WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Telugu Mahabharatha Stories. Show all posts
Showing posts with label Telugu Mahabharatha Stories. Show all posts

Friday, 30 September 2016

CAPITAL CITY OF PANDAVAS - INDRAPRASTHAM - FULL INFORMATIVE STORY IN TELUGU



ఇంద్రప్రస్థం

ఇంద్రప్రస్థం కథ... ధర్మచింతనులైన పాండవులను దుర్యోధనాదులకు దూరంగా గెంటివేయాలన్న దురుద్దేశంతో చక్రవర్తి ధృతరాష్ట్రుడు వారిని పిలిచి `నాయనలారా, మీరు ఖాండవప్రస్థం అనే చోటికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండండి… ‘ అని ఆదేశించాడు. మహారాజు ఆదేశానుసారంగా పాండవులు ఖాండవప్రస్థం చేరారు. అయితే, అది ఎలా ఉన్నదంటే- పూర్తిగా కొండలు గుట్టలు, చెట్లూచేమలూ… జనసంచారం చాలాతక్కువ. 

మహాసౌధాలతో కళకళలాడే హస్తినాపురి ఎక్కడ ? ఈ అటవీప్రాంతమైన ఖాండవప్రస్థం ఎక్కడ? కానీ, ధృతరాష్ట్రులవారు మాత్రం- `నాయనలారా, హస్తినాపురి ఎంతో ఈ ఖాండవప్రస్థం కూడా అంతే సుమీ… మీరక్కడ సుఖశాంతులతో వర్థిల్లండి’ అంటూ ఎలాంటి అనుమానాలకు తావులేదన్నట్టుగా తేల్చి చెప్పాడు. పాండవులు హస్తినాపురి విడిచి ఖాండవప్రస్థం బయలుదేరారు. ఈ రాజ్యపంపకం హస్తినాపురవాసులకు నచ్చలేదు. ఇది అన్యాయమని వాపోయారు. కానీ మహారాజు నిర్ణయాన్ని ఎదిరించలేకపోయారు. పాండవులు ఖాండవప్రస్థం వెళ్ళిచూశారు. అక్కడ మెరక, పల్లపు భూములు చాలానేఉన్నాయి. చిన్నచిన్న గుట్టలు, భయంకరమైన అడవులు…అక్కడక్కడా పల్లెలు కనిపించాయి. ఇదీ ఖాండవప్రస్థ భౌగోళిక స్థితి. అయితే ఒకే ఒక్క సౌకర్యం ఉంది. ఈ ప్రాంతం పక్కనుంచే యమునానది ప్రవహిస్తోంది.

ఈలాంటి ఖాండవప్రస్థాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని యుధిష్టిరుడు సంకల్పం చెప్పుకున్నాడు. అందుకు శ్రీకృష్ణుడు మద్దతు పలికాడు. స్థానికుల సాయంతో అటవీభూములను వ్యవసాయానికి అనుకూలంగా మలుచుకున్నారు. సకాలంలో వానలు పడటంతో నదులూ వాగులూ ఒప్పొంగాయి. పంటలు బాగా పండాయి. తినడానికి తిండి, త్రాగడానికి నీరు సంవృద్ధిగా అందుబాటులోకి వచ్చింది. దీంతో అభివృద్ధికి బాటలుపడ్డాయి. అవసరమైన చోట్ల రహదారులు నిర్మించారు. నెమ్మదిగా వాణిజ్యానికి అనుకూలవాతావరణం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వర్తక శ్రేణులు తమ వ్యాపారాలను ఈ ప్రాంతానికే తరలించారు. ధనధాన్యరాశులు వచ్చిపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం ఉరకలెత్తుతోంది.

హస్తినాపురికి తీసిపోని విధంగా ఖాండవప్రస్థం రూపుదిద్దుకుంటోంది. ఖాండవప్రస్థం కాస్తా ఇంద్రప్రస్థంగా మారిపోయింది. అంటే సాక్షాత్తు ఇంద్రుడు నివసించే ప్రాంతంలా విరాజిల్లింది. పాలనాపరమైన సౌకర్యాల కోసం ఒక రాజ్యసభ అవసరమైంది. దేవతలశిల్పి మయుడు ఆనాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుని అందమైన రాజ్యసభను నిర్మించారు. ఆసభకు మయసభ అన్న పేరు సార్థకమైంది. సామంతరాజులు ధర్మరాజుని కీర్తించారు.

అడవిలో పడిఉండమని చక్రవర్తి శాసించినా కారడవిని మహానగరంలా మార్చిన పాండవుల తెలివితేటలు చూసి దుర్యోధనాదులకు కన్నుకుట్టింది. పాండవులు నిర్వహించిన రాజసూయ యాగంతో ఈర్ష పతాకస్థాయికి చేరుకుంది. వెళ్లకూడదనుకుంటూనే ధుర్యోధనాదులు రాజసూయయాగానికి వెళ్ళారు. అక్కడి మయసభను విభ్రాంతితో చూశారు. దుర్యోధనుడు చిత్తభ్రాంతికి గురై మడుగులో కాలుజారి పడ్డాడు. అదే సమయంలో అక్కడున్న పాంచాలి నవ్వింది. దీంతో పరాభవాగ్నితో దహించుకుపోతున్న దుర్యోధనుడ్ని శాంతిపచేయడానికి శకుని మాయాజూదం అంకానికి తెరతీశారు. ఫలితంగా చివరకు మహాభారత యుద్ధం జరిగింది. ఇదీ నాటి ఇంద్రప్రస్థ కథ.

Thursday, 30 June 2016

BIRTH HISTORY MAHABHARATHA HERO - EKALAVYA


ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు !

(ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం)
మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు?
ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతానికి హరివంశం ఖిలపర్వం, సంస్కృత భారంతలో మూల హరివంశాన్ని జోడించి చదివితే ఏకలవ్వుని పుట్టు పూర్వోత్తరాలన్నీ పువ్వులాగ విచ్చుకొంటాయి.
సంస్కృత హరివంశంలోని ౩౪వ అధ్యాయాన్ని చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాండవులకు గాని కృష్ణునికిగాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. పాండవులకు గాని కృష్ణునికిగాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. రక్తబంధువు. పాండవులు, ఏకలవ్యుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. కృష్ణుడూ ఏకలవ్యుడూ మేనత్త మేనమామ బిడ్డలు. ఈ బీరకాయ పీచు బంధుత్వాలు ఎర్రయ్యగారి తెలుగు హరివంశం వల్ల కూడా కొంత తెలుస్తాయి. ఏకలవ్యునికీ, కీచకునికి కూడా బంధుత్వం ఉంది. సుధేష్ణ పాండవులకు స్వయానా పినతల్లి కూతురు. ఉత్తరకుమారునికి పాండవులు మేనమామలు.
యాదవకులంలో అంధక వంశశాఖ ఉంది. అందులో శూరుడను రాజుకు వసుదేవుడు మొదలయిన తొమ్మండుగురు కొడుకులూ, అయిదుగురు కుమార్తెలూ వున్నారు. ఆ పుత్రికల పేర్లను హరివంశం ఇలా చెబుతుంది.
పృధుకీర్తి: పృథాచైవ
శ్రుతదేవా శ్రుత శ్రవఁ
రాజాధిదేవీ చకదా
పంచైతై వీరమాతరః
(అధ్యాయం శ్లో ౧౯-౩౨)
వసుదేవుని ఈ అయిదుగురు అక్క చెల్లెళ్లూ ఎవరెవరిని పెళ్ళాడారో, వాళ్ళ సంతానం పేరులేమిటో కూడా హరివంశం ఈ అధ్యాయంలోని ఇతర శ్లోకాలలో చెబుతుంది.
౧. పృదకీర్తి
భర్తః వృద్ధశర్మ కరూశాధిపతి
కొడుకుః దంతవక్త్రుడు
౨. శ్రుతదేవ
భర్తః కేకయేశ్వరుడు హిరణ్యధన్వుడు
కొడుకుఛ ఏకలవ్యుడు
౩. శ్రుతశ్రవ
భర్తః చేదిరాజు దనుఘోషుడు
కొడుకుః శిశుపాలుడు
౪. పృధ(కుంతి)
భర్తః పాండురాజు
కొడుకులుః పాండవులు
౫. రాజాధిదేవి
భర్తః అనంతపతి
కొడుకులుః విందాను విందులు
కేకయరాజుకూ శ్రుతదేవకూ పుట్టిన ఏకలవ్యుడు నిషాదుడెందుకయ్యాడు? హరివంశంలోనే ఒక శ్లోకం ఆ సంగతిని చెబుతుంది.
దేవశ్రవాః ప్రజాతస్తు
నైషాదిర్యః చ్రతిశ్రుతిః
ఏకలవ్యో మహారాజ
నిషాదైః వధివర్థితః
(౬-౪ శ్లో ౩౩)
ఈ శ్లోకార్థమేమిటంటే? దేవశ్రవునికి ఏకలవ్యుడు జన్మించి నిషాదులచే పెంచబడ్డాడని, దేవశ్రవుడు వసుదేవుని తమ్ముళ్ళలో ఒకడు. శ్రుతదేవ అనే పేరుకు బదులు దేవశ్రవ అనే పేరు ఈ శ్లోకంలో చోటుచేసుకుంది. ఎర్రయ్యగారు ఆంధ్ర హరివంశంలో "శ్రుతదేవ కుంగేకయేశ్వరుని వలన నేకలవ్యుడు పుట్టి నిషాదులలోన బెరిగె" అని ఈ శ్లోకాన్నే అనువదించారు.(పూర్వం ౩-౧౬౧) కేకయ రాజు సుక్షత్రియుడు కానందు వల్లనే నిషాదుడయ్యాడు.
సంస్కృత భారతం - విరాటపర్వం - పదహారో అధ్యాయంలో కేకయ రాజుల ప్రసక్తి వుంది. "కీచకుని వివరాలను జనమేజయుడు చెప్పమంటే వైశంపాయనుడు చెప్పాడు." క్షత్రియ పురుషునికి బ్రాహ్మణ స్త్రీ వలన పుట్టినవాడిని సూతుడంటారు.
ఈ విధమైన ప్రతిలోమ జాతులలో సూతునికి ద్విజత్వం ప్రాప్తిస్తుంది. వీళ్ళని రధకారులని పిలుస్తారు. పూర్వం రాజులకు సూతవంశాలతో వైవాహిక సంబంధాలు వుండేవి.
అయినా సూతుని రాజ శబ్దంలో వ్యవహరించరుగాని కొందరు సూతులు రాజులను ఆశ్రయించి రాజ్యాలు సంపాదించారు. వాళ్ళని సూతరాజులంటారు. వాళ్ళలో కేకయుడు కూడా ఒకడు. ఇతడు సూతులకు అధిపతి. క్షత్రియ స్ర్రీకే పుట్టాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య మాళవి. ఈమెకు బాణుడు అనే కొడుకు పుట్టి కీచకుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. కేకయుని రెండో భార్యకు చిత్ర అనే కుమార్తె పుట్టి సుధేష్ణ అనే పేరుతో పెరిగింది. ఈమె విరటుని రెండో భార్య. పెద్ద భార్య శ్వేత చనిపోయాక విరటుడు ఈమెను పెళ్ళాడాడు.
మూలంలోని ఈ శ్లోకాలను తిక్కనగారు తమ విరాటపర్వంలో తెనిగించలేదు. పైగా మూలంలో లేని విషయాన్ని మరొకచోట చెప్పారు. ఉత్తర కుమారుడు శమీవృక్షం దగ్గర బృహన్నలతో పాండవుల గురించి అడిగి "ఏనమ్మహానుభావుల మేనల్లుండ" అని చాటుకొన్నట్టు రాశారు. (విరాట-౪-౧౨౦) సుధేష్ణ పాండవుల పినతల్లి కూతురే అన్న సంగతి ఇందువల్ల తేలుతుంది.
హరివంశంలో ఏకలవ్యడి విద్యాభ్యాసం ప్రసక్తిగాని, గురుదక్షిణ సంగతిగాని లేదు. ఏకలవ్యుడు జరాసంధుని ఆంతరంగికులలో ఒకడు. జరాసంధుని సైన్యాలకు ఏకలవ్యుడే సేనాధిపతి. మధర మీద పద్దెనిమిది సార్లు జరాసంధుడు దండెత్తాడు. ప్రతీముట్టడి లోనూ ఏకలవ్యుడు సైన్యాధిపత్యం వహించాడు. సంస్కృత హరివంశంలో ౯౩వ అధ్యాయం నుంచి ౯౯వ అధ్యాయం దాకా ఏకలవ్యుని సంగర విక్రమం కనబడుతుంది.

Tuesday, 22 December 2015

MAHABHARATHA - 72 YAKSHA PRASNALU NY YAMADHARMA RAJA AND ANSWERS BY DHARMARAJA IN TELUGU


యక్ష ప్రశ్నలు

72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
(పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
(అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన
సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల
అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
( మౄత్యు భయమువలన)

12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ,
అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల
ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో
తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో
అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
( యజ్ణ్జం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని
రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి
బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి
అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి,
ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు,
ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం,
క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ
దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ఞానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం).

51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ఞానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా
చేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ఞానం)

62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన
భర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు;
వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,
దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది
గొప్పవాడవుతాడు)

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
(సుఖపడతాడు)

69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో
తిని తౄప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం?
(ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే
శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
(ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని
సమంగా చూసేవాడు)

72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ,
శీతోష్ణాదులందు, కలిమి లేములందూ,
సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై
అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై
ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)

Monday, 19 January 2015

TELUGU MAHABHARATA STORIES - STORY ABOUT LORD SRI KRISHNA AND NALAKUBARA MANIGRIVA CURSE STORY IN TELUGU


శ్రీమద్భాగవతము లోని కథ
.
అల్లరి నల్లనయ్య తల్లిమీద కినుకబూని దధిభాండమును పగులగొట్టాడు. పొరుగింటిలో దూరి ఱోలు తిరగవేసి దానిమీదకెక్కి ఉట్టిమీదనున్న వెన్నను తీసి ఒక కోతికి ఇచ్చాడు. ఇటువంటి అల్లరి పనులు చేస్తున్న దొఱదొంగను చూచి యశోద “కన్నయ్య! నీవింతవరకూ ఎవరికి చిక్కలేదనీ ఎవరూ నీ ముద్దుమోము చూచి నిన్ను శిక్షించలేదనీ బొత్తిగా అదురూ బెదురూ లేకుండా అల్లరి పనులు చేస్తున్నావు. ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను” అని అన్నది. బెత్తం తెచ్చి కొడుకును బెదిరించడానికి వచ్చిన యశోద తన మదిలో ఇలా అనుకున్నది “ఇతడు పసివాడు అనుకొందామంటే కనీవినీ ఎఱుగని అత్యబ్ధుత కార్యాలు చేస్తున్నాడు. బెదిరించి బుద్ధులు నేర్పుదామనుకుంటే తనంతట తానే బుద్ధిగా ఉంటున్నాడు. అలాగని వీడు చూడని చోటులేదు ఎక్కరలేని విషయములేదు. భయము అంటూ ఒకటుందని వీడికి తెలీనేతెలియదు. నాన్నా! సాహసాలు మానరా! ప్రమాదమురా! అని చెప్పినా వినడు”. ఇలా పరిపరి విధాల తలచి ఆ యశోద చివరికి “అతి గారాబము చేస్తే పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడు నయానో భయానో మంచి గుణాలు అలవాటు చేయాలి. దుడుకుగల పిల్లలకు దండోపాయమే మంచిది” అనుకుని ఆ మాయలయ్యను బెత్తంతో జళిపించింది.

శ్రీకృష్ణుడు భయపడినట్టు నటించి ఱోలు మీదనుంచి అందెలు ఘల్లుఘల్లుమని మ్రోగుతుండగా అతివేగముగా పారిపోయాడు. ఆ తల్లి బాలకృష్ణుని వెనకాల పరుగులెట్టింది.

తనను పట్టుకోలేక అలసిపోయిన తల్లిని చూసి జాలిపడి ఆ పరమాత్మ ఆమెకు దొరికిపోయాడు! పరమయోగీశ్వరులకు సంయములకు మునులకు దొరకని ఆ భగవంతుడు భక్తురాలైన యశోదకు దొరికిపోయాడు. కన్నతండ్రిని పట్టుకున్నదే కానీ కొట్టడానికి చేతులు రాలేదు ఆ తల్లికి. యశోదాదేవి శరీరము స్వభావముకూడా పువ్వువలె మెత్తనివి. బిడ్డ మీద జాలితో దండించలేక త్రాటితో ఱోకటికి (ఉలూఖలమునకు) కట్టివేయాలనుకొన్నది. ఒక పెద్ద త్రాడు తీసుకువచ్చి ఆ బాలకృష్ణుని గట్టిగా కట్టబోయింది. కాని ఆ త్రాడు రెండంగుళాలు తక్కువయ్యింది. మరొక త్రాడు దానికి జతచేసినా మళ్ళీ రెండంగుళాలు తక్కువైనది. యశోద ఇంటిలోనున్న త్రాళ్ళన్నీ జతచేసినా ఆ నల్లనయ్య సన్నటి నడుమును చుట్టలేకపోయింది. ముజ్జగాలు దాగివున్న ఆ చిరు బొజ్జను కట్టుట ఎవరితరము? అలసిపోయిన తల్లిపై జాలిపడి నందకిశోరుడు కట్టుబడిపోయాడు. భక్తులకు పట్టుబడినట్టుగా భగవంతుడు జ్ఞానులకుగానీ మౌనులకుగానీ దానపరులకుగానీ యోగీశ్వరులకుగానీ పట్టుబడడుగదా!
యశోదాదేవి శ్రీకృష్ణుని ఇలా ఱోటికి కట్టివేసి ఇంటిపనులలో మునిగిపోయింది. బాలకృష్ణుడు ఆ ఱోలు ఈడ్చుకుంటూ పెరట్లో చాలాకాలముగా శాపగ్రస్తులై మద్దిచెట్లుగా ఉన్న నలకూబర మణిగ్రీవుల దగ్గరకువెళ్ళి వారిని కరుణించదలచి ఆ రెండు చెట్ల మధ్యనుంచి రోటిని లాక్కుంటూ వెళ్ళాడు. దానితో ఆ యమళ అర్జున వృక్షాలు కూలిపోయినాయి. అందునుంచి దిఙ్మండలము ప్రకాశింపచేయు ఇద్దరు అగ్నితుల్యులగు దివ్య పురుషులు వచ్చి స్వామిని స్తుతించి అతని అనుజ్ఞతీసుకుని కర్తవ్యొన్ముఖులై వెళ్ళిపోయారు

Monday, 12 January 2015

MAHABHARATHA STORY IN TELUGU - ABOUT ARJUNA AND HIS PILIGRIM VISITS


అర్జునుడు... నారీ తీర్థాలు

ఒకసారి పాండవ మధ్యముడైన అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ దక్షిణ సమద్రతీర ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో సౌభద్రం, పౌలోమం, కారంధమం, ప్రసన్నం, భారద్వాజం అనే పంచతీర్థాలు ఉన్నట్టు తెలుసుకున్న అర్జునుడు అక్కడికి బయలుదేరుతూంటే ఒక సాధువు వారించి, ‘వాటిలో పెద్దపెద్ద మొసళ్ళున్నాయి. అవి స్నానం చెయ్యడానికి దిగిన వారిని పట్టి మ్రింగుతున్నాయి. ఇలా అనేక సంవత్సరాలుగా జరుగుతున్నది కనుక వాటి దరికి వెళ్ళవద్దు’అని హెచ్చరించాడు. అయినా లక్ష్యపెట్టకుండా అర్జునుడు ఆ తీర్థాలున్న ప్రదేశానికి చేరుకున్నాడు.

ముందుగా సౌభద్ర తీర్థంలో స్నానానికి దిగాడు. సాధువు చెప్పినట్టుగానే కొన్ని క్షణాల్లో ఒక బలిష్టమైన మొసలి అర్జునుని కాలు పట్టుకొని లోపలకు లాగసాగింది. అతి ప్రయాసతో అర్జునుడు దాన్ని ఒడ్డుకు ఈడ్చుకొచ్చాడు. ఒడ్డుకు రాగానే ఆ మొసలి ఆశ్చర్యంగా ఓ త్రిలోక సుందరిగా మారిపోయింది. నిశే్చష్టుడైన అర్జునుడు కాస్సేపటికి తేరుకొని, మొసలి రూపంలో ఎందుకున్నావని ఆమెను అడిగాడు.

అప్పుడా సుందరి, ‘‘మహాశక్తిమంతా! నేను అప్సరసను. నా పేరు వర్గ. నేనంటే కుబేరుడికెంతో ఇష్టం. నాకు నలుగురు చెలికత్తెలున్నారు. వారికీ నాలాగే కామగమనం తెలుసు. మేము అప్పుడప్పుడూ భూలోకం వచ్చి ప్రకృతి అందాలను చూడ్డానికి అరణ్యాల్లో సంచరిస్తూ ఉంటాం. ఒకరోజు మేమైదుగురం ఇక్కడికి సమీపంలో ఉన్న అరణ్యానికి వచ్చాం. పచ్చని చెట్లతో, పుష్పాలతో ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఒక యువకుడు తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అతని తేజస్సుతో ఆ ప్రదేశమంతా సూర్యభగవానుని కన్నా మిన్నగా వెలిగిపోతోంది. అతని అద్భుతరూపం చూసి ఇంత అందగాడికి తపస్సేమిటి అనుకున్నాం.
‘‘వయస్సు పొంగులో ఒడలు తెలియలేదు. ఆ సుందరుడి తపస్సు భగ్నం చేసి మా వశం చేసుకోవాలని నేనూ, సౌరభేయి, సమీచి, బుద్భుద, లత అతని చెంత చేరాం. ఆటలతో పాటలతో అలరించాం. వెటకారం చేస్తూ పగలబడి నవ్వాం. అహంకారంతో ఎన్నోవిధాలుగా అవమానించాం. నెమ్మదిగా కనులు విప్పిన ఆ తాపసి మా ఆట పాటలకు అంద చందాలకు ఏమాత్రం చలించలేదు. అతడి మనోనిగ్రహం ముందు మా చేష్టలన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. మా దురుద్దేశాన్ని గ్రహించిన ఆ మునీశ్వరుడు, ఇక ఎవ్వరికీ మేమలా తపోభంగం చేయకూడదనుకున్నాడు కాబోలు- ‘మీరు మొసళ్ళుగామారి పంచతీర్థాల్లో పడి ఉండండి’అని శపించాడు.

‘‘మేము గడగడ వణకిపోయాం. ఏంచేయాలో తోచలేదు. కొన్ని క్షణాల అనంతరం తేరుకొని చేసిన అపరాధానికి పశ్చాత్తాపపడుతూ ‘తాపసోత్తమా! వయస్సు, అందం, కోరిక, మాలో విచక్షణా జ్ఞానాన్ని నశింపజేసాయి. మీవంటి తపోధనుల పట్ల వెకిలిగా ప్రవర్తించడం, వెర్రిమొర్రి వేషాలు వేయడం తప్పని ఒప్పకుంటున్నాం. మీ శాప ప్రభావంతో మేము మొసళ్ళు కావడం అన్నమాట తల్చుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. దయచేసి మమ్మల్ని క్షమించి మీ శాపాన్ని ఉపసంహరించుకోండి’ అంటూ అతని కాళ్ళమీద పడ్డాం.

‘‘ఆ తాపసి సానుభూతితో మమ్మల్ని చూస్తూ ‘నేనింతవరకూ ఎగతాళికి కూడా అసత్యం పలుకలేదు. కాబట్టి నా శాపప్రభావంతో పంచతీర్థాల్లో మొసళ్ళుగా పడి ఉండడం తప్పదు. మీరు ఆ తీర్థాల్లో స్నాన మాచరించడానికి వచ్చిన వారిని పట్టి మ్రింగుతుంటారు. మీకు ఆహారం కాకుండా మిమ్మల్ని ఒడ్డుకు లాగ గలిగిన పురుషునివల్ల శాపవిమోచనం కలిగి స్వస్వరూపాలు ధరిస్తారు. కనుక మీరు త్వరగా పంచతీర్థాల వద్దకుపోయి అయిదుగురూ అయిదింటిలో ప్రవేశించండి’అని దయతో పలికాడు. ‘‘అప్పట్నుంచీ మొసళ్ళరూపంలో మేమీ జలాశయాల్లోపడి ఉన్నాం. మహాబలులు నా చెలులు కూడా నాలాగే నాలుగు జలాశయాల్లో ఉన్నారు. దయార్ద్ర హృదయంతో వారికీ యథారూపాన్ని ప్రసాదించు’’ అని వేడుకుందా త్రిలోక సుందరి.

జాలిపడిన అర్జునుడు ఆమె మాట మన్నించి మిగతా నలుగురికీ కూడా శాపవిముక్తి కలిగించాడు. వారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ, ‘‘మహాభాగా! మీరే గనుక ఇక్కడకు రాకపోతే ఎంత కాలమైనా మేము మొసళ్ళుగానే ఉండిపోయే వాళ్ళం. ఎంతో ధైర్యంగా మాకు శాపవిముక్తి కలిగించిన మీకు సర్వదా కృతజ్ఞులం!’’ అన్నారు ఏక కంఠంతో.
అప్పుడు అర్జునుడు ‘‘దేవకాంతలారా! తపోధనుల సాధుత్వాన్ని బలహీనతగా భావించి, అహంకారంతో వారిపట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని ఇప్పటికైనా గ్రహించండి!’’అని మందలించాడు.వారు బుద్ధిగా తలలూపి అర్జునుడికి నమస్కరించి తమ లోకానికి పోయారు. ఆనాటినుండీ పంచతీర్థాలు నారీ తీర్థాలుగా పేరు పొందాయి. (చిత్రం) సౌభద్ర తీర్థం

Monday, 29 December 2014

PANDAVAS - SWARGAVAROHANA STORY IN TELUGU


పాండవ స్వర్గారోహణ - మానవజీవితమునకు అన్వయము. 

మనపురాణాలలో అంతర్గతముగా ప్రతి సన్నివేశములోను ఎదో ఒక అధ్యాత్మరహస్యము దాగి వుంటది.దానిని గమనించటమే మన పని. మహభారతములోని 18వ పర్వము స్వర్గారోహణపర్వము. కురుక్షేత్ర యుద్ధము ముగిసింది. ధర్మరాజు రాజ్యపాలన చేయ సాగాడు. కొంతకాలము గడిచినది. శ్రీక్రిష్ణుడు నిర్యాణము చెందాడు.బలరాముడు అస్తమించాడు. యాదవకులములో ముసలము పుట్టింది. అందరు స్వార్ధపురిత అలోచనలతో మెలగసాగారు.శ్రీకృష్ణ నిర్యాణముతో పాండవులు సర్వము కొల్పొయిన వారిలా బాధపడ్డారు.ఇంతలో వచ్చిన ఈ పరిణమాలు గమనించిన ధర్మజుడు తాముకూడా హిమాలయ పర్వతములు తద్వార స్వర్గారొహణమునకు పొవ నిశ్చయించాడు.ఈ విషయము మిగిలిన వారికి తెలిపి రాజ్యాన్ని తమ వారసులకు అప్పగించి తాము సర్వము త్యజించి హిమాలయములకు సాగిపొయారు.ఈ సమయములో పాండవులతో పాటు ఒక కుక్క వెంబడించింది.ఇప్పుడు మొత్తము 7రు అయినారు.అందరుకలసి ప్రయాణము సాగించారు.

పట్టణాలు,నగరాలు,గ్రామాలు,మైదానాలు,పర్వతపంక్తులు అన్ని దాటి హిమాలయ సానువులకు వచ్చారు. హిమాలయములను అధిరొహణ ప్రారంభించారు.కొద్ది దూరము వెళ్ళిన తరువాత ద్రౌపది పడిపొయినది అమె ప్రియుడైన అర్జునుడు అందోళన చెందాడు. కాని ధర్మరాజు వారి వంక కూడా చూడకుండా స్వర్గారొహణ మార్గములో పయనము సాగించాడు.ఇంతలో ద్రౌపది మరణించినది.అయినను ఆగలేదు.ఇలా ఒకరి వెంట ఒకరు నకులసహదేవులు,అర్జునుడు,భీముడు మృతిచెందారు కాని ధర్మరాజు వీరిగురించి తలచక తనమార్గములో తాను పయనిస్తున్నాడు.ఇంకను కుక్క ధర్మ్రాజును వెంబడిస్తునే వున్నది. స్వర్గ ద్వారమునకు కుక్క,ధర్మరాజు చేరుకున్నారు.అక్కడవున్న కావలి వారు ధర్మరాజుకు మాత్రము స్వాగతము చెప్పారు.కుక్కను నిరాకరించారు.కాని ధర్మరాజు నేను ఒక్కడిని ప్రయాణము సాగించలేదు నాతో సహ ప్రయాణికుడుగా ఇంత దూరము కుక్క వచ్చింది, కుక్కనుకూడా అనుమతిస్తేనే నేను రాగలను కాని ఒక్కడిని రావటము ధర్మవిరుద్ధము అవుతుంది కాబట్టి నేను ప్రవేశింపలేను అని నిరాకరించాడు. అంత కుక్క యమధర్మరాజుగా నాయినా!ధర్మరాజ అందరు నీ ధర్మనిరతిని పోగుడుతున్నారు పుత్రుడవైన నీవు ఎలా ధర్మమార్గము పాటిస్తున్నవో అని తెలుసుకునేందుకు ఈ చిన్నపాటి పరిక్ష నాయినా అని అశ్వీరదించి. నీవే కాదు నీతాలుకు అందరు స్వర్గలోకములో నీకై ఎదురు చూస్తున్నారు అని పలికి స్వర్గలోక ప్రవేశము కలిపించాడు.

ఇది మహభారతములోని స్వర్గారోహణపర్వములోని కధ సూక్ష్మముగా మరి మానవ జీవితానికి అన్వయము ఎలా? పుట్టిన ప్రతీజీవి మరణించక తప్పదు.ఈ విషయము తెలిసిన మానవుడు పరమాత్మను పై విశ్వాసముంచి భక్తి,శ్రద్ధలతో కోలవాలి. మరి మనకు అంత్యకాలము సమీపించినఫ్ఫుడు అనగా వృద్ధాప్యకాలములొ ముందుపోవునది అందము,రూప లావణ్యాలు.దీనికి గుర్తుగా ద్రౌపది మరణము. ఆతరువాత పోవునది ఆరోగ్యము,లివర్ మొదలగునవి చేడిపోవటము.దీనికి ప్రతికగా అశ్వనిదేవతల పుత్రులు నకుల సహదేవుల మృతి.ఆతరువాత పోవునది ఇంద్రియాలు అందుకే ఇంద్రకుమారుడైన అర్జునుడు మరణించటము.అతరువాత పోవునది శరీరములోని శక్తీ,బలము దీనికి ప్రతికగా వాయుపుత్రుడు శక్తికి ప్రతీక భీముడు మృతి.మరి స్వర్గాన్ని చేరింది ఎవరు విశ్వాసానికి ప్రతికగా నిలచిన కుక్క,జీవునకు ప్రతికగా నిలచిన ధర్మజుడు.మరీ జీవుని రమ్మని కుక్కను వద్దంటే ? విశ్వాసములేని స్వర్గము ఎందుకు అని తృణికరించటమే భక్తి తత్వము.అందుకే సమవర్తి అయిన యమధర్మరాజు స్వర్గలోక ప్రవేశము కల్పించాడు.

Saturday, 20 December 2014

MAHABHARATHA STORY ABOUT THE GREAT WARRIOR AHBIMANYU IN TELUGU


కురుక్షేత్రంలో అభిమన్యుని సాహసం

పూర్వం ‘‘మహాభారతం’’లో పాండవులు, కౌరవుల మధ్య కొన్ని రోజులపాటు ‘‘కురుక్షేత్ర సంగ్రామం’’ (యుద్ధం) ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ యుద్ధంలో ఎందరో యోధులు తమ ప్రాణాలను వీడారు. ఈ యోధులలో భీష్మ పితామహుడు, కుంతి పెద్ద కుమారుడు కర్ణుడు, అర్జునుడి కుమారుడు అభిమన్యుడు వంటివారు ఇచ్చిన మాట ప్రకారం రాజ్యంకోసం యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేశారు. వీరిలో అర్జునుని కుమారుడు అయిన అభిమన్యుని పాత్రకు ఎనలేని గౌరవం లభించింది. అతి చిన్న వయస్సులోనే కురుక్షేత్ర సంగ్రామంలో తన ప్రాణాలను వీడి, శాశ్వత కీర్తిని సంపాదించుకున్నాడు. సుభద్ర, అర్జునుల కుమారుడయిన అభిమన్యుడు... తల్లి కడుపులో వున్నప్పుడే పద్మవ్యూహాన్ని ఛేధించే విద్య గురించి తెలుసుకున్నాడు. అటువంటి వీరుడైన అభిమన్యుని వైనం గురించి కొన్ని విశేషాలు...

కురుక్షేత్ర యుద్ధం మొదలైన మొదటి నుంచి ఎంతో భయంకరంగా సాగుతోంది. పాండవులు, కౌరవుల తరఫు నుంచి ఎందరో మహావీరులు, సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. అలా ఘోరంగా సాగిన యుద్ధం పదమూడవ రోజుకు చేరుకుంది. కౌరవులు, పాండవులను ఓడించేందుకు ద్రోణాచార్యుని సహాయంతో పద్మవ్యూహం పన్నాగం పన్నుతారు. ఎంతో క్లిష్టతరమైన ఈ వ్యూహాన్ని ఛేదించడంలో పాండవులు, వారి సైన్యం వెనకుండిపోతుంది. కౌరవులు పన్నిన వ్యూహంతో సైనికులను చంపుకుంటూ ముందుకు వెళ్లిపోతారు.

ఆ సమయంలో ధర్మరాజు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి అభిమన్యుని సహాయం కోరుకుంటాడు. ధర్మరాజు, అభిమన్యునితో.. ‘‘అభిమన్యుడా..! ఈ భయంకరమైన పద్మవ్యూహాన్ని ఛేదించే విద్య కేవలం శ్రీకృష్ణుడు, మీ నాన్న అర్జునునికి, శ్రీకృష్ణుని కొడుకైన ప్రద్యుమ్నునికి, నీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ సమయంలో వీరెవ్వరూ ఇక్కడ లేరు. కాబట్టి ఈ వ్యూహాన్ని ఛేధించే మొత్తం భారం నీమీదే వుంది. సైన్యాధిపతి బాధ్యతలను స్వీకరించి, సైన్యాన్ని నీ వెంట తీసుకువెళ్లు’’ అని వేడుకుంటాడు.

దానికి సమాధానంగా అభిమన్యుడు.. ‘‘పెదనాన్న (ధర్మరాజు) గారు! నేను మీకు ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో పనికి వస్తానని ఏనాడు అనుకోలేదు. కానీ ఈరోజు నాకు ఇంతటి సౌభాగ్యం కలిగించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను వయస్సులో చిన్నవాడయినా.. వీరబలశాలి అయిన అర్జునుడు, సుభద్ర కుమారుణ్ణి. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించే విద్య గురించి నేర్చుకున్నవాణ్ణి. నేను కేవలం పద్మవ్యూహాన్ని ఛేధించి లోనికి వెళ్లే వరకు మాత్రమే విద్యను సంపాదించుకోగలిగాను. వెనక్కి వచ్చే మార్గం గురించి తెలుసుకోలేకపోయాను. అయినా నేను నేర్చుకున్న ఈ విద్యను ఉపయోగించి, మీకు సహాయం పడటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని చెబుతాడు.

ధర్మరాజుకు ఇచ్చిన మాట ప్రకారం అభిమన్యుడు ఎంతో ఉత్సాహంగా కౌరవులు పన్నిన పద్యవ్యూహాన్ని సునాయాసంగా ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతాడు. పాండవుల సేన కూడా అతనిని అనుసరిస్తూ కౌరవసేనను మట్టి కరిపిస్తూ వెళ్లారు. కొంత సమయం వరకు అభిమన్యుడు తను నేర్చుకున్న విద్యతో అపార ప్రతిభను ప్రదర్శించాడు. అది గమనించిన కౌరవ సేనులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎక్కడ వారు యుద్ధంలో ఓడిపోతారోనన్న భయం వారిలో ఒక్కసారిగా కలచివేసింది.

అప్పుడు శకుని ఎలాగైనా అభిమన్యున్ని చంపాలనే నెపంతో.. తన తెలివితేటలతో, మాటలతో అతనిని పొగడ్తలతో ముంచెత్తుతాడు. చిన్న వయస్సులో వున్న అభిమన్యుడు, శకుని మాటలతో ఉత్సాహాన్ని తగ్గించుకుంటాడు. అప్పుడు కౌరవ సైన్యం ఒక్కసారిగా అభిమన్యుని మీద విరగబడతారు. కత్తులు, బాణాలు, గదలతో అతని మీద విరుచుకుపడతారు. చిన్న వయస్సులోనే అభిమన్యుడు తన విద్యతో కౌరవ సైన్యాన్ని మట్టి కరిపించి, తను కూడా నేలకొరిగాడు. ఉన్న కొద్దిసమయం వరకు విజయవంతంగా పోరాడి.. చివరికి వీరస్వర్గాన్ని సొంతం చేసుకున్నాడు. ఎందరో యువసైనికులకు ఆదర్శంగా నిలిచాడు.

MAHABHARATHA PURANA KATHA - WHY DANCER URVASI CURSE ARJUNA AND HOW ARJUNA UTILISES THE CURSE IN AGNATHAVASAM AS BRUHANNALA


 ఊర్వశి, అర్జునున్ని ఎందుకు శపించింది?

పూర్వం మహా శివుడు, పరాక్రమవంతుడైన అర్జునుని విలువిద్యలను పరీక్షించాలని ఒక చిన్న పరీక్ష పెడతాడు. ఆ నేపథ్యంలో శివుడు మహా కిరాతుకుని రూపంలో అర్జునుని మీద దాడి చేస్తాడు. అర్జునుడు అతనిని చూసి భయపడకుండా తన శక్తితో యుద్ధానికి దిగుతాడు. దీంతో శివుడు అర్జునుని శక్తియుక్తులను చూసి ఎంతో సంతోషిస్తాడు. అతనికి బహుమతిగా పాశుపతాస్త్రాన్ని కూడా ప్రసాదిస్తాడు శివుడు. అలాగే అర్జునుని లీలలను ప్రశంసిస్తూ ఇంద్రుడు, వరుణుడు, ముడు, కుబేరుడు కూడా అతనికి దివ్య అస్త్రాలను ఇస్తారు. ఆ శుభసందర్భంలోనే అర్జునుడు స్వర్గలోకానికి వెళతాడు.

అర్జునుడు స్వర్గలోకానికి వెళ్లగానే అక్కడ దేవతలందరూ ఇతనికి ఘనస్వాగతం పలుకుతారు. అతిధి మర్యాదలు నిర్వహించి ఇతనికోసం నృత్య ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ నృత్య ప్రదర్శనలో స్వర్గలోకంలోనే అపురూప సౌందర్యవతి అయిన ఊర్వశి ఎంతో అద్భుతంగా నాత్యం చేసి అందరినీ మెప్పిస్తుంది. ఆమె నాట్యాన్ని చూసిన అర్జునుడు కూడా కనురెప్పలను ఆర్పకుండా నిర్ఘాంతమయిపోయి, అలాగే చూస్తూ వుండిపోతాడు. అర్జునుడిని ఆ విధంగా గమనించిన ఊర్వశి కూడా సంతోషంతో ముగ్ధురాలయిపోతుంది. తన మోహంలో అర్జునుడు కూడా ముగ్ధుడయిపోయాడని ఆమె భావిస్తుంది.

ఇలా నృత్య ప్రదర్శన అయిపోయిన తరువాత అర్జునుడు సేద తీర్చుకోవడానికి తన గదిలో తూగుట ఊయలో విశ్రాంతి తీసుకుంటుంటాడు. అదే సమయంలో ఊర్వశి అక్కడికి చేరుకుంటుంది. ఆమెను చూడగానే అర్జునుడు విధేయతతో లేచి, ఆమె ముందు నిలబడతాడు. అర్జునుని మోహంలో పూర్తిగా మునిగిపోయిన ఊర్వశి సిగ్గుపడుతూ.. ‘‘అర్జునా! నీ చూపులు చూస్తుంటే నువ్వు నన్ను ఎంతగా ఇష్టపడుతున్నావో అర్థమవుతోంది. నేను కూడా నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాను. నీ గురించి, నీ ధైర్యపరాక్రమల గురించి అందరి ద్వారా ఎంతగానో విన్నాను. అలాంటి నిన్ను ప్రత్యక్షంగా చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాను. నిన్ను ఎలాగైనా సంతోష పెట్టాలని ఇక్కడికి వచ్చాను’’ అని అంటుంది.

ఊర్వశి చెప్పిన మాటలకు అర్జునుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యి... కొద్దిసేపటివరకు ఆలోచనలో పడిపోతాడు. ఆమెకు సమాధానంగా... ‘‘తల్లీ! నీ మాటలు నన్ను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. అసలు నువ్వు ఇలా ఎలా ఆలోచించగలిగావు. నువ్వు మా వంశస్థుడైన పురూరడివి భార్యవి.. అంతేకాకుండా ఇంద్రునికి ఇష్టసఖివి.. అలా చూస్తే నువ్వు నాకు తల్లితో సమానురాలివి. అటువంటిది నువ్వు నన్ను, నేను నిన్ను మోహించడం అనైతికం. దయచేసి నీ మనసులో వున్న ఆలోచనలను తొలగించేసుకుని, ఇక్కడి నుంచి వెళ్లిపో’’ అని చెబుతాడు.

అర్జునుడు ఇన్నేసి మాటలన్నా ఊర్వశి వాటిని పట్టించుకోకుండా తనను నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నిస్తుంది. ‘‘దేవలోకంలో ఇటువంటి నీతులు, బంధాలు వుండవని... అప్సరసలు వుండేదే అందరినీ ఆనందింపచేయడానికి’’ అని చెబుతుంది. అయితే అర్జునుడు మాత్రం ఆమె మాటలకు, సౌందర్యానికి లొంగకుండా.. ‘‘నువ్వు ఎంత ప్రయత్నించినా నా మనసు నీ సౌందర్యం మీద మోహించదు. నేను నిన్ను అంగీకరించలేను. నువ్వు నాకు తల్లితో సమానం’’ అని పేర్కొంటాడు.

అర్జునుడి మాటలతో ఊర్వశి కోపం అవధులు లేకుండా దాటిపోతుంది. ఆవేశంతో రగిలిపోతూ.. ‘‘ఓరీ అర్జునా! ఈ దైవలోకంలో నన్ను ప్రతిఒక్కరు మోహించినవారే వున్నారు కానీ... ఎవ్వరూ నన్ను ఇంతవరకు తిరస్కరించలేదు. నాకు నేనుగా నిన్ను మోహించడానికి కోరుకుంటే.. నువ్వు నాతో ఇలా మాట్లాడుతావా..! ఈ పరాభవాన్ని నేను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఇంతగా అవమానించిన నీకు ఏదో ఒక శిక్ష అనుభవించక తప్పదు. నువ్వు నన్ను మోహించలేదు కాబట్టి కొన్నాళ్లవరకు నపుంసకుడిగా జీవిస్తావు. నీ ధైర్యసాహసాలకు భిన్నంగా ఆడవాళ్లతో కలిసి జీవించాల్సి వస్తుంది. ఇదే నేను నీకు విధించే శాపం’’ అని చెబుతుంది.

అలా ఆ విధంగా అప్సరస ఊర్వశి, అర్జునునికి శాపం ఇచ్చిన కారణంగా ఒక ఏడాదిపాటు నాట్యాచారుడు బృహన్నల అవతారం ఎత్తవలసి వచ్చింది. మహిళలతో కలిసి జీవించాల్సి వచ్చింది. అయితే ఈ శాపమే అతనికి ఒక విధంగా కొన్ని సందర్భాలలో వరంగా కూడా మారింది.

Tuesday, 16 December 2014

PANDAVAS SWARGHAVAROHANA PARVAM TELUGU MAHABHARATHA STORY



పాండవ స్వర్గారోహణ - మానవజీవితమునకు అన్వయము.

మనపురాణాలలో అంతర్గతముగా ప్రతి సన్నివేశములోను ఎదో ఒక అధ్యాత్మరహస్యము దాగి వుంటది.దానిని గమనించటమే మన పని. 

మహభారతములోని 18వ పర్వము స్వర్గారోహణపర్వము. 

కురుక్షేత్ర యుద్ధము ముగిసింది. ధర్మరాజు రాజ్యపాలన చేయ సాగాడు. కొంతకాలము గడిచినది. శ్రీక్రిష్ణుడు నిర్యాణము చెందాడు.బలరాముడు అస్తమించాడు. యాదవకులములో ముసలము పుట్టింది. అందరు స్వార్ధపురిత అలోచనలతో మెలగసాగారు.శ్రీకృష్ణ నిర్యాణముతో పాండవులు సర్వము కొల్పొయిన వారిలా బాధపడ్డారు.ఇంతలో వచ్చిన ఈ పరిణమాలు గమనించిన ధర్మజుడు తాముకూడా హిమాలయ పర్వతములు తద్వార స్వర్గారొహణమునకు పొవ నిశ్చయించాడు.ఈ విషయము మిగిలిన వారికి తెలిపి రాజ్యాన్ని తమ వారసులకు అప్పగించి తాము సర్వము త్యజించి హిమాలయములకు సాగిపొయారు.ఈ సమయములో పాండవులతో పాటు ఒక కుక్క వెంబడించింది.ఇప్పుడు మొత్తము 7రు అయినారు.అందరుకలసి ప్రయాణము సాగించారు.

పట్టణాలు,నగరాలు,గ్రామాలు,మైదానాలు,పర్వతపంక్తులు అన్ని దాటి హిమాలయ సానువులకు వచ్చారు. హిమాలయములను అధిరొహణ ప్రారంభించారు.కొద్ది దూరము వెళ్ళిన తరువాత ద్రౌపది పడిపొయినది అమె ప్రియుడైన అర్జునుడు అందోళన చెందాడు. కాని ధర్మరాజు వారి వంక కూడా చూడకుండా స్వర్గారొహణ మార్గములో పయనము సాగించాడు.ఇంతలో ద్రౌపది మరణించినది.అయినను ఆగలేదు.ఇలా ఒకరి వెంట ఒకరు నకులసహదేవులు,అర్జునుడు,భీముడు మృతిచెందారు కాని ధర్మరాజు వీరిగురించి తలచక తనమార్గములో తాను పయనిస్తున్నాడు.ఇంకను కుక్క ధర్మ్రాజును వెంబడిస్తునే వున్నది. స్వర్గ ద్వారమునకు కుక్క,ధర్మరాజు చేరుకున్నారు.అక్కడవున్న కావలి వారు ధర్మరాజుకు మాత్రము స్వాగతము చెప్పారు.కుక్కను నిరాకరించారు.కాని ధర్మరాజు నేను ఒక్కడిని ప్రయాణము సాగించలేదు నాతో సహ ప్రయాణికుడుగా ఇంత దూరము కుక్క వచ్చింది, కుక్కనుకూడా అనుమతిస్తేనే నేను రాగలను కాని ఒక్కడిని రావటము ధర్మవిరుద్ధము అవుతుంది కాబట్టి నేను ప్రవేశింపలేను అని నిరాకరించాడు. అంత కుక్క యమధర్మరాజుగా నాయినా!ధర్మరాజ అందరు నీ ధర్మనిరతిని పోగుడుతున్నారు పుత్రుడవైన నీవు ఎలా ధర్మమార్గము పాటిస్తున్నవో అని తెలుసుకునేందుకు ఈ చిన్నపాటి పరిక్ష నాయినా అని అశ్వీరదించి. నీవే కాదు నీతాలుకు అందరు స్వర్గలోకములో నీకై ఎదురు చూస్తున్నారు అని పలికి స్వర్గలోక ప్రవేశము కలిపించాడు.

ఇది మహభారతములోని స్వర్గారోహణపర్వములోని కధ సూక్ష్మముగా మరి మానవ జీవితానికి అన్వయము ఎలా? పుట్టిన ప్రతీజీవి మరణించక తప్పదు.ఈ విషయము తెలిసిన మానవుడు పరమాత్మను పై విశ్వాసముంచి భక్తి,శ్రద్ధలతో కోలవాలి. మరి మనకు అంత్యకాలము సమీపించినఫ్ఫుడు అనగా వృద్ధాప్యకాలములొ ముందుపోవునది అందము,రూప లావణ్యాలు.దీనికి గుర్తుగా ద్రౌపది మరణము. ఆతరువాత పోవునది ఆరోగ్యము,లివర్ మొదలగునవి చేడిపోవటము.దీనికి ప్రతికగా అశ్వనిదేవతల పుత్రులు నకుల సహదేవుల మృతి.ఆతరువాత పోవునది ఇంద్రియాలు అందుకే ఇంద్రకుమారుడైన అర్జునుడు మరణించటము.అతరువాత పోవునది శరీరములోని శక్తీ,బలము దీనికి ప్రతికగా వాయుపుత్రుడు శక్తికి ప్రతీక భీముడు మృతి.మరి స్వర్గాన్ని చేరింది ఎవరు విశ్వాసానికి ప్రతికగా నిలచిన కుక్క,జీవునకు ప్రతికగా నిలచిన ధర్మజుడు.మరీ జీవుని రమ్మని కుక్కను వద్దంటే ? విశ్వాసములేని స్వర్గము ఎందుకు అని తృణికరించటమే భక్తి తత్వము.అందుకే సమవర్తి అయిన యమధర్మరాజు స్వర్గలోక ప్రవేశము కల్పించాడు

Thursday, 13 November 2014

TELUGU PURANA STORIES - BHANGARU MUNGISA STORY IN TELUGU


బంగారు ముంగిస-శ్రీ మహాభారతంలో కథలు

ధర్మరాజు వదిలిన యాగాశ్వం పార్థుడి సంరక్షణలో సమస్త భూమండలాల్నీ దిగ్విజయంగా చుట్టి వచ్చింది. దక్షప్రజాపతి యాగవైభవాన్ని గుర్తుచేస్తూ ధర్మతనయుడు నిర్విఘ్నంగా అశ్వమేథయాగాన్ని ముగించాడు. వ్యాసమహాముని, దేవతలు, మునులు ధర్మరాజుని ఆశీర్వదించారు. ఋత్విజులకు ఒక్కొక్కరికీ కోటీవేల బంగారు నాణాలను ఇచ్చి తన రాజ్యమంతటినీ వేదవ్యాసమహామునికి దక్షిణగా సమర్పించాడు ధర్మరాజు.

"ధర్మతనయా! నువ్వు నాకు దక్షిణగా రాజ్యమంతా ఇచ్చావు. కాని, నాకు బంగారం కావాలి. భూమి అక్కర్లేదు. కనుక ఈ భూమికి వెలకట్టి దానికి తగిన బంగారం ఇచ్చి ఈ భూమిని నువ్వే తీసుకో" అన్నాడు మహర్షి.
"స్వామీ! అశ్వమేథయాగానికి భూమి దక్షిణ అంటారు. అందుకే తమకు భూమిని సమర్పించుకున్నాను. నేను అరణ్యానికి వెళ్ళి సుఖంగా వుంటానిక. అంతేకాని బ్రహ్మధనాన్ని తిసుకుంటానా?" అన్నాడు ధర్మరాజు.
"రాజా! మేము అమ్ముతామంటే నువ్వు భూమిని కొనుక్కోవడంలో తప్పేముంది? ఇందులో ఏ దోషం లేదు, తీసుకో" అన్నాడు వ్యాసముని.

"సరే అయితే!" అంటూ కోటికోట్ల మాడలు కుప్పగా పోసి, "ఇది ఈ భూమికి వెల" అని చెప్పి ఆ ధనాన్ని వ్యాసమహర్షికి అర్పించాడు ధర్మరాజు. ఆయన అదంతా విప్రులకు, మిగతావాళ్ళకు పంచిపెట్టాడు. బంగారు పాత్రలు, యూపస్తంభాలు, తోరణాలను అందరికీ దానం చేశాడు ధర్మరాజు.

"రండి! మీకేం కావాలో చెప్పండి. ఇవిగో వస్త్రాలు! ధరించండి! రకరకాల బంగారు పాత్రలివిగో - స్వీకరించండి" అంటూ అందర్నీ పిలిచి పిలిచి ఇచ్చాడు భీముడు.

ఉపాధ్యాయుడు కానివాడు, వేదవేదాంగ నిరతుడు కానివాడు, వ్రతనిష్ఠలేనివాడు ఆ సదస్సులో లేనేలేరు. మునులందరూ ఆ యాగాన్ని మెచ్చుకున్నారు. సిద్ధులూ విప్రులూ అక్షింతలు జల్లుతూ ఆశీర్వదించారు.
తన భాగానికి వచ్చిన బంగారమంతా కుంతీదేవికి ఇచ్చాడు వ్యాసుడు. ఆమె దాన్ని అందరికీ దానం చేసింది. యజ్ఞానికి వచ్చిన రాజులందరికీ మణిభూషణాలు, ఏనుగులు, గుర్రాలు ఇచ్చాడు ధర్మరాజు. కృష్ణుణ్ణి విశేషంగ సత్కరించాడు. ఆనాడు ధర్మరాజు చేసిన దానాల వల్ల సమస్త ప్రజలూ తృప్తి పొందారు. అయితే, అప్పుడొక చిత్రం జరిగింది.

ఒక కలుగులోంచి ఒక ముంగిస బయటకి వచ్చి, "అబ్బ! ఎంత గొప్పగా పొగుడుతున్నారు! ఎంత దానం చేస్తే మాత్రం మరీ అంతగా మెచ్చాలా! సక్తుప్రస్ఫుడు చేసిన ధర్మంలో ఏ వంతు ఈ అశ్వమేథయాగం?!" అంటూ మూతి విరిచింది.

ఆ మాటలు విని అంతా ఆశ్చర్యపోయారు. "అదేమిటి అలా అంటున్నావు. ఈ యాగంలో నీకేం లోటు కనిపించింది?" అని విప్రులు ముంగిసను ప్రశ్నించారు.

"అయ్యా! ఆకలిని, తృష్ణను జయించినవాడు సక్తుప్రస్ఫుడు. అతనొక బీద బ్రాహ్మణుడు. ఉంచవృత్తితో జీవించేవాడు. నా, నేను అన్న ప్రీతిని త్యజించి సంపూర్ణార్పణతో అతిథిపూజ చేసిన మహానుభావుడు. భక్తి, వినయం, శ్రద్ధ, ఓర్పు, కరుణ అతనియందు స్థిరంగా వున్నాయి. నెల్లాళ్ళుగా కరువు వల్ల కడుపునిండా తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఒకసారి ఎవరి దయవల్లనో కుంచెడు పిండి తెచ్చుకున్నాడు. అతనూ, భార్యా, కొడుకూ, కోడలూ ఆవురావుమంటూ తినడానికి కూర్చోబోతుండగా అనుకోకుండా ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథికి వాళ్ళంతా సపర్యులు చేసి, "ఆరగించండి స్వామీ" అంటూ తెచ్చుకున్న ఆ కాస్త పిండినీ భక్తితో సమర్పించారు. నాటి అతని దానదక్షతను దేవతలే స్తుతించారు. ధర్మదేవత సంతసించింది. బ్రహ్మదేవుడు మణిమయ విమానం పంపి సక్తుప్రస్ఫుణ్ణి స్వర్గలోకానికి పిలిపించుకున్నాడు. అదంతా చూశాక కలుగులోంచి బయటకు వచ్చాను నేను. ఆ సక్తుప్రస్ఫుడు తయారుచేసిన పిండి వాసనా, అతిథి కాళ్ళు కడిగిన నీళ్ళూ సోకి నాతలా, శరీరంలో ఒక భాగమూ బంగారుమయమయ్యాయి! ఇదీ ఆ సక్తుప్రస్ఫుడి ధర్మమహిమ!!

"మిగిలిన శరీరం కూడా బంగారుమయం చేసుకుందామని ఎన్ని యజ్ఞ ప్రదేశాలకో వెళ్ళాను. లాభం లేకపోయింది. సక్తుప్రస్ఫుడి దాననిరతికి దీటైన దయాశీలత నాకు ఇంతవరకూ తారసపడలేదు. ఈ నాడు ధర్మరాజు యాగం చేస్తున్నాడుకదా, నా కోరిక తీరకపోతూందా అనుకున్నాను. కాని నా ఆశ నిరాశ అయింది. అందుకే ధర్మరాజు యాగం సక్తుప్రస్ఫుడి ధర్మానికి సరిపోదని అన్నాను" అని చెప్పి ఆ ముంగిస ఎవరికీ కనబడకుండా మాయమయింది.


Thursday, 25 September 2014

TELUGU MAHABHARATHA STORIES - IMPORTANCE OF GAYA


గయ మహత్యం

ఆధ్యాత్మిక వైభవాన్ని కాకుండా ప్రాచీన చరిత్రనూ స్వంతం చెసుకున్న గయా క్షేత్రప్రస్తావన మహాభారత, రామాయణాలతో పాటు వాయు, గరుడ, వరాహ, కూర్మ, పద్మ, నారదీయ పురాణాల్లో ఉంది. గయాసురుడి పేరు మీద ఈ క్షేత్రానికి ‘గయ’ అనే పేరు ఏర్పడినట్లు పురాణాలు, స్థలపురాణం వెల్లడిస్తున్నాయి. ‘గయ’ త్రిస్థలాల్లో ఒకటిగా కీర్తించబడింది. ప్రయాగ, కాశీ, గయ అనే మూడు క్షేత్రాలను కలిపి ‘త్రిస్థలాలు’ అని అంటారు. వీటిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని, వీటిని దర్శిస్తే ముక్తి కలుగుతుందని ప్రతీతి.

కాగా,అ గయ పవిత్రమైన నాలుగు క్షేత్రాలలో ఒకటిగా కూడా చెప్పబడింది. ప్రయాగ, కురుక్షేత్రం, గయ, వారణాసి, ఈ నాలుగు క్షేత్రాలు కలిపి పవిత్రమైన నాలుగు స్థలాలుగా పేర్కొంటారు. ప్రయాగలో శిరోముండనం చేయించుకుని, కురుక్షేత్రంలో తర్పణం వదిలి, గయలో పిండప్రదానం చేసి, కాశీలో ప్రాణత్యాగం చేయడం వల్ల జన్మరాహిత్యం కలుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ విధంగా అత్యంత పవిత్రక్షేటంగా కీర్తించబడిన గాయక్షేత్రం పితృదేవతారాధనకు, పిండ ప్రదానాలకు ప్రసిద్ధిచెందింది. గయలో భరద్వాజ మహర్షిముందుగా పిండ ప్రదానం చేసినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. వనవాసకాలంలో శ్రీరాముడు ఇక్కడ పిండ ప్రదానం చేసినట్లు చెప్పబడుతోంది. భౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు గయను చేరి ఇక్కడి అశ్వత్థవృక్షం క్రింద నలభైరోజులు పాటూ ధ్యానంలో నిమగ్నుడై, చివరకు జ్ఞానోదయాన్ని పొందాడు. షోడశ మహాజానపదాల కాలంలో మగధ పరిపాలన క్రింద వుండి ప్రధానమైన పట్టణంగా గయ పేరుపొందింది. ఇదేవిధంగా మౌర్య సామ్రాజ్యకాలంలో కూడా అభివృద్ధి చెందినా గయకు దగ్గరలోనే గుప్తసామ్రాజ్య పాలకుడైన మొదటి కుమారగుప్తుడు (క్రీ.శ. 414-435) నలందాలో భౌద్ధ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. దీనితో వివిధ దేశాల నుంచి భారతదేశానికి భౌద్ధ అధ్యయనం కోసం వచ్చేవారి సంఖ్య అధికం కాగా, వారు నలందాతో పాటూ ఆధ్యాత్మికంగా, బుద్ధుడి జ్ఞానభూమిగా పేరు పొందిన ‘గయ’ను దర్సించడంతో పాటూ దాని అభివృద్ధికి కూడా కృషి చేయడం విశేషం.

పూర్వం ఈ ప్రాంత్రంలో ‘గయుడు’ అనే రాక్షసుడు వుండేవాడు. అతనికే గయాసురుడు అని వ్యవహారం. రాక్షసుడే అయినా గయాసురుడు గొప్ప దైవభక్తుడు. అటువంటి గయాసురుడు ఒకసారి విష్ణువును గురించి ఘోరతపస్సు చేసి తనను తాకినవారికి మోక్షం లభించేటట్లు వరం పొందాడు. వరాన్ని పొందిన గయాసురుడు తన శరీరాన్ని కొన్ని యోజనాల పొడవు, వెడల్పులుగా పెంచి జీవించసాగాడు. దీనితో ప్రతివారు గయుడి శరీరాన్ని తాకి మోక్షం పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోయారు. ఇంద్రుడికి, యమధర్మరాజుకు పనీపాటలేకుండా పోయింది. దీనితో వీరిద్దరూ భయపడి విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా జరుగుతూవున్నా ఈ విషయాన్ని గురించి త్రిమూర్తులు కలిసి పరిపరి విధాలుగా అలోచించి, చివరకు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని ప్రకారం బ్రహ్మదేవుడు గయాసురుడు వద్దకు వెళ్లాడు.

‘గయాసురా! నేను లోకకళ్యాణం కోసం ఒక గొప్ప యాగం చేయదలిచాను. ఆ యాగం చేసేందుకు అనువైన ప్రదేశం ఎక్కడా భూమండలంలో కనిపించలేదు. నా యాగానికి అనువైన స్థలం, యజ్ఞ జ్వాలల వేడిని తట్టుకునే ప్రదేశం నీ శరీరమే. కనుక నీవు అంగీకరిస్తే నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని యజ్ఞం చేస్తాను’ అని బ్రహ్మ దేవుడు గయాసురుని అడిగాడు. అందుకు గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని పెంచి ఉత్తర దిశగా తలను వుంచి పడుకున్నాడు. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసేందుకు సిద్దమయ్యాడు. సకల దేవతలు, మహర్షులు అందారూ ఈ ప్రాంతానికి చేరుకోగా బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడం ప్రారంభించాడు. యజ్ఞ వేడికి గయాసురుడి తల కదలడం ప్రారంభించింది. దీనితో బ్రహ్మదేవుడు -

“మరీచి శాపంవల్ల దేవవ్రత శిలగా మారింది కదా! ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై వుంచండి" అని ఆదేఇంచాడు. దేవతలు ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై వుంచినా తల కడులూతునే వుంది. ఫలితంగా బ్రహ్మదేవుడు విష్ణువును పిలిచి, ఆ శిలపై నిలుచుని వుండమని కోరాడు. విష్ణువు ఆ శిలపై నిలుచున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యాగం వేడిని, తనను భరిస్తున్న గయాసురుడిని చూసి విష్ణువు కు జాలి కలిగి, ‘గయాసురా! ఏదైనా వరాన్ని కోరుకో!’ అని అడిగాడు. అందుకు, “దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్లనూ, నీ పాదధూళిసోకడం వల్లనూ నా జన్మ ధన్యమైపోయింది. నా తలపై వుంచిన సిల బరువుకు ఎలా అయినా నేను భూమిలో కూరుకుపోతాను. ప్రజలు ఎవ్వరు ఇకమీదట నన్ను చూడలేరు. అయినా ఫర్వాలేదు. నా తలపై వుంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా వుంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలోనూ, మరెక్కడైనా నన్ను తలుచుకుంటూ పిండ ప్రదానాలు, పిత్రుదేవతల పూజలుచేస్తే వారి వంశం అభివృద్ధి చెందేటట్లుగా వరాన్ని ప్రసాదించండి" అని గయాసురుడు వేడుకున్నాడు.

గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు ప్రసాదించాడు. ఈ విధంగా గయ పితృదేవతల ఆరాధనకు ప్రత్యేకతను పొందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బ్రహ్మ దేవుడు యజ్ఞ సమయంలో శివుడితో పాటు ఈ ప్రాంతానికి చేరిన పార్వతీదేవి శ్రీమాంగల్య గౌరీదేవిగా కొలువు దీరినట్లు, మహర్షుల పూజలందుకున్నట్లు కథనం.

గయ మూడు నదుల సంగమ తీరంలో వుంది. ఈ క్షేత్రంలో ఫల్గుణీ, మధుర, శ్వేత అనే మూడు నదులు సంగామిస్తూ వుండడం వాళ్ళ ఈ క్షేతం ప్రయాగాతో సమానమైన క్షేత్రంగా చెప్పబడుతూవుంది. ఈ నదుల్లో ఫల్గుణీనది ముఖ్యమైంది. ప్రస్తుతం ఎండిపోయిన ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందని చెప్తారు. పిన్దప్రదానాలు చేసే సమయంలో ఈ నదిలోనే చెలమలను త్రవ్వించి అందులో నీటిని తెప్పిస్తారు. దీనిని బట్టి ఇప్పటికీ ఫల్గుణీనది అంతర్వాహినిగా ప్రవహిస్తూ వుందని చెప్పవచ్చు. ఫల్గుణీ నదీతీరంలో “విష్ణుపడమందిరం" కనిపిస్తుంది. ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలను కలిగి వున్నా ఈ ఆలయంలో కొలువుదీరిన దేవుడు శ్రీమహావిష్ణువు. ఈయనకే ‘గదాధరుడు’ అని పేరు. స్వామి చతుర్భుజాలను కలిగి శంఖు, చక్ర, గద, వరదహస్తాలతో దర్శనమిస్తాడు. గదను ఆయుధంగా ధరించి గడాధరస్వామిగా పూజ లందుకుంటున్నాడు. ఈ ఆలయ ముఖమండపంలో మనకు పెద్ద పాదాలు దర్శనమిస్తాయి. సుమారు ఒకటిన్నర అడుగు పొడవు, అర్థ అడగు వెడల్పున్న ఈ పాదాలు గయాసురుడి తలమీద వుంచిన శిలపై నిలబడిన విష్ణుమూర్తి పాదాలుగా చెబుతారు.

ఈ ఆలయంలో ఒక పెద్ద మర్రిచెట్టు వుంది. దీనిని “అక్షయవటం" అని పిలుస్తారు. పూర్వం సీతాదేవి ఈ చెట్టుకు ‘చిరకాలం అక్షయవటం’గా వర్థిల్లమణి వరాన్ని ప్రసాదించిందట. ఈ విష్ణుపద మందిరానికి ప్రక్కనే అష్టాదశ శక్తిపీఠ దేవతల్లో పదహారవ దేవత అయిన శ్రీమాంగల్య గౌరీదేవి ఆలయం వుంది. విశాలమైన ఈ ఆలయం లోని గర్భాలయంలో అమ్మవారు దివ్యమైన అలంకరణలతో దర్శనమిస్తుంది. ఈమెకే శ్రీ సర్వమంగళాదేవి అని కూడా పేరు. ఈమెను శ్రీ మహావిష్ణువు సోదరిగా పేర్కొనడం విశేషం.