ప్రశ్న: మన శరీరానికి చక్కెర ఎందుకు అవసరం?
జవాబు : మనం తీసుకున్న ఆహారాన్ని మన శరీరం గ్లూకోజ్ అనే శక్తిరూపంగా మారుస్తుంది. దీనికే బ్లడ్ షుగర్ అని పేరు. దీనినే మన శరీరం శక్తి కోసం ఉపయో గించుకుంటుంది.
ప్రశ్న : మన శరీరంలో అవసరమైనంత వరకు చక్కెర స్థాయి వుండేటట్లు చూసే వ్యవస్థ ఏది?
జవాబు : మన జీర్ణాశయానికి దగ్గరగా క్లోమగ్రంధి వుంది. ఇది ఇన్సులిన్‌ను తయారు చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఆహారం ద్వారా వచ్చే చక్కెరను శరీర కణాలకు చేర వేస్తుంది. ఆ కణాలు చక్కెరను ఉపయో గించుకుని శక్తిని విడుదల చేస్తాయి.
ప్రశ్న : మధుమేహం లేదా చక్కెర వ్యాధి అంటే ఏమిటి?
జవాబు : మన శరీరంలో తయారయ్యే ఇన్సులిన్ బాగా పనిచెయ్యకపోయినా, లేక తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోయినా మన శరీరంలో చక్కెర ఎక్కువగా పేరుకు పోతుంది. ఇది మన శరీరానికి నష్టం కలిగి స్తుంది. ఈ స్థితినే 'మధుమేహం' అని అంటారు. దీనినే వైద్య రంగ పరిభాషలో 'డయాబెటిస్ మెల్లిటన్'గా వ్యవహరిస్తారు.
ప్రశ్న : సాధారణంగా ఒక వ్యక్తి రక్తంలో చక్కెరస్థాయి ఎంత పరిమాణంలో వుండాలి?
జవాబు: ఎడిఎ వారు 2000 సంవత్సరంలో 'మధుమేహం'కు సంబంధించి సూచించిన వివరాలు:1) ఆహారం తీసుకోకుండా ఉన్న ప్పుడు రక్తంలో వుండవలసిన చక్కెర : ద100 మి.గ్రా/డిఎల్
2) హెచ్.పి.జి (ఆహారం తీసుకున్న తరువాత) : ద140 మి.గ్రా/డిఎల్
న 75 గ్రాముల గ్లూకోజ్ పౌడర్‌ను నీటిలో కలిపి తాగిన రెండు గంటల తర్వాత ఈ పరీక్ష చేయవలసి వుంటుంది.
ప్రశ్న:మధుమేహం రావడానికి గల కారణాలేమిటి?
జవాబు : వంశపారంపర్య లక్షణాలు. రోగ నిరోధక వ్యవస్థ అస్థవ్యవస్థమై తనకు తానే కణాలను నాశనం చేయడం, క్లోమగ్రంధి చెడిపోవడం లేదా వ్యాధిసోకడం. మారు తున్న జీవన విధానం. పోషకాహార లోపం కారణంగా బరువు పెరగటం లేదా తగ్గడం. మానసిక ఒత్తిడి.
ప్రశ్న : మధుమేహ రోగలక్షణాలేమిటి?
జవాబు: a) చాలా తరచుగా 1) మూత్రం పోయాల్సిరావడం 2) దాహం వేయడం 3) ఆకలి వేయడం. b) బరువు తగ్గడం ష) బల హీనత/ అలసట స) చర్మము మరియు జన నేంద్రియాలపై దురద వ) గాయాలు, పుండ్లు మానడానికి చాలా కాలం పట్టడం ట) అస్పష్ట మైన కంటిచూపు.
పైన పేర్కొన్నట్లుగా 'ఎ'లోనివి మొదటి రకం మధుమేహ లక్షణాలు. 'బి' నుండి 'ఎఫ్' వరకు చెప్పినవి రెండవ రకం మధుమేహ లక్షణాలు. ఇవి పైకి స్పష్టంగా కనబడక పోవచ్చు. కాబట్టి - రక్తంలో చక్కెర స్థాయి పరీక్షలను తరచుగా చేయించుకోవాలి.
ప్రశ్న: మధుమేహాన్ని ఎందుకు అదుపు చెయ్యాలి?
జవాబు: రక్తంలో అధిక చక్కెర శాతం అనేక సంవత్సరాలుగా వుంటే - నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటాయి.
ఈ వ్యవస్థలు దెబ్బతింటే వచ్చే సమస్యలు:
ఎ) గుండె మరియు రక్త ప్రసరణలో సమ స్యలు ఏర్పడటం.
బి) మూత్ర పిండాలు సరిగా పనిచేయక పోవడం.
సి) పాదాలు స్పర్శజ్ఞానం కోల్పోవడం.
డి) కంటి చూపు మందగించడం.
ప్రశ్న : మధుమేహం పూర్తిగా తగ్గిపోతుందా?
జవాబు: తగ్గదు, మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి.దీనిని అదుపుచెయ్యడం ద్వారా ఆరోగ్య పరిస్థితిని కాపాడుకోవచ్చు. మధుమేహాన్ని నివారించలేం. నియంత్రించగలం అంతే!
ప్రశ్న : మరి అటువంటప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఏం చెయ్యాలి?
జవాబు : మీరు ముందుగా మధుమేహం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలి. మధుమేహంతో ఎలా జీవించాలో నేర్చుకోవాలి. అప్పుడు మీరు ఎన్నుకున్న జీవితాన్ని హాయిగా ఆనందించవచ్చు.
ప్రశ్న : మధుమేహానికి చికిత్స ఏమిటి?
జవాబు : మొదటి రకం మధుమేహానికి - ఇన్సులిన్ అవసరం. చక్కని పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయా మం చేయడం అవసరం. దీని వల్ల రక్తంలో సాధారణ చక్కెర స్థాయి వుండేటట్లుగా చూసు కోవచ్చు. తద్వారా దీర్ఘకాలిక సమస్యలను అదుపు చెయ్యవచ్చు.
రెండవ రకం మధుమేహానికి చక్కని పోష కాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో బాటు, డాక్టరు సలహా ప్రకారం మందులు, అవసరం మేరకు ఇన్సులిన్ వాడవలసి వుంటుంది.
ప్రశ్న : మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పదా ర్థాలు తినాలి? ఏఏ పదార్థాలు తినకూడదు?
జవాబు : మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్ని రకాల పదార్థాలు తీసుకోవచ్చు. ఆరోగ్యా న్నిచ్చే సమతులాహారం తీసుకుంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. అందువల్ల - మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో అన్ని రకాల పదార్థాలు వుండేలా చూసుకోవాలి. చక్కెర మరియు ఇతర తీసి పదార్థాలు మాత్రమే రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తాయని భావించరాదు. పిండి పదార్థాలను కలిగివుండే పండ్లు, కూర గాయలు, చిక్కుళ్ళు, పాలు, ధాన్యాలు కూడా చక్కెరస్థాయిని అధికంచేస్తాయి. ఈ పదార్థాలను ఒకేసారి కాకుండా,రోజుమొత్తానికి సమంగా విభ జించుకుని, తగిన పరిమాణంలో తీసుకోవాలి.