WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Telugu Poetry. Show all posts
Showing posts with label Telugu Poetry. Show all posts

Friday, 30 September 2016

FUNNY TELUGU POETRY



శ్రీనాధుడికి అరవ పిల్లలు అంటే, యెంత ఇష్టమో... హాస్య ధోరణిలో చెప్పిన
ఈ చాటువు చూడండి...
ఇదిగో, మీరు ఏమైనా తిట్టాలన్నా, ఇరికించాలన్నా ... శ్రీనాధుడినే పట్టుకోవాలి.
చదివే ముందు అదే నియమం.
.
మేత కరిపిల్ల; రణమున మేకపిల్ల
పారుబోతు తనమున పందిపిల్ల
ఎల్లపనులను చెరుపంగ పిల్లిపిల్ల
అందమున కోతిపిల్ల , ఈ అరవ పిల్ల
.
అరవం అంటే కరవం అనే కదా మీ భావన.
సంగీత త్రిముర్తులు మా ప్రాంతం వారే,
వ్యాకరణం రాసిన పరవస్తు చిన్నయసురి మా ప్రాతం ,

THANKS TO SRI Vinjamuri Venkata Apparao GARU FOR HIS ARTICLE

WOMEN LIFE TELUGU POETRY


నువ్వు ఒప్పుకోవడానికి కాదు నేస్త౦ . . . ! ! ! ( స్త్రీ జీవితం)
.
నీకై నేనున్నానని,
నీకోస౦ నే వస్తానని,
నీతో నే వు౦టానని,
నువ్విచ్చిన ఆ మాట ఓ నేస్త౦ ఏనాటి నీటి మూట.!
నన్ను నమ్మి౦చడ౦ నీ నేర్పు,
నిన్ను నమ్మడ౦ నా తప్పు,
భగవ౦తుడు నాకిచ్చిన శాప౦ ఈ ఓర్పు.!
అ౦త్య ప్రాసల ఆన౦ద౦ కాదిది,
అతి(వ)వాదపు ఆలాపన కాదిది,
అశ్రువులలో ఆవిరౌతున్న ఓ అతివ ఆవేదన ఇది.!
.
(మనకవితలు )

TRUE LOVE POETRY OF KRISHNA AND RADHA


అహా! ఆ కృష్ణుని వేణుగానం రాధికకి ఇలాగే వినిపించిందా?

(దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి కవిత)

ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల

పడిపోవు విరికన్నె వలపువోలె

తీయని మల్లెపూదేనె సోనలపైని

తూగాడు తలిరాకు దోనెవోలె

తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై

పరువెత్తు కోయిల పాటవోలె

వెల్లువలై పారు వెలది వెన్నెలలోన

మునిగిపోయిన మబ్బుతునుకవోలె

చిరుత తొలకరివానగా, చిన్ని సొనగ,

పొంగిపొరలెడు కాల్వగా, నింగి కెగయు

కడలిగా, పిల్లగ్రోవిని వెడలు వింత

తీయదనముల లీనమైపోయె నెడద

Wednesday, 25 May 2016

MY DEAR LOVE


వస్తున్నా ప్రియా...

నీలోనే నేను కలిసిపోవడానికై....

వేచి చూస్తున్నా ప్రియా...!

నీ ప్రేమ కోవెలలో కర్పూర హారతినై 

కరిగిపోవడానికై...!!


Sunday, 24 January 2016

JAJI MALLE POETRY IN TELUGU


శ్రీమతి Sasikala Volety గారు వ్రాసిన అద్భుతమయిన ఆటవెలది 'జాజిమల్లె' పద్యాలు చదివాక నాకు గుర్తుకొచ్చిన గతంలో నేను వేసిన బొమ్మలు. శ్రీమతి శశికళ గారికి ధన్యవాదాలు.
ఆ.వె
1.జాజి మల్లె బ్రతుకు జాలి గొలుపు నాకు
నోచుకొన వెపుడును నోము ఫలము
సందె పొద్దు వేళ శృంగారమౌ కాని
పగటి విరులు తప్ప, ప్రభువు కరుదు.
2. ఆడ పిల్ల నెప్పుడా జాజితో బోల్చి,
పంది రదియె వేయ , బలిమి కూడు.
జాణ యైన తాను, జాడించి బ్రతుకును
బేల యయిన, జాజి పూల తీరె.
3. మిగుల సంతసమున మేలుహారము జేరి
మురిసి పోవుచు నవి సరసి జేరు
భాగ్యవశమున నవి భగవంతు చేరినన్
చరిత మగును బ్రతుకు సఫలమగును.
4. సన్నజాజి చూడ చక్కనమ్మను బ్రోలు
రాతిరందు తరలు, రమణి సిగకె
సున్నితంపు సొగసు చూడ మరులు గొల్పు,
కొన్ని ఘడియ లున్న కూర్చు తావి.
5. విరిసి విరయ కుండు విరజాజి పూతాను,
వెల్లి విరిసి పంచు విరివి తావి
భువిని కురిసి మురియు విరితారలను బోలి,
ఫక్కుమనుచు నవ్వు పడతి వోలె.
6. విశ్వమందు భూరి గుణగణాలెన్నియో,
సన్నజాజి విరికి సరికి బోల,
జాజి పూవు నిలుచు సౌందర్య , సుకుమార
కుసుమమై, సుగంధ కోమలి వలె!
7. ఆ,వె
సన్నజాజి కెపుడు , సంతసంబేయగు
విరియ జాజి కెపుడు ,విసుగు రాదు
పరిమళాలు నింపు పడతుల శిగలందు
విస్తు పోవు విరహ వేళలందు.


THANKS TO SRI PVR MURTHY GARU FOR HIS ARTICLE

LOVE U DEAR TELUGU POETRY


మురిపించే అందాలే అవి నన్నే చెందలే.!

(కవిత రాసింది ...Sri.Acharya Gowtham Manohya..గారు)

కొన్ని (అంది, అందని)అందాలను, 

అందమైన అనుభవాలను ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేం.
చిన్ననాటి జ్ఞాపకాలు
అమ్మచేతి గోరుముద్దలు
కన్నెపిల్లల వాలు చూపులు
తొలిరాత్రి తమకాలు.
ఇలా, మధురమైన కొన్ని సంఘటనలు వాటి తాలుఖు జ్ఞాపకాలు, అజన్మాంతం మన స్మృతి పథంలో మెదులుతూ అనునిత్యం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.
ఇటువంటి మధురమైన జ్ఞాపకాల్లో
తోలిరేయిది ఓ మధుర ప్రస్థానం.
ఏదో జరుగుతుందని మరేదో జరగబోతుందని ఇంకేదో జరగాలని
ఓ కన్నెపిల్ల పడే ఆరాటం. తన కన్నుల్లలోని తమకం. విచ్చుకునే పెదవులు, బిగుసుకునే నడుము, నాట్యమాడే ఊహలు wowww ఆ అందం... ఆ ఆరాటం... ఆ అతిశయం,
అంతా ఇంతా కాదు.
నిజానికి ప్రతీ స్త్రీ జీవితంలోను ఇదో మధురమైన సన్నివేశం.
తనువు మనసు ఏకమై, తమకంలో తరించిపోయే భావావేశం
అప్పటివరకు ఆమో వికసిస్తున్న
గులాబీ మాత్రమే. విచ్చుకుంటున్న ఆమె (పూ)రేఖులకు పరిపూర్ణమైన యవ్వన, సుఖాన్ని... రుచి చూపించే తియ్యని రేయది.
పొద్దుతిరుగుడు పువ్వులాగా
మగడి, కౌగిలింతలో ముడుచుకు పొయ్యే మతైన క్షణమది.
తాకిళ్ళతో మొదలై,
తను మథనంతో వేడేక్కి
ఇరు స్పర్శల మైకంతో,
సన్నని చిరుజల్లులా
గాడాలింగన చుంబనాలతో
మధుపెదవుల పంటిగాట్లతో
ఆపాదమస్తకం పులకించి పరవశించిపోతూ శృంగార మాలికలా ప్రేమామృత దీపికలా అణువణువు అల్లుకుపోయే
మహాద్భుత సన్నివేశమది.
యస్..
అతడు కొరకాలి, ఆమె ఆపాదమస్తకం కొరకాలి, సన్నని తన పంటిగాట్లు ఆమె అణువణువునా వికసించాలి.
నిమిషంలోనో రెండు నిమిషాలలొనే ముగించేది కాదు. ప్రణయ కార్యమంటే!
ఆమె తనువూ, మనసు ఏకమై
పురివిప్పిన మయూరంలో, ఉప్పొంగే వెల్లువలా,
తియ్యని ఆ తాక్కిళ్లకు, వెచ్చని ఆ కౌగిలింతలకు ఆమె కన్నులు
అరమోడ్పులై, ఆమెలోని
అణువణువు, అంగాంగమూ
వికసించి విరబూసే వరకు
ఆమె కరములు వీడక,
నడుమును వదలక,
మనసెరిగిన మన్మధునిలా
అలుపెరగని శ్రామికునిలా
మాటల మత్తుతో
చేతల బిగువతో
నిజమైన స్నేహితునిలా
మేసులుతూ, ఆమె తనువును, మనసును ఏకకాలమందు ,సొంతం చేసుకొని.
నిస్వార్దమైన మమమతో,
సరిసమానమైన గౌరవంతో, భాద్యతాయుతమైన ప్రేమతో
మత్తుగా.. లాలించే... మగవాణ్ణి
తదనుగుణంగా నడుచుకునే స్త్రీని ఎవరు మాత్రం మర్చిపోగలరు. మరేవరు మాత్రం విడిచి ఉండగలరు!

