WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Drinking Water Health Tips. Show all posts
Showing posts with label Drinking Water Health Tips. Show all posts

Sunday, 7 September 2014

MORNING DRINKING WATER TIPS IN TELUGU


పగటిపూట నీరు ఎలా తాగాలి?

మనం ఉదయం పూట తాగిన నీరు 10, 11 గంటల వరకు శరీర అవసరాలను తీర్చడానికి సరిపోయింది. ఆ సమయం నుంచి శరీరానికి నీటి అవసరం మళ్లీ ఉంటుంది. పగటి పూట అంటే, ఉదయం టిఫిన్‌ తిన్న తర్వాత నుంచి సాయంకాలం వెలుతురున్న వరకు తాగే నీటి విషయం. ఈ సమయంలో తాగిన నీరు శరీరాన్ని శుభ్రపర్చడానికి పనికిరాదు కానీ, శరీరాన్ని ఎండ నుంచి కాపాడుకోవటానికి, పని చేసినపుడు కండరాల్లో పుట్టే వేడిని చల్లార్చడానికి, జీర్ణాది రసాల ఉత్పత్తికి సహకరిస్తుంది.

పగటిపూట మనం రెండున్నర లీటర్ల నీరు తాగితే మంచిది. ఈ నీటిని ఎప్పుడు పడితే అప్పుడు, తినేటప్పుడు కాకుండా ఒక పద్ధతి ప్రకారం తాగితే సవ్యంగా ఉపయోగపడతాయి.

మూడవ దఫా నీరు : రెండవ దఫా నీటిని తాగిన తర్వాత 25, 30 నిముషాలు గ్యాప్‌ ఇచ్చి మీరు ఏదన్నా టిఫిన్‌ తినవచ్చు లేదా తాగవచ్చు. టిఫిన్‌ తినేటపుడు నీటిని తాగవద్దు. టిఫిన్‌ తిన్న రెండు గంటల తర్వాత ఈ మూడవ దఫా నీటిని ఒకేసారి మాత్రం తాగకూడదు. అలా తాగితే బరువుగా, ఆయాసంగా ఉంటుంది. ఈ నీటిని రెండు, మూడు అంచెలుగా తాగితే మంచిది. అంటే అప్పుడొక గ్లాసు, అప్పుడొక గ్లాసు చొప్పున నీటిని తాగాలి. మధ్నాహ్నం భోజనానికి అరగంట ముందు వరకు నీరు తాగి ఆపి వేయాలి. ఇక భోజన సమయంలో మంచినీరు తాగరాదు. మాత్రలు మింగడానికి గానీ, గొంతు బాగా పట్టినపుడు గానీ ఒక గుక్కెడు నీరు తాగవచ్చు.

నాల్గవ దఫా నీరు : మధ్యాహ్నం భోజనం అయిన రెండు గంటల తర్వాత నుంచి 2, 3 అంచెలుగా లీటరు నుంచి లీటరుంపావు వరకు నీటిని తాగవచ్చు ఇలా తాగిన నీరు జీర్ణమైన ఆహారాన్ని పేగులు పీల్చుకోవటానికి సహకరిస్తుంది. 55, 60 సంవత్సరాలు పైబడిన వారు సాయంకాలం 4, 5 గంటలు దాటిన తర్వాత ఇక నీటిని తాగకుండా ఉంటే రాత్రికి మూత్రం సమస్య ఉండదు.

ఉదవ దఫా నీరు : ఇది అందరికీ అవసరం లేదు. ఎవరైతే నాల్గవ దఫాలో నీరు తక్కువ తాగారో వారికి, బాగా ఎండలో చెమటలు పట్టే పనిచేసిన వారికి, యుక్తవయసులో ఉన్న వారికి, ఉదయం రెండవ విరేచనం సాఫీగా అవ్వని వారికి, మూడవ విరేచనం ప్రయత్నిద్దామనే వారికి మంచిది. పైన చెప్పిన వారు మాత్రం ముప్పావు లీటరు నుంచి లీటరు నీటి వరకు సాయంకాలం 6 గంటల సమయంలో తాగి విరేచనం అవ్వాలని ప్రయత్నిస్తే సరిపోతుంది. రాత్రిపూట నీటిని తాగనవసరం లేదు. ఎవరికన్నా రాత్రి 9. 10 గంటలకు దాహం అనిపిస్తే అరగ్లాసు లేదా గ్లాసు నీరు తాగి పడుకోవచ్చు.

తినేటపుడు నీరు తాగితే నష్టమేమిటి?

