WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 2 December 2015

GODDESS SRI KANAKA DURGA MATHA WEAPONS AND ITS MEANING IN TELUGU


దుర్గా మాత ఆయుధాలు మరియు వాటి అర్ధం.

 శంఖం
శంఖం ప్రణవాన్ని లేదా ఓంకారానికి ప్రతీక. ఈ శబ్ద రూపం లో అమ్మవారు కొలువై ఉందని అర్ధం. ధనుర్బాణాలు:
ఇవి శక్తి ని సూచిస్తాయి.ధనుర్బాణాలని ఒక చేతిలో ధరించిన దుర్గా మాత తాను స్థితి గతి శక్తులు రెండింటి మీదా అధికారం కలిగియున్నానని అమ్మవారు తెలియచేస్తున్నట్లు 
గద:
ఆవిడ చేతిలో ఉండే చక్రం ధృడ సంకాల్పానికి ప్రతీక. భక్తులు కూడా తమ నమ్మకాల పట్ల అంత ధృడం గా వ్యవహరించాలనీ ,ఎటువంటి ఆపద ఎదురొచ్చినా మొక్కవోని ధైర్యం తో ఎదుర్కోవాలనీ అర్ధం.

కమలం:
దుర్గా మాత చేతిలోని కమలం పూర్తిగా వికిసితమయ్యి ఉండదు.అంటే సఫలత అనివార్యమనీ కానీ అదే ఆఖరు మజిలీ కాదనీ అర్ధం.సంస్కృతం లో కమలాన్ని "పంకజం" అంటారు. అంటే బురద నుండి పుట్టినది అని అర్ధం. బురదలో కమలం వికసించినట్లు దురాశ, కోరికల మధ్యలో జీవిస్తున్న భక్తులు కూడా ఆధ్యాత్మికతని వికసింపచేసుకోవాలని సూచన అన్నమాట.

సుదర్శన చక్రం:
సుదర్శన చక్రం దుర్గా మాత యొక్క చూపుడు వేలు పైన వేలుకి తాకకుండా తిరుగుతూ ఉంటుంది.అంటే ఈ విశ్వం అంతా ఆ మాత యొక్క ఆఙకి లోబడి నడుస్తోందనడానికి సూచన.చెడు ని సంహరించి మంచి ని వృద్ధి చెయ్యడానికి ఈ సుదర్శన చక్రాన్ని అమ్మవారు వాడుతుంది.

ఖడ్గం:
దుర్గా మాత ధరించే ఖడ్గం కత్తి వంటి పదును గల ఙానాన్ని సూచిస్తుంది.అన్ని సందేహాలనుండీ విముక్తమైన ఙానం కత్తి వాదర వలే మెరుస్తుంది.

త్రిశూలం:
త్రిశూలం మూడు గుణాలైన సత్వ ,రజో , తమో గుణాలకి ప్రతీక.శారీరక,మానసిక, ఆధ్యాత్మిక అవరోధాలని దుర్గా మాత తొలగిస్తుంది.

దుర్గా మాత నిర్భయం గా సింహం మీద నిలుచుని ఉంటుంది.

దుర్గా మాత నిర్భయం గా సింహం మీద నిలుచుని ఉంటుంది. ఇది అభయముద్ర. అంటే భయం నుండి విమోచనని సూచిస్తుంది. ఈ ముద్రలో అమ్మవారు భక్తులనుద్దేశించి " మీ కార్యాలు, విధుల భారాన్ని నా మీద వెయ్యండి, మిమ్మల్ని అన్ని భయాల నుండీ విముక్తులని చేస్తాను" అన్నట్లుగా ఉంటుంది.

No comments:

Post a Comment