ఇవి ఏమిటో ఎవరికైనా తెలుసా..?
రాయలసీమలో కడప,కర్నూల్, అనంతపూర్ జిల్లాలకు బాగా సుపరిచతమైన " కాసర కాయలు అక్కడి మాండలికంలో వేగంగా పలకడంలో..కాంన్చ్సర కాయలు" అనే కాయగూర ఇది.
కాకరకాయ లానే ఇది కూడ చెదుగా వుంటుంది, కాని కాకర కాయ సంతతి కాదు. రాయల సీమ వాసులు చాలా ఇష్టంగా తినే కాయగూర ఇది. వీటిని రెండు విదాలుగా వంటలో వాడతారు.
ఒకటి ః వెల్లుల్లితో తయారు చెసిన పప్పుల పొడి ( పుట్నాల పొడి ) తో వేపుడు చెసుకొంటారు. రాత్రిల్లు తినే జొన్న రొట్టల్లో ఇదె వేపుడు కలుపుకొని తింటారు.
రెండు ః నీటిలో ఉప్పు వేసి ఉడకబెట్టి తర్వాత రెండు రోజుల దాకా బాగా ఎండలో ఎండబెట్టాక వాటిని ఒక డబ్బాలో నిలువ వుంచుతారు. ఎప్పుడు కావాలనుకొన్నప్పుడు అప్పుడు నూనెలో వడియాల లాగ వేయించుకొని భోజనంలొ తింటారు. ఇవి ఆరు నెలల నుండి సంవత్సరం దాక నిలువ వుంటాయి చెడిపోకుండా...!!
ఇవి పంటి కింద పడి కరుమ్ కరుమ్ అని నులుగుతూ తింటూంటే అదో రకపు చేదె గాని.. ఆ చెదు కూడ చాలా రుచిగా వుంటుంది.
No comments:
Post a Comment