నెలో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. 3. పాలను బాగా మరిగించి , మంట తగ్గించి మరికొంత సేపే బాగా పాలు కాచాలి. 4. ఇప్పుడు ఒక మిక్స్ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకొన్న బాదం, పిస్తా మరియు యాలకలు వేసి మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి . మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 5.ఇప్పుడు ఈ పేస్ట్ ను కాగుతున్న పాలలో వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు అదే పాలలో పంచదార వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత చివరగా కొద్దిగా కుంకుపువ్వు చిలకరించాలి. 6. పాలను తక్కువ మంటలోనే ఉడికించుకోవాలి. 7. పాలు కొద్దిగా చిక్కపబడుతున్నప్పుడు స్టౌ ఆఫ్ చేసి, ఈ మిల్క్ షేక్ గది ఉష్ణోగ్రతలో చల్లారనివ్వాలి.

SIMPLE AND SPICY MANGO PICKLE RECIPE MAKING TIPS


నోరూరించే పుల్లటి మామిడికాయ పచ్చడి 

పచ్చిమామిడియ- 1 cup (chopped) బెల్లం: 1/2 cup ఎండు మిర్చి: 5 to 6 ఆవాలు:1tps కరివేపాకు : 8 to 10 కొబ్బరి తురుము: 1/2 cup కొత్తిమీర : 4 to 5 ఉప్పు రుచికి సరిపడా 

తయారుచేయు విధానం: 1. ముందుగా ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అందులో పచ్చిమామిడికాయ ముక్కలు వేయాలి. 2. ఈ బౌల్ స్టౌ మీద పెట్టి మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి. 3. అంతలోపు , మరో బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేసి, బెల్లం తురము వేసి చిక్కటి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాిలి. 4. ఇప్పుడు మెత్తగా ఉడికిన మామిడి ముక్కలనుండి అదనపు నీరు పక్కకు వంపేసుకోవాలి. తర్వాత ముక్కలను మిక్సీ జార్లో వేయాలి. 5. ఇప్పుడు అందులోనే ముందుగా వేగించి పెట్టుకొన్న ఎండు మిర్చి , కొబ్బరి తురుము వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి. 6. ఇప్పుడు స్టౌ మీద మరో పాన్ పెట్టి అందులో బెల్లం నీటినివేసి కొద్దిగా సేపు ఉడికించుకోవాలి. 7. కొద్దిసేపటి తర్వాత అందులో మిక్సీ చేసి పెట్టుకొన్ని మామిడికాయ పచ్చడి వేయాలి మొత్తం మిశ్రమాన్ని కలగలుపూత ఉడికించాలి. 8. అవసరం అయితే కొద్దిగా నీరు, ఉప్పు వేసి బాగా ఉడికించి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.

Monday, 16 May 2016

GUTTHI AVAKAYA PICKLE


గుత్తి ఆవకాయ

• కావల్సినవి: మామిడికాయలు - చిన్నవి ఇరవై అయిదు, కారం, ఆవపిండి, ఉప్పు, పప్పునూనె - కేజీ చొప్పున, మెంతులు - పావులో సగం, సెనగలు - అరకప్పు, పసుపు - కొద్దిగా.

• తయారీ: కారం, జల్లించిన ఆవపిండి, ఉప్పు, మెంతులు, సెనగలు, పసుపు తీసుకుని బాగా కలిపిపెట్టుకోవాలి. మామిడికాయాల్ని కడిగి తుడిచి ముక్కలు చేయకుండా గుత్తివంకాయకు తరిగినట్లు నాలుగు భాగాలుగా చేసుకోవాలి. కాయ విడిపోకుండా జీడిని నెమ్మదిగా తొలగించాలి. కారంలో గ్లాసు నూనె చేర్చి తడిపొడిగా కలిపి పెట్టుకోవాలి. జాడీలో కొద్దిగా నూనె వేసి తడిపొడిగా ఉన్న పిండిని గుప్పెడు అడుగున వేయాలి. మిగతా పిండిలో నూనె కలిపి ఈ మిశ్రమాన్ని కాయల్లో కూరి జాడీలో సర్దాలి. పైన కొద్దిగా నూనె వేసి మూతపెట్టేయాలి. మూడో రోజున ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా తిరగ కలిపితే సరిపోతుంది. పసందైన గుత్తి ఆవకాయ సిద్ధం.

Wednesday, 27 January 2016

MANGO BRINJAL FRY RECIPE IN TELUGU


వంకాయ+మామిడికాయ వేపుడు

కావాల్సిన పదార్ధాలు ;-

వంకాయలు -- అర కేజీ
మామిడికాయ -- సగం కాయ
ఉప్పు -- ఒకటిన్నర టీ స్పూన్స్
కారం -- రెండు టీ స్పూన్స్
సెనగపిండి -- ఒక టేబుల్ స్పూన్
ఎం . టి . అర్ సాంబార్ పౌడర్ -- ఒకటిన్నర టేబుల్ స్పూన్స్
నూనె -- రెండు టేబుల్ స్పూన్స్

తయారుచేసే విధానం ;-

ముందుగ వంకాయలను ముక్కలుగా తరిగి పెట్టుకుని , ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాలి . తరువాత మామిడికాయను ముక్కలుగా తరిగి మెత్తని గుజ్జులాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి . ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో నూనే వేసి ఉప్పు వంకాయ ముక్కలు వేసి వేయించాలి . వేగిన వంకాయలో మామిడి గుజ్జు వేసి ఐదు నిముషాలు వేయించి సెనగపిండి వెయ్యాలి . మళ్లీ ఐదు నిముషాలు ఆగి ఎం . టి . అర్ పౌడర్ వేసి కారం వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచి దించేయాలి . అంతే ఘుమఘుమ లాడే పుల్లపుల్లగా ,కారం కారంగా వంకాయ+మామిడికాయ వేపుడు రెడీ 

BUTTERMILK MAGAYA RECIPE


మజ్జిగ మాగాయ
కావాల్సిన పదార్ధాలు .;-

మాగాయ --- రెండు దోసేడులు
ఉప్పు -- ఒక స్పూన్
పెరుగు -- 4గరిటెలు
ఆవాలు -- అర టీ స్పూన్
మెంతులు -- ఒక టీ స్పూన్
ఇంగువ -- ఒక టీ స్పూన్
పచ్చిమిరపకాయలు --- 12
ఎండుమిరపకాయలు --- 8

తయారుచేసే విధానం ;-

ముందుగ ఒక గిన్నెలోకి జాడీ లోనుంచి మగయను తీసి పెట్టుకోవాలి . ఇప్పుడు ఒక బాండి ను తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో 3టీ స్పూన్స్ నూనె వేసి ఆవాలు , మెంతులు ,ఇంగువ ,ఎండుమిరప ముక్కలు వేసి పోపును దోరగా వేగనివ్వాలి . అందులోనే ఇప్పుడు పచ్చిమిరప ముక్కలు ,ఉప్పు వేసి ఒక రెండు నిముషాలు ఆగి పెరుగును కొద్దిగా నిల్లు పోసి ఒక ఐదు నిముషాలు వుంచి దించేయాలి . ఈ పోపును పక్కన పెట్టుకున్న మగయలొ వేసి బాగా కలపాలి . మాగాయ ముక్కలను చేతితో చిన్న చిన్న ముక్కలుగా చిదిమితే మజ్జిగ మగయకి రుచి పెరుగుతుంది . అంతే ఘుమఘుమ లాడే మజ్జిగ మాగాయ రెడీ .... ఇది దోసకాయ పప్పుకి మంచి జోడి 

MIRCHI RECIPE IN TELUGU


మిరపకాయ కూర

కావాల్సిన పదార్ధాలు ;-

మిరపకాయలు --- పావు కేజీ
సెనగపిండి -- 4టేబుల్ స్పూన్స్
ఉప్పు -- ఒకటిన్నర టీ స్పూన్స్
కారం -- ఒక టీ స్పూన్
నూనె -- ఒక టీ స్పూన్
వాము -- అర టీ స్పూన్

