WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Dasara Festival Bhakthi Articles. Show all posts
Showing posts with label Dasara Festival Bhakthi Articles. Show all posts

Friday, 30 September 2016

DASARA FESTIVAL STARTING FROM 01-10-2016 TO 11-10-2016 - FIRST AVATHAR SRI SWARNA KAVACHALANKRUTHA DEVI ALANKARAM AND DEVI PUJA PRASADHAM INFORMATION IN TELUGU

ఆశ్వయుజ మాసం లో వచ్చే శరన్నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు అతి ప్రీతి పాత్రమైన కాలం గా మనకు పెద్దల ద్వారా, పురాణాల ద్వారా తెలుస్తోంది. ప్రతి రోజూ భగవంతుని ఆరాధనకు బ్రాహ్మి సమయం, సంధ్యా సమయం ఎంత అత్యుత్తమ మైనవొ, అలాగే ఏడాది లో ఆశ్వయుజ మాసం లో శుక్ల పక్షం లో పాడ్యమి మొదలు దశమి తిధి వరకు ఉన్న రోజులు అమ్మ వారి ఆరాధనకు, సాధనకు అంత అత్యుత్తమ మైన సమయం గా ఋషుల చేత నిర్ణయింప బడినదని మనకు తెలుస్తోంది. శరద్ ఋతువులో భారత దేశం అంతా సమతుల్యమైన ఉష్ణోగ్రత ఉండటం వలన సాధనకు చాల అనువైన కాలం గా కూడా చెప్పబడుతుంది.
ఈ పవిత్ర పర్వ దినాలలో మన పాఠకులకు ప్రత్యేకంగా శరన్నవరాత్రి విశిష్టతను మరొక్క సారి గుర్తుకు తెస్తూ శ్రీమతి నయన కస్తూరి గారు ముందుగ శరన్నవరాత్రుల వైభవాన్ని వివరించటమే కాక, ఈ నవ రాత్రులలో ప్రతి రోజు అ మరుసటి రోజు యొక్క దేవీ అలంకార ప్రభావాన్ని విశదీకరిస్తూ, అ దేవికి సమర్పించే ప్రత్యేక నివేదన గురించి ప్రస్తావించటం జరుగుతుంది. పాఠకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ దేవి అలంకారాలూ నివేదనలు, ప్రాంతానుసారం ఉత్తర తూర్పు దక్షిణ భారతాలలో కొంత మార్పుతో ఉంటాయి. అంతేకాక అచ్చటి దేవీ క్షేత్రాల సంప్రదాయం అనుసరించి కూడా స్వల్పమైన మార్పుతో ఉండవచ్చు. మనం ఇక్కడ పొందు పరిచేవి, సామాన్యం గా మన ప్రాంతాలలో జరుపుకునే పద్ధతి ని అనుసరించి వుంటాయి.
కనుక అక్టోబర్ 1 వ తేదీ నుండి, అక్టోబర్ 11 వ తేదీ వరుకు కొనసాగే దేవి నవరాత్రులలో పాఠకులంతా అమ్మవారి వివిధ రూపాలని అర్చించి తరించగలరని ఆశిస్తూ, మన అందరిపై ఆ తల్లి కృపా కటాక్ష వీక్షణాలు నిరంతరం నిలవాలని కోరుకుంటున్నాము.
రమణ బంధకవి
సంపాదకుడు
శరన్నవరాత్రులు-------- ప్రధమం - ప్రసన్న రూపం (01-10-2016)
శ్రీ స్వర్ణకవచాలంకృత దేవీ అలంకారం
శ్రీమతి నయన కస్తూరి
వసంత ఋతువు దేవీ పూజకు ఎంత శ్రేష్టమో శరదృతువు కూడా అమ్మ ఆరాధనకు అంతే శ్రేష్ఠం. వేదాలు ఆవిర్భవించక పూర్వం నుండే శ్రీ శక్తిని పూజించే విధానం పురాణేతిహాసాల ద్వారా మనకు విదితమవుతోంది. మహాభారత సమయం లో శ్రీ కృష్ణుడు పాండవుల విజయం కోసం అమ్మవారిని ప్రార్ధించిన దాఖలాలు ఉన్నాయి. ఈ నవరాత్రులలో దేవీ ఆరాధనే ప్రముఖం గా వుంటుంది కనుక ఈ నవరాత్రులు, దేవీ నవరాత్రులుగా కూడా భక్తులచే పిలవబడుతున్నాయి.

మనం నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో శక్తి రూపానికి పూజలు జరిపిస్తామని చెప్పుకున్నాం కదా? అయితే నవరాత్రుల యందు ప్రధమ మైన శుక్ల పాడ్యమి రోజున అలరారించే సువర్ణ కవచాలంకృత దేవీ దివ్య రూపాన్ని ఈ రోజు దర్శించుకుందాము. ఒకసారి కనులు మూసుకుని ఆ సువర్ణ దివ్యమంగళ విగ్రహాన్ని మనసు నిండా నింపుకుని, ధ్యానించు కుందాము.

“ఓం హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం!
చంద్రాం హిరణ్మయిం లక్ష్మీం జాతవేదో మా అవహ!”

“అమ్మ మనసు ఎప్పుడూ బంగారమే! ఇక రూపం కూడా సువర్ణమైతే చెప్పేదేముంది? అమ్మ వారి స్వర్ణకవచాలంకారం వీక్షించడానికి సహస్రాక్షువులు ఉన్నా తక్కువే! అమ్మ అందం స్వర్ణ కవచాలంకరణతో ద్విగుణీకృతం అవుతుంది. అష్ట భుజాలతో శంఖ, చక్ర, గదాంకుశ, త్రిశూల దారి అయి, అలరారుతుంది. శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి గా సువర్ణ రత్న ఖచిత సింహాసనం మీద ఆసీనురాలై చిరుమందహాసం తో భక్తుల కోరికలు ఈడేరుస్తుంది. ఆ శాంభవి యొక్క సువర్ణ కవచం భక్తుల పాలిట రక్షణ కవచం అవుతుంది. ఆపదలకు అడ్డు కాస్తుంది. ఆ దివ్య మంగళ విగ్రహాన్ని మనస్సులో ప్రతిష్టించుకుని, శ్రీ దుర్గా అష్టోత్తరం తో షోడశోపచార పూజలు సలిపి, రాజోపచారాలు, భక్తోపచారాలు, శక్త్యోపచారాలు జరిపి తీపి బూందీని, నాన బెట్టిన శనగలు సుండలు శ్రద్ధగా చేసి, భక్తిగా నివేదించుకుని, మంగళ నీరాజనాలు అలది, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీ దుర్గా చాలీసా పారాయణం చేసి, ప్రధమ రోజు పూజ ముగించుకుని, దివ్యమైన ద్వితీయ అలంకారం తో రేపు కలుద్దాము!

ధరించవలసిన వర్ణం: పసుపు
ప్రసాద నివేదన: తీపిబూంది, శనగల సుండలు, పెసరసున్నుండలు.
ఇక ఈ నాటి అమ్మ వారి ప్రసాదాల తయారీ ని ఒక సారి చూద్దామా?

తీపి బూందీ:

రెండు గ్లాసుల జల్లించిన శనగపిండిని తీసుకోండి. తగినన్ని నీళ్ళు తీసుకుని పిండిని జాలువారుగా కలుపుకోండి. ఒక బాండీ లో రెండు గ్లాసుల పంచదార రెండు గ్లాసుల నీళ్ళ లో కలిపి, స్టవ్ మీద పెట్టి తీగ పాకం పట్టుకోవాలి. పాకాన్ని పక్కకు పెట్టి, ఇంకొక బాండీ లో నూనె పోసి స్టవ్ మీద పెట్టాలి, నూనె కాగాకా బూంది చట్రం తీసుకుని, దాని మీద ఇంకొక గరిటతో పిండి పోసి, కింద నుండి బూందీ ఆకారం లో పడేలా తిప్పుతూ వుండాలి. బూందీ మరీ కరకర మనకుండా నే తీసి, పంచదారపాకం లో వేస్తూ వుండాలి. పాకానికి సరి పడ బూందీ అయ్యాక బాగా కలిపి, ఒక పళ్ళెంలో కి తీసుకుని ఆరబెట్టు కోవాలి. బూందీ పాకం పీల్చుకుని బాగుంటుంది.

శనగల సుండలు:
ఒక అరకిలో శనగలు ముందు రోజు రాత్రి బాగా కడిగి నాన బెట్టుకోవాలి. మరునాడు నానిన శనగలను తీసి సరి పడ నీరు పోసి కుక్కర్ లో ఉడక బెట్టుకోవాలి. బాగా ఉడకడానికి కుక్కర్ ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. ఉడికిన తర్వాత చిల్లుల బుట్టలో వేసి నీళ్ళు పోనివ్వాలి. ఒక బాండిలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి, నాలుగు ఎండు మిరపకాయ ముక్కలు, రెండు చెంచాల మినప్పప్పు, ఒక అరచెంచా ఆవాలు, ఒక చెంచాడు జీలకర్ర వేసి, పోపు వేయించుకోవాలి. చివరలో 
నాలుగు పచ్చి మిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. ఒక చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. సుండలు తయార్! ఈ సుండలంటే అమ్మ వారికి అత్యంత ప్రీతి సుమండీ!

ఇతర నివేదనలు:
పై చెప్పినవే కాక కొందరు పెసర సున్నుండలు కూడా తయారు చేసి నివేదించటం కద్దు!

పెసర సున్నుండలు :
పెసర పప్పు ని వేయించి, మెత్తగా పొడి చేసుకుని, పెసర పిండి, చెక్కర ను కలిపి, కరిగించిన నేతిని తగినంత వేసి, యాలకుల పొడి వేసి చక్కగా ఉండలు కట్టుకుంటే పెసర సున్నుండలు తయార్!

MAHALAYA AMAVASYA - DASARA FESTIVAL BEGINNING - TELUGU ARTICLE

మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అర్ఘ్యము ఇవ్వడం ద్వారా వంశాభివృద్ధి ప్రాప్తిస్తుంది. ఇంకా మహాలయ అమావాస్య రోజున పేదలకు తమకువీలైనంత దానము చేయడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
సాధారణంగా ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలము. అయితే దక్షిణాయణము పితృదేవతల కాలము గనుక అశుభకాలమని మన పూర్వీకుల విశ్వాసం.

ప్రతి మాసంలో వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆరోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంటూ ఉంటారు.

ఇందులో మహాలయము అంటే.. భాద్రపద బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉన్న 15 రోజులు. దీన్ని పితృపక్షంగా మహాలయంగా చెప్తారు. ఇందులో మరీ ముఖ్యమైన తిధి త్రయోదశి.
"యత్యించిన్మధునా మిశ్రం ప్రదద్యాత్తు త్రయోదశీమ్ |
తదప్య క్షయమేవస్యాత్ వర్షాసుచ మఘాసుచ" ||
అనగా వర్షఋతువు నందు భాద్రపద కృష్ణత్రయోదశి మాఘా నక్షత్రంలో కూడి ఉన్న సమయంలో ఏ పదార్థమైనా శ్రాద్ధం చేసిన అది పితృదేవతలకు అక్షయ తృప్తిని ఇస్తుందని విశ్వాసం.

అంతటి విశిష్టత గాంచిన ఈ మహాలయ పక్షమందు అందరూ వారి వారిశక్తిని తగినట్లుగా పితృదేవతలకు తర్పణమివ్వాలని పురోహితులు చెబుతున్నారు. కొందరు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయాతిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు ఆచరించవచ్చును. ఒకవేళ గతించిన పెద్దల తిథి గుర్తులేనప్పుడు "మహాలయ అమావాస్య"నాడే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడం ఉత్తమమని పురోహితులు అంటున్నారు.

కావున పితృకార్యములు చేయుటకు అర్హత పొందినవారు అంతా విధిగా పక్షాలను ఆచరించి, వారి వారి వంశవృక్షములకారకులైన పితృదేవతలను స్మరించుకుని శ్రాద్ధ కర్మలు చేస్తే వారి శుభాశీస్సులతో సర్వశుభములు పొందుతారని పండితులు పేర్కొంటున్నారు.

Wednesday, 2 December 2015

GODDESS SRI KANAKA DURGA MATHA WEAPONS AND ITS MEANING IN TELUGU

దుర్గా మాత ఆయుధాలు మరియు వాటి అర్ధం.

 శంఖం
శంఖం ప్రణవాన్ని లేదా ఓంకారానికి ప్రతీక. ఈ శబ్ద రూపం లో అమ్మవారు కొలువై ఉందని అర్ధం. ధనుర్బాణాలు:
ఇవి శక్తి ని సూచిస్తాయి.ధనుర్బాణాలని ఒక చేతిలో ధరించిన దుర్గా మాత తాను స్థితి గతి శక్తులు రెండింటి మీదా అధికారం కలిగియున్నానని అమ్మవారు తెలియచేస్తున్నట్లు 
గద:
ఆవిడ చేతిలో ఉండే చక్రం ధృడ సంకాల్పానికి ప్రతీక. భక్తులు కూడా తమ నమ్మకాల పట్ల అంత ధృడం గా వ్యవహరించాలనీ ,ఎటువంటి ఆపద ఎదురొచ్చినా మొక్కవోని ధైర్యం తో ఎదుర్కోవాలనీ అర్ధం.

కమలం:
దుర్గా మాత చేతిలోని కమలం పూర్తిగా వికిసితమయ్యి ఉండదు.అంటే సఫలత అనివార్యమనీ కానీ అదే ఆఖరు మజిలీ కాదనీ అర్ధం.సంస్కృతం లో కమలాన్ని "పంకజం" అంటారు. అంటే బురద నుండి పుట్టినది అని అర్ధం. బురదలో కమలం వికసించినట్లు దురాశ, కోరికల మధ్యలో జీవిస్తున్న భక్తులు కూడా ఆధ్యాత్మికతని వికసింపచేసుకోవాలని సూచన అన్నమాట.

