గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రక్తహీనత పరీక్షలు
గర్భం ధరించిన స్త్రీలు ముఖ్యంగా చేయించుకోవాల్సిన పరీక్ష రక్తహీనత పరీక్షలు. గ్రామాలలో నిర్దేశించబడిన రోజులలో హీమోగ్లోబిన్ స్థాయిని పరీక్షించే సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆ రోజుల్లో తప్పక పరీక్ష చేయించుకోవాలి. ఒక వేళ అందుబాటులో లేనట్లయితే ఏరియా ఆసుపత్రిలో కానీ ఏదేని పరీక్షా కేంద్రాల్లోకానీ చేయించుకోవాలి. ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా కల ఆహార పదార్థాలు తినాలి. ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగాలి. రోజూ ఒక గుడ్డు తినాలి. రోజూ పండ్లు కూడా తినాలి. ఆరు బయట నడిచేటప్పుడు ఎప్పుడూ చెప్పులు వేసుకోవాలి.మొలలు, అధిక రక్తస్రావం, మలేరియా వంటి సమస్యలకు చికిత్స తీసుకోవాలి. కాన్పు తర్వాత నాల్గవ నెల నుండి మూడు నెలల వరకు 100 ఎం.జి. ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వాడాలి. గర్భిణీ స్త్రీలకి సకాలంలో టి.టి. ఇంజక్షను ఇప్పించాలి. (రెండు మోతాదులు ఒక నెల వ్యవధిలో)ఇప్పించాలి.
గర్భిణీ స్త్రీలకి పోషకాహార లోపం వలన కలిగే నష్టాలు
1. రక్తహీనత
2. కడుపులో బిడ్డ సరిగ్గా ఎదగకపోవుట
3. కాన్పు జరిగినపుడు కష్టం అవడం
4. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం
గర్భిణీ స్త్రీల యొక్క హీమోగ్లోబిన్ శాతం (హెచ్.బి. శాతం) 10 గ్రాముల కంటే తక్కువ ఉంటే ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ బిళ్ళలు రోజుకి 1 చొప్పున 4 నెలలు తీసుకోవాలి. వైద్యుని సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి. వైద్యుని సూచనలు లేకుండా ఈ టాబ్లెట్స్(బిళ్ళలు) వాడరాదు.
గర్భిణీ స్త్రీ 4వ నెల నుండి 100 మి.గ్రా. ఐరన్ మరియు 0.5 మి.గ్రా. ఫోలిక్ యాసిడ్ బిళ్ళలను రోజుకి 1 చొప్పున ఆహారంతోపాటు తీసుకోవాలి. వైద్యుని సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి. వైద్యుని సూచనలు లేకుండా ఈ టాబ్లెట్స్(బిళ్ళలు) వాడరాదు.
నీళ్ళు
గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ చమట(స్వేదం)రావటం సహజమే. ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గి , ఉష్ణోగ్రత మార్పులకు సున్నితత్వం పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి . కొబ్బరి నీరు, నిమ్మరసం, ఫ్రూట్ జూస్లు ఎక్కువగా తీసుకోవాలి. దాని వల్ల మూత్రం ఇన్ఫెక్షన్ రాదు.
థైరాయిడ్ పరీక్ష
గర్భిణీ స్త్రీలలో అనేక హార్మోను మార్పుల వల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. ధైరాయిడ్ ఫంక్షన్ పరీక్షలు చేయించుకోవాలి. థైరాయిడ్ పనిలో హెచ్చు తగ్గులు వలన చెమటలు పట్టె ఆస్కారము ఉన్నది. గర్భిణీగా ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్యవల్ల గర్భస్రావం జరగవచ్చు. లేదా కడుపులో శిశువు పెరుగుదలను అడ్డుకొంటుంది. కాబట్టి మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఒక సారి థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
ఆహారం :
గర్భిణీ స్త్రీలు ఎక్కువ పిండి పదార్ధాలని ఎక్కువ తీసుకోవాలి. వీటిలో ఎక్కువ ఫైబర్,విటమిన్లు, పోషకాలు ఉంటాయి.
పిండి పదార్ధాలు :
పిండిపదార్దాలున్న పప్పులు, ధాన్యాలు, గోధుమలు, బియ్యం, జొన్నలు, రాగులు, బంగాళ దుంపలు, కర్రపెండలం, చిలగడదుంపలు, అరటి, బ్రెడ్, పండ్లు వీటితో పాటు మాంసకృత్తులు ఎక్కువగా వున్నఆహారం తీసుకోవాలి. పప్పులు, చిక్కుళ్ళు, వేరుశనగలు, సోయబీన్సు, పచ్చటి ఆకుకూరలు బాగా తీసుకోవాలి.
డెయిరీ పదార్ధాలు :
ఇక డెయిరీ పదార్ధాలు గర్భిణీ స్త్రీలకు ఎంతో శ్రేష్టం. అందుకే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటివి చక్కగా తీసుకోవాలి. పాలు, పెరుగు ఎక్కువగా తీసుకుంటే బిడ్డకూ, గర్భానికి చాలా మంచిది. పెరుగు వల్ల జీర్ణాశయం లో ఇంఫెక్షన్స్ ఎమీ రాకుండా చూస్తుంది.
గుడ్లు :
వీటిలో మీకు కావల్సినంతా ప్రోటీన్లు, అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శిశువు పెరుగుదలకి చాలా ముఖ్యం. గ్రుడ్లలో డజనుకు పైగా విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి.
చేపలు, మాంసము తినటం చాలా మంచిది. వీటిలో ఉండే క్రొవ్వు పదార్ధాలు మీకు మీ బిడ్డకు మంచి శక్తినిస్తాయి.
వేరుశెనగలు :
ప్రతిరోజు గుప్పెడు వేరుసనగలు తింటే శరీరానికి సరిపడా మాంసకృత్తులు లభిస్తాయి. ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను(ఎక్కువ 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభించాలి, తల్లి పాలు ఇచ్చేంతవరకు పొడిగించాలి.
మాంసాహారం :
ఉడికించిన పదార్థాలను, పచ్చిగా ఉన్న (ఉడకని పదార్థాలను)విడివిడిగా జాగ్రత్తపరచాలి. స్పూన్స్, ప్లేట్స్, కత్తులు, కట్టింగ్ బోర్డులు వంటివి మాంసాహారాలను కట్ చేసినప్పుడు శుభ్రం చేసిన తర్వాత భద్రపరచాలి. లేదాంటే సాల్మొనెల్ల ఇతర హానికరమైన బ్యాక్టీరియా గర్భిణీ స్త్రీలకు హాని కలిగిస్తుంది.
వాకింగ్ :
గర్భిణీ స్త్రీలు చేసే పనులలో నడక ఉండాలి. గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే గర్భిణీ స్తీలు ఎక్కువ బరువు పనులు చేయకూడదు. ప్రత్యేకంగా నెలలునిండిన సమయంలో అస్సలు చేయకూడదు. అది కూడా డాక్టర్ సలహా ప్రకారమే నడుచుకోవాలి. ఇలా చిన్న చిన్న వ్యాయామాలు, వాకింగ్ చేయటం వల్ల సుఖ ప్రసవం జరుగుతుంది.
పెట్స్ :
పెట్స్ అంటే మీరు ఇంట్లో పెంచుకొనే కుక్కలు, పిల్లులూ వాటికి దూరంగా ఉండాలి. ఇంకా వాటిని శుభ్రం చేయకూడదు. ఎందుకంటే వాటిలో పారాసైట్స్ వంటివి ఇన్ఫెక్షన్ కు దారితీస్తాయి. అంతే కాకుండా ఈ సంక్రమణ వల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ మెదడు, కళ్ళ మీద ప్రభావాన్ని చూపుతాయి.
నిద్ర :
మొత్తానికి గర్భిణి స్త్రీలకు, నిద్రలేమి తప్పదు. నిద్రకు ఉపక్రమించే ముందు వేడిపాలు త్రాగాలి. పగలు కొంచెం వ్యాయామం చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది. రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి. నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి.
ఒత్తిడి
ప్రస్తుతం వయోపరిమితి లేకుండా అందరినీ బాధించేది ఒత్తిడి. ఇలా ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతూనే ఉన్నారు. అయితే దీనికి మూలం గర్భిణీగా ఉన్నప్పుడు తల్లి పడే టెన్షన్ వలన పుట్టబోయే బిడ్డలకు కూడా ఒత్తిడి సమస్య సంక్రమిస్తుంది.
కాస్మెటిక్స్ కు దూరంగా
గర్భిణీ స్త్రీలకు కొన్ని వాసనలు పడవు. అలాగే కొన్ని కాస్మోటిక్స్ కూడా చర్మానికి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. కొన్ని రకాల కాస్మొటిక్స్ లో వివిధ రకాల కెమికల్స్ కలపడం వల్ల గర్భస్త శిశువు పై ప్రభావం చూపుతాయి.
ధూమపానం, మధ్యపానం
పోగాకు లేదా మద్యపానం అనగా (సారా, విస్కీ) లాంటివి సేవించరాదు. టీ, కాఫీ తాగడంవలన, శరీరానికి కావలసినంత ఐరన్ దొరకదు. అందుచేత భోజనం తరువాత టీ కానీ కాఫీ కానీ తీసుకోకూడదు.
సెల్ ఫోన్ సంభాషణ
గర్భంతో ఉన్నప్పుడు భర్తకు దూరంగా,పుట్టింట్లో ఉండటం కాస్త కష్టమే. దీనితో ఆ ఎడబాటును పోగొట్టుకునేందుకు భర్తతో సెల్ ఫోన్లో ఎక్కువ సమయం మాట్లాడుతున్నారు. గర్భంతో ఉండే మహిళలు సెల్ ఫోన్‌తో ఎక్కువగా మాట్లాడితే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కాలిఫోర్నియాలో దాదాపు 30 వేల మంది చిన్నారులపై వివిధ రకాల పరీక్షలు జరిపిన తర్వాత పరిశోధించగా వారిలో 50శాతం మందికి ఫైగా రేడియేషన్ ప్రభావానికి గురెైనట్లు తేలిందని తేల్చి చెప్పారు.రోజులో కావాల్సిన వారితో మూడు, నాలుగుసార్లు మాట్లాడవచ్చు అయితే అది కూడా నాలుగు నిమిషాలకు మించకుండా ఉండాలి. అంతకన్నా ఎక్కువ సేపు మాట్లాడితే పుట్టే బిడ్డపై రేడియేషన్ ప్రభావం అధికంగా ఉంటుందని స్పష్టం అవుతోంది.
హై హీల్స్
హై హీల్స్ ఎత్తుమడమల చెప్పులు వాడకూడదు. కాళ్ళకు కరెక్ట్ గా సరిపోయే చెప్పులను, సౌకర్యవంతమైన చెప్పులను ధరించాలి. పాదాలకు ఎప్పుడూ రక్షణ కల్పించాలి. కాళ్ళు, పాదాలు వాపులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి.
షవర్ బాత్
శరీరానికి వేడి తగలకుండా జాగ్రత్త పడాలి. శరీరాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుకోవాలి. వేడి వేడి నీటితో స్నానం చేయకూడదు. గోరు వెచ్చని నీటిని మాత్రమే వాడాలి.
బరువు
గర్భిణి స్త్రీలు తమ బరువును ఎప్పటికప్పుడు చూసుకోవాలి. తొమ్మిది నెలలో గర్భిణి-ఎనిమిది లేక తొమ్మిది కిలోల బరువు పెరగాలి. పెరగనిచో ఏదో సమస్య ఉన్నదని తెలుసుకోవాలి. కనుక వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చివరి నెలలో అకస్మాత్తుగా బరువు పెరగడం మంచిది కాదు. తల్లికాబోయే ఆమెకు మంచి పోషకాహారం ముఖ్యం. పచ్చటి ఆకుకూరలు, గుడ్లు, పండ్లు, మాంసము మొదలగు ఆహరం తీసుకోవాలి.
No comments:
Post a Comment