WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Indian Yoga Tips. Show all posts
Showing posts with label Indian Yoga Tips. Show all posts

Wednesday, 6 July 2016

YOGA SADHANA - YOGA HEALTH BENEFITS


యోగసాధన
భారతీయ షట్ దర్శనాల్లో యోగ ఒకటి. “యోగ: చిత్తవృత్తి నిరోధ:” అని అన్నారు మహర్షి పతంజలి. అనగా చంచలమైన మనో నడవడికలను, ఆలోచనలను నిరోధించి ఏకాగ్రతను సాధించేదే యోగము.
ఆధ్యాత్మికుల మాటల్లో చెప్పాలంటే ఇది ఆత్మ – పరమాత్మల సంయోగానికి మార్గం. యుజ్ అనే సంస్కృత పదానికి సమ్యోగం అని అర్ధం. ఈ యుజ్ నుంచి యోగ వచ్చింది. బయతి ప్రప్రంచంలోని అసత్య రూపాలతోను, ఆకర్షణలతోను మునిగి ఉన్న అహం కారపూరిత మనస్తత్వం కలిగి ఉన్న మానవ జీవాత్మను సర్వోపగతమైన పరమాత్మ యొక్క అనుగ్రహం పొందగల స్థితికి చేర్చు ప్రయత్నమే యోగాభ్యాసం.
యోగ శాస్త్రాన్ని క్రీస్తుపూర్వం రెండు శతాబ్దాల నాడు మహర్షి పతంజలి క్రమబద్ధం చేసి గ్రంథస్థం చేశారు. అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల నుంచే యోగ భిన్న పద్ధతులలో ఉండవచ్చన్నది చరిత్ర కారుల అభిప్రాయం.
సాంఖ్య దర్శనానికి యోగ కొనసాగింపు.
యోగలో మొత్తం ఎనిమిది దశలున్నాయి. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాథి.ఈ ఆఖరి స్థితొలోనే ఆత్మను పరమాత్మతో సమ్యోగం చేయవచ్చన్నది దార్శనికుల విశ్వాసం.
1. యమ అనగా పది ధర్మములను అబ్య్హసించటం. అవి అహింస, సత్యం, దొంగతనం చేయకుండుత, బ్రహ్మచర్యం, దయ, నీతి, క్షమ, పట్టుదల, మితాహారము తీసుకొనుట మరియు శుభ్రము.
2. నియమమనగా 8 ధర్మములను అబ్యసించటం. అవి త్రుప్తి, వేదములను నమ్మటం, దానము, దైవపూజ, వేదములను పఠించటం, అణకువ, మనియు జపము.
3. ఆసన: అయిదు ముఖ్యమైన కూర్చుండు విధములను పాటించటం. అవి ఏమనగా పద్మాసన, స్వస్తికాసన,భద్రాసన, వజ్రాసన మరియు విరాసన.
4. ప్రాణామాయం అంటే గాలిని లోనికి పీల్చి, కొంత సేపు అట్లాగే ఉంచి తరువాత వదలి వేయుట. గాలిని ముక్కు యొక్క ఎడమ రంధ్రంతో 16 మాత్రల కాలము పీల్థి, 64 మాతల కాలం లోపల ఉంచి తరువాత ముక్కు యొక్క కుడి రంధమునిండి 32 మాత్రల కాలము వదలి పెట్టాలి. ఈ ప్రాణాయామం వీలయినన్నిసార్లు ఎక్కువ కాలం అభసించాలి. ఈ ప్రణాయామ అభాసంలో శరీర మునకు మిక్కిలి చెమట పడితే అది సామాన్య ప్రాణామాయం. శరీరము కుదిపినట్లయిన మధరకమైనది. శరీరము నేలనుండి పైకి లేచిన అది సర్వోత్కృష్టమైనది.
5. ప్రత్యాహారము: జ్ఞానేంద్రియములను రూప రసగంధాది విషయాలనుండి బలవంతంగా విముఖంగానుండునట్లు అంతర్ముఖం చేయటం.
6. ధారణ: భగవంతుని తప్ప మైయొకటి ఎరుగని స్థితిలో ఉండటం.
7. ధ్యానం: ఇష్ట దైవాన్ని ఏకాగ్రతతో ప్రార్థించటం.
8. సమాధి: ఈ స్థితిలో ఆత్మను పరమాత్మతో సమ్యోగం చేయవచ్చునని దార్శనికుల విశ్వాసం.
ఆధునిక కాలంలో దాదాపు వందేళ్ళుగా ఇటు భారతదేశంలోను, అటు పశ్చిమదేశాల్లోను విస్తృతంగా ఆచరిస్తున్న యోగకు మాత్రం శారీరక, మానసిక ప్రశాంతతే లక్ష్యం అష్టాంగయోగలోని మూడు, నాలుగు దశలు ఆసన (శారీరక వ్యయామం) ప్రాణాయమ (ఉచ్చ్వాస, నిశ్వాసాల నియంత్రణ)ను ప్రప్రంచంవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఆచరిస్తున్నారు. శారీరక ఆరోగ్యానికి, శారీరక, దార్ద్యానికి తిరుగులేని మార్గంగా నమ్ముతున్నరు.

