WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Food Grains Health Tips. Show all posts
Showing posts with label Food Grains Health Tips. Show all posts

Tuesday, 6 September 2016

FOOD TIPS TO REMAIN FRESH ROUND THE CLOCK


రోజంతా చురుకుగా.. !

ఉదయం నిద్రలేచాక బద్ధకంగా ఉండి... ఇంకా నిద్రపోవాలనిపిస్తే ఏం బాగుంటుంది. బాగుండటం సంగతి పక్కన పెడితే బద్ధకంగా ఉంటే ఆధునిక పరుగులో వెనకబడిపోతామన్న భయం వెంటాడుతుంది. బద్ధకంగా రోజు మొదలవ్వకుండా ఉండేందుకు కొన్ని టిప్స్‌ ఉన్నాయి. 

పిండిపదార్ధాలతో ఉన్న అల్పాహారం తింటేనే పొట్ట నిండుగా ఉంటుందనుకుంటే పొరపాటు. చక్కెర కలిగిన తృణధాన్యాలు, బ్రెడ్‌ వంటివి తింటే సరళ పిండిపదార్థాలు (సింపుల్‌ కార్బోహైడ్రేట్స్‌) శరీరానికి చేరతాయి. దాంతో త్వరగా ఆకలవుతుంది.

అందుకని ప్రొటీన్లు లేదా నట్స్ ‌తో తయారుచేసిన స్మూతీలు తినాలి. ఇవేవీ కుదరలేదంటే సంక్లిష్ట పిండిపదార్ధాలను (కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్లు) కలిగిన ఓట్స్‌ వంటివి తింటే ఆకలవ్వదు.

నిద్రలేవగానే పళ్లు తోముకోవడం సహజం. అయితే కొందరు బ్రేక్‌ఫాస్ట్‌ తిన్న తరువాత కూడా పళ్లు తోముతారు. ఇదేమంత మంచిది కాదు అంటున్నారు డెంటిస్టులు. ఎందుకంటే పళ్లరసాలు, పెరుగు, కాఫీ వంటి ఆమ్లపదార్ధాలు తీసుకున్నాక ఎనామిల్‌ మెత్త బడుతుంది. అప్పుడు దంతాలు తోమితే ఎనామిల్‌ పోతుంది. అందుకే అల్పాహారం తర్వాత దంతధావనం చేయకపోవడం ఉత్తమం.

‘ఉదయం నిద్రలేవగానే మీరేం చేస్తార’ని అడిగితే -‘ఏం చేస్తాం... ఫోన్‌ చెక్‌ చేస్తాం’ అనే సమాధానం చెప్తున్నారు ఈ మధ్య ఎక్కువమంది. నిద్రలేవగానే కళ్లలో తేమ అంతగా ఉండదు. దానివల్ల నిద్రలేచీ లేవగానే ఫోన్‌ స్ర్కీన్‌ చూస్తే కళ్లకు హాని కలుగుతుంది.

వర్కవుట్‌లనేవి అన్ని రకాలుగా ఎంతో మంచిది. అయితే జిమ్‌కి వెళ్లాలనో, వర్కవుట్‌లు చేయాలనో నిద్ర సరిపడా పోకపోతే కూడా ఇబ్బంది. శరీరానికి సరైన విశ్రాంతి దొరక్కపోతే జిమ్‌లో, వర్క్‌లో మీ సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి శక్తి కావాలంటే కంటినిండా నిద్ర ఉండాలి.

మనలో ఎక్కువమంది రాత్రి నిద్రాభంగం కాకూడదని కిటికీ కర్టెన్లు మూసేసి, లైట్లు ఆపేసి నిద్రకు ఉపక్రమిస్తుంటారు. కాని దీనివల్ల బాడీక్లాక్‌ (జీవగడియారం)కి సరైన సందే శం వెళ్లదు. ఈ గడియారం వెలుగుకి, చీకటికి సున్నితంగా స్పందిస్తుంది. తెల్లవారిందనే సంకేతాన్ని బాడీ క్లాక్‌కి అందించాలంటే సహజమైన కాంతి పడకగదిలో పడాలి.

గోరువెచ్చటి నీళ్లతో ఉదయంపూట స్నానం చేస్తే బద్ధకం వదిలి రోజంతా ఉత్తేజంగా ఉండొచ్చనుకుంటారు. వాస్తవానికి చన్నీళ్ల స్నానం చేస్తే అలా ఉంటారు. దీనివల్ల అప్పటివరకు గాఢనిద్రలో మునిగిన శరీరానికి ‘తెల్లవారింది మత్తు వదులు’ అనే సంకేతం వెళ్తుంది. అదే గోరువెచ్చని నీళ్లనుకోండి ‘కండరాలు రిలాక్స్‌ అయ్యే సమయం ఇది’ అని నాడీవ్యవస్థకు సందేశం వెళ్తుంది. ఈ సారి మీరు వేడినీళ్ల స్నానం చేశాక గమనించండి అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇది తెలిశాక ఉదయం చన్నీళ్ల స్నానమే బెస్ట్‌ అనిపిస్తోంది కదూ..!

Monday, 5 September 2016

HEALTH BENEFITS WITH SABHUDHANA


1. మీరు శాకాహారులా? మీకు మంసాహారుల్లా కండాలు పెంచాలని వుందా? అయితే మీరు తప్పకుండా సాబుదాను తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో అధిక మొత్తంలో ప్రోటిన్స్ వుండటం వల్ల కండరాల అభివృద్ధి అధికంగా వుంటుంది.

2. సాబుదానలో కాల్షియం,ఐరన్, విటమిన్ ‘ కె ‘ అధికంగా వుండటం వల్ల మన ఎముకలు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజంతా పనిచేసిన మిమల్ని ఉత్సాహాంగా వుంచుతుంది.

3. దీనిలో వుండే పోటాషియం మన శరీరంలోని రక్తపీడనను అదుపులో వుంచుతుంది.

4. సాబుదాలో ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా వుండటం వల్ల పిండాభివృద్ధికి , నాడీ సంబధ లోపాలను నియంత్రణలో వుంచుతుంది.

5. సాబుదానను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు అద్భుతంగా వుంటుంది. అంతే కాకుండా మలబద్దకం, అజీర్ణం , గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

6. శరీరంలో కొవ్వు స్థాయిలను అదుపులో వుంచుతుంది.

Saturday, 30 January 2016

HELATH BENEFITS WITH BROWN RICE


బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం)తో వండిన అన్నం కంటికి ఇంపుగా ఉండదు. కానీ ఒంటికి మాత్రం ఖచ్చితంగా మంచిది. బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యం. పాలిష్ చేయని బియ్యాన్ని బ్రౌన్ రైస్ అంటారు. అసలు పాలిష్ పెట్టకుండా కేవలం వడ్ల పైన వుండే బయటి పొరను తొలిగిస్తే బియ్యపు గింజ గోధుమ రంగు లో వుంటుంది. పాలిష్ బాగా ఎక్కువ చేస్తే బియ్యపు గింజ తెల్లగా వుంటుంది. అయితే కావాలని కోరుకున్నా, ఇప్పుడు పట్టణాలలో దంపుడు బియ్యం కనపడ్డం కష్టం.

గోధుమరంగు బియ్యంలో ఉన్న సెలీనియం పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని తెలుస్తుంది. బియ్యంలో పెద్ద మొత్తంలో ఉన్న పీచు జీర్ణవాహికలో క్యాన్సర్ కారక రసాయనాల బయటకు పంపుతుంది, ఈ రకంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ నుండి కాపాడుతుంది. గోధుమ రంగు బియ్యంలో ఉండే ఫైటోన్యూట్రిఎంట్ లిగ్నాన్ రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బులను అడ్డుకోవడంలో సహయపడుతుంది. వయసు మళ్ళిన మహిళలపై జరిపిన అధ్యయనంలో బ్రౌన్ రైస్ వంటి ధాన్యాహారాన్ని తినడం వలన ఎంటరోల్యాక్టోన్ స్థాయిని పెంచుతుందని, దీని వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని తెలుస్తుంది. 

Thursday, 17 December 2015

MOKKA JONNA HEALTH TIPS


మొక్కజొన్న ప్రత్యేకంగా సీజన్‌లో మాత్రమే లభిస్తుంది. లేత మొక్కజొన్న తినటానికి ఎంతో రుచిగా ఉంటుంది. కొంచెం ముదిరిన గింజలను ఎండబెట్టి వాటితో పాప్‌కార్న్‌ చేస్తారు. కార్న్‌ఫ్లేక్స్‌ కూడా మొక్కజొన్న గింజలతోనే తయారుచేయబడతాయి. మొక్కజొన్న గింజలతో వడలను తయారుచేస్తారు. వీటి గింజల నుంచి కార్న్‌ ఆయిల్‌ను తీస్తారు. ఈ కార్న్‌ఆయిల్‌ను వంటనూనెగా ఉపయోగిస్తారు. మొక్కజొన్నలను కాల్చి, ఉడికించి తింటారు. మొక్కజొన్నలో పోషకవిలువలు లభిస్తాయి. ఇందులో విటమిన్‌లు, పిండిపదార్థాలు, మాంసకృత్తులు, పీచుపదార్థం, ఖనిజాలు అధికంగా లభిస్తాయి. అరుగుదల తక్కువగా ఉన్నవారు మొక్కజొన్నగింజల మీద ఉప్పుపొడి, మిరియాలపొడి చల్లి నిమ్మరసం పిండి తినవచ్చు. అప్పుడు సులువుగా జీర్ణమవుతుంది. మొక్కజొన్నగింజలను ఎండబెట్టి, పొడిచేస్తారు. దీన్ని కార్న్‌ఫ్లోర్‌ అంటారు. మొక్కజొన్న ఔషధపరంగా కూడా ఎంతగానో ఉపయోగిస్తుంది. మొక్కజొన్నలో ఉండే కాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆరోగ్యానికీ ధృఢత్వానికీ తోడ్పడుతుంది. ఇందులోని పీచుపదార్థం మలబద్ధకాన్ని తొలగిస్తుంది. దీనిలో లభించే పొటాషియం రక్తపోటును నియంత్రించి, అధికరక్తపోటు రాకుండా చేస్తుంది. కాన్సర్‌ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. 

మధుమేహ రోగులు మొక్కజొన్న గింజలను, గింజలతో చేసిన పదార్థాలను కానీ తినవచ్చు. ఇందులో ఉండే లవణాలు, పోషకపదార్థాలు వారి ఆరోగ్యానికి తోడ్పడుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండెకు సంబంధించిన ఆనారోగ్యాలు రాకుండా నిరోధిస్తుంది. రక్తనాళాలతో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. కార్న్‌ఆయిల్‌ రక్తంలో కొలెస్టరాల్‌ శాతం పెరగకుండా నిరోధిస్తుంది. రక్తంలోని కొలెస్టరాల్‌ శాతాన్ని నియంత్రిస్తుంది. దీని గింజలను నమిలితినడం వల్ల దంతా ల పటుత్వం పెరుగుతుంది. దీనిలో లభించే పిండిపదార్థం శరీరానికి శక్తిని సమకూరుస్తుంది. గర్భిణీలు మొక్కజొన్న తింటే, ప్రసవానంతరం చనుపాలు వృద్ధిచెందుతాయి. ఇందులో లభించే చక్కెర శరీరానికి శక్తిని అందిస్తుంది. నాడీవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.

Tuesday, 8 December 2015

FOOD GRAINS HEALTH TIPS - GODHUMA - JONNA ROTTE HEALTH TIPS IN TELUGU


(గోధుమ + జొన్న) రొట్టెల - ఆరోగ్య రహస్యాలు

1) గోధుమపిండి ఒక భాగం , జొన్నపిండి రెండు భాగాలు , పుదినా , కొత్తిమీర పేస్టు కలిపి , తగినంత ఉప్పు కలిపి ,పెనం మీద వేసి రొట్టెలు లా తయారు చేసుకోవాలి. (ఈ రొట్టెలు చేసేటప్పుడు పాలకూర లేదా మెంతి కూర పేస్టు కూడా కావాలంటే కలుపుకోవచ్చు)
2) ఈ రొట్టెలలో పుష్కలంగా ఐరన్ , ప్రోటీన్ , ఫైబర్ (పీచు పదార్ధం) ఉంటుంది. కావాల్సిన కాల్షియమ్ కూడా అందుతుంది.
3) ఎవరైతే అధికబరువు , డయాబెటిస్ తో బాధపడుతున్నారో అలాంటి వారు , రాత్రి అన్నానికి బదులుగా , ఈ రొట్టెలు తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ , కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
4) రాత్రి పూట 2 నుండి 3 రొట్టెలు వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రొట్టెలలో కార్బోహైడ్రేట్ లెవెల్స్ చాల చాల తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరంలో గ్లూకోస్ లెవల్స్ , కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగవు.
5) ఈ రొట్టెలు తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి , చల్లగా తీసుకొంటే కడుపులో వేడి చేయదు.