సుదర్శన చక్రం:
సుదర్శన చక్రం దుర్గా మాత యొక్క చూపుడు వేలు పైన వేలుకి తాకకుండా తిరుగుతూ ఉంటుంది.అంటే ఈ విశ్వం అంతా ఆ మాత యొక్క ఆఙకి లోబడి నడుస్తోందనడానికి సూచన.చెడు ని సంహరించి మంచి ని వృద్ధి చెయ్యడానికి ఈ సుదర్శన చక్రాన్ని అమ్మవారు వాడుతుంది.

ఖడ్గం:
దుర్గా మాత ధరించే ఖడ్గం కత్తి వంటి పదును గల ఙానాన్ని సూచిస్తుంది.అన్ని సందేహాలనుండీ విముక్తమైన ఙానం కత్తి వాదర వలే మెరుస్తుంది.

త్రిశూలం:
త్రిశూలం మూడు గుణాలైన సత్వ ,రజో , తమో గుణాలకి ప్రతీక.శారీరక,మానసిక, ఆధ్యాత్మిక అవరోధాలని దుర్గా మాత తొలగిస్తుంది.

దుర్గా మాత నిర్భయం గా సింహం మీద నిలుచుని ఉంటుంది.

దుర్గా మాత నిర్భయం గా సింహం మీద నిలుచుని ఉంటుంది. ఇది అభయముద్ర. అంటే భయం నుండి విమోచనని సూచిస్తుంది. ఈ ముద్రలో అమ్మవారు భక్తులనుద్దేశించి " మీ కార్యాలు, విధుల భారాన్ని నా మీద వెయ్యండి, మిమ్మల్ని అన్ని భయాల నుండీ విముక్తులని చేస్తాను" అన్నట్లుగా ఉంటుంది.

Thursday, 25 September 2014

WHAT ARE THE ESSENTIALS REQUIRED FOR PERFORMING DASARA PUJA

పూజకు అవసరమైన ముఖ్య వస్తువులు

01. పూజ వేళ ఉపయోగించుటకుగాను విడివిడిగ పాత్రలలో జలము, ఉద్ధరిణెలు లేదా చెంచాలు కావలేను.

02. ఏ దైవమును పూజించుచున్నామో ఆ దైవము యొక్క చిత్రపటము లేదా ప్రతిమ, అది కూడా లేనప్పుడు బంగారు లేదా వెండితో చెసిన కాసు.

03. ముఖ్యముగా “వినాయక” పుజకు “వరలక్ష్మీ పూజకు పాలవెల్లి కట్టి తీరవలెను.

04. దీపారధనకు కుందులు, ప్రత్తితో చేసిన వత్తులు, ఆవు నెయ్యి, అవి వెలిగించుటకు ఒక అగ్గిపెట్టె, ధూపారాధనకు సాంబ్రాణి.

05. పూజ నిమిత్తము అక్షతలు, పువ్వులు, పసుపు కుంకుమ.

06. ఇతరేతరోపచారార్ధము =- తపలపాకులు, వక్కలు, అగరు వత్తులు, గంధము, హారతికర్పూరము, కొబ్బరికాయలు.

07. ప్రధానముగా కలశము, దానిపైకి ఒక కొబ్బరికాయ, రవికెల గుడ్ద.

08. వినాయకపూజకు తప్పనిసరిగా 21 రకముల పత్రి కావలెను.

09. నివేదన (నైవేద్యం) నిమిత్తముగా బెల్లము ముక్క (గుడశకలం), అరటిపళ్ళు (కదళీఫలం), కొబ్బరి (నారికేళఫలం) ఇవి సాధారణావసరములు.

Wednesday, 24 September 2014

DEVI NAVARATHRI PUJA INFORMATION IN TELUGU - DASARA FESTIVAL SPECIAL TELUGU INFORMATION

నవ అంటే తొమ్మిది. సంస్కృత భాషలో నవానాం రాత్రీనాం సమహరః నవరాత్రి. అంటే నవరాత్రి తొమ్మిది రాత్రుల సమహారమని. ఈ తొమ్మిది రాత్రులు అమ్మవారిని ఆరాధించాలి కనుక దేవి నవరాత్రులన్నారు. 
నవ‬ సంఖ్య పరిపూర్ణతకు చిహ్నం.ఈ నవరాత్రులు మనిషికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తాయి. ఈ నవరత్రులలో దేవిభాగవతం చదవడంకానీ,వినడంకాని చేస్తారు.

