WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Pregnancy Health Tips. Show all posts
Showing posts with label Pregnancy Health Tips. Show all posts

Monday, 19 September 2016

FOOD HEALTH TIPS TO PREGNANT WOMEN AND ALSO AFTER DELIVERY TO KID


ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు - 


* బాలింతలకు ప్రసవించిన 8 వ దినము నుండి క్రమక్రమంగా శరీరమునకు బలము చేకూర్చు ఔషధములు , ఆహారములు వాడుట మంచిది. బాలింతలకు 12 దినములు గడుచునంత వరకు మాంసం పెట్టకూడదు. 

* గర్భం నందు శిశువు తల్లి ఆహారం పంచుకొని పెరుగుట చేత ప్రసవవేదన అనుభవించుట చేత , ప్రసవకాలమున అధిక రక్తస్రావం జరుగుటవలన బాగా అలిసిపోవడం వలన బాలింతరాలుకు వ్యాధులు తొందరగా వచ్చును.అందుకొరకు తొందరగా బలం చేకూర్చుటకు ప్రత్యేక ఔషదాలు ఇవ్వవలెను. దశమూలారిష్టం టానిక్ గాని ద్రాక్షరిష్టం టానిక్ గాని , సౌభాగ్యశొంటి అను లేహ్యం కాని భోజనమును తరువాత వాడవలెను. దీనివలన మంచి జీర్ణశక్తి కలుగును.

* బాలింతలకు పథ్యమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వవలెను . దేహశ్రమ , పురుషసంపర్కం , కోపం చల్లనిపదార్ధాలు వీటిని విడిచిపెట్టవలెను. అన్నివిధముల పరిశుభ్రముగా ఉండవలెను . నెయ్యి వంటి పదార్థం కలిసిన పథ్యమైన ఆహారం మితముగా భుజించవలెను. ప్రతిదినము తలంటుస్నానం చేయవలెను . ఈ నియమాలు బాలింత శ్రద్దగా ఒక నెలరోజుల పాటు అనుసరించవలెను.

* బాలింతరాలు తలంటు స్నానం నందు మూడుమాసముల వరకు బలాధన్వంతర తైలం వాడుట మంచిది. దీనివలన నరములకు బలం కలుగును.

* స్త్రీకి గర్భధారణ నిల్చిపోయి 6 సంవత్సరములు అయిన పిదప మరలా గర్భదారణ జరిగి ప్రసవం ఏర్పడినట్లైతే ఆ శిశువుకు ఆయుర్ధాయం తక్కువ ఉండునని శుశ్రుతుడు చెప్పెను.

* బాగా పాతబడిన బియ్యాన్నే ఆహారముగా ఇవ్వవలెను.

* కందికట్టు , ధనియాలపొడి , శొంఠిపొడి , వెల్లుల్లి పాయ కారం , నువ్వులనూనె , నువ్వులపొడి , ఇంగువ , పాతబెల్లం , తాంబూలం పాత ఉశిరిక పచ్చడి , పాతనిమ్మ పచ్చడి , పొట్లకాయ , మునగకూర , బీరకాయ , కందకూర
ఆవుపాలు , వేడినీటి స్నానం , ఎక్కువ విశ్రాంతి ఇవన్ని తప్పకుండా ఆచరించాలి .

* ప్రసవించిన 15 రోజుల వరకు ఒంటిపూట భొజనం చేయాలి . బొప్పాయిపండు తినవచ్చు. రొట్టె , కాఫీ పుచ్చుకోవచ్చు. కాచి గోరువెచ్చగా ఉన్న చల్లార్చిన నీటిని తాగవచ్చు .

* మాంసాహారం తీసుకునేవారు ఎండుచేపలు , కాల్చిన మాంసం , ఆవునెయ్యిలొ వేయించిన మాంసం , ఎండబెట్టిన మేకమాంసం , మేకమాంసానికి అల్లం , ఉప్పు , కొద్దిగా గరం మసాలా రాసి ఎండించి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఆవునెయ్యిలొ వేయించి తినవచ్చు .

బాలింతలు తినకూడని ఆహార పదార్దాలు -


* ఎట్టి పరిస్థితులలో కొత్తబియ్యం అన్నం తినకూడదు.

* చద్దిఅన్నం , పలుకుగా ఉన్న అన్నం తినరాదు.

