WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Health tips with Vegetables. Show all posts
Showing posts with label Health tips with Vegetables. Show all posts

Friday, 30 September 2016

INFORMATION ABOUT NEW VEGETABLE - KASARAKAYALU OR KANCHARAKAYALU


ఇవి ఏమిటో ఎవరికైనా తెలుసా..?
రాయలసీమలో కడప,కర్నూల్, అనంతపూర్ జిల్లాలకు బాగా సుపరిచతమైన " కాసర కాయలు అక్కడి మాండలికంలో వేగంగా పలకడంలో..కాంన్చ్సర కాయలు" అనే కాయగూర ఇది.
కాకరకాయ లానే ఇది కూడ చెదుగా వుంటుంది, కాని కాకర కాయ సంతతి కాదు. రాయల సీమ వాసులు చాలా ఇష్టంగా తినే కాయగూర ఇది. వీటిని రెండు విదాలుగా వంటలో వాడతారు.
ఒకటి ః వెల్లుల్లితో తయారు చెసిన పప్పుల పొడి ( పుట్నాల పొడి ) తో వేపుడు చెసుకొంటారు. రాత్రిల్లు తినే జొన్న రొట్టల్లో ఇదె వేపుడు కలుపుకొని తింటారు. 
రెండు ః నీటిలో ఉప్పు వేసి ఉడకబెట్టి తర్వాత రెండు రోజుల దాకా బాగా ఎండలో ఎండబెట్టాక వాటిని ఒక డబ్బాలో నిలువ వుంచుతారు. ఎప్పుడు కావాలనుకొన్నప్పుడు అప్పుడు నూనెలో వడియాల లాగ వేయించుకొని భోజనంలొ తింటారు. ఇవి ఆరు నెలల నుండి సంవత్సరం దాక నిలువ వుంటాయి చెడిపోకుండా...!!
ఇవి పంటి కింద పడి కరుమ్ కరుమ్ అని నులుగుతూ తింటూంటే  అదో రకపు చేదె గాని.. ఆ చెదు కూడ చాలా రుచిగా వుంటుంది.

FRESH KOTHIMERA HEALTH BENEFITS



ఆకుకూరలలో పచ్చిగా తినగలిగిన వాటిలో ఇది ఒకటి.దీని వల్ల మన శరీరానికి విలువైన పోషకపదార్దాలు అందుతున్నాయి. ఇకపోతే ఇందులో ఖనిజ పదార్దాలు, ఇనుము,విటమిన్ సి, విటమిన్ బి, భాస్వరం, ఇనుము, సోడియం, కాల్షియం చాలా ఎక్కువగా వుంటాయి. అందుకే ఇది మానవుని ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే ఆకుకూర. అవ్వన్ని పక్కనపెడితే దీని వల్ల మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1.కొత్తిమీరలో వుండే బోర్నియోల్ జీర్ణ శక్తిని పెంచడమే కాకుండా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. డయోరియాతో భాదపడే వారికి ఈ జ్యూస్ మంచి ఔషధం.

2.దీనిలో వుండే స్పెషల్ గుణాలు చర్మ సమస్యలను ముఖ్యంగా మొటిమలు,నల్లటి మచ్చలను దూరం చేస్తుంది.

3.బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ వుంచుతూ ఒత్తిడిని తగ్గిస్తూ ,గుండె సమస్యలను దూరం చేస్తుంది.

4.దీనిలో ఐరన్ కంటెంట్ అనీమియాను దూరం చేస్తుంది.

5.కొత్తిమీరలోని యాంటీ సెప్టిక్ గుణాలు గాయాలను నయం చేయడంలో ముఖ్యంగా అల్సర్ లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.

6.దీనిలో వుండే కాల్షియం ఎముకలను బలంగా మార్చుతాయి.

7.జీర్ణ శక్తిని మెరుపరచడంతో పాటు కళ్ళ అరోగ్యాన్ని పెంచుతుంది.

8. కొత్తిమీరలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో హానికరమైన కొవ్వు పదార్దాల స్థాయిని తగ్గిస్తాయి. దీని వల్ల బరువు తగ్గుతారు.

Saturday, 17 September 2016

HEALTH BENEFITS WITH ADAVI KAKARAKAYA - CONTROL SUGAR AND CANCER WITH AGAKARA - AKAKARA - ADAVI KAKARA - BONTHU KAKARA - BODA KAKARA



షుగ‌ర్‌, క్యాన్స‌ర్‌ల‌కు విరుగుడు అడవికాక‌ర‌..

ఆగాక‌ర‌, ఆకాక‌ర‌, అడ‌వి కాక‌ర‌, బొంతు కాక‌ర‌, బోడ కాక‌ర‌... ఇలా ఈ కూర‌గాయ‌కు చాలా పేర్లే ఉన్నాయి. కాక‌ర‌కాయంత పొడ‌వుగా ఉండ‌దు, దానంత చేదు కూడా ఉండ‌దు. కానీ ఆగాక‌ర‌లో పోష‌కాలు మాత్రం ఎక్కువే ఉంటాయి. వీటిని మ‌న ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆగాక‌ర కాయ‌లు మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. ఇవి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. ఇన్సులిన్ లెవ‌ల్స్‌ను పెంచుతాయి. 
మ‌ధుమేహం వ‌ల్ల వ‌చ్చే ఇతర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేస్తాయి.

2. ఆగాక‌ర కాయ‌ల్లో పైటో న్యూట్రియంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్‌ల‌ను న‌యం చేస్తాయి. క్యాన్స‌ర్ క‌ణ‌తుల‌ను పెర‌గ‌నీయ‌కుండా అడ్డుకుంటాయి. క్యాన్స‌ర్ కార‌కాల‌ను నాశ‌నం చేస్తాయి.

3. ఆగాక‌ర కాయ‌ల్లో ఫొలేట్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది చిన్న పిల్ల‌ల‌కు, గ‌ర్భిణీ స్త్రీలకు ఎంత‌గానో అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కం. దీంతో గ‌ర్భ‌స్థ శిశువు చ‌క్క‌గా ఎదుగుతుంది.

4. ఆగాక‌ర కాయ‌ల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే న‌ష్టాన్ని నివారిస్తుంది.

5. ఆగాక‌ర కాయ‌ల్లో ఫ్లేవ‌నాయిడ్లు కూడా స‌మృద్ధిగానే ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఇందు వ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌ర‌గా ద‌రి చేర‌వు.

6. ఆగాక‌ర‌లో విట‌మిన్ ఎ కూడా బాగానే ఉంటుంది. ఇది దృష్టి సంబంధ స‌మ‌స్య‌లను తొల‌గిస్తుంది.

7. మూత్ర‌పిండాలు, మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు ఉన్న వారు నిత్యం ఆగాక‌ర కాయ‌ల‌ను తింటుంటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

8. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

Monday, 5 September 2016

HEALTH BENEFITS WITH EATING BRINJALS - VANKAYA - REGULARLY


వంకాయల్ని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంకాయల్ని వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి రక్తంలోని కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది. వంకాయలోని పొటాషియం రక్తంలో చేరే కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. వంకాయలోని పీచు ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువు పెరగడానికి బ్రేక్ వేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

వంకాయలో క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది. వంకాయను ఉడికించి దానితో తేనె చేర్చి సాయంత్రం పూట తీసుకుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. వంకాయను వంటల్లో చేర్చడం ద్వారా గుండె, రక్తనాళాల్లో ఏర్పడే వ్యాధులను నిరోధించవచ్చు. వంకాయలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి మేలు జరిగినట్లే. వంకాయలను తినడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా హైబీపీని వంకాయలు నియంత్రిస్తాయని వారు చెప్తున్నారు.

Wednesday, 15 June 2016

HEALTH BENEFITS WITH CHINTHA CHIGURU - TAMARIND LEAVES


చింత చిగురు యాంటీఆక్సిండెట్‌గా ప‌ని చేస్తుంది.

చింత చిగురు రుచికే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. 

చింతచిగురులో "యాంటీసెప్టిక్ "గుణాలు అధికంగా ఉంటాయి. 

ఇది యాస్ట్రింజెంట్ మాదిరి పని చేసి, మ‌న శ‌రీరంలోని వ్యర్థాలను బ‌య‌ట‌కు తొలగిస్తుంది. అన్ని వయసుల వారూ దీన్ని తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వ‌వ‌చ్చు.

చింత చిగురుతో కూరా, పచ్చడీ చారు 
ఇతరత్రా వాటితో కలిపి పదార్థాల్ని చేసుకోవచ్చు. తరచూ తీసుకోవడం వల్ల "రక్తం శుద్ధి అవుతుంది. "వీటిలోని ఆమ్లాలు రక్తంలోని మలినాలను తక్షణమే తొలగిస్తాయి.

చిన్నారుల కడుపులో నులిపురుగులు ఉంటే ఎంతగానో బాధిస్తాయి. అలాంటి వారికి తరచూ చింత చిగురుతో చేసిన కూరలూ, పచ్చళ్లూ తినిపిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అలానే కళ్లు దురదలుగా అనిపించినా ఈ చిగురు తింటే సమస్య తగ్గుముఖం పడుతుంది.

చింతపండులో కంటే చిగురులో విటమిన్ 'సి' శాతం అధికంగా ఉంటుంది. చింత చిగురులోని యాంటీఆక్సిండెట్లు శరీరంలోని వ్యర్థాలను దూరం చేస్తాయి.చింత చిగురు ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Monday, 29 December 2014

HEALTH WITH BITTERGOURD - KAKARAKAYA UPAYOGALU


కాకర కాయ చేదంటే.. అనారోగ్యం పాలైనట్లే?

అమ్మో కాకర కాయ చేదు అనుకుంటున్నారా? అయితే అనారోగ్యం పాలైనట్లే. కాకరలో తల నుంచి పాదాల వరకు మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారంలో అప్పుడప్పుడు కాకరను చేర్చుకోవడం ద్వారా అలెర్జీ, ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ వంటివి దరిచేరవు.
కాకరలో కెలోరీలు తక్కువ. ఇందులో 80 శాతం నుంచి 90 శాతం వరకు తేమ ఉంటుంది. బి1, బి2, బి3, బి5, బి6, సి విటమిన్లతో పాటు పొటాషియం, మేగ్నీషియం, సోడియం, ఫాస్పరస్ వంటి ధాతువులు వున్నాయి. ఆకుకూరల్లో ఉన్న క్యాల్షియం కంటే కాకరలో రెండింతలు అధికంగా క్యాల్షియం ఉంటుంది.
100 గ్రాముల కాకరలో ఏముంది?
కొవ్వు - 0.17 గ్రాములు,
పీచు- 2.80 గ్రాములు
నియాసిన్ - 0.400 మి.గ్రాములు
క్యాల్షియం - 10. మి.గ్రాములు
సోడియం - 5 మి. గ్రాములు
పొటాషియం -296 మి.గ్రా

Tuesday, 16 December 2014

HEALTHY ADVANTAGES WITH USING CABBAGE



మేలు చేసే క్యాబేజి

క్యాబేజిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. తద్వారా అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సిలు క్యాబేజిలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి జీవక్రియ పనితీరును మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాక, కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్‌ ప్రమాదాలను తగ్గిస్తుంది. కండరాల ధృడత్వానికి, రక్తాన్ని శుద్ధిచేయడానికి, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచటానికి క్యాబేజి ఎంతో ఉపయోగం.క్యాబేజి వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు. మొటిమలు తగ్గాలంటే వారానికి రెండు సార్లు దీనిని ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.
అయితే ఉడికించిన క్యాబేజిని తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. ఉడికించడం వల్ల కొవ్వు శాతం చాలా తగ్గుతుంది. జలుబు నుంచి ఉపశమనం లభించాలంటే క్యాబేజిని బాగా ఉడికించి ఆ రసాన్ని సేవిస్తే ఫలితం ఉంటుంది. క్యాబేజి రసంతో అధిక బరువును దూరం చేస్తుంది. క్యాబేజితో క్యారెట్‌ తరుము చేర్చి ఉప్పు లేకుండా ఉడికించి ఆ నీటిని సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా శరీరానికి ఎన్నో విధాల మేలు చేస్తుందీ క్యాబేజి.

HEALTH WITH VEGETABLES - HEALTH WITH DOSAKAYA FRUIT - PUT CHECK TO CANCER - DIABETES ETC WITH DOSAKAYA



 జబ్బులకు దోసకాయతో చెక్‌

మధుమేహం, కేన్సర్‌లను నివారించే లక్షణాలు దోసకాయల్లో ఉన్నాయని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. దోసకాయల్లో ఉన్న కుకుర్‌బిటాసిన్స్‌ అనే పదార్థం కేన్సర్‌ కణాలను చంపివేస్తుందని వారి అధ్యయనంలో వెల్లడైంది. భారతదేశంతోపాటు చైనాలోను కొన్ని వేల సంవత్సరాల నుంచి కాలేయవ్యాఽధి చికిత్సకు దోసకాయలతోపాటు వాటి ఆకులతో కూడిన ఔషధాలను వినియోగిస్తున్నారు. తాజాగా దోసకాయల్లో కేన్సర్‌ కణాలను చంపివేసే కుకుర్‌బిటాసిన్స్‌ ఎక్కువ మోతాదులో ఉందని తేల్చారు. దోసకాయలతో జరిపిన క్రినికల్‌ ట్రయల్స్‌లో కేన్సర్‌ నివారణలో మంచి ఫలితం కనిపించిందని పరిశోధకుడైన విలియం లుకాస్‌ వెల్లడించారు. ఈ పరిశోధనల ఫలితాలు తాజాగా వెలువడిన సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి.