WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Diabetes Tips. Show all posts
Showing posts with label Diabetes Tips. Show all posts

Wednesday, 28 September 2016

SEX AND DIABETES IN ADULTS



మధుమేహం – లైంగిక సమస్యలు

నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యదికం శాతం మానసిక దుర్బలత్వం, భయం, డయాబెటిస్‌ వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధిత వ్యాధుల లోపాల వలన అంగస్తంభన శీఘ్రస్కలన సమస్య, సెక్స్‌ కోరికలను తగ్గటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిస్‌ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లను ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్ధ్యం మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన అనుమానాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా భలహిన పరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. ఇటువంటి వారికి మొదటగా ఆత్మవిశ్వాసం పెంచాటానికి కౌన్సిలింగ్‌ ఇచ్చి తరువాత సమస్యకు అనుగుణంగా మందులు ఇవ్వడం వలన లైంగిక వైఫల్యాల నుంచి విముక్తి పొందవచ్చు.

మధుమేహా వ్యాధి గ్రస్తులతో లైంగిక సామర్థ్యం తగ్గకుండ ఉండాలంటే…

మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. బాదం, ఖర్జూర, మొలకెత్తిన విత్తనాలు, పాలు,గ్రుడ్లు, తాజా ఆకు కూరలు తీసుకోవాలి.

కీర దోసకాయ,క్యారెట్‌, బీట్‌రూట్‌తో తయారు చేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి.

యాపిల్‌, జామ దానిమ్మ,ద్రాక్ష, నేరేడు, వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట స్మోకింగ్‌ గుట్కాలు, పాన్‌పరాగ్‌, నార్కోటిక్స్‌ తీసుకోవడం వంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం స్టెరాయిడ్‌ నిత్యం వాడటం వలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోతుంది.

తీవ్ర మానసిక ఒత్తిళ్లు హార్మోన్ల ప్రభావం చూపి లైంగిక సామర్థ్యంను తగ్గించును. కావున మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్‌తో పాటు ఒత్తిడి లేని మంచి జీవన విధానాన్ని అలవర్చుకొనుటకు ప్రయత్నం చేయాలి.

ప్రతి రోజు ఉదయం వేకువ జామున 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వాకింగ్‌ చేయడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడి ఒత్తిళ్లను అధిగమించవచ్చును.

చికిత్స

డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులలో లైంగిక సమస్యలను రూపుమాపే శక్తి వంతమైన ఔషాధాలెన్నో హోమియో వైద్యంలో కలవు. వ్యక్తి యెక్క మానసిక వ్యక్తిత్వ, శారీరక లక్షణాలను ఆధారం చేసుకుని వైద్యం చేసినవో లైంగిక సమస్యలును త్వరితంగా నివారించవచ్చును.

మందులు

ఆసిడ్‌ ఫాన్‌

వీరికి నీరసం, నిస్త్రాణ ఎక్కువ.శీఘ్రస్కలన సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. శీఘ్రస్కలన నివారణకు ఈ మందు బాగా పని చేయును. అలాగే అంగము పూర్తిగా చెందక ముందే గాని, లేదా అంగప్రవేశం అయిన వెంటనే స్కలనం అవుతు, మధుమేహాంతో బాధపడేవారికి ఈ మందువాడి ప్రయోజనం పొందవచ్చును.

ఫాస్పరస్‌

వీరికి లైంగిక వాంఛ అధికం, కానీ సంభోగించు శక్తిని త్వరగా కోల్పోయి, లైంగిక వాంఛ మాత్రం మిగులుట గమనించి దగిన లక్షణం. మానసిక స్థాయిలో వీరు సున్నిత స్వభావులు. ఎదుటి వారి సానుభూతిని కోరుకుంటారు. ప్రతి దానికి తేలికగా ఆకర్షితులవుతారు. భయం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు ఉండి డయాబెటిస్‌ వ్యాధితో బాధపడేవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

లైకోపోడియం

ఈ మందు యువకుల్లో వచ్చే నపుంసకత్వానికి ముఖ్యమైనది. అతిగా కామకాలాపాల్లో పాల్గొనడం వల్ల , హస్త ప్రయోగానికి గురై లైంగిక సామర్థ్యం కోల్పొయిన వారికి ఈ మందు చాలా ప్రత్యేకమైనది. వీరు మానసిక స్థాయిలో దిగులుగా ఎప్పుడో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ద్వేషం అహాం, పిరికితనం కలిగి ఉంటారు. ముసలితనం ముందుగానే వచ్చినట్లు నుదిటిపై ముడతలు పడుతాయి. ఎవరైనా కృతజ్ఙతలు తెలిపితే వెంటనే కంటతడి పెడుతారు. ఇటువంటి లక్షణాలు ఉండి డయాబెటిస్‌ వ్యాధితో బాధపడే వారు లైంగిక సామర్ధ్యం కొరకు ఆ మందు వాడి ప్రయోజనం పొందవచ్చును.

ఎగ్నన్‌ కాక్టన్‌

వీరు పూర్తిగా నపుంసకత్వంతో బాధపడుతూ ఉంటారు. కామ వాంచ తక్కువగా ఉండి అంగస్తంభన జరుగదు. అలాగే స్కలనం కూడా తెలియకుండానే తరుచుగా జరుగును. వీరికి సంభోగ వాంచ కూడా ఉండకపోవుట గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్న మధుమేహా వ్యాధి గ్రస్తులకు ఈ మందు ప్రయోజనకారి.

అవైనా సటైవా

నిత్యం మద్యం సేవిస్తూ, సరైనా నిద్రలేక నరాల బలిహీనత ఏర్పడి సంభోగ శక్తిని కోల్పోయిన డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకి ఈ మందు బాగా ఉపకరిస్తుంది.

సెలీనియం

మానసికంగా కామ వాంఛ కొరిక ఉన్నా శారీరక అంగస్తంభన జరుగక తెలియకుండానే స్కలనం జరిగిపోవును. స్కలనం అనంతరం తీవ్ర నీరసంతో బాధపడేవారకి ఈ మందు అలోచించదగినది.ఈ మందులే కాకుండా డామియాన, కెలాడియం, ఒనాస్మోడియం, చైనా వంటి మందులను లక్షణ సముదాయమును బట్టి డాక్టర్‌ గారి సలహా మేరకు వాడి మధుమేహాంలో ఎదుర్కునే లైంగిక సమస్యలనుంచి విముక్తి పొందవచ్చును.

డాక్టర్‌ పావుశెట్టి శ్రీధర్‌, హోమియోఫిజీషియన్‌
అంజనా హోమియో హెల్త్‌కేర్‌
హన్మకొండ సెల్‌ – 94402 29646

Wednesday, 6 July 2016

SEVEN IMPORTANT DIABETES HEALTH TIPS


మధుమేహులకు సప్త సూత్రాలు

మీరు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారా...అయితే మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకునేందుకు సప్తసూత్రాలు పాటించాలంటున్నారు వైద్యనిపుణులు. మీరు మధుమేహంతో బాధపడుతున్నా వైద్యనిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.వైద్యనిపుణులతో సమయానుకూలంగా కలుస్తూ వారి సూచనలు పాటించాలి. డయాబెటీస్ ను అదుపులో ఉంచుకోవాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వైద్యుల సలహాతో మధుమేహాన్ని నిరంతరం నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ వ్యాధి వల్ల కలిగే అనర్ధాలపై పరీక్షలు చేయించుకోవాలి. వైద్యనిపుణుల సలహాతో దీర్ఘకాలిక వైద్యం తీసుకోవాలి. మధుమేహంతోపాటు ఒత్తిడి లేకుండా జీవనం కొనసాగించాలి. ఈ సప్త సూత్రాలు పాటించకుంటే మధుమేహ వ్యాధి పీడితులు అనర్ధాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు. 

Saturday, 12 December 2015

FOOD GRAINS TIPS TO DIABETES PATIENTS


మధుమేహుల కోసం 'మధురాజ్'! 

• తక్కువ గ్లూకోజు సూచీ వరి రకం గుర్తింపు 
• వచ్చే నెలలో వరి ధాన్యం విత్తనాల పంపిణీ 
• ఛత్తీస్‌గఢ్‌లోని ఐజీఏయూ పరిశోధకుల ఘనత 

రాయ్‌పూర్: మధుమేహులకు 'మధురమైన' వార్త. ఆలస్యంగా జీర్ణమవుతూ, రక్తంలోకి గ్లూకోజు నెమ్మదిగా వెళ్లేలా చేసే.. అంటే గ్త్లెసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉండే కొత్తరకం బియ్యాన్ని ఛత్తీస్‌గఢ్ పరిశోధకులు గుర్తించారు. దీని పేరు మధురాజ్-55. తిన్న తర్వాత ఆహారం ఎంత వేగంగా గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుందనేదాన్ని గ్త్లెసిమిక్ ఇండెక్స్ సూచిస్తుంది. రాయ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఐజీఏయూ) ప్రొఫెసర్ డాక్టర్ గిరీశ్ చందెల్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం గుర్తించిన కొత్తరకం బియ్యం మధుమేహులకు, మధుమేహం ముప్పు గలవారికే కాదు.. అందరికీ ఎంతగానో మేలు చేయగలవని నిపుణులు భావిస్తున్నారు. ''గత కొన్నేళ్లుగా గ్త్లెసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే వరి ధాన్యం రకాన్ని గుర్తించటానికి, అభివృద్ధి చేయటానికి ప్రయత్నిస్తున్నాం. ఆశ్చర్యకరంగా ఛత్తీస్‌గడ్‌లో సంప్రదాయంగా సాగు చేస్తున్న 'చపతి గుర్‌మటియ' అనే రకం వరి ధాన్యంలోనే దీన్ని గుర్తించాం'' అని చందెల్ తెలిపారు. మనదేశంలో చాలామంది అన్నం తినేవారే కావటం వల్ల ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుందని వివరించారు. పరిమితికి మించిన గ్త్లెసిమిక్ ఇండెక్స్ బియ్యం తినటం మధుమేహులకు హాని కలిగిస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని తాము పరిశోధన చేపట్టామని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ కౌన్సిల్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో ఎలుకలకు ఈ బియ్యాన్ని తినిపించి సమాచారాన్ని సేకరించామన్నారు. మధుమేహం గల ఎలుకలను ఎంచుకొని కొన్నింటికి కొత్తరకం బియ్యాన్ని, మరికొన్నింటికి రక్తంలో గ్లూకోజును నియంత్రించే మందును ఇచ్చి పరిశీలించామని.. ఇందులో బియ్యం ప్రభావం స్పష్టంగా బయటపడిందన్నారు. ''కొత్తరకం బియ్యం గ్త్లెసిమిక్ సూచీ 55గా ఉన్నట్టు తేలింది. ఇది మధుమేహులకు మేలు చేస్తుంది. అందువల్ల వాణిజ్యపరంగా విక్రయించటానికి దీనికి 'మధురాజ్-55' అని పేరు పెట్టాం'' అని చందెల్ వివరించారు. దీంతో వండిన అన్నం నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందువల్ల రక్తంలోకి గ్లూకోజు కూడా నెమ్మదిగా వెళ్తుంది. 6.5 కోట్ల మంది మధుమేహులు గల మనదేశంలో మధుమేహాన్ని కట్టడి చేయటానికిది దోహదం చేయగలదని చందెల్ పేర్కొన్నారు. అధిక దిగుబడినిచ్చే దీని రుచి మిగతా బియ్యం మాదిరిగానే ఉంటుందన్నారు. ఈ వరిధాన్యం విత్తనాలను 2016, జనవరిలో రైతులకు పంపిణీ చేయనున్నట్టు ఐజీఏయూ ఉప కులపతి డాక్టర్ ఎస్.కె.పాటిల్ తెలిపారు. వచ్చే ఖరీఫ్‌లో దీని ఉత్పత్తి ఆరంభం కావొచ్చన్నారు.

Wednesday, 1 January 2014

PUT CHECK TO DIABETES DISEASE - SUGAR DISEASE TO BE CURED BY FOLLOWING TIPS ONLY AFTER DOCTOR'S ADVISE



 షుగర్ వ్యాధికి చెక్‌పెట్టండి

మధుమేహ వ్యాధిగ్రస్తులకు పుత్తూరు తైలంవారి 'డయాకేర్-బి' ఔషధం చక్కటి పరిష్కారాన్ని చూపుతుందని తయారీదారులు చెబుతున్నారు. భారతదేశంలో తొలిసారిగా రూపొందించబడిన ఈ ఔషధం అనుభవజ్ఞులైన ఆయుర్వేద డాక్టర్ల ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగింది. మధుమేహ వ్యాధిగ్రస్తులే కాదు మధుమేహం లేనివారు కూడా ఈ డయాకేర్-బి ని వాడితే ఆ వ్యాధి రాకుండా నివారించవచ్చని, ఇది అన్ని అపోలో మందుల దుకాణాల్లో లభిస్తుందని పుత్తూరు తైలం వారు చెబుతున్నారు.

ప్రస్తుతకాలంలో మధుమేహం కారణంగా అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారీరక శ్రమ తక్కువగా ఉండటం, మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం వలన, శరీరంలో తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అవడం వలన, ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌ను శరీరంలోని కణజాలం సంపూర్ణంగా ఉపయోగించుకోకపోవడం వలన, బి.ఎం.ఐ 30 కంటే ఎక్కువగా ఉన్న వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ.

డయాకేర్-బి పాత్ర

మధుమేహ నివారణలో ఎలాంటి ప్రమాదం లేకుండా సంపూర్ణంగా శరీరంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గించే మొట్టమొదటి ఔషధం డయాకేర్-బి. తద్వారా వ్యాధిగ్రస్తులు క్రమంగా సంపూర్ణ ఉపశమనాన్ని పొందుతారు. ఈ ఔషధంలోవాడిన దాల్చిన చెక్కపై అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిశోధనలు జరిగాయి. ఇది ముఖ్యంగా రక్తంలో గల చక్కెర(గ్లూకోజ్)ను జీవకణాలకు అందించటంలో అద్భుతమైన ప్రతిభను చూపుతుంది. డయాకేర్-బి ఇన్సులిన్‌లా పని చేస్తుంది.

ఇంకేం చేస్తుంది?

టైప్1, టైప్-2 రకాల మధుమేహంలోనూ డయాకేర్-బి'వాడవచ్చు. అతిమూత్రం, అలసట, ధాతుక్షయము, అరికాలి మంటలు, తిమ్మిర్లు రావడం, అధిక దాహం, ఎక్కువ ఆకలి, ఒళ్లు నొప్పులు మొదలైన లక్షణాలను డయాకేర్-బి తక్షణమే నివారించగల శక్తిగలదు. మధుమేహం కలవారికి లైంగిక శక్తిని పెంచగలిగే ఔషధం కేవలం డయాకేర్-బి ఒక్కటే. ఈ ఔషధం వాడటంతో పాటు 15-20 నిమిషాలు పాటు వ్యాయామం/ యోగా/ ప్రాణయామం లేదా 2 కి.మీ. నడవడం, రాత్రిపూట అల్ఫాహారం తీసుకోవడం చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.

విశేషాలు

ఇది మధుమేహ నివారణ కోసమే తయారుచేసిన ఔషధం.

టైప్-2 ఉన్నవారు ఈ డయాకేర్-బి వాడటం వల్ల తమ సామాన్య జీవితాన్ని తిరిగి పొందగలరు. వీరిలో 90శాతం మందికి సంపూర్ణ ఉపశమనం కలుగగలదు.

డయాకేర్-బి హెర్బల్ ప్రాడక్ల్ కావడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆయుష్ వారు ఆమోదించిన జీఎంపీ సర్టిఫైడ్ ప్రాడక్ట్ ఇది. క్యాప్సూల్ రూపంలో అన్ని మెడికల్ షాపులలో లభిస్తుంది.
టైప్-1 ఉన్నవారికి ఈ డయాకేర్-బి వాడుతూనే క్రమేపీ ఇన్సులిన్ మోతాదును (డోస్) తగ్గించు కుంటూ కేవలం డయాకేర్-బి మీద ఆధారపడి ఉపశమనం పొందవచ్చు.

వాడే విధానం

టైప్-1(ఇన్సులిన్ డిపెండెంట్) ఉదయం, రాత్రి అల్పాహారానికి 15-30 నిమిషాల ముందు 1 క్యాప్సూల్‌ను తీసుకోవాలి. టైప్-2(నాన్- ఇన్సులిన్ డిపెండెంట్) ఉదయం మరియు రాత్రి అల్పాహారానికి అరగంట లేదా పావుగంట ముందు 1 క్యాప్సూల్ తీసుకోవాలి. ఒకవేళ మధుమేహం రాకుండా ఉండేందుకు తీసుకోవాలనుకుంటే రోజూ ఉదయం, రాత్రి ఒక క్యాప్సూల్ చొప్పున 3 నెలలు వాడితే మధుమేహాం రాకుండా నివారించవచ్చు.
పిల్లలకు: తినడానికి అరగంట ముందు రోజుకు 1 క్యాప్సూల్ వాడవచ్చు. అయితే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

గమనిక: నివారణ కోసం మెడిసిన్(ప్రివెన్షన్) వాడేవారు 15-30 రోజులకోసారి షుగర్ (గ్లూకోజ్) లెవల్స్ పరీక్ష చేయించుకుంటూ ఉంటే మంచి పరిష్కారం దొరుకుతుంది.

పుత్తూరు తైలం: కీళ్లు, కండరాలు, ఎముకలు, బెణుకు, నరం, నడుం, మెడ మొదలైన అన్ని రకాల నొప్పులకు పుత్తూరు తైలం మరియు పుత్తూరు బామ్ చక్కగా పనిచేస్తుంది.

డిస్నోర్: గురక నివారిణి:

గురక పెట్టడానికి ప్రధానంగా ఆరోగ్యపరమైన సమస్యలే కారణమని చెప్పవచ్చు. స్థూలకాయం, సైనసైటిస్, మలబద్దకం, ఆస్తమా, వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిళ్ల వంటివి ఉన్నప్పుడు గురక పెట్టడం జరుగుతుంది. అలాగే మద్యపానం, ధూమపానం చేసే వారిలో కూడా ఈ అలవాటు ఎక్కువే. గురకతో పక్కవారికి ఇబ్బంది మాటెలా ఉన్నా దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అందుకే డిస్నోర్-గురక నివారిణి సిరప్ 10 ఎం.ఎల్. లేదా రెండు టీస్ఫూన్లు తాగితే అది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను విరేచనాల ద్వారా బయటకు పంపిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ నిర్మూలనకు కూడా ఈ మందు ఎంతగానో ఉపయోగపడుతుంది.

క్లీన్ టీ: నోటి దుర్వాసనను పోగోడుతుంది. పళ్లు పుచ్చకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. ఎనామిల్ కోటింగ్ పోకుండా చూస్తుంది. పళ్లపై మరకలను పోగొడుతుంది. దంతక్షయానికి చక్కటి పరిష్కారం చూపుతుంది.


Monday, 9 December 2013

WHAT IS DIABETES DISEASE - WHAT IS SUGAR DISEASE - MAIN SYMPTOMS OF DIABETES - HOW TO CURE DIABETES - WHAT ARE THE STEPS TAKEN WHEN DIABETES DETECTED - DIABETES TIPS IN TELUGU



చక్కెర వ్యాధిపట్ల అనుమానాలు వద్దు మధుమేహంపై



ప్రశ్న: మన శరీరానికి చక్కెర ఎందుకు అవసరం?
జవాబు : మనం తీసుకున్న ఆహారాన్ని మన శరీరం గ్లూకోజ్‌ అనే శక్తిరూపంగా మారుస్తుంది. దీనికే బ్లడ్‌ షుగర్‌ అని పేరు. దీనినే మన శరీరం శక్తి కోసం ఉపయో గించుకుంటుంది.
ప్రశ్న : మన శరీరంలో అవసరమైనంత వరకు చక్కెర స్థాయి వుండేటట్లు చూసే వ్యవస్థ ఏది?
జవాబు : మన జీర్ణాశయానికి దగ్గరగా క్లోమగ్రంధి వుంది. ఇది ఇన్సులిన్‌ను తయారు చేస్తుంది. ఈ ఇన్సులిన్‌ ఆహారం ద్వారా వచ్చే చక్కెరను శరీర కణాలకు చేర వేస్తుంది. ఆ కణాలు చక్కెరను ఉపయో గించుకుని శక్తిని విడుదల చేస్తాయి.
ప్రశ్న : మధుమేహం లేదా చక్కెర వ్యాధి అంటే ఏమిటి?
జవాబు : మన శరీరంలో తయారయ్యే ఇన్సులిన్‌ బాగా పనిచెయ్యకపోయినా, లేక తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి కాకపోయినా మన శరీరంలో చక్కెర ఎక్కువగా పేరుకు పోతుంది. ఇది మన శరీరానికి నష్టం కలిగి స్తుంది. ఈ స్థితినే 'మధుమేహం' అని అంటారు. దీనినే వైద్య రంగ పరిభాషలో 'డయాబెటిస్‌ మెల్లిటన్‌'గా వ్యవహరిస్తారు.
ప్రశ్న : సాధారణంగా ఒక వ్యక్తి రక్తంలో చక్కెరస్థాయి ఎంత పరిమాణంలో వుండాలి?
జవాబు: ఎడిఎ వారు 2000 సంవత్సరంలో 'మధుమేహం'కు సంబంధించి సూచించిన వివరాలు:1) ఆహారం తీసుకోకుండా ఉన్న ప్పుడు రక్తంలో వుండవలసిన చక్కెర : ద100 మి.గ్రా/డిఎల్‌
2) హెచ్‌.పి.జి (ఆహారం తీసుకున్న తరువాత) : ద140 మి.గ్రా/డిఎల్‌
న 75 గ్రాముల గ్లూకోజ్‌ పౌడర్‌ను నీటిలో కలిపి తాగిన రెండు గంటల తర్వాత ఈ పరీక్ష చేయవలసి వుంటుంది.
ప్రశ్న:మధుమేహం రావడానికి గల కారణాలేమిటి?
జవాబు : వంశపారంపర్య లక్షణాలు. రోగ నిరోధక వ్యవస్థ అస్థవ్యవస్థమై తనకు తానే కణాలను నాశనం చేయడం, క్లోమగ్రంధి చెడిపోవడం లేదా వ్యాధిసోకడం. మారు తున్న జీవన విధానం. పోషకాహార లోపం కారణంగా బరువు పెరగటం లేదా తగ్గడం. మానసిక ఒత్తిడి.
ప్రశ్న : మధుమేహ రోగలక్షణాలేమిటి?
జవాబు: a) చాలా తరచుగా 1) మూత్రం పోయాల్సిరావడం 2) దాహం వేయడం 3) ఆకలి వేయడం. b) బరువు తగ్గడం ష) బల హీనత/ అలసట స) చర్మము మరియు జన నేంద్రియాలపై దురద వ) గాయాలు, పుండ్లు మానడానికి చాలా కాలం పట్టడం ట) అస్పష్ట మైన కంటిచూపు.
పైన పేర్కొన్నట్లుగా 'ఎ'లోనివి మొదటి రకం మధుమేహ లక్షణాలు. 'బి' నుండి 'ఎఫ్‌' వరకు చెప్పినవి రెండవ రకం మధుమేహ లక్షణాలు. ఇవి పైకి స్పష్టంగా కనబడక పోవచ్చు. కాబట్టి - రక్తంలో చక్కెర స్థాయి పరీక్షలను తరచుగా చేయించుకోవాలి.
ప్రశ్న: మధుమేహాన్ని ఎందుకు అదుపు చెయ్యాలి?
జవాబు: రక్తంలో అధిక చక్కెర శాతం అనేక సంవత్సరాలుగా వుంటే - నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటాయి.
ఈ వ్యవస్థలు దెబ్బతింటే వచ్చే సమస్యలు:
ఎ) గుండె మరియు రక్త ప్రసరణలో సమ స్యలు ఏర్పడటం.
బి) మూత్ర పిండాలు సరిగా పనిచేయక పోవడం.
సి) పాదాలు స్పర్శజ్ఞానం కోల్పోవడం.
డి) కంటి చూపు మందగించడం.
ప్రశ్న : మధుమేహం పూర్తిగా తగ్గిపోతుందా?
జవాబు: తగ్గదు, మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి.దీనిని అదుపుచెయ్యడం ద్వారా ఆరోగ్య పరిస్థితిని కాపాడుకోవచ్చు. మధుమేహాన్ని నివారించలేం. నియంత్రించగలం అంతే!
ప్రశ్న : మరి అటువంటప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఏం చెయ్యాలి?
జవాబు : మీరు ముందుగా మధుమేహం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలి. మధుమేహంతో ఎలా జీవించాలో నేర్చుకోవాలి. అప్పుడు మీరు ఎన్నుకున్న జీవితాన్ని హాయిగా ఆనందించవచ్చు.
ప్రశ్న : మధుమేహానికి చికిత్స ఏమిటి?
జవాబు : మొదటి రకం మధుమేహానికి - ఇన్సులిన్‌ అవసరం. చక్కని పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయా మం చేయడం అవసరం. దీని వల్ల రక్తంలో సాధారణ చక్కెర స్థాయి వుండేటట్లుగా చూసు కోవచ్చు. తద్వారా దీర్ఘకాలిక సమస్యలను అదుపు చెయ్యవచ్చు.
రెండవ రకం మధుమేహానికి చక్కని పోష కాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో బాటు, డాక్టరు సలహా ప్రకారం మందులు, అవసరం మేరకు ఇన్సులిన్‌ వాడవలసి వుంటుంది.
ప్రశ్న : మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పదా ర్థాలు తినాలి? ఏఏ పదార్థాలు తినకూడదు?
జవాబు : మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్ని రకాల పదార్థాలు తీసుకోవచ్చు. ఆరోగ్యా న్నిచ్చే సమతులాహారం తీసుకుంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. అందువల్ల - మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో అన్ని రకాల పదార్థాలు వుండేలా చూసుకోవాలి. చక్కెర మరియు ఇతర తీసి పదార్థాలు మాత్రమే రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తాయని భావించరాదు. పిండి పదార్థాలను కలిగివుండే పండ్లు, కూర గాయలు, చిక్కుళ్ళు, పాలు, ధాన్యాలు కూడా చక్కెరస్థాయిని అధికంచేస్తాయి. ఈ పదార్థాలను ఒకేసారి కాకుండా,రోజుమొత్తానికి సమంగా విభ జించుకుని, తగిన పరిమాణంలో తీసుకోవాలి.