WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Articles on Indian Tradition and Culture. Show all posts
Showing posts with label Articles on Indian Tradition and Culture. Show all posts

Friday, 18 December 2015

ARTICLE ON DHANURMASAM MUGGULU - SANKRANTHI MUGGULU AND ITS IMPORTANCE - SPIRIRUAL AND RELIGIOUS AND HEALTHY SECRETS ABOUT MUGGULU / RANGOLI / KOLAMS


ధనుర్మాసం ముగ్గులు

ముగ్గులు తెలుగు ముంగిళ్ళలో వేయబడిన రంగవల్లికలు


ముగ్గుపిండి, బియ్యపురవ్వలతో చుక్కలు పెట్టి, తీగాలుగుగా, బొమ్మలను వేసే అలంకారం ముగ్గు. స్తీల సృజనాత్మకతకు అద్దం పట్టే అందమైన పొందికైన రూపకాలు. ముగ్గులు వాకిలికి అందాన్ని ఇచ్చి, ఇంటికి సౌభాగ్యాన్ని తెస్తాయని నమ్మకం. భారతీయ సంప్రదాయంగా ఎన్నో వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ముగ్గుల సంప్రదాయం కేవలం అలంకరణ కోసమేకాదు.. ఆరోగ్యం, అందం, ఆనందం కోసం కూడా.

ధనుర్మాసం ముగ్గులు:

ధనుర్మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో విష్ణుమూర్తి భూమి మీదకు వస్తాడని నమ్ముతారు. ఈ మాసంలోనే స్వర్గపు ద్వారాలు కూడా తెరుచుకుంటాయనేది మన పెద్దల నమ్మకం. అందుకే మహిళలంతా ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి, కల్లాపి చల్లి, ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులను వేసుకునేప్పుడు విష్ణునామస్మరణ చేస్తూ పూర్తి చేస్తారు. ఈ ముగ్గులలో ప్రత్యేకంగా వైకుంఠ-వాకిళ్ళు వేస్తారు.

ముగ్గులలో గొబ్బిళ్లు…

ఈ నెల మొత్తం ఆవు పేడను ముద్దలుగా చేసి ముగ్గుల మధ్యలో పెడతారు. వీటిని గొబ్బెమ్మలు అంటారు. ఇది గౌరీమాతను పూజించడంలో ఓ భాగంగా వస్తోంది. ఈ గొబ్బెమ్మళ్లను పసుపు కుంకుమలతో అలంకరించి మధ్యలో గుమ్మడి లేదా బంతి పూలను పెడతారు. పెద్దదాన్ని ముగ్గు మధ్యలో పెట్టి చిన్న చిన్న వాటిని వాటి చుట్టూ పెడతారు. చిన్న చిన్న పిల్లలు, పెళ్ళికాని యువతులు మంచి భర్త రావాలని ఈ ముగ్గుల చుట్టూ పాటలు పాడుతూ గొబ్బి తడతారు. పెళ్లైన మహిళలు తమ దాంపత్య జీవితం బాగా గడవాలని కోరుతూ ఈ వేడుకను చేసుకుంటారు. నెల చివర్లో సంక్రాంతిన, వేడుకల అనంతరం..రోజూ ముగ్గులలో పెట్టే గొబ్బిళ్లను తీసి ఎండలో ఎండబెడతారు.వీటిని పండుగ రోజు సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టే తీపి అన్నం (పాయసం) వండేందుకు పిడకలుగా వుపయోగిస్తారు. ఇప్పటికీ పల్లెటూళ్లలో వీటినే వంట చేసుకునేందుకు వుపయోగిస్తారు. ఇవి ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయి కూడా.

పోటీలు…

ఈ మాసంలో మహిళలు పోటీ పడి మరీ ముగ్గులను వేస్తారు. అనేక చోట్ల పోటీలను కూడా నిర్వహిస్తారు. పత్రికలు, వార్తాపత్రికలు, ఇతర సంస్థలు పోటీలను నిర్వహించి బహుమతులను కూడా అందజేస్తారు.

ఆరోగ్యం…

ముగ్గు వేయడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఓ వరం కూడా. ఉదయాన్నే లేవడం… నీటిని తెచ్చి అందులో పేడ కలపడం… చల్లడం.. వంగి ముగ్గులు పెట్టడం ఇదంతా శరీరానికి చక్కటి వ్యాయామాన్ని ఇస్తుంది. ఇది చేతి వేళ్లు మొదలు పాదం వరకు అన్నిటిలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఉదయాన్నే లేవడం వల్ల రోజు మొత్తం ఆహ్లాదంగా వుంటుంది. అధిక బరువు, అనవసర కొవ్వు వంటివి శరీరంలో చేరకుండా కాపాడుతుంది. పైగా పేడలోని ఔషధ గుణాలు ఎన్నో రకాల క్రిములను నాశనం చేస్తాయి. ఆరోగ్యాన్నిస్తాయి.సంక్రాంతి పండుగ అంటేనే మిగిలిన వాటికి ఎంతో ప్రత్యేకమైంది. పల్లెటూళ్లలో ధాన్యం ఇళ్లకు చేరే సమయం.. అన్ని గడపలూ ఆనందంతో నిండిపోతాయి..పైగా సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించే పవిత్రమైన ధనుర్మాసం.. మిగిలిన పండుగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి చేసుకున్నా ఈ పండుగకు మాత్రం సౌరమానాన్ని అనుసరిస్తారు. అందుకే ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత వుంటుంది.

గ్రామీణ ప్రాంతాల్లో…

గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను ఎర్రమన్నుతో కట్టుకునే వారు. అలా కట్టుకున్న ఇంటికి మట్టిపేడను కలిపి అలికేవారు. దీని వల్ల దుమ్ముధూళి వంటివి ఇంట్లోకి రాకుండా అణగి పోయేవి. పురుగులు వంటివి రాకుండా బియ్యపు పిండితో ముగ్గులు పెట్టేవారు. వీటి వల్ల అవి ఆ బియ్యం పిండిని ఆహారంగా తీసుకుని ఇంట్లోకి రాకుండా పోయేవట.

రకాలు..

ఈ ముగ్గులలోనూ రెండు రకాలు వున్నాయి.. అవి ఒకటి చుక్క లు పెట్టి వేసేవి. మరొకటి డిజైన్స్..వీటికి ఏ చుక్కలూ అవసరం లేదు. సృజనాత్మకంగా తమ మనసులోని రూపాలను వేయడం అన్నమాట. ఏది ఏమైనా వీటిలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యత. పువ్వులు, కుందేళ్లు, చిలుకలు, చెరుకుగడలు, ఇళ్లు, లక్ష్మీదేవి వంటి వాటికే ప్రాధాన్యత ఎక్కువ. దక్షిణ భారతదేశంలోని పల్లెటూళ్లలో ఇప్పటికీ పేడ నీటిని చల్లి బియ్యపు పిండితో ముగ్గులు పెట్టుకునేవారున్నారు. ఇప్పుడు చాలా వరకు బియ్యపు పిండికి బదులు ముగ్గురాళ్ల పొడి దొరుకుతుంది. దీని ద్వారా వేసుకుంటున్నారు.

సాంప్రదాయ ముగ్గులు.

మామూలు పిండితో పేడతో కళ్ళాపి చల్లిన నేలపై పెట్టేవి. ఇవి ప్రతి రోజూ పొద్దున్నే ఆలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహలక్ష్మి నడయాడుతుందన్న నమ్మకంతో వేసే ముగ్గులు.

రంగుల ముగ్గులు.

కొన్ని విశేష సంధర్భాలలో రంగులను ఉపయోగించి వేసే ముగ్గులు. పోటీలకు, కొత్త సంవత్సర ముగ్గులను తీర్చి దిద్దేందుకు, ఇంట్లో శుభకార్యాలకు ఇలాంటివి వేస్తుంటారు. కొన్నింటిలో పక్షులు, జంతువులు, పువ్వులు కనిపిస్తాయి.

పండుగ ముగ్గులు.

సాధారణంగా ముగ్గులతోనే పండగలకు కళ వస్తుంటుంది. సంక్రాంతి సందర్భంలో పెట్టే ముగ్గులు దీనికి ఉదాహరణ. కార్తీకమాసం మొదలుకొని సంక్రాంతి పూర్తి అయ్యేంతవరకూ ముగ్గులతో ముంగిళ్ళను ఊరంతా నింపుతూ ఉంటారు. సంక్రాతి ముగ్గులను బంతి పూల రేకులతోను, గొబ్బెమ్మలతోను అలంకరిస్తారు.

చుక్కల ముగ్గు.

ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యని బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు, ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి.

అమావాస్య రోజున ముగ్గులు.

అమావాస్య తిథి రోజున ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని పండితులు అంటున్నారు. అమావాస్యకు ముందురోజున పితృదేవతలు మన గృహానికి వస్తారని, ఆ సమయంలో పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం వంటి కార్యాలను చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. అదేవిధంగా.. అమావాస్య రోజున ఇంటి ముందు చెత్తను శుభ్రం చేసి, నీటితో కల్లాపు చల్లడం వరకే చేయాలి. ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తే పితృదేవతలు వాకిలితోనే ఆగిపోతారని పండితులు అంటున్నారు. అందుచేత అమావాస్య నాడు ఇంటికొస్తారని విశ్వసించే పితృదేవతలను మనసారా ప్రార్థించి, దేవతామూర్తులకు ఇచ్చే నైవేద్యాలు, కర్పూర హారతులివ్వాలని పురోహితులు సూచిస్తున్నారు. పితృదేవతలకు ప్రీతికరమైన రోజైన అమావాస్య నాడు దేవతలు స్మరించినా ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు. ఆ రోజున దేవతలకు సమానంగా పితృదేవతలను కొలిచే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.

నగరాలలో ముగ్గులు.

గతంలో ఇంటి ముందు ముగ్గులు అందంగా వేసేవారు. చాలామందికి ఇప్పుడు ప్రతి రోజు యాంత్రికమైన జీవితంలో పడిపోయి రంగవల్లులను చిత్రీకరించే సమయమే దొరకడం లేదు. దీనికి ముందుగానే పెయింట్తో ముగ్గులు వేసేస్తున్నారు. గతంలో ముదురు రంగులతో ముగ్గులు వేసుకొనేందుకు ఇష్టపడేవారు కాదు. లేత రంగులని మాత్రమే వాడేవాళ్లు. కాని ఇప్పుడు విధానం మారిపోయింది. ప్రధానంగా పట్టణాలు, నగరాలలోని ఫ్లాట్ల ముందు ముదురు రంగులతో ముగ్గులను వేస్తున్నారు. దీంతో ఇంటికి కొత్త అందం వస్తుంది. రంగులతో పెయింటింగ్లో షేడ్లు, టోన్లు ఇలా ప్రతీ ఒక్క విషయానికి ప్రాధాన్యత ఉంటుంది. పెయింట్ వేయడం వల్ల ఇంటికి అందంతో పాటు వాతావరణ ప్రభావాల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. మీరు ఇంటి లోపల, అలాగే ఇంటి బయట ముగ్గులు పెయింట్తో వేయాలనుకుంటే పసుపు, ఎరుపు రంగులు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. కొట్టొచ్చినట్టు కనపడే ఈ రంగులు మనసుకు ఉత్సాహాన్నిస్తాయి. వీటితో మీకు నచ్చిన డిజైన్లలో ముగ్గులు వేసి ఆనందించండి

Monday, 19 January 2015

ARTICLE ON IMPORTANCE OF INDIAN TRADITIONAL CUSTOMS AND CULTURE ABOUT MUGGULU / KOLAMS / RANGOLI / RANGAVALLI


మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి?

 ఏ ముగ్గును ఎక్కడ,ఎప్పుడు వేయాలి?

ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.

అంతేకాదండోయ్! మనం ముగ్గులు రోజు వేయలేక పేంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో #ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

Friday, 9 January 2015

ARTICLE IN TELUGU ABOUT THE RICHEST VALUES OF INDIAN TRADITIONS AND CULTURE ABOUT WEARING WOMEN SINDHOOR / KUMKUM / BOTTU


భారతీయతకు ప్రతీక… కుంకుమ

మోమున మెరిసే కుంకుమ తిలకం నింగిని వెలిగే జాబిలి కిరణం.. ఒక సినిమా కవి వ్యక్తం చేసిన ఈ ఎక్స్‌ప్రెషన్ ఎంత బాగుంటుందో కదా. మనం ధరించే కుంకుమకు ఇంతకంటే గొప్ప ఉండదేమో అనిపిస్తూ వుంటుంది. నిజంగా కుంకుమ ధరించడం అనేది చాలా గొప్ప విషయంగా అనాది నుంచి భావిస్తూ వస్తున్నారు. ఈరోజుల్లో అయితే కొంతమంది తెలిసీ తెలియక నొసట కుంకుమ ధరించటం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించిన విషయం అనుకుంటున్నారు. నిజానికి నుదుట కుంకుమ ధరించడం అనేది స్త్రీ పురుషులిద్దరికీ సంబంధించిన అంశం.

* ఆస్తికుల ఆస్తి కుంకుమ

నుదుట ఎర్రటి కుంకుమ పెట్టుకోవడం అనేది హిందూ సంప్రదాయంలో ఒక భాగం. గతంలో హిందువుల్లో ఏ కులం వారైనాసరే తప్పకుండా నుదుటన కుంకుమ ధరించేవారు. ముఖ్యంగా శైవులు, వైష్ణవులైతే కుంకుమ ధరించడం తప్పనిసరి.. అలా కుంకుమ ధరించడం గొప్పదనంగా భావించేవారు. ఆస్తికుల ముఖం మీద చెరగని ఆస్తిగా కుంకుమ భాసించేది. ఈ ఆధునిక యుగంలో తప్ప శతాబ్దాలుగా ప్రతి ఒక్క హిందువు ముఖం మీద కుంకుమ తప్పకుండా వుండేది. అది కేవలం ఆచారంగా మాత్రమే కాకుండా అలంకారంగా కూడా వర్ధిల్లింది. హరిచందనాన్ని, మంచి గంధాన్ని, విభూతిని, ఎర్రటి కుంకుమను నుదుటన ధరించడం హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ వచ్చింది. సృష్టిలో మొదటిరంగు ఎరుపు కాబట్టి కుంకుమ ఎర్రటి రంగులో ఉంటుందట. ఎరుపురంగు లక్ష్మీప్రదమని కూడా అంటారు.

* నాడులు కలిసే కీలక ప్రదేశంలో…

మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే నాడులు సక్రమంగా పనిచేయాలి. శరీరంలో రెండు ముఖ్యమైన నాడులు వుంటాయి. వాటిలో ఒకటి ‘ఇడ’ రెండోది ‘పింగళ’. ఈ రెండు నాడులూ నుదుటి వద్ద కలుస్తాయి. అంటే శరీరంలోని నాడులన్నింటికీ అనుసంధానం నుదుటన వుందన్నమాట. ఈ ప్రదేశాన్ని ‘సుషుమ్న’ నాడిగా పిలుస్తారు. ఇక్కడ కుంకుమగానీ, గంధం గానీ, విభూదిగానీ ధరించడం వల్ల నాడుల పనితీరు సక్రమంగా వుంటుందన్న అభిప్రాయాలు వున్నాయి. అలాగే కుంకుమ ధరించడం వల్ల దృష్టిదోషం తగలదట. కుంకుమ ధరించిన వ్యక్తులకు ఎదుటి వ్యక్తులు మానసికంగా లొంగిపోతారట. అలాగే కుంకుమకున్న ఎర్రటి రంగు మనలో మనోశక్తి, త్యాగనిరతి, నిర్భయత్వం, పరోపకార గుణాన్ని పెంపొందిస్తాయన్న అభిప్రాయాలు వున్నాయి.

* పవిత్రతకు చిహ్నం

పురుషులు కుంకుమ ధరించడం పవిత్రతకు, ఆస్తికత్వానికి, ధార్మికత్వానికి సంకేతంగా భావిస్తారు. అదే స్త్రీలకయితే పై అంశాలకు తోడు సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా కూడా భావిస్తారు. అనాది నుంచి హిందువులకు ప్రధాన అలంకార ప్రక్రియ కుంకుమ పెట్టుకోవడం అనే అభిప్రాయాలు కూడా వున్నాయి. ఈ విషయాన్ని కొన్ని గ్రంథాల్లో కూడా పేర్కొన్నారు. కుంకుమను భారతీయతకు చిహ్నంగా భావిస్తారు. దూరదర్శన్‌లో చూసే బధిరుల వార్తల్లో ‘ఇండియా’ అనే సందర్భం వచ్చినప్పుడు ఆ న్యూస్‌రీడర్ నుదుటన కుంకుమ పెట్టుకునే ప్రదేశంలో మధ్యవేలుని చూపిస్తుంది. అది కుంకుమకి, భారతదేశానికి ఉన్న బలీయమైన బంధాన్ని సూచిస్తుంది. ఈమధ్యకాలంలో పురుషులు కుంకుమ పెట్టుకోవడం మానేశారు. కొంతమంది మహిళలు కూడా మానేశారు. ఈ ధోరణి ఎక్కడకి దారితీస్తుందోనన్న ఆందోళనను సంప్రదాయ వాదులు వ్యక్తం చేస్తూ వుంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద వుంటుంది. హిందువులు తమ సంప్రదాయానికి దూరంగా వెళ్ళిపోవడం, కుంకుమను విస్మరించడం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

USE KUMKUM ONLY FOR SINDHOOR


 కుంకుమతోనే నొసట బొట్టు పెట్టుకోండి.

నొసట కుంకుమ బొట్టు పెట్టుకునేవారిలో ఒక మంగళకరమైన కళ తాండవిస్తూంటుంది. వీరు ఎదురుపడితే శుభశకునంగా భావిస్తారు. ముత్తైదువలు కుంకుమ పెట్టుకుంటారు. ఇది అలంకరణ మాత్రమే కాదు. దీనికెంతో మహత్తర భావముంది. ముత్తైదువులు మొదట ముఖానికి పసుపు పూసుకుని అటుపై ఉంగరపు వేలితో నొసట బొట్టు పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. కుంకుమ క్రిములను నశింపజేస్తుంది. సమస్తైశ్వరాలను ప్రసాదిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తుంది. శుభములు కలిగిస్తుంది. అలాంటి మహత్తరమైన కుంకుమ ఉంగరపు వేలితోనే పెట్టుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. కుంకుమ రక్తాన్ని శుభ్రం చేస్తుంది. గాయాలను మాన్పుతుంది. బొట్టు పెట్టుకోవడానికి పసుపులో చేసిన కుంకుమ శ్రేష్టమైనది.

Wednesday, 3 September 2014

BRIEF FACTS ABOUT KALANKARI ART IN ANDHRA PRADESH


కళంకారీ కళ
శ్రీకాళహస్తిలో ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఉన్న ఆధారాలను బట్టి, 13 - 19వ శతాబ్దాల్లో కోరమాండల్‌ తీరం వెంబడి వస్త్ర వ్యాపారం బాగా జరిగేది. ఈ కళ ఎక్కువగా హిందూ సాంప్రదాయాన్నే ప్రతిబింబిస్తుంది. ఇక్కడి కళాకారులు ఇప్పటికీ రామాయణం, మహాభారతం, శివపురాణాల నుంచి పాత్రలను చిత్రిస్తూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.కోరమాండల్‌ తీరం వెంబడి ఉన్న ముఖ్యమైన మచిలీపట్నం ఓడరేవు ద్వారా ఈ కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలకూ వ్యాపించాయి. మచిలీపట్నం ఓడరేవుకు సౌకర్యాలు సరిగా లేకపోయినా గోల్కొండ ప్రభువులతో సంబంధాలు ఉండటంవలన అది ముఖ్యమైన ఓడరేవుగా విలసిