WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label God's Prayers. Show all posts
Showing posts with label God's Prayers. Show all posts

Thursday, 10 December 2015

DAILY PUJA INFORMATION OF ALL HINDU GODS - NITYA PUJA VIDHANAM IN TELUGU


(నిత్య పూజా విధానం)
{ప్రతి దేవుని (దేవత) పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని పూజించవలెను.}
వినాయకుని శ్లోకం:
శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
🌿🌿🌿
వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః
{అని నమఃస్కారం చేసుకోవాలి}


ఏకాహారతి వెలిగించాలి:
{ఏకాహారతి వెలిగించి దానికి పసుపు, కుంకుమ, అక్షంతలు & పూల తో అలంకరించవలెను.}
🌼🌼🌼
దీపారాధన వెలిగించేటప్పుడు శ్లోకం:
{యీ క్రింది మంత్రమును చెప్పుతూ దీపమును ఏకాహారతి తోటి దీపం వెలిగించాలి}
భోదీప దేవి రూపస్త్వం,
కర్మ సాక్షిహ్య విఘ్ణకృత్,
యావత్ పూజాం కరిష్యామి,
తావత్వం సుస్థిరో భవ.
దీపారాధన ముహూర్తః సుమూహూర్తోస్తు
{పై శ్లోకం చదువుకుంటూ దీపారాధన కుంది కి పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలతో పూజ చెయ్యాలి.}


ఆచమనం:
{చెయ్యి అలివేణి (ప్లేటు)లో కడుగుకోవాలి}
ఓం కేశవాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం నారాయనాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం మాధవాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}
{మళ్లీ చెయ్యి కడుగుకోవాలి}
ఓం గోవిందయనమః --- {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}


{తదుపరి నమఃస్కారం చేయుచు యీ మంత్రములను పఠించవలెను}
కేశవనామాలు:
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూధనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం రిషీకేసాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అదోక్షజాయ నమః
ఓం నరసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే శ్రీకృష్ఱాయ నమః


యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయమంగళమ్ ||
లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః
యేషా మిందీనరశ్యామో హృదయస్థో జనార్థనః ||
ఆపదామపహర్తారందాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్ర్యంబికేదేవి నారాయణి నమోస్తుతే ||
{ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.}
ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః
ఓం శచీపురందరాభ్యాం నమః
ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
ఓం శ్రీ సితారామాభ్యాం నమః
||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||
భూశుద్ధి
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతేభూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
{ప్రాణాయామము చేసి అక్షంతలను వెనుక వేసుకోవలెను.}
ప్రాణాయామం
ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||
||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||


అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః ||
(అని నాలుగు దిక్కులా ఉద్ధరని తో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా.)
సంకల్పం
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం
శుభేశోభనే ముహూర్తే - శ్రీ మహావిష్ణో రాజ్ఞయా
ప్రవర్తమానస్య - ఆద్యబ్రహ్మణః
ద్వితియ పరార్ధే - శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే - కలియుగే
ప్రథమపాదే - జంబూద్వీపే
భరతవర్షే -భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే
(ఏ నది కి దగ్గర వుంటే ఆ నది సమీపే అని చదవాలి)
(శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా / గంగా / గోదావర్యోః మధ్యదేశే" )
నివాసిత గృహే
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
ఏ సంవత్సరమైతే అది చదువుకోవాలి
ఉత్తరాయనే
(దక్షిణాయనే from 17th july / ఉత్తరాయనే from 15th jan --- -[6 months కి ఒక సారి మారుతుంది.)
గ్రీష్మ ఋతువే
('గ్రీష్మ ఋతువే' - 'Summer Season' / 'వర్ష ఋతువే' - 'Rainy Season' / 'వసంత ఋతువే' - 'Winter Season')
(తెలుగు నెల)(శ్రావణ, చైత్ర, జ్యేష్ఠ, )
(శుక్ల పక్షం / బహుళ పక్షం, కృష్ణ పక్షం)
________ తిధౌ
(morning ఏ తిథి start అయితే ఆ తిథే చదువుకోవాలి
_______ వాసరే
(ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి)
శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరుణే,
ఏవం గుణవిశేషణ విశిష్టాయాం,
శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రా
అహం __________ నామ ధేయా
(భర్త పేరు చదువు కోవాలి)
ధర్మ పత్ని ______________ నామ ధేయా,
సకుటుంభాయాః సకుటుంబస్య - ఉపాత్త దురితక్షయ ద్వారా,
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం,
క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం,
ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం,
సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం,
సత్సంతాన సిద్ధ్యర్ధం, శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతా ముద్దిశ్య,
కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే,
{అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను.}
🍁🍁🍁
కలశారాధన
అదౌ నిర్విఘ్న పరి సమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి పూజార్ధం తదంగ కలశారాధనం కరిష్యే.
{కలశమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి, కలశంలో ఒక పువ్వు, కొద్దిగా అక్షంతలు వేసి, కుడి చేటితో కలశంను మూసి పెట్టి, ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను.}
కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః మూలే తత్ర స్థితోబ్రహ్మా
మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా
వసుంధరా ఋద్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః అంగైశ్చ
సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగేచ యమునే చైవ
గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు.
{శిరస్సు పైన పూజా ద్రవ్యముల పైన నీరు చల్లవలెను}
ఆత్మానం సంప్రోక్ష్య, పూజ ద్రవ్యాణి సంప్రోక్ష్య.
💫మీ మధుశర్మ💫

GANANAYAKASTAKAM IN TELUGU


గణనాయకాష్టకమ్

..ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ 

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతమ్
బాలేందుశకలం మౌళీ, వందేహం గణ నాయకమ్

చిత్రరత్నవిచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్
కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్

గజవక్త్రం సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్
పాశాంకుశధరం దేవం వందేహం గణ నాయకమ్

మూషికోత్తమ మారుహ్య దేవాసురమహాహవే
యోద్ధుకామం మహావీరం వందేహం గణ నాయకమ్

యక్షకిన్నెర గంధర్వ, సిద్ధ విద్యాధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణ నాయకమ్

అంబికాహృదయానందం, మాతృభి: పరివేష్టితమ్
భక్తిప్రియం మదోన్మత్తం, వందేహం గణ నాయకమ్

సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితమ్
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణ నాయకమ్

గణాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ సతతం నరః
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్

ఇతి శ్రీ గణనాయకాష్టకమ్.

Monday, 30 November 2015

KARTHIKA SOMAVARAM - LORD SIVA PRAYER


కార్తీక సోమవారం శుభాకాంక్షలు
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న” కారాయ నమః శివాయ ||
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై “మ” కారాయ నమః శివాయ ||
శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ |
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై “శి” కారాయ నమః శివాయ |
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ |
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై “వ” కారాయ నమః శివాయ ||
యఙ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై “య” కారాయ నమః శివాయ ||
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

OM NAMAH SIVAYA TELUGU PRAYER


ఓం శివయ ఓం శివాయ ఓం నమశ్శివాయ
చిదంబరాన చిరువనాన
నగరాజ తనయ నాన రత్న విభూషితయై
నటనమాడె నటరాజు నాగభూషణుని కూడి
శివజ్యోతి తత్వమై అఖండ జ్యోతియై అనంతమంత ఆక్రమించె
అర్ధనారీశ్వరియై సృష్టికి నాందిపలికె
ఆనంద స్వరూపునితో కూడి అంబ అమృతవర్షిణియై
శుద్ధ విద్యా సమన్వితుని శక్తియై ఙ్ఞానసముదాయినియై
మాయాశక్తిసంభూతిని మాయాశక్తియై కాలచక్రము త్రిప్పె
పంచాక్షరుని ప్రణవనాదమై శూన్యమెల్లనిండె
నటన సాగె శివ శక్తులేకమయి
పావన సురగంగ పరవళ్ళతొ పద్మముఖి పార్వతిపై ముత్యాలొలికె
భవుని నాగాభరణాలు భవాని కంఠాభరణాలతొ వింత వింత రంగులొలికె
వ్యాఘ్ర చర్మధారి కదలికలు మహా వ్యాఘ్రమై తోచె
కనకాంబరధారి కనక మణిమయ కాంతులతొ కలసిపోయె
మహా భయంకర ఢమరుక ధ్వనులను తన హస్తవిన్యాసములతొ శ్రుతి జేసె
శివకామసుందరి శివకామియై సుందరేశుని కూడి
అసురశక్తులను తనపాదముల నణచి నటనమాడే
వాణి వీణ మీట నారాయణుండు నాదమూద
బ్రహ్మ తాళమేయ నారదుని సామగానములొ
సుర గంధర్వ కిన్నెరాదులు వంతపాడ
సత్యం శివం సుందరమై నటనమాడె
ఓం నమశ్శివాయ ఓం శివాయ ఓం శివయ

ఓం నిధన పతయే నమ ! ఓం నిధన పతాంతికాయ నమః !! 
ఓం ఊర్దాయ నమః ! ఓం ఊర్ధలింగాయ నమః!!
ఓం హిరణ్యాయ నమః ! ఓం హిరణ్య లింగాయ నమః!! 
ఓం సువర్ణాయ నమః ! ఓం సువర్ణలింగాయ నమః!!
ఓం దివ్యాయ నమః! ఓం దివ్యలింగాయ నమః!! 
ఓం భవాయ నమః ! ఓం భవలింగాయ నమః !!
ఓం సర్వాయ నమః! ఓం సర్వలింగాయ నమః !! 
ఓం శివాయ నమః ! ఓం శివలింగాయ నమః !!
ఓం జ్వాలాయ నమః ! ఓం జ్వలలింగాయ నమః !! 
ఓం ఆత్మయ నమః! ఓం ఆత్మలింగాయ నమః !!
ఓం పరమాయ నమః ! ఓం పరమలింగాయ నమః
ఓం భవాయ దేవయ నమః ! ఓం శర్వాయ దేవాయ నమః !
ఓం ఈశానాయ దేవాయ నమః ! ఓం పశుపతయే దేవాయ నమః !!
ఓం రుద్రాయ దేవాయ నమః 1 ఓం ఉగ్రాయ దేవాయ నమః !!
ఓం భీమాయ దేవాయ నమః ! ఓం మహాతే దేవాయ నమః !!
ఓం భవస్య దేవస్య పత్న్యై నమః! ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః !!
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ! ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః !!
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ! ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః !!
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ! ఓం మహతో దేవస్య పత్న్యై నమః !!
(శివయ్య అభిషేక ప్రియుండు, ఆయనకు చేసే అభిషేక ఫలితాలు) 
శివుని శిరమున కాసిన్ని నీళ్లుజల్లి
పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేనువతడి గాడి పసర
మల్ల సురశాభి వానింట మల్లెచెట్టు
నెయ్యి - కీర్తి, ఆరోగ్యం
తేనె - తేజస్సు
చెరకు రసం - ధన సంవృధ్ది
పంచదార - దుఃఖ నాశనం
కొబ్బరి నీళ్ళు - సర్వసంపదలవృద్ది
భస్మజలం - మహాపాప వినాశం
నవరత్న జలం - ధనధాన్య బహుపుత్రలాభం
మామిడి పళ్ల రసం - చర్మవ్యాదుల నిర్మూలనం
పసుపు నీళ్లు - సౌభాగ్యం
నువ్వుల నూనె - అపమృత్యు భయ నాశనం
పుష్పోదకం - భూలాభం
బిల్వజలం - భోగభాగ్యాలు
రుద్రాక్షోదకం - ఐశ్వర్య ప్రాప్తి
గరిక, వట్టివేరు జలం - ధన కనక వస్తువాహనం

Sunday, 22 November 2015

LORD SIVA PRAYER IN TELUGU


మంత్ర జపంతో శివుడ్ని ప్రసన్నం చేసుకోండిలా

శివారాధన చేస్తే భోలాశంకరుని కరుణా కటాక్షాలు లభించి మనోసిద్ధి ఫలిస్తుందని పండితులు అంటున్నారు. ఇక్కడ ఇచ్చిన కొన్ని మంత్రాలు ప్రతి రోజూ రుద్రాక్షమాలతో జపిస్తే ఫలితముంటుందని వారు తెలిపారు.

జపం చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తర ముఖం వైపు కూర్చొని జపించాలి. జపం చేసేముందు శివుడ్ని బిల్వ పత్రాలతో పూజించాలి.

క్రింద పేర్కొనబడిన మంత్రాలను జపించి భోలాశంకరుని కృపకు పాత్రులవ్వండి...

** ॐ నమః శివాయ

** ప్రౌం హ్రీం ఠః

** ఊర్థ్వ భూ ఫట్

** ఇం క్షం మం ఔం అం

** నమో నీలకంఠాయ

** ॐ పార్వతీపతయే నమః

** ॐ హ్రీం హ్రౌం నమః శివాయ

** ॐ నమో భఘవతే దక్షిణమామూర్తయే మహ్యం మేధా ప్రయచ్ఛ స్వాహా

ఇలా మంత్ర జపం నియమ నిష్టలతో చేస్తుంటే తమరు అనుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయని పండితులు సూచిస్తున్నారు.

Monday, 16 November 2015

DHYARIDRA DAHANA SIVA STHOTRAM TELUGU PRAYER


దారిద్ర్యదహన శివ స్తోత్రమ్ 

విశ్వేశ్వరాయ, నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ,శశిశేఖర ధారణాయ,
గౌరిప్రియాయ,రజనీశ కళాధరాయ కాలాన్తకాయ,భుజగాధిప కంకణాయ
గంగాధరాయా,గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ,నమశ్శివాయ.
భక్తిప్రియాయ,భవరోగ భయాపహాయ ఉగ్రాయ, దుఃఖ భవసాగర తారణాయ,జ్యోతిర్మయాయ, గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖ దహనాయ,ననశివాయ.
చర్మాంబరాయ,శవభస్మ,విలేపనాయ ఫాలేక్షణాయ,మణికుండల మండితాయ.
మంజీరపాదయుగళాయ,జటధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ,నమశ్శివాయ.
పంచాననాయ,ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ,భువన త్రయమండితాయ.
ఆనందభూమి పరదాయ,తమోమయాయ దారిద్ర్యదుఃఖ దహనాయ,నమశ్శివాయ.
భానుప్రియాయ,భవసాగర తారణాయ కాలాన్తకాయ,కమలాసన పూజితాయ,
నేత్రత్రయాయ,శుభలక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ,నమశ్శివాయ.
రామప్రియాయ,రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ,నరకార్ణవ తారణాయ,పుణ్యాయ పుణ్యభరితాయ,సురార్చితాయ,దారిద్ర్యదుఃఖ దహనాయ,నమశ్శివాయ.
ముక్తీశ్వరాయ,ఫలదాయ,గణేశ్వరాయ గీతప్రియాయ,వృషభేశ్వర వాహనాయ,మాతంగచర్మ వసనాయ,మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ,నమశ్శివాయ.
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ ,
సర్వ సంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్థనమ్ .
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం,
సస్వర్గ మవాప్నుయాత్ .
ఇతి శ్రీవశిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రం సంపూర్ణమ్
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణు ర్విష్ణో శ్చ హృదయం శివః ॥
యథా శివమయో విష్ణు రేవం విష్ఞుమయ శ్శివః |
యథాఁన్తరం న పశ్యామి తథా మే స్వస్తి రాయుషి ॥
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయచ |
జగద్దితాయ కృష్ణాయ గోవిన్దాయ నమో నమః ॥

Friday, 13 November 2015

DHANDAYUDHAPANI STHUTHI - LORD SHANMUGAM PRAYER IN TELUGU


దండాయుధపాణి స్తుతి
చణ్డ పాపహర పాదసేవనం
గణ్డశోభి వరకుండలద్వయం
దణ్డితాఖిల సురారిమండలం
దణ్డపాణి మనిశం విభావయే

కామనీయక వినిర్జితాంగజం
రామలక్ష్మణకరాంబుజార్చితం
కోమలాంగమతి సుందరాకృతిం
దణ్డపాణి మనిశం విభావయే

దండాయుధపాణి అయిన సుబ్రహ్మణ్యుని స్తుతి ఇది. పాదాలను సేవించు భక్తుల తీవ్ర పాపాలను హరించేవాడు, చెవుల కుండలాల కాంతుల చెక్కిళ్లలో ప్రతిఫలించి ప్రకాసిస్తున్న రమణీయ వదనం కలవాడు, సమస్త రాక్షస సమూహాన్ని దండించే దండపాణి నిరంతర విశేషంగా భావిస్తున్నాను. మన్మధుని మించిన మంగళత్వం కలవాడు, రామలక్ష్మణుల చేత పూజింపబడినవాడు, కోమలాంగుడు, అతిసుందరమైన ఆకృతి కలవాడు అయిన దణ్డపాణిని ఎల్లవేళలా భావిస్తున్నాను.

Friday, 5 December 2014

GODDESS SRI SARADA STHOTRAM IN TELUGU


శారద స్తోత్రం

నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసినీ 
త్వామహం ప్రార్ధయే నిత్యం విద్యాదానంచ దేహి మే 
యా శ్రద్ధా ధారణా మేధా వాగ్దేదేవీ విధి వల్లభా 
భాక్తజిహ్వాగ్రసదనా సమాధిగుణదాయినీ
నమామి యమినీం నాదలోకాలంకృత కుంతలం
భవానీం భవసంతాపణ సుదానదీం
భద్రకాల్యై నమో నిత్యం సరస్వతయే నమో నమ
వేదవేదాంగ వేదాంత విద్యాస్థానేచ ఏవచ
పరబ్రహ్మ స్వరూపా పరమా జ్యోతి రూపా సనాతనీ
సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమ:
యయా వినా జగత్సర్వం మూకమున్మత్త వత్సతా
యాదేవీ వాగదిస్యాద్రి తస్య వాణ్యై నమో నమ:

Friday, 12 September 2014

LORD SRINIVA'S TELUGU PRAYERS / TELUGU SANKEERTHANALU COLLECTION


తిరుమలేశా తిరుమలేశా
తిలకించిన చాలు తీయ్యని తన్మయత్వము 

కను చూపులో కారుణ్యము 
చిరు నవ్వులో శరణ్యము
చేయి ముద్రలో అభయము
కరిగించెను కఠిన హృదయము
సప్తగిరుల శిఖరము అంచున
సాగించెను శ్రీనివాససంకీర్తనము

పాదసేవలో పాపం హరించి
పదసేవలో ప్రాణం పరవశించి
హరుని జఠాజఠమున ఎగిసిన
హరివిల్లుల పావన పద గంగై
కొండ కోనల నడయాడి
కొండలరాయుని కాళ్ళు కడిగి
కరుణాసాగారాన్ని చేరే గానము

Thursday, 11 September 2014

DURGA MATHA PRAYER IN TELUGU


శిలల తెచ్చి ఉలుల మలచి అమ్మ యందునా?
వెన్నవంటి మనసు మాట తలపకుందునా
వెలుగులీను దీప శిఖల అమ్మ యందునా
వెల్లివిరియు చల్లదనము వదలు కొందునా!
అంతు లేని నింగి చూచి అమ్మ యందునా
లేనిదాని కున్న దనము నిచ్చు కొందునా!
మంత్ర తతుల నాదగతులనమ్మ యందునా
అమ్మలోని శాశ్వతత్త్వ మెన్నకుందునా!
మంచుకొండ ముద్దుపట్టి అమ్మ యందునా
ఆమె అఖిలమాత యనుట పలుకకుందునా!
శివుని మేన అర్ధ భాగమమ్మ యందునా
నిత్య పూర్ణశక్తినిట్లు చీల్చు కొందునా!

Tuesday, 2 September 2014

LORD SIVA'S TELUGU POETRY





అగ్ని ముఖంబు పరాపరాత్మక మాత్మ, కాలంబు గతి రత్న - గర్భపదము

శ్వసనంబు నీ యూర్పు - రసన జలేశుండు, దిశలు కర్ణంబులు - దివము నాభి

సూర్యుండు కన్నులు - శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు - చదలు శిరము

సర్వౌషధులు రోమ - చయములు శల్యంబు, లద్రులు మానస - మమృతకరుఁడు

తే.గీ. ఛందములు ధాతువులు ధర్మ - సమితి హృదయ, మాస్యపంచక ముపనిష - దాహ్వయంబు

లైన నీ రూపు పరతత్త్వ - మై శివాఖ్య, మై స్వయంజ్యోతియై యొప్పు - నాద్యమగుచు.

NIRAKARA OMKARA - LORD SRI MAHADEV'S PRAYER


నిరాకారుడు (ఆకారము లేని వాడు), ఓంకారానికి మూలమైన వాడు, 


తురీయుడు (జాగ్రత్, సుషుప్త, స్వప్నావస్థలను దాటిన 


అత్యుత్తమమైన అవస్థ), 


గిరిపై నివశించే వాడు, పర్వతములకు అధిపతి 


అయిన పరమ శివునికి నమస్కారములు

Saturday, 4 January 2014

LORD VENKATESWARA SWAMY PRAYER



గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా

మత్స్యకూర్మా గోవిందా

మధుసూదన హరి గోవిందా

వరాహ నరసింహ గోవిందా
 
వామన భృగురామ గోవిందా

బలరామానుజ గోవిందా

బౌద్ధకల్కిధర గోవిందా

వేణుగాన ప్రియ గోవిందా

వేంకటరమణా గోవిందా

గోవిందా హరి గోవిందా

వేంకటరమణా గోవిందా

Sunday, 1 December 2013

SRI SIVA ASTATHORA SATA NAMA STHOTRAM


శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రము

శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః |
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ||

శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః |
శిపివిష్టో అంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః ||

భవశ్శర్వత్రిలోకేశ శ్శితికంఠశ్శివప్రియః |
ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః ||

గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః |
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః ||

కైలాసవాసీ కవచీ కఠోరత్రిపురాంతకః |
వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూలితవిగ్రహః ||

సామప్రియస్స్వరమయ స్త్రయీమూర్తిరనీశ్వరః |
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్ని లోచనః ||

హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః |
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ||

హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘః |
భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః ||

కృత్తివాసః పురాతనర్భగవాన ప్రమథాధిపః |
మృత్యుంజయ స్సూక్ష్మతను జగద్వ్యాపీ జగద్గురుః ||

వ్యోమకేశో మహాసేన జనకశ్చారువిక్రమః |
రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్నో దిగంబరః ||

అష్టమూర్తి రనేకాత్మా సాత్త్విక శ్శుద్ధవిగ్రహః |
శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః ||

మృడః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః |
భగనేత్రభిదవ్యక్తో దక్షాధ్వరహరో హరః ||

పూలదంతభిదవ్యగ్రో సహస్రాక్షస్సహస్రపాత్‌ |
అపవర్గప్రదో అనంతస్తారకః పరమేశ్వరః ||

|| ఇతి శ్రీ శివాష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణం ||


DWADASA JYOTHIRLINGAM STHOTRAM


ద్వాదశజ్యోతిర్లింగ స్తోత్రము

సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునమ్‌

ఉజ్జయిన్యాం మహాకాళం, ఓంకారం అమరేశ్వరం

వైద్యనాథం చితాభూమౌ, ఢాకిన్యాం భీమశంకరం

సేతు బంధేచ రామేశం, నాగేశం దారుకావనే

వారణాశ్యాంతు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీతటే

కేదారం హిమవత్‌ పృష్టే, ఘృశ్మేశం శివాలయే

ద్వాదశైతాని నామాని ప్రాతరుత్ధామయః పఠేత్‌

సర్వపాప వినిర్ముక్తః సర్వసిద్ధి ఫలం లభేత్‌ ||

SRI SIVA PATRA SMARANA STHOTRAM



శ్రీ శివప్రాతః స్మరణస్తోత్రమ్‌

ప్రాతః స్మరామి భవభీతిహరం సురేశం
గంగాధరం వృషభవాహన మంబికేశమ్‌ |
ఖట్టాంగశూల వరదాభయ హస్తమీశం
సంసార రోగ హరమౌషధ మద్వితీయమ్‌ ||

ప్రాతర్నమామి గిరీశం గిరిజార్ధదేహం
సర్గస్థితిప్రళయ కారణ మాదిదేవమ్‌ |
విశ్వేశ్వరం విజిత విశ్వమనోభిరామం
సంసార రోగ హరమౌషధ మద్వితీయమ్‌ ||

ప్రాతర్భజామి శివమేకమనంతమాద్యం
వేదాంతవేద్య మనఘం పురుషం మహాంతమ్‌ |
నామాది భేదరహితం షడ్భావశూన్యం
సంసార రోగ హరమౌషధ మద్వితీయమ్‌ ||

|| ఇతి శివప్రాతః స్మరణస్తోత్రం సంపూర్ణమ్‌ ||

SRI ARDHANARESWARA STHOTRAM


శ్రీ అర్థనారీశ్వర స్తోత్రం

చాంపేయగౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థశరీరకాయ 
థంమిల్లకాయై చ జటాదరాయ నమశ్శివాయై చ నమశ్శివాయ ||

కస్తూరికా కుంకుమచర్చితాయై చితారజః ప్రజ్ఞ విచర్చితాయ 
కృతస్మరాయైవి కృతస్మరాయ నమశ్శివాయై చ నమశ్శివాయ ||

ఝణత్వణకంకణనూరురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ 
హేమాజ్గదాయై భుజగాంగదాయ నమశ్శివాయై చ నమశ్శివాయ ||

విశాలనీలోత్పలలోచనాయై వికాసిపజ్కేరుహలోచనాయ
నమేక్షణాయై విషమేక్షణాయ నమశ్శివాయై చ నమశ్శివాయ ||

మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకిత కందరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశ్శివాయై చ నమశ్శివాయ ||

అంభోధరశ్యామలకుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశ్శివాయై చ నమశ్శివాయ ||

ప్రపంచసృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్తసంహారకతాండవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే నమశ్శివాయై చ నమశ్శివాయ ||

ప్రదీప్తరత్నోజ్జ్వలకుణ్డలాయై స్ఫురన్నహాపన్నగ భూషణాయ
శివన్వితాయై చ శివన్వితాయ నమశ్శివాయై చ నమశ్శివాయ ||

ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యాచ మాన్యో భువిధీర్ఘజీవీ
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాస్సదా తస్య సమస్తసిద్ధిః ||

|| ఇతి శ్రీ శంకరాచార్య కృతం అర్థనారీశ్వర స్తోత్రమ్‌ ||