WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Sleeping Tips. Show all posts
Showing posts with label Sleeping Tips. Show all posts

Wednesday, 4 May 2016

SLEEPING TIPS IN TELUGU TO PREGNANT WOMEN - GOOD SLEEPING TIPS 2 PREGNANT WOMEN


గర్భిణి సమయంలో నిద్ర పట్టకపోతే..

గర్భిణిగా ఉన్నప్పుడు.. నెలలు నిండేకొద్దీ ఓ పట్టాన నిద్రపట్టదు. అలాగని ఎక్కువసేపు మెలకువగా ఉండలేని పరిస్థితి. మరి ఏం చేయాలంటే..
ఫలానా సమయంలోనే పడుకోవాలనే నియమాన్ని పెట్టుకోవాలి. దానికి తగినట్లుగా దినచర్యను రూపొందించుకోవాలి. ఆ సమయంలో ఒకవేళ నిద్రరాకపోయినా కూడా నడుమువాల్చేలా చూసుకోవాలి. ఇది విశ్రాంతిని ఇస్తుంది.

* నిద్రపోయేందుకు కనీసం గంటముందు సెల్‌ఫోను, కంప్యూటరు, టీవీ లాంటివాటిని దూరం పెట్టేయాలి. కుదిరితే ఓ పుస్తకం చదవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. అలాగే నిద్రపోయేందుకు రెండు గంటల ముందు కాఫీ తాగడం, కెఫీన్‌ పదార్థాలు ఎంచుకోవడం మానేయాలి.

* గర్భం దాల్చినప్పుడు కాస్త భారంగా అనిపిస్తుంది. అయినప్పటికీ భోజనం చేసిన తరవాత కాసేపు నడవాలి. అలాగే కుదిరితే నిపుణుల పర్యవేక్షణలో చిన్నచిన్న వ్యాయామాలూ, యోగాసనాలు వేస్తే గనుక.. రాత్రిళ్లు హాయిగా నిద్రపడుతుంది. ఈ రోజుల్లో కేవలం గర్భిణులకు వ్యాయామాలూ, ఆసనాలూ చెప్పే నిపుణులూ ఉన్నారు. వారి సేవల్ని ఉపయోగించుకోవచ్చు.

* ఇలాంటి సమయంలో వెల్లకిలా పడుకుంటే సౌకర్యంగా అనిపిస్తుంది. కానీ దానివల్ల బిడ్డకు అందే ప్రాణవాయువుకి ఆటంకం ఏర్పడుతుంది. దాంతో తల్లి వెన్నెముకపై భారం పడుతుంది. అందుకే కాస్త కష్టంగా అనిపించినా ఒక పక్కకు తిరిగి పడుకునేలా చూసుకోవాలి. అది అసౌకర్యంగా అనిపిస్తే గనుక పొట్టకు ఆసరాగా ఒకటి రెండు దిండ్లు పెట్టుకోవచ్చు.

* పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడం అసౌకర్యంగా అనిపిస్తుంటే.. తలను కాస్త ఎత్తుగా పెట్టి పడుకోవాలి. అలాగే కాళ్ల అడుగున కూడా ఆసరాగా ఒక దిండు ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది కాస్త తగ్గుతుంది.

Saturday, 12 December 2015

DREAM SLEEPING TIPS IN TELUGU


సుఖ నిద్రాయోగం
అలిసిన శరీరానికి, బరువెక్కిన మనసుకు నిద్ర ను మించిన సుఖమేముంది.? కాని కొందరికి నిద్ర మాత్రలు వేసుకుంటే తప్ప నిద్ర పట్టని స్థితి ఉంటుంది. అలాంటి వారు ఈ కింది ఆహార పానీయాలు తీసుకుంటే సుఖంగా నిద్రించవచ్చు.
• బాదం
వీటిలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల కండరాలు ఉపశమనానికి గురై, హాయిగా నిద్ర పడుతుంది. ఇందులోని గ్లూకోస్‌తో శరీరం శక్తివంతమై నిద్ర లేవగానే ఉత్సాహంగా ఉంటుంది.
• పాలు
పాలల్లో ఉండే కాల్షియంలో నిద్రను క్రమబద్ధం చేసే గుణం ఉంది. ఇది శరీరంలో మెలటోనిన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. పైగా పాలల్లో ట్రిప్టోటిన్‌ అనే అమినో ఆసిడ్‌ ఉంటుంది. ఇది సెరటోనిన్‌ అనే న్యూరో ట్రాన్స్‌ మీటర్‌ను బ్రేక్‌ చేస్తుంది. ఈ ట్రాన్స్‌మీటర్‌కు మనసును ప్రశాంత పరిచే గుణం ఉంది. ఇది శరీరం విరామం పొందడానికి నిద్రలోకి వెళ్లడానికి తోడ్పడుతుంది.
• వాల్నట్స్‌
నిద్ర, మెలకువల్ని నియంత్రించే మెలటోనిన్‌ అనే హార్మోన్‌ ఈ వాల్నట్స్‌లో ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారు నిద్రకు ఉపక్రమించే ముందు నాలుగు వాల్నట్లు తింటే సరిపోతుంది.
• వెన్న
కాల్షియం ఎక్కువగా ఉండే వెన్నలో కూడా నిద్రను క్రమబద్ధం చేసే మెలటోనిన్‌ హార్మోన్‌ ఉంది. ఇష్టమైన స్నాక్స్‌ మీద వెన్న రాసుకుని తినేస్తే బాగా నిద్ర పడుతుంది.
• జాస్మన్‌ రైస్‌
నిద్రలేమికి గొప్ప ఔషధం జాస్మన్‌ రైస్‌. ఇది శరీరంలోని ట్రిప్టోఫాన్‌ నిలువల్ని పెంచుతుంది. ఇది కూడా సెరటోనిన్‌ అనే హార్మోన్‌ను బ్రేక్‌ చే స్తుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది.
• అరటి పండ్లు
అరటి పండ్లల్లో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటికీ కండరాలకు ఉపశమనం కలిగించే గుణం ఉంది. ఫలితంగా ఒక గాఢమైన నిద్ర కలుగుతుంది.
• తేనె
తేనెలో ఇన్సులిన్‌ను పెంచే గుణం ఉంది. ఇన్సులిన్‌కు సహజంగానే ట్రిప్టోఫాన్‌ నిలువల్ని పెంచి మనసును ప్రశాంత పరిచే తత్వం ఉంది. ఫలితంగా నిద్రకు మార్గం సుగమం అవుతుంది.
• చెర్రీలు
వీటిలో నిద్రను క్రమబద్ధం చేసే మెలటోనిన్‌ ఉంటుంది మీరు నిద్రలేమితో బాధపడుతూ ఉంటే నిద్రా వేళకు గంట ముందు కొన్ని చెర్రీలు తినేస్తే చాలు....హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు.

Saturday, 28 November 2015

SLEEPING GIVES MENTAL PEACE AND BODY RELAXATION - SO GO ON SLEEPING DAILY


నిద్ర అనేది అందరికీ తప్పనిసరైన జీవన క్రియ. అది ఎక్కువైనా, తక్కువైనా మానసిక, శారీరక మార్పులు అనివార్యం. జీవనోపాధికి పగలంతా పనిచేయాల్సి రావడంతో రాత్రివేళ నిద్ర పోవడం అన్నది అనాదిగా అలవాటై పోయింది. కాలక్రమంలో చాలా ఉద్యోగాలు రాత్రిళ్ళే చే యాల్సి వస్తున్నాయి. పరిశ్రమలు, కమ్యూనికేషన్ సెంటర్స్, ఆస్పత్రులు, కాల్ సెంటర్స్, రవాణా, సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఎంతోమంది రాత్రివేళ పనిచేయక తప్పడం లేదు. అలాంటపుడు వారు పగటి పూట నిద్ర తీయాల్సి ఉంటుంది. ఇది అందరి విషయంలో కాకపోవచ్చు. కానీ, మధ్యాహ్నపు నిద్ర కొద్దిసేపే అయినా మంచిదే అంటున్నారు వైద్య నిపుణులు. మధ్యాహ్నం భోజనం ముగించాక చిన్నపాటి కునుకు తీస్తే చాలు. ఆ తర్వాత చలాకీతనం, చురుకుదనం ఇట్టే వచ్చేస్తాయి. సెల్‌ఫోన్‌కు చార్జింగ్ ఎంత అవసరమో, మనిషికి నిద్ర కూడా అంతే అవసరం. అయితే, పగటి నిద్ర మన పనులకు ఆటంకాన్ని కలిగించకూడదు. పని పూర్తిచేశాకే చిన్నపాటి కునుకు తీయాలి. అలా కుదరని పక్షంలో వేళకు రాత్రి నిద్రను అలవాటు చేసుకోవాలి. మనకు ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే అవసరం. కానీ, నేటి ఉరుకులు, పరుగుల యుగంలో నిద్రలేమి ఒక జబ్బుగా కొందరిలో కనిపిస్తున్నది. సుదీర్ఘ పని గంటలు, కెరీర్ లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు, దాంపత్య సమస్యలు ఇవన్నీ మానసిక ఒత్తిడులను పెంచే అంశాలే. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం, అనారోగ్యాలు, మానసిక సమస్యలు ఇవన్నీ నిద్రలేమికి దారితీస్తున్న అంశాలే! ఎంతసేపు నిద్ర పోవాలి? ఎన్ని గంటలు సరిపోతుంది? అనే విషయాలపై చాలామందిలో గందరగోళం కనిపిస్తుంది. వాస్తవానికి అందరి నిద్రా ఒకలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నిద్రపోవడం అలవాటు. తగిన సమయం ఉంటే పగటిపూట ఒకింత నిద్ర పోవడం మంచిదే. మధ్యాహ్నపు నిద్ర వల్ల ఆందోళన, అలసట దూరం అవుతాయి. ఆరోగ్యరీత్యా ఎంతో మెరుగ్గా ఉంటారు. రాత్రివేళ ఎనిమిది గంటల సేపు నిద్రపోవడం సరిపోతుందని భావించకూడదు. రాత్రి ఎంతగా నిద్రించినా, మధ్యాహ్నం వేళ చిన్నపాటి కునుకు చాలా ఉపయోగంగా వుంటుంది. పగటినిద్ర మనలో చలాకీతనం, జ్ఞాపకశక్తి స్థాయిలను మెరుగుపరచుతుంది. అయితే, పగటి నిద్రకు చాలా తక్కువ సమయాన్ని మాత్రమే కేటాయించాలి. గంటల తరబడి కునుకు తీయడం సరికాదు. ఇది క్రమం తప్పని అలవాటుగా మారినపుడే ప్రయోజనం దక్కుతుంది. పగటి నిద్ర తప్పకుండా ఒత్తిడులను తగ్గించి, ఉత్సాహాన్ని పెంచుతుంది. నిద్ర లేచాక ముఖంలో అందం, ఆకర్షణ, ఫ్రెష్‌నెస్ పెరుగుతాయి. లంచ్ తర్వాత మ ధ్యాహ్నం రెండు నుండి నాలుగు గంటల మధ్య ఓ మోస్తరు నిద్ర తీయడం అన్ని విధాలా ఉత్తమం. పావుగంట నుంచి అరగంట వరకూ మించి అవసరం లేదు. తక్కువ సమయమైనప్పటికీ గాఢంగా నిద్ర పడుతుంది. గనుక మనసుకు, శరీరానికి చాలా రిలాక్సేషన్‌ని ఇస్తుంది.

Friday, 27 November 2015

EFFECT OF LESS SLEEP IN DAILY LIFE - HOW TO SLEEP BETTER AND PEACEFULLY


నిద్రలేమి, పని ఒత్తిడి ఇతరత్రా కారణాల వల్ల కళ్లు తొందరగా అలసటకు గురవుతుంటాయి. ఒక్కోసారి నీళ్లు కారడం, ఎర్రగా మార డం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వీటికి దూరంగా ఉండాలం టే కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. తగిన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఇతర ఇబ్బందులూ దూరమవుతాయి. దీనికి చేయాల్సిందల్లా ఆకుకూరలతో పాటు బొప్పాయి, చేపలు, పాలు, గుడ్లు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు కూడా కళ్లు తొందరగా అల సటకు గురవుతుంటాయి. నీటిని అధికంగా తీసుకోవడం, ఆహారంలో ఉప్పుని తగ్గించడం వల్ల కొంతవరకూ ఈ ఇబ్బందికి దూరంగా ఉండవచ్చు.మానసిక ఆందోళనతో సతమతమవుతున్నప్పుడు నిద్రలేమి బాధిస్తుంది. ఫలితంగా కంటికింద వలయాలు, నల్లగా మారడంతో పాటు ఉబ్బినట్లు కనిపిస్తాయి. అలాంటప్పుడు దీనికి తక్షణ పరిష్కారం తగినంత నిద్రపోవడమే. తరువాతే మిగిలిన పరిష్కారాలున్న విషయం మరువకూడదు.
తీసుకున్న ఆహారానికి తగినట్లుగా శరీరానికి తగిన శ్రమ లేకపోతే అనారోగ్యాలు చుట్టుముడతాయి. రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఉండే మలినాలు బయటకుపోతాయి. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కళ్లకింద వాపు, తిత్తులు ఏర్పడటం వంటి సమస్యలు దూరమవుతాయి.
కొందరు మస్కారా, ఐలైనర్‌ వంటి మేకప్‌తోనే నిద్రపోతుంటారు.
ఇలా ఎక్కువకాలం కొనసాగితే కంటికి రక్షణగా నిలిచే కనురెప్పల వెంట్రుకలు రాలిపోతాయి. అలా కాకుండా పడుకోబోయే ముందు తప్పనిసరిగా గోరువెచ్చని కొబ్బరినూనె లేదా చల్లటిపాలల్లో ముంచి దూదితో శుభ్రపరుచుకోవాలి.
నిద్రపోయేటప్పుడు తలకింద ఎత్తయిన దిండ్లను ఉంచుకుంటారు. దీనివల్ల రక్తప్రసరణ సాఫీగా జరగకపోగా శరీరంలోని ఉండే నీటిని కోల్పోవలసి వస్తుంది. దీంతో కళ్లకింద ఉబ్బినట్లుగా తిత్తులు ఏర్పడ తాయి. వీలైనంత వరకూ దిండు లేకుండా నిద్రపోవడం మేలు. అలానే మెడను నెమ్మదిగా అటూఇటూ కదిలిస్తూ వ్యాయామాలు చేయడం తప్పనిసరి. ఇక ఉద్యోగరీత్యా బయట ఎక్కువసేపు తిరిగేవారు, కంప్యూటర్‌పై అధిక సమయం పనిచేసేవారు ప్రతి అరగంటకోసారి చల్లటినీటితో కళ్లను కడుక్కొంటూ ఉండాలి. రేడియేషన్‌తో పాటు దుమ్ము, ధూళి నుంచి రక్షణ లభిస్తుంది. అలర్జీల వంటి సమస్యలు దరిచేరవు. కంప్యూటర్‌ ముందు గంటల తరబడి పనిచేసేవారిలో కంటి సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం తెరను తీక్షణంగా చూడటమే. ప్రతి పదినిమిషాలకోసారి కళ్లు మూసి తెరిస్తే త్వరగా అలసిపోవు.

Wednesday, 28 May 2014

HOW TO SLEEP PERFECTLY AND NICELY - BED TIME SLEEPING TIPS FOR ALL AGES



కంటినిండా నిద్ర కోసం....!

నిద్రపోవడానికి కూడా టైమ్ మేనేజ్‌మెంట్ అవసరమంటున్నారు నిపుణులు. టైము ప్రకారం నిద్రపోతే మర్నాడు తొందరగా లేచి రోజు వారీ కార్యక్రమాలను చురుగ్గా, చేసుకోగలరని సలహా ఇస్తున్నారు. మరి మంచి నిద్ర పట్టాలంటే ఎలా అంటారా? దీన
ికి కొన్ని చిట్కాలున్నాయి. వాటిని పాటింటి చూడండి...

* బెడ్ టైమ్ షెడ్యూల్ పాటించాలి. రోజూ రాత్రి నిర్దిష్ట టైముకు పడుకోవాలి. అలాగే ఉదయం కూడా నిర్దిష్ట టైముకు నిద్ర లేవాలి .


* పిల్లలు రోజుకు ఆరు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి


* పడుకునేబోయేముందు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి.


* మర్నాడు చేయాల్సిన పనుల లిస్టును రాత్రే రాసుకుంటే ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా నిద్రపోతారు.


* యోగా, స్ట్రెచెస్ లాంటి రిలాక్సేషన్ ఎక్స్‌ర్‌సైజులు చేస్తే శరీరం తేలికపడి మంచి నిద్ర పడుతుంది.


* రేడియోలో పాటలు లేదా సంగీతం వినడం, మంచి పుస్తకం చదువుకోవడం చేస్తే మెదడుకు ప్రశాంతత చేకూరి తొందరగా నిద్రలోకి జారుకుంటాం.


* మానసిక ప్రశాంతతను ఇచ్చేలా బెడ్‌రూమ్ పరిసరాలను తీర్చిదిద్దుకోవాలి.


* పరుపు శుభ్రంగా లేకపోయినా, పక్క బాగుండకపోయినా కూడా నిద్ర రాదు. అందుకే తరచూ బెడ్ దులపడం, బెడ్‌షీట్స్ మారుస్తుండడం చేయాలి.


* స్లీప్ డైరీని (ఏ టైములో రోజూ నిద్రపోతున్నారు, రోజులో ఎంతసేపు నిద్రపోతున్నారు, ఎన్నిసార్లు నిద్రలో మెళకువ వస్తోంది వంటి వివరాలతో ) రాయడం కూడా మంచిది. ఒకవేళ నిద్రలేమి అనారోగ్య సమస్యగా మారితే రోగ నిర్థారణకు స్లీప్ డైరీలో రాసుకున్న అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయి.


* పగటి సమయంలో మధ్యమధ్యలో చిన్నపాటి కునుకు తీయడం కూడా మంచిదే
.

Thursday, 30 January 2014

HEALTHY INDIAN BELIEF OF SLEEPING - SLEEPING TIPS IN TELUGU




కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్రలేవాలి?

నిద్రకు ఉపక్రమించడం, నిద్రలేవడం మరియు రోజును గడిపే విధానాల గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది. మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకోండిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాత తరం వారు విశ్వసించేవారు. 
ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపునకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధిచినది. నేటి పాశ్చాత్య వైద్యులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాటించాల్సిన అంశంగా సూచిస్తున్నారు. 
మన శరీరం చుట్టు రెండు అయస్కాంత వలయాలు ఉన్నాయి. మొదటిది పాదం నుండి తలవరకు, తల నుండి పాదం వరకు తిరుగుతుంది. రెండవది ఎడమ వైపునుండి కుడికి, కుడివైపు నుండి ఎడమకు మన చుట్టుతా తిరుగుతుంది. అనుకూల దిశగా మన శరీర కదలిక వల్ల రెండవ వలయ ప్రవాహం ప్రభావితమై బలం చేకూరుస్తుంది.
ఒకవేళ ఈ రెండు వలయాలు ఒకదానికొకటి విరుద్ద దశలో ఉంటే శరీర యంత్రాంగం బలహీనపడును. ఈ విషయాన్ని గుర్తించిన ఆధునిక సైన్స్ కుడివిఎపునకు తిరిగి లేవడం వల్ల వలయ ప్రవాహం బలం పుంజుకుంటుందని తెలుపడం జరుగుతోంది.
పిల్లలు తమ పనిలో మందకోడిగా ఉన్నట్లయితే ఎడమవైపునకు తిరిగి నిద్రలేచావని పెద్దలు ఈ కారణంగానే మందలిస్తారు.