తయారుచేసే విధానం ;-

ముందుగ మిరపకాయలను బాగా కడిగి మధ్యలో చీల్చి పెట్టుకోవాలి . తరవాత ఒక గిన్నెలో సెనగపిండి ,ఉప్పు ,వాము ,కారం ,నూనె వేసి బాగా కలిపి చీల్చి పెట్టుకున్న మిరపకాయలలో కూరాలి . ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి కూరిన మిరపకాయలు వేసి సన్నటి సెగ మీద మాడకుండా మధ్య మధ్య లో గిన్నెను కదుపుతూ వేయించాలి . వేగిన కూర మీద ఇందాక మనం మిరపకాయలలో కూరటానికి తయారుచేసిన పొడిని జల్లి రెండు నిముషాలు ఉంచి దించేయాలి . అంతే ఘుమఘుమ లాడే మిరపకాయ కూర రెడీ ............... వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని ఈ కూర తో తింటే చాల బావుంటుంది ... కారం తినలేని వారు రెండు టీ స్పూన్స్ చింతపండు రసం కలిపి పొడిని కూరుకుని చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది 

Tuesday, 22 December 2015

PARTY DISH BEETROOT BIRYANI RECIPE


బీట్‌రూట్ బిర్యానీ

కావలసిన పదార్థాలు:
బీట్‌రూట్ - రెండు
బియ్యం -మూడు కప్పులు
ఉల్లిపాయలు - రెండు
పుదీనా - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
పచ్చి మిరపకాయలు - ఆరు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
ధనియాల పొడి - రెండు స్పూన్లు
గరం మసాలా - ఒక స్పూను
కారం - రెండు స్పూన్లు
పసుపు - చిటికెడు
మిరియాలు - కొద్దిగా
మసాలా ఆకు - నాలుగు
ఉప్పు, నూనె - తగినంత

తయారుచేసే విధానము

1. ముందుగా నీళ్ళల్లో బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి.
2. తరువాత బీట్‌రూట్‌ని తురుముకోవాలి. ఒక గిన్నెలో తగినంత నూనె పోసుకొని వేడి అయ్యాక అందులో మసాల ఆకు వేసి వేయించుకోవాలి.
3. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అందులో బీట్‌రూట్, అల్లం వెల్లుల్లి వేసి మరో ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి.
4. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాల పొడి, కారం, పసుపు, మిరియాలు, తగినంత ఉప్పు వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి.
5. వేగాక అందులో నానబెట్టిన బియ్యాన్ని వేసి రెండు నిముషాల పాటు వేయించి అందులో సరిపడా నీళ్ళు పోసి మీడియం మంట మీద అన్నం పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి.
అంతే బీట్‌రూట్ బిర్యానీ రెడీ.

Sunday, 20 December 2015

MAKING INFORMATION OF GARAM MASALA IN TELUGU - KITCHEN TIPS FOR PREPARATION OF GARAM MASALA AND ITS DIFFERENT TYPES OF INDIAN SPICES USING TO MAKE GARAM MASALA