* పచ్చి చేపలు , కొత్త చింతపండు , పులుసుకూరలు , మజ్జిగ , పెరుగు ముట్టుకోకూడదు.

* చల్లటి పదార్దాలు ముట్టరాదు.

పైన చెప్పిన నియమాలు పాటించని బాలింతలకు సూతికా వ్యాధులు సంభవిస్తాయి. ఒక్కోసారి ఈ చిన్న వ్యాధులు 13 రకాల సన్నిపాత జబ్బులుగా మారి ప్రాణాలు హరిస్తాయి
గమనిక -

పైన చెప్పిన ద్రాక్షారిష్ట , సౌభాగ్య శొంటి ప్రముఖ ఆయుర్వేద షాపుల్లో లభించును.

************** కాళహస్తి వెంకటేశ్వరరావు **************

HEALTH WITH D-VITAMIN TO MOMS


పాలిచ్చే తల్లులకు డి-విటమిన్‌!

ఇటీవల చిన్నాపెద్దా తేడా లేకుండా అందరిలో డి-విటమిన్‌ లోపంతోనే అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నది తెలిసిందే. దాంతో పాలిచ్చే తల్లులు విటమిన్‌-డి సప్లిమెంట్లను వాడటంవల్ల పిల్లల్లో ఆ విటమిన్‌ శాతం పెరిగి ఆరోగ్యంగా ఉంటారని న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఒటాగో పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే ఎముక కణజాలం కాల్షియంను శోషించుకునేందుకు విటమిన్‌-డి ఎంతో అవసరం. సాధారణంగా ఇది సూర్యరశ్మి ద్వారానే శరీరంలోకి చేరుతుంది. ఆహారం, తల్లిపాల ద్వారా కొంతవరకూ మాత్రమే పిల్లలకు అందుతుంది. దాంతో డి-విటమిన్‌ లోపం ఉన్న పసిపిల్లలో రికెట్స్‌... లాంటి ఎముక సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే పాలిచ్చే తల్లులు విటమిన్‌ -డి సప్లిమెంట్లను తీసుకుంటే పిల్లలో అది క్రమంగా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, ఇందుకోసం 90 మంది పాలిచ్చే తల్లుల్ని ఎంపికచేసి రెండు విభాగాలుగా చేశారు. బిడ్డపుట్టిన నాలుగువారాలపాటు ఒక విభాగానికి 1.25 మి.గ్రా. డోసునీ, మరో విభాగానికి 2.5 మి.గ్రా. మోతాదునీ ట్యాబ్లెట్ల రూపంలో ఇచ్చారట. రక్తపరీక్షలద్వారా పిల్లల్లో ఆ విటమిన్‌ శాతాన్ని పరిశీలించగా అధిక మోతాదు ఇచ్చిన తల్లుల పిల్లలో డి-విటమిన్‌ లోపం పెద్దగా కనిపించలేదనీ తక్కువ మోతాదు తీసుకున్నవాళ్లలో ఇది లోపించిందనీ గుర్తించారు. కాబట్టి తల్లులు డి-విటమిన్‌ సప్లిమెంట్లను వాడటం మంచిదని వాళ్లు విశ్లేషిస్తున్నారు.

Saturday, 10 September 2016

INFORMATION ABOUT PRECAUTIONARY MEASURES / HEALTH TESTS /PROTECTION STEPS TO BE TAKEN BY A PREGNANT WOMEN


గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రక్తహీనత పరీక్షలు

గర్భం ధరించిన స్త్రీలు ముఖ్యంగా చేయించుకోవాల్సిన పరీక్ష రక్తహీనత పరీక్షలు. గ్రామాలలో నిర్దేశించబడిన రోజులలో హీమోగ్లోబిన్ స్థాయిని పరీక్షించే సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆ రోజుల్లో తప్పక పరీక్ష చేయించుకోవాలి. ఒక వేళ అందుబాటులో లేనట్లయితే ఏరియా ఆసుపత్రిలో కానీ ఏదేని పరీక్షా కేంద్రాల్లోకానీ చేయించుకోవాలి. ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా కల ఆహార పదార్థాలు తినాలి. ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగాలి. రోజూ ఒక గుడ్డు తినాలి. రోజూ పండ్లు కూడా తినాలి. ఆరు బయట నడిచేటప్పుడు ఎప్పుడూ చెప్పులు వేసుకోవాలి.మొలలు, అధిక రక్తస్రావం, మలేరియా వంటి సమస్యలకు చికిత్స తీసుకోవాలి. కాన్పు తర్వాత నాల్గవ నెల నుండి మూడు నెలల వరకు 100 ఎం.జి. ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వాడాలి. గర్భిణీ స్త్రీలకి సకాలంలో టి.టి. ఇంజక్షను ఇప్పించాలి. (రెండు మోతాదులు ఒక నెల వ్యవధిలో)ఇప్పించాలి.

గర్భిణీ స్త్రీలకి పోషకాహార లోపం వలన కలిగే నష్టాలు

1. రక్తహీనత
2. కడుపులో బిడ్డ సరిగ్గా ఎదగకపోవుట
3. కాన్పు జరిగినపుడు కష్టం అవడం
4. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం

గర్భిణీ స్త్రీల యొక్క హీమోగ్లోబిన్ శాతం (హెచ్.బి. శాతం) 10 గ్రాముల కంటే తక్కువ ఉంటే ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ బిళ్ళలు రోజుకి 1 చొప్పున 4 నెలలు తీసుకోవాలి. వైద్యుని సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి. వైద్యుని సూచనలు లేకుండా ఈ టాబ్లెట్స్(బిళ్ళలు) వాడరాదు.
గర్భిణీ స్త్రీ 4వ నెల నుండి 100 మి.గ్రా. ఐరన్ మరియు 0.5 మి.గ్రా. ఫోలిక్ యాసిడ్ బిళ్ళలను రోజుకి 1 చొప్పున ఆహారంతోపాటు తీసుకోవాలి. వైద్యుని సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి. వైద్యుని సూచనలు లేకుండా ఈ టాబ్లెట్స్(బిళ్ళలు) వాడరాదు.

నీళ్ళు

గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ చమట(స్వేదం)రావటం సహజమే. ఈస్ట్రోజన్‌ స్థాయిలు తగ్గి , ఉష్ణోగ్రత మార్పులకు సున్నితత్వం పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి . కొబ్బరి నీరు, నిమ్మరసం, ఫ్రూట్ జూస్లు ఎక్కువగా తీసుకోవాలి. దాని వల్ల మూత్రం ఇన్ఫెక్షన్ రాదు.

థైరాయిడ్ పరీక్ష

గర్భిణీ స్త్రీలలో అనేక హార్మోను మార్పుల వల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. ధైరాయిడ్ ఫంక్షన్‌ పరీక్షలు చేయించుకోవాలి. థైరాయిడ్ పనిలో హెచ్చు తగ్గులు వలన చెమటలు పట్టె ఆస్కారము ఉన్నది. గర్భిణీగా ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్యవల్ల గర్భస్రావం జరగవచ్చు. లేదా కడుపులో శిశువు పెరుగుదలను అడ్డుకొంటుంది. కాబట్టి మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఒక సారి థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.

ఆహారం : 

గర్భిణీ స్త్రీలు ఎక్కువ పిండి పదార్ధాలని ఎక్కువ తీసుకోవాలి. వీటిలో ఎక్కువ ఫైబర్,విటమిన్లు, పోషకాలు ఉంటాయి.

పిండి పదార్ధాలు :

పిండిపదార్దాలున్న పప్పులు, ధాన్యాలు, గోధుమలు, బియ్యం, జొన్నలు, రాగులు, బంగాళ దుంపలు, కర్రపెండలం, చిలగడదుంపలు, అరటి, బ్రెడ్, పండ్లు వీటితో పాటు మాంసకృత్తులు ఎక్కువగా వున్నఆహారం తీసుకోవాలి. పప్పులు, చిక్కుళ్ళు, వేరుశనగలు, సోయబీన్సు, పచ్చటి ఆకుకూరలు బాగా తీసుకోవాలి.

డెయిరీ పదార్ధాలు : 

ఇక డెయిరీ పదార్ధాలు గర్భిణీ స్త్రీలకు ఎంతో శ్రేష్టం. అందుకే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటివి చక్కగా తీసుకోవాలి. పాలు, పెరుగు ఎక్కువగా తీసుకుంటే బిడ్డకూ, గర్భానికి చాలా మంచిది. పెరుగు వల్ల జీర్ణాశయం లో ఇంఫెక్షన్స్ ఎమీ రాకుండా చూస్తుంది.

గుడ్లు : 

వీటిలో మీకు కావల్సినంతా ప్రోటీన్లు, అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శిశువు పెరుగుదలకి చాలా ముఖ్యం. గ్రుడ్లలో డజనుకు పైగా విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి.
చేపలు, మాంసము తినటం చాలా మంచిది. వీటిలో ఉండే క్రొవ్వు పదార్ధాలు మీకు మీ బిడ్డకు మంచి శక్తినిస్తాయి.

వేరుశెనగలు : 

ప్రతిరోజు గుప్పెడు వేరుసనగలు తింటే శరీరానికి సరిపడా మాంసకృత్తులు లభిస్తాయి. ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను(ఎక్కువ 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభించాలి, తల్లి పాలు ఇచ్చేంతవరకు పొడిగించాలి.

మాంసాహారం : 

ఉడికించిన పదార్థాలను, పచ్చిగా ఉన్న (ఉడకని పదార్థాలను)విడివిడిగా జాగ్రత్తపరచాలి. స్పూన్స్, ప్లేట్స్, కత్తులు, కట్టింగ్ బోర్డులు వంటివి మాంసాహారాలను కట్ చేసినప్పుడు శుభ్రం చేసిన తర్వాత భద్రపరచాలి. లేదాంటే సాల్మొనెల్ల ఇతర హానికరమైన బ్యాక్టీరియా గర్భిణీ స్త్రీలకు హాని కలిగిస్తుంది.

వాకింగ్ : 

గర్భిణీ స్త్రీలు చేసే పనులలో నడక ఉండాలి. గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే గర్భిణీ స్తీలు ఎక్కువ బరువు పనులు చేయకూడదు. ప్రత్యేకంగా నెలలునిండిన సమయంలో అస్సలు చేయకూడదు. అది కూడా డాక్టర్ సలహా ప్రకారమే నడుచుకోవాలి. ఇలా చిన్న చిన్న వ్యాయామాలు, వాకింగ్ చేయటం వల్ల సుఖ ప్రసవం జరుగుతుంది.

పెట్స్ : 

పెట్స్ అంటే మీరు ఇంట్లో పెంచుకొనే కుక్కలు, పిల్లులూ వాటికి దూరంగా ఉండాలి. ఇంకా వాటిని శుభ్రం చేయకూడదు. ఎందుకంటే వాటిలో పారాసైట్స్ వంటివి ఇన్ఫెక్షన్ కు దారితీస్తాయి. అంతే కాకుండా ఈ సంక్రమణ వల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ మెదడు, కళ్ళ మీద ప్రభావాన్ని చూపుతాయి.

నిద్ర : 

మొత్తానికి గర్భిణి స్త్రీలకు, నిద్రలేమి తప్పదు. నిద్రకు ఉపక్రమించే ముందు వేడిపాలు త్రాగాలి. పగలు కొంచెం వ్యాయామం చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది. రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి. నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి.

ఒత్తిడి

ప్రస్తుతం వయోపరిమితి లేకుండా అందరినీ బాధించేది ఒత్తిడి. ఇలా ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతూనే ఉన్నారు. అయితే దీనికి మూలం గర్భిణీగా ఉన్నప్పుడు తల్లి పడే టెన్షన్‌ వలన పుట్టబోయే బిడ్డలకు కూడా ఒత్తిడి సమస్య సంక్రమిస్తుంది.

కాస్మెటిక్స్ కు దూరంగా

గర్భిణీ స్త్రీలకు కొన్ని వాసనలు పడవు. అలాగే కొన్ని కాస్మోటిక్స్ కూడా చర్మానికి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. కొన్ని రకాల కాస్మొటిక్స్ లో వివిధ రకాల కెమికల్స్ కలపడం వల్ల గర్భస్త శిశువు పై ప్రభావం చూపుతాయి.

ధూమపానం, మధ్యపానం

పోగాకు లేదా మద్యపానం అనగా (సారా, విస్కీ) లాంటివి సేవించరాదు. టీ, కాఫీ తాగడంవలన, శరీరానికి కావలసినంత ఐరన్ దొరకదు. అందుచేత భోజనం తరువాత టీ కానీ కాఫీ కానీ తీసుకోకూడదు.

సెల్ ఫోన్ సంభాషణ

గర్భంతో ఉన్నప్పుడు భర్తకు దూరంగా,పుట్టింట్లో ఉండటం కాస్త కష్టమే. దీనితో ఆ ఎడబాటును పోగొట్టుకునేందుకు భర్తతో సెల్ ఫోన్లో ఎక్కువ సమయం మాట్లాడుతున్నారు. గర్భంతో ఉండే మహిళలు సెల్‌ ఫోన్‌తో ఎక్కువగా మాట్లాడితే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కాలిఫోర్నియాలో దాదాపు 30 వేల మంది చిన్నారులపై వివిధ రకాల పరీక్షలు జరిపిన తర్వాత పరిశోధించగా వారిలో 50శాతం మందికి ఫైగా రేడియేషన్‌ ప్రభావానికి గురెైనట్లు తేలిందని తేల్చి చెప్పారు.రోజులో కావాల్సిన వారితో మూడు, నాలుగుసార్లు మాట్లాడవచ్చు అయితే అది కూడా నాలుగు నిమిషాలకు మించకుండా ఉండాలి. అంతకన్నా ఎక్కువ సేపు మాట్లాడితే పుట్టే బిడ్డపై రేడియేషన్‌ ప్రభావం అధికంగా ఉంటుందని స్పష్టం అవుతోంది.

హై హీల్స్

హై హీల్స్ ఎత్తుమడమల చెప్పులు వాడకూడదు. కాళ్ళకు కరెక్ట్ గా సరిపోయే చెప్పులను, సౌకర్యవంతమైన చెప్పులను ధరించాలి. పాదాలకు ఎప్పుడూ రక్షణ కల్పించాలి. కాళ్ళు, పాదాలు వాపులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి.

షవర్ బాత్

శరీరానికి వేడి తగలకుండా జాగ్రత్త పడాలి. శరీరాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుకోవాలి. వేడి వేడి నీటితో స్నానం చేయకూడదు. గోరు వెచ్చని నీటిని మాత్రమే వాడాలి.

బరువు

గర్భిణి స్త్రీలు తమ బరువును ఎప్పటికప్పుడు చూసుకోవాలి. తొమ్మిది నెలలో గర్భిణి-ఎనిమిది లేక తొమ్మిది కిలోల బరువు పెరగాలి. పెరగనిచో ఏదో సమస్య ఉన్నదని తెలుసుకోవాలి. కనుక వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చివరి నెలలో అకస్మాత్తుగా బరువు పెరగడం మంచిది కాదు. తల్లికాబోయే ఆమెకు మంచి పోషకాహారం ముఖ్యం. పచ్చటి ఆకుకూరలు, గుడ్లు, పండ్లు, మాంసము మొదలగు ఆహరం తీసుకోవాలి.


FOOD HEALTH TIPS TO PREGNANCY AND AFTER PREGNANCY TO WOMEN


గర్భం తరువాత స్త్రీలందరు వారి శరీర బరువు తగ్గించుకొని, తిరిగి సాధారణ శరీర బరువును, ఆకృతిని పొందాలి అనుకుంటారు. నిజానికి గర్భం తరువాత శరీర బరువు తగ్గించుకోవటం చాలా కష్టం అని చెప్పవచ్చు. గర్భం తరువాత శరీర బరువు తగ్గించుకోటానికి, గర్భానికి ముందు పాటించిన ఆరోగ్యకర జీవనశైలితో పాటు, సహనం, అంకిత భావంతో, వాస్తవికంగా మరియు సానుకూల దృక్పథంతో ప్రయత్నించాలి.

గర్భం తరువాత స్త్రీలు మంచి ఆహారాలతో పాటు, వ్యాయామాలను అనుసరించటం వలన శరీర బరువు తగ్గించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. గర్భదశ ముగిసిన తరువాత, ఆహార సేకరణలో కొన్ని సవరణలను అనుసరించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. గర్భం తరువాత బరువు తగ్గించుకోటానికి ఆహారంలో కలుపుకొవలసిన ఆహార పదార్థాల గురించి కింద పేర్కొనబడింది.
కరిగే ఫైబర్ లు

కరిగే ఫైబర్ లను మీరు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోండి. హోల్ గ్రైన్స్, బెర్రీలు, బ్రౌన్ రైస్ మరియు పండ్లలో కరిగే ఫైబర్ లు అధిక మొత్తంలో ఉంటాయి. కడిగే ఫైబర్ లు జీర్ణక్రియను మెరుగుపరిచి, అదనపు కొవ్వు పదార్థాలు, చక్కెరలు మరియు పిండిపదార్థాలను గ్రహించటాన్ని మరియు నిల్వలను తగ్గిస్తాయి. వరి, ఓట్స్, చాయ్ మరియు బార్లీ వంటి వాటిలో నీటిలో కరిగే ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఫైబర్ అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువగా తినటం వలన ఆకలి ఎక్కువగా అనిపించదు మరియు గర్భం తరువాత ఉన్న అధిక బరువును సులభంగా తగ్గిస్తాయి.
శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచుకోండి

గర్భం తరువాత శరీర బరువును తగ్గించుకోటానికి అందుబాటులో ఉన్న మరొక పద్దతి- శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచుకోవటం. అధికంగా నీటిని తాగటం వలన శరీరంలో ఉండే విష పదార్థాలు భయటకు పంపబడి, చివరగా శరీర బరువు తగ్గించబడుతుంది. భోజనానికి ముందు ఒక గ్లాసు మంచి నీటిని తాగండి. దీని వలన ఆకలిగా అనిపించటం తగ్గి, అధిక ఆహార సేకరణకు కూడా దూరంగా ఉంటారు. ఇలా గర్భం తరువాత భోజనాన్ని నియంత్రణలో తీసుకోవటం వలన శరీర బరువు తగ్గుతుంది.
పండ్లు

ప్రతి రోజు 5 రకాల పండ్లను తినండి. గర్భం తరువాత పాటించే ఆహార ప్రణాళికలో అధిక మొత్తంలో ఆకుకూరలు మరియు పండ్లు ఉండేలా ప్రణాళికను రూపొందించుకోండి. కొన్నిసార్లు, భోజనానికి బదులుగా కేవలం పండ్లను మాత్రమే తినవచ్చు.

సూప్స్

గర్భం తరువాత శరీర బరువు తగ్గించుకోటానికి గానూ, వారంలో 3 సార్లు సూప్ లను తాగండి. అధిక బరువును తగ్గించుటలో ఈ పద్దతి కూడా శక్తివంతంగా పని చేస్తుంది. సూప్ లలో తక్కువ క్యాలోరీలు, అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉండి, పొట్ట నిండినట్టుగా నిపించేలా చేస్తాయి.
క్యాలోరీల లేక్కిపు

బరువు నిర్వహణ అనేది తీసుకునే మరియు ఖర్చు చేసే క్యాలోరీల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. భోజనం ఎక్కువగా చేసి అధిక క్యాలోరీలను తీసుకుంటే తరువాత భోజనంలో క్యాలోరీలను తక్కువగా తీసుకోవాలి. ఇలా రోజు తీసుకునే క్యాలోరీల సంఖ్యపై పూర్తి అవగాహాన కలిగి ఉండాలి. మధ్యాన్న భోజనం అధికంగా తిన్నట్లయితే రాత్రి తక్కువ క్యాలోరీలను అందించే బటర్ మిల్క్ లేదా మీగడ తీసిన పాలను తాగాలి. తీసుకునే క్యాలోరీల లెక్కింపుతో పాటుగా, వ్యాయామాలు, ఇతర పనుల ద్వారా ఖర్చు చేసే క్యాలోరీల సంఖ్యను కూడా లెక్కించాలి.
చాక్లెట్ లకు దూరంగా ఉండండి

చాక్లెట్ షేక్స్, హాట్ చాక్లెట్ మరియు చల్లబరచిన చాక్లెట్ ద్రావణాలు తక్కువ స్థాయిలో పోషకాలను కలిగి ఉంటాయి. తినే చాక్లెట్ ల కన్నా చాక్లెట్ ద్రావణాల ద్వారా శరీరానికి అధిక మొత్తంలో క్యాలోరీలు అందించబడి, బరువు తగ్గే ప్రయత్నాన్ని విఫలం చేస్తాయి