WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Beautiful Hair Care Tips. Show all posts
Showing posts with label Beautiful Hair Care Tips. Show all posts

Saturday, 7 May 2016

HAIR CARE IN TRADITIONAL FORM USAGE TIPS


జుట్టు ఆరోగ్యానికి
కుంకుడుకాయలను వాడాలంటే కొంత శ్రమ ఉంటుంది. ఆ కాయలను చితక్కొట్టి, వాటిలో గింజలను తీసెయ్యాలి. వాటిని వేడి నీటిలో నానపెట్టి... ఆ రసంతో తలరుద్దుకునేవారు. ఆ తర్వాత శీకాకాయపొడి మార్కెట్లో లభించడం ఆరంభమయింది. ఆ పొడిని నీటిలో తడిపి, ఆ ముద్దతో తలరుద్దుకునేవారు. అయితే, ఈ రోజుల్లో శీకాకాయపొడి కాకుండా కుంకుడుపొడి కూడా లభిస్తోంది. చాలామంది, కుంకుడుకాయలను ఈ రోజుల్లో వాడటం లేదు. నిజానికి తలంటుకి కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెండ్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు రావు
ఈ రోజుల్లో షాంపూలు వచ్చాక చాలా మందికి కుంకుడు కాయలు సంగతి తెలియదు. తల రుద్దుకోవటానికి కుంకుడు కాయలను ఉపయోగిస్తాం. అలాగే క్లీనింగ్ కొరకు కూడా కుంకుడు కాయలు బాగా సహాయపడతాయి

జుట్టుకు కండిషనర్ మందార ఆకులు మరియు పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.
జుట్టు ఆరోగ్యం గా పెరగడానికి షాంపూల కంటే కుంకుడుకాయలు మందారఆకు పొడి వాడితే మంచిది

Thursday, 17 December 2015

HEALTHY HAIR BEAUTY TIPS TO INDIAN WOMEN IN TELUGU


మహిళలు ముఖ్యంగా భారతీయ వనితలు కురులకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. శిరోజాలు అందంగా, ఆకర్షణీయంగా, వత్తుగా పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు పొడుగాటిదైనా, పొట్టిదైనా, ఉంగరాలదైనా, నల్లగా ఉన్నా, లేదా బూడిద రంగులో ఉన్నా, పట్టులా మెరుస్తూ వత్తుగా ఉన్నప్పుడే అది ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తుంది. అందంగా, ఆరోగ్యంగా అలంకరించుకున్న జుట్టు స్త్రీకి 'క్రౌనింగ్‌ గోరి' లాంటిది. అంటే శిరోజాల సౌందర్యం స్త్రీకి మకుటం లాంటిదని.

డ్రై హెయిర్‌ : పొడిగాఉండే జట్టును డ్రైహెయిర్‌ అంటారు. ఈ రకం జుట్టు మృదుత్వం, మెరుపు లేకుండా రఫ్‌గా ఉంటుంది. ఎక్కువ సమయం ఎండలో గడిపే వారిలోనూ, పదే పదే వేడి గాలిలో జుట్టు ఆరబెట్టుకునే వారిలో ఎండిపోయిన జుట్టు కన్పిస్తుంది. ఇలాంటి వారికి ఆయిల్‌ మసాజ్‌ ఉపయోగంగా వుంటుంది. మసాజ్‌కు కొబ్బరి - ఆల్మండ్‌ ఆయిల్‌ లేదా బాదం ఆయిల్‌లను వాడవచ్చు. కొబ్బరినూనెను సన్నని సెగపైకాచి కొంచెం చల్లారనివ్వాలి. దూదిని గోరువెచ్చగా ఉన్న కొబ్బరినూనెలో ముంచి వెంట్రుకలను పాయలు పాయలుగా తీసి వెంట్రుకకు కుదుళ్ళకు అంటే విధంగా దూదితో ఈ వేడి నూనెను మాడుకు బాగా రుద్దాలి. ఆ తరువాత తలంతా మాలిష్‌ చేయాలి. తర్వాత వేడి నీటిలో ఒక టవల్‌ను ముంచి నీటిని పిండి అరగంటవరకు ఆ టవల్‌ను తలకి చుట్టుకోవాలి. తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల డ్రై హెయిర్‌లోని డల్‌నెస్‌ తగ్గి మృదుత్వం చేకూరుతుంది.

ఆయిలీ హెయిర్‌ : ఆయిలీ హెయిర్‌ ఉన్నవారి బాధ అంతాయింతాకాదు. జిడ్డుకారుతున్నట్లు కనిపించే జుట్టు ఎవరికైనా చిరాకు కలిగిస్తుంది. తైలపదార్ధం అవసరాన్ని మించి తలలో ఉత్పత్తికావడంవల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. తరచుగా తలస్నానంచేస్తూ ఉండడంద్వారా కొంతవరకు జిడ్డును వదిలించు కోవచ్చు. ముల్తాని మట్టిలో నిమ్మరసంపోసి తలంటుకుని స్నానం చేస్తే తైలపదార్థం తొలగిపోయి జిడ్డుకారకుండా వెంట్రుకలు నిగనిగలాడతాయి. అయిలీ హెయిర్‌ ఉన్నవాళ్ళు నూనెలు, మసాలా పదార్థాలు మానుకుని నెలకోసారి హెన్నాలో నిమ్మరసం చేర్చి తలకు పట్టించుకుని ఒక గంట తర్వాత స్నానం చేసినట్లయితే జిడ్డు వదిలిపోయి శుభ్రంగా ఆకర్షణీయంగా శిరోజాలు నిగ నిగలాడుతువుంటాయి. 

బిరుసుగా వుండే జుట్టు : ఇలాంటి జుట్టు మృదుత్వం లేని కారణంగా ఎండిపోయి జీవం కోల్పోయినట్లు ఉంటుంది. ఎంతదువ్వినాజుట్టు ఉన్నచోట ఉండక నానా ఇబ్బందులు కలిగిస్తుంది. వేసవిలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగానే కన్పిస్తుంది. వీరు హెన్నా ఉపయోగించడం వల్ల మంచిఫలితం వుంటుంది. శిరోజాల పోషణకు మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో దోహదంచేస్తుంది. జుత్తు ఆరోగ్యంగా ఉండాలంటే ఐరన్‌, జింక్‌, పొటాషియం, మెగ్నీషియం, బి కాంప్లెక్స్‌ విటమినులు పుష్కలంగా ఉండాలి. దోసకాయలు, తాజా ఆకు కూరలు, గుడ్లు, చేపలు, యాపిల్స్‌, ఉసిరిక, పాలకూర మొదలైనవి ఎక్కువగా వాడాలి.

Friday, 27 November 2015

STOP DANDRUFF WITH hibiscus-sembaruthi-flower-powder - mandara puvvu


మందారపూలను మెత్తగా నూరి తలకు పట్టించినట్లయితే చుండ్రు తగ్గిపోతుంది. పేనుకొరుకుడు కూడా తగ్గిపోతుంది.

చుండ్రుతో బాధపడే వారి సంఖ్య మనదేశంలో అధికంగా ఉందనే చెప్పాలి. అయితే చుండ్రు కొద్దిగా ఉన్న దశలో మెడికేటెడ్‌ సబ్బులను వాడనవసరం లేదు.

- మెడికేటెడ్‌ షాంపూలను తరచుగా వాడుతూ వాటితో గట్టిగా రుద్దుకోరాదు.

- కొద్దిగా గ్లిజరిన్‌ తీసుకుని తలకు బాగా పట్టించి మర్దన చేసి నాలుగు గంటలపాటు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోండి.

- ఇరవై నుండి ముప్పది నల్లమిరియాలును తీసుకుని వాటిని పొడిచేసి అరకప్పు పాలలో కలిపి తలకు మర్దన చేయండి. రాత్రంతా అలాగే ఉంచి మర్నాడు షాంపూతో శుభ్రం చేసుకోండి. ఇలా ముప్పదిరోజులు చేయాలి.

- ఒక టేబుల్‌స్పూన్‌ లెమన్‌ జ్యూస్‌ తీసుకుని రెండు చెంచాల కొబ్బరి నూనెతో కలిపి తలకు మర్దన చేయండి. నాలుగైదు గంటలపాటు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోండి.

Friday, 11 July 2014

MANSOON HAIR CARE TIPS IN TELUGU - BEAUTY TIPS FOR CARING HAIR IN RAINY SEASON IN TELUGU



వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు 

1) మీ జుట్టును పొడిగా ఉంచండి: సాధ్యమైనంత ఎక్కువ సమయం మీ జుట్టు పొడిగా ఉంచేందుకు ప్రయత్నించండి. సాధారణంగా మనం సుమారు 50-60 వెంట్రుకలను కోల్పోతాము, కానీ వర్షాకాల సమయంలో మనకు తెలియకుండా 200 వెంట్రుకలను కోల్పోతాము. ఇది అదనంగా జుట్టు రాలడ౦, చుండ్రు వంటి జుట్టు సమస్యలను నివారించి మీ జుట్టు ఎప్పుడూ పొడిగా ఉండేటట్లు చూసుకోండి 

2) తేలికపాటి షాంపూ లను ఉపయోగించండి: మీరు చుండ్రు, జుట్టురాలడమే కాకుండా తల జిడ్డుదనాన్ని కూడా కలిగిఉ౦డవచ్చు. అందువల్ల మీరు మీ జుట్టును ప్రతిరోజూ తేలికపాటి షాంపూ తో శుభ్రం చేయండి. ఆయిలీ జుట్టు కలవారు ప్రతిరోజూ షాంపూ పెట్టడానికి వేరొక కారణం కూడా ఉంది, మీ జుట్టు వర్షాకాలంలో దెబ్బతినవచ్చు, షాంపూ చేయడం వల్ల మాత్రమే మీ జుట్టు పరిమాణాన్ని పునరుద్దరించు కుంటుంది. ప్రతిరోజూ మీ జుట్టు వర్షానికి తడిస్తే ప్రతిరోజూ షాంపూ పెట్టండి.

3) ఆరోగ్యకరమైన జుట్టుకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన ఆహార పదార్ధం. అయితే, మీ జుట్టు అందంగా కనిపించాలి అనుకుంటే, చేపలు, గుడ్లు, కారెట్లు, తృణధాన్యాలు, ముదురు ఆకుపచ్చ కూరగయలు, చిక్కుళ్ళు, గింజలు, తక్కువ కొవ్వు ఉన్న పాలుత్పత్తుల వంటి ఎక్కువ ప్రోటీన్ గల ఆహారాన్ని తీసుకోవాలి.

4) కనీసం వారానికి ఒకసారి జుట్టుకు నూనె రాయడం : వారంలో ఒక సారి తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

5) పెద్ద పళ్ళ దువ్వేనను ఉపయోగించడం: పెద్ద పళ్ళు ఉన్న దువ్వెనను ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ కలగ కుండా ఉంటుంది. చిక్కు సులభంగా వస్తుంది.

6) జుట్టు తడిగా ఉన్నపుడు బిగి౦చకుండా ఉండడం: జుట్టు తేమగా ఉన్నప్పుడు ముడి వేసుకోవడం వల్ల కేశాలు పెళుసుగా తయారవుతాయి. జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది కనుక పూర్తిగా ఆరనివ్వండి.

Wednesday, 18 December 2013

MAINTAIN SHINY AND BEAUTIFUL HAIR IN RAINY SEASON - TIPS FOR HAIR CARE IN RAINY / WINTER SEASON



వర్షాకాలంలో తేమ కారణంగా, చెమటకారణంగా జుట్టు రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంది. వెంట్రు కలు మరింత జిడ్డుగా, డ్రై వెంట్రుకలు పొడిగా, నిర్జీవంగా మారిపోతాయి. చిట్లిపోతాయి. ఈ కాలంలో వెంట్రుకలు ఆరోగ్యంగా, మెరుస్తుండా లంటే 'హెయిర్‌స్పా' ట్రీట్‌మెంట్‌ చాలా అవసరం. ఈ ట్రీట్‌మెంట్‌ని పార్లర్‌లో తీసుకోవచ్చు లేదా ఇంట్లో చేసుకోవచ్చు.
'హెయర్‌స్పా' ట్రీట్‌మెంట్‌ కోసం ఒక గంట సమయం పడుతుంది. ఇందులో మసాజ్‌, మెషీన్‌, క్రీం, హెయిర్‌ మాస్క్‌ మొదలైనవి ఉపయో గిస్తారు. సాధారణంగా వెంట్రుకల్లో చెమట రావడం కారణంగా వెంట్రుకలు జిడ్డుగా మారతాయి. దీంతో స్కాల్ఫ్‌ పై మొటిమలు, చుండ్రు లాంటివి ఏర్పడి వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఇలాంటి వెంట్రుకలకు 'హెయిర్‌ స్పా' ట్రీట్‌మెంట్‌ అవసరం. 'హెయిర్‌ స్పా' ఇవ్వడానికి అన్నిటికన్నా ముందు వెంట్రుకలను షాంపు చేస్తారు. తర్వాత వెంట్రుకల టెక్టృర్‌, స్కాల్స్‌ అనుసరించి క్రీమును ఎంచుకుని 45 నిముషాల వరకు మసాజ్‌ చేస్తారు. ఆ తర్వాత మెషీన్‌తో వెంట్రుకలు, భుజాల్ని, వీపులో ఇలా చేస్తే వెంట్రుకలలో చెమట కారణంగా ఏర్పడే బ్యాక్టీరియా తొలగిపోతుంది.
ఆ తర్వాత 20 నిమిషాల హెయిర్‌ మాస్క్‌తో వెంట్రుకలకు షాంపూ చేస్తారు. ఈ 'హెయిర్‌ స్పా'తో వెంట్రుకలకు సంబంధించిన సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. వెంట్రుకలు సున్నితంగా మారతాయి. మెరుస్తుంటాయి. ఈ ట్రీట్‌మెంట్‌ను నెలలో 2సార్లు చేయిస్తే చాలు. కానీ వెంట్రుకలు ఎక్కువగా డ్రైగా ఉంటే 3 లేదా 4సార్లు కూడా చేయించవచ్చు.
ఇంట్లో 'హెయిర్‌ స్పా' చేసుకోవడానికి వేడినీళ్ళతో షాంపూ అప్లరుచేయండి. ఆ తర్వాత వేళ్ళ సహాయంతో వెంట్రుకల మూలాల్లో తేలికపాటి మసాజ్‌ చేయండి. వెంట్రుకలు నూనెతో తడిసేవరకు అలా చేయండి. ఆ తర్వాత వెంట్రుకలను 30నిమిషాల వరకు ప్లాస్టిక్‌ బ్యాగ్‌ చుట్టి ఉంచండి. అరగంట తర్వాత హెయిర్‌ మాస్క్‌ వేయండి. మాస్క్‌ను తయారుచేయడానికి ఒక పండిన అరటిపండు రెండు చెమ్చాల మ్యోనిజ్‌, ఒక చెమ్చావేసి కలిపి పేస్టు తయారుచేసుకోండి. మళ్ళీ గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా చేస్తే డ్రై వెంట్రుకలు మళ్ళీ షైనీగా మారతాయి. స్మూత్‌, సాఫ్ట్‌లుక్‌ వస్తుంది.

MAINTAINING BLACK HAIR SO BEAUTIFUL - HAIR CARE TIPS IN TELUGU




నిగనిగలాడే ఒత్తయిన నల్లని కురులు మీ సొంతం కావాలి అనుకుంటున్నారా ఈ క్రింది చిట్కాలు పాటించండి. రోజులో వీలైనంద పరిశుభ్రమైన నీరు. రోజుకు కనీసం 12 నుండి 14గ్లాసులు తాగితే శిరోజాలకే కాదు అన్ని విధాల ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలు జున్ను, జీడిపప్పు, పచ్చని ఆకుకూరలు, కూరగాయుల మీరు రోజు తీసుకునే ఆహారంలో ఉం డేలా చూసుకోండి. తలస్నానానికి ముందు పరిశుభ్రమైన కొబ్బరినూనె శిరోజాలకు పట్టించాలి. ఇందువల్ల శిరోజాలకు చక్కని మెరుపు, నునుపు వస్తుంది. తల స్నానం వీలైనంత వేగంగానే ముగించి శిరోజాలను ఆరబెట్టుకోండి. గంటల తరబడి జుత్తును తడిగానే ఉంచేయడం మంచిది కాదు. తలస్నానానికి ముందు పరిశుభ్రమైన కొబ్బరినూనె శిరోజాలకు పట్టించాలి. ఇందువల్ల శిరోజాలకు చక్కని మెరుపు వస్తుంది. శిరోజాలకు రంగులు వేసే అలవాటు ఎంత దూరమైతే అంతమంచిది. ఎందువల్ల నంటే దీని వల్ల 20శాతం జుట్టు కోల్పోతారు.హడావిడి సమయాల్లో త్వరగా జుత్తును ఆరబెట్టుకునేందుకు డ్రయ్యర్స్‌ వాడటం వల్ల పరిపాటి. ఇలా డ్రయ్యర్లు వాడటంతో ఆరబెట్టటం వల్ల జుట్టు పగుళ్ళు ఏర్పడటం, బలహీనపడి, రాలి పోవటం జరుగుతుంది. పళ్ళు దగ్గరగా ఉండి మొనదేలిన బ్రష్‌లనుఉపయోగించకూడదు. ఇందువల్ల శిరోజాలు చిట్లిపోవడం కాకుండా, మొదళ్ల భాగంలో ఉండే సున్నితమైన భాగంలో ఉం డే సున్నిత మైన చర్మం కూడా దెబ్బతినే అవకాశంఉంది.పళ్ళు దూరంగా ఉండి చివర్లు మొనదేలిన బ్రష్‌లు వాడాలి.