కొంతమంది నీరు తాగి వెంటనే తినడం మొదలు పెడతారు. మరికొందరు తినేటపుడు తాగితే, ఇంకొందరు తిన్నాక తాగుతారు. ఇలా నీటిని తాగటం జీర్ణక్రియకు ఇబ్బందిని కలిగించడమే. మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి పొట్టలో హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ ఊరుతుంది. ఆ యాసిడ్‌ మన ఆహారంతో డైరెక్టుగా కలిస్తే ఆహారం త్వరగా అరిగి పిండిపిండిగా విడగొట్టబడుతుంది. ఇలా జరగకుండా, మనం తినేటపుడు తాగిన నీరు పొట్టలోనికి వెళ్లి, లోపల ఊరిన హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని పలుచగా (యాసిడ్‌కి నీరు కలిపితే గాఢత లేదా పవర్‌ తగ్గిపోతుంది.) చేసేస్తుంది. దాంతో జీర్ణక్రియకు మామూలు కంటే రెట్టింపు సమయం పడుతుంది. తినేటపుడు నీరు తాగటం వల్ల వచ్చే నష్టాలు చూస్తే, భుక్తాయాసం రావటం, కడుపులో మంటలు రావటం, అజీర్ణం కలగటం, ఆహారం ఎక్కువ సేపు నిలువ ఉండి పులవడం, గ్యాసు తయారవడం, త్రేన్పులు ఎక్కువగా రావడం, పొట్ట సాగిపోవడం మొదలగునవి అన్నీ వస్తూ ఉంటాయి. తినేటపుడు నీటిని తాగడం అసహజం. పండ్లు, పచ్చి కూరలు తిన్నపుడు మీరు బాగా నమిలి తింటున్నారు కాబట్టి గొంతు పట్టడం గానీ, ఎక్కిళ్లు గానీ రావు. ఆహారాన్ని మెత్తగా పిండిపిండిగా నమిలి, మెల్లగా తింటూ ఉంటే తినేటపుడు నీటి అవసరం రాదు. కొత్తలో వారం, పది రోజులు కొంచెం ఇబ్బందిగా ఉన్నా మెల్లగా అలవాటు అయి, మీకు తిన్నాక ఎంతో హాయి అనిపిస్తుంది. బద్దలు, నీళ్లు కలిపి పోసి రోటిలో రుబ్బితే పిండి నలగదు కాబట్టే ముందు బద్దలను రుబ్బి ఆ తర్వాత నీరు కలుపుకోవడం మన అలవాటు. అలాగే ఇక నుంచి మీ పొట్టలో కూడా అలాగే రుబ్బుకోవడానికి ప్రయత్నించండి.

పేగులను ఎవరెవరు క్లీన్‌ చేసుకోవాలి?

పేగులను క్లీన్‌ చేయడానికి కొందరు మాత్రలు వాడితే, కొందరు ఆముదం, ఇంకొందరు ఉప్పు నీళ్లు తాగడం ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఆ మార్గాలన్నీ పేగులను కొంత శుభ్రం చే సినప్పటికీ శరీరానికి 1, 2 రోజుల్లోనే కొంత నీరసాన్ని కూడా కలిగిస్తుంటాయి. ఆ మార్గాలు పేగులలో ఉన్న మలాన్ని పూర్తిగా శుభ్రం చేయలేవు. మనిషి ఏదో ఒక సమయంలో తను వాడుకునే అన్ని వస్తువులను, వాహనాలను పూర్తిగా శుభ్రం చేస్తూ ఉంటాడు. చివరకు 10, 12 సంవత్సరాల కొకసారైనా సెప్టిక్‌ ట్యాంకు కూడా పూర్తిగా శుభ్రం చేస్తారు. దానికున్న అదృష్టం కూడా మన పేగులకు ఈ రోజుకీ లేదు. దానినిండా తట్టెడు పేరుకున్నా మనకు పట్టడం లేదు. మలం పేగు ఆరోగ్యాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. దానిని బట్టే మనలో రోగనిరోధకశక్తి ఉంటుంది. పేగులను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ముందు వాటిలో ఉన్న చెత్తను పూర్తిగా క్లీన్‌ చేసి ఆ తర్వాత రోజూ సాఫీగా 2, 3 సార్లు విరేచనం అయితే ఇక ఎప్పటికీ వాటి ఆరోగ్యం చెడిపోదు. ఏ లక్షణాలు ఉన్న వారు క్లీన్‌ చేసుకోవాలో ఆలోచిద్దాం. నీళ్లు తాగి మనసు పెట్టి ప్రయత్నించినా విరేచనం కానివారు, ఒకవేళ అయినా ఎక్కువ సమయం పడుతున్నవారు, ఎక్కువ కాలం నుంచి బాగా మలబద్దకం ఉన్న వారు, విరేచనం బాగా పెంటికలుగా వచ్చేవారు, పేగుల్లో బంక బాగా ఉన్నవారు, ఎమీబియాసిస్‌, నులిపురుగులు, నలుగు పాములున్నవారు, గ్యాస్‌ట్రబుల్‌ బాగా ఎక్కువగా ఉన్న వారు, ఆకలి అసలు వేయని వారు, కడుపునొప్పి తరచుగా వచ్చేవారు, మలం బాగా దుర్వాసన ఉన్నవారు ముందుగా పేగులను శుభ్రం చేసుకుంటూ దానికి తోడుగా ఆహార నియమాలను, నీటి నియమాలను పాటించడం మంచిది. 

DRINKING WATER AT THE CORRECT TIME MAXIMIZES ITS EFFECTIVENESS ON THE HUMAN BODY - DRINKING WATER TIPS


నీళ్లే కదా అని నిర్లక్ష్యం చేయకండి....!
నీళ్లు బాగా తాగు అని అమ్మ చెబితే విసుక్కుంటుంటాం. కానీ నీరు శరీరానికి దివ్యౌషధమని తెలుసా? శరీరంలో నీటి శాతాన్ని బట్టి శరీరారోగ్యం ఆధారపడి ఉంటుంది. అనారోగ్యం దరి చేరదు..!
మన శరీరంలో 75 శాతం, మెదడులో 85 శాతం నీరుంటుంది. ఆహారం కన్నా కూడా నీటి ద్వారా శరీరానికి అందే పోషకాలు ఎక్కువ. ఇవి శరీరాన్ని ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే నీరు ఎంత ఎక్కువ తాగితే అంతమంచిది. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలన్నా, శరీర భాగాలు సరిగా పనిచేయాలన్నా నీరు ఎంతో అవసరం.
* నీరు ఆహారాన్ని అరిగేట్టు చేస్తుంది. తిన్న తిండిలోని పోషకాలను అందేలా చేస్తుంది. అంతేకాదు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త కణాలకు కావాల్సిన ఆక్సిజన్‌, ఇతర పోషకాలను అందజేయడంలో ఎంతో సహకరిస్తుంది. శరీరంలోని రకరకాల మలినాలను బయటకు పంపిస్తుంది. ఇవేకాదు జాయింట్స్‌ కదలికలను కూడా మెరుగుపరుస్తుంది. టిష్యూలను పరిరక్షిస్తుంది. అన్నింటికన్నా మెటబాలిజ ం సరిగా పనిచేయడంలో తోడ్పడుతుంది. నీరు తరచూ తాగుతుండడం వల్ల శరీరాన్ని డీ-హైడ్రేషన్‌ నుంచి రక్షించవచ్చు.
* రోజుకు ఒకటిన్నర లీటరు నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి. మనిషి ఫిజికల్‌ యాక్టివిటీకి అనుగుణంగా నీరు తాగాలి. బాగా యాక్టివ్‌గా ఉండేవాళ్లు నీటిని ఎక్కువ తాగాలి. రోజూ నీరు బాగా తాగుతున్నారా లేదా అనే విషయాన్ని మూత్రం రంగును చూసి చెప్పొచ్చు. మూత్రం పసుపుపచ్చగా వస్తుంటే మీరు నీటిని తక్కువ తీసుకుంటున్నారని అర్థం.
నీటి శాతాన్ని పెంచాలి.. ..!
* నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగాలి. ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత, అలాగే నిద్రపోయే ముందర నీటిని బాగా తాగాలి.
- నడకలాంటి వ్యాయామాలు చేసేముందర కూడా నీళ్లు తాగాలి.
- పనిచేస్తున్న సమయంలో మధ్యమధ్యలో నీళ్లు తాగుతుండాలి.
- అన్నం తినేముందర నీటిని తాగాలి.
- బయటకెళ్లినప్పుడు దారిలో కూడా కొద్ది కొద్దిగా మంచినీళ్లు తాగుతుండాలి.
- కాఫీ, టీలకు బదులు మంచినీళ్లు తాగడం మంచిది.
- మంచినీళ్లు నోటికి రుచిగా లేవనిపిస్తే నిమ్మకాయనీళ్లు తాగండి. ఇది శరీరానికి ఎనర్జీ నిస్తుంది.