WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Swimming Health Tips. Show all posts
Showing posts with label Swimming Health Tips. Show all posts

Wednesday, 16 December 2015

HEALTH WITH SWIMMING - TOP TEN HEALTH BENEFITS WITH SWIMMING


స్విమ్మింగ్‌ చేయడమన్నది చక్కటి వ్యాయామం.

 స్త్రీలు, పురుషులేకాక బాలబాలికలు కూడా ఈ రోజుల్లో స్విమ్మింగ్‌ నేర్చుకుంటున్నారు. కొన్ని పెద్దపెద్ద అపార్ట్‌మెంట్స్‌లో స్విమ్మింగ్‌ ఫూల్‌ను నిర్మిస్తున్నారు. కొన్ని హోటల్స్‌లో, ఫామ్‌హౌస్‌ల్లో ఈత కొలనులను నిర్మిస్తున్నారు. స్విమ్మింగ్‌వల్ల శరీరానికి చేకూరే ప్రయోజనాలేమిటో తెలుసుకోవడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యంనుంచే స్విమ్మింగ్‌ నేర్పిస్తున్నారు. అదేపనిగా గంటలతరబడి కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేయడం లేదా తలదించుకుని ఆఫీసులో రాసే రాతలవల్ల భుజాలు, చేతులు, నడుము, మెడలకు ఎక్కువగా అలసట కలిగి నొప్పి ఏర్పడి బాధపడవలసివస్తోంది. కండరాలు బిగుసుకుపోయినట్లవడం, ఎముకలు, భుజాలు, నడుంనొప్పికి నివారణ కలగాలంటే స్విమ్మింగ్‌ చేయడం మంచిది. స్విమ్మింగ్‌ చేయడంవల్ల ఎన్నెన్నో లభాలున్నాయి.

1. స్విమ్మింగ్‌ చేయడంవల్ల శరీరభాగాలన్నిటికీ కదలిక ఏర్పడి కండరాలకు, శరీరానికీ చక్కని వ్యాయామం ఏర్పడుతుంది.
2. శరీరాకృతి నాజూకుగా మారుతుంది.
3. నడుమునొప్పికి ఉపశమనం ఏర్పడుతుంది.
4. వెన్నుపాము, చేతులు, కాళ్లు, భుజాలు దృఢంగా తయారవుతాయి.
5. కండరాల వాపు తగ్గిపోతుంది.
6. మెదడు చురుకుగా పనిచేస్తుంది.
7. శరీరంలో నిలవవున్న కొవ్వు కరిగిపోతుంది.
8. రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.
9. స్థూలకాయం తగ్గుతుంది.
10. బరువును తగ్గించే శక్తి స్విమ్మింగ్‌కు ఉంది.