WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 17 December 2015

BRIEF BIODATA ABOUT BHARATHA KOKILA SAROJINI DEVI


సరోజినీదేవి ఫిబ్రవరి-13, 1879న హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తండ్రి అఘోరనాధ చటోపాధ్యాయ, హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేసేవారు. సరోజిని చిన్నప్పట్నుంచే చదువులో ఎంతో శ్రద్ధ కనపరచేది. 12 సంవత్సరాల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ నుంచీ మెట్రిక్యులేషన్‌ పరీక్షరాసి, ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాల యింది. ఆమెకు చిన్నప్పట్నుంచే గ్రంథ పఠనం పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా ఉండేది. పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని సంపాదించాలని, నూతన విషయాలను తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరేది సరోజిని. పుస్తకాలు చదివే ఆ తపన, ఆ ఆసక్తి, ఆమెచేత కలం పట్టించింది. సరోజినీదేవి చిన్నప్పుడే ఎన్నెన్నో కవితలు రాసింది. 13సంవత్సరాల ప్రాయంలోనే 'లేడీ ఆఫ్‌ ది లేక్‌' అనే కవితను రాసి ఎందరి ప్రశంసలనో అందుకున్నది. కవితలు రాయడమేకాక, భాషమీద ఎంతో పట్టుపొందింది. రాతల్లోనేకాక, మాటల్లో కూడా ఆమెదిట్ట. అనర్ఘళంగా ఉపన్యా సాలివ్వగలిగిన వక్త సరోజిని.
సరోజిని ఉన్నత విద్యలను అభ్యసించటానికి 16 సం||ల వయసులో, షిప్‌ మీద ప్రయా ణించి లండనుకు వెళ్ళింది. అక్కడ కింగ్స్‌ కాలేజీలో చేరింది. ఆ తర్వాత, కేంబ్రిడ్జిలోని గ్రిట్టన్‌ ఉమెన్స్‌ కాలేజీలో ప్రవేశించింది. ఇంగ్లాండులో ఉన్నప్పుడు సరోజినికి గోవిందరాజులు నాయుడిగారితో పరిచయం ఏర్పడి, అది స్నేహబంధంగా మారింది. ఆ తర్వాత, కేంబ్రిడ్జిలోని గ్రిట్టన్‌ ఉమెన్స్‌ కాలేజీలో ప్రవేశించింది. ఇంగ్లాండులో ఉన్నప్పుడు సరోజినికి గోవిందరాజులునాయుడుగారితో పరిచయం ఏర్పడి, అది స్నేహబంధంగా మారింది. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించింది. తన చదువు పూర్తికాకుండానే, భారతదేశానికి వచ్చేసింది సరోజిని. తల్లిదండ్రులను ఒప్పించి, వారి అంగీకారంతో తను ప్రేమించిన గోవిందరాజులు నాయుడు గారినే పెళ్ళాడిందామె. సరోజినికి చిన్నప్పటినుంచీ దేశాభి మానం, దేశభక్తి అధికంగా ఉండేవి. మహిళా విద్యను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలను చేపట్టిందామె. సభలు సమావేశాల ద్వారా మహిళలు చదువుకోవలసిన ఆవశ్యకత ను గురించి మహిళ చదువుకుంటే కలిగే ఉపయోగాలేమిట న్నదీ తెలియపరచేదామె తన ఉపన్యాసాల ద్వారా. ఆమెకే గోపాలకృష్ణగోఖలేగారితో పరిచయం కలిగింది. ఆ పరిచయం తర్వాత ఆయనలోని దేశభక్తి, పట్టుదల, కృషిచూసి జాగృతి పొందిన సరోజినినాయుడు ఎంతో ఉత్సాహంతో, చెక్కుచెదరని ఆత్మధైర్యంతో స్వాతంత్య్రసమరంలోకి ప్రవేశించి, ఎందరో దేశనాయకులతో కలసి పనిచేసింది. హోంరూల్‌ ఉద్యమంలో ఆమె పాల్గొన్నది. జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన దౌర్జన్యం, మారణకాండను గురించి, గుండెధైర్యంతో బ్రిటీష్‌ నాయకులకు తెలియచెప్పే సాహసం చేశారామె. అదేవిధంగా ఖిలాఫత్‌ ఉద్యమంలో జరిగిన అన్యాయాలు, వేధింపులతోపాటు నిజానిజాలేమిటో ఎంతో నిజాయితీగా, గుండెనిబ్బరంతో బ్రిటీష్‌ వారికి తెలియచేసేందుకు ఎంతగానో శ్రమించింది సరోజినీనాయుడు.

1925 వ సంవత్సరంలో కాంగ్రెసు మహాసభలు జరిగినప్పుడు శ్రీమతి సరోజినీనాయుడు అధ్యక్షత వహించింది. తాను అనుకున్నది, న్యాయసమ్మతమయినదిగా భావిస్తే, ఆచరణలో పెట్టగలిగిన వ్యక్తిత్వం ఆమెది. రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్సులో ఎంతో ఆవేశంగా ఉత్తేజంగా ప్రసంగించిన ధీశాలి సరోజినీనాయుడు. బ్రిటీష్‌ ప్రభుత్వం ఆమెకు 'కైజార్‌- ఎ- హింద్‌' స్వర్ణపతకాన్ని బహుమతి ప్రదానం చేసింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్‌కు గవర్నరుగా బాధ్యతలను స్వీకరించింది. మార్చి-22న, 1949లో ఆమె స్వర్గస్థురాలయింది. సరోజినీనాయుడు దేశభక్తురాలు, వక్త, సంఘసేవకురాలు, కవయిత్రి, ఉదాత్తమయిన వ్యక్తిత్వం, దేశంకోసం పలుమార్లు ఆమె జైలుకు వెళ్ళవలసి వచ్చింది. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, గుండెధైర్యం కలిగిన ఉత్తమ నాయకురాలామె. ఆమె రచించిన 'ది గోల్డెన్‌ త్రెషోల్డ్‌' కవితా సంపుటి భారతదేశంలోనేకాక, విదేశాలలో కూడా ప్రఖ్యాతి చెందింది. హైదరాబాద్‌లో ఆమె నివసించిన భవనానికి, 'ది గోల్డెన్‌ త్రెషోల్డ్‌' అని పేరుపెట్టిందామె. అయితే, ఆమె స్వర్గస్థురాలయిన తర్వాత ఆ భవనాన్ని ఆమె వారసులు ఆమె గుర్తుగా కానుకగా ఇచ్చేశారు. 'ది బర్డ్‌ ఆఫ్‌ టైం' 'ది ఫాదర్‌ ఆఫ్‌ ఉమన్‌' 'ది బ్రోకెన్‌ వింగ్‌' అనే ఆమె రచనలు ఎంతో పేరు సంపాదించుకున్నాయి. దేశవిదేశాల్లో ఎంతో ప్రఖ్యాతి చెందాయి. 'నైటింగేల్‌ ఇండియాగా' ఆమె కీర్తిని పొందింది.

No comments:

Post a Comment