అమ్మవారు వివిధ రూపాల్లో రాక్షసులను సంహరించింది. నిజానికి రాక్షసులు ఎక్కడొ లేరు. మనలోనే, ఆలోచనలలో, మనసులో ఉన్న చెడు భావాలలో, దురలవాట్లు, కుళ్ళు కుతంత్రాలే రాక్షసులు. వారిని ఈ తొమ్మిది రాత్రులలో ఈ దేవి భాగవత పారాయణతో వాటిని సంహరించి జయించడం, మనలను మనం సంస్కరించుకోవడమే విజయదశమి పండుగ.

నవ అంటే పరమేశ్వరుడని, రాత్రి అంటే పరమేశ్వరి అని కూడా అర్ధాలు ఉన్నాయి. అలాగే నవ అంటే క్రొత్తది అని కూడా అర్ధం ఉంది. 9 రోజులు ఆరాధన చేయలేని వారు 7 రోజులు కానీ,5,3 లేదా కనీసం చివరి రోజైనా తప్పక ఆరధించాలి అని శాస్త్రం చెప్తొంది.

ఆ కాలంవారికి పనిపాటలేదు కనుక ఎప్పుడు పూజలు పునస్కారాలు చేసేవారు,మాకైతే ఉదయం ఆఫీసు ఉంటుంది, కాలేజీ ఉంటుంది, లేదా వేరే పని ఉన్నదని తప్పించుకోవటానికి లేదు. ఎందుకంటే ఇది రాత్రి విశేషంగా చేయవలసిన పూజ. సాయంకాలం నుండి రాత్రి 9గంటలలోపు చేయవలసిన ఆరాధన. ఆ సమయానికి అందరు ఇంటికి చేరుకుంటారు కనుక తప్పించుకునే అవకాశం లేదు.

పవంచ వింధ్య వాసిన్యాం నవరాత్రోపవాసతః|
ఏక భుక్తేన నక్తేన తధైవాయాచితేన చ||
ఈ నవరాత్రి వ్రతాని ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో ఆచరించాలని,ఆచరించేవారు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలని అర్దం.
పూజనీయా జనైర్దేవి స్థానే స్థానే పురే పురే|
గృహే గృహే శక్తి పరైర్ర్గ్రామే గ్రామే వనే వనే||

ఈ వ్రతాన్ని ప్రతినగరంలోను,ఇంట్లోను,గ్రామంలోను,వనంలొ ప్రతి చోట ఆచరించాలి అని అర్దం.

ఒక సాధకుడి జీవితంలో నవరాత్రులను మూడు భాగాలుగా విభజించి ఆ దేవికి వుండే మూడు అంశలుగా భావించి ఆరాధించడంవల్ల ఎంతో పవిత్రమైన సత్యం ఆవిష్కరణ అవుతుంది. దేవికి తొమ్మిది రోజులు చేసే నవరాత్ర పూజ ఆత్మ సాక్షాత్కారానికి అనువైన మార్గంగా బోధిస్తున్నారు స్వామి శివానంద. మొదటి 3 రోజులు దుర్గగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవిగా, చివరి 3 రోజులు సరస్వతీదేవిగా అమ్మను ఆరాధించాలి.

DASARA PUJA 2014 FIRST DAY SRI BALA THRIPURA SUNDARI AVATHAR OF GODDESS SRI KANAKA DURGA PUJA DETAILS

నవరాత్రులలో తొమ్మిది రూపాలలో శక్తిని ఆరాధిస్తారు. 

స్థలసంప్రదాయాన్ని బట్టి దేవతల రూపాలు మారుతూ ఉంటాయి

దసరా ఒక హిందువుల ముఖ్యమైన పండుగ . ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది.

నేటిదినమును బాలాత్రిపురసుందరి అవతారములో అమ్మవారిని పూజించవచ్చు.ఈరోజు చిన్నపిల్లలకు పసుపురాసి పూజచేసి వారిలో అమ్మవారిని చిన్నపిల్లగా చూస్తారు. ఈ బాలాత్రిపురసుందరి దేవికి పాయసం నివేదనగా అర్పిస్తారు.

శైలపుత్రి: సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి

Bezawada Sri Kanaka Durga Amma vari Navarathrulu First Day Avathar Information - Swarna Kavacha Alankrita Durga Devi Puja - Navaratri Day One 25-09-2014

Swarna Kavacha Alankrita Durga Devi Puja - Navaratri Day One - Telugu - 

స్వర్ణ కవచలంకృత దుర్గాదేవి పూజ

అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
విజయవాడ కనకదుర్గ అలంకారాలే రాష్ట్రములోని మిగతా ప్రాంతాలలో కూడా అనుసరిస్తారు.
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.
నవరాత్రిలో ప్రతిదినము చేయవలసిన పూర్తి పూజ
శుక్లామ్బరధరమ్ విష్ణుమ్ శశి వర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోప శాంతాయే

దీపత్వమ్ బ్రహ్మ రూపేసి జ్యోతిషాం ప్రభురవనయహ్
సౌభాగ్యం దేహి పుత్రాన్స్‌చ సర్వాన్ కామాన్‌శ్చ దేహిమ్

దీపమును వెలిగించి దీపపు కున్దిని కుంకుమ అక్షంతాలతో అలంకరీంపవలెను
శ్లో : అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః,విష్ణవే నమః,
మధుసూదనాయ నమః,త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః,శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ప్రాణాయామము
(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
సంకల్పం
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
తదంగత్వేన కలశారాధనం కరిష్యే
కలశారాధనం
శ్లో : కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)
శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)
మం : ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

శ్రీ మహాగణాధిపతి బెల్లము OR పండ్లు గానీ ప్రసాదముగ నివేదించాలి. కర్పూర నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను).
శ్రీ దుర్గా దేవియే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.
శ్రీ దుర్గా దేవి యే నమః పాదయోః పాద్యం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి (గంధం చల్లవలెను)
శ్రీ దుర్గా దేవియే నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
అధాంగ పూజ
ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి

శ్రీ దుర్గాష్టోత్తర శతనామ పూజ
ఓం దుర్గాయై నమ:
ఓం శివాయై నమ:
ఓం మహాలక్ష్మ్యై నమ:
ఓం మహా గౌర్యై నమ:
ఓం చండికాయై నమ:
ఓం సర్వజ్జాయై నమ:
ఓం సర్వలోకోశ్యై నమ:
ఓం సర్వ కర్మ ఫల ప్రదాయై నమ:
ఓం సర్వ తీర్థమయాయై నమ:
ఓం పుణ్యాయైనమ:
ఓం దేవయోనయే నమ:
ఓం అయోనిజాయై నమ:
ఓం భూమిజాయై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం ఆధార శక్త్యై నమ:
ఓం అనీశ్వర్యై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం నిరహంకారాయై నమ:
ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ: 
ఓం సర్వలోక ప్రియాయై నమ:
ఓం వాణ్యై నమ:
ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:
ఓం పార్వత్యై నమ:
ఓం దేవమాత్రే నమ:
ఓం వనీశ్యై నమ:
ఓం వింద్య వాసిన్యై నమ:
ఓం తేజోవత్యై నమ:
ఓం మాహా మాత్రే నమ:
ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ:
ఓం దేవతాయై నమ:
ఓం వహ్ని రూపాయై నమ:
ఓం సతేజసే నమ:
ఓం వర్ణ రూపిణ్యై నమ:
ఓం గణాశ్రయాయై నమ:
ఓం గుణమద్యాయై నమ:
ఓం గుణ త్రయ వివర్జితాయై నమ:
ఓం కర్మజ్జాన ప్రదాయై నమ:
ఓం కాంతాయై నమ:
ఓం సర్వ సంహార కారిణ్యై నమ:
ఓం ధర్మజ్జానాయై నమ:
ఓం ధర్మ నిష్ఠాయై నమ:
ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:
ఓం కామాక్ష్యై నమ:
ఓం కామ సంహత్ర్యై నమ:
ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:
ఓం శాంకర్యై నమ:
ఓం శాంభవ్యై నమ:
ఓం శాంతాయై నమ:
ఓం చంద్ర సూర్య లోచనాయై నమ:
ఓం సుజయాయై నమ:
ఓం జయాయై నమ:
ఓం భూమిష్థాయై నమ:
ఓం జాహ్నవ్యై నమ:
ఓం జన పూజితాయై నమ:
ఓం శాస్త్ర్ర్రాయై నమ:
ఓం శాస్త్ర మయాయై నమ:
ఓం నిత్యాయై నమ:
ఓం శుభాయై నమ:
ఓం శుభ ప్రధాయై
ఓం చంద్రార్ధ మస్తకాయై నమ:
ఓం భారత్యై నమ:
ఓం భ్రామర్యై నమ:
ఓం కల్పాయై నమ:
ఓం కరాళ్యై నమ:
ఓం కృష్ఠ పింగళాయై నమ:
ఓం బ్రాహ్మే నమ:
ఓం నారాయణ్యై నమ:
ఓం రౌద్ర్ర్యై నమ:
ఓం చంద్రామృత పరివృతాయై నమ:
ఓం జేష్ఠాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం మహా మాయాయై నమ:
ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమ:
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:
ఓం కామిన్యై నమ:
ఓం కమలాయై నమ:
ఓం కాత్యాయన్యై నమ:
ఓం కలాతీతాయై నమ:
ఓం కాల సంహార కారిణ్యై నమ:
ఓం యోగ నిష్ఠాయై నమ:
ఓం యోగి గమ్యాయై నమ:
ఓం తపస్విన్యై నమ:
ఓం జ్జాన రూపాయై నమ:
ఓం నిరాకారాయై నమ:
ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమ:
ఓం భూతాత్మికాయై నమ:
ఓం భూత మాత్రే నమ:
ఓం భూతేశాయై నమ:
ఓం భూత ధారిణ్యై నమ:
ఓం స్వదానారీ మద్యగతాయై నమ:
ఓం షడాధారాది వర్ధిన్యై నమ:
ఓం మోహితాయై నమ:
ఓం శుభ్రాయై నమ:
ఓం సూక్ష్మాయై నమ:
ఓం మాత్రాయై నమ:
ఓం నిరాలసాయై నమ:
ఓం నిమగ్నాయై నమ:
ఓం నీల సంకాశాయై నమ:
ఓం నిత్యానందాయై నమ:
ఓం హరాయై నమ:
ఓం పరాయై నమ:
ఓం సర్వ జ్జాన ప్రదాయై నమ:
ఓం ఆనందాయై నమ:
ఓం సత్యాయై నమ:
ఓం దుర్లభ రూపిణ్యై నమ:
ఓం సరస్వత్యై నమ:
ఓం సర్వ గతాయై నమ:
ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ:

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గా దేవి యే నమః (ప్రసాదం నివేదయామి).

ఓం ప్రాణాయస్వాహా, ఓమ్ అపానాయస్వాహా, ఓంవ్యానాయ స్వాహా
ఓమ్ ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. (నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి. (తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ దుర్గా దేవి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
(అనుకొని నమస్కరించుకొనిదేవుని వద్దగల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)
శ్రీ దుర్గా దేవి పూజ సమాప్తం.

Dasara Festival 2014 Pooja Information and step by step details - Dasara Puja - Durga Puja Vidhanamu - Vivaramulu - Telugu Article of Bezawada Sri Kanaka Durga Ammavari Alankaramulu and its detailed puja information

Dasara Puja - Durga Puja Vidhanamu - Vivaramulu - Telugu - 

దుర్గాదేవీ పూజా విధానం

బెజవాడ కనక దుర్గ అలంకారములు

మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి - రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి - మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి - నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి - ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి - ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి - ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి ) - తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి ) - పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )

శ్రీ శైలము దుర్గ అవతారములు

1రోజున శైలపుత్రి అలంకారం, భృంగి వాహన సేవ,
2న బ్రహ్మచారిణి, మయూర వాహనం,
3న చంద్రగంట , రావణ వాహన సేవ,
4న కూష్‌మాండ , కైలాస వాహన సేవ,
5న స్కంధమాత , శేష వాహనసేవ,
6న కాత్యాయని , హంస వాహనసేవ,
7న కాళరాత్రి, గజవాహన సేవ,
8న మహాదుర్గ , అశ్వ వాహనసేవ,
9న సిద్ధదాయిని అలంకారం, నంది వాహనసేవ

దుర్గాదేవీ పూజా విధానం

శుక్లామ్బరధరమ్ విష్ణుమ్ శశి వర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోప శాంతాయే

దీపత్వమ్ బ్రహ్మ రూపేసి జ్యోతిషాం ప్రభురవనయహ్
సౌభాగ్యం దేహి పుత్రాన్స్‌చ సర్వాన్ కామాన్‌శ్చ దేహిమ్

దీపమును వెలిగించి దీపపు కున్దిని కుంకుమ అక్షంతాలతో అలంకరీంపవలెను
శ్లో : అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః,విష్ణవే నమః,
మధుసూదనాయ నమః,త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః,శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ప్రాణాయామము
(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

కలశారాధనం

శ్లో : కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం : ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

శ్రీ మహాగణాధిపతి బెల్లము OR పండ్లు గానీ ప్రసాదముగ నివేదించాలి. కర్పూర నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను).
శ్రీ దుర్గా దేవియే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.
శ్రీ దుర్గా దేవి యే నమః పాదయోః పాద్యం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి (గంధం చల్లవలెను)
శ్రీ దుర్గా దేవియే నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)

అధాంగ పూజ

ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి

శ్రీ దుర్గాష్టోత్తర శతనామ పూజ

అక్షతలు ,పుష్పములు పూజ చెయ్యండి
ఓం దుర్గాయై నమ:
ఓం శివాయై నమ:
ఓం మహాలక్ష్మ్యై నమ:
ఓం మహా గౌర్యై నమ:
ఓం చండికాయై నమ:
ఓం సర్వజ్జాయై నమ:
ఓం సర్వలోకోశ్యై నమ:
ఓం సర్వ కర్మ ఫల ప్రదాయై నమ: 
ఓం సర్వ తీర్థమయాయై నమ:
ఓం పుణ్యాయైనమ:
ఓం దేవయోనయే నమ:
ఓం అయోనిజాయై నమ:
ఓం భూమిజాయై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం ఆధార శక్త్యై నమ:
ఓం అనీశ్వర్యై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం నిరహంకారాయై నమ:
ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ: 
ఓం సర్వలోక ప్రియాయై నమ:
ఓం వాణ్యై నమ:
ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:
ఓం పార్వత్యై నమ:
ఓం దేవమాత్రే నమ:
ఓం వనీశ్యై నమ:
ఓం వింద్య వాసిన్యై నమ:
ఓం తేజోవత్యై నమ:
ఓం మాహా మాత్రే నమ:
ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ: 
ఓం దేవతాయై నమ:
ఓం వహ్ని రూపాయై నమ:
ఓం సతేజసే నమ:
ఓం వర్ణ రూపిణ్యై నమ:
ఓం గణాశ్రయాయై నమ:
ఓం గుణమద్యాయై నమ:
ఓం గుణ త్రయ వివర్జితాయై నమ:
ఓం కర్మజ్జాన ప్రదాయై నమ:
ఓం కాంతాయై నమ:
ఓం సర్వ సంహార కారిణ్యై నమ: 
ఓం ధర్మజ్జానాయై నమ:
ఓం ధర్మ నిష్ఠాయై నమ:
ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:
ఓం కామాక్ష్యై నమ:
ఓం కామ సంహత్ర్యై నమ:
ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:
ఓం శాంకర్యై నమ:
ఓం శాంభవ్యై నమ:
ఓం శాంతాయై నమ:
ఓం చంద్ర సూర్య లోచనాయై నమ: 
ఓం సుజయాయై నమ:
ఓం జయాయై నమ:
ఓం భూమిష్థాయై నమ:
ఓం జాహ్నవ్యై నమ:
ఓం జన పూజితాయై నమ:
ఓం శాస్త్ర్ర్రాయై నమ:
ఓం శాస్త్ర మయాయై నమ:
ఓం నిత్యాయై నమ:
ఓం శుభాయై నమ:
ఓం శుభ ప్రధాయై
ఓం చంద్రార్ధ మస్తకాయై నమ:
ఓం భారత్యై నమ:
ఓం భ్రామర్యై నమ:
ఓం కల్పాయై నమ:
ఓం కరాళ్యై నమ:
ఓం కృష్ఠ పింగళాయై నమ:
ఓం బ్రాహ్మే నమ:
ఓం నారాయణ్యై నమ:
ఓం రౌద్ర్ర్యై నమ:
ఓం చంద్రామృత పరివృతాయై నమ:
ఓం జేష్ఠాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం మహా మాయాయై నమ:
ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమ:
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:
ఓం కామిన్యై నమ:
ఓం కమలాయై నమ:
ఓం కాత్యాయన్యై నమ:
ఓం కలాతీతాయై నమ:
ఓం కాల సంహార కారిణ్యై నమ:
ఓం యోగ నిష్ఠాయై నమ:
ఓం యోగి గమ్యాయై నమ:
ఓం తపస్విన్యై నమ:
ఓం జ్జాన రూపాయై నమ:
ఓం నిరాకారాయై నమ:
ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమ:
ఓం భూతాత్మికాయై నమ:
ఓం భూత మాత్రే నమ:
ఓం భూతేశాయై నమ:
ఓం భూత ధారిణ్యై నమ:
ఓం స్వదానారీ మద్యగతాయై నమ:
ఓం షడాధారాది వర్ధిన్యై నమ:
ఓం మోహితాయై నమ:
ఓం శుభ్రాయై నమ:
ఓం సూక్ష్మాయై నమ:
ఓం మాత్రాయై నమ:
ఓం నిరాలసాయై నమ:
ఓం నిమగ్నాయై నమ:
ఓం నీల సంకాశాయై నమ:
ఓం నిత్యానందాయై నమ:
ఓం హరాయై నమ:
ఓం పరాయై నమ:
ఓం సర్వ జ్జాన ప్రదాయై నమ:
ఓం ఆనందాయై నమ:
ఓం సత్యాయై నమ:
ఓం దుర్లభ రూపిణ్యై నమ:
ఓం సరస్వత్యై నమ:
ఓం సర్వ గతాయై నమ:
ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ:

తదుపరి ఇక్కడ ఏ రోజు ఏ దేవి అలంకారిన్ని, అవతారాన్ని పూజిస్తారో ఆరోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను.
_________

బెజవాడ కనక దుర్గ అలంకారములు

మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి - రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి - మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి - నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి - ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి - ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి - ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి ) - తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి ) - పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )
తిథి నక్షత్రములను బట్టి అలంకారములు మారవచ్చును