WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Swami Ayyappa Puja Articles. Show all posts
Showing posts with label Swami Ayyappa Puja Articles. Show all posts

Wednesday, 9 December 2015

INFORMATION ABOUT SABARIMALAI - AYYAPPA SWAMY


శబరిమలై .....అయ్యప్ప (Ayyappa) హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య 
smile emoticon
 విష్ణువు), అప్ప 
smile emoticon
 శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు

శబరిమలై అంటే శబరి యొక్క పర్వతము అని అర్ధం.
దేవాలయ నిర్మాణము
అయ్యప్ప ఈ పర్వతముపై కల అయ్యప్పస్వామి దేవాలయము భారతదేశ ప్రసిద్ధి చెందిన, అధిక జనసమ్మర్ధం కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయమునకు మాలధారణ చేసుకొని నలుభైఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీకమాసం మరియు సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు. అయ్యప్ప మాల ధారణ దక్షిణ భారతదేశము లోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో అధికంగా కలదు.

Wednesday, 2 December 2015

LORD SRI SWAMY AYYAPPA ASTOTHARA SATHA NAMAVALI IN TELUGU


అయ్యప్ప అష్టోత్తర శతనామావళి.

ఓం మహాశాస్తాయ నమ:
ఓం మహా దేవాయ నమ:
ఓం మహాదేవస్తుతాయ నమ:
ఓం అవ్యక్తాయ నమ:
ఓం లోకకర్ర్తేనమ:
ఓం లోకభర్తే నమ:
ఓం లోకహర్తే నమ:
ఓం పరాత్పరాయ నమ:
ఓం త్రిలోక రక్షాయ నమ:
ఓం ధంవినే నమ:
ఓం తపశ్వినే నమ:
ఓం భూత సైనికాయ నమ:
ఓం మంత్రవేదినే నమ:
ఓం మహా వేదినే నమ:
ఓం మారుతాయ నమ
ఓం జగదీశ్వరాయ నమ:
ఓం లోకాధ్యక్షే నమ:
ఓం అగ్రగణ్యే నమ:
ఓం శ్రీమతే నమ:
ఓం అప్రమేయ పరాక్రమాయ నమ:
ఓం సింహారూఢాయ నమ:
ఓం గజారూఢాయ నమ:
ఓం హయారూఢాయ నమ:
ఓం మహేశ్వరాయ నమ:
ఓం నానావస్త్రధరాయ నమ:
ఓం అనఘాయ నమ:
ఓం ననావిధ్యావిశారధాయ నమ:
ఓం ననారూపధరాయ నమ:
