మొక్కజొన్న ప్రత్యేకంగా సీజన్‌లో మాత్రమే లభిస్తుంది. లేత మొక్కజొన్న తినటానికి ఎంతో రుచిగా ఉంటుంది. కొంచెం ముదిరిన గింజలను ఎండబెట్టి వాటితో పాప్‌కార్న్ చేస్తారు. కార్న్‌ఫ్లేక్స్ కూడా మొక్కజొన్న గింజలతోనే తయారుచేయబడతాయి. మొక్కజొన్న గింజలతో వడలను తయారుచేస్తారు. వీటి గింజల నుంచి కార్న్ ఆయిల్‌ను తీస్తారు. ఈ కార్న్‌ఆయిల్‌ను వంటనూనెగా ఉపయోగిస్తారు. మొక్కజొన్నలను కాల్చి, ఉడికించి తింటారు. మొక్కజొన్నలో పోషకవిలువలు లభిస్తాయి. ఇందులో విటమిన్‌లు, పిండిపదార్థాలు, మాంసకృత్తులు, పీచుపదార్థం, ఖనిజాలు అధికంగా లభిస్తాయి. అరుగుదల తక్కువగా ఉన్నవారు మొక్కజొన్నగింజల మీద ఉప్పుపొడి, మిరియాలపొడి చల్లి నిమ్మరసం పిండి తినవచ్చు. అప్పుడు సులువుగా జీర్ణమవుతుంది. మొక్కజొన్నగింజలను ఎండబెట్టి, పొడిచేస్తారు. దీన్ని కార్న్‌ఫ్లోర్ అంటారు. మొక్కజొన్న ఔషధపరంగా కూడా ఎంతగానో ఉపయోగిస్తుంది. మొక్కజొన్నలో ఉండే కాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆరోగ్యానికీ ధృఢత్వానికీ తోడ్పడుతుంది. ఇందులోని పీచుపదార్థం మలబద్ధకాన్ని తొలగిస్తుంది. దీనిలో లభించే పొటాషియం రక్తపోటును నియంత్రించి, అధికరక్తపోటు రాకుండా చేస్తుంది. కాన్సర్ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది.
మధుమేహ రోగులు మొక్కజొన్న గింజలను, గింజలతో చేసిన పదార్థాలను కానీ తినవచ్చు. ఇందులో ఉండే లవణాలు, పోషకపదార్థాలు వారి ఆరోగ్యానికి తోడ్పడుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండెకు సంబంధించిన ఆనారోగ్యాలు రాకుండా నిరోధిస్తుంది. రక్తనాళాలతో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. కార్న్‌ఆయిల్ రక్తంలో కొలెస్టరాల్ శాతం పెరగకుండా నిరోధిస్తుంది. రక్తంలోని కొలెస్టరాల్ శాతాన్ని నియంత్రిస్తుంది. దీని గింజలను నమిలితినడం వల్ల దంతా ల పటుత్వం పెరుగుతుంది. దీనిలో లభించే పిండిపదార్థం శరీరానికి శక్తిని సమకూరుస్తుంది. గర్భిణీలు మొక్కజొన్న తింటే, ప్రసవానంతరం చనుపాలు వృద్ధిచెందుతాయి. ఇందులో లభించే చక్కెర శరీరానికి శక్తిని అందిస్తుంది. నాడీవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.
No comments:
Post a Comment