HAMSASANAM HEALTH BENEFITS


హంస ఆసనం

ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. అక్కడ నుంచి రెండు అరచేతులని నేలమీద ఉంచి వెనక్కి తిప్పిపెట్టాలి. కాళ్లను నెమ్మదిగా వెనక్కి చాపాలి. ముందుకు చూస్తూ శ్వాసని తీసుకుని, వదులుతూ ఉండాలి. ఈ ఆసనంలో కూడా పది నుంచి ఇరవైసెకన్లపాటూ ఉండాలి. ఇలా మూడు సార్లు చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల చేతుల దగ్గర అధిక కొవ్వు చేరుకుండా ఉంటుంది. భుజాలు శక్తిమంతం అవుతాయి. పొట్ట స్ట్రెచ్‌ అయి కొవ్వు తగ్గుతుంది. వీపు, భుజాల దగ్గర స్ట్రెచ్‌ అయి ఆ ప్రాంతంలో అధికంగా ఉండే కొవ్వు తగ్గుతుంది.

INDIAN YOGA HEALTH BENEFITS - PRASARITHA PADHOTHASANAM


ప్రసారిత పాదోత్తాసనం

రెండుకాళ్లనూ సాధ్యమైనంత వరకూ దూరంగా స్ట్రెచ్‌ చేసి మెల్లగా 90 డిగ్రీల కోణంలో వంగి రెండు అరచేతులనూ నేలకు ఆనించాలి. చేతులు రెండు పాదాల మధ్యకు వచ్చేటట్టుగా ఉంచాలి. చేతులు వంచకుండా నిటారుగా ఉంచాలి. తలని పైకిపెట్టి ముందుకు చూస్తూ ఉండాలి. అలా పదిసెకన్ల నుంచి అరనిమిషం పాటూ ఉండాలి. ఈ ఆసనాన్ని రెండు నుంచి మూడు సార్లు చేయొచ్చు. ఇలా చేయడం వల్ల చేతులూ, కాళ్లలోని కండరాలు సాగి క్రమంగా శక్తిని పుంజుకుంటాయి. చక్కగా నునుపుతేలతాయి. తీరైన ఆకృతిని సంతరించుకుంటాయి. భుజాల నుంచి నడుము వరకూ ఉండే కొవ్వు తగ్గుతుంది.