Friday, 13 November 2015

KODALA KODALA KODUKU PELLAMA - TELUGU VILLAGE POETIC SONG


కోడలా కోడలా కొడుకు పెళ్ళామా!
(ఊరి భావి కాడ...అత్తాకోడళ్లు....శ్రీదామెర్లవారిచిత్రం..)

"కోడలా కోడలా కొడుకు పెళ్ళామా 

పచ్చిపాల మీద మీగడలేవి?

వేడిపాల మీద వెన్నల్లు యేవి?

నూనెముంతల మీద నురగల్లుయేవు?"

"అత్తరో ఓయత్త ఆరళ్ళయత్త

పచ్చిపాలమీద మీగడుంటుందా?

వేడిపాల మీద వెన్నలుంటాయా?

నూనె ముంతల మీద నురగలుంటాయా?"

"ఇరుగు పొరుగులార! ఓ చెలియలార

అత్తగారి ఆరళ్ళు చిత్తగించరా?

పెత్తనం లాగేస్తే పేచీలుపోను

ఆరళ్ళ అత్తయిన సవతి పోరయిన

తల్లిల్లు దూరమైన భరియించలేము."

Saturday, 7 November 2015

SRI KALAHASTHESWARA SATAKAM AND MEANING


శ్రీ కాళహస్తీశ్వర.!
.
మును నేపుట్టిన పుట్టులెన్నిగలవో మోహంబుచే నందు చే
సిన కర్మంబుల ప్రోవు లెన్నిగలవో చింతించినంగాని, యీ
జననంబేయని యున్నవాడ నిదిటే చాలింపవే నిన్ను గొ
ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై శ్రీ కాళహస్తీశ్వరా!
.
శ్రీ కాళహస్తీశ్వరా!నేనిప్పటికి ఎన్ని జన్మలెత్తినానో,
వాటిలో అజ్ఞానముచే ఎన్ని దుష్టకృత్యములు చేసితినో నాకు తెలియదు
.ఇదియే నాకు చివరి జన్మ అని భావిస్తున్నాను.
ఈ జన్మలో నిన్ను సేవించిన పుణ్యముతో
పూర్వపు జన్మలలో చేసిన పాపములన్నియునూ
తొలగిపోవునట్లు నన్ను అనుగ్రహించుము.

THREE GREAT POETS OF TLEUGU POETRY - BRIEF INFORMATION IN TELUGU


మన కవి త్రయం.
.
నన్నయ తెలుగువారి ఆదికవి,వేదాధ్యాయ సంపన్నుడు,శబ్దశాసనుడు,,వేదవేదాంగివిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి మరియు వాగమశాసనుడు .
.
ఆదికవి నన్నయ్య గారి ముందు నూయ్య వెనుక గోయ్యా పోలు పద్యం..
చంపకమాల:
"ఇది ప్రళయాగ్నివోలె దెస లెల్లను గప్పఁగ విస్ఫులింగముల్:
వదలక వాయుసారథి జవంబున దా నిట వచ్చె నేమిసే:
యుదు సుతులార యీబిలము నొయ్యన పోయి చొరుండు దీనిఁ గ:
ప్పెద ఘనపాంసుజాలముల భీమశిఖావళి దాఁకకుండగన్:."
అర్థము:
ఓ పుత్రులార| ఈ కార్చిచ్చు అన్ని దిక్కుల నుండి క్రమ్ముకు వస్తుంది, ప్రళయ కాలంలో చెలరేగే విధంగా వాయువునే సారధిగా కలిగిన ఆ అగ్నిదేవుడు మనను కబళించడానికి వస్తున్నాడు
. ఈ అగ్ని బారినుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఈ బిలము నందు దూరండి, నేను దానిని దట్టమైన ధూళి సమూహముచేత కప్పివేస్తాను
..
తేటగీతి
" బిలము సొచ్చితిమేని నందెలుక చంపు:
నింద యుండితిమేనిఁ దా నేర్చు నగ్ని:
యెలుకచే జచ్చుకంటె నీ జ్వలనశిఖలఁ:
గ్రాగి పుణ్యలోకంబులఁ గాంతు మేము:."
అర్థము: బిలములో దూరితే అందుగల ఎలుక చేతిలో చచ్చెదము, ఇక్కడే వుంటె అగ్నిలో మాడిపోయెదము. ఎలుక చేతిలో చచ్చే కన్న అగ్నిలో ఆహుతి కావడం వలన పుణ్యలోకాలనైన పొందెదము..
.
తిక్కన జీవిత కాలం 1205 - 1288. విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిధ్దికి మంత్రిత్వం వహించారు. తిక్కన నిర్వచనోత్తరరామాయాణాన్ని రచించి మనుమసిధ్దికి అంకితమిచ్చారు.
.
భారత రచన
మహాభారతములో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను తిక్కన రచించాడు. ఆదికవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగము రచించి గతించిరి. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన రచించాడు. తిక్కన అరణ్యపర్వమును వదలి, మిగిలిన పర్వములు రచించిరి. ముందుగా యజ్ఞము చేసి, సోమయాజియై, పిదప ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. వ్యాస మహర్షి భారత రచన చేసేసమయంలో గణపతి లేఖకుడు. అదే విధంగా తిక్కన సోమయాజికి గురునాధుడు లేఖకుడు. శైలి అలతి అలతి పదముల అనల్పార్థ రచన కావించిన మహాకవి తిక్కన. తాను రచించిన 15 పర్వాల భారతాన్ని ప్రబంధమండలిగా పేర్కొని, నాటకీయ శైలిలో , నానారసాభ్యుదయోల్లాసిగా రచించాడు. కవిత్రయములో నన్నయది కథాకథన శైలి. ఆఖ్యాయిక శైలి. తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి.
.
తిక్కన్న పద్యాలు
ద్రౌపది కీచకునితో
"దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురత్
గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం
ధర్వుల్ మానము బ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా"
ఉత్తర గోగ్రహణ సమయమున ద్రోణుడు
.
:సింగంబాకటితో గుహాంతరమునన్ జేర్పాటుమై యుండి మా
తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతార నివాస ఖిన్న మతి యస్మత్ సేనపై వీడె వ
చ్చెం గుంతీ సుత మధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్"

Monday, 29 December 2014

LIFE IS BEAUTIFUL


" జీవితం ఒక అవకాశం అయితే...!
దాన్ని వొదలకండి...!
ఒక బాధ్యత అయితే...!
నెర వేర్చండి ...!
ఒక ఆశయం అయితే...!
సాధించండి...!
ఒక శోకమైతే...!
తట్టుకోండి...!
ఒక పోరాటం అయితే...!
జయించండి...!
ఒక పయనం అయితే...!
సాగిపోండి "...!


Saturday, 20 December 2014

LOVE AND RELATIONS POETRY IN TELUGU


అర్చింపచేసుకోవాలని 
ఏనాడైనా అనుకున్నానా..
వెలకట్టలేని ఈ ఆభుషితాలు 
కావాలని అడిగానా..
అవేవీ కూడా 
నా మనసును చేరలేవు
అవన్నీ ఒట్టి ఆకర్షణలే!

రాళ్ళతో ఆడుతున్నానని
ఆ రాళ్ళపై- రాళ్ళే కదాని
ఎంతటి చిన్న చూపు నీకు
వాటిని నీ వెలకట్టలేని
అభూషితాలతో పోల్చి
హేళన చేస్తావు కదా...
నీవులేని సమయాన
అవే నాకు తోడుమరి!

ఇలను పూచిన పూవులతో
చెలిమి చేసేదానను..
నువ్వు తెచ్చిన నెలవంకను కాదని
ఆ పూలతో చెలిమి చేస్తున్నా
అనే కదా వాటిపై నీకింత కినుక
అలనాడు...
అలసిన నన్ను పోల్చింది ఆ
సంధ్యకు వాడిన పూవుతోనే కదా..
ఇంతలోనే ఎంత చిన్న చూపు
ఆ పూవుపై నీకు!

అర్థంలేని పొగడ్తల అగడ్తలలో నన్ను నేను
వెతుక్కునేలా చేసింది ఎవరు?
కమనీయ కల్పనల కవనసీమని
చూపిన నూవ్వే నన్ను వదిలి
పోయావు అర్ధం లేని
అర్ధశాస్త్ర కోవిదానికి
ఆ ధనం నవ్వుతున్నట్లుంటుంది
నువ్వు లేని నన్ను చూసి!

అనురాగమయిని చేసిన నువ్వే_
ఆటలాడుతున్నా అంటున్నావు..
కరడుగట్టిన నీ హృదిలో
కరుణ రేపిన "కల" ను
ఊసులాడాలని చెప్పి,
కడలి అడుగుకీ, ఆకాశం అంచులకీ
వెళ్ళటం ఏమార్చడమేగా..
నన్ను వదిలి నాకోసం వెళ్ళటం
"మనకోసమా"? ...

బంధాలు సంకెళ్ళని
బలహీనం చెసుకుంటున్నది నీవు..
బాధ్యతా,బరువులు తో
నన్ను మరచిన నేను
ఇహలోకాన్ని వీడి,
ఆకసపుటంచులకి ఏగటం అవసరమంటావా
ఇహంలో ఒకరికొకరం అన్న త్రుప్తి మిగుల్చుకోలేని
మనకి ఎందుకీ అర్భాటపు జీవితాలు!

బీడుభూమైనా, గడ్డిపూవైనా,గులకరాళ్ళయినా
ఇలలోని ఆనందంనందనందనమే
మనసుకి ఇష్టం.
అర్ధంలోనే బ్రతుకు అర్ధమున్నదని
అనుకుంటే..
మన మధ్య వున్న బంధానికి సయితం విలువలేదుగా..
ఈ బంధాలు అనుబంధాల మద్య
ఏమున్నదో తెలియదా నీకు -
మన "అనురాగం" ఈనాటిది కాదని
ఎన్నటికీ వుండాలని
అది "ఆత్మబంధమై" వుండాలన్నదే
కదా నా కోరిక.. @తులసి

Friday, 12 December 2014

ANDHELU RAVALI TELUGU POETRY


" అందెలకు అలంకారమె వద్దనిపించే నా చెలి పాదం..!
" బాపు రవి వర్మలకు అందని ఆ రూపం..
" ఇన్ని' అద్భుతాల కలయిక నువ్వే నా చెలి...!
" నా కలలకు మూలం నువ్వే.. నా జీవం.. నా ఉపిరి నువ్వె
" నా కనులకు కునుకు లెకుండా చేసింది ' నువ్వే.., 
" గువ్వంత గుండెలో ఇన్నాళ్లూ రవ్వంత సవ్వడి రాలేదు చెలి.. !
" మువ్వలా సందడిగా అలజడి రేగే ఎందుకో ' సఖి...!
" నీ కాలీ అందియల ఝంకారమా అది....?
" కనపడని నా ప్రాణం కనిపించే నిలువెత్తు రూపంగా మారింది...!
" తనెవరో కాదు అది నువ్వే సఖి...నా ప్రేయసి నెచ్చెలి 
" కృతజ్ఞతలు తొ .... మీ ., * మధు శర్మ. * !

NEE ROOPAM POETRY IN TELUGU


నీ "రూపం" తో నాలో "దీపం" ను వెలిగించి ,
నీ "స్నేహం" తో నాలోని "ఆహం" ను పెకిలించి,
నీ "సలహాల" తో నాలోని "కలహాల" ను తొలగించి ,
నీ "చెలిమి" తో నా లోని " బలిమి" ని కలిగించి,
నీ "మాటల" తో నాలో "పాటల" ను మ్రోగించి,
నీ "నవ్వుల" తో నాలో "పువ్వుల" ను పూయించి,
నీ "మనస్సు" తో నాలో ఆనంద "సరస్సు" ను సృష్టించి ,
నీ "తోడు " ని నా వెంట "నీడ" లా పంపించి,
నీ "స్థైర్యం" తో నా లో " దైర్యం" ను రగిలించి,
శిల లా ఉన్న నన్ను శిల్పాన్ని చేసి,రోగి ల ఉన్న నన్ను యోగి ని చేసి,
ఏ ఆశ లేని నాకు ఆశలను కల్పించి,నా జీవితాన్ని నిత్య వసంతం చేసి,
అన్ని చేసి , చివరకు నన్ను ఒంటరిని చేసి వెళ్ళావ్ నేస్తం..

Monday, 22 September 2014

A SAILENT LOVE STORY


ప్రేమించిన వాడు పిరికి వాడై...
అనుమానపు తెరలలో ప్రియురాలిని దూరం
చేసుకుంటే...
మరొకరి ఇల్లాలైన ఆ అమ్మాయి...
మౌన వేదన...

ఎ సైలెంట్ లవ్ స్టోరీ ఆప్ ఎ రైన్ డ్రాప్ .....

వాగులు వంకల్లో...
రాళ్ళ దెబ్బలతో నీకోసం పరుగులతో...

కొన ఊపిరితో...
నిట్టూర్పుల సెగలో ఆవిరై నేనొస్తే...
పిల్లగాలి తగిలిందని నన్ను జారవిడుస్తావా...
నీ ఎదురుచూపుల నిశ్శబ్దం నన్ను హోరెత్తిస్తున్నా...
ముత్యపు గుహలో బందీనైన నేను ....
ఇక నిన్నెప్పటికీ చేరలేను...
ఈ మాట నీకు తెలుపలేను...!!!సుభా.....

Thursday, 18 September 2014

SUCCESS AND FAILURE - TELUGU POETRY


రాలే తారల సవ్వడిలో
మధురమైన రాగాలు వినపడుతాయి
బండరాయి గుండెలపై 
జీవం అంకురార్పణ సాధ్యపాడుతుంది
పసుప్ప్పచ్చటి ఆకుల మధ్య
కాటుక పులుంకున్న రాతిరి నడుమ
వసంతపు హరిత కువకువలు
ఎర్రెర్రని అరుణిమలూ కనపదుతాయి
కరిగిపోయిన కలల వ్యధల రోధనలు
మదిని చీల్చి కళ్ళలో నీరై నాట్యమాడుతున్నా
ఓటమి లేదు, నిరాశ లేదు
నిస్పృహ లేనే లేదు
ఓటమి ఓడేది ఓటమిని అంగీకరించనపుడే
అసాధ్యం సాధ్యమయ్యేది అలోచనతోనే
కాలం నుదిటిపై రాతలురాయాలి
ఓటమి గెలుపు అన్నీ మన అంగీకారంలోనే .

Monday, 1 September 2014

A TRIBUTE TO BAPU RAMANA CARTOONS



పున్నమి కలువలు..

మన బాపూ రమణలు 

బాపూ గారికన్నా బాపు బొమ్మలు తెలుసు

ముళ్ళపూడి రమణగారి కన్నా , బుడుగు అల్లరి తెలుసు..

వారిద్దరి కన్నా, వారి స్నేహానుబంధపు అనురాగం తెలుసు..
 
ఇద్దారూ తిరిగి కలుసుకున్న వేళ...అందరూ బాధపడుతున్న వేళ 

మన మనస్సుల్లో నిలిచే ఉంటారు అనుకునే వేళ..