WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Medical tips. Show all posts
Showing posts with label Medical tips. Show all posts

Saturday, 23 April 2016

STOP USING PAIN KILLERS REGULARLY WHICH LEADS TO SEVERE HEALTH DISORDERS


పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా.. వాటితో ప్రమాదమే!!

ఒళ్లు నొప్పులనో, తలనొప్పిగా ఉందనో… కొంతమంది నొప్పి రాగానే పెయిన్‌ కిల్లర్‌ టాబ్లెట్స్ వాడుతుంటారు. చిన్న చితక నొప్పులే కదా అని మరికొందరు డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండా తాత్కాలిక ఉపశమనం కోసం మందులను వాడుతుంటారు. అటువంటి మందులు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా… దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

తాజాగా పెయిన్ కిల్లర్స్ పై చేసిన పరిశోధనల్లో.. ఊహించిన దానికంటే ఎక్కువ ముప్పు నిర్ధారణ అయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మాత్రలతో అల్సర్లు, బీపీ పెరగడం తదితర ఇబ్బందులు ఎదురవుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ డెన్మార్క్‌ పరిశోధకులు వివరించారు. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారు పెయిన్‌ కిల్లర్‌ మాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

నాన్‌ స్టెరాయిడల్‌ యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ డ్రగ్స్‌(ఎన్‌ఎస్ఏఐడీ)గా వ్యవహరించే ఈ మాత్రలను సాధారణ నొప్పుల నుంచి మొదలుకొని పలు రకాల వ్యాధుల నివారణకు వాడుతుంటారని చెప్పారు. కండరాలు, ఎముకల వ్యవస్థ, వాపు, నొప్పి తదితర ఇబ్బందులనుంచి రోగులకు ఉపశమనం కలిగించేందుకు వైద్యులు ఈ మాత్రలను సూచిస్తుంటారని… అయితే, ఈ చికిత్స దీర్ఘకాలంలో బీపీ పెరగడానికి, అల్సర్లకు దారితీస్తుందని వర్సిటీకి చెందిన మార్టెన్‌ స్కిమిడిట్‌ తెలిపారు.
రోగులకు ఉపశమనం కలిగించేందుకు ఎన్‌ఎస్ఏఐడీ మందులను రాసేముందు వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇకపోతే ప్రిస్కిప్షన్‌ లేకుండా అమ్మకాలు జరిపే విషయంలో ఆయా మాత్రల వాడకం గురించి కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని, డాక్టర్ల సలహా మేరకు మాత్రమే పెయిన్ కిలర్స్ వాడాలని సూచించారు.

Friday, 8 January 2016

Psoriasis Symptoms - Medical tips to cure


చాలా మంది చర్మరోగులు సొరియాసిస్‌ను ఒక సాధారణ చర్మ వ్యాధిగానే భావిస్తారు. కానీ ఇది మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ వికటించడం వలన వచ్చే చర్మ వ్యాధి అన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ జబ్బును కేవలం పై పూతలతో పూర్తిగా నయం చేయలేము.
 
సొరియాసిస్‌ అనేది దీర్ఘకాలికంగా కొనసాగే ఆటోఇమ్యూన్ వ్యాధి. అనగా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఒకేసారి పొరబడి చర్మ కణాలపై దాడి చేయడం వల్ల జరిగే పరిణామాల వల్లనే ‘సొరియాసిస్‌’ వస్తుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటువ్యాధి కాదు. కాకపోతే, ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంది.
 
సాధారణంగా మన చర్మం రెండు పొరలతో నిర్మితమై ఉంటుంది. బయటి పొరను ఎపడెర్మిస్‌ అని, లోపలి పొరను డెర్మిస్‌ అని అంటారు. సుమారు నెలరోజులకొకసారి డెర్మిస్‌లో తయారైన కొత్తకణాలు ఎపిడెర్మిస్‌లోకి చేరుకుంటాయి. కాని సొరియాసిస్‌ వ్యాధిలో కణాలు తయారమ్యే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. కొత్త కణాలు తయారయి చర్మం పైభాగానికి వచ్చేస్తుంటాయి. అధికంగా వచ్చేసిన ఆ కణాలు పేరుకుపోయి బిళ్లల మాదిరిగా తయారవుతాయి. చూడటానికి వెండి రంగుపొలుసుల వలే కనిపిస్తాయి. సొరియాసిస్‌ ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు అరిచేతులు, అరికాళ్లు, ఉదరంపై ప్రభావితం చేస్తుంది. సొరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్‌ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌’ అని అంటారు.
 
కారణాలు 
జన్యుపరమైన కారణాల వలన గానీ, లేదా మానసిక ఒత్తిడి వలన గానీ ఈ వ్యాధి రావచ్చునన్న విషయం అనుభవపూర్వకంగా అంగీకరించబడింది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడిన అసమతుల్యతల కారణంగా కూడా ఈ వ్యాధి రావచ్చు మరియు దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం కూడా సొరియాసిస్‌ కారణం కావచ్చు.
 
లక్షణాలు 
చర్మం ఎర్రబడటం, సాధారణం నుంచి అతి తీవ్రమైన దురద, చర్మంపైపొర వెండి రంగు పొలుసులుగా ఊడిపోవడం, సొరియాసిస్‌ తలలో ఉన్నప్పుడు పొలుసులు రాలడంతో బాటు జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారినపుడు చర్మంపై పగుళ్లు ఏర్పడటంతో పాటు రక్తస్రావం కావడం ఉంటాయి. సొరియాసిస్‌ గోళ్లను ప్రభావితం చేయటం జరిగితే అవి పెళుసుబారి దృఢత్వాన్ని కోల్పోయి త్వరగా విరిగిపోతాయి. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు కీళ్ళు ప్రభావితమై తద్వారా కీళ్ల నొప్పులు మొదలవుతాయి.
 
నిర్థారణ పరీక్షలు 
సిబిపి, ఈఎస్‌ఆర్‌, స్కిన్ బయాప్సీ, సొరియాసిస్‌ కీళ్లను ప్రభావితం చేసినప్పుడు ఎక్స్‌రే మొదలగు పరీక్షలు చేయించాలి. సాధారణంగా అనుభవజ్ఞులైన డాక్టర్లు రోగి చర్మ లక్షణాలను నిశితంగా పరిశీలించిన మీదట రోగనిర్ధారణ చేస్తారు.
 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ చికిత్స 
చాలా మంది సొరియాసిస్‌ రోగులు ఆతృతతో వైద్యులను, వైద్య విధానాలను త్వరితకాలంలో మార్చేస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. సొరియాసిస్‌ ఒక దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి క్రమం తప్పకుండా కొంతకాలంపాటు వైద్యం తీసుకుంటేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ సిమిలియం విధానం ద్వారా సొరియాసిస్‌ రోగి వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకుని తద్వారా వికటించిన అతని రోగనిరోధక వ్యవస్థను సరిచేసి ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా సొరియాసి్‌సను సంపూర్ణంగా నయం చేయవచ్చు.