WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Karthikamasam Special Articles. Show all posts
Showing posts with label Karthikamasam Special Articles. Show all posts

Saturday, 28 November 2015

SRI KARTHIKAPURANAM - KARTHIKAMASAM STORY IN TELUGU


వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి జనకమహారాజా! నీవు అడిగిన ప్రశ్న నిజమైనదే. నేను వేదవేదాంగములను కూడా పఠించాను. వానిలో కూడా సూక్ష్మమార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అనే ధర్మాలు మూడు రకాలు. సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమ కూడిన సమయమున సత్యమను గుణము పుట్టి ఫలమంతయును పరమే శ్వరునికి అర్పించి, మనస్సునందు ధర్మాన్ని పాటించిన ఆ ధర్మము ఎంతో మేలు చేస్తుంది. సాత్విక ధర్మము సమస్త పాపాలను తొలగించి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖాలను సమకూర్చును.
ఉదాహరణకు తామ్రపర్ణి నది యందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు నీరు పడినచో ధగాధగా మెరిసి, ముత్యమగు విధంగా సాత్వికత వహించి, సాత్విక ధర్మాన్ని ఆచరించుచూ గంగా, యమునా, గోదావరి, కృష్ణానదుల పుష్కరాలు మొదలగున్న పుణ్యకాలాలలో దేవాలయాలలో వేదాలు పఠించి, సదాచారపరుడైన, గృహస్థుడైన బ్రాహ్మణునకు ఎంత చిన్న దానము చేసినా, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయాలలో జపతపాదుల్ని చేసినా విశేష ఫలాన్ని పొందుతారు. 

రాజస ధర్మమమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త ధర్మాలను వీడి చేసిన ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగిస్తుంది. దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసో, తెలియకో ఏ చిన్న ధర్మాన్ని చేసినా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అనగా పెద్ద కట్టెల గుట్టలో చిన్న మంట ఏర్పడినా మొత్తం భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామాన్ని తెలిసిగానీ, తెలియ కగానీ తలచినచో వారి సకల పాపాలు పోయి ముక్తి పొందుతారు. దానికి ఓ చిన్న కధ కలదు.

అజామీళుని కథ : పూర్వ కాలంలో కన్యాకుబ్జమను నగరంలో నాలుగు వేదాలు చదివిన ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి ఎంతో గుణవంతురాలైన హేమవతి అనే భార్య కలదు. ఆ దంపతులు ఎంతో ఆదర్శంగా నిలిచి అపూర్వ దంపతులని పేరు పొందారు. వారికి చాలా కాలానికి లేకలేక ఓ కుమారుడు జన్మించాడు. వారు అతడిని ఎంతో గారా భంగా పెంచుతూ అజామీళుడని పేరు పెట్టారు. ఆ బాలుడు పెరుగుతూ అతి గారాభం వల్ల పెద్దల మాటను కూడా వినక, చెడు స్నేహాలు చేస్తూ, చదువును నిర్లక్ష్యము చేసి, బ్రాహ్మణ ధర్మాలను పాటించక తిరుగుచుండెను. కొంత కాలానికి యవ్వనము రాగా కామాంధుడై, మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతమును వీడి, మద్యము తాగుచూ, ఒక ఎరుకల జాతి స్త్రీని మోహించి ఆమెతోనే కాపురం చేయుచుండెను. ఇంటికి కూడా పోకుండా ఆమె ఇంటనే భోజనం చేయుచుండెను. అతి గారాభం ఎలా చెడగొట్టిందో వింటివా రాజా! తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నా చిన్ననాటి నుండి సక్రమంగా పెంచకపోతే ఈ విధంగానే జరుగుతుంది. కాబట్టి అజామీళుడు కులాన్ని వీడడంతో అతని బంధువులు అతడిని విడిచి పెట్టారు.

అందుకు అజామీళుడు కోపంతో వేట వలన పక్షులను, జంతువులను చంప ుచూ కిరాతక వృత్తిలో జీవిస్తున్నాడు. ఒకరోజున ఈ ఇద్దరు ప్రేమికులు అడ విలో వేటాడుచూ కాయలను కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనె పట్టును తీసుకోబోతుండగా కొమ్మ విరగడంతో ఆమె చనిపోయింది. అజామీళుడు ఆ స్త్రీపై పడి కొంత సేపు ఏడ్చి, తరువాత అక్కడే ఆమెను దహనం చేసి ఇంటికి వెళ్ళెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఓ కూతురు ఉంది. కొంత కాలానికి ఆ బాలిక పెరిగి పెద్దైనాక కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామీళుడు ఆ బాలికతో కాపురం చేయుచుండెను.

వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగారు. ఆ ఇద్దరు పుట్టగానే చనిపోయారు. మరల ఆమె గర్భము ధరించి ఒక కొడుకును కన్నది. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచూ ఒక్క క్షణమైనా విడువక, ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకుని వెళ్తూ, నారాయణ, నారాయణ అని ప్రేమతో పెంచు కుంటున్నారు. కాని నారాయణ అని తలచినంతనే ఎటువంటి పాపాలైనా తొలగి పుణ్యాన్ని పొందవచ్చని వారికి తెలియదు. ఇలా కొంత కాలము జరిగిన తర్వాత అజామీళుడు అనారోగ్యంతో మంచం పట్టి చావుకు సిద్ధంగా ఉండెను. ఒకనాడు భయంకర రూపాలతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైనారు. వారిని చూచి అజామిళుడు భయంతో కొడుకుపై ఉన్న ప్రేమతో నారాయణా, నారాయణా అంటూ ప్రాణాలను వదిలెను. అజామిళుని నోట నారాయణా అన్న మాట వినగానే యమ భటులు గజగజ వణకసాగిరి.

అదే సమయానికి దివ్యమంగళాకారులు, శంకచక్ర గదాధారులైన శ్రీమన్నారాయణుని భటులు కూడా విమానంలో అక్కడకు వచ్చారు. ఓ యమ భటులారా వీడు మావాడు. మేము ఇతన్ని వైకుంఠమునకు తీసుకువెళ్తాం అని చెప్తూ అజామిళుడుని విమానమె క్కించి తీసుకొని పోవడానికి సిద్ధమవ్వగా, యమదూతలు అయ్యా! మీరు ఎవరు? అతడు దుర్మార్గుడు.ఇతన్ని నరలోకా నికి తీసుకువెళ్ళడానికి మేము వచ్చా ము. కాబట్టి మాకు వదల మని కోరగా, విష్ణుదూతలు ఇలా చెప్పసాగెను.

KARTHIKA MASAM DEEPARADHANA MAHATYAM


ఏ మానవుడు కార్తీక మాసమంతయూ దేవలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును.దీపదానుము చేయుట యెట్లనగా పైడిప్రత్తి తానే స్వయముగా తీసి, శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గానీ, గోధమపిండితో గాని ప్రమిద వలే చేయవలెను. ఆ ప్రమిదలో ఆవునేతితో తడిపిన వత్తులు వేసి, దీపమును వెలిగించి దానిని బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమునందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి, బంగారముతో వత్తిని చేయించి, ఆవునెయ్యి నిండుగా పోసి రోజూ చేస్తున్న ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపమును వెలిగించి ఈనెల రోజులూ దానమిచ్చిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమివ్వాలి. ఇలా చేసిన యెడల సకలైశ్వర్యములు కలుగుటయేకాక మోక్షప్రాప్తి కూడా సిద్ధించును.

దీప దానము చేయువారు ఇట్లా వచింపవలెను.
శ్లో: సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ....అని స్తోత్రం చేసి దీపదానము చేయవలెను. దీని అర్థమేమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగుజేయునదియు, సకల సంపదల నిచ్చునదియు అగు ఈ దీపదానమును చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక! అని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తిలేని యెడల పదిమంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు గానీ, స్త్రీలు గానీ, ఏ ఒక్కరు చేసినా సిరిసంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్‌వృద్ధి కలిగి సంతోషముగా ఉందురు. దీని గురించి ఒక ఇతిహాసము కలదు.
లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట: పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్ళి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుతే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచూ, వారి ఇండ్లలోనే భుజించుచూ, యజమానులు సంతోషముతో ఇచ్చిన వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచూ ఆ విధముగా వచ్చిన సొమ్మును అధిక వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బు కూడబెట్టుకొనెను 

దొంగలు తీసుకువచ్చిన దొంగ వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముచూ కూడా ధనమును కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడ బెట్టిన ధనమును వడ్డీలకిస్తూ, శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచిచేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించినా ఏమి? ఆమె ఒక్క రోజు కూడా ఉపవాసము గాని, దేవుడుని మనసారా ధ్యానించుట గాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థ యాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి, యే ఒక్క బిచ్చగానికీ పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటుల కొంత కాలము జరిగెను.

ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని, ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె వద్దకు వెళ్ళి 'అమ్మా! నా హితవచనము ఆలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకించుము. మన శరీరములు శాశ్వతము కావు. నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి, దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడుత దానిని దినేద్దామని భ్రమించి, దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాటలాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దానధర్మము చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి రోజూ శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మొక్షమును పొందుము. నీ పాప పరిహారార్ధముగా, వచ్చే కార్తీక మాసమంతయూ ప్రాత:కాలమున నదీ స్నానమాచరించి, దానధర్మాలు చేసి, బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవు' అని ఉపదేశమిచ్చెను. ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచూ కార్తీక మాసం వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమును పొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహాత్మ్యం ఉన్నది.

INFORMATION ABOUT KARTHIKAMASAM - SOMAVARAM VRATHAM IN TELUGU


హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.
ఈ వారంలో ముత్తయిదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీముహూర్తమున స్నానమాచ రించి హరహరశంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం. దీనినే కార్తీక నత్తాలు అంటారు.

సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తిచేసుకుని, పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం ద్వారా నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యా లతో వర్ధిల్లుతారని విశ్వాసం.
నోములన్నింటిలోకి కార్తీక సోమవారం నోము విశిష్టమైనదిగా చెప్పబడింది. ఈ నోము మహిమను చాటే కథ గురించి తెలుసుకుంటే, స్త్రీలంతా ఈ నోము పట్ల ఎందుకు ఇంతటి శ్రద్ధాసక్తులను చూపిస్తున్నారనేది అర్థమవుతుంది.

పూర్వం శతకోటి అనే ఒక బ్రాహ్మణ కన్య అందచం దాలతో తనకి సాటి మరొకరు లేరనిపించుకుంది. అయితే ఆమె ఎవరింటికి వెళితే ఆ ఇంటి వాళ్లకి వెంటనే ఏదో ఒక నష్టం జరిగేది. దాంతో ఆమె ఎక్కడ వుంటే అక్కడ దరిద్రం తాండవ మాడుతుందనే ప్రచారం జోరుగా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె అందచందాలకు ముగ్దుడైన ఓ శ్రీమంతుడు, ఎవరెన్ని చెబుతున్నా వినిపించుకోకుండా శతకోటిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ శ్రీమంతుడు చేస్తోన్న అన్ని వ్యాపారాల్లోను నష్టాలు రావడంతో, ఏడాది తిరిగేలోగా అతను దివాలా తీశాడు. ఈ విషయంగా అత్తారింటి వారు తీవ్రంగా వేధిస్తూ ఉండటంతో ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది. 

సరిగ్గా ఆసమయంలోనే పార్వతీ దేవి ప్రత్యక్షమై ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుంది.
శివుడు ఐశ్వర్య కారకుడనీ, ఆయన అనుగ్రహం కోసం కార్తీక సోమవారపు నోము నోచుకోమని శతకోటితో పార్వతీదేవి చెప్పింది. ఈ నోము ఫలితంగా ఆమె ఎక్కడుంటే అక్కడ సిరిసంపదలు ఉంటాయని అంది. దాంతో శతకోటి మనసు మార్చుకుని ఇంటికి వచ్చి కార్తీక మాసం రాగానే సోమవారం నోము పట్టింది.
ఉదయాన్నే నదీ స్నానం చేసి ... నదిలో నుంచి తీసిన మెత్తని మట్టిలో శ్రీ గంధాన్ని - పాలని కలిపి శివలింగాన్ని తయారు చేసింది. 108 సార్లు పంచాక్షరీ మంత్రాన్ని స్మరిస్తూ ఆ శివలింగాన్ని అర్చించింది. ధూప .. దీప .. నైవేద్యాలను సమర్పించిన తరువాత, ఆ శివలింగాన్ని ఓ బ్రాహ్మణుడికి దానమిచ్చింది. దాంతో అప్పటి వరకూ ఆమెను వెంటాడిన దోషం తొలగి పోయింది.

అందానికి అదృష్టం ... ఐశ్వర్యం తోడు కావడంతో, అందరూ ఆమెను గౌరవించడం ... అభిమానించడం మొదలు పెట్టారు. నోము ఫలితంగా సంపదలన్నీ తిరిగి సమకూరడంతో అత్తగారింట్లో వారంతా కూడా ఆమెపై ప్రేమాభిమానాలు కురిపిస్తూ అపురూపంగా చూసుకోసాగారు. తన పరిస్థితికి కారకులైన ఆది దంపతులకు మనసులోనే శతకోటి కృతజ్ఞతలు తెలియజేసింది.

KARTHIKA MASAM SIVA PUJA INFORMATION - SIVA SHADKSHARA STHOTRAM


మన్మథుని బూడిద చేసిన పరమశివుడు పార్వతిపై అనురాగాన్ని పెంచుకొని శివకుమారోదయానికి సుముఖత వెల్లడించాడు. శివకుమారుడు తన సేనతో వెళ్లి ముల్లోకాలను గడగడలాడించే తారకాసురుని సంహరించాడు.
ఏ ఆయుధం చేతకూడా మరణించకూడదనే వరాన్ని సంపాదించి లోకాలన్నింటినీ అతలాకుతలం చేస్తూ త్రిపురాసురులు నానాహింసచేస్తుంటే పరమశివుడే తరలివచ్చి సునాయాసంగా త్రిపురులను సంహరించాడు.
దేవదానవులు కలసి అమృతోత్పాదన చేద్దామన్న సంకల్పంతో మేరువు కవ్వంగా చేసుకొని క్షీరసాగరాన్ని మధిస్తున్న సమయంలో హాలాహలం పుట్టి లోకాలన్నింటా చిమ్మచీకటిని ఆవరింపచేస్తుంటే పరమశివుడే పూనుకొని ఆ హలాహలాన్నంతా తన కంఠాన పట్టిఉంచాడు. ఇట్లాంటి పరమశివుడు పరమదయాళువు భోళాశంకరుడు. ఓమ్ నమశ్శివాయ అంటే చాలు కొద్దినీళ్లను తలపై పోస్తే చాలు అమితంగా ఆనందపడి వరాలను కురిపించేకైలాసవాసుణ్ణి కొలవడానికి కార్తికం అత్యంత పవిత్రమైంది.
తెల్లవారు జామునే స్నానమాచరించాలి. వేడి నీటి స్నానం చేయరాదు. పగలు నిద్ర పోకూడదు. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల పిండితో, స్ర్తిలు తులసి చెట్టు మొదల్లోని మృత్తిక (మట్టిని) పూసుకొని స్నానమాచరించాలి. ‘తులరాశింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని పర్వత ద్రవ రూపేణ సానం పూర్భావేత్తదా’ అనే శ్లోకం పఠిస్తూ స్నానమాచరించాలి. ఇవన్నీ కార్తిక మాసంలో చేయాల్సిన విధులు.
శ్రీమహావిష్ణువు కృష్ణుడై పుట్టిన నాటినుంచి రాక్షస సంహారం చేస్తూ శిష్టులను తన భక్తులను కాపాడుతున్న కృష్ణుణ్ణి ‘కార్తిక దామోదరుడు’ అన్న పేరుతో కార్తికంలో స్మరిస్తే చాలు అనుకొన్న కోరికలన్నీ ఈడేరుతాయ. పరమశివుని ధ్యానంలో శ్రీమన్నారాయణుడు, నారాయణుని ధ్యానంలో పరమశివుడు ఉంటాడన్న విషయానికి తార్కాణంగా దామోదర ప్రీత్యర్థం అంటూ దీపాలను వెలిగిస్తారు. దీపాలు, వస్త్రాలు, ఇలా దేనినైనా దానం ఇవ్వడం వలన అధికమైన పుణ్యాన్ని అటుశివుడు ఇటు విష్ణువు అనుగ్రహిస్తారు. ప్రతి ఇంట్లో ఉంటే తులసి కోట ముందు రోజు చేసే దీపారాధన కార్తికంలో మరింత పుణ్యాన్నిస్తుంది. తులసీ వనంలో ఐదు పద్మాలను రచించి వాటిమీద దీపంప్రజ్వలనం చేసినవారికి ఇహపరాల్లో సంపదకు కొదువవుండదు.
ఈ మాసంలో ప్రత్యేకంగా శ్రీమన్నారాయణుని తులసీ దళాలు, జాజిపువ్వులతో పూజించాలి. పరమశివుడిని జిల్లేడు పూవులు, మారేడు దళాలతో పూజించాలి. సాలగ్రామాన్ని గంథంతో గరికతో, కుశలతోపూజించాలి. ఇలా చేసినవారు పాప విముక్తులౌతారు అంటుంది కార్తిక పురాణం.
పరమశివునకు పంచామృతములతో అభిషేకము చేసినట్లయతే అశ్వమేధ యాగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. కార్తిక మాస నియమ నిష్టలు ఆచరించినవారికి అటు శారీరక ఆరోగ్యం, ఇటు పుణ్యము రావడమే కాదు మానసిక వికాసంకలుగుతుంది. కార్తిక పున్నమినాడు మూడువందల అరవైవత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. జ్వాలతోరణాన్ని నిర్వహిస్తారు. త్రిపురసంహారిని స్మరించడం కూడా జన్మరాహిత్యాన్ని కలిగిస్తాయ.
ఈ కార్తికమాసమంతా శివకేశవుల అభిషేకాలు, అర్చనలు, వ్రతాలు, దీపదానములు, కార్తిక పురాణ పఠనంతో గృహాలు, దేవాలయాలు కళకళలాడుతూ వుంటాయి. ఆవునేతితోవెలిగించిన దీపాలను దానం చేసిన వారికి జన్మజన్మల పాపాలు నశిస్తాయ. దీపదానం వల్ల యజ్ఞం చేసినంత ఫలమూ వస్తుంది.
సంవత్సరమంతా కూడా శివుని స్మరించనివారు, దేవాలయదర్శనం చేయనివారు, అపనిందలువేసేవారు, అబద్దాలు ఆడేవారు సైతం ఈ కార్తికంలో దీపదానం చేయడం, దీపం వెలిగించడం వల్ల అజ్ఞానం నశించి పరమశివుని అనుగ్రహం లభించి ఇక నుంచి వారు జ్ఞానవంతులు అయ్యే అవకాశం ఉంది. సర్వాధికారి సర్వవ్యాపి అయన భగవంతుని గూర్చి ఎరుకను తెలుసుకొనే నైపుణ్యవంతులు కూడా అవుతారు.

KARTHIKA MASAM - ATTACHMENT OF OSIRIKAYA - HEALTH WITH OSIRIKAYA - TRADITIONAL IMPORTANCE OF VUSIRIKAYA IN KARTHIKAMASAM


ఉసిరికాయను దైవవృక్షంగా భావిస్తారు గనుకే కార్తీకమాసంలో వనభోజనాల సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద వంటలు వండుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. కార్తీక మాసంలో పూజలకు, అనేక నోములు, వ్రతాల్లోనూ ఉసిరికి ప్రాధాన్యం ఉంది. తరచూ ఉసిరికాయలు తినేవారు అనారోగ్యాలకు దూరంగా ఉంటారని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. చర్మవ్యాధుల నివారణకు, శిరోజాల గట్టిదనానికి ఇది దోహదపడుతుంది. ఉసిరికాయలు తక్కువ కేలరీలను అందిస్తాయి. 80 శాతం మేరకు నీటిని కలిగి ఉంటాయి. వీటిలో పిండి పదార్థాలు, పీచు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్-సితో పాటు కాల్షియం, భాస్వరం, ఇనుము వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.
వైద్యపరంగానే కాదు, వంటల్లోనూ ఉసిరిని విరివిగా వాడుతుంటారు. ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టపడనివారు ఉండరు. ఉసిరి పచ్చడి పెట్టిన రోజున తినడానికి ఇష్టపడేవాళ్ళు కొందరైతే, పాత ఉసిరికాయ పచ్చడి అంటే ప్రాణం పెట్టేవాళ్ళు మరికొందరు. మన శారీరక అందానికి కూడా ఉసిరి ఉపయోగపడుతుంది. ఉసిరిపొడిలో కాస్త పెరుగు, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి, ఆ మిశ్రమాన్ని ‘ఫేస్‌ప్యాక్’ వేసుకుంటే ముఖంపై చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. చర్మంపై ముడతలు కనుమరుగవుతాయి. ఉసిరికాయల రసాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం వుంటుంది. ఉసిరి రసంలో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ముడతలు, మచ్చల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిలోని యాంటి ఆక్సిడెంట్లు చర్మగ్రంథులను శుభప్రరుస్తాయి. మొటిమల సమస్య నివారణకు ఉసిరి పొడిలో కాస్త పెసరపిండి, నిమ్మరసం,పాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. కాలుష్యం, రసాయనాల ఫలితంగా జుట్టు కుదుళ్ళు దెబ్బతింటే ఉసిరి రసాన్ని తలకు రాసుకోవడం మంచిది. ఉసిరికాయ నిత్య యవ్వనులుగా ఉండేందుకు టానిక్‌లా ఉపయోగపడుతుంది. అంటు వ్యాధులను దూరం చేయడమే గాక, గుండె, కిడ్నీలు, కండరాలకు బలం చేకూరుతుంది. ఉసిరి రసంలో తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే నేత్ర సంబంధ సమస్యలు దరిచేరవు.

Tuesday, 24 November 2015

INFORMATION ABOUT HOW TO CELEBRATE FESTIVAL - KARTHIKHA POURNAMI - PUJA INFORMATION IN TELUGU


కార్తిక పౌర్ణమి

సౌందర్యాన్ని ఆశ్చర్యపరిచే జగత్సౌందర్యమే కార్త్తిక పూర్ణిమ. కార్త్తిక మాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే తిథులలో కార్త్తిక పూర్ణిమ ఒకటి. శంకరుని అతి ప్రియమైన రోజు ఇది. ఈ రోజు కుమారస్వామిని దర్శించాలి. ఈశ్వరాలయాల్లో జ్వాలాతోరణం చేస్తారు. ఈరోజు చేసే దీపదానానికి ఎంతో విశేష ప్రాముఖ్యం ఉంది. శివుడు త్రిపురాసుడిని సంహరించింది ఈ పౌర్ణమినాడే. అందుకే త్రిపుర పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. ఈరోజున ఉదయంనుంచి ఉపవాసంఉండి ప్రదోషంలో అంటే సాయంకాంలో స్ర్తిలు దీపాలను వెలిగించాలి. తరువాత పురుషులు ఆ దీపాలను విధివిధానంగా ఆరాధించాలి. ఈ దీపారాధన ఉసిరిక చెట్టుకింద చేస్తే విశేష ఫలితాల్ని పొందవచ్చు. త్రిపురాసురులను సంహరించిన తరువాత పరమేశ్వరుని దృష్టి దోషపరిహారం కోసం ఇంకా విజయుడైన అతని గౌరవార్ధం పార్వతీదేవి మొదటిగా ఈ జ్వాలా తోరణాన్ని జరిపించిందనీ అప్పటినుండి ఇది ఆచారమైనదని కథనం. ఈ జ్వాలా తోరణాన్ని దర్శించడం వల్ల సర్వ పాపాలు హరించబడతాయని ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారించబడుతుందని ప్రతీతి. గడ్డిని తోరణంగా పేని దాన్ని వెలిగించి మంట చేసి ఆ మంటను కిందినుంచి పార్వతీదేవిని అటు ఇటు తిప్పుతారు. దీన్ని జ్వాలా తోరణం అంటారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించినపుడు వెలువడ్డ హాలాహలాన్ని భరించలేక లోకాలు తల్లడిల్లిపోతుంటే తన భర్తను వేడుకుని హాలా హలాన్ని స్వీకరించి లోకాన్ని రక్షించమని ప్రార్థిస్తుంది. దానికి గుర్తుగానే ఈ జ్వాలా తోరణాన్ని నేటికీ వెలిగిస్తారంటారు. కొందరు ఈరోజు తులసిచెట్టు, ఉసిరి చెట్టు ముందు ముగ్గు పెట్టి, దీపం వెలిగించి షోడశోపచార పూజ చేసి తులసి దగ్గరే వంట చేసుకుని భోజనం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ఎందుకంటే తులసి, ఉసిరి చెట్లను లక్ష్మీ నారాయణులుగా భావిస్తారు. ఈరోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజించి మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు శివుడిని పూజించి భక్తేశ్వర వ్రతం చేయాలి. ఈ దినం పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివుడిని అభిషేకించి, మారేడు దళాలతో పూజించి నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ వ్రతం చేసినట్టయితే వైధవ్య బాధలు వుండవని శాస్త్రాలు చెప్తున్నాయి.

కార్తిక పౌర్ణమి రోజున ముత్తయిదువలు ఆచరించి తమ ఐదోతనాన్ని కాపాడమని పరమేశ్వరుడ్ని ప్రార్థించుకుంటారు. సాక్షాత్తు సర్వమంగళాదేవి అయిన మంగళగౌరి కూడా కార్తీకమాసంలో దీపాల్ని వెలిగించి మురిసిపోతుందిట. అందుకే ఈరోజు దీపారాధనకు ప్రాముఖ్యత ఏర్పడింది.

కార్తికపూర్ణిమ నాడు మనసును ప్రశాంతంగా ఉంచి, ‘ఓం నమఃశ్శివాయ’అంటే చాలు, ఒక పవిత్ర శక్తి ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రదక్షిణం చేసి గంగలో మూడు మునకలు వేసి పరమోత్కృష్టమైన కైలాస శిఖరాన్ని తాకి, మనపై కారుణ్యామృతాన్ని వర్షిస్తుందని శివపురాణం స్పష్టం చేస్తోంది. జలం, జ్వాల ఈ రెండును ప్రతి ఒక్కరికి అవసరమే. అందుకే నదుల్లో స్నానమాచరించి, దీప తోరణాలను చెరువుల్లోకానీ, బావుల్లోకానీ నదుల్లోకానీ వదలడం కన్నుల పండువగా కన్పిస్తుంది. కార్తీక దామోదరునిగా ప్రసిద్ధి చెందిన విష్ణువును ఉసిరిక చెట్టుకింద దీపంపెట్టి వేదపఠనం కావించి అర్చిస్తారు. తులసి కోట దగ్గర శివాలయంలోను మున్నూట అరవై వత్తులతో దీపారాధన చేస్తారు.
శ్రీహరి దేవేరియైన శ్రీ మహాలక్ష్మి కార్తీకపూర్ణిమనాడు ఇంటింటికీ వస్తుందని, ఏ ఇంట శివలింగారాధన జరుగుతుందో శివనామ స్మరణ జరుగుతుందో ఆ ఇంట రహస్య శక్తులతో ప్రవేశిస్తుంది. దీపాలు ఎవరి ఇంట ఈరోజు సాయంకాలం వెలిగిస్తారో వారి దారిద్య్రం తొలగిపోతుంది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని పారద్రోలి ఆకాశాన నిండు చంద్రుడు నిలిచిన పూర్ణిమనాడు చంద్రోదయ సమయంలో నదులలో, అరటి దొప్పలలో ఆవునేయితో దీపాలను వెలిగించి వదులుతారు. అందుకే కార్తీక మాసానికి సమమైన మాసం ఇంకేదీ లేదని చెప్తారు. ఇన్ని లక్షణాలున్న కార్తీక మాసాన్ని, ముఖ్యంగా పౌర్ణమినాడు మనమందరం కూడా దీపారాధన చేసి దీపాలను నీటిలో వదిలి ఆ శివకేశవుల ప్రీతికి పాత్రులవుదాం.

