మనిషి బరువును మోసేవి పాదాలు.. నడకకు ఉపయోగించేవి పాదాలే...
మనిషి నిలబడటానికి ఆధారం, ఆసరా పాదాలే. ఎక్కువసేపు నిలబడి పనులు చేసినా, వేగంగా ఎక్కువ దూరం నడిచినా పాదాలకు అలసటకలిగి, నొప్పి ఏర్పడుతుంది. తడిలో తడిసినా, మట్టినేలలో ఎక్కువ సమయం తిరిగినా పాదాలు పగలడం, వేళ్ళ మధ్య పాసినట్లయి బాధ కలగటం, ఒక్కోసారి కొత్త పాదరక్షలు ధరించినప్పుడు కూడా అవి కరిచి, పుండుపడి పాదాలకు నొప్పి కలుగుతుంది. పాదాలు అలిసినా, బాధ కలిగినా, పాదాలు పగిలినా కూడా నడవడం కష్టంగా అనిపిస్తుంది. అందువల్ల పాదాల ఆరోగ్యానికీ, దృఢత్వానికీ పాదాలనొప్పికి ఉపశమనంగానూ కొన్ని చర్యలు చేపట్టాలి.
శ్రీ అలసట పొందిన పాదాలకు కొంత సమయం విశ్రాంతినివ్వాలి.
శ్రీ శరీర బరువును మోసే పాదాలకు కష్టం కలిగించకుండా బరువును నియంత్రించడం అవసరం.
శ్రీ విశ్రాంతిగా ఉన్నప్పుడు పాదాల అడుగు భాగాన, పాదంమీద, వేళ్ళమధ్య భాగాన కొబ్బరినూనెనుకానీ, నువ్వులనూనెనుకానీ పూయాలి. కాలివేళ్ళను ఆముదంతో మసాజ్ చేయడం కూడా మంచిదే.
శ్రీ పాదాల వేళ్ళగోళ్ళు పొడుగ్గా పెరగకుండా కత్తిరించాలి. పొడుగ్గా ఉన్న గోళ్ళు రాళ్ళకు తగిలి, గోరువిరిగి బాధించవచ్చు. పొడుగ్గా ఉన్న గోరు తోటివారి చర్మాన్ని గాయపరచవచ్చు. మనకు తెలియకుండానే లేదా మన కాలి చర్మానికి తగిలి, చర్మం చీరుకుపోవచ్చు.
శ్రీ కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలను సైకిల్ తొక్కుతున్నట్లుగా కదిలిస్తూంటే పాదాలకు ఎక్సర్‌సైజు లభించి, పాదాలు దృఢంగా తయారవుతాయి.
శ్రీ రోజుకు 5,6 నిముషాలు కాలివేళ్ళ మీద నడవటం కూడా మంచిది. పాదాల ఆరోగ్యానికీ, దృఢత్వానికీ చేసే పద్ధతులన్నీ పాదాలకు అలసట కలగనివ్వవు.
శ్రీ పచ్చని మెత్తని గడ్డిమీద ప్రతిరోజూ పదిహేను, ఇరవై నిమిషాలు చెప్పులు ధరించకుండా నడిస్తే పాదాలకు రక్తప్రసరణ బాగా జరిగి పాదాల అలసట తొలగిపోతుంది.
శ్రీ ఒక టబ్బులో వేడినీటిని పోసి అందులో ఉప్పును, నిమ్మరసాన్ని, షాంపూను కలిపి, ఆ నీటిలో పాదాలను ఆ నీటి వేడి తగ్గేంతవరకూ ఉంచాలి. ఆ తర్వాత పాదాలను శుభ్రపరచే ఫ్యూమిక్‌స్టోన్‌తో పాదాల ప్రక్కన, పాదాలమీద మృదువుగా రుద్దాలి. పాదాల పగుళ్ళల్లో ఉన్న మట్టిని, గోళ్ళల్లోని మట్టిని తొలగిస్తుంది. పాదాల చర్మం మెత్తబడి మృదువుగా, శుభ్రంగానూ ఉంటుంది. పాదాల అలసట చక్కగా తీరిపోతుంది.
శ్రీ వానాకాలంలో బయటికి వెళ్ళినప్పుడు, ఇంటికిరాగానే, గోరువెచ్చని నీటితో పాదాలను కడుక్కుని, పాదాలను, వేళ్ళ మధ్య తడిలేకుండా తుడిస్తే పాదాలు శుభ్రపడటమేకాకుండా, పాదాలకు అలసట అనిపించదు.
శ్రీ పాదాలలో రక్త ప్రసరణ చక్కగా జరగటానికి, చురుకుగా నడవటానికి ఆరోగ్యం సరిగ్గా ఉండటానికి, పాదాలు అలసిపోకుండా దృఢంగా ఉండటానికీ, పాదాలపట్ల కూడా తగిన శ్రద్ధ, శుభ్రత, పోషణ ఉండటం ఎంతో అవసరం.
No comments:
Post a Comment