WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Acidity Health Tips. Show all posts
Showing posts with label Acidity Health Tips. Show all posts

Thursday, 8 September 2016

Natural Remedies for Gastric Problems for Instant Relief - home remedy for acidity


1గ్యాస్ సమస్యతో తరచు భాధపడితే బోజనానికి ముందు అల్లం ముక్కను తింటే ఆ సమస్యలు దరి చేరవు.

2ఇక మనం తినే ఆహరంలో ఎక్కువగా వెల్లుల్లి ఉండే విధంగా చూసుకుంటే చాలా మంచిది.

3జీలకర్ర పొడిని కూడా మనం తినే ఆహరంలో వేసుకుని తింటే చాలా మంచిది.

4సువాసన వచ్చే పొదీన తో టీ త్రాగడం కూడా చాలామంచిది.

5తులసి ఆకులని రసంగా చేసుకుని నిళ్ళలో కలుపుకుని తాగితే గ్యాస్ సమస్యలు దూరం అవుతాయి

6యాలకులు డైజెషన్ ప్రక్రియను ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే గ్యాస్ ని అరికడతాయి. యాలకును మరుగుతున్న నీటిలో వేసి 5 నుంచి 7 నిమిషాలు ఉంచాలి. తర్వాత 

7నిదానంగా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది

8బెల్లం తో పాటు కొంచెం మిరియాల పొడి తీసుకుంటే గ్యాస్ సమసయ్లకే కాదు డైజెషన్ ప్రాబ్లంస్ ను కూడా తగ్గిస్తుంది.

Saturday, 30 January 2016

Home Remedies for Acidity - Top 10 Home Remedies FOR ACIDITY


అసిడిటీ

"ఇదివరకు ఏం తిన్నా అరాయించుకునే వాళ్లం".." ప్రస్తుతం పరిస్థితి అలా లేదు". " ఏ ఆహారం తీసుకోవాలంటే భయమేస్తుందని" చెప్పే వారి సంఖ్య నానాటికి అధికమవుతోంది. ఏదైనా ఆహారం తీసుకోగానే తేన్పులు, చిరాకు, గుండెలో మంట వంటివి వస్తే.. ఈ పరిస్థితినే అసిడిటీ అంటారు .ఎసిడిటీ అనేది జబ్బు కాదు
మనం తీసుకునే ఆహారం, మన జీవన శైలి, మన అలవాట్లు ఇవ్వన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అసిడిటీ కి కారణం అవుతున్నాయి
ఆల్కహాల్, పొగ త్రాగుడు, గుట్కాలు లాంటి పదార్థాలను పూర్తిగా మానివేయాలి.
మానసిక ఆందోళనను తగ్గించుకోవాలి.
ఎక్కడపడితే అక్కడ ఫాస్ట్ఫుడ్స్ తినకూడదు.
మసాలాలు ఉండే ఆహారం కాస్త తగ్గించాలి

దాని ప్రభావానికి గుండెల్లో మంట, నొప్పి, చికాకు వంటివి మొదలవుతాయి. ఇది గుండె నొప్పిలానూ ఉండొచ్చు. గుండెల్లో మొదలయ్యే నొప్పి గొంతు వరకూ కూడా వ్యాపించొచ్చు. అందుకే చాలామంది దీన్ని గుండె జబ్బుగా పొరబడి కార్డియాలజిస్టులనూ సంప్రదిస్తుంటారు
కానీ కాదు
ఇప్పుడున్న ఉరుకులు పరుగులు పెట్టె మన జీవన విధానం లో మార్పు తీసుకురావాలి, ఆహార నియమాలు, వ్యాయామం, భోజనం చేసాక కాసేపు నడవడం, తినగానే పడుకోకుండా ఉండటం, బాగా నూనె, వేసి చేసిన వేపుళ్ళు కాస్త తగ్గించడం ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ జోలికి ఎక్కువ పోకుండా ఉండటం ఇలాంటి మార్పులు తీసుకొస్తే అసిడిటీ రాకుండా చూసుకోగలం ...
time కి తినడం, బాగా నమిలి తినడం ప్రధానం,..కాని మనకి ఉండే బిజీ షెడ్యూల్ ఉద్యోగాలు పనులు మానసిక వొత్తిడి వీటన్నిటి మూలంగా ఈ time కి తినడడం, నమిలి తినడం, మనం ఏం తింటున్నామో గమనించుకోకుండా ఉండటం సాధారణంగా చేస్తుంటాం
కాబట్టి కాస్త మన ఆహార అలవాట్లు జీవన శైలి మార్చుకోడానికి ప్రయత్నం చేద్దాం