WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Tourist Spots and Tourism. Show all posts
Showing posts with label Tourist Spots and Tourism. Show all posts

Tuesday, 10 November 2015

DETAILED ARTICLE ABOUT FAMOUS NANDI HILLS OR NANDIDURG IN KARNATAKA STATE - INDIA



Nandi Hills or Nandidurg is an ancient hill fortress in southern India, in the Chikkaballapur district of Karnataka state. It is 10 km from Chickballapur town and approximately 60 km from the city of Bengaluru.

నంది హిల్‌‌స లేదా నంది దుర్గం దక్షిణ భారత దేశం లో ఒక పురాతనమైన ఎత్తన దుర్గం. ఇది కర్ణాటక రాష్టమ్రు లోని చిక్కబాల్లాపూర్‌ జిల్లాలో వుంది. ఇది చిక్కబలాపూర్‌ పట్టణం నుంచి కేవలం 10 కి.మీ మరియు బెంగళూర్‌ నగరం నుండి 60 కి.మీ దూరంలో వుంది. ఈ కొండలు నంది,ముద్దేనహళ్లి , కనివేనారయనపుర గ్రామాల మధ్య విస్తరించి ఉన్నాయి. ఈ కొండల నుండి అర్కావతి అనే నది పుట్టింది. 

ఈ నంది కొండలు అనే పేరు ఎలా వచ్చింది గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. చోళుల కాలం లో దీన్ని ఆనంద గిరి అని పిలిచే వాళ్ళు. యోగి నందీశ్వరుడు ఇక్కడ తన ప్రాణాన్ని బలి ఇచ్చాడని అందువలననే ఈ కొండలకి ఆ పేరు వచ్చిందని ఇక్కడి ప్రజల నమ్మకం. నంది ని సాదారణం గా నంది దుర్గం (కోట) అని కూడా పిలుస్తారు. దీన్ని టిప్పూ సుల్తాన్‌ కట్టించాడు. కొందరు ఈ కొండలు నిద్రిస్తున్న నంది ఆకారంలో వుండడం వల్ల ఆ పేరు వచ్చిందని చెపుతారు. ఇది సముద్ర మట్టం నుంచి 4,551 అడుగుల ఎత్తు లో వుంది. ఇది జాతీయ రహదారి -7 వద్ద దేవనహళ్లి నుంచి 20 కి.మీ వుంది. బెంగుళూరు విమానాశ్రయం కి అతి దగ్గరగా వున్నప్రదేశం. ఇక్కడి వాతావరణం ఊటి వలె చాలా చల్లగా వుండి హిల్‌‌ల స్టేషన్‌ ని తలపిస్తుంది. టూరిస్‌‌ట లకు చాలా ఆకట్టుకుంటుంది.

ముఖ్యమైన ప్రదేశాలు: 
టిప్పూ డ్రాప్‌ ఇక్కడి నుంచి బ్రిటిష్‌ ఖైదిలని కొండ మీద నుంచి త్రోసివేయడం వల్ల ఇది చాలా ప్రసిద్ది చెందింది.

టిప్పూ వేసవి విడిది: 
ఇది టిప్పూ సుల్తాన్‌ గెస్‌‌ట హౌస్‌. వేసవిలో ఇక్కడే వుండేవాడు. దీనిని చిక్కబల్లాపూర్‌ సామంత రాజులు కట్టించారు. టిప్పూ సుల్తాన్‌ దీన్ని శత్రు దుర్భేద్యమైన కోటగా తయారు చేశాడు. దీనిలోకి ఇప్పుడు మూసివేసారు. సందర్శకులు కేవలం బయటినుండి మాత్రమే చూడవచ్చు.

రహస్య సొరంగం: 
ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకునేందుకు పశ్చిమ వైపు ఒక రహస్యపు దారి వుంది.

దేవాలయాలు: 
ఇక్కడ శ్రీ భోగ నరసింహా, శ్రీ ఉగ్రనరసింహ మరియు శ్రీ యోగ నరసింహ అంకితమైన అనే చాలా అందమైన పురాతనమైన గుడి ఉంది.

గవి వీరభద్ర స్వామి గుడి: 
కొండ పైభాగాన గవి వీర భద్ర స్వామి టెంపుల్‌ వుంది
ఇవి మాత్రమే కాకుండా నెహ్రు నిలయ గెస్‌‌ట హౌస్‌, గాంధీ గెస్‌‌ట హౌస్‌, పిల్లల ఆట స్థలం ఉన్నాయి.

ప్రకృతి శోయగాలు: 
కర్నాటక రాష్ట్రంలో చిక్కబల్లాపూర్‌ జిల్లాలో అతి ప్రాచీన పర్వత కోట. దీనిని నందిదుర్గ అని కూడా అంటారు. బెంగుళూరుకి సుమారుగా 60 కి.మీల దూరంలో ప్రకృతి సోయగాలతో పర్యాటకులకి కనువిందు చేస్తుంది. ఈ కొండలు నంది, ముద్దెనహల్లి, కనివెనారాయణపుర నగరాల్ని కలుపుతూ విస్తరించి ఉన్న ప్రదేశం. ఈ ప్రాంతం గుండానే ఆర్కవతీ నది ప్రవహిస్తూవుంటుంది. ఈ నగరాలలో శ్రీ సత్య సాయిబాబా యూనివర్శిటీ, ఐఐటి ముద్దెనహల్లి, విశ్వేశ్వరాయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్వాన్‌‌స్డ టెక్నాలజీ లాంటి ప్రముఖ విద్యాసంస్థలకి నందిదుర్గ కేంద్రంగా ఉంది. ఇక చారిత్రక పరంగా ఈ నందిదుర్గకి చాలా కథనాలు ఉన్నాయి. చోళుల కాలంలో ఈ నందికొండల ప్రాంతాన్ని ఆనందగిరి అని పిలిచ ేవారు. అందుకు కారణం ఈ ప్రదేశం చాలా ఆనందాన్ని కలగ చేస్తుంది అనేది ఒక కథనమైతే, మరో కథనం ప్రకారం ఇక్కడ యోగి నందీశ్వరుడు తపస్సు చేసిన ప్రాంతం కనుక ఆయన పేరుతోనే నందికొండలుగా ప్రసిద్ధి చెందింది అని అంటారు. అలాగే దీనికి నందిదుర్గ అనే మరోపేరుతో వ్యవహరిం చడానికి కారణం ఈ కొండపై ఉన్న కోట టిప్పూసుల్తాన్‌ నిర్మించాడు. అదీకాక ఈ కొండ పడుకున్న నంది ఆకారంలో ఉంటుంది. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇక మరో కథనం ప్రకారం ఈ కొండమీద 1200 సంవత్సరాల క్రితం ద్రవిడ సంప్రదాయ వాస్తురీతిలో నందీశ్వరుని ఆలయాన్ని నిర్మించారు. అలాగే ఇక్కడ శివపార్వతుల దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయంలోని నందిని భోగనందీశ్వరుడని అంటారు. ఇక్కడ ఉన్న అందమైన సరస్సుని కళ్యాణీ చెరువు అంటారు.

నందిదుర్గ: 
దీనిని 19 డిశంబర్‌, 1791లో మైసూరుని పాలిస్తున్న టిప్పూసుల్తాన్‌ మొట్టమొదటి యుద్ధం సందర్భంగా ఈ ప్రాంతపు కార్నావాల్‌‌స సైన్యాలు నిర్మించారు. ఇక్కడ చూడవలసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి.

టిప్పూసుల్తాన్‌ వేసవి విడిది: 
గంగ కాలంలో చిక్కబల్లాపూర్‌ సామంతరాజులు ఇక్కడ కోటని నిర్మించారు. ఆ తరువాత కాలంలో టిప దీనిని మరింత బలోపేతంగా మార్చడమే కాకుండా తన వేసవి విడిదిగా అన్ని సదుపాయాలతోటీ తీర్చిదిద్దాడు. నాటి నుంచి దీనిని టిప వేసవి విడిది అనే అంటున్నారు. ప్రస్తుతం దీని తలుపులు మూసేవుంటాయి. సామాన్య ప్రజలు లోపలికి అనుమతించరు.

గుర్రాల మార్గం: 
దీనిని హార్‌‌స వే అంటారు. కోటకి ఈశాన్య భాగంలో నాటి సైనికులు గుర్రాల మీద నుంచి ఎగబాకడానికి సహాయకారిగా ఉండటం కోసం నిర్మించినట్టు ఇక్కడివారి విశ్వాసం.

రహస్య మార్గం: 
ఈ దుర్గంలో శత్రువుల దాడినుండి రాజులు తప్పించుకోడానికి ఒక రహస్యమార్గాన్ని ఏర్పరిచారు. దీనిని చూస్తుంటే నాటి ఇంజినీరింగ్‌ టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉండేదో అర్ధమవుతుంది. ఇక ఇక్కడ దేవాలయాలు భక్తికి, ఆధ్మాత్మికతకి నిలువుటద్దాలు. అందులో భోగనరసింహస్వామి ఆలయం, ఉగ్రనరసింహ దేవాలయం, యోగనరసింహ దేవాలయం లాంటివి మరెన్నో పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.

గవి వీరభద్రస్వామి దేవాలయం: 
శిఖరాగ్రాన సుల్తాన్‌ పేట వెళ్ళే మార్గంలో టిప్పూ సుల్తాన్‌ పేలస్‌ వద్ద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అతి పెద్ద బండరాళ్ళతో నిర్మించిన దేవాలయం గవి వీరభద్ర ఆలయం. ఇది అనేక కళా నైపుణ్యాలతో అలరారుతూవుంది.

పిల్లల ఆట స్థలం: 
ఇది హార్టీ కల్చర్‌ శాఖవారు పిల్లలకోసం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న గార్డెన్‌. ఇందులో అనేక ఆట సదుపాయాలు సమకూర్చారు. ఇక్కడ ఎంతో వినోదంగా ఉంటుంది. ఇలాంటి పర్యాటక ప్రదేశాలు నందికొండల చుట్టు పక్కల చూడదగ్గవి ఎన్నో వున్నాయి. ఇటువంటి ప్రదేశాలు తిలకించడం వల్ల విజ్ఞానం, వినోదంతో పాటు చారిత్రక కాలం నాటి స్థితిగతులు, జీవన విధానం మనకి తెలుస్తాయి.

ప్రశాంత వాతావరణం: 
నంది హిల్‌‌స అని బెంగళూరుకి 45 దూరం లోఉంది. అక్కడి టిప్పూ కోట లోకి వెళ్ళగానే ఒక చిన్న కొలను ఉంటుంది.. ఆ కొలను ఒంటరిగా బిక్కు బిక్కు మంతున్నట్టుగా ఉంటుంది. ఎవరు లేని ప్రదేశం అది.. ఏదో సినిమా షూటింగ్‌ కోసం లొకేషన్‌ లాగా ప్రశాంతంగా ఉంటుంది.. అక్కడ ఉన్న వాతావరణం చూసి మనం ఎక్కడో సుదూర ప్రాంతం లోకి వెళ్ళినట్టుగా అనుకుంటాం.. ఆ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అక్కడే ఎప్పటి నుంచి గూడు చేసుకున్న కోతులు కూడా నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ హాయిగా ఆ ప్రకృతిని ఆరాధిస్తు్తన్నట్లుగా ఉంటాయి.

Saturday, 7 November 2015

BRIEF INFORMATION ABOUT LORD SRI KURUMURTHI SWAMI - MEHABOOB NAGAR - INDIA


పేదల వెంకన్న... శ్రీ కురుమూర్తి స్వామి

కలియుగదైవం శ్రీనివాసుడు ఎక్కడ కొలువైనాడంటే... ఏడుకొండలపై అని, అవి ఎక్క డున్నాయంటే... తిరుపతిలో అని ఎవరైనా ఇట్టే సమాధానం చెబుతారు. సర్వాంతర్యామి అయిన ఆ దేవదేవుడు లేని చోటంటూ ఈ విశ్వంలో ఉంటుందా? అయితే... శ్రీనివాసుడు కొలువైన తిరుపతిలాగే... మరో తిరుపతి కూడా ఉంది. అది ఎక్కడో కాదు మహబూబ్‌నగర్‌ జిల్లాలో... జిల్లాలోని అమ్మాపూర్‌ గ్రామమే ఆ మరో తిరుపతి... తెలంగాణ తిరుపతిగా పేరుగాంచి.. ఇటీవలే బ్రహ్మోత్సవాలు జరుపుకున్న శ్రీ కురుమూర్తి స్వామి విశిష్టతలు ఈవారం ‘ఆలయం’లో...

రాష్ట్రంలోనే అతి పురాతన ఆలయాల్లో ఒక టిగా పేరుగాంచిన దేవస్థానం శ్రీ కురు మూర్తి వేంకటేశ్వర దేవస్థానం. తిరుమల వేం కటేశ్వర ఆలయానికి, కురుమూర్తి ఆలయాని కి పోలికలున్నాయి. అమ్మాపూర్‌ గ్రామ సమీ పంలో ఏడు కొండల మధ్య లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలసిన స్వామి వారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నారు. పూర్వం కురు మూర్తికి ‘కురుమతి’ పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తున్నది. ఇటీవలే కురు మూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

క్షేత్ర మహత్మ్యం...
శ్రీ వేంకటేశ్వరస్వామి వారు ఇక్కడకు రావడా నికి రెండు రకాల పురాణ గాథలు ఉన్నాయి. ఇందులో... తిరుపతి నుంచి కురుమూర్తికి రా వడానికి కారణం కుబేరుని అప్పుల బాధ నుండి తప్పించుకోవడానికి. తిరుపతి నుంచి ఇక్కడి కి ఉత్తరముఖంగా వస్తున్న సమయంలో... సుగంధభరిత నానాఫల పక్షాలతో కనబడిన గుట్టపై కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆగినట్టు పురాణ గాథ. ఇక్కడ ‘కురు’ అనగా చేయుట, ‘మతి’ అనగా తలచుట అని అర్థం. అందుకే ఈ స్వామికి ‘కురుమతి’ అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది ‘కురుమూర్తి’గా స్థిరపడి పోయినట్లు పూర్వీకులు చెబుతుంటారు. దాదాపు 900 సంవత్సరాల నుండి స్వామి వారు పూజలు అందుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి.

ఆలయ నిర్మాణం...
1ఆత్మకూరు పట్టణానికి 13 కిలోమీటర్ల దూ రంలో ఎత్తయిన ఏడు కొండలపై ఉన్న కురు మూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం క్రీ.శ. 1268 ప్రాంతములో ముక్కెర వంశ మూలపు రుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. 1350లో చంద్రారెడ్డి అభివృద్ధిపరచగా, సోమ భూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ఏటా జాతర నిర్వహించే సంప్రదాయం అమలు లోకి తెచ్చాడు. 1870లో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాల లో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ప్రధాన ఘట్టం. 1999 లో కొత్తగా మండపం ఏర్పా టు చేశారు. 


ఇక్కడ ప్రతియేటా బ్రహ్మోత్స వాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో స్వామి వారిని హంస వాహనంపై ఊరేగిస్తారు.

ఇక్కడా ఏడు కొండలపైనే..!
ఇక్కడ కూడా ఆ స్వామి ఏడు కొండలపైనే కొలువుదీరడం విశేషం. ఆ కొండల వివరాలు...
1. శేతాద్రి (బొల్లిగట్టు), 2. ఏకాద్రి (బంటి గట్టు), 3. కో ట గట్టు, 4. ఘనాద్రి (పెద్ద గట్టు), 5. భల్లూకాద్రి (ఎలు గులగట్టు), 6. పతగాద్రి (చీపు ర్లగట్టు), 7. దైవతాద్రి (దేవరగట్టు)... అనే ఏడు కొండల్లో దేవతాద్రి అని పిలిచే దేవరగట్టపైనే కురుమూర్తి వేంకటేశ్వర స్వామి కొలువై విరాజిల్లుతున్నారు.

దళితుల సేవ...
కురుమూర్తి దేవ స్థానానికి దళితులకు విడదే యరాని బంధం ఉంది. స్వామి వారి పాదుకల ను వడ్డెమాన్‌లోని ఉద్దాల కార్పోగారంలో రా యలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్య మైన ఆవు చర్మంతో పాదుకలను దళితులు తయారు చేస్తారు. దీపావళి అమావాస్య రోజు నుంచి 7 రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉపావాస దీక్షలతో స్వామి పాదుకలు ఉద్ధాలు చేస్తారు. వారి పూజలు అనంతరం ఉద్దాలను ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు. ఉద్దాల మండలంలో దళితులే అర్చకులు. ఇది చాలా అరుదైన విషయం.

తిరుమలకు కురుమూర్తికి పోలికలు...
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి కురుమూర్తి అనేక పోలికలున్నాయి.
* తిరుపతి క్షేత్రంపై మేరు పర్వత పుత్రుడైన ఆనందగిరిపై శ్రీనివాసుడు వెలసి ఉన్నాడని పురణాలు చెబుతున్నాయి. శ్రీ కురుమూర్తి కొండలు ఆనందగిరిలో భాగమేనని అచట వెలసిన స్వామి వారే ఇచ్చట వెలిశారని స్థల పురాణంలో చెప్పబడినది.
* తిరుపతిలో విఘ్నేశ్వరుని విగ్ర హం లేదు. కురుమూర్తిలో కూడా లేదు.
* వేంకటాచలంతో స్వామి నిల్చున్న భంగిమ ల్లో ఉండగా కురుమూర్తి స్వామి అదే భంగిమ లో ఉండడం విశేషం.
* తిరుమలకు మెట్లపై వెళ్లేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నాయి. ఇక్కడా ఉన్నాయి.
రవాణా సౌకర్యం...
* ఈ కురుమూర్తి స్వామి దేవస్థానానికి చేరు కోవడానికి బస్సు, రైలు సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌ నగర్‌ నుంచి దేవరకద్ర, కౌకుంట్ల మీదుగా కురుమూర్తి చేరుకోవచ్చు.
* రైలు సౌకర్యం హైదరాబాద్‌, కర్నూల్‌ ద్వారా కురుమూర్తి రైల్వే స్టేషన్‌లో దిగి స్వామి దగ్గరకు రావచ్చు.



Friday, 6 November 2015

ARTICLE ABOUT THE BEAUTIFUL TOURIST SPOT IN KERALA - KUMARAKOM - NEAR CITY KOTTYAM - KERALA - INDIA IN TELUGU


Kumarakom is a popular tourism destination located near the city of Kottayam, in Kerala, India, famous for its backwater tourism. It is set in the backdrop of the Vembanad Lake, the largest freshwater lake in the state of Kerala.

ప్రకృతి అందాల కొలమానం కుమరకొమ్

సముద్ర గర్భాన్ని చీల్చుకుని వెలుపలికి వస్తున్నట్లుగా కడిగిన ముత్యంలా ప్రకాశించే సూర్య భగవాగవానుడి లేలేత కిరణాల హొయలు, ఆ ఆదిత్యుడికి స్వాగతం పలికే పక్షుల కిలకిలారావాలు, ఈ సుందర దృశ్యాలను ప్రతిబింబిస్తూ మురిసి మెరిసిపోయే సముద్ర అలలు.. గాలి తాకిళ్లను తట్టుకుని ముందుకు దూకే పడవలు, వాటిలోని జాలర్లు, పసిపిల్లల కేరింతల్లా చప్పుడుచేసే కొబ్బరాకుల గలగలలు.. ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని తనలో దాచుకున్న అద్భుతమైన ప్రాంతమే కేరళ. 

ఙసముద్ర జలాలతో ఏర్పడిన సర స్సులు, నదులు, పిల్లకాలువలు కలగ లసి... కేరళ రాషా్టన్రికి దేశంలోనే అంద మైన ప్రాంతంగా గుర్తింపు తెచ్చాయి. పశ్చి మ కనుమలలోని కార్డమమ్‌ హిల్‌‌స నుండి కనీసం 40 నదులు కేరళ గుండా ప్రవ హించి అరేబియా సముద్రంలో కలుస్తుం టాయి. కేరళలో సరస్సులున్న ప్రాంతాలను కుట్టునాడు అని అంటుంటారు. కుట్టు నాడు అంటే.. పొట్టివాళ్ళు ఉండే ప్రదేశం అని అర్థం. ఇక్కడి రైతులు ఎప్పుడూ సాగు భూముల్లో మోకాలిలోతు కూరుకుపోయి పంట పనులు చేయటం వల్ల బహుశా ఆ ప్రాంతాలకు ఆ పేరు వచ్చి ఉంటుంది. శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫలసా యాలు, కొబ్బరి ఉత్పత్తులు, ఇతర వస్తు వుల రవాణాకు మళయాళీలు ఈ నదుల పైనే ఆధారపడ్డారు. అందుకేనేమో.. ఇప్ప టికీ ఆయా లంకల్లోని మళయాళీలకు పడ వలే రవాణా సౌకర్యాలు. పాఠశాలలకు పిల్లల్ని తీసుకెళ్లటం, తీసుకురావటం లాంటి వాటితో సహా ప్రజలు దైనందిన కార్యకలాపాలలో పడవ ప్రయాణాలు సర్వసాధారణం. ఈ తీర ప్రాంతాలలో విహారం ఓ అనిర్వచనీయమైన అనుభూ తిని అందిస్తుందనడంలో ఎలాంటి సందే హం లేదు. మరి ఇంత అందమైన ప్రకృతి దృశ్యాలను చూడాలంటే కోకొనట్‌ లాగూన్‌ రిసార్‌‌టకు వెళ్ళాల్సిందే మరి..!

కుట్టునాడ్‌ జీవనశైలికి ప్రతిబింబం.. 
కేరళలోని కొట్టాయం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే కోకొనట్‌ లాగూన్‌ రిసార్‌‌ట.. కొచ్చి నుంచి 78 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన పామ్‌ చెట్ల మధ్యలో.. వెంబనాడ్‌ సరస్సు తూర్పుతీరంలో కవనార్‌ నదీ ముఖద్వారం వద్ద ఈ కోకొనట్‌ లాగూన్‌ రిసార్‌‌ట వెలసింది. కుట్టునాడ్‌ ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ, చక్కటి సరస్సులు, నదులు కలగలసి ఉన్న ఈ ప్రదేశంలోని కోకొనట్‌ లాగూన్‌ హెరిటేజ్‌ రిసార్‌‌ట... పచ్చని చీరను చుట్టుకున్నట్లుగా ప్రకృతి తన అందాలతో అలరింపజేస్తుంది. కేరళ సంప్రదాయసిద్ధ మైన ధారవాడ నిర్మాణశైలిలో నిర్మించిన విడి కాటేజీలు కూడా ఇక్కడ అందుబా టులో ఉంటాయి. ఈ కాటేజీలన్నీ పురాతన మైన భవనాలు కావడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ది గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్‌‌సలోనూ... 
ప్రపంచ ప్రఖ్యాత రచయిత అరుంధతీ రాయ్‌కి బుకర్‌ ఫ్రైజును తెచ్చిపెట్టిన `గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్‌‌స'లో పేర్కొన్న కోకొనట్‌ లాగూన్‌ రెస్టారెంట్‌.. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న కోకొనట్‌ లాగూన్‌ రిసార్‌‌టలోని ఒక పురాతన భవనం కావడం విశేషం. ఇది అద్భుతమైన కేరళ వంటకా లకు ప్రసిద్ధి చెందిన ధారావాడ శైలిలో నిర్మించిన చక్కటి భవనంలో ఉన్న ఈ రెస్టారెంట్‌ కోకొనట్‌ లాగూన్‌ రిసార్‌‌టలోకెల్లా అత్యంత పురాతన భవనం. ఓ మళయాళీ కుటుంబానికి చెందిన ఈ భవనాన్ని కొను గోలు చేసి జాగ్రత్తగా ముక్కలుచేసి తెచ్చి, ఈ లాగూన్‌లో మళ్లీ నిర్మించటం మరో విశేషం. కోకొనట్‌ లాగూన్‌లోని రిసెప్షన్‌ భవనం ఒక్కటే కేరళలోని సంప్రదాయ సిద్ధ మైన మరో నిర్మాణశైలి, నలుకెట్టు ఆకృ తితో అందంగా ఆహ్వానిస్తూంటుంది. నిజా నికి ఇది ఈ లాగూన్‌కు సమీపంలో ఉండే గ్రామమైన వైకోమ్‌లో 1860లో నిర్మితమై, ఒక బ్రాహ్మణ కుటుంబీకులు నివాసం ఉం డిన పురాతన భవనం. దీనిని కొనుగోలు చేసి లాగూన్‌కు తెచ్చి పునర్నిర్మించారు.

ఇవీ వసతులు... 
చిన్న చిన్న కాటేజీలు, కొన్ని ఏసీ సౌకర్యం ఉన్న గదులు పర్యాటకులకు అందుబా టులో ఉంటాయి. 14 హెరిటేజ్‌ మాన్షన్లు, 28 హెరిటేజ్‌ బంగ్లాలు, 8 ప్రైవేట్‌ పూల్‌ విల్లాలు పర్యాటకులకు చక్కని వసతులు అందించగలవు. హెరిటేజ్‌ మాన్షన్‌‌సలో అయితే ఒక్కో కాటేజీకి రెండు అంతస్థులు ఉండి, పై అంతస్తు నుండి వెంబనాడ్‌ సరస్సు అందాలను చూసేందుకు వీలుగా ఉంటుంది.

సూర్యాస్తమయం అద్భుతం... 
సూర్యాస్తమయ దర్శించేందుకు కోకోనట్‌ లాగూన్‌ రిసార్‌‌టను మించిన అనువైన ప్రదేశం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ లాగూన్‌ చుట్టుపక్కల ప్రాంతా లను పడవల్లో ప్రశాంతంగా తిరుగుతూ చూడటం మరో అనిర్వచనీయమైన అను భూతి. ఈ రిసార్‌‌టకు సమీపంలో, కవనార్‌ నదికి దక్షిణ ప్రాంతంలో నెలవైన రక్షిత పక్షుల కేంద్రం మరో ఆకర్షణీయమైన ప్రదేశం అని చెప్పవచ్చు.

సౌందర్య వీక్షణమే కాదు.. ఆరోగ్య సౌలభ్యం కూడా... 
ఆయుర్వేదిక్‌ మసాజ్‌, యోగ, ధ్యానం, మారుమూల ప్రాంతాలకు పడవ ప్రయా ణాలు, రైస్‌ బోట్‌ ప్రయాణాలు, ఫిషింగ్‌, ఈత లాంటివి ఈ కోకొనట్‌ లాగూన్‌ రిసార్‌‌ట అదనపు ఆకర్షణలుగా చెప్పవచ్చు. స్థానిక, అంతర్జాతీయ (బఫె) భోజన సదుపా యాలు ఈ ప్రాంతాల్లో లభ్యం అవుతాయి. సాధారాణంగా ఇక్కడి వాతావరణం కని ష్టంగా 23 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ఠంగా 32 డిగ్రీల సెల్సి యస్‌గా ఉంటుంది. ఇక్కడి చేరుకోవా లంటే.. కొచ్చిలోని కాసినో హోటల్‌ నుండి నేరుగా అక్కడికి ప్రయాణికులను చేరవేసే పడవ సౌకర్యం ఉంటుంది. లేదా కొంతదూరం రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి కుమ రకోమ్‌ నుండిగానీ.. పుతెన్గడి నుండిగానీ పడవ ప్రయాణం ద్వారా కోకొనట్‌ లాగూన్‌ హెరి టేజ్‌ రిసార్‌‌టకు చేరుకోవచ్చు.

మరో ప్రకృతి సౌందర్యం.. కుమరకోమ్‌... 
కేరళ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన కుట్టనాడ్‌ ప్రాంతంలో వెంబనాడ్‌ సరస్సు పరీవాహక ప్రాంతంలో ఈ కుమరకోమ్‌ కొలువై ఉంది. ఈ సరస్సు నుండి పిల్లకా లువలు విస్తరించి, మధ్య లంకలన్నీ గుబు రైన కొబ్బరి చెట్లతో పచ్చగా, చల్లగా, ఆహ్లా దకరమైన వాతావరణంతో నిండి కుమర కోమ్‌కు వన్నె తెస్తాయి. కేవలం ఈ ప్రాం తంలోనే కాదు. కేరళలోని మరెన్నో ప్రాం తాలలో ప్రధాన రవాణా మార్గాలుగా పలు నదులు, కాలువలు నిలుస్తున్నాయి. పల్లె లను, పట్టణాలను కలిపే ఈ నదీమార్గాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ప్రాధా న్యాన్ని సంతరించుకున్నాయి. కుట్టనాడ్‌లో నదీమార్గం ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఘనత సాధించింది. కేరళ గ్రామీణ వాతా వరణాన్ని ఆస్వాదిస్తూ పడవలలో ఈ నదీమార్గాల ద్వారా చేసే ప్రయాణం ఎన్నటికీ మరపురానిది.

అన్నీ పడవల ద్వారానే... 
కుమారకోమ్‌.. కేరళలోని ప్రసిద్ధ విహార కేంద్రం. ఈ ప్రదేశంలో సింహభాగం నీటితో నిండి ఉంటుంది. ఎటుచూసినా.. సరస్సులు, సెలయేళ్లతో నిండివుంటుంది. ఇక్కడి చుట్టు పక్కల గ్రామాలకు.. పాలు మొదలకుకొని.. కూరగాయలు, గ్యాస్‌ సిలిండర్లు, పప్పులు, నూనెలు ఇలా గృహా వసరాలకు కావలసిన ఏ వస్తువైనా లాం చీల్లో రావాల్సిందే. ఇక్కడ రోడ్లకంటే.. నదీ పాయలే ఎక్కువ. బైకులు, మోటార్‌సైకిళ్ల కంటే.. బోట్లే ఎక్కువ. చుట్టూ నీరుండ డంతో.. ఇక్కడి ప్రజల్లో చాలామంది చే పల వేటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు.

ఆగస్టు, సెప్టెంబర్‌లలో వెంబనాడ్‌ సంబరాలు... 
కేరళ పేరు చెప్పగానే గుర్తొచ్చే అంశాలలో పడవల పోటీ ఒకటి. వెంబనాడ్‌ సరƒ స్సులో ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెం బరు నెలల మధ్యకాలంలో నిర్వహించే ఈ పోటీలు నీళ్లలో పోటీజ్వాలలు రగులు స్తాయని అంటుంటారు. నాటి ప్రధాన మంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ స్మారకంగా నెహ్రూ బోట్‌ రేస్‌ పేరిట నిర్వహించే పడవల పోటీ అత్యంత ఆసక్తి కరంగా సాగుతుంది. ఆగస్టు నెల రెండవ శనివారంనాడు దీనిని నిర్వహిస్తారు. మళ్లీ ఓనమ్‌ సందర్భంగా అళప్పూజ ప్రాం తంలో అరణ్‌ముల పడవల పోటీ నిర్వ హించడం ఆనవాయితీ. కొట్టాయం నుండి పది కిలోమీటర్ల దూరంలో.. కొచ్చిన్‌ నుండి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే.. సగం దూరం రోడ్డు గుండా చేరుకుని తన్నీర్ముక్కమ్‌ జెట్టీ ద్వారా కుమరకోమ్‌ చేరుకోవచ్చు. సమీపంలోని రైల్వే స్టేషన్‌ కొట్టాయం. సమీపంలోని విమానాశ్ర యం.. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం. 

కుమరకోమ్‌ పక్షుల రక్షిత ప్రాంతం... 
కుమరకోమ్‌ ప్రాంతం అంతా వెంబనాడ్‌ సరస్సు తీరంలోని చిన్నచిన్న లంకలతో కలిపి ఉంటుంది. ఇదంతా కుట్టనాడ్‌ ప్రాం తానికి చెందిందే. ఇక్కడ 14 ఎకరాలలో విస్తరించి ఉన్న పక్షుల రక్షిత ప్రదేశం పక్షుల వీక్షకులకు చక్కని అనుభూతిని కలుగజేస్తుంది. కోయిలలు, హంసలు, వలస పక్షులు, లొట్టిపిట్టలు, సైబీరియన్‌ స్టార్‌‌క వంటి అనేక జాతుల పక్షులకు ఇది ఆవాస ప్రదేశం. ఈ పక్షులను సందర్శిం చాలనుకుంటే ఇక్కడి లంకల్లో పడవల్లో ప్రయాణించడం ఒక్కటే ఉత్తమ మార్గం.

మరెన్నో ప్రతే్యకతలు... 
కుమరకోమ్‌లో ఇంకా ఎన్నో ప్రతే్యక ఆక ర్షణలు పర్యాటకలను ఆకట్టుకుం టాయి. ఇక్కడి తాజ్‌ గార్డెన్‌ రిట్రీట్‌లో బోటింగ్‌, ఫిషింగ్‌ సౌకర్యాలు ఉన్నాయి. కేరళ ప ర్యాటక అభివృద్ధి సంస్థ కుమర కోమ్‌ టూ రిస్‌‌ట గ్రామ సముదాయంలో భాగంగా కొబ్బరి, అరటి తోటల్లో కాటేజీ లను ఏర్పా టు కూడా ఉంది. పడవ ఇళ్లలో హాలిడే ప్యాకేజీలు వర్ణతీతమైన అనుభవం.

Monday, 2 February 2015

ARTICLE AND HISTORY OF KOLLETI KOTA SRI SRI SRI PEDDINTAMMA THALLI TEMPLE - KOLLERU - ANDHRA PRADESH - INDIA


కొల్లేటికోట- శ్రీశ్రీపెద్దింటమ్మతల్లి

ఆంధ్రదేశం లో అందమైన ప్రదేశం కొల్లేరు. కొల్లేరు ప్రకృతి రామణీయకత కు శాశ్వత చిరునామా. దక్షిణ కాశ్మీరం గా పిలువబడే కొల్లేరు సరస్సు లో ఉన్న కోటదిబ్బ పేరే కొల్లేటి కోట. కొల్లేటి కోట లో కొలువైన అమ్మల గన్న యమ్మ మన పెద్దింటమ్మ. ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్దదైన మంచినీటి సరస్సు కొల్లేరు. చరిత్ర ప్రసిద్ధి చెందిన ఈ సరస్సు పరిథి లోకి కృష్ణాజిల్లా లోని కైకలూరు , మండవల్లి మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదపాడు, ఏలూరు,దెందులూరు భీమడోలు నిడమర్రు, ఉంగుటూరు ఆకివీడు మండలాలు సరిహద్దులు గా ఉన్నాయి. 135 చ.కి.మీ .విస్తీర్ణం గల ఈ కొల్లేరు సరస్సు లో 145 గ్రామా లున్నాయి. వీటిలో 142 గ్రామాలు పశ్చిమ గోదావరి జిల్లా లోని 7మండలాల్లో ఉండగా, మిగిలిన మూడు గ్రామాలు కృష్ణాజిల్లా లోని కైకలూరు, మండవల్లి మండలాల్లో ఉన్నాయి.
శ్రీశ్రీ పెద్దింటి అమ్మవారు స్థానిక మత్స్యకారుల కులదైవం. వీరిలో ఎక్కువమంది ఒరిస్సా ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు గా చెపుతారు.

* దేవీదర్శనం

కొల్లేటి కోట లో కొలువు తీరిన పెద్దింటమ్మ తొమ్మిదడుగుల ఎత్తు కలిగి, విశాలమైన నేత్రాలతో వీరాసనం లో భక్తరక్షణోద్యుక్తురాలై దర్శన మిస్తుంది. డమరుకం త్రిశూలం మొదలైన ఆయుధాల తో, నాగాభరణాల తో, సూర్య చంద్రాభరణాలతో రక్తాంబర ధారియై రౌద్ర మనోహరం గా దర్శనమిస్తుంది తల్లి.

అమ్మవారి కి ఎడమ వైపు జలదుర్గా మాత విగ్రహం నయన మనోహరం గా , పద్మాసన స్థితయై, అభయ ముద్ర తో చిరునవ్వులు చిందిస్తూ ప్రత్యక్ష మౌతుంది. శ్రీ పెద్దింటి అమ్మవారు పార్వతీదేవికి ప్రతిరూపమే నని భక్తులు భావిస్తారు. 101 మంది గ్రామ దేవతలలో ఈమె పెద్దది కాబట్టి ఈమె పెద్దింటమ్మ గా సేవించబడుతూ,.

యా దేవీ మధు కైటభ ప్రశమనీ యా మాహిషోన్మీలినీ !
యా ధూమ్రేక్షణ చండముండ దమనీయా రక్తబీజాశనీ ! యాశుంభాదినిశుంభ దైత్యదమనీయా శుద్ద లక్ష్మీపరా ! సా చండీ నవకోటి శక్తి సహితా మాం పాతు విశ్వేశ్వరీ !!

అంటూ భక్తుల చేత స్తుతించబడుతోంది.

* చారిత్రక ప్రాథాన్యం

కొల్లేటి కోట అతిప్రాచీన పట్టణంగా చారిత్రక ఆథారాలున్నాయి. తొలిసారి లాంగుళ్య గజపతి ఈ ఆలయాన్ని నిర్మించి నట్లు గా చెప్పబడుతోంది.ఇక్కడ ఒక పెద్దమట్టికోట ఉండేదని అది కాలక్రమేణ మట్టి దిబ్బ గా మిగిలి పోయినట్లు తెలుస్తోంది .11వ శతాబ్దానికి చెందిన అంబదేవరాయలు జలదుర్గ మైన కొల్లేటి కోటను జయించి, జలదుర్గాలయం లో పెద్దింటమ్మను ప్రతిష్ఠించినట్లు జనశృతి.

వేంగీ –చాళుక్యల కాలం నాటికే కొల్లేరు ప్రాంతం ఒక మండలం గా ఉండేది. ఈ కొల్లేటి కోటను “ కొలను విషయ,”” సాగరవిషయ,” గా పిలవబడినట్లు చారిత్రకాథారాలున్నాయి. నేటి కొల్లేటి కోటను” కొలను పురం, “ “కొలనువీడు,” గా వ్యవహరించినట్లు శాసనాథారాలు కన్పిస్తున్నాయి. క్రీ.శ 10-11 శతాబ్దాలలో వేంగీరాజులకు చాళక్యుల తో సంబంధ బాంధవ్యాలుండే వని 12-13 శతాబ్దాలలోని కమలాకర పుర వల్లభుల శాసనాల వలన తెలుస్తోంది. వీరి పురాలు కమలాకరపురం ( నెల్లూరు) పద్మినీపురం ( గణపవరం ) కొలనువీడు (కొల్లేటి కోట ) గా చరిత్రకారులు గుర్తించారు. క్రీ.శ 1076 లో విజయాదిత్యుని మరణం తో వేంగీసామ్రాజ్యం అంతరించింది. వేంగీరాజైన రాజరాజచోళుడు రాజరాజనరేంద్రుని కుమారుడు. తల్లితరపున వారసత్వం గా వచ్చిన చోళ సింహాసనాన్ని అధిష్ఠించి కుళోత్తుంగ చోళుడు గా రాజ్య పరిపాలన చేశాడు. ఈతని కుమారుడు వేంగిని పాలిస్తూ, యుద్ధభూమి లో వీరమరణం పొందటం తో వారసుడు లేని రాజ్యం లో సామంతులు తిరుగు బాటు చేసి, స్వాతంత్య్రాన్ని ప్రకటించు కున్నారు. ఈ సమయం లో రాజ్యం పరహస్త గతం కాకుండా ఉండటానికి వృద్ధరాజైన కుళోత్తుంగ చోళుడు వెలనాటి చోడవీరుని దత్తపుత్రుని గా స్వీకరించి, సర్వాథికారి గా ప్రకటించాడు.అది ఇష్టం లేని మండలేశ్వరులు తిరుగు బాటు చేశారు. ఆ తిరుగు బాటు చేసిన వారి లో కొలనువీడు మండలేశ్వరుడైన తెలుగు భీముడు కూడ ఉన్నాడు. దీనికోసమే ఇంత చరిత్ర చెప్పాల్సివచ్చింది.

ఈ తెలుగు భీముని పేరు తో వెలసిన గ్రామమే నేటి భుజబల ( భీమ) పట్నం గా చారిత్రకులు గుర్తించారు. బహు సాహసి గా పేరొందిన ఈ తెలుగు భీముడు మిగిలిన తిరుగు బాటు దారుల తో కలసి పితృపురం (నేటి పిఠాపురం ) చాళుక్యరాజుని విజయాదిత్య చక్రవర్తి గా, వేంగీశ్వరుని చేశాడు. తొలిసారి పార్వతీమాత ను పెద్దమ్మ గా కొలిచిన చక్రవర్తి ఈయనే. పిఠాపురం శాసనాన్ని బట్టి అగస్త్యుడు సముద్రాన్ని ఇంకించినట్లు, కొల్లేటి నీటి తోడించి,తోడించి, వంతెన వేయించి కొల్లేటి మథ్య లో ఒక అభేధ్యమైన జలదుర్గాన్ని నిర్మంచి నట్లు తెలుస్తోంది. ఈ దుర్గం చుట్టూ 150 రాజహస్తాల వెడల్పు, 7 నిలువుల లోతు,3 కోశాల చుట్టుకొలత గల అగడ్త ఉండేదని చరిత్ర కారులు వ్రాశారు. ( కోసు అనగా - రెండువేల విండ్లపట్టు – అని అర్థము ). ఈ కొల్లేటి సరస్సు లో ఇప్పుడు కన్పించే దిబ్బలే శిథిలమైన కోటకు ఆనవాళ్ల ని చారిత్రకుల అభిప్రాయం. దీనినే ప్రస్తుతం కొల్లేటి కోట గా పిలుస్తున్నాము. చైనా యాత్రికుడు హ్యుయన్ సాంగ్ ఈ కొల్లేటి సరస్సును ఒక గొప్ప మంచినీటి సరస్సు గా వర్ణించాడు.

దండి మహాకవి తన దశకుమారచరిత్ర లో కొల్లేటిసరస్సుని గురించి, భుజ బలవీరుడైన తెలుగు భీముని గురించి చాల గొప్పగా అభివర్ణించాడు. ఈ కొల్లేటి సరస్సు కు ప్రాచీన కాలం లో “కునాళ “సరస్సు అని పేరున్నట్లు తెలుస్తోంది. ప్రాచీన కాలం లో ఇక్కడున్న సౌధాలు ,మేడలు, మిద్దెలు కాలగర్భం లో కలసి పోయినా. అమ్మవారి ఆలయం మాత్రం ఆటుపోటులకు తట్టుకొని నిలబడింది.విజయనగర రాజులకు మహమ్మదీయులకు జరిగిన పోరులో విజయనగర సామ్రాజ్య సైన్యాధ్యక్షుడు విజయాన్ని ఆకాంక్షిస్తూ, తన కన్న కూతురును కొల్లేటిఒడ్డున బలి యిచ్చి,విజయాన్ని పొందాడని ,అప్పటినుండి ఆ ఒడ్డుకు” పేరంటాలు కనుమ “అని పేరు వచ్చిందని ఐతిహ్యం. జంతుబలి పై నిషేధం ఉన్నప్పటికీ ఇప్పటికి కూడ ఇక్కడ కోళ్లు, గొఱ్ఱెలు మొదలైన వాటిని బలి ఇవ్వడం సాథారణం గానే జరిగిపోతుంది. కోడిని అమ్మవారికి చూపించి తీసుకెళితే 1.00 రూ, గొర్రె, మేకను చూపించి తీసుకెళితే 10.రూ10 .యలు దేవస్థానానికి చెల్లించాలి. విశ్వాసాల ముందు చట్టాలు పని చేయవు కదా!

* కొల్లేటి అందాలు.:

కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం అభయారణ్యం గా ప్రకటించ బడింది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు , అక్టోబరు నెలలలో ఆష్ట్రేలియా, నైజీరియా ఫిజీ దీవులనుండి గూడకొంగలు వలస వస్తాయి .పరజపిట్టలు, నీటిబాతులు,మొదలైన అనేక అరుదైన పక్షిజాతులు ఈ సమయం లో కొల్లేరు ని ఒక విహారకేంద్రం గా, సందర్శనీయ స్థలం గా మార్ఛేస్తాయి. ఈరమణీయ దృశ్యాలను చూడటానికి,తమ కెమేరాల్లో బంధించుకోవడానికి ఆ నెలల్లో విదేశీ సందర్శకులు కొల్లలు గా కొల్లేటి సందర్శనకు వస్తారంటే ఆ దృశ్యాలు ఎంత నయన మనోహరాలో మనం అర్థం చేసుకోవచ్చు. బుర్రదోనె లో కూర్చొని చేపలు వేటాడే జాలరి దంపతుల తో పాటు,అప్పుడప్పుడు విదేశీ యులు కూడ ఆ దోనెల్లో కన్పిస్తుండటం చూడటానికి ముచ్చట గా ఉంటుంది.

* రవాణా సౌకర్యాలు.

పెద్దింటి అమ్మ ను దర్శించుకోవడానికి రెండు రవాణామార్గాలు ఉన్నాయి. ప్రయాణాన్ని మక్కువగా ఆస్వాదించ దలచిన వారు ఆకివీడు నుండి కొల్లేటిఒడ్డు వరకు సొంత వాహనం లో గాని, ఆర్టీసీ బస్సు లో గాని ప్రయాణించి అక్కడ నుండి కర్రలవంతెన మీదు గా నడుచుకుంటూ కొల్లేటి పాయను ( ఆనాటి అగడ్త ను ) దాటి అక్కడనుండి ఆటోలో 3.5 కి.మీ కచ్చా రోడ్డుమీద దుమ్ము తో కలిసి పోతూ ప్రయాణం చేసి అమ్మవారి ఆలయాన్ని చేరు కోవచ్చు. ఈ కర్రల వంతెన మీద ప్రయాణం ఒకవింత అనుభూతి. కర్రల వంతెన దాటి నందుకు తలకు మూడు రూపాయలు టోల్గేటు దగ్గర చెల్లించవలసిరావడం ఈ ప్రయాణం లో కొసమెరుపు. ఆటోకి పదిరూపాయల నుండి వసూలు చేస్తారు. ఇదికాక కొల్లేటి అందాలను దర్శిస్తూ, లాంచీలో ప్రయాణం చేసి ఆలయానికి చేరుకోవచ్చు.ఇదే కాకుండా సుఖప్రయాణం కోరుకునే వారు కైకలూరు, ఆలపాడు, ఏలూరు మీదు గా రోడ్డు మార్గం లో ప్రయాణించి అమ్మవారిని దర్శించు కొవచ్చు.

* ప్రత్యేక ఉత్సవాలు.

పెద్దింటమ్మ అమ్మవారి జాతర ఈ ప్రాంత ప్రజలకు గొప్పపండుగ. కొల్లేటి పరిసర ప్రాంతపు కార్మికులు, కర్షకులు కష్టాన్ని మరచి అధికోత్సాహం తో అమ్మవారి జాతర మహోత్సవాల్లో పాల్గొని, ఆనందాన్నిపంచుకుంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ద పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అమ్మవారి( తీర్థం ) జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవం లో భాగం గానే ఇక్కడ కు 2.5 కి మీ దూరం లో ఉన్న గోకర్ణేశ్వర స్వామి వారిని మేళ తాళాల తో గ్రామోత్సవం చేస్తూ తీసుకొని వచ్చి జలదుర్గా గోకర్ణేశ్వర స్వామి వార్ల కళ్యాణాన్ని వైభవోపేతం గా నిర్వహిస్తారు . కళ్యాణానంతరం రథోత్సవం కనుల పండువు గా జరుగుతుంది. పుణ్యాన్ని పురు షార్థాన్ని పొందడానికి ఇటువంటి తీర్థాలను తప్పని సరి గా దర్శించాలని పెద్దలు చెపుతారు .ఆథ్యాత్మిక ప్రదేశం గానే కాక విహారయాత్రా స్థలం గా కూడ ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది.

ARTICLE AND HISTORY OF MAHISHASURA MARDHANI SAMETHA BHIMESWARA SWAMY TEMPLE AT BHIMAVARAM - WEST GODAVARI DISTRICT - ANDHRA PRADESH - INDIA


మహిషాసుర మర్థనీ సమేత భీమేశ్వర స్వామి భీమవరం 

భీమవరం ఆంధ్రదేశం లో ప్రసిద్ధి పొందిన పట్టణాల్లో ఒకటి. భీమవరానికి ఆ పేరు రావడానికి కారణభూతమైన దైవం ఈ భీమేశ్వరుడు. ఈ స్వామి ఇచ్చట మహిషాసుర మర్థనీ సమేత భీమేశ్వరుడు గా తెలుగు భీముడు గా కొనియాడబడుతున్న చాళుక్య భీముని చేత ప్రతిష్ఠించబడి, పూజలందుకుంటున్నాడు.

* చారిత్రక నేపథ్యం 

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇతి హాస కాలం లో దండకారణ్యం గా ఉండేదని, మౌర్యుల కాలం లో ఈ ప్రాంతాన్ని మానవ నివాసయోగ్యం గా తీర్చిదిద్దారని చరిత్రకారులు భావిస్తున్నారు. వారి పరిపాలనాకాలం లోనే బౌద్దమతం ఈప్రాంతం లో వ్యాప్తి చెందింది. మౌర్యసామ్రాజ్య పతనానంతరం ఈప్రాంతం వారి సామంతులగు ఆంధ్ర శాతవాహనుల ఏలుబడిలోకి వచ్చింది. శాతవాహనుల సామ్రాజ్యం క్షీణించిన తరువాత బృహల్పలాయనులవంశస్థులు శాలంకాయనులు అథికారం లోకి వచ్చారు. ప్రస్తుతము ఏలూరు వద్ద నున్న దెందులూరు రైల్వేష్టేషన్ సమీపంలోని పెదవేగి, చినవేగి ప్రాంతాలను కలిపి వేంగీపురం గా మార్చి ,దానిని రాజథాని గా చేసుకొని పాలన కొనసాగించారు. ఆ కారణం గానే ఈ గోదావరి కృష్ణానదుల మథ్య ప్రాంతానికి వేంగీమండలం అనే పేరు వచ్చింది. ఆ వేంగీమండలం లోనే ఈ భీమవరం ఉండేది. శాలంకాయనుల తర్వాత విష్ణుకుండినులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 7 వ శతాబ్ధి ప్రారంభం లో రెండవ పులకేశి విష్ణుకుండినులను ఓడించి, వేంగీమండలాన్ని వశపర్చు కున్నాడు. ఈ గోదావరీ ప్రాంతాన్నికైవసం చేసుకొని,పిఠాపురం ను రాజధాని గా ప్రకటించి, తన సోదరుడు కుబ్జవిష్ణువర్ధనుని తూర్పుప్రాంతానికి రాజప్రతినిథి గా ప్రకటించినట్లు చరిత్ర చెపుతోంది.రెండవపులకేశి మరణానంతరం కుబ్జవిష్ణువర్దనుడు స్వతంత్రుడై ,తూర్పు చాళుక్య రాజ్యాన్నిస్థాపించాడు. ఈ తూర్పు చాళుక్యులు 7 వ శతాబ్దం నుండి సుమారు పన్నెండు వందల సంవత్సరాలు ఆంధ్ర దేశాన్ని పాలించారు. ఈ రాజులు పిఠాపురం నుండి వేంగి అక్కడ నుండి రాజమహేంద్ర వరానికి రాజధానులను మార్చి పరిపాలనను విస్తరింపజేశారు. వీరిలో 9 వ శతాబ్దం లోపాలించిన చాళుక్య భీముడు మహావీరుడు. కళాపోషకుడు. హిందూమతాభిమాని యైన ఈ రాజు ఆంధ్రదేశం లో ఎన్నో దేవాలయాలను నిర్మించాడు. భీమేశ్వరుడు వీరి ఇలవేల్పు. వీరి బిరుద నామాలు కూడ" ముమ్మడి భీముడు," "బిరుదాంకభీముడు" అని ఉండేవి.

* శ్రీ భీమేశ్వర దర్శనం

ఈ చాళుక్య భీముడు నిర్మించిన నగరమే నేటి భీమవరం. ఈయన కట్టించిన ఆలయమే ఈ భీమేశ్వరాలయం గా చరిత్రకారులు చెపుతున్నారు. ఈ ఆలయ నిర్మాణం క్రీ.శ 890-918 మథ్య కాలం లో నిర్మించబడి ఉండవచ్చునని చారిత్రక అంచనా. ఈ దేవాలయ ప్రాంగణం లో లభించిన శిలా సాక్ష్యాలను బట్టి ఈ ఆలయం చాళుక్యుల కాలం నాటి నిర్మాణమని పురావస్తుశాఖ వారు ధృవపర్చారు.

ఈ ఆలయం లో స్వామి శ్రీ భీమేశ్వరుని మూలవిరాట్ 5 అడుగుల ఎత్తు ఉంటుంది. స్వామి కి ఎడమవైపున ఉన్న ఉపాలయం లో మహిషాసురమర్ధని చతుర్భుజాలతో వైష్ణవ రూపిణి గా దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిలోని ప్రత్యేకత ఎడమ కుడి హస్తాలలో చక్ర,శంఖాలను ధరించి ఉండటం. విష్ణువు శంఖ చక్రాలను ధరిస్తాడు. అది కూడ కుడి చేతి లో చక్రాన్ని, ఎడమచేతిలో శంఖాన్ని ధరిస్తాడు. చెన్నకేశవుడు మాత్రమే శంఖ చక్రాలను తారుమారు గా ధరిస్తాడు. ఇక్కడ అమ్మవారి చేతి లో శంఖ చక్రాలు ఉండటం, అవికూడ తారుమారు గా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత గా చెపుతారు. ఈ విథమైన మూర్తి మరి ఎక్కడా ఉండకపోవచ్చు. అందుకే అమ్మవారిని శక్తిస్వరూపిణి గా పూజిస్తారు. ఆలయ ప్రాంగణం లోనే శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ రాధాకృష్ణ ఆలయం ,శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలున్నాయి. గాలిగోపురానికి లోపలి వైపు భీమేశ్వరునికి అభిముఖం గా, బ్రహ్మ,దత్తాత్రేయుడు దర్శనమిస్తారు.

* ప్రత్యేక ఉత్సవాలు

మహాశివరాత్రి కి శ్రీ భీమేశ్వర,మహిషాసురమర్ధని అమ్మవార్ల కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవం గా, పాంచాహ్నిక దీక్ష తో ఐదు రోజులు మహావైభవం గా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో రథోత్సవం, తెప్పోత్సవం రోజుల్లో భక్తుల రద్దీ అధికం గా ఉంటుంది. కార్తీక మాసం లోను ,ధనుర్మాసం లోను స్వామివారికి గ్రామోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఈ భీమేశ్వరాలయం ప్రాచీన ఆలయం అవడం, ఈ ప్రాంగణం లోనే మరి రెండు ఆలయాలుండటం తో దేవాలయ ప్రాంగణం నిత్యం భక్తుల తో కళకళ లాడుతూనే ఉంటుంది.

Friday, 9 January 2015

ARTICLE IN TELUGU ON SRI VEPANJARI SRI LAKSHMI NARAYANA SWAMY TEMPLE AT 85 KM TO CHITTOOR DISTRICT - ANDHRA PRADESH - INDIA


వేపంజరి శ్రీలక్ష్మీ నారాయణ స్వామి ఆలయం

ఈ ప్రాంతం తిరుపతికి 85 కిలోమీటర్ల దూరంలోనూ, చిత్తూరుకు 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. మానవుని పంచ మహాపాతకాలను హరించి, కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఈ క్షేత్రం ‘వేం పంచ హరి’గా పిలవబడింది. ‘వేం’ అనగా పాపమని, ‘పంచ’ అనగా ఐదు, ‘హరి’ అంటే హరించమని అర్థముంది. అంటే, తాము చేసే పంచమహాపాపాలను హరించమని భక్తులు భగవంతుని ప్రార్థిస్తుంటారు. కాబట్టి ఈ క్షేత్రానికి ‘వేం పంచ హరి’ అని పేరు వచ్చిందని ఒక కథనం. కాలక్రమంలో దీని పేరు వేపంజరిగా ప్రసిద్ధి గాంచింది.

స్థలపురాణానికి సంబంధించి, క్రీ.శ. 12వ శతాబ్దంలో చోళవంశానికి చెందిన మూడవ కుళోత్తుంగ రాజువారి పరిపాలనలో తొండ మండల గ్రామంలో శ్రీలక్ష్మీనారాయణ స్వామి స్వయంగా వెలిసాడని చరిత్ర చెపుతుంది. కుళోత్తుంగ చోళుడు పరిపాలిస్తున్న సమయంలో, ఓ వైష్ణవ భక్తుని కలలో గోచరించిన శ్రీమన్నారాయణుడు, తాను సమీపంలోని ఒక పుట్టలో ఉన్నట్లుగా తెలిపాడు. ఆ భక్తుడు తన కలలో కనిపించిన దృశ్యాన్ని రాజుకు వివరించగా, రాజు సకల జనుల సమేతంగా స్వామి ఉన్న పుట్టకోసం వెదకడం జరిగింది. చివరకు ఓ చిట్టడవిలో కనిపించిన పుట్టను తొలగించగా, స్వామివారు, అమ్మవారిని తన తొడపై కూర్చోబెట్టుకున్న భంగిమలో శ్రీలక్ష్మీనారాయణుల వారి శిలాప్రతిమ కాంతులీనుతూ దర్శనమిచ్చింది. ఆ విగ్రహాన్ని ఓ పద్మపీఠంపై ప్రతిష్టింపజేసిన రాజావారు, వెను వెంటనే అక్కడ ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మింపజేసాడు. అలా మూడవ కుళోత్తుంగ చోళుని కాలంలో నిర్మించబడిన ఈ ఆలయము, ఆయన కాలములో నిత్య పూజలతో, ఉత్సవాలతో కళకళలాడింది. అనంతరం పట్టించుకునే వారే కరువై ప్రకృతి బీభత్సాలకు, శత్రువుల దండయాత్రలకు ఆలయం ధ్వంసమయ్యే స్థితికి చేరుకుంది. దాని ఫలితం ఉంటుందిగా మరి. అనంతరం ఆ ప్రాంతమంతా అనావృష్టి తాండవించింది. వర్షాలు లేకపోవడంతో పంటలు లేవు. పంటలు లేకపోవడంతో కరువు కరాళ నృత్యం చేయసాగింది. ఆ స్థితిలో గ్రామస్తులంతా గుమిగూడి, తమ ప్రాంతానికే ఎందుకీ దురవస్థ అని ఆలోచించి, శ్రీలక్ష్మీనారాయణ స్వామికి నిత్య పూజలు జరుగక పోవడమే క్షామానికి కారణమని గ్రహించారు. అనుకున్నదే తడవుగా, ఆరోజు నుంచి ఆలయంలో నిత్య పూజలు మొదలయ్యాయి. ఫలితంగా మరలా ఆ ప్రాంతమంతా పచ్చ పచ్చని పైరులతో కళకళలాడటం ప్రారంభించింది.

ఈ స్వామి వారి విగ్రహం సుమారు క్రీ.శ. 1178-1218 కాలం నాటిది. ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి అమ్మవారిని తన ఎడమ తొడపై కూర్చుండ పెట్టుకుని దర్శనమిస్తారు. ఈ మనోహర రూపాన్ని దర్శించుకోడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. స్వయంగా స్వామి, అమ్మవారితో కలిసి భక్తుల కోరికలను తీరుస్తూ వుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ ఆలయం భక్తుల పాలిట కోరికలు తీర్చే కల్పవృక్షంగా మారింది. విశిష్టమైన వేపంజరి గ్రామంలో శ్రీమన్నారాయణుని ఆలయమే కాక, ఇంకా పలు ఉపాలయాలు, చూడదగిన విశేషాలెన్నో వున్నాయి. అందులో ప్రధానమైంది అష్టలక్ష్మీ ఆలయం. మన రాష్ట్రంలోనే ప్రముఖ స్థానాన్ని ఆ సంపాందించుక్ను ఈ ఆలయంలో శ్రీవారు కుబేరలక్ష్మీతో మధ్యస్థంగా వుండగా చుట్టూ అష్టలక్ష్ములు కొలువై ఉన్నట్టుగా విగ్రహాలు వున్నాయి.

* దశవతార పుష్కరిణి

ఆలయానికి ఈశాన్యదిశలో స్వామివారి దశావతార పుష్కరిణి వుంది. ఈ పుష్కరిణిలో స్వామివారు కృష్ణ లీలలను తెలియజేసే కాళీయమర్దన రూపంలో వుండగా, దశవతార విగ్రహం పలువురిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఒక్కో యుగంలో శ్రీమహావిష్ణువు పాపాత్ములను సంహరించటానికి దశావతారా లు ఎత్తాడని లోకవిదితమే. అయితే ఏ విష్ణు ఆలయంలో చూసినా, దశావతారాలు విడివిడిగా కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం స్వామి వారి దశావతారాలు ఒకే విగ్రహంలో ఇమిడి వుండి 21 అడుగుల దశావతార విగ్రహం రూపంలో అద్భుతమయిన రూపంలో కనిపిస్తుంది.

అంతేకాక స్వామి వారి నాభిభాగంలో బ్రహ్మదేవుడు. వక్షస్థల భాగంలో శివుని రూపం కలిగి వుంటారు. ఫలితంగా త్రిమూర్తులందరిని ఒకేచోట దర్శించుకునే అవకాశం భక్తజనులకు కలుగుతుంది. ఈ ఆలయానికి దగ్గరలోనే దేవతల వైద్యుడైన ధన్వంతరీ ఆలయం వుంది. ఇక్క డకు వచ్చిన భక్తులు వారి అనారోగ్యాన్ని గురించి ధన్వంతరీ దేవుని ముందు చెప్పుకుని, మంత్రాన్ని జపించి అందుకు తగిన ఫలితాన్ని పొందుతుంటారు.

* పూజలు-సేవలు

ప్రాతః కాలంలో ఐదు గంటలకు తెరవబడే ఈ ఆలయాన్ని రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలో మూలవరులకు అభిషేకం, స్వర్ణపుష్పార్చన, కల్యాణోత్సవం (నిత్యం), దీపకైంకర్యం, పుష్ప కైంకర్యం (నెలకోసారి), నిత్యార్చన, గోసంరక్షణ, అన్నదానం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు, కైంక ర్యాలు, ఉభయం, నిర్వహించబడతాయి. ఈ దేవాలయం, ప్రాంగణం, పరిసరాలు సువిశాలంగా కనిపిస్తూ ఆహ్లాదకర వాతా వరణంతో కనిపిస్తూ భక్తుల మనసులను అలౌకిక ఆనందాన్ని అందజేస్తుంటుంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దసరా సమయంలో శ్రీలక్ష్మీనారాయణ స్వామివారికి వైభవో పేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి.

* ఎక్కడుంది? ఎలా వెళ్లాలి?

చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవాలంటే మన రాష్ట్రం లోని విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాదు, రాజమండ్రి వంటి పలు ప్రాంతాల నుండి బస్సు, రైలు సౌకర్యాల ద్వారా చేరు కోవచ్చు. అలా తిరుపతి వరకు వెళ్లి అక్కడ నుండి బస్సు ప్రయా ణం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలాగే చెనై్న, బెంగళూరుల నుండి కూడా వేపంజరికి బస్సు సౌకర్యం వుంది. తిరుపతికి వెళ్లే యాత్రీకులు ముందస్తు ప్రణాళికతో ఈ ఆలయాన్ని కూడా దరించుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు.

* శాపవిమోచన వృక్షం

దశావతార పుష్కరిణి ప్రవేశించే దారిలో రెండు దశాబ్దాల చరిత్రగల మర్రిచెట్టు వుంది. దీనికి శాప విమోచన వృక్షమని పేరు. ఈ చెట్టు కింద బ్రహ్మదేవునికి పూజలు జరుగుతూ వుంటాయని, చనిపోయి ఆత్మలుగా మారిన వారు ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ మోక్షాన్ని పొందుతారని ఒక కథనం ప్రచారంలో వుంది. అందుకే ఈ చెట్టుకు శాపవిమోచన వృక్షమని పేరు వచ్చింది. ఈ చెట్టు నుంచే వేపంజరి దిద్యక్షేత్రానికి శాప విమోచన క్షేత్రమన్న పేరు ఉంది.

* సుదర్శన, యోగ మందిరం

ఈ పుణ్య క్షేత్రంలో మరొక విశేషం యోగమందిరం. ఈ మందిరంలోని ఓ విగ్రహం పైభాగంలో సుదర్శన చక్రం, కింద భాగంలో యోగనరసింహస్వామి కలిసిన విగ్రహం దర్శనమిస్తుంది. ఈ విగ్రహం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తూ సుదర్శన మంత్రాన్ని జపిస్తూంటే సమస్త పాపాలన్నీ పటాపంచలై ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.

* కల్పవల్లి వృక్షం

రాగి, వేప, మద్ది, చింత, మర్రి, బిల్వ, పనస మొదలగు ఏడు వృక్షాలు కలిగిన ఈ స్థలంలో కల్పవల్లి మరియు మునీశ్వర దేవతలు పూజలందుకుంటారని అందుకే దీనిని కల్పవృక్షమంటారు. కోరిన కోర్కెలు తీర్చే ఈ తల్లి భక్తుల పాలిట కొంగుబంగారంగా మారింది.

* నక్షత్ర వనం

ఈ వనంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు తమ దేవేరులైన సరస్వతి, లక్ష్మి, పార్వతీ సమేతంగా కొలువై వుంటారు. వారి చుట్టూ నవగ్రహాలు ప్రతిష్టించబడి వుంటాయి. అంతేకాక 27 నక్షత్రాలకు సంకేతంగా 27 వృక్షాలున్నాయి. దీని దగ్గర్లో 18 మెట్లతో అయ్యప్పస్వామి విగ్రహం వుంది. శబరిమలైని తలపించే విధంగా స్వామి విగ్రహం కనిపిస్తుంది. అంతేకాక పుష్కరిణికి ఉత్తరదిశలో శ్రీవిద్య వినాయక విగ్రహం కూడా వుంది.ఇంకా ఈ క్షేత్రంలో 33 అడుగుల ఎత్తుతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి వారి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. దీనితో పాటు, గంగమ్మ మరియు భక్త ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు కూడా వుండటం విశేషం. ఇలా ఆలయ ప్రాంగణమంతా శిల్పకళా శోభితంగా అలరారుతుంది.

Friday, 5 December 2014

2000 YEARS AGED TIMPLE AT CHEBROLU - GUNTUR DISTRICT - ANDHRA PRADESH - INDIA


రెండు వేల సంవత్వరాల వయస్సు కలిగిన ఆలయం::

గుంటూరు జిల్లాలో అతి పురాతన ఆలయం :: 

Read Completely::

ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం గుంటూరు జిల్లా సమీపంలోని చేబ్రోలు గ్రామంలో ఉన్న ఆలయ ప్రాంగణంలోని ఒక ఆలయం.. ఈ ఆలయ ప్రాంగణంలో రెండు వేల సంవత్సరాల క్రితం(అనగా పధ్నాలుగవ శతాబ్ధంలో ) నిర్మించిన ఆలయాలు కూడాఉన్నాయి.. ఇంతటి చారిత్రక ప్రాశస్థ్యం కలిగిన ఈ గుడులకు కొన్ని వందల ఎకరాల దేవుడి మాన్యం కూడా ఉందట... కానీ కాలక్రమేణా చేతులు మారి చివరికి నిత్య నైవేద్యం కూడా మొక్కుబడిగా పెట్టే స్థితి వస్తుందని ఆ బ్రహ్మ లింగేశ్వరుడు కూడా ఊహించి ఉండడు... మన భారతదేశంలో బ్రహ్మ కు ఆలయాలు చాలా చాలా తక్కువ.. అటువంటి ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లో ఉందని చాలా మందికి తెలియదు కూడా.. సువిశాల ఆవరణలో ఉన్న ఈ దేవాలయ ప్రాంగణం చాలా బావుంటుంది.. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.. ఏ ఆదరణకు నోచుకోకుండానే దీని వైభవం ఈ విధంగా ఉంటే కొంచెం శ్రద్ధ చూపితే ఎంత బావుంటుందో.. ఈ ఆలయ విశేషాలు.. 

1. గుంటూరు జిల్లాలో రెండు వేల సంవత్వరాల వయస్సు కలిగిన ఆలయం...
2. పల్లవ, చాళుక్య, చోళ చరిత్రకు సంబంధించిన అవశేషం...
3. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఏకైక బ్రహ్మ దేవాలయం...
4. ఒకే ఊరిలో నూటొక్క దేవాలయాలు...
భృగు మహర్షి శాప కారణంగా బ్రహ్మ దేవునికి ఎక్కడా ఆలయాలు ఉండవు.. కానీ కాశీ లో ఒక ఆలయం ఇక్కడ గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో ఒక ఆలయం ఉంటాయి... ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం చుట్టూ కోనేరుతో మధ్యలో ఆలయం తో చూడముచ్చటగా ప్రశాంతంగా ఉంటుంది... శివలింగంలో నాలుగు దిశలా నాలుగుముఖాలతో బ్రహ్మ ఇక్కడ కొలువైయ్యాడు...
ఈ ఆలయం వేయి సంవత్సరాలచరిత్ర కలిగినదని... ఆ సమయంలో ఈ ప్రదేశాన్ని చాళుక్య చోళులు పరిపాలించేవారు... తూర్పు చాళుక్యులకు చెందిన సత్యశ్రాయుడు తన సేనాధిపతి బయనంబిని దండయాత్రకై పంపించాడు.. ఆయన చాళుక్యచోళులకు సంబంధించిన ధరణికోట(అమరావతి)ని యనమదల కోటలను ఓడించి తన సామ్రాజ్యానికి ముఖ్యపట్టణంగా చేబ్రోలును ఎంపిక చేసుకుని ఇక్కడ పలు ఆలయాలు నిర్మించాడు...
చాలావరకు ఆల యాలు చరిత్ర గతిలో కలసినా ఆంధ్రుల శిల్పకళా ప్రాభ వాన్ని చాటి చెప్పే దేవాలయాలింకా కొన్నిక్కడ మిగిలి ఉన్నాయి. సరస్సు మధ్యలో బ్రహ్మదేవుడి కొక ఆలయం -ఆ చతుర్ముఖుని నాలుగు ముఖాల మధ్యలో శివ లింగం అద్భుతంగా ఉన్నాయి. బ్రహ్మేశ్వర లింగంగా ఇది ప్రసిద్ది చెందింది. ఇదేకాక సహస్ర లింగేశ్వర స్వామి, వీరభద్రస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. నాగేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయం, నంది విగ్రహం కూడా ఉన్నాయి. ఇక్కడి అమ్మవారు రాజ్యలక్ష్మి. ఈ ఆలయం క్రీ.శ. మొదటి శతాబ్దం నుంచీ ఉన్నదనటానికి చారిత్రక ఆధారాలు ఇక్కడ దొరికిన నాణాలు. తొట్ట తొలుత ఈ క్షేత్రం పేరు తాంబ్రావ, తాంబ్రాప. క్రమంగా అది చేబ్రోలు అయింది. లోహ యుగపు మొదలులో ఇక్కడ తామ్ర లోహం చాలా విరివిగా దొరికేదట...ఇక్కడ రాగి, తామ్రం తో కూడిన తయారీ పనివారు ఉండే వారట... అలా తామ్రమును సంస్కృతంలో ‘చెం’ అని అంటారని...(చిన్న చిన్న రాగి, ఇత్తడి లోటాలను/డొక్కులను చెంబులు అంటారు) ఈ చెంబులు తయారీ అయే పేరు కాస్తా చేబ్రోలు అయిందని వినికిడి...
మొదట ఇక్కడ కుమార స్వామికి గుడి, పూజ ఉండేవిట. అప్పట్లోనే చౌడేశ్వర, గణపేశ్వర ఆల యాలు నిర్మించారు. తర్వాత భీమేశ్వర ఆలయం.
ఈ భీమేశ్వరాలయం క్రీ.శ. రెండవ శతాబ్ది కి చెందినదని... ఈ గుడికి జీర్ణోద్ధారణ ప్రక్రియ నిమిత్తం బాగుచేస్తుండగా రెండువేల ఏళ్ళ సంవత్సరాల క్రితం శివలింగం నంది విగ్రహాలు బయటపడ్డాయి... ప్రస్తుతం పురావస్తు శాస్త్రజ్ఞులు చాలా జాగ్రత్తగా పనులు చేస్తున్నారు.. ఇక్కడే పన్నెండు అడుగుల నటరాజ విగ్రహం ఉండేదట కానీ ప్రస్తుతం ఆ ఆలయమూ లేదు దాని ఆనవాళ్ళు కూడా లేవు అక్కడ. కానీ ఆలయముందు భాగంలో ఉండవలసిన ఒక పెద్ద నంది విగ్రహం మాత్రం ఉంది... ఇటువంటి పురాతన సంస్కృతికి సంబంధించిన అవశేషాలను ఆనవాళ్ళను కాపాడుకోవడంలో మన ఆంధ్రులం కొంచెం వెనుకపడ్డామనే చెప్పుకోవచ్చు.. ఈ విషయంలో తమిళులను ఆదర్శంగా తీసుకుంటే చాలా వృద్ధి సాధించవచ్చు..
కొన్ని వేల ఏళ్ళ చరిత్ర కలిగిని ఈ చేబ్రోలు (నూటొక్క గుడులు)దేవాలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం పూనుకుంటే గుంటూరు జిల్లా టూరిజం బాగా వృద్ధి చెందుతుందనుటలో ఎటువంటి సందేహం లేదు...
అంతటి ఘన చరిత్ర కలిగిన దేవాలయాన్ని మీ కళ్ళతో స్వయంగా చూడవలెనని ఉందా.. క్రింద లింకు నుండి యూ ట్యూబ్ ద్వారా చూడండి.

Thursday, 13 November 2014

DETAILED HISTORY AND FULL INFORMATION ABOUT SREE KANAKA DURGA AMMA VARU - INDRAKEELADHRI - VIJAYAWADA - ANDHRA PRADESH - INDIA


విజయ దాయిని కనకదుర్గ – ఇంద్రకీలాద్రి

అమ్మలకు అమ్మ మన దుర్గమ్మ. కోరిన కోరికల తీర్చెడి కల్పవల్లి యై, ఆర్తులను ఆదుకొనెడు అభయప్రదాత్రి యై ,కనకధారలను కురిపించు బంగారుతల్లియై, పాడిపంటలను కాపాడు నిత్యకళ్యాణి యై సువాసినీ పూజలందుకుంటున్న శ్రీ గౌరియై , దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తూ “ తన్ను లో నమ్మిన జనమ్ముల”నాదుకుంటూ ఇంద్రకీలాద్రి పై కొలువు తీరిన త్రిపురసుందరి కనకదుర్గ. పవిత్ర కృష్ణానదీ తీరాన వెలసిన పుణ్యతీర్థమిది. సాధారణ దినాలలో వేలమంది, పర్వదినాలలో లక్షలాది భక్తులు పుణ్య స్నానాలు చేసే పవిత్ర తీర్ధమిది హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి పై విజయవాడ లోకి ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరిని తన అమృతహస్తాలతో ఆశీర్వదిస్తూ, ఆహ్వానిస్తూ భక్తులకు తాను కొండంత అండగా వున్నానంటూ భరోసా ఇస్తున్నట్లుగా కన్పిస్తుంది ఎడమ వైపున ఇంద్రకీలాద్రి.దాని పై కొలువు తీరిన దుర్గమ్మ. అతిథులకు అర్ఘ్య పాద్య ఆచమనీయాలివ్వడం భారతీయత గనుక కుడివైపు న ఉన్న కృష్ణమ్మ నగరంలోకి ప్రవేశిస్తున్న ప్రతిఒక్కరిని తన చల్లని చిరుగాలులతో ప్రయాణపు అలసటను పోగొడుతూ తీయని మంచినీటి ని అందిస్తూ, ప్రకాశం బరాజ్ అందాలతో ఆహ్లాదాన్ని కల్గిస్తోంది. ఇది విజయవాటిక చేసుకున్న పుణ్యం. కనకదుర్గాదేవి కరు ణాకటాక్షవీక్షణాల సాఫల్యం..

* స్థలపురాణం

పూర్వం ఇంద్రకీలుడనే యక్షుడు పార్వతీ పరమేశ్వరులను గూర్చి వేల సంవత్సరాలు తపస్సు చేసి వారిని ప్రసన్నం చేసుకున్నాడు. ప్రత్యక్షమైన ఆది దంపతులను ఎల్లప్పుడు తనపై అదివసించి ఉండేటట్లు వరం కోరాడు. అందుకు అంగీకరించిన శివపార్వతులు యక్షుణ్ణి శైలరూపాన్ని పొందవలసిందిగా ఆజ్ఞాపించారు. ఇంద్రకీలుడు శైలరూపాన్ని పొందగా ,ఆనాటినుండి పార్వతీ పరమేశ్వరులు దుర్గా మల్లేశ్వరు లై ఇంద్రకీలాద్రి మీద కొలువు తీరియున్నారు. యక్షుడి పేరు కీలుడని, స్వయంభువుగా వెలసిన అమ్మను ఇంద్రాది దేవతలు కొలవడం వలన ఇంద్రకీలాద్రి అయ్యిందని ఒక కథ.

విజయుడు ప్రతిష్టించిన విజయేశ్వరస్వామి ఇక్కడ కొలువు తీరి వుండటంతో ఈ పురాన్ని విజయవాటిక యని విజయవాడ అని , బెజవాడ అని కూడ పిలుస్తున్నారు.

వనవాసం చేస్తున్న పాండవులను పరామర్శించడానికి వచ్చిన వేదవ్యాసుడు మాటల సందర్భంగా పాశుపతాస్త్ర ఫ్రస్తావన చేసి, దాన్ని సంపాదించవలసిందిగా పాండవులను ఆదేశించాడు . ధర్మరాజు ఆశీస్సులను పొందిన అర్జునుడు ఇంద్రకీలాద్రి కేగి పశుపతిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరతపస్సు ప్రారంభించాడు.మల్లికా పుష్ఫాలతో నిత్యం శివార్చన చేస్తూ కఠోర తప మాచరిస్తున్న అర్జునుని పరీక్షించడానికి ఆది దంపతులు కిరాతవేషధారులై ప్రవేశించారు. వరాహ వేట లో మాట పెరిగింది . ధనుర్యుద్ధం ముగిసింది. మల్లయుద్ధానికి సిద్ధపడ్డారు కిరాతార్జునులు. తను విసురుతున్న ఒక్కొక్క ముష్టిఘాతానికి కిరాతుని శరీరం నుండి మల్లికా పుష్పాలు రాలడం గమనిస్తూనే ఆవేశంతో కిరాతుని కొట్టడానికి గాండీవం ఎత్తాడు విజయుడు. ఆదిదంపతులు ప్రత్యక్షమయ్యారు. పాశుపతాస్త్రాన్ని ప్రసాదించారు. ఆనాడు విజయుడైన అర్జునుని చేత ప్రతిష్టించబడిన లింగమే విజయేశ్వరస్వామి. ఆయన ఉన్న ప్రాంతమే విజయవాటిక.లేదా విజయవాడ.

అర్జునునితో మల్లయుద్ధము చేసిన ఈశ్వరుడు కావున మల్ల >ఈశ్వరుడు మల్లేశ్వరుడైనాడని, మల్లికాసుమాలచే పూజించబడటం వలన మల్లి > ఈశ్వరుడు > మల్లీశ్వరుడైనాడని ఒక ఐతిహ్యం.

మహిషాసురమర్దని గా ఇందకీలాద్రి పై నున్న కనకదుర్గ అష్టబాహువులతో వివిధ ఆయుధ ధారిణియై మనకు దర్శనమిస్తోంది. ధీనికి ఆధారంగా దేవీభాగవతంలో ఒక కథ కన్పిస్తోంది.

శుంభ నిశుంభులను రాక్షసులు శివుని మెప్పించి పురుషుని వలన మరణం లేకుండా వరం పొందుతారు. ఆ వర గర్వంతో దేవతలను యజ్ఞ హవిస్సులను సైతం హరించసాగారు. దేవతలు వెళ్లి శివునితో మొరపెట్టుకున్నారు . శివుని అర్థబాగమైన గౌరి తన శరీరమునుండి ఒక స్తీమూర్తిని అవతరింపజేసింది ఆమె పేరు కౌశిక. ఆమె సౌందర్యానికి మోహితులై తమను పెళ్లి చేసుకోవలసిందిగా కౌశిక వద్దకు రాయబారం పంపించారు శుంభ నిశుంభులు. యుద్ధంలో తనను ఓడించిన వారినే వివాహం చేసుకుంటానన్నది కౌశిక. ఆ యుద్దంలో రాక్షస సేనానాయకులైన ధూమ్రలోచనుడు, చండముండులను సంహరించి, ఉగ్రరూపిణియై ప్రచండదుర్గగా శుంభనిశుంభులను సైతం మట్టుపెట్టింది తల్లి.

ఇంద్రకీలాద్రి పై వెలసిన ఆ ఉగ్రరూపిణి ని దర్శించడానికి దేవతలు కూడ భయపడుతుంటే ఆదిశంకరులు శ్రీ చక్ర స్థాపన చేసి ఆమెలోని రౌద్రకళలనన్నింటిని వేరొకమూర్తిలోకి ఆవాహన చేసి శాంతమూర్తిగా మార్చి మల్లేశ్వరునితో శాంతి కళ్యాణం జరిపించారని ఆనాటి నుండి ఆమె కనకదుర్గయై భక్తులను కాపాడుతోందని స్థలపురాణం చెపుతోంది.

* ఆలయ ప్రత్యేకత

ఇంద్ర కీలాద్రి పై వెలసిన కనకదుర్గ స్వయంభువు. ఈమె అష్టభుజాలు కలిగి,శంఖ చక్ర గదా ఖడ్గ పాశ భిండి వార త్రిశూలాది ఆయుధాలను ధరించి అభయహస్తం తో మహిషాసురమర్థని గా మనకుదర్శనమిస్తోంది .ఈవిడ మహిషాసుమర్ధని అయితే దుర్గమ్మ ఎక్కడ అని వెతుకులాడే భక్తకోటికి మన పూర్వీకులు ఒకనమ్మకాన్ని ప్రచారం చేశారు. ఇంద్రకీలాద్రి ఫైనే గుహల్లో ఎక్కడో కనకదుర్గాదేవి మూర్తి ఉందని , ఆమెను నిత్యం యోగులు ఋషులు యక్షులు కిన్నెరులు దేవతలు సేవించుకుంటూ ఉంటారని మహిషాసురమర్థని ప్రథమ ద్వారం కాగా రెండవద్వారం వద్ద చింతామణి దుర్గాదేవి దర్శనం లభిస్తుందని చెపుతున్నారు.{ www.durgamma.com }.

ఈ విధమైన వాదనే వేదాద్రి యోగానందనరసింహస్వామి విషయంలోను విన్పిస్తోంది. స్వామివారు గుహలో ఉన్నారని నేను వెళ్లి వచ్చామని వయోవృద్దులై మరణించబోతూ నాతో చెప్పిన వాళ్లు న్నారు. మరికొన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడ ఇటువంటి వాదనలు విన్నాము. వీటిని స్థూలంగా విశ్లేషిస్తే-- మంత్ర ద్రష్టలు ఉపాసనాపరులునైన మనపూర్వీకులు అనేకవేరువేరు కారణాల వలన మూలమూర్తులను మరుగు పరచి ప్రతిష్ఠామూర్తులలో మూలరూపశక్తులను ఆవాహన చేసి మనకందించారేమో నని పిస్తోంది. ఇది విషయాంతరము.చర్చనీయార్హము.

సింహవాహనారూఢయైన మహిషాసురమర్ధనిగా కనకదుర్గమ్మ కొలువు తీరివుంది. ఆమెకు ఎడమ వైపు శ్రీచక్రం ఫ్రతిష్టించబడింది. ధుర్గామల్లేశ్వర స్వామి వార్లకు జరిగే పూజలన్నీ ఈ శ్రీచక్రానికే జరుగుతాయి. ప్రక్కనే గణపతి విగ్రహం ధర్శనమిస్తుంది. విజయవాడ శక్తి ప్రధానక్షేత్రమైనప్పటికి ఇచ్చట శాక్తేయ విధానంలో ఆరాధన జరగటం లేదు. ఇది ఇక్కడి ప్రత్యేకత మహిషాసురుడనే రాక్ష సుని సంహరించిన ఆదిశక్తి మహిషాసుర మర్ధని యైంది.ఆ కథ ఇలా ఉంది. దితి రాక్షసుల తల్లి.

తనసంతానాన్నిఇంద్రుడు మట్టుపెడుతుండటంతో ఇంద్రుని చంపగలిగిన కుమారుని కోసం సుపార్శుడనే ముని ఆశ్రమం ప్రక్కగా దితి ఘోరతపస్సు ప్రారంభించింది. ఆమెతపస్సువేడికి కోపగించిన సుపార్శుడు నీకు మహిషుడు పుడతాడని శపించాడు. ఆమెకు ప్రత్యక్షమైన బ్రహ్మ సైతం ముఖము మహిషమై మిగిలిన శరీరం నరరూపంతుండే కుమారుణ్ణి ప్రసాదించాడు. మహిషుడు తపస్సుచేసి శివుని మెప్పించి మరణం లేకుండా వరాన్ని కోరాడు. పుట్టిన వానికి మరణం తప్పదు అన్నాడు శివుడు. అయితే మగవానితో మరణం లేనట్లు వరం పొందాడు మహిషుడు. మహిషుని ఆగడాలను భరించలేని దేవతాగణం తమ నారీతేజాలనన్నింటిని ఒక్కచోట చేర్చి ప్రార్ధించారు. ఆ తేజస్సునుండి ప్రచండ శక్తి ఆవిర్భవించి మహిషాసురుని మట్టుపెట్టి మహిషాసురమర్ధని యై పూజలందుకుంటోంది . ఇది ఒక స్థలపురాణం.

* చారిత్రకత

క్రీ.శ. 7వశతాబ్దం. మాధవవర్మ మహారాజు విజయవాటికను పరి పాలించే రోజులవి. అతని కుమారుడు ఇంద్రకీలాద్రి సమీపంలో వేగంగా రథాన్ని నడిపి ఒక సామాన్య స్త్రీ కుమారుని మరణానికి కారణమయ్యాడు. పుత్ర శోకంతో న్యాయార్థిని యై వచ్చిన ఆ వనిత ధర్మఘంట మోగించింది. విషయాన్ని సభలో విచారించి నేరస్థుడైన తనకుమారునకు మరణదండన విధించాడు మాధవవర్మ. అతని లోని ధర్మదీక్ష కు సంతోషించిన విజయదుర్గ విజయవాటికలో కనకవర్షాన్నికురిపించి, కనకదుర్గ అయ్యిందని ఒక ఐతిహ్యం . అయితే ఈ మాధవవర్మ పల్లవుడా? తూర్పు చాళుక్యుడా? అనేది చరిత్రకారుల్లో సంశయం ఉంది. కాలం ఏదైనా కనకవర్షం మాత్రం యదార్థం.

మల్లేశ్వరస్వామి దేవాలయంలో ముఖమండపంలోని కుడి వైపు స్థంభం మీద క్రీ.శ.9 వ శతాబ్దం నాటి తెలుగు శాసనం ఒకటి కన్పిస్తోంది.

చాగి వంశానికి చెందిన” నరసింహవర్ధన” బిరుదాంకితుడైన రెండవ పోతరాజు విజయవాటిక లోని” మల్లేశ్వర స్వామికి హవిర్బిల్వార్చనలకు నోచెండ్ల గ్రామాన్ని, జక్కమపూడి లోని రెండుభాగాలను దానంచేసినట్లు” జక్కంపూడి శాసనం చెపుతోంది.{ఆర్క్-335—1882 } ఈయన కాలం శా.శ. 1119 -1152. గుడిమెట్ట ను రాజధానిగా చేసుకొని, విజయవాటిక ,బృహత్కాంచీపురా{ పెనుగంచిప్రోలు } లను ఉపకేంద్రాలుగా చేసుకొని రెండు శతాబ్దాలు పరిపాలన సాగించిన చాగి వంశంలో ఇతని పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పవచ్చు.

అలాగే మనం “ బెజవాడ “అని పిలుస్తున్న పేరు కూడ అతి ప్రాచీనమైనది గానే కన్పిస్తోంది. రెండవపోతరాజు కాలంలోనే కొనకంచి ఆంజనేయస్వామి దేవాలయ స్ధంభం మీద ఉన్న శాసనంలో “ బెజవాడ తెలికివేవురు కులానికి చెందిన కుఱ్ఱిశెట్టి కొనకంచి నరేంద్రేశ్వర దేవరకు దీపమాలలు రెండుసేయించ్చె.... అని” వ్రాయబడింది. { ఆర్క్-270-1924}

శ్రీకృష్ణ దేవరాయలు దుర్గామల్లేశ్వరులను దర్శించి కానుకలు సమర్పించినట్లు శాసనాలున్నాయి. అక్కన్న మాదన్నగుహలు చారిత్రక ఆధారాలే.ఆముక్తమాల్యద కావ్యం చెరిగి పోని సాక్ష్యం కదా! బెజ్జంవాడ > బెజవాడ అయ్యిందని ఒక వాదన .
ప్రత్యేక ఉత్సవాలు ప్రతిసంవత్సరము అమ్మవారికిజరిగే ఉత్సవాల్లో నవరాత్రి ఉత్సవాలు ప్రధానమైనవి. తొమ్మిది రోజులు తొమ్మిది శక్తిరూపాలతో తల్లి భక్తులను కటాక్షిస్తుంది. వీటినే దేవీనవరాత్రులుగా వ్యవహరిస్తారు.ఇవి సెప్టెంబరు- అక్టోబరు నెలల్లో వస్తాయి. శివరాత్రికి దుర్గా మల్లేశ్వర కల్యాణం వైభవంగా జరుగుతుంది. నవంబరు- డిశెంబరు నెలల్లో భవానీదీక్షలు అంగరంగవైభవంగా జరుగుతాయి.ఇంద్రకీలాద్రే కాదు విజయవాడే దీక్షాధారులతో నిండిపోతుంది.

* ఆలయం తెరచి ఉంచు వేళలు

ప్రభాతవేళ 4గం.ల నుండి రాత్రి 9గం.ల వరకు వివిధ దర్శనాలు లభిస్తాయి .

* రవాణాసౌకర్యాలు

విజయవాడ అతి పెద్ద రైల్వే జంక్షన్. దేశం నలుమూలలనుండి రవామా సౌకర్యం పుష్కలంగా ఉంది. కొండమీదకు 500 మెట్లతోటి కాలిబాట, ఘాటురోడ్డు సౌకర్యం ఉంది. నగరంలోని ప్రధాన కూడళ్ల నుంచి దేవస్ధానం వారి బస్సు సౌకర్యం ఉంది. కొండమీదకు స్వంతవాహనాలకు టోల్ రేటు అనుమతి ఉంది.

* వసతిసౌకర్యాలు

దేవస్దానం వారి వసతి గదులు రూ 50/ నుండి 250/ రూపాయల పరిధిలో ఆయా వసతులతో లభిస్తాయి .లగ్జరీ రూములు కావాలనుకొనే వారికి పెద్ద హోటళ్లు అందుబాటు లోనే ఉంటాయి. ప్రతిరోజు 600 నుండి 1000 మంది వరకు నిత్యాన్న దానం జరుగుతూ ఉంటుంది.

సంప్రదించవలసిన నెంబర్లు 0866-2423600 , 0866-2423800
వివరాలకు www.dugamma.com లో కూడ చూడవచ్చు.

FULL DETAILS AND HISTORY OF SRI SRI SRI BALA PARVATHI SAMETHA SRI JALADEESWARA SWAMY VARI TEMPLE - GHANTASALA - KRISHNA DISTRICT - ANDHRA PRADESH - INDIA


 ఘంటశాల జలథీశ్వరస్వామి

కృష్ణాతీరం లో వెలసిన తీర్దక్షేత్రాల్లో ఘంటశాల ఒకటి.ఆంద్రదేశం లోనే కాకుండా భారతదేశం లోనే ఎక్కడా లేని విధంగా శివపార్వతులిద్దరూ ఒకే పానమట్టం పై దర్శనమిచ్చే ఏకైక క్షేత్ర మిది. జలథీశ్వరస్వామి గా స్వామి సేవలందుకుంటుంటే, బాలపార్వతి గా అమ్మవారు భక్తులను తన కరుణాకటాక్ష వీక్షణాలతో కాపాడుతూ వస్తోంది . ఇది తరతరాలనాటి మాట.ఎందుకంటే ఈ ఆలయం రెండవశతాబ్ది కంటే పూర్వపు దని చరిత్రకారులు శాసనాద్యాధారాతో నిర్ధారించారు. ఒకే పీఠం మీద ఆదిదంపతులు కొలువు తీరిన రమణీయ దృశ్యం భక్తులను పరవశులను చేస్తుంది.పెద్దముతైదువ పెనిమిటి తో కలసి ఏకపీఠం మీద దర్సనమివ్వడం అపురూప దృశ్యం కదా. ఇటువంటి మూలవిరాట్ సందర్శనం సకలశుభాలను, సుఖాలను,సంపదలను , కీర్తిప్రతిష్టలను కలిగిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

* స్థలపురాణం:

హిమవంతుని కుమార్తె గా జన్మించిన పార్వతీదేవి పరమశివుని కోసం ఘోర తపస్సు చేసి, శంకరుని మెప్పించింది. సప్తఋషులు పెళ్లి పెద్దలుగా వెళ్లి వివాహాన్ని నిశ్చయం చేశారు. కమనీయమైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వేడుకను కనులారా గాంచడానికి సమస్త ప్రాణికోటి ఉత్తరాపథానికి బయలుదేరింది. జీవకోటి భారంతో ఉత్తరాపథం కృంగి పోయే ప్రమాదం సంభవించింది.ఆ సమయంలో పరమేశ్వరుడు స్వయంగా అగస్త్యమహర్షిని పిలిపించి, తక్షణమే దక్షిణాపథానికి వెళ్లి ఒక పవిత్ర ప్రదేశంలో శివపార్వతులను ప్రతిష్ఠించి, పూజలు జరిపితే తమ కల్యాణం చూచిన ఫలం లభిస్తుందని, వెంటనే ఆ పని చేయవలసిందని ఆజ్ఞాపించాడు. మహేశ్వరుని ఆజ్ఞను శిరసావహించి, మహా తప స్సంపన్నుడైన అగస్త్యుడు దక్షిణాపథానికి విచ్చేసి, ఘంటసాల ను పవిత్ర ప్రదేశంగా ఎన్నుకొని పానమట్టంమిద శివపార్వతులను ప్రతిష్ఠించి, ఏకాగ్రతతో పూజాదికాలు నిర్వహించి శ్రీస్వామివారి సాక్షాత్ కళ్యాణమహోత్సవసందర్శన భాగ్యాన్ని పొందాడు. ఆనాటి నుండి దక్షిణకైలాసం గా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. అప్పటికి ఈ గ్రామం సముద్రం, కృష్ణానది కలిసే నదీ ముఖ ద్వార ప్రదేశంగా ఉండేది. జలథి అంటే సముద్రం. సముద్రం లో నౌకాయానానికి బయలుదేరేముందు నావికులు గంగానాథుడైన ఈ స్వామిని పూజించి , బయలుదేరేవారని, తిరిగి వచ్చిన తరువాత మళ్లీ స్వామిని దర్శించుకొనే ఇళ్లకు వెళ్లేవారు. దుకే ఈ స్వామి జలథీశ్వరుడయ్యాడు. 1,2 శతాబ్ధాలలోకంటకశ్శిల అనేపేరు గల ఘంటశాల ప్రముఖ నౌకా కేంద్రంగా విలసిల్లినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.

* ఆలయప్రత్యేకత.

శివపార్వతులిద్దరు ఒకే పానమట్టం మీద దర్శనమివ్వడం ఈ ఆలయప్రత్యేకత.ఈ పానమట్టం ఏకఱాతిశిల. దీని నాలుగుమూలలా నాలుగు కాళ్లు ఉండి దానిపై పైనమట్టం నిలిచి ఉంటుంది.పానమట్టం భూమిని తాకక పోవడం ఒక ప్రత్యేకత.

ఈ ఆలయ గోపురం” గజపృష్టాకార గోపురం” గా పిలవబడుతోంది. అంటే సాధారణ ఆలయాల గోపురం వలే కాకుండా ఇది మూడు శిఖరాలను కలిగిఉంటుంది. తంజావూరు బృహదీశ్వరాలయ గోపురం మాత్రమే ఇటువంటి ఆకృతిని కలిగి ఉంది విమాన శిఖరం ఎత్తు కూడ 45 అడుగులవరకు ఉంటుంది. ఈ విమానగోపురం పాటిమట్టి తో నిర్మించబడి తరువాత కాలంలో సిమెంటు ప్లాస్టింగ్ చేయబడింది.

మహామేరు శ్రీ చక్రం ఈ ఆలయంలో అమ్మవారి ముందు అర్చించ బడుతోంది.32కిలోలబరువు తో,9అంగళాల ఎత్తు కలిగి పంచలోహాలతో చేయబడిన ఈ శ్రీ చక్రాన్ని కంచి పీఠాథిపతుల అనుగ్రహంతో కంచి పీఠంనుండి తెచ్చి ప్రతిష్టించడం జరిగింది . పూజ్యశ్రీ రామేశ్వరానందగిరి స్వామి వారిచే ఆలయములో అమ్మవారి పాదముల చెంత ఉంచబడి పూజించబడుతోంది.

కంచిపీఠాథిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు జయేంద్రసరస్వతీ స్వామి వారు ఈ ఆలయంలోని పీఠాన్ని అర్థనారీశ్వర పీఠంగా నిర్థారించారు.

* నవగ్రహమండపం.:

ఏకపీఠంపై వెలసిన సివపార్వతుల వలెనే నవగ్రహాలకు చెందిన దేవతామూర్తులు కూడ సతీసమేతులై ఈ ఆలయము నందలి నవగ్రహమండపం లో కొలువు తీరి ఉండటం మరొక ప్రత్యేకత.ఇటువంటి నిర్మాణం చాలా అరుదుగా దర్శనమిస్తుంది. ఏలినాటిశని నుండి అన్నిరకాల శనిదోష నివారణకు, రాహుకేతు పూజలకు ఈ మందిరం అత్యంత ప్రసిద్ది.

* శ్రీసుబ్రమణ్యేశ్వర ఆలయం.

ఈ ఆలయ ఆవరణ లోనే 200 సంవత్సరాల నాటి వల్లీ దేవసేనా సమేత శ్రీసుబ్రమణ్యేశ్వర ఆలయం ఉంది. మార్గశిర మాసంలో షష్టి ఉత్సవాలు తిరునాళ్లను తలపిస్తూ అత్యంతవైభవంగా జరుగుతాయి. సంతానాకాంక్షులయిన దంపతులు స్వామివారికి పూజలు చేయించి మందిరానికి వెనుకనున్న నాగేంద్రస్వామి పుట్టలో పాలు పోయడం, అనంతర కాలంలో తల్లిదండ్రులై మరలా వచ్చి స్వామికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతోందని భక్తుల విశ్వాసం.

దేవాలయఆవరణ లో నైఋతిభాగంలో శ్రీవిఘ్నేశ్వర స్వామి ఆలయం నిర్మించబడింది.పూర్ణిమ తరువాత వచ్చే చవితికి ఈ ఆలయంలో విశేషపూజలు జరుగుతాయి. జలథీశ్వరుని అభిషేకజలం ఆరోగ్యప్రదాయిని . ఈ అర్దనారీశ్వరుని అభిషేకజలం సర్వరోగనివారిణి యని జనశ్రుతి.

అంత్రాలయ ద్వారానికి పైన ఆది శంకరుల విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఎడమ వైపు కాలభైరవుడు, కుడివైపు నరసింహస్వామి ద్వారపాలకులు గా దర్శనమిస్తారు. దీనిని శివ కేశవాభేదానికి ప్రతీకగా భక్తులు చెప్పుకుంటారు.ఈ రెండు పాలరాతి విగ్రహాలు క్రీ,శ, 2 వ శతాబ్దానికి చెందినవి గా పురావస్తు శాఖ వారు నిర్దారించారు.

* చారిత్రకత. 

ఇది అత్యంత ప్రాచినమైన శైవక్షేత్రం. ఇక్కడ లభించిన సరస్వతీ దేవి, రతీదేవి విగ్రహాలు క్రీ.పూ. 6000 సంవత్సరాలనాటి హరప్పా ,మొహంజొదారో శిల్పకళ కు చెందినవి గా చరిత్ర పరిశోధకులు గుర్తించారు.

క్రీ.శ.1 వ శతాబ్దం లో ఘంటశాల ను “కంటకశైల “గా ఫ్రెంచి చరిత్రకారుడు డూబ్రెయిల్ తన డక్కను పూర్వచరిత్ర లో పేర్కొన్నాడు.టోలమీ మొదలగు చరిత్రకారులు ఈ రేవు పట్టణాన్ని సందర్శించారు. చోళుల కాలం లో చోళపట్టణం గా, పాండ్యులకాలం లో పాండ్యపురంగా తరువాత ఘంటశాల గా పిలువబడుతోంది. రోమనుల కాలం నాటికే ఈ పట్టణం ప్రసిద్ద ఓడరేవు గా ఉన్నట్లు చారిత్రకాధారాలున్నాయి.

సుమారు ఏడు శాసనాలు ధేవాలయ ఉత్తర గోడమిద, బావి త్రవ్వేటప్పుడు బయటపడ్డాయి.ఇవన్నీ దాన శాసనాలే

* రవాణాసౌకర్యాలు.

విజయవాడ,గుడివాడ,మచిలీపట్నం, రేపల్లె ల నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. బారసాల,అక్షరాభ్యాసం,గ్రహశాంతులు, జరిపించుకోవడానికి వచ్చే దూర ప్రాంత భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కలదు.స్వంతవాహనం ఉన్నట్లయితే విజయవాడ నుండి కఱకట్ట మీదుగా 52 కి.మీ లో శ్రీకాకుళం,కొడాలి మీదుగా ఘంటశాల కు చేరుకోవచ్చు.

Monday, 15 September 2014

GODDESS VARAHI AMMAVARI TEMPLE, BHUTAN


వారాహి అమ్మవారి దేవాలయం, భూటాన్

మన హైందవంలో శక్తిని ఆరాధించేవారు, శైవులు(శివుడిని ఆరాధించేవారు), 

వైష్టవులు(విష్ణువును ఆరాధించేవారు) అందరు కూడా వారాహి అమ్మవారిని ఆరాధించేవారట.

వారాహి దేవతను ఎక్కువగా వామమార్గ తాంత్రిక సాధన చేసే వారు ఆరాధిస్తారట.. 

అందుకే మన జనబాహుళ్యానికి ఎక్కువగా తెలియదు.

గాలిలో తేలియాడుతున్నట్లుగా ఉండే అమ్మవారు భూటాను లోని Chumphu nye in Paro అనే ప్రాంతంలో (భూటాన్ లోని ఒక ముఖ్య పట్టణం ‘థింపు ’ నుండి ఒక రోజు ప్రయాణం...) అమ్మ వారు ఒక పర్వత శిఖరాగ్రమున కొలువై ఉన్నారు.. ఇక్కడి విగ్రహం భూమిపై ఆధారంగా నిలబడి ఉండదు.. అమ్మవారి విగ్రహం క్రింది భాగం గుండా పేపర్ ను చాలా సులభంగా ఇటునుండి అటుకు తీసుకు వెళ్ళి ఆ విగ్రహం గాలిలో నిలబడి ఉన్నట్లుగా మనకు అక్కడి పూజారులు చూపిస్తారు... చాలా అద్భుతంగా ఉంటుందట... ఈ గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని ఫోటోలు తీయడానికి అనుమతించరు.. అందుకే ఎక్కడా ఈ చిత్రాలు మనకు కనపడవు... ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిత్రం కొంతమంది భక్తులతో వేయ బడిన పెయింటింగ్.

అమ్మవారి వివరములు పూర్తిగా తెలియరాలేదు..
జై మాతాజీ!!!

VISIT THE BELOW LINK FOR MOTE INFORMATION