గరం మసాలా..రకరకాలుగా

• వంటల్లో గరం మసాలా వాడాల్సి వచ్చినప్పుడు ఇదివరకు బయట కొన్న పొడి వేసేదాన్ని. కానీ అది అన్ని కూరలకూ నప్పడంలేదు. దాంతో నేనే ఇంట్లో గరం మసాలా తయారుచేసి వాడా. అయినా కూరలకి రుచి రాలేదు. దీనికి కారణమేంటీ.. గరం మసాలా ఇంకా ఎన్ని రకాలుగా చేయొచ్చు? - కావ్యశోభ, అమలాపురం
* మనం సాధారణంగా లవంగాలూ, యాలకులూ, దాల్చినచెక్కతో పాటూ కొద్దిగా మిరియాలూ, జీలకర్రా, గసగసాలూ కలిపి మసాలా తయారుచేసుకుంటాం. బహుశా మీరూ అలాగే చేస్తుండొచ్చు. వాటికి ఈసారి అనాసపువ్వు పొడీ, ఒక చిటికెడు జాజికాయపొడి కూడా కలిపి చూడండి. కొంత ఘాటు వస్తుంది. రుచిలోనూ మార్పు ఉంటుంది. మీ సమస్యకు మరో పరిష్కారం.. వివిధ రకాల గరంమసాలాలూ వాడిచూడటమే. ముఖ్యంగా కేరళా, పంజాబీ, గుజరాత్‌లలో వాడే గరంమసాలా చాలా విభిన్నమైన రుచుల్ని అందిస్తాయి. వాటినోసారి ప్రయత్నించండి..!
• పంజాబ్‌ గరంమసాలా మిగిలిన వాటితో పోలిస్తే ప్రత్యేక రుచితో ఉంటుంది. ఈ పొడిని కేవలం శాకాహార, మాంసాహార కూరల్లోనే కాదు, పప్పుల్లోనూ వేస్తుంటారు. దీనికోసం అరకప్పు ధనియాలకు, పావుకప్పు జీలకర్రా, తొమ్మిది పది దాల్చిన చెక్క ముక్కలూ, రెండు టేబుల్‌స్పూన్ల లవంగాలూ, పన్నెండు యాలకులూ, రెండు టేబుల్‌స్పూన్ల చిన్న యాలకులూ, ఒకటిన్నర టేబుల్‌స్పూను మిరియాలూ, అంగుళం పొడవున్న శొంఠి ముక్కా, ఒక జాజికాయను తీసుకోవాలి. అలాగే పది బిర్యానీ ఆకుల్ని కూడా వేసుకుని అన్నింటినీ దోరగా వేయించి పొడిలా చేసుకుంటే చాలు.
• కేరళ ప్రాంతంలో వాడే గరంమసాలా పొడి ఘాటు తక్కువగా, కమ్మగా ఉంటుంది. యాలకులూ, లవంగాలూ, దాల్చినచెక్కతోపాటూ చిన్న జాజి పువ్వు ముక్కా, కప్పు జీలకర్ర కూడా వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే గరంమసాలా పొడిలోనే చిటికెడు చొప్పున శొంఠిపొడీ, ఇంగువా, ఐదారు ఎండుమిర్చీ, చెంచా కసూరీమేథీ, తగింత ఉప్పు, కొద్దిగా పసుపూ కలిపి పొడికొడతారు. గుజరాతీ గరమంమసాలా రుచి కూడా భిన్నంగానే ఉంటుంది. ఇందులో లవంగాలూ, దాల్చినచెక్కకు బదులు మూడు టేబుల్‌స్పూన్ల కొబ్బరిపొడీ, ఒక టేబుల్‌స్పూను నువ్వులూ, రెండు టేబుల్‌స్పూన్లు ఆవాలూ, కొద్దిగా మిరియాలూ, అరకప్పు ఆకుపచ్చని యాలకులూ, ముప్పావు కప్పు జీలకర్రా, పావుకప్పు జాజికాయపొడీ కలిపి తయారు చేస్తారు.
• ఏ తరహా మసాలా చేసుకుంటున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మసాలా తయారీలో ఉపయోగించే పదార్థాలను ఎండలో ఓ గంటసేపు ఉంచాలి. వేయించిన పదార్థాలన్నీ చల్లారాకే పొడి కొట్టాలి. తయారు చేసుకున్న పొడిని గాలితగలని డబ్బాలోకి తీసుకున్నప్పుడే అది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. గరంమసాలా మంచి సువాసనతో పాటూ కొద్దిగా తియ్యగా కూడా ఉండాలనుకుంటే అందులో ఓ టేబుల్‌స్పూను వేయించిన సోంపు కలుపుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి రంగూ, వాసన మసాలాకి వస్తాయి.

Tuesday, 15 December 2015

CREAMY VEG ROLL WITH CHINESE SALSA RECIPE


 క్రీమీ వెజ్‌ రోల్‌ విత్‌ చైనీస్‌ సల్సా 

* కావల్సినవి: బేబీకార్న్‌ - ఒకటి, క్యాలీఫ్లవర్‌ పువ్వులు - ఐదారు, క్యారెట్‌ - సగం ముక్క, క్యాబేజీఆకులు - రెండు, క్యాబేజీ తరుగు - టేబుల్‌స్పూను, చీజ్‌ తురుము - టేబుల్‌స్పూను, కారం - చెంచా, వెజిటబుల్‌ బ్రాత్‌పౌడర్‌ - అరచెంచా(బజార్లో దొరుకుతుంది), టొమాటోలు - మూడు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి ముక్కలు - చెంచా చొప్పున, చక్కెర - అరచెంచా, రాజ్‌మా - టేబుల్‌స్పూను, కొత్తిమీర - కట్ట, నువ్వులనూనె - చెంచా, నూనె - వేయించేందుకు సరిపడా, ఉప్పు - తగినంత, స్ప్రింగ్‌రోల్‌ షీట్లు - ఆరు (బజార్లో దొరుకుతాయి). లేదంటే వాటిని ఇలా తయారుచేసుకోవచ్చు. అందుకోసం: మైదా - కప్పు, ఉప్పు - పావుచెంచా, మొక్కజొన్నపిండి - మూడు చెంచాలు.

* తయారీ: ముందుగా స్ప్రింగ్‌రోల్‌షీట్లను తయారుచేసుకోవాలి. అందుకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో తీసుకుని నీళ్లతో చపాతీపిండిలా కలపాలి. తరవాత కొద్దిగా పిండి తీసుకుని వీలైనంత పల్చగా వత్తుకుని పెనంపై వేసి రెండు నిమిషాలు కాల్చి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలూ, టొమాటో తప్ప మిగిలిన కూర¹గాయలన్నింటినీ సన్నగా తరిగి వాటిపై చీజ్‌ తురుము వేయాలి. తరవాత తగినంత ఉప్పూ, వెజ్‌ బ్రాత్‌ పౌడర్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని పొడుగ్గా బులెట్‌లా చేసుకోవాలి. ఇలాగే మిగిలిన మిశ్రమాన్ని చేసుకోవాలి. తరవాత ఒక్కోదాన్ని ఒక్కో స్ప్రింగ్‌ రోల్‌ షీట్‌లో ఉంచి.. రోల్‌లా చుట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు చైనీస్‌సల్సా సిద్ధం చేసుకోవాలి. టొమాటోలు, ఉల్లిపాయను సన్నగా తరగాలి. ఈ ముక్కల్లో వెల్లుల్లి ముక్కలూ, కొత్తిమీర తరుగూ, పచ్చిమిర్చి తరుగూ, నువ్వుల నూనె, చక్కెరా, కారం, ఉడికించి ముద్దలా చేసిన రాజ్‌మా కలపాలి. తరవాత అందులో కొద్దిగా ఉప్పు కలపాలి. సల్సా తయారైనట్లే. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ముందుగా చేసుకున్న రోల్స్‌ని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకోవాలి. వీటిని సల్సాతో కలిపి వడ్డించాలి.

Thursday, 10 December 2015

PREPARATION OF CHICKEN TIKKA MASALA RECIPE


చికెన్ టిక్కా మసాలా 

కావల్సినవి: చికెన్ - 400 గ్రా (ముక్కల్లా కోయాలి), పెరుగు - కప్పు, జీలకర్రపొడి - చెంచా, ధనియాలపొడి - అరటేబుల్‌స్పూను, పసుపు - పావుచెంచా, అల్లంవెల్లుల్లి తరుగు - టేబుల్‌స్పూను చొప్పున, కారం - ఒకటిన్నర చెంచా, ఉప్పు - తగినంత.

గ్రేవీకోసం: ఉల్లిపాయలు - రెండు(ముక్కల్లా కోయాలి), ఎరుపురంగు క్యాప్సికం - ఒకటి, జీడిపప్పు - ఆరు, జీలకర్ర - టేబుల్‌స్పూను, ధనియాలపొడి - అరచెంచా, లవంగాలు - మూడు, దాల్చినచెక్క - అర అంగుళం ముక్క, యాలకులు - రెండు (లవంగాలూ, యాలకులూ, దాల్చినచెక్కనుపొడిలా చేసుకోవాలి), కసూరీమేథీ - టేబుల్‌స్పూను, క్రీం - పావుకప్పు, టొమాటో కెచెప్ - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - ఒకటిన్నర చెంచా, వెన్న - టేబుల్‌స్పూను, నూనె - అరకప్పు, ఉప్పు - తగినంత.

తయారీ: ఓ గిన్నెలో పెరుగూ, జీలకర్రపొడీ, ధనియాలపొడీ, పసుపూ, అల్లంవెల్లుల్లి తరుగూ, కారం, తగినంత ఉప్పూ వేసుకుని బాగా కలపాలి. ఇందులో చికెన్ ముక్కలు వేసి వాటికి ఈ మసాలా పట్టేలా కలిపి మూత పెట్టేయాలి. ఇప్పుడు క్యాప్సికంని సన్ననిమంటపై ఉంచి కాల్చుకోవాలి. అది కొద్దిగా నల్లగా అయ్యాక ఓ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టేయాలి. క్యాప్సికం చల్లారాక చెక్కూ, అందులోని గింజల్ని తీసేయాలి. ఈ క్యాప్సికంని ముక్కల్లా కోయాలి. ఇప్పుడు చికెన్‌ని గ్రిల్‌పై కాల్చుకోవాలి. లేదంటే బాణలిలో కొద్దిగా నూనె వేసి వేయించుకుని తీసుకోవాలి.

బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి ఉల్లిపాయముక్కల్ని వేయాలి. అవి వేగాక క్యాప్సికం ముక్కల్ని వేయాలి. రెండు నిమిషాల తరవాత దింపేసి ఈ రెండింటినీ మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. మరో బాణలిలో నూనె వేడిచేయాలి. అందులో లవంగాలూ, దాల్చినచెక్కా, యాలకులూ కలిపి చేసుకున్న పొడీ, జీలకర్రా, దనియాలపొడీ వేయాలి. తరవాత ఉల్లిపాయ మిశ్రమం, జీడిపప్పు పేస్టూ వేసి రెండుమూడు నిమిషాలు వేయించాలి. తగినంత ఉప్పూ, కారం, టొమాటో కెచెప్ వేయాలి. ఇందులోనే కసూరీమేథీ, క్రీం, వెన్నా వేసి బాగా కలపాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి మూత పెట్టేయాలి. కాసేపటికి చికెన్ ముక్కలకు ఆ మసాలా పట్టి.. కూరలా తయారవుతుంది. అప్పుడు దింపేయాలి. ఇది పల్చగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఈ కూర అన్నంలోకే కాదు, రొట్టెల్లోకీ బాగుంటుంది.

KALAKANDH SWEET MILK RECIPE


 కలాకండ్ 

కావల్సినవి: పాలు - రెండులీటర్లు, చక్కెర - అరకప్పు, యాలకులపొడి - చెంచా, బాదం గింజలు - పదిహేను, పిస్తా పలుకులు - పదిహేను, మామిడి పండు గుజ్జు- ముప్పావు కప్పు. 

తయారీ: వెడల్పాటి గిన్నెలో పాలను తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. కొద్దిగా వేడయ్యాక చక్కెర వేసి కలిపి మంట తగ్గించాలి. మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి పాలు కోవాలా తయారవుతుంది. ఇంతలో మామిడిపండు గుజ్జును ఓ గిన్నెలో తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. పదినిమిషాలకు ఇది కొద్దిగా చిక్కగా అవుతుంది. ఇందులో సన్నగా చేసుకున్న బాదం, పిస్తా పలుకులూ... యాలకులపొడీ వేసుకుని... దీన్ని కోవాలో కలపాలి. సన్నని మంటపై ఉంచి కలుపుతూ పది నిమిషాల తరవాత దింపేయాలి. ఇది పూర్తిగా చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచాలి. గంట తరవాత నచ్చినట్లుగా కోసుకోవచ్చు.

PREPARATION TIPS FOR AALU JONNA ROTTE RECIPE


ఆలూ జొన్న రొట్టె

కావల్సినవి: పచ్చ జొన్న పిండి - రెండు కప్పులు, ఉడికించి ముద్ద చేసిన ఆలూ - ముప్పావుకప్పు, ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు, కొత్తిమీర తరుగు - పావుకప్పు, అల్లం, పచ్చిమిర్చి పేస్టు - రెండు చెంచాలు, ఆమ్‌చూర్‌పొడి - చెంచా, గరంమసాలా - అరచెంచా, ఉప్పు - తగినంత. నెయ్యి - రెండు చెంచాలు. జొన్నపిండి - కొద్దిగా.

తయారీ: నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరవాత గోరువెచ్చని నీళ్లు చల్లుకుంటూ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కొద్దిగా తీసుకుని పొడి జొన్నపిండిి అద్దుకుంటూ చేత్తో రొట్టెలా తట్టుకుని పెనంపై వేసుకోవాలి. అరచెంచా నెయ్యి వేసుకుంటూ రెండువైపులా కాల్చుకుని తీసుకోవాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకోవాలి.

Wednesday, 2 December 2015

PREPARATION OF PANCHAMRUTHAM FOR PUJA


పంచామృతం అంటే

ఏ శుభకార్యం చేయవలసి వచ్చినా పంచామృతం తప్పనిసరిగా ఉపయోగిస్తాము. గుడిలో అభిషేకం చేయవలసి వచ్చినా పంచామృతం వుంటుంది. మనం గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రసాదంతోబాటు తీర్ధంగా కొబ్బరినీళ్ళు ఇస్తారు. వీటితో పాటు కొన్నిసార్లు పంచామృతాన్ని కూడా ఇస్తారు. కొన్ని దోషాల నివృత్తి కోసం పంచామృతంతో అభిషేకాన్ని సూచిస్తారు జ్యోతిష్యవేత్తలు, పండితులు. దాన్ని బట్టే పంచామృతం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.

