సంక్రాంతికి శాస్త్రపరంగా ప్రత్యేకత ఉంది.
నక్షత్రాలు ఇరవై ఏడు. మళ్లీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి సంక్రాంతిగా వ్యవహరించబడుతుంది.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు ప్రాణాధారమైనవాడు. సూర్యకాంతితో చంద్రుడు ప్రకాశిస్తాడు. ఒకరు శక్తి మరొకరు పదార్థము. మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుడు కర్కాటక రాశ్యాధిపతి. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో కర్కాట సంక్రమణంలో ప్రవేశిస్తాడు. అది దక్షిణాయనం. ఇంద్రుడు తూర్పు దిక్కునకు అధిపతి. వరుణుడు పడమరకు అధిపతి. వీరిద్దరి వాహనాలు ఐరావతము, మకరము.
సూర్యుడు ధనుర్రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించేవరకు దేవతలకు పగలుగా ఉంటుంది. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించింది మొదలు ధనురాశిలో ప్రవేశించేవరకు దేవతలకు రాత్రి. ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది.
కనుకనే దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందమని పండితులు చెబుతున్నారు. మకర సంక్రాంతి.. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటాడు. రవి ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు.
సంక్రాంతి, ఆధ్యాత్మికం, భోగి, కనుమ, ముక్కనుమ
No comments:
Post a Comment