WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Heart Care Health Tips. Show all posts
Showing posts with label Heart Care Health Tips. Show all posts

Saturday, 12 December 2015

HEART CARE WITH FRUITS - EAT FRUITS DAILY AND REDUCE THE CHANCE OF ATTACKING HEART ATTACK


ప్రస్తుత రోజులల్లో గుండె సంబంధిత వ్యాధులు అధికమైపోయాయి. చిన్న వయసులోనే గుండె జబ్బులు రావటం, గుండెపోటు కారణంగా మరణాలు సంభవించడం జరుగుతోంది. శరీరంలో గుండె ఒక ప్రధాన బాగం. ఇది ఒక పెద్ద కండరం కాగా, ఇరవై నాల్గు గంటలూ పనిచేస్తూనే వుంటుంది. శరీరంలోని వివిధ బాగాలకు రక్తప్రసరణ చేస్తుంది. గుండెకు సంబందించిన రక్తనాళాలలో ఎటువంటి అడ్డంకులు ఏర్పడకుండా మంచి ఆహారాలు, తగిన వ్యాయామం సహకరిస్తాయి. సాధారణంగా నలభై ఏళ్ళ వయస్సు దాటిన ప్రతి ఒక్కరిలో గుండె పనితీరుకు సంబంధించిన ఆలోచన, ఆందోళన తప్పక ఉంటుంది. అందుకే 40 నుంచి 50 వరకు ఏటా ఒకసారి, 50 దాటాక ఏడాదికి రెండు సార్లు లిపిడ్ ప్రొఫైల్ రక్తపరీక్ష చేయించుకొని, వైద్యలు సలహా తీసుకుంటే మీ గుండె నిక్షేపంగా ఉంటుంది. పరీక్షల సంగతి పక్కన పెడితే, గుండె ఆరోగ్యానికి ఏ రకమైన ఆహారాలు, జీవన విధానం ఆచరించాలనేది పరిశీలించండి. ప్రతిరోజ కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయాలు తినండి. డైనింగ్ టేబుల్ పై ఉప్పు, కారం లేకుండా చూసుకోండి. తీనే సమయంలో అధనంగా ఉప్పు వేసుకునే అలవాటు మానండి. ఈ సీజన్‌లో యాపిల్స్ పుష్కలంగా లభిస్తాయి. గుండె ఆరోగ్యానికి యాపిల్ చాలా మంచిది. అందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఒక కప్పు యాపిల్ ముక్కల్లో 3.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. నారింజపండ్ల రసంలో బి9 విటమిన్ ఉంటుంది. ఇది గుండెజబ్బులకు దారితీసే హోమోసిస్టైన్‌ను తగ్గిస్తుంది. పచ్చిబఠానీల్లో బి2, బి6 విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్లు రక్తనాళాలను పదిలంగా కాపాడతాయి. రక్తనాళాలు దెబ్బతినడం వల్ల గుండెజబ్బులు వచ్చిపడతాయి. ద్రాక్షపండ్లు గుండెజబ్బులను దూరంగా ఉంచుతాయి. ద్రాక్ష వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఫ్లావాన్స్, ఆంతోసైనిన్ వంటి ఎన్నో మంచి లక్షణాలు ద్రాక్షపండ్లలో ఉన్నాయి. ద్రాక్షను గోరువెచ్చని నీళ్లలో లేదా ఉప్పు నీటిలో క డిగి తీసుకోవడం వల్ల రసాయనాల ప్రభావం మనపై పడకుండా ఉంటుంది. వేరుశనగపప్పులు గుండెకు ఎంతో మేలు చేస్తాయట. రోజూ కాసిని వేరుశనగ పప్పులు, బాదంపప్పు, వాల్‌నట్స్ తీసుకుంటే గుండె నిక్షేపంగా ఉంటుందంటున్నారు నిపుణులు. వీటితో పాటు బీన్స్ కూర తరచుగా తనడం వల్ల కూడా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చక్కర వ్యాది వున్న వారు డాక్టర్ సలహా తీసుకోండి

Friday, 27 November 2015

LATEST NEWS ABOUT HEART CARE WITH EATING BANANA'S DAILY


రోజూ మూడు అరటిపండ్లను తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్‌పెట్టవచ్చనని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటీష్‌ ఇటాలియన్‌ పరిశోధనకు నిర్వహించిన అధ్యయనంలో రోజువారీగా మూడు అరటిపండ్లు తీసుకునే వారిలో హృద్రోగ సమస్యలు చెక్‌ పెట్టవచ్చునని తేలింది.
- రోజూ ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అరటిపండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌కు మూడో అరటిపండును తీసుకునే వారిలో శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్తసంబంధిత రోగాలను 21శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు.
- కాగా, స్పానిష్‌, నట్స్‌, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే, మూడు అరటిపండ్లు రోజువారీగా తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటు వంటివి చాలామటుకు తగ్గిపోతుందని వారి చెబుతున్నారు.
- పొటాషియం అధికంగా గల ఆహారం తీసుకోవడం ద్వారా సంవత్సరానికి గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవ్ఞతుందని వార్వింక్‌ యూనివర్శిటీ నిర్వహించిన స్టడీలో తేలింది. అయితే రోజూ మూడు అరటిపండ్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి, గుండెపోటును నియంత్రించవచ్చునని ఆ పరిశోధనలో తేలింది.


Saturday, 5 July 2014

HEALTH WITH GREEN TEA AND LEMON - SAFE HEART WITH LEMON AND GREEN TEA


గ్రీన్ టీ మరియు నిమ్మ

ఆరోగ్యకరమైన గుండె


గ్రీన్ టీ లో కాటెచిన్స్ అని పిలిచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల గొప్ప మూలం ఉంది.
 
ఇది గుండె యొక్క ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయం చేయడానికి ప్రసిద్ధి చెందింది. 

అయితే అధ్యయనాలు ప్రకారం ఈ సమ్మేళనాలు 20 శాతం మాత్రమే 

మానవ శరీరంలో శోషించబడతాయి. 

గ్రీన్ టీ కు నిమ్మరసం జోడించడం వల్ల 80 శాతం వరకు 

కాటెచిన్స్ స్థాయిలు పెరుగుతాయని తెలిసింది.


ఒక కప్పు గ్రీన్ టీ కాచిన తర్వాత దానిలో ఒక మొత్తం నిమ్మకాయ రసం పిండాలి

Tuesday, 29 April 2014

PISTA - THE BEST FOOD STUFF WHICH PROTECTS FROM HEART DISEASES



గుండె జబ్బులని తగ్గించే పిస్తా

* పిస్తా పప్పులు పోషక పదార్థాలు. వీటిలో పోటాషియమ్ అత్యధికంగా లభిస్తుంది.

* శరీరంలో ద్రవాల నియంత్రణకు పొటాషియమ్ బాగా పనికొస్తుంది.

* దీనిలో ఉండే విటమిన్ బి6 ప్రోటీన్ల తయారీ, శోషణంలో ఉపయోగపడుతుంది.

* మిగిలిన ఎండు పండ్లతో పోలిస్తే కాలరీలు తక్కువ. ఇవి గుండెజబ్బులను తగ్గించే గుణం కలిగినవి. * వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ విశేషంగా ఉంటాయి.

* తాజా పరిశోధనల్లో పిస్తాలు క్యాన్సర్ రాకుండా కాపాడతాయని తేలింది.

* అయితే పిస్తాలో మోనో శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉన్నందువల్ల వీటిని మరీ ఎక్కువగా తీసుకోకూడదు.


* వారంలో 15-20 గ్రాములకు మించి 

తినడం మంచిది కాదు.