IMPORTANCE OF THE DAY KARTHIKA POURNAMI


కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు

కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.
కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.

Friday, 6 November 2015

KARTHIKAMASAM LORD MAHESWARA'S STEP BY STEP NITYA/DAILY PUJA INFORMATION IN TELUGU - KARTHIKAMASAM SIVA BHAKTHULAKU SIVA SWAMULAKU NITYA PUJA VIDHANAM


కార్తీక మాస సందర్భంగా శివ భక్తులకు

 మరియు శివస్వాములకు ఆ మహాదేవుని 

నిత్య పూజ విధానం

{ప్రతి దేవుని (దేవత) పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని పూజించవలెను.}
వినాయకుని శ్లోకం
శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే
***
వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః
{అని నమఃస్కారం చేసుకోవాలి}
******
శ్లో|| గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః
***
పవిత్రము
శ్లో|| అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాం గతోపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం | సభాహ్యా అభ్యంతర శుచిః ||
పుండరీకాక్ష | పుండరీకాక్ష | పుండరీకాక్షాయ నమః ||
{ పంచపాత్రలోని నీటిని ఉద్దరిణితో తీసుకుని బొటన వేలితో 3సార్లు తలపై చల్లుకోవాలి }
******
అనంతరం ఏకాహారతి వెలిగించాలి
{ ఏకాహారతి వెలిగించి దానికి గంధం, పసుపు, కుంకుమ అలంకరించాలి }
దీపారాధన
{యీ క్రింది మంత్రమును చెప్పుతూ దీపమును ఏకాహారతి తోటి వెలిగించాలి అంతే కానీ దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు}
శ్లో|| దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే ||
ఇతి దీపదేవతాభ్యో నమః
{దీపానికి గంధం, పసుపు, కుంకుమ, పువ్వులు అలంకరించాలి. ఆడవారు 5వత్తులు, మగవారు 3వత్తులు, హీనపక్షంలో కనీసం 2వత్తులు వెలిగించాలి}
[ ఓ దీప దైవమా! నీవు బ్రహ్మస్వరూపమై ఉన్నావు. మాకు సకల సౌభాగ్యాలను, సుపుత్రులను ఇచ్చి, మా కోర్కెలన్నింటినీ తీర్చుమా అని అర్ధం ]
******
(దీపం వెలిగించి గంటను వాయిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను)
ఘంటా నాదము
శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్ |
కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ ||
[అంటే దేవతలు ఉండే చోట రాక్షసులు ఉండరు కదా. ఈ పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో దుష్టశక్తులు ఉండకూడదు కాబట్టి మీరు ఇక్కడనుండి వెళ్ళిపొండి అని గంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించడానికి గంటానాదం చేయడం జరుగుతుంది]
******
ఆచమనం
( స్త్రీలైతే స్వాహా అనరాదు నమః అనాలి)
ఓం కేశవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం నారాయనాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం మాధవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
{ చెయ్యి కడుగుకోవాలి}
ఓం గోవిందాయనమః --- {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}
{తదుపరి నమఃస్కారం చేయుచు యీ మంత్రములను పఠించవలెను}
కేశవనామాలు
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః --- ( అని కొంచెం నీళ్ళు పళ్ళెములో విడువవలెను)
******
భూశుద్ధి
{ఆచమానంతరం - భూశుద్ధి కై భూతోచ్చాటన మంత్రము చదువుతూ కొన్ని అక్షతలు వాసన చూసి వెనుకకు వేసుకోవలెను}
శ్లో|| ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతేభూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
******
ప్రాణాయామం
శ్లో|| ఓం భూ: | ఓం భువః | ఓం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ||
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
{ అను మంత్రమును చదువుతూ 3సార్లు ప్రాణాయామము చేయవలెను }
******
సంకల్పం
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం
(కులదైవాన్ని సంభోదించుకోవాలి "పరశ్వరుని" బదులుగా)
శుభే శోభనే ముహూర్తే
ప్రవర్తమానస్య - అద్యబ్రహ్మణః
(ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు)
ద్వితియ పరార్ధే - శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే - కలియుగే
ప్రథమపాదే - జంబూద్వీపే
భరతవర్షే - భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే
శ్రీశైలస్య____ (ఈశాన్య/వాయువ్య/... ) ప్రదేశే
(కృష్ణా / గంగా / గోదావర్యోః) మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి)
(ఏ నది కి దగ్గర వుంటే ఆ నది సమీపే అని చదవాలి) ____నదీసమీపే
నివాసిత గృహే (సొంత ఇల్లు అయితే "సొంత గృహే"అని చదవాలి)
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ____నామ సంవత్సరే
ఉత్తరాయనే / దక్షిణాయనే
______ఋతవే ( 'గ్రీష్మ' - ఎండాకాలం / 'వర్ష' - వర్షాకాలం / 'వసంత' - చలికాలం)
______మాసే (తెలుగు నెలలు చైత్రం, వైశాఖం...)
______పక్షే (శుక్ల పక్షం -- చంద్రుడు పెరుగుతుంటే / కృష్ణ పక్షం -- చంద్రుడు తరుగుతుంటే)
______ తిధౌ (ఉదయం ఏ తిథి ప్రారంభం అయితే ఆ తిథే చదువుకోవాలి. పాడ్యమి, విదియ... )
______ వాసరే (ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి. ఆది, సోమ...)
శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే,
ఏవం గుణవిశేషణ విశిష్టాయాం
శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రః (గోత్రం)
అహం __________ నామ ధేయస్య (పేరు)
ధర్మ పత్ని ______________ నామ ధేవతి (పేరు)
సఃకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం,
ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం, అభీష్ట సిద్ధ్యర్ధం, సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం, సత్సంతాన సిద్ధ్యర్ధం, శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతా ముద్దిశ్య,
కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే
{అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను}
నిర్విఘ్నేన పూజా పరిసమాప్త్యర్ధం మహా గణాధి పతయే నమః
శ్రీ గురుభ్యో నమః
******
కలశారాధన
తదంగ కలశారాధనం కరిష్యే
{మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని ,చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను. కలశమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి, కలశంలో ఒక పువ్వు, కొద్దిగా అక్షంతలు వేసి, కుడి చేతితో కలశంను మూసి పెట్టి, ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను}
శ్లో|| కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితోబ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋద్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ||
గంగేచ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి |
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ||
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః
కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి)
ఆత్మానాం సంప్రోక్ష్య (మన పైన)
పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యాల పైన చల్లాలి)
******
షోడశోపచార పూజ
1) ఓం శివాయ నమః --- ధ్యానం సమర్పయామి
2) ఓం పరమేశ్వరాయ నమః --- ఆవాహయామి
3) ఓం కైలాసవాసాయ నమః --- సింహాసనం సమర్పయామి
(సింహాసనార్ధం అక్షతాన్ సమర్పయామి)
4) ఓం గౌరీనాధాయ నమః --- పాదయో: పాద్యం సమర్పయామి
5) ఓం లోకేశ్వరాయ నమః --- హస్తయో: అర్ఘ్యం సమర్పయామి
6) ఓం వామదేవాయ నమః --- ముఖే ఆచమనీయం సమర్పయామి
7) ఓం రుద్రాయ నమః --- మధుపర్కం సమర్పయామి
8) ఓం వృషభవాహనాయ నమః --- పంచామృత స్నానం సమర్పయామి
పంచామృత స్నానానంతరం శుద్దోదక స్నానం సమర్పయామి
9) ఓం దిగంబరాయ నమః --- వస్త్రయుగ్మం సమర్పయామి
10) ఓం జగన్నాధాయ నమః --- యజ్ఞోపవీతం సమర్పయామి
11) ఓం భవాయ నమః --- ఆభరణం సమర్పయామి
(ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి)
12) ఓం కపాలధారిణే నమః --- గంధం సమర్పయామి
13) ఓం మహేశ్వరాయ నమః --- అక్షతాన్ సమర్పయామి
14) ఓం సంపూర్ణగుణాయ నమః --- పుష్పం సమర్పయామి
సూచన
* అర్ఘ్యం, పాద్యం, ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు స్వామికి చూపించి వేరొక పాత్ర లో వదలవలెను. అరివేణం (పంచ పాత్రకు క్రింద నంచు పళ్ళెము) లో వదలరాదు.
* మధుపర్కం సమర్పయామి అనగా స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని అర్ధం. ఈ మధుపర్కంను ఆయన ప్రతిమకు అద్దవలెను. (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు)
* వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మమనగా రెండు) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును. ఇటువంటివి రెండు చేసుకొనవలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.
* ఉపవీతం సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను. ఇదియును ప్రత్తితో చేయవచ్చును. ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి ,కుంకుమ అద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.
******
అథాంగ పూజ
ఓం శంకరాయ నమః – పాదౌ పూజయామి
ఓం శివాయ నమః – జంఘే పూజయామి (పిక్కలు)
ఓం మహేశ్వరాయ నమః – జానునీ పూజయామి (మోకాళ్ళు)
ఓం త్రిలోకేశాయ నమః – ఊరుం పూజయామి (తొడలు)
ఓం వృషాభారూఢాయ నమః – గుహ్యం పూజయామి
ఓం భస్మోద్ధోళిత విగ్రయా నమః – కటిం పూజయామి(నడుము)
ఓం మృత్యుంజయాయ నమః – నాభిం పూజయామి
ఓం రుద్రాయ నమః – ఉదరం పూజయామి
ఓం సాంబాయ నమః – హృదయం పూజయామి
ఓం భుజంగభూషణాయ నమః – హస్తౌ పూజయామి
ఓం సదాశివాయ నమః – భుజౌ పూజయామి
ఓం విశ్వేశ్వరాయ నమః – కంఠం పూజయామి
ఓం గిరీశాయ నమః – ముఖం పూజయామి
ఓం త్రిపురాంతకాయ నమః – నేత్రాణి పూజయామి
ఓం విరూపాక్షాయ నమః – లలాటం పూజయామి
ఓం గంగాధరాయ నమః – శిరః పూజయామి
ఓం జటాధరాయ నమః – మౌళీం పూజయామి
ఓం పశుపతయే నమః – సర్వాణ్యంగాని పూజయామి
అష్టోత్తర శతనామపూజ
ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః (10)
ఓం శూలపాణయే నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః (20)
ఓం శితికంఠాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కౌమారయే నమః
ఓం అంధకాసుర సూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపానిధయే నమః (30)
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం క్తెలాసవాసినే నమః
ఓం కవచినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం వృషభారూఢాయ నమః (40)
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం స్వరమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వఙ్ఞాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యఙ్ఞమయాయ నమః (50)
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం గిరీశాయ నమః (60)
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగ భూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాససే నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమధాధిపాయ నమః (70)
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేన జనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః (80)
ఓం అహిర్భుథ్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం స్వాత్త్వికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయ నమః (90)
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః (100)
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అపపర్గప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః (108)
15) ఓం పార్వతీనాధాయ నమః --- ధూపమాఘ్రాపయామి
16) ఓం తేజోరూపాయ నమః --- దీపం దర్శయామి
******
నైవేద్యం
(నివేదన పదార్ధములపై నీరు చిలుకుచూ)
శ్లో|| ఓం భూర్భువస్సువః ఓం తత్స వితుర్వరేణ్యం |
భర్గోదేవస్య ధీమహి - ధీయోయోనః ప్రచోదయాత్ ||
(క్రింది మంత్రం చెపుతూ పుష్పంతో నీటిని నైవేద్యం చుట్టూ 3సార్లు సవ్య దిశలో తిప్పాలి)
(నైవేద్యం పగలు సమయంలో పెడితే)
ఓం స్వత్యంత్వర్తేన పరిషించామి
(నైవేద్యం రాత్రి సమయంలో పెడితే)
ఋతంత్వా సత్యేన పరిషించామి
(పుష్పంతో నైవేద్యంపై జలం ఉంచి)
అమృతమస్తు
(అదే జలపుష్పాన్ని దేవుని వద్ద ఉంచి)
అమృతోపస్తరణమసి
ఓం లోకరక్షకాయ నమః --- నైవేద్యం సమర్పయామి
(5సార్లు దేవునికి నైవేద్యం చూపిస్తూ)
ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా -
ఓం వ్యానాయ స్వాహా - ఓం ఉదానాయ స్వాహా -
ఓం సమానాయ స్వాహా
(క్రింది మంత్రాలు చెపుతూ పుష్పంతో నీటిని దేవుడి పైన 5సార్లు చల్లాలి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి - ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి
పాదౌ ప్రక్షాళయామి
శుధ్ధాచమనీయం సమర్పయామి
******
తాంబూలం
ఓం కాలాయ నమః --- తాంబూలం సమర్పయామి
{తాంబూలమును (మూడు తమలపాకులు, రెండు పోక చెక్కలు, అరటి పండు వేసి) స్వామి వద్ద ఉంచాలి}
తాంబూల చరవణానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి
(తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి)
******
నీరాజనం
(కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన ఏకాహారతి దీపంతో వెలిగించాలి)
ఓం త్రిలోచనాయ నమః --- కర్పూర నీరాజనం సమర్పయామి
కర్పూర నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి
(నీరు హారతి కుంది చివర వదలాలి)
******
మంత్రపుష్పం
(మంత్రపుష్పమునకు అక్షతలు, పుష్పములు తీసుకొని విడువవలయును)
శ్లో|| ఓం పురుషస్య విద్మహే మహాదేవస్య ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్
ఓం శంకరాయ నమః --- సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
******
ప్రదక్షిణ నమస్కారం
(అక్షతలు, పుష్పము తీసుకొని ప్రదక్షిణము చేయ వలయును)
శ్లో|| యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ |
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః |
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలా ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా ||
ఓం భవాయ నమః --- ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
******
సాష్టాంగ ప్రణామం
(మగ వారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ల పై పడుకుని కుడికాలు ఎడమకాలు పై వేసి)
శ్లో|| ఉరసా శిరసా దృష్ట్యా వచసా మనసా తథా |
పదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||
******
క్షమాప్రార్థన
ఆ తరవాత మళ్లీ కూర్చుని, కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచెం నీటిని అక్షతలపై వేసుకుని ఈ శ్లోకం చెప్పుకోవాలి)
శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరః
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానావాహనాది షోడషోపచార పూజయాచ అష్టోత్తర నామార్చనాయచ మహా నివేదనాయచ భగవాన్‌ సర్వాత్మకః సర్వం శ్రీమహేశ్వర దేవతార్పణమస్తు
శ్రీ మహేశ్వర దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు
ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు
(అంటూ అక్షతలనూ నీటినీ పళ్ళెంలో వదలాలి)
శ్లో|| ఉపచారాపదేశేన కృతాన్ అహర్ అహర్మయా |
అపచారానిమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ ||
ఓం మహేశ్వరాయ నమః - అపరాధ నమస్కారాన్ సమర్పయామి
శ్రీ పరమేశ్వర ప్రసాదం శిరసా గృహ్ణామి
(పూజాక్షతలు శిరసున ధరించాలి)
******
విశేషోపచారములు
ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ యామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజో పచార, భక్త్యోపచార పూజాం సమర్పయామి
(నమస్కరించి అక్షతలు వేయాలి)
******
తీర్ధం
శ్లో|| అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణమ్ |
సమస్త పాపక్షయకరం శ్రీపరమేశ్వర పాదోదకం పావనం శుభమ్ ||
(తీర్ధమును చేతిలో వేసుకొని మూడుమార్లు నోటి లోనికి తీసుకొనవలెను. ప్రసాదం స్వీకరించాలి)
******
ఉద్వాసన
ఓం పరమేశ్వరాయ నమః ఉద్వాసయామి యథాస్థానం ప్రవేశయామి
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయచ
(అక్షతలు వేసి నమస్కారం చేయాలి. ఇంట్లో చేసుకునే నిత్య పూజకు ఉద్వాసన చెప్పాల్సిన అవసరం లేదు)
******
శుభం భూయాత్...