ఓం వీరాయ నమ:
ఓం ననాప్రాణిసేవితాయ నమ:
ఓం భూతేశాయ నమ:
ఓం భూతిదాయనమ:
ఓం భృత్యాయ నమ:
ఓం భుజంగభూషణోత్తమాయ నమ:
ఓం ఇక్షుధంన్వినే నమ:
ఓం పుష్పబాణాయ నమ:
ఓం మహారూపాయ నమ:
ఓం మహాప్రభువే నమ:
ఓం మహాదేవిసుతాయ నమ:
ఓం మాన్యాయ నమ:
ఓం మహాన్వితాయ నమ:
ఓం మహాగుణాయ నమ:
ఓం మహాకృపాయ నమ:
ఓం మహారుద్రాయ నమ:
ఓం వైష్ణవాయ నమ:
'ఓం విష్ణుపూజకాయ నమ:
ఓం విఘ్నేశ్వరాయ నమ:
ఓం వీరభద్రాయ నమ:
ఓం భైరవాయ నమ:
ఓం షణ్ముఖదృవాయ నమ:
ఓం మేరుశృంగసమాసనాయ నమ:
ఓం మునిసంఘసేవితాయ నమ:
ఓం దేవాయ నమ:
ఓం భద్రాయ నమ:
ఓం గణనాధాయ నమ:
ఓం గణేశ్వరాయ నమ:
ఓం మహాయోగినే నమ:
ఓం మహామాయనే నమ:
ఓం మహాజ్నానినే నమ:
ఓం మహాస్థిరాయ నమ:
ఓం దేవశాస్త్రే నమ:
ఓం భూతశాస్త్రే నమ:
ఓం భీమసాహస పరాక్రమాయ నమ:
ఓం నాగరాజాయ నమ:
ఓం నాగేశాయ నమ:
ఓం వ్యోమకేశాయ నమ:
ఓం సనాతనాయ నమ:
ఓం సగుణాయ నమ:
ఓం నిర్గుణాయ నమ:
ఓం నిత్యతృప్తాయ నమ:
ఓం నిరాశ్రయాయ నమ:
ఓం లోకాశ్రయాయ నమ:
ఓం గణాధీశాయనమ:
ఓం చతుషష్టికళాత్మికాయ నమ:
ఓం సమయజుర్వధర్వణ రూపాయ నమ:
ఓం మల్లకాసురభంజనాయ నమ:
ఓం త్రిమూర్తినే నమ:
ఓం దైత్యదమనే నమ:
ఓం ప్రకృతయే నమ:
ఓం పురుషోత్తమాయ నమ:
ఓం జ్నానినే నమ:
ఓం మహాజ్నానినే నమ:
ఓం కామదాయ నమ:
ఓం కమలేక్షణాయ నమ:
ఓం కల్పవృక్షాయ నమ:
ఓం మహావృక్షాయ నమ:
ఓం విభూతిదాయ నమ:
ఓం సంసారతాప విచ్చేత్రే నమ:
ఓం పశులోకభయంకరాయ నమ:
ఓం లోకహంత్రే నమ:
ఓం ప్రాణహదాత్రే నమ:
ఓం పరగర్వ భంజనాయ నమ:
ఓం సర్వశాస్త్రతత్వజ్నానాయ నమ:
ఓం నీతిమతయే నమ:
ఓం పాపభంజనాయ నమ:
ఓం పుష్కలాపూర్ణసంయుక్తాయ నమ:
ఓం పరమాత్మనే నమ:
ఓం సతాంగతయే నమ:
ఓం అనంతాదిత్యాకాశాయ నమ:
ఓం సుభ్రహ్మణ్యానుజాయ నమ:
ఓం బలినే నమ:
ఓం భక్తానుకంపనే నమ:
ఓం దేవేశాయ నమ:
ఓం భగవతే నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం పూర్ణాపుష్కల సమేత హరిహరపుత్రఅయ్యప్పస్వామినే నమ:

Saturday, 28 November 2015

HINDU PURANA STORY OF LORD AYYAPPA - BIRTH STORY AND INFORMATION OF SWAMY AYYAPPA IN TELUGU


అనాధ రక్షకుడైన అయ్యప్పస్వామి హరిహరసుతుడు. మణికంఠుడుగా సంతానం లేని పందళరాజుకు లభ్యమయ్యాడు. ఆ శివుడే తనకోసం బిడ్డను ప్రసాదించాడని నమ్మి మెడలో మణిహారంతో పంబా తీరంలోలభించినబిడ్డ కనుక ఈ బాలుడిని మణికంఠునిగా పేరిడి ఆ మహారాజు అల్లారుముద్దుగా బిడ్డడిని పెంచుకోసాగాడు. ఆ దారిలో అగస్త్యమహర్షి కనిపించి ఆ మహారాజును దీవించి మణికంఠుని వల్ల నీ వంశానికే కీర్తి వస్తుందని దీవించి పంపించాడు.
మహారాజురాణి లతో పాటుగా ఆ బాలుని ముద్దుగా ‘అయ్యా - అప్పా’ అని జనులందరూ పిలవసాగారు దాంతో మణికంఠుడే అయ్యప్పగా మారాడు. భక్తులం దరూ అయ్యప్పా అని ఒకసారి పిలవగానే పలుకే మణికంఠుని నామం ఎవరికైనా మధురమే కదా. స్వామియే శరణమయ్యప్ప! అనడం అయ్యప్ప దీక్షాదారులకు అలవాటే. పులిపాల నిమిత్తం వెళ్లిన మణికంఠుడు నానా రభస చేసే మహిషిని సంహరించాడు. ఈ మహిషాసుర సంహారం తరువాత తాను వచ్చిన పని అయపోయందని ఇక నేను వెళ్తాను అనే మణికంఠుని చూచి మహారాజ పరివారంతో పాటు సకల జనులు కనుల నీరు కార్చారు. కాని మణికంఠుడు వారికి అభయం ఇస్తూ తాను ఎప్పుడు ఎవరు తలుచుకున్నా వారికి కనిపిస్తానని, వారి కష్టాలను దూరం చేస్తానని మాటఇచ్చాడు. సంక్రాంతి పర్వదినాన శబరిమల ప్రాంతంలో తాను జ్యోతిస్వరూపుడుగా అందరికీ దర్శనం ఇస్తానని అభయం ఇచ్చాడు.
అలా అభయం ఇచ్చిన తరువాత అయ్యప్ప తను వేసిన బాణము పడినచోట చివరిగా అందరికీ దర్శనమిచ్చి అంతర్థానమయ్యాడు ఆ మణికంఠుడు. అలాదర్శనం ఇచ్చిన చోటే శబరిమల. స్వామి శబరిమల శిఖరం చేరి పట్టబందాసనంలో కూర్చొని, చిన్ముద్ర, అభయహస్తముతో అందరికీ దర్శనమిచ్చి జ్యోతిరూపంలో అంతర్థామైనట్లు శబరిమల స్థల పురాణం చెబుతుంది. తరువాత పరశురాముడు 18 మెట్ల నిర్మాణం కావించి స్వామిని విగ్రహరూపంలో ప్రతిష్టించినట్లు చెప్తారు. బ్రహ్మచారి యైన మణికంఠుని దర్శనం కేవలం మగవారికే. వారు కూడా దీక్షావస్త్రాలను ధరించి నియమ నిష్టలను పాటించి తరువాత శబరిమల చేరి స్వామి దర్శనం చేసుకోవాలి. ఇట్లా స్వామి దర్శనం చేసుకొన్నవారికి ఇహలోక ఇబ్బందులు ఏవీ అంటవు. శనేశ్వరుని బాధలను తాకవు. స్వామిని దర్శించడానికి వెళ్లేవారు బ్రహ్మచర్య వ్రతం చేబట్టి, రెండు పూటలా తలకు చన్నీటి స్నానం చేస్తారు. నేలమీద నిద్రిస్తారు. ఒంటిపూట భోజనంచేస్తారు. తెల్లవారు జామున నాలుగు గంటలకే బ్రహ్మీమహూర్తంలో అయ్యప్ప ఆరాధన చేస్తారు. తిరిగి సాయం సంధ్యవేళ కూడా స్వామి ఆరాధన చేస్తారు. గురుస్వాముల పర్యవేక్షణలో సామూహికారాధనలు చేస్తారు. దీక్షతీసుకున్న వారు వారికున్న దుర్వ్యసనాలనన్నీ విడిచిపెట్తారు. సత్సంగాలకు వెళ్తూ సత్కాలక్షేపంతో ఆధ్యాత్మిక చింతన వారికి అలవడుతుంది. అహంబ్రహ్మస్వి - తత్వమసి సిద్ధాంతం ప్రకారం స్వామి దీక్షచేబడుతారు. తనలోను, ఎదుటివారిలో కూడా అయ్యప్పస్వామినే దర్శించి ప్రతివారిని స్వామి అన్న పేరుతోనే పిలుస్తారు. దీనివల్ల అరిషడ్వర్గాలపై అదుపు దొరుకుతుంది. అహంకారం, గర్వం దూరమవుతాయ. సర్వవ్యాపి అయన భగవంతుణ్ణి అందరిలోను చూసే నేర్పు ఈ దీక్షతో వస్తుంది. చివరకు దీక్షావిరమణకు శబరిమలకు ఇరుముడితో ఆవు నేతిని ముద్రకాయలో నింపి తీసుకువెళ్లి స్వామివారికి అభిషేకించి స్వామికి శరణాగతులౌతారు. ఇలా చేసినవారందరూ స్వామివారి కృపకు పాత్రులవుతారు. ఇహలోక సంపదలన్నీ పొంది అంత్యమందు మోక్షాన్ని పొందుతారు.