పంచామృతం అంటే….

పంచదార, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఈ అయిదింటిని కలిపి పంచామృతంగా చేస్తారు. ఇక్కడ పాలు అంటే ఆవుపాలు అని అర్థం. పెరుగు, స్వచ్చమైన నెయ్యి, తేనె, చక్కెరలను ఆవుపాలలో కలుపుతారు. భక్తి పరమైన విషయాలను పక్కన పెడితే ఈ అయిదు పదార్థాలూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి! అది ఎలాగో ప్రస్తుత వైద్య విజ్ఞానం ప్రకారమే చూద్దాం!

ఆవు పాలు......
ఆవును గోమాత అన్నారు. ఎందుకంటే, ఆవు పాలు తల్లి పాలతో సమానమైనవి. శ్రేష్టమైనవి. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. గేదెపాలకు మల్లేనే ఆవు పాలలో కూడా కాల్షియం అత్యధికంగా వుంటుంది. కాల్షియం చిన్న పిల్లల్లోనూ, పెద్దలలోనూ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పాలు నిజంగానే అమృతంలా పనిచేస్తాయి. పాలు ఎక్కువగా తాగటం వల్ల బరువు తగ్గుతారని పరిశోధనలలో వెల్లడైంది. పాలలో విటమిన్ ‘ఎ’ కూడా పుష్కలంగా వుంటుంది. ఇది అంధత్వం త్వరగా రాకుండా నివారిస్తుంది.

పెరుగు......
పెరుగులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పెగుగు కూడా త్వరగా జీర్ణం అవుతుంది. ఉష్ణ తత్వం వున్నవారికి పెరుగు అత్యధ్బుత ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులను నయంచేసే విషయంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని పరిశోధనలలో తేలింది. కేశ సంరక్షణలో కూడా పెరుగుకే అగ్రస్థానం వుంది. ఉదయం పూట పెరుగు తినటం ఆరోగ్యదాయకం. మన పూర్వీకులు పెరుగుతో అన్నం తిని పొలం పనులకు వెళ్ళేవారు. ఉదయం పూట గుడికి వెళ్ళి పెరుగుతో పంచామృతం తీసుకోవటం ఈ విధంగా చూసినా మంచిదే!

నెయ్యి.....
మేధాశక్తిని పెంచటంలో నేతిని మించింది లేదు. ఆయుర్వేదం ప్రకారం నేతితో తయారైన అరిసెల్లాంటి పదార్థాలు, నెయ్యితో వేయించిన జీడిపప్పు తదితర ఆహారపదార్థాలు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పిల్లలు తినే ఆహారంలో ప్రతిరోజూ నెయ్యి వుండేలా చూసుకోవాలి. దీనివల్ల ముఖం కాంతివంతం అవుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాలి. నెయ్యిలో ‘ఎ’ విటమిన్ వుంటుంది.

తేనె......
వేల సంవత్సరాల నుంచీ కూడా తేనెను పోషకాహారంగా ఉపయోగిస్తున్నారు. తేనె రుచిగా ఉండటము, మంచి పోషకాహారం కావడమే కాదు, ఇది ఒకరకంగా యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. తేనె సూక్ష్మ క్రిములతో శక్తివంతంగా పోరాడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను దగ్గరకు రానీయదు. తేనె ఆహార పదార్థాలు త్వరగా జీర్ణమయ్యేలా దోహదపడుతుంది. తేనెలో ఖనిజాలు చాలా ఎక్కువ స్థాయిలో వుంటాయి. తేనెను సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. తేనె చర్మ సంరక్షణలో అద్వితీయమైన పాత్రను పోషిస్తుంది. ఇకపోతే, పంచదార శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

ఇన్ని సుగుణాలున్న పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలయికతో రూపొందించిన పంచామృతం శరీరానికి ఎంత మేలు చేస్తుందో దీన్ని బట్టే అర్థమవుతోంది. కనుక ప్రసాదం రూపంలో తీసుకునే పంచామృతం ఎంతో మేలు చేస్తుంది.