పూజా విధానము సంపూర్ణం
శివ షోడశోపచార పూజ
(శివునిపై ఉదకము చల్లుచూ, లేక విడుచుచు)
ఓం శూల పాణీయే నమః శివోః హం ప్రతిష్ఠితోభవ.
ధ్యానం:
(పుష్పము చేతపట్టుకొని)
శ్లో // శుద్ధస్పటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం /
గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితం //
నీలగ్రీవం శశాంకాంకం – నాగ యజ్ఞోపవీతినం /
వ్యాఘ్ర చర్మోత్తరీయంచ వరేణ్య మభయప్రదం //
కమండల్వక్ష సూత్రభ్యామాన్వితం శూలపాణినం /
జ్వలంతం పింగళజటా శిఖాముద్యోత ధారిణిం //
అతృతేనాప్లుతం హృష్టముమాదేహార్ధ ధారిణం /
దివ్యసింహాసనాసీనం – దివ్య భోగ సమన్వితం //
దిగ్దేవతా సమాయుక్తం – సురా సుర నమస్కృతం /
నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం
సర్వవ్యాపిన మీశానమేవం వై విశ్వరూపిణం //
(పుష్పమును స్వామిపై నుంచవలయును. అనంతరము ఆవాహనమును చెప్పవలయును. నమకము నందలి 23 వ మంత్రము)
ఆవాహనం:
(మం) మానోమహన్తముతమానో అర్భకం మాన ఉక్షన్తముత మాన ఉక్షితమ్ /
మానోవధీః పితరం మోతం మాతరం ప్రియమాన్తనస్త నువోః // రుద్రదీరిష //
ఓం శివాయనమః ఆవాహయామి /
(పుష్పము నుంచవలయును. తరువాత నమకము నందలి యాతే రుద్రయను ప్రథము మంత్రముచే పుష్పాసనము సమర్పించవలయును.).
ఆసనం:
(మం) యాతేరుద్ర శివాతనూరఘోరా పాపకాశినీ //
తయానస్తనువాశంతమయా గిరీశన్తాభిచాకశీహి //
ఓం మహేశ్వరాయ నమః పుష్పం సమర్పయామి
(అక్షతలు వేయవలెను.)
పాద్యం:
(మం) యామిషుం గిరిశన్త హస్తే భిభిర్ష్యస్తవే
శివాం గిరిత్రతాంకురు మహిగం సీః పురుషంజగత్
ఓం శంభవే నమః పాద్యం సమర్పయామి.
(ఉదకమును విడవవలెను.)
అర్ఘ్యం:
(మం) శివేన వచసా త్వా గిరిశాచ్చా వదామసి /
యదానస్సర్వమిజ్జగదయక్ష్మగం సుమనాఅసత్ //
ఓం భర్గాయ నమః అర్ఘ్యం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)
ఆచమనం:
(మం) అధ్య వోచద ధివక్త్రా ప్రథమో దైవ్యోభిషక్ /
అహంగ్ హీశ్చ సర్వానమ్భజస్సర్వాశ్చ యాతుధాయన్య
ఓం శంకరాయ నమః ఆచమనీయం సమర్పయామి.
(ఉదకమును విడువవలెను.)
స్నానం :
(మం) అసౌ యస్తామ్రౌ అరుణ ఉతబభ్రుసుమంగళః
యే చేమాగం రుద్రా అభితోదిక్షు //
శ్రితాస్సహస్ర శోవై షాగం హేడ ఈమహే //
ఓం శాశ్వతాయ నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)
పంచామృతస్నానం
ఆప్యాయస్వమేతుతే విశ్వతస్సోమవృష్టియం /
భవా వాజస్య సంగధేః //
ఓం పశుపతయే నమః క్షీరేణ స్నాపయామి .
(స్వామికి పాలతో స్నానము చేయవలెను)
ధదిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరస్వశ్యవాజినః /
సురభినో ముఖాకరత్ప్రమణ అయుగంషితారిషత్ //
ఓం ఉమాపతయే నమః దధ్యాస్నాపయామి .
(స్వామికి పెరుగుతో స్నానము చేయవలెను)
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవేవస్సవితోత్సునా
త్వచ్చిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్యరస్మిభిః //
ఓం పరబ్రహ్మణే నమః అజ్యేన్న స్నాపయామి.
(స్వామికి నెయ్యితో స్నానము చేయవలెను)
మధువాకా యతాయుతే మధుక్షరంతి సింధవః
మాధ్వీన్నస్సంత్వౌషమాధీః / మధునక్తముతోషినీ //
మధువత్పార్ధిగం రజః మధుదౌరస్తునః స్థితాః /
మధుమాన్నో వనస్పతిర్మధురాగం (అస్తు) సూర్యః
మాధ్వీర్గావో భవంతునః //
ఓం బ్రహ్మాధిపాయనమః / మధునా పపయామి
(స్వామికి తేనెతో స్నానము చేయవలెను)
స్వాధుః సవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ
సహనేతునామ్నే ! స్వాదుర్మిత్రాయ వరుణాయ
వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః /
ఓం పరమేశ్వరాయ నమః! శర్కరాన్ స్నపయామి.
(స్వామికి పంచదారతో స్నానము చేయవలెను)
యాః ఫలవీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రమాతోస్తానో ముస్త్వగ్ హంసః //
ఓం ఫాలలోచనాయ నమః – ఫలోదకేన స్నాపయామి
(స్వామికి కొబ్బరినీళ్ళుతో స్నానము చేయవలెను)
(తతః నమకచమకపురుషసూక్తేన శుద్ధోదకస్నానం కుర్యాత్)
అపోహిష్టామయోభువః – తాన ఊర్జేదధాతన /
మహేరణాయ చక్షసే యోవశ్శివ తమోరసః /
తస్మా అరంగ మామవః యస్యక్షయాయ జిన్వధ //
అపోజన యధాచనః
ఓం అష్టమూర్తయే నమః – శుద్ధోదకస్నానం సమర్పయామి.
(స్వామికి నీళ్ళుతో స్నానము చేయవలెను)
అభిషేకము:
(క్రింది మంత్రములను చదువుచు జలధార విడువవలయును)
ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే అస్తుధన్వనే బాహుభ్యాముత తే నమః //
తయాన స్తనువాశం తమయా గిరిశన్తాభి చాకశీహి /
యామిషుం గిరిశన్త హస్తే భిభిర్ష్యస్తవే
శివాం గిరిత్రతాంకురు మహిగం సీః పురుషంజగత్ //
శివేన వచసా త్వా గిరిశాచ్చా వదామసి /
యదానస్సర్వమిజ్జగదయక్ష్మగం సుమనా అసత్ //
అధ్య వోచద ధివక్త్రా ప్రథమో దైవ్యోభిషక్ /
అహంగ్ హీశ్చ సర్వానమ్భజస్సర్వాశ్చ యాతుధాయన్యః //
అసౌ యస్తామ్రౌ అరుణ ఉతబభ్రుసుమంగళః
యే చేమాగం రుద్రా అభితోదిక్షుః //
శ్రితాస్సహస్ర శోవై షాగం హేడ ఈమహే
అసౌయో పరస్పతిః నీలగ్రివో విలోహితః
ఉత్తైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః
ఉత్తైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః //
నమోఅస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే /
అథోయే అస్య సత్వానో హం తేభ్యో కరం నమః
ప్రముంచ ధన్వన స్వముభయోరార్న్తి యోర్జ్యామ్
యశ్చతే హస్త ఇషవః పరాతా భగవోవ ప
అవతత్యదనుస్ట్వగం సహస్రాక్ష శతషుధే //
నిశీర శల్యానాం ముఖాశివో నస్సుమానాభవ //
విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగం ఉత //
అనేశన్న స్యేషవ అభురస్య నిషంగధిః //
యాతే హేతిర్మీఢుష్టమ హస్తేబభూవతే ధనుః
తయా స్మానిశ్వత స్త్వమయక్ష్మ యా పరిభుజ //
నమస్తే అస్త్యాయుధాయాతా నాత య ధృష్ణవే
ఉభాభ్యాముత నమో బాహుభ్యా తవ ధన్వనేః
పరితే ధన్వనోహేతిరస్మాన్మృణక్తు విశ్వతః
అథోధియ ఇషు స్తవా రే అస్మిన్న దేహితమ్ //
మానో మహాన్త ముతమానో అర్భకం మాన ఉక్షన్త
ముతమాన ఉక్షీతమ్ / మానో వధీః పితరం మోతమాతరం
ప్రియామానస్తనువోః రుద్రరీరిషః //
మానస్తోకే తనయే మాన ఆయుషిమానో గోషుమానో
అశ్వేషిరీరిషః వీరాజన్మానో రుద్రభామితో వఢఃఇర్హవిష్మన్తో నసుసావిధేమ తే //
అణోరణీయా మహమేవకత్వం మహానహం విశ్వ మదం వచైత్రం
పురాతనోహం పురుషోహమీశో హిరణ్యయోహం శిరూప మస్తి //
ఓం మృత్యుంజయాయ నమః అభిషేకం సమర్పయామి.
వస్త్రం:
(మం) అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః
ఉతైనం గోపా అదృశన్నదృశన్ను దహార్యః
ఉతైనం విశ్వభూతానిసః దృష్టో మృడయాతినః
ఓం మృడాయ నమః – వస్త్రయుగ్మం సమర్పయామి.
కటిబంధనము:
(మం) దీర్ఘాయుత్వాయజదృష్టిరస్మితం జీవామివరదః
పురూచరాయ సోషమభిసంవ్య యిష్యే /
ఓం భూతేశాయ నమః కటిబంధేనవస్త్రం సమర్పయామి.
భస్మదారణం:
(మం) అగ్నిరితభస్మ వాయురిత భస్మజమితి
భస్మస్థలమితి భస్మ వ్యోమేతిభస్మ సర్వగం హవాయ ఇదగం సర్వంభస్మ /
(మం) త్ర్యంబకం యజామహే ఉగంధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుకమివబంధనాన్మృత్యోరుక్షీయమా మృతాత్ /
ఓం శర్వాయ నమః ఇతి భస్మధారణం.
యజ్ఞోపవీతం:
(మం) యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్ /
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః //
ఓం సర్వేశ్వరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి.
గంధం:
(మం) యోవైరుద్రవః యశ్చసోమో భూర్భువ
సువస్తస్మై నమోనమశ్శీర్ షంజనదోం విశ్వరూపోసి
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీశిణీం
ఈశ్వరీగం సర్వభూతానాంత్వామిహోపహ్వయేశ్రియం
ఓం సర్వజ్ఞాయ నమః గంధం విలేపయామి.
(గంధం చల్లవలెను.)
అక్షతలు
(మం) ఆయనే తే పరాయణే దూర్వారోహస్తు పుష్పిణః
హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాణమే //
ఓం సదాశివాయ నమః అక్షతాన్ సమర్పయామి.
(అక్షతలు సమర్పించవలెను)
బిల్వపత్రం:
(మం) యావై రుద్రస్య భగవాన్యశ్చ సూర్యోభూర్భువ
సువస్తస్మైవై జనమోనమశ్శీర్ షంజనదో విశ్వరూపోసి //
శ్లో // అమృతోద్భవ శ్రీవృక్షం శంకరస్య సదాప్రియా /
తత్తేశంభో ప్రయచ్ఛామి బిల్వపత్రం సురేశ్వర //
త్రిశాఖై ర్భిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలై శుభైః /
తవపూజాం కరిష్యామి అర్చయేత్పరమేశ్వరః //
గృహాణ బిల్వపత్రాణి సుపుష్పాణి మహేశ్వరః /
సుగంధేన భవానీశ హివత్త్వం కుసుమప్రియః //
ఓం అభయాయ నమః బిల్వపత్రాణి సమర్పయామి.
