మందారపూలను మెత్తగా నూరి తలకు పట్టించినట్లయితే చుండ్రు తగ్గిపోతుంది. పేనుకొరుకుడు కూడా తగ్గిపోతుంది.
చుండ్రుతో బాధపడే వారి సంఖ్య మనదేశంలో అధికంగా ఉందనే చెప్పాలి. అయితే చుండ్రు కొద్దిగా ఉన్న దశలో మెడికేటెడ్ సబ్బులను వాడనవసరం లేదు.
- మెడికేటెడ్ షాంపూలను తరచుగా వాడుతూ వాటితో గట్టిగా రుద్దుకోరాదు.
- కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని తలకు బాగా పట్టించి మర్దన చేసి నాలుగు గంటలపాటు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోండి.
- ఇరవై నుండి ముప్పది నల్లమిరియాలును తీసుకుని వాటిని పొడిచేసి అరకప్పు పాలలో కలిపి తలకు మర్దన చేయండి. రాత్రంతా అలాగే ఉంచి మర్నాడు షాంపూతో శుభ్రం చేసుకోండి. ఇలా ముప్పదిరోజులు చేయాలి.
- ఒక టేబుల్‌స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకుని రెండు చెంచాల కొబ్బరి నూనెతో కలిపి తలకు మర్దన చేయండి. నాలుగైదు గంటలపాటు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోండి.
No comments:
Post a Comment