WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Laughing Health Tips. Show all posts
Showing posts with label Laughing Health Tips. Show all posts

Thursday, 17 December 2015

LAUGHING TELUGU HEALTH TIPS TO ALL AGES


మనసారా నవ్వ గలగడం అలవరచుకుంటే ఆరోగ్యాన్ని పెంపొందించు కున్నట్లే, శారీరక ఆరోగ్యంతో పాటు మానసికానందం, ప్రశాంతత ఏర్పడతాయి. చక్కగా నవ్వుతూండటం, నవ్వుతూ మాట్లాడే వారితో తోటివారు స్నేహం చేయటానికి ఆసక్తి చూపుతారు. నవ్వుల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఎదుటివారిని హేళనచేస్తూ నవ్వడం, ఎదుటివారి నిస్సహాయతను చూసినవ్వడం, ఏదయినా తొక్కమీద కాలువేసి జారిపడినా, రాయి తగిలి జారినా వారిని చూసి నవ్వాపుకోలేకపోవడం, వికటాట్టహాసం, వక్రపునవ్వు, ఎదుటివారి అపజయానికి ఎద్దేవాగా నవ్వడంలాంటి నవ్వులు ఆరోగ్యకర మయినవి కావు. ఆ నవ్వు వెనకాల ఉండే అర్థాన్ని గ్రహించిన ఎదుటివారు వారి స్వభావాన్ని చీదరించుకుంటూ వారికి దూరంగా తప్పుకుంటారు. ఎదుటివారు అసహాయతను చూసి నవ్వడం క్షమించరాని నేరం. నవ్వు కృత్రిమంగా ఉండకూడదు. సహజమయిన నవ్వు ఆరోగ్యానికి టానిక్‌లాంటిది. నవ్వువల్ల ఎన్నెనో ప్రయోజనాలున్నాయి.

1.ఆవేశాన్ని, ఉద్రిక్తతను తగ్గించటానికి తోడ్పడుతుంది నవ్వు.
2. దేహంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
3.మానసిక ఒత్తిడిని తగ్గించి, స్ట్రెస్‌ హార్మోన్లు లెవెల్స్‌ను తక్కువచేసి, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
4.శ్వాసకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కోవటానికి సిద్ధపడే యాంటీబాడీస్‌ ఉత్పత్తిని పెంచు తుంది.
5.    ముఖానికి చక్కని వ్యాయామం కలుగు తుంది. ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది.
6.    దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి నవ్వు దివ్యౌషధంలా, చికిత్సగా పనిచేస్తుంది.
7.    నోరంతా తెరచి నవ్వడం వల్ల ఆక్సిజన్‌ సమృద్ధిగా లభిస్తుంది.
8.    ఉచ్ఛ్వాసనిశ్వాసాలు సక్రమంగా జరిగేలా చేస్తుంది. హార్ట్‌రేట్‌ తగ్గుతుంది.
9.    మనస్సులోని దిగులును, బాధలను మరపింపచేసి మనస్సును తేలికచేస్తుంది.
10.    బాధను తట్టుకునే శక్తిని పెంచుతుంది.
11.    నవ్వడం ద్వారా శరీరంలో కండరాలు, నరాలు, అవయవాలు ఉత్తేజితం పొందుతాయి.
12.    ఏ విషయాన్నయినా బాధపడకుండా హాస్యంగానూ, తేలికగానూ, నవ్వుతూ తీసుకునే మనస్తత్వం అలవడుతుంది.