WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday, 14 January 2014

HEALTHY ADVANTAGES OF EATING REGI PANDU - REGI FRUIT


రేగుపండులో సుగుణాలు

రేగు పండులో విటమిన్ డి, ఎ, కె పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రేగు పండు మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 వేల రకాల రేగు పండ్లు లభిస్తున్నాయి. ఎండిన రేగు పండులో కాపర్, బోరాన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు మూలకాలు ఆస్టియోపొరోసిస్ నివారణలో ప్రధానపాత్ర వహిస్తాయి. రేగు పండు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే మినరల్స్ బీపిని అదుపులో ఉంచడంలో తోడ్పడుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం పదిలమవుతుంది. మంచి యాంటిఆక్సిడెంట్ కూడా కావడం వల్ల క్యాన్సర్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. రేగు పండులో బీ కాంప్లెక్స్‌లోని నియాసిన్, విటమిన్ బి6, ఫినోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కార్బోహైవూడేట్లు, ప్రొటీన్లు, కొవ్వుపదార్థాల జీర్ణక్షికియకు తోడ్పడుతాయి. 

గుండె ఆరోగ్యానికి - రేగు పండులో ఉండే విటమిన్ కె రక్తం చిక్కబడకుండా నిరోధిస్తుంది. అందువల్ల బీపి అదుపులో ఉండటం మాత్రమే కాదు గుండె కొట్టుకునే విధానం కూడా స్థిరంగా ఉంటుంది. రేగు పండులోని సాలిబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి తోడ్పడుతుంది. ఈ పండులోని అధిక పొటాషియం శరీర బరువును కూడా నియంవూతిస్తుంది.

కాన్సర్ ను నిరోధిస్తుంది - రేగు పండులోని బీటా కెరోటిన్ చాలా రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

కంటి ఆరోగ్యానికి - ఆరోగ్యవంతమైన కళ్లకి విటమిన్ ఎ ఎంతో అవసరం. రేగుపండులో విటమిన్ ఎ తో పాటు జియాక్సిథిన్ అనే ఒక ఫైబర్ కూడా రెటినా ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది, ఇది హానికరమైన యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది.

మలబద్దకానికి - ఎండిన రేగు పండును ప్రూనే అంటారు. జీర్ణక్షికియకు తోడ్పడే ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో ఉండే సార్బిటాల్, ఇసాటిన్ జీర్ణవ్యవస్థ పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణక్షికియ సామర్థ్యం పెరిగి కడుపులో కదలికలు సరైనరీతిలో జరిగి మలబద్దక సమస్యకు మంచి పరిష్కారం రేగు పండు.

నిరోధక శక్తి పెంపొందించడానికి- రేగుపండు ద్వారా విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ సి వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్రపోషిస్తుంది. నిరోధక వ్యవస్థ బలోపేతంగా ఉంటే తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

వృద్ధాప్యం వాయిదా -రేగు పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలిఫినాలిక్ యాంటిఆక్సిడెంట్, లూటిన్, క్రిప్టోక్సాథిన్, జియాక్సిథిన్ వంటి యాంటి ఆక్సిడెంట్లు శరీరంలో ప్రతినిత్యం జరిగే ఏజింగ్ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. ఫలితంగా వృద్ధాప్యాన్ని వాయిదా వేయడానికి వీలుంటుంది.

No comments:

Post a Comment