YOGA TIPS - VYAGRASANAM


వ్యాఘ్రాసనం

ముందుగా వజ్రాసనంలో కూర్చుని అక్కడ నుంచి మోకాళ్లపై లేచి రెండు చేతులన్నీ భుజాలకు సమాంతరంగా ఉంచి... తర్వాత మెల్లగా కుడిమోకాలుని పైకి లేపాలి. ఎడమచేత్తో కుడిపాదాన్ని పట్టుకుని స్ట్రెచ్‌ చేయాలి. ఈ ఆసనంలో శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. తర్వాత ఇదే విధంగా కుడికాలితో కూడా చేయాలి. ఇలా కుడివైపు మూడు సార్లు ఎడమవైపు మూడు సార్లు చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల పిరుదుల వెనక, నడుము దగ్గర ఉన్న కండరాలు సాగి ఆరోగ్యంగా ఉంటాయి. సయాటికా నొప్పి ఉన్నవారికి కూడా ఉపశమనం కలుగుతుంది. శరీరం మొత్తానికి చక్కగా రక్త ప్రసరణ జరుగుతుంది. శరీరం వెనుక భాగంలో అన్ని భాగాలకూ వ్యాయామం అంది కొవ్వు తొలగిపోతుంది.

Friday, 27 November 2015

LIVE LIFE HAPPILY WITH YOGA EVER AND FOREVER


అన్ని జన్మలలోనూ మానవజన్మ ఉత్కృష్టమైన జన్మ. మానవుడు బుద్ధిజీవి. అతడు ధర్మార్థ,కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సాధించవలసి ఉన్నది. మానవులకు ధర్మసాధనాలలో శరీరమే మొట్టమొదటి సాధనం. శరీరమాద్యంఖలు ధర్మసాధనమ్‌ అని పండితుల వాక్కు. మానవుడు చతుర్విధ పురుషార్ధాలను సాధించాలంటే దానికి సరైన ఆరోగ్యమే మూలం.
ధర్మార్థ కామ మోక్షాణాం ఆరోగ్యం మూల ముత్తమమ్‌
ఆరోగ్యం సక్రమంగా లేకపోయినట్లయితే ఇటు శారీరకంగానే కాక అటు మానసికంగా కూడా దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే దానికి ఆరోగ్యసాధన మొట్టమొదటి సాధనం.మానవుడు ముందుగా ఆధ్మాత్మికమైన జ్ఞానాన్ని సంపాదించాలి. ఆధ్యాత్మిన జ్ఞానం లేకపోవటం వలన కలిగే దుఃఖాన్ని మానవుడు నివారించుకోగలిగినప్పుడే అతడు ముముక్షువు అవుతాడు. ముముక్షువుకు యోగసాధన అనివార్యం అయినట్టిది.భగవద్గీతలో సమత్వం యోగః అనీ కర్మకౌశలం యోగంః అని యోగం రెండు విధాలుగా నిర్వచింపబడింది. సుఖదుఃఖాలను, శీతోష్ణాలను, మానావమానాలను సమానంగా పరిగణించటమే యోగం అని అర్థం. సమత్వం కలవాడే స్థితప్రజ్ఞుడుగా పరిగణింపబడతాడు.ఒక పనిని అత్యంత నైపుణ్యంతో చేయటమే యోగం అన్నారు. అభ్యాసం వలన, ఏకాగ్రత కుదరటం వలన ఒక పనిని అత్యంత సామర్థ్యంతో నెరవేర్చవచ్చు.

యోగశ్చిత్తవృత్తి నిరోధకః అని పతంజలి మహర్షి ఇచ్చిన నిర్వచనం. చిత్త వృత్తిని నిరోధించటమే యోగం.
యోగాంగాలను అనుష్ఠించటం వలన అశుద్ధి నశించి జ్ఞానప్రకాశం కలుగుతుంది. ''యోగాంగా నుష్ఠానాదశుద్ధి క్షయే జ్ఞాన దీప్తిః వివేక ఖ్యాతిః అనే సూత్రంలో అది వివరింపబడింది.కాబట్టి బుద్ధి జీవి అయిన మానవుడు నిరంతరం యోగసాధన చేస్తూ శరీరాన్నీ, మనస్సునూ కాపాడుకుంటూ దాని ద్వారా సామాజికమైన ఆరోగ్యాన్ని కూడా చేకూర్చవలసిన బాధ్యత కలిగి ఉన్నాడు. అటువంటి ఆరోగ్యవంతమైన సమాజం వలన దేశసౌభాగ్యం చేకూరుతుంది. యోగసాధన చేసేవారు ముఖ్యంగా 3వర్గాలకు చెందినవారు. మోక్షప్రాప్తికై యోగమార్గాన్ని అనుసరించేవారు మొదటి వర్గం. వీరికి ఇహలోక సుఖాలపై ఆసక్తి ఉండదు. రెండవ వర్గం వారు శారీరక, మానసిక ఆరోగ్యాలను సర్వదా కాపాడుకోవటానికై ఆసనాలను అభ్యాసం చేసేవారు. వీరికి ఆరోగ్యమే ప్రధానం. ఇక మూడవ వర్గానికి చెందినవారు కేవలం వ్యాధి నివారణే ధ్యేయంగా కలిగి ఆసనాలను అభ్యసించేవారు.పై మూడు విధాలుగా ఏవిధంగా ఆలోచించినప్పటికీ ఆసన, ప్రాణాయామాది యోగసాధన వలన అన్ని వర్గాల వారికీ మేలు కలుగుతుందనటం అక్షరసత్యం. సంపూర్ణ వ్యక్తిత్వం - అంటే శారీరకమైన ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడ యోగ సాధన వలన సాధ్యమవుతుంది.యోగాసనాలకు ఇతర వ్యాయా మాలకు చాలా భేదం ఉంది. ఇతర వ్యాయామాలకు సాధనాలు అవసరం. దాని వలన శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆహారం దానికి తగినట్లుగా తీసుకోవలసి వస్తుంది.


Wednesday, 28 May 2014

yoga tips to house wives



ఇంటి పట్టున యోగా చేసేవారు కొన్ని అంశాలను క్రమం తప్పకుండా పాటించాలని యోగానిపుణులు అంటున్నారు.

* నిత్యం ఒకే రకమైన యోగసనాలను చేయాలి. ఉదాహరణకు అష్టాంగయోగ చక్కటి ఉదాహరణ. ఇందులో ఊపిరి తీసుకోవడం, దృష్టిని ఒకచోట కేంద్రీకరించడం వంటివి ఉంటాయి. ఇవన్నీ ఒక చోట కూర్చుని కదలకుండా సులువుగా చేయొచ్చు. ఈ ఆసనాలు మెడిటేషన్‌కు కూడా బాగా సహకరిస్తాయి.

* యోగాసనాల్లో ఎప్పుడూ ఒకే క్రమం (సీక్వెన్స్) అనుసరించాలి.
ఊ నిర్దిష్ట సమయాన్ని యోగాకు కేటాయించాలి. ఆ సమయంలోనే యోగా చేయాలి. టైమింగ్స్ మార్చకూడదు.


* ఇంట్లో ఒక ప్రదేశం అనుకుని అక్కడే యోగా చేయాలి. ఆ ప్రదేశంలో ఒక దేవుడి పటమో, క్యాండిల్ ఇంకేదైనా పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఏకాగ్రతతో యోగా చేయగలరు.

* ప్రాణాయామ , జపం, మెడిటేషన్ వంటివి చేయొచ్చు. వీటి వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. ఉదాహరణకు మూడు నిమిషాల పాటు మీరు చేసే ప్రాణయామ మీకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది.

* అపుడపుడు యోగ వర్కుషాపులకు వెడుతుండాలి, యోగా టీచర్‌ని సంప్రదిస్తుండాలి. ఇవి ఇంట్లో యోగా చేసుకునే వారికి ఎంతో ఉపయోగపడతాయి.