Saturday, 7 November 2015

SWAMI AYYAPPA DIVYA CHARITHAMU


శ్రీ అయ్యప్ప వారి దివ్య చరితము

దేవతలపై పగ సాధించాలని మహిషి అనే రాక్షసి బ్రహ్మగురించి తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ``శివుడికి కేశవుడికి పుట్టిన కొడుకు తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి. అలా కానిపక్షంలో అతడు కూ నా ముందు ఓడిపోవాలి'' అని వరం కోరింది మహిషి. ``తధాస్తు'' అనేసి తన లోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మ. పాల సముద్రంలో ఉద్భవించిన అమృతాన్ని దేవ, దానవులకు పంచడానికై శ్రీహరి మోహినీ రూపాన్ని దాల్చాడు. పరమేశ్వరుడు ఆ సర్వాంగ సుందరియైన మోహిని పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త.
అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వచ్చాడు రాజశేఖరుడు అనే పందళ దేశాధీశుడు, శివభక్తుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని నమ్మాడు. రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందించింది. వారెంతో వాత్సల్య అనురాగాలతో ఆ శిశువును పెంచసాగారు. ఆయన అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషమేమోగాని, ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవించింది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు ``అయ్యా'' అని మరికొందరు ``అప్పా'' అని, మరికొందరు రెండు పేర్లూ కలిపి ``అయ్యప్ప'' అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపించారు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తించాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేశాడు. అయ్యప్ప అడవికి బయలుదేరాడు.
ఇంతలో నారధుడు మహిషి అనే రాక్షసిని కలిసి ``నీ చావు దగ్గరపడింది. రేపో, మాపో చస్తావని'' హెచ్చరించాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి సిద్ధపడి చెంగున ఒక్క దూకు దూకింది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు వచ్చిన దేవతలతో పాటు గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురష, సిద్ధ, సాధ్య, నారదాది ఋషి పుంగవులతో నింగి నిండిపోయింది. వీరి భీకరయుద్ధంలో భాగంగా ఆ మహిషిని ఒక్క విసురు విసిరాడు. నేల మీదపడి రక్తసిక్తమై కన్నీటితో చావు మూలుగులు మూలుగుతున్న ఆ మహిషి శరీరంపై తాండవమాడాడు. ఆ దెబ్బకి ఆ గేదె మరణించింది. దేవతలంతా ఆయన ముందుకు వచ్చారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ``దేవేంద్రా! నేను చిరుతపులిపాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి'' అన్నాడు. అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతదండుతో అయ్యప్ప తన రాజ్యం చేరాడు.
అయ్యప్ప మంత్రిని పిలిచాడు `` ఇవిగో చిరుతపులులు, మీ వైద్యుణ్ణి పిలిచి పులి పాలు కావాలో చెప్పమను'' అన్నాడు. మంత్రి అయ్యప్ప పాదాలపై పడి శరణుకోరాడు. అయ్యప్ప అతడ్ని క్షమించాడు. అనంతరం ``తండ్రీ! నా జన్మకారణం నెరవేరింది. తము్మడైన రాజరాజన్నే పట్టాభిషిక్తుణ్ని చేయండి. నేను శబరిమలై చేరి సమాధిపొందుతాను నాకు ఆలయం కట్టించండి. నేను ఇక్కడ నుండి ఒక కత్తి విసురుతాను. అదెక్కడ పడితే అక్కడే చిన్ముద్ర. అభయహస్తాలతో సమాధిలో కూర్చుని అనంతరం పరమాత్మలో చేరతాను. నా చెంతనే మల్లిగపురత్తమ్మకు స్థానం య్యివండి. మిత్రుడైన వావరన్‌కు ఓ ఆలయం కట్టించండి.
సమాధికి వెళూ్త ఇలా అన్నాడు స్వామి, ``తండ్రీ! సంవత్సరానికి ఒక్కసారి మకర సంక్రాంతినాడు ఇతర భక్తులతోబాటు మీరు అక్కడికి వచ్చి నా దర్శనం పొందవచ్చు. నేను ధరించే ఆభరణాలన్నీ యిప్పుడు మీకు యిస్తాను. నా ఆలయానికి వచ్చినప్పుడు వీటిని కూడా తెచ్చి నా విగ్రహానికి అలంకరించి ఆనందించండి. నాకు ఎడమవైపుగా లీలా కుమారి కోసం నిర్మించే ఆలయంలోనే మా అన్నగారైన శ్రీ గణపతికి కుడురవన్‌, కుడుశబ్దన్‌ కురుప్పన్‌ మొదలైన భూతగణాలకి, నాగరాజుకి తావిచ్చి ప్రతిష్టలు జరిపించండి. బాబరన్‌కి ఎరుమేలిలో ఆలయం నిర్మించండి. నా దర్శనానికి వచ్చే వారంతా ముందుగా మీ దర్శనం చేసుకోవాలి. అటు తర్వాతనే నా దర్శనానికి రావాలి'' అని తన ఆభరణాలను తీసి యిచ్చేశాడు. ఆపై అయ్యప్ప సమాధినిష్ఠుడయ్యాడు. శబరిమలై ఆలయం వెలిసింది. శరణాగత రక్షకుడైన శ్రీ అయ్యప్ప స్వామివారి దివ్యాతి దివ్యమైన చరిత్ర సంపూర్ణం.


Thursday, 7 August 2014

SWAMY SARANAM AYYAPPA PUJA DETAILS - ARTICLE IN TELUGU ABOUT LORD AYYAPPA PUJA STEP BY STEP DETAILS


అయ్యప్ప పూజ

దీక్షలో పాటించవలసిన నియమాలు :

దీక్షా కాలమందు బ్రహ్మచర్యము పాటించవలెను.
ప్రతి దినము ఉదయము సూర్యోదయమునకు ముందు సాయంకాలము సూర్యుడు అస్తమించిన తర్వాత చన్నీటి స్నానము ఆచరించవలెను.
శుభ, అశుభ కార్యములందు పాల్గొనరాదు.
గురుస్వామి ఆజ్ఞలను పాటించవలెను.
శాఖాహారము మాత్రమే భుజించవలెను.
శవము ఎదురైన వెంటనే తలస్నానము చేయవలెను.
మత్తు పానీయములు సేవించరాదు.
నల్ల దుస్తులు మాత్రమే అయ్యప్పలకు శ్రేష్టము.
కుల, మత బేధములు పాటించరాదు.
ధూమపానము తాంబూలములు సేవించరాదు.
ఇరుముడి కట్టుకొనుటకు 41 రోజుల దీక్ష పూర్తి చేసి ఉండవలెను.
దీక్షా కాలములో ఏ విధమైన అనుమానము వచ్చినను గురుస్వామివారిని అడిగి తెలుసుకొనవలెను.
దీక్షలో ఉన్న అయ్యప్పలు తమ శక్తి కొలది తోటి అయ్యప్పలకు ఇంటి యందు భిక్ష పెట్టవలెను.
అహంకారము, ఆడంబరములు వదలి మామూలు జీవితము గడుపవలెను.
ఉదయం, సాయంకాలము తప్పక శరణుఘోష చేయవలెను.
ప్రతి అయ్యప్ప రాత్రివేళల్లో అయ్యప్పకు పవళింపుసేవ చెయ్యాలి.
ఎన్నిసార్లు అయ్యప్పను దర్శించిన వారైనా తోటి అయ్యప్పలను గౌరవించవలెను.
స్త్రీలలో బాలికలు 10 సం. లోపు పెద్దలకు 50 సం.లు పైబడి వయస్సు ఉన్నవారు మాత్రమే మాలాధారనకు అర్హులు.
బహిష్టు అయిన స్త్రీని చూడడము, వారి మాటలు వినడము చేయరాదు. అటుల చూచిన వెంటనే స్నానము చేసి శరణుఘోష పలుకవలెను.
41 రోజుల వ్రత దీక్షలో పూర్తిగా ఆధ్యాత్మిక చింతన అలవరుచుకొనవలెను.
గోళ్ళు తీయుట, వెంట్రుకలు కత్తిరించుట చేయరాదు.
ఆహారం సేవించునపుడు సాధ్యమైనంత వరకు ఉప్పు, కారం తగ్గించవలెను.
భోజనము ఒక పూట మాత్రమే ( మధ్యాహ్నం ) చేయవలెను.
ప్రతివారిని " స్వామి " అని మాత్రమే సంభోదించవలెను. పిల్లలను " మణికంఠ " అని సంభోదించవలెను.
బాలికలను, స్త్రీలను 'మాత' అని, భార్యను 'మాలికాపురత్తమ్మ' అని సంభోదించవలెను.
రాత్రి అల్పాహారం లేదా పాలు పండ్లు మాత్రమే తీసుకొనవలెను.
పాదరక్షలు ధరించరాదు. చిరుతిళ్ళు తినరాదు. ఏ విధమైన చెడుఅలవాట్లు ఉండరాదు.
పడుకునేటప్పుడు పరుపు, దిండ్లు ఉపయోగించరాదు. చాపమీద మాత్రమే పడుకొనవలెను.
దీక్షలో వారు వారి ఇంటిలో ఎవరైనా మరణించిన వారి వద్దకు వెళ్ళరాదు. అటుల వెళ్ళవలసి వచ్చిన, మాలను గురుస్వామితో తీయించి స్వామి ఫొటోకి వేయవలెను. ఆ సంవత్సరము అతను శబరిమల యాత్ర చేయరాదు.
స్వామి దీక్షలో ఉన్నప్పుడు పగలు ఎంత మాత్రము నిద్రించరాదు.
నిరంతరం శరణుఘోష జపించవలెను. "స్వామియే శరణం అయ్యప్ప" అను వేదమంత్రోచ్ఛారణ నిరంతరము జపించవలెను.
తాను చేయు ప్రతికార్యమును , ప్రతి జీవిలోను అయ్యప్ప భగవానుని దర్శించుచుండవలెను.
ప్రతి స్త్రీ (భార్యసైతము) దేవి స్వరూపమే.
అయ్యప్ప ఎల్లపుడు విభూది, చందనం, కుంకుమ బొట్టులతో విలసిల్లుచూ, అస్కలిత బ్రహ్మచర్యము అవలంభించవలెను.
ఎదుటివారిని తన యొక్క మాటల, చేతల వలన గాని నొప్పించక ఎల్లపుడూ దయ, శాంతమును కలిగి యుండవలెను.
'మానవ సేవయే మాధవ సేవ' అన్న సూక్తిని మరువక తోటివారికి సాధ్యమైనంత వరకు సహాయ పడుట అయ్యప్ప కర్తవ్యము.
నియమములను క్రమం తప్పకుండా ఆచరించు భక్తులను శబరిమల సన్నిధానమందు పదునెట్టాంబడి నెక్కు అర్హత కలుగును. భగవత్ సాక్షాత్కారము లభించును. శబరి యాత్ర ఫలితమును పొందగలరు.
కన్నెస్వాములకు కొన్ని ముఖ్య సూచనలు :

అయ్యప్పలు వ్యర్థ ప్రసంగములు చేయరాదు.
అయ్యప్పలు చెప్పినట్లు యాత్రలో అనుసరించవలెను. కాని బృందాన్ని వదలి ముందుకు నడవరాదు. ఆ భక్త సమూహంలో తప్పిపోయిన గుర్తు పట్టడం చాలా కష్టమౌతుంది.
ఇరుముడి నెత్తిపై పెట్టుకున్న తరువాత వెనక్కి తిరిగి చూడకూడదు. వస్తానని కాని, వెళుతున్నాని కాని, కుటుంబసభ్యులకు కాని మరెవ్వరికి చెప్పరాదు.
ఇరుముడిని శిరస్సుపై వుంచుకుని చిరుతిళ్ళు తినుట వంటివి చేయరాదు.
ఇరుముడిని కన్నె అయ్యప్పలు ఎట్టి పరిస్థితులలోను దించుకొనరాదు. అవసరమైతే బృందంలోని అయ్యప్పలే ఇరుముడిని క్రిందకు దించుతారు. బృదంలోని వారు కాక యాత్ర చేసే వేరే అయ్యప్పలెవరైనా సాయం చేయవచ్చును.
కన్నె అయ్యప్పలలో భక్తితో మహత్తర శక్తి నిబిడీకృతమై వుండుట వలన ఉత్సాహముతో ఉరకలు వేయడానికి మనసు ఆరాటపడుతుంది. కాని ఎట్టి పరిస్థితులలోనూ బృందాన్ని విడిచి వెళ్ళకూడదు.
యాత్రలో తినిబండారాలను అందరికీ పంచి పెట్టి తినాలి..
స్వామి శరణుఘోషను చెప్పుకుంటూ నడకను సాగించాలి.
యాత్రలో మనసును అయ్యప్పస్వామి పైనే లగ్నము చేయాలి.
యాత్రలో ఆలయములు, పుణ్యక్షేత్రములు దర్శించేటప్పుడు అందరితో కలసి దర్శించవలెను. కాని వేరుగా పూజలు జరపించరాదు. అందరితో కలసి వెళ్ళాలి. ఎవరిదారిన వారు వెళ్ళకూడదు.
స్నానము చేయునపుడు విలువైన వస్తువులు, డబ్బు మిగిలినవన్నీ అందరితో బాగా పరిచయము ఉన్న అయ్యప్పలకు ఇచ్చి వెళ్ళాలి.
కన్నె అయ్యప్పస్వాములు బృదంతో కాకుండా ఎప్పుడూ యాత్ర చేయరాదు. ఒంటరిగా కూడా వెళ్ళకూడదు.
సాటి అయ్యప్ప కనిపించనప్పుడు " స్వామిశరణం " అని చెప్పాలి. ఎవరినీ కూడా పేరుతో పిలవకూడదు. వారి వారి పేరు చివర 'అయ్యప్ప' అని కానీ 'స్వామి' అని కాని పిలవవలెను.
విద్యార్థులు, ఉద్యోగస్థులు, వ్యాపారస్థులు విధి నిర్వహణలో అశ్రద్ధ చేయరాదు. పూజలకు, భజనలకు అవకాశము లేని యెడల చింతించక, వారి వారి విధులు నిర్వహిస్తూనే శరణు ఘోష మనసులో తలచుకున్నా చాలు.
పూజా, భజన సమయాలలో ఒంటి మీద చొక్కా ఉంచుకోకూడదు. తువ్వాలును మాత్రం నడుముకు చుట్టుకోవాలి.
అయ్యప్పలు లుంగీ పంచను పైకి మడచి కట్టుకోరాదు. ఒక వేళ విధి నిర్వహణలో అడ్డుగా ఉంటే పైకి కట్టుకొనవచ్చును.
మాలవేసినపుడు, భజన పూజ నిర్వహించునపుడు ఇరుముడి కట్టినపుడు , మాల తీయునపుడు, గురుస్వామికి అయ్యప్పలు వారి శక్తి కొలది దక్షిణ చెల్లించవలెను.
అయ్యప్పలు సాటి అయ్యప్పలకు ,గురుస్వాములకు, తల్లిదండ్రులకు పాదనమస్కారములు చేయవలెను.
అయ్యప్పలు గుడిలోనికి వెళ్ళగానే ఒంటిపై చొక్కావిప్పి స్వామివారిని దర్శించాలి.
మాలాధారణ మంత్రము :

మాలను ఇతరులకు వేయునపుడు గురుస్వాములు ఈ మంత్రమును చెప్పవలెను.
జ్ఞానముద్రాం శాస్తృముద్రాం గురుముద్రాం నమామ్యహం |
వనముద్రాం శుద్దముద్రాం రుద్రముద్రాం నమామ్యహం |
శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం |
గురుదక్షిణయాపూర్వం తస్యానుగ్రహకారిణే |
శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం |
చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం |
శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః |
అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం |
విదితం శుద్దముత్కృష్టం సన్నిధానం నమామ్యహం |
ఊరుజం వాపురం చైవ భైఅరవద్వన్న సేవితం |
విష్ణుమాయాన్వితం శాస్తృ పరివారం నమామ్యహం ||
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ||
మాల విసర్జన మంత్రం :

మాల ధరించుటకు మంత్రమున్నట్లే మాలా విసర్జనమునకు మంత్రము గలదు. శబరిమల నుండి తిరిగి రాగానే ఇంటి ముంగిట కొబ్బరికాయ కొట్టి లోనికి ప్రవేశించి పూజా మందిరం లేక శ్రీవారి మండపం ముంగిట కర్పూరం వెలిగించి శరణుఘోషలు చెప్పి గురుస్వామికి దక్షిణ తాంబూలాదులు యొసంగి మాల విసర్జన మంత్రమును చెప్పి గురుస్వామి గారిచే మాల తీయించుకొనవలెను. అపూర్వ మచలా రోగా ద్దివ్య దర్శన కారన |
శాస్తృ ముద్రాద్మహాదేవ దేహిమే వ్రతమోచనం ||
దీక్షాపరులకు గమనిక

అయ్యప్ప దీక్షాపరులు పూజవిధానము మెదట గణపతిని పూజించి అనంతరము బ్రహ్మణ్యస్వామి ని అయ్యప్పస్వామిని విధిగా పూజిచవలెను. శరణుఘోష, శ్రీ అయ్యప్ప నినాదాలు, మరియు శ్రీ అయ్యప్ప స్వామి పంచరత్నములు విశేషాంశములలో పొందుపరిచినాము గమనింపగలరు.