(బిల్వపత్రములు వేయవలెను)
(అనంతరం అష్టోత్తరశతనామైర్వాత్రిశతనామైర్వా సహస్ర నామైర్వాప్రపూజయేత్)
అథాంగపూజ:
ఓం శంకరాయ నమః – పాదౌ పూజయామి.
ఓం శివాయ నమః – జంఘే పూజయామి.
ఓం మహేశ్వరాయ నమః – జానునీ పూజయామి.
ఓం త్రిలోకేశాయ నమః – ఊరుం పూజయామి.
ఓం వృషాభారూఢాయ నమః – గుహ్యం పూజయామి.
ఓం భస్మోద్ధోళిత విగ్రయా నమః – కటిం పూజయామి.
ఓం మృత్యుంజయాయ నమః – నాభిం పూజయామి.
ఓం రుద్రాయ నమః – ఉదరం పూజయామి.
ఓం సాంబాయ నమః – హృదయం పూజయామి.
ఓం భుజంగభూషణాయ నమః – హస్తౌ పూజయామి.
ఓం సదాశివాయ నమః – భుజౌ పూజయామి.
ఓం విశ్వేశ్వరాయ నమః – కంఠం పూజయామి.
ఓం గిరీశాయ నమః – ముఖం పూజయామి.
ఓం త్రిపురాంతకాయ నమః – నేత్రాణి పూజయామి.
ఓం విరూపాక్షాయ నమః – లలాటం పూజయామి.
ఓం గంగాధరాయ నమః – శిరః పూజయామి.
ఓం జటాధరాయ నమః – మౌళీం పూజయామి.
ఓం పశుపతయే నమః – సర్వాణ్యంగాని పూజయామి.
ఓం పరమేశ్వరాయ నమః – పూజయామి.
లింగపూజ:
ఓం నిధనపతయే నమః
ఓం నిధనపతాంతికయై నమః
ఓం ఊర్ధ్వాయ నమః
ఓం హిరణ్యాయ నమః
ఓం సువర్ణాయ నమః
ఓందివ్యాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం శివాయ నమః
ఓం జ్వలాయ నమః
ఓం ఆత్మాయ నమః
ఓం పరమాయ నమః
ఓం ఊర్థ్వలింగాయ నమః
ఓం హిరణ్యలింగాయ నమః
ఓం సువర్ణలింగాయ నమః
ఓం దివ్యలింగాయ నమః
ఓం భవలింగాయ నమః
ఓం శర్వలింగాయ నమః
ఓం శివలింగాయ నమః
ఓం జ్వలలింగాయ నమః
ఓం ఆత్మలింగాయ నమః
ఓం పరమలింగాయ నమః
ధూపం:
నవవస్త్వా ధూపయంతు / గాయత్రే ఛందసాంగి -
రస్వద్ద్రుద్రాస్త్వా భూపయంతు / త్రెష్టుభేన ఛందసాంగి
రస్వదాదితాస్త్వా ధూపయంతు / జగతేన ఛందసాంగి
రస్వదిఁ బ్రస్త్వా ధూపయత్వం / గిరిస్వదివ్వష్ణుస్త్వా ధూపయర్వంగిరస్వ /
వ్వరుణత్వా ధూపయత్వం గిరిస్వదదలిప్తా దేవీర్విశ్వ దేవ్యాపతీ /
పృధీవ్యాసృభస్థేంగిదసర్దనత్యనట దేవానాం త్వాపత్నీ /
ఓం భీమాయ నమః – ధూపమాఘ్రాపయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)
దీపం:
ఆపాణి పాదోహ మంచిత్తపశ్శ్క్తిం, పశ్వామ్య చక్షుస్స
శృణోన్యుకర్ణః సవేత్తివేద్యం నదతపాప్తి, వేత్తాత మహురగ్ర్యం పురుషం మహంతం
సర్వవ్యాపిన మాత్మానం క్షీరే సర్పి శివార్పితంసా
ఆత్మవిద్యా తపోమూలం త్ద్బ్రహ్మోపవిషదమ్ //
నతత్ర సూర్యోభాతినః చంద్రతారకం
నేమావిద్యుతో భాంతికురో యమగ్ని తస్యభాసా సర్వమిదమ్ విభాతి //
ఓం మహాదేవాయ నమః దీపం దర్శయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)
నైవేద్యం:
(మం) దేవసవితః ప్రసువసత్యంత్వర్తేన పరిషంచామి
అమృతమస్తు అమృతోప స్తరణమసి స్వాహా //
(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.)
ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి,
(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)
(ఎడమచేతితో గంటను వాయించవలెను)
ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా
ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రఃప్రచోదయాత్
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి – ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ పక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – శుద్దాచమనీయం సమర్పయామి.
తాంబూలం:
(మం) ఉమారుద్రాయ తవసే కపర్థినేక్షయద్వీరాయ
ప్రభరామహమతిం / య్ధావశ్శమ అద్విపదే
చతుష్పదే విశ్వం పుష్టంగ్రామే అస్మిన్న నాతురమ్ //
ఓం త్రిపురాంతకాయ నమః తాంబూలం సమర్పయామి.
తాంబూలం చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.
నీరాజనం:
శ్లో // పరానంద చిదాకాశ – పరబ్రహ్మ స్వరూపికా /
నీరాజనం గృహాణేశ – ఆనందాఖ్యం సదాశివ //
(మం) అర్యప్రజామే గోపాయ – సర్వప్రజామే గోపాయ – అమృతత్త్వాయ జీవసే జనిష్యమాణాంచ / అమృతేసత్యే ప్రతిష్టితామ్ అధర్వపితుంమే గోపాయ రసమన్న మిహాయుషే అదబ్దాయో శీతతనో అవిషన్న పితుంకృణుః స్వపశూన్మే గోపాయః ద్విపాదో యే చతుష్పదః అష్టాశ పాశ్చాయ ఇహగ్నే / యేచైక్ శపా అనుగాః సప్రధస్సభాంమే గోపాయ యేచక్యాస్సభాసదః తానింద్రియావతః కురుసర్వమయూరు పానతామ్ హేర్భుద్ని య మంత్రం మే గోపాయ యమృషయస్రై విదావిదుః // ఋచుస్సామాని యజూగంషిపాహి శ్రీరమృతానతామ్ / మానో వాగంసీ జాతవేదోగామశ్వం పురుషం జగత్ అభిభ్రదగ్న గహిశ్రియా మా పరిపాలయా సామ్రాజ్యం చ విరాజం చాభి శ్రీర్యాచనో గృహలక్ష్మీ రాష్ట్రస్యయ ముఖేతయా మానగం సృజామసినం తత శ్రీరస్తుః నిత్యమంగళాని భవంతు.
ఓం సదాశివాయ నమః కర్పూరనీరాజనం సమర్పయామి.
(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)
అనంతరం ఆచమనీయం సమర్పయామి.
మంత్రపుష్పమ్:
ఓం సహస్ర శీర్ షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం,
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదం.
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగం హరిం.
విశ్వమేవేదం పురుషస్త ద్విశ్వముఅపజీవతి,
పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం,
నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః,
నారాయణ పరంబ్రహ్మ తత్త్వం నారాయణః పరః
నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః
యచ్చకించిజ్జగ త్సర్వం దృశ్యతే శ్రూయతే పివా,
అంతర్బహిశ్చ త త్సర్యం వ్యాప్య నారాయణ స్స్థితః
అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం
పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం,
అధోనిష్ట్యా వితస్త్యాన్తే నాభ్యాముపరి తిష్ఠతి,
జ్వాలామాలా కులం భాతి విశ్వస్యాయతనం మహత్,
సన్తతగం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం.
తస్యాన్తే సుషిరగం సూక్ష్మం తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠతం,
తస్య మధ్యే మహా నగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతోముఖః.
సోగ్రభు గ్విభజ న్తిష్ఠ న్నాహార మజరః కవిః
తిర్యగూర్థ్వ మధశ్శాయీ రశ్శయస్తస్య సంతతా,
సంతాపయతి స్వం దేహ మాపాదతలమస్తగః,
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః,
నీలతోయదమధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా,
నీవారశూకవ త్తన్వీ పీతా భాస్వత్యణూపమా,
తస్య శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః,
స బ్రహ్మ స శివ స్స హరిస్సేంద్ర స్సోక్షరః పరమః స్వరాట్.
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే,
నమో వయం వై శ్రవణాయ కుర్మహే
స మే కామా న్కామకామాయ మహ్యం
కామేశ్వరోవైశ్రవణో దదాతు.
కుబేరాయవైశ్రవణాయ, మహారాజాయ నమః
ఓం తద్బ్రహ్మ – ఓం తద్వాయుః ఓం తదాత్మా
ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః.
అన్తశరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కాస్త్వ మింద్రస్తగం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః / త్వం తదాప ఆపోజ్యోతి రసో మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ //
(ఈశాన్యస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మధిపతిర్బ్రహ్మణీధిపతిర్బ్రశివోమే అస్త్సదా శివోం
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్ //
( అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )
ఆత్మప్రదక్షిణ
(కుడివైపుగా 3 సార్లు ఆత్మప్రదక్షిణం చేయవలెను)
యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ,
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే.
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః,
త్రాహి మాం కృపయా దేవ శరణా గతవత్సల.
శ్రీ సదాశివాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
అర్పణం::
శ్లో // యస్యస్మృత్యాచనామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందేతమీశ్వరం //
మంత్రహీనం క్రియాహీనమ్ భక్తహీనం మహేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే //
సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు
శ్రీ సదాశివ ప్రసాదం శిరసా గృహ్ణామి //
(పుష్పాదులు శిరస్సున ధరించవలెను.)
తీర్థస్వీకరణం:
శ్లో // అకాలమృత్యుహరణం – సర్వవ్యాధి నివారణం
సమస్త పాపక్షయకరం – శివపాదోదకం పావనం శుభం //
(అనుచు స్వామి పాద తీర్థమును పుచ్చుకొనవలెను.)
శుభం భూయాత్ ..
పూజా విధానము సంపూర్ణం.

THANKS TO SRI SRAJU NANDA GARU FOR HIS VALUABLE INFORMATION

ARTICLE IN TELUGU ABOUT IMPORTANCE OF KARTHIKA SOMAVARAM


కార్తీక సోమవారం

హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.

ఈ వారంలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీముహూర్తమున స్నానమాచరించి "హరహరశంభో" అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం.దీనినే కార్తీక నత్తాలు అంటారు.
సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తి చేసుకుని, పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం ద్వారా నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం.

Tuesday, 28 October 2014

IMPORTANCE OF VANABHOJANALU IN KARTHIKAMASAM - KARTHIKAMASAM SPECIAL TELUGU ARTICLES COLLECTION

 
కార్తీకమాసం : వనభోజన మహత్యం
 
వశిష్టుడు తిరిగి జనకమహారాజుతో ఇలా అంటున్నాడు… ”ఓ జనక మహారాజా! కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమున నందు గాని విష్ణాలయము నందు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయాలి. అలా చేసినవారి సర్వ పాపములును నివృతియగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్తారు. భగవద్గీత కొంత వరకు పఠించిన వారికీ విష్ణు లోకం ప్రాప్తిస్తుంది. ఒక్క శ్లోకములో ఒక్క పదమైననూ కంఠస్థం చేసినట్లయితే విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరి కాయలతో నిండిఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యదోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడను భోజనం చేయాలి. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షణ తాంబూలములతో సత్కరించి నమస్కరించాలి. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణకాలక్షేపం చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మంపోయి నిజ రూపం కలిగింది” అని చెప్పారు. అది విన్న జనకుడు ”ముని వర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగింది? దానికి గల కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి వశిష్టుడు ఇలా చెబుతున్నాడు…
కిరాతుడు, ఎలుకలకు మోక్షం
రాజా! కావేరి నదీ తీరంలో ఒక గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు. ఆయనకో కొడుకున్నాడు. అతని పేరు శివశర్మ. చిన్నతనం నుంచి భయం భక్తి లేక గారాబంగా పెరిగాడు. దీనివల్ల నీచ సహవాసాలు అలవాటయ్యాయి. అతని దురాచారాలు చూసిన తండ్రి ఒకరోజు అతన్ని పిలిచి ”బిడ్డా…! నీ అపచారాలకు అంతు లేకుండా పోతోంది. నీ గురించి ప్రజలు ఎన్నో రకాలుగా చెప్పుకొంటున్నారు. నన్ను నిలదీస్తున్నారు. నీ వల్ల వస్తున్న నిందలకు నేను సిగ్గుపడుతున్నాను. నలుగురిలో తిరగలేకపోతున్నాను. కనీసం ఈ కార్తీక మాసంలోనైనా నువ్వు బుద్ధిగా ఉండు. నదిలో స్నానం చేయి. శివకేశవులను స్మరించి, సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేయి. నీ పాపాలు తొలగిపోయే అవకాశాలుంటాయి. నీకు మోక్షం ప్రాప్తిస్తుంది” అని చెప్పాడు. దానికి ఆ పిల్లాడు మూర్ఖంగా… ”స్నానం చేస్తే మురికి పోతుంది. అంతే…! దానికి వేరే ఏమైనా వస్తుందా? స్నానం చేసి పూజ చేస్తే దేవుడు కనిపిస్తాడా? గుళ్లో దీపం పెడితే లాభమేమిటి? ఇంట్లో పెడితే వెలుగైనా వస్తుంది కదా?” అని ఎదురు ప్రశ్నలు వేశాడు.
దాంతో ఆ బ్రాహ్మడు ”ఓరీ నీచుడా! కార్తీక మాస ఫలాన్ని ఎంత చులకన చేస్తున్నావు. నీ అంతటి కొడుకు నాకెందుకు? నీవు అడవిలో ఉన్న రావిచెట్టు తొర్రలో ఎలుక రూపంలో బదుకుదువుగాక” అని శపించాడు. ఆ శాపంతో గజగజా వణికిపోయిన శివశర్మ తండ్రి పాదాలపై పడి… ”నన్ను క్షమించండి. అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని, దైవకార్యాలను చులకన చేశాను. నాకు ఇప్పుడు పశ్చాత్తాపమైంది. నాకు శాపవిమోచనం చెప్పండి” అని కోరాడు. అంతట ఆయన ”బిడ్డా! నా శాపం అనుభవించక తప్పదు. అయితే నీవు ఎలుక రూపంలో ఉన్నా.. కార్తీక మహత్యాన్ని వింటే నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందుతావు” అని ఊరడించాడు.
తండ్రి శాపంతో శివశర్మ ఎలుక రూపాన్ని ధరించి, అడవికి పోయి, చెట్టు తొర్రలో నివసిఊ్త, పండ్లు తింటూ బతకసాగాడు. కావేరీ నదీతీరాన ఉన్న రావిచెట్టు తొర్రలో అతను నివాసమేర్పరుచుకోవడం వల్ల నదీస్నానానికి వచ్చేవారు అక్కడున్న వృక్షం కింద విశ్రమించేవారు. నదీ స్నానం చేసేవారు రామాయణ, మహాభారతాలు, పురాణగాథల్ని చెప్పుకొనేవారు. కార్తీకమాసంలో ఒకానొకరోజున మహర్షి విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి అక్కడకు వచ్చాడు. ప్రయాణ బడలిక వల్ల ఆ రావిచెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో తన శిష్యులకు కార్తీకపురాణ విశేషాన్ని బోధిస్తున్నారు. చెట్టు తొర్రలో ఎలుక రూపంలో ఉన్న శివశర్మ కూడా ఆ కథను విన్నాడు. రుషిదగ్గర ఉన్న పూజా సామాగ్రిలో తినేందుకు ఏమైనా దొరుకుతుందేమోనని చెట్టు మొదట నక్కి చూస్తున్నాడు.
అంతలో ఒక కిరాతకుడు చెట్టుకింద ఉన్నవారిని దూరం నుంచి చూసి ”ఓహో… ఈ రోజు నా పంట పండింది. ఈ బాటసారులను దోచుకుంటే డబ్బేడబ్బు” ఆలోచించసాగాడు. అతనలా ఆలోచిస్తూ దగ్గరకు వచ్చేసరికి మునులను చూశాడు. ఒక్కసారిగా అతని బుద్ధి మారిపోయింది. వారందరికీ నమస్కరించి ”మహానుభావులారా…! మీరెవరు? ఎందుకు ఇక్కడకు వచ్చారు? మీ దివ్య దర్శనంతో నా మనసు పులకించిపోతోంది” అని అన్నాడు. అంతట విశ్వామిత్రుడు ”ఓ కిరాతకా! మేం కావేరీ నదీ స్నానమాచరించేందుకు ఇక్కడకొచ్చాం. ఇప్పుడు కార్తీక పురాణం పఠిస్తున్నాం. నువ్వుకూడా ఇక్కడ కూర్చొని వినవచ్చు” అన్నారు.
అటు ఎలుక, ఇటు కిరాతకుడు శ్రద్ధగా కథ వినసాగారు. కథ వింటుండగా… కిరాతకుడికి తన పూర్వజన్మ వృంతాతమంతా జ్ఞాపకమొచ్చింది. పురాణ శ్రవణం తర్వాత రుషులకు దండం పెట్టి, సాష్టాంగం చేసి, వెళ్లిపోయాడు. ఎలుక కూడా పురాణమంతా వినడం, చెట్టుకింద దొరికిన ఫలాలను బుజించడం వల్ల తన స్వరూపాన్ని పొందగలిగింది. ఎలుక రూపం నుంచి విముక్తి పొందిన శివశర్మ విశ్వామిత్రుడితో ”మునివర్యా! ధన్యుడనయ్యాను. మీ వల్ల నేను మూషిక రూపం నంచి విముక్తి పొందాను” అని తన వృత్తాంతమంతా చెప్పాడు.
”కాబట్టి జనకమహారాజా…! ఈ లోకంలో సిరిసంపదలు, పరమున మోక్షాన్ని కోరేవారు తప్పక ఈ కార్తీక పురాణాన్ని చదివి, ఇతరులకు వినిపించాలి. బంధుమిత్రులతో కలిసి వనభోజనమాచరించాలి” అని వివరించారు.