WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 4 May 2016

SLEEPING TIPS IN TELUGU TO PREGNANT WOMEN - GOOD SLEEPING TIPS 2 PREGNANT WOMEN


గర్భిణి సమయంలో నిద్ర పట్టకపోతే..

గర్భిణిగా ఉన్నప్పుడు.. నెలలు నిండేకొద్దీ ఓ పట్టాన నిద్రపట్టదు. అలాగని ఎక్కువసేపు మెలకువగా ఉండలేని పరిస్థితి. మరి ఏం చేయాలంటే..
ఫలానా సమయంలోనే పడుకోవాలనే నియమాన్ని పెట్టుకోవాలి. దానికి తగినట్లుగా దినచర్యను రూపొందించుకోవాలి. ఆ సమయంలో ఒకవేళ నిద్రరాకపోయినా కూడా నడుమువాల్చేలా చూసుకోవాలి. ఇది విశ్రాంతిని ఇస్తుంది.

* నిద్రపోయేందుకు కనీసం గంటముందు సెల్‌ఫోను, కంప్యూటరు, టీవీ లాంటివాటిని దూరం పెట్టేయాలి. కుదిరితే ఓ పుస్తకం చదవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. అలాగే నిద్రపోయేందుకు రెండు గంటల ముందు కాఫీ తాగడం, కెఫీన్‌ పదార్థాలు ఎంచుకోవడం మానేయాలి.

* గర్భం దాల్చినప్పుడు కాస్త భారంగా అనిపిస్తుంది. అయినప్పటికీ భోజనం చేసిన తరవాత కాసేపు నడవాలి. అలాగే కుదిరితే నిపుణుల పర్యవేక్షణలో చిన్నచిన్న వ్యాయామాలూ, యోగాసనాలు వేస్తే గనుక.. రాత్రిళ్లు హాయిగా నిద్రపడుతుంది. ఈ రోజుల్లో కేవలం గర్భిణులకు వ్యాయామాలూ, ఆసనాలూ చెప్పే నిపుణులూ ఉన్నారు. వారి సేవల్ని ఉపయోగించుకోవచ్చు.

* ఇలాంటి సమయంలో వెల్లకిలా పడుకుంటే సౌకర్యంగా అనిపిస్తుంది. కానీ దానివల్ల బిడ్డకు అందే ప్రాణవాయువుకి ఆటంకం ఏర్పడుతుంది. దాంతో తల్లి వెన్నెముకపై భారం పడుతుంది. అందుకే కాస్త కష్టంగా అనిపించినా ఒక పక్కకు తిరిగి పడుకునేలా చూసుకోవాలి. అది అసౌకర్యంగా అనిపిస్తే గనుక పొట్టకు ఆసరాగా ఒకటి రెండు దిండ్లు పెట్టుకోవచ్చు.

* పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడం అసౌకర్యంగా అనిపిస్తుంటే.. తలను కాస్త ఎత్తుగా పెట్టి పడుకోవాలి. అలాగే కాళ్ల అడుగున కూడా ఆసరాగా ఒక దిండు ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది కాస్త తగ్గుతుంది.

No comments:

Post a Comment