WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Winter Season Legs Care Tips. Show all posts
Showing posts with label Winter Season Legs Care Tips. Show all posts

Wednesday, 16 December 2015

HOW TO MAINTAIN AND TO TAKE CARE OF YOUR LEGS - HEALTHY TIPS FOR LEGS CARE


మనిషి బరువును మోసేవి పాదాలు.. నడకకు ఉపయోగించేవి పాదాలే... 

మనిషి నిలబడటానికి ఆధారం, ఆసరా పాదాలే. ఎక్కువసేపు నిలబడి పనులు చేసినా, వేగంగా ఎక్కువ దూరం నడిచినా పాదాలకు అలసటకలిగి, నొప్పి ఏర్పడుతుంది. తడిలో తడిసినా, మట్టినేలలో ఎక్కువ సమయం తిరిగినా పాదాలు పగలడం, వేళ్ళ మధ్య పాసినట్లయి బాధ కలగటం, ఒక్కోసారి కొత్త పాదరక్షలు ధరించినప్పుడు కూడా అవి కరిచి, పుండుపడి పాదాలకు నొప్పి కలుగుతుంది. పాదాలు అలిసినా, బాధ కలిగినా, పాదాలు పగిలినా కూడా నడవడం కష్టంగా అనిపిస్తుంది. అందువల్ల పాదాల ఆరోగ్యానికీ, దృఢత్వానికీ పాదాలనొప్పికి ఉపశమనంగానూ కొన్ని చర్యలు చేపట్టాలి.

శ్రీ అలసట పొందిన పాదాలకు కొంత సమయం విశ్రాంతినివ్వాలి.

శ్రీ శరీర బరువును మోసే పాదాలకు కష్టం కలిగించకుండా బరువును నియంత్రించడం అవసరం.
శ్రీ విశ్రాంతిగా ఉన్నప్పుడు పాదాల అడుగు భాగాన, పాదంమీద, వేళ్ళమధ్య భాగాన కొబ్బరినూనెనుకానీ, నువ్వులనూనెనుకానీ పూయాలి. కాలివేళ్ళను ఆముదంతో మసాజ్‌ చేయడం కూడా మంచిదే.
శ్రీ పాదాల వేళ్ళగోళ్ళు పొడుగ్గా పెరగకుండా కత్తిరించాలి. పొడుగ్గా ఉన్న గోళ్ళు రాళ్ళకు తగిలి, గోరువిరిగి బాధించవచ్చు. పొడుగ్గా ఉన్న గోరు తోటివారి చర్మాన్ని గాయపరచవచ్చు. మనకు తెలియకుండానే లేదా మన కాలి చర్మానికి తగిలి, చర్మం చీరుకుపోవచ్చు.

శ్రీ కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలను సైకిల్‌ తొక్కుతున్నట్లుగా కదిలిస్తూంటే పాదాలకు ఎక్సర్‌సైజు లభించి, పాదాలు దృఢంగా తయారవుతాయి.

శ్రీ రోజుకు 5,6 నిముషాలు కాలివేళ్ళ మీద నడవటం కూడా మంచిది. పాదాల ఆరోగ్యానికీ, దృఢత్వానికీ చేసే పద్ధతులన్నీ పాదాలకు అలసట కలగనివ్వవు.

శ్రీ పచ్చని మెత్తని గడ్డిమీద ప్రతిరోజూ పదిహేను, ఇరవై నిమిషాలు చెప్పులు ధరించకుండా నడిస్తే పాదాలకు రక్తప్రసరణ బాగా జరిగి పాదాల అలసట తొలగిపోతుంది.

శ్రీ ఒక టబ్బులో వేడినీటిని పోసి అందులో ఉప్పును, నిమ్మరసాన్ని, షాంపూను కలిపి, ఆ నీటిలో పాదాలను ఆ నీటి వేడి తగ్గేంతవరకూ ఉంచాలి. ఆ తర్వాత పాదాలను శుభ్రపరచే ఫ్యూమిక్‌స్టోన్‌తో పాదాల ప్రక్కన, పాదాలమీద మృదువుగా రుద్దాలి. పాదాల పగుళ్ళల్లో ఉన్న మట్టిని, గోళ్ళల్లోని మట్టిని తొలగిస్తుంది. పాదాల చర్మం మెత్తబడి మృదువుగా, శుభ్రంగానూ ఉంటుంది. పాదాల అలసట చక్కగా తీరిపోతుంది.

శ్రీ వానాకాలంలో బయటికి వెళ్ళినప్పుడు, ఇంటికిరాగానే, గోరువెచ్చని నీటితో పాదాలను కడుక్కుని, పాదాలను, వేళ్ళ మధ్య తడిలేకుండా తుడిస్తే పాదాలు శుభ్రపడటమేకాకుండా, పాదాలకు అలసట అనిపించదు.
శ్రీ పాదాలలో రక్త ప్రసరణ చక్కగా జరగటానికి, చురుకుగా నడవటానికి ఆరోగ్యం సరిగ్గా ఉండటానికి, పాదాలు అలసిపోకుండా దృఢంగా ఉండటానికీ, పాదాలపట్ల కూడా తగిన శ్రద్ధ, శుభ్రత, పోషణ ఉండటం ఎంతో అవసరం.

Wednesday, 19 November 2014

LEGS CARING TIPS IN WINTER SEASON IN TELUGU


శీతాకాలంలో పాదాలు ఎక్కువగా పగులుతాయి. పాదాల పగుళ్ళు సాదారణంగా పొడి చర్మము ఉన్న వాళ్ళకి, మధుమేహ వ్యాధి గల వారికి ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు..కారణాలు తెలుసుకొందాం..

కారణాలు:

1. శరీరములో అధిక వేడి, పొడి చర్మం, ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి సాదారణంగా వస్తుంటాయి. 
కఠిన నేలపై నడవడం కూడా ఒక కారణమే. ఎత్తైన చెప్పులు ధరించి నడవడంతో పాదల వద్ద రక్తప్రసరణ సరిగా జరగదు. అలాగే అధిక బరువు కలిగిఉండడం, పోషకాహార లోపము పాదాల పగుళ్ళకు కారణమౌతున్నాయి...అలాంటి వారు కొన్ని నివారణోపాయాలు పాటిస్తే పాదాల సౌందర్యం మీసొంతం అవుతుంది.

నివారణోపాయాలు:

1. ఇంటిపని, వంటపని చేస్తున్నప్పుడు మెత్తని స్పాంజ్ తో తయారు చేసిన స్లిప్పర్స్‌ వాడాలి.
2. రోజూ నిద్రించటానికి ముందు కాళ్ళను శుభ్రపరుచుకుని తుడుచుకోవాలి.
3. పగుళ్ళపై కొబ్బరి నునేతో మృదువుగా మర్దన చేసి మందంగా ఉండే సాక్సులు ధరించాలి.
4. వారానికి ఒక్కసారి శుభ్రంగా పాదాలను సబ్బుతో కడగాలి. ఒక చెంచా క్యుటికల్ క్రిము లేదు రెండు చెంచాలా ఆలివ్‌ఆయిల్, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కుల గ్లిజరిన్ బాగా కలిపి చేతులకు పాదాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో హెర్బల్ షాంపు వేసి 15 నిమిషాల పాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా పాదాలమీద వున్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది.
5. ప్రతిరోజూ ఉదయం పాత బ్రష్ తో రుద్ది గోరువెచ్చని నీటిలో కడిగితే మురికి, మ్రుతకనలు పోయి నున్నగా తయారవుతాయి.
6. అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్ళ పై రాసి పదినిముషాలు వుంచి తరువాత నీటితో శుభ్రపరచుకుంటే పాదాలు మెట్టబడతాయి.
7.గోరువెచ్చని నీటిలో కొంచెము నిమ్మరసం వేసి అందులో పాదాలను వుంచి పది నిముషాలు తరువాత మామూలు నీటితో శుభ్రపరచుకుంటే పగుళ్ళ నొప్పి తగ్గుతుంది.
8. ప్రతి రోజు సాయంత్రం రోజ్ వాటర్ ను పళ్ళెం లో వేసి పది నిముషాలు పాదాలు ముంచి ఉంచితే మృదువుగా తయారవుతాయి.
9. నిమ్మరసం వ్యాజ్ లైన్ వేసిన గోరువేచ్చని సబ్బుద్రావనం లో పాదాలను పెట్టి 10 నిముషాలు అయ్యాక పొడి వస్త్రంతో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్ రాయాలి .
10. రోజూరాత్రిపూట హేండ్‌ క్రీమ్ కొద్దిగా నిమ్మరసంతో కలిపి పాదాలకు రాసుకుంటే మృదువుగా నునుపుగా ఉంటాయి. కాలిమడమలో తీవ్రమైన పగుళ్ళు ఉంటే నైట్ పెట్రోలియం జెల్లీ రాసుకుని పాదాలకు సాక్సుధరించి నిద్రించడం మంచిది.

Wednesday, 11 December 2013

HOW TO MAINTAIN YOUR BEAUTIFUL LEGS SHINE AND HEALTHY - WINTER SEASON BEAUTY TIPS


వారానికి ఒక్కసారి శుభ్రంగా పాదాలను సబ్బుతో కడగాలి. ఒక చెంచా క్యూటికల్‌ క్రీము లేదా రెండుచెంచాల ఆలివ్‌ఆయిల్‌, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కల గ్లిజరిస్‌ బాగా కలిపి చేతులకు పాదాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో హెర్బల్‌ షాంపు వేసి 15 నిమిషాల పాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా పాదాల మీద వున్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది.
పాదాలను నీళ్ళలోనే ఉంచి ప్యూమిక్‌స్టోన్‌తో పాదాల మీద మడమల మీద పగుళ్ళను మూడు- నాలుగు నిమిషాల పాటు రుద్దండి. దీనివలన పాదాలపై పేరుకున్న మట్టి వచ్చేస్తుంది. మంచినీళ్ళతో పాదాలను సబ్బుతో కడిగిన తర్వాత మరోసారి బాగా రుద్దుతూ కడగాలి.
రోజూ రాత్రిపూట హేండ్‌క్రీమ్‌ కొద్దిగా నిమ్మరసంతో కలిపి పాదాలకు రాసుకుంటే మృదువుగా నునుపుగా ఉంటాయి. కాలిమడమలో తీవ్రమైన పగుళ్ళు ఉంటే నైట్‌ పెట్రోలియం జెల్లీ రాసుకుని పాదాలకు సాక్సు ధరించి నిద్రించడం మంచిది. కాలివేళ్ళగోళ్ళు వీలయినంతగా కత్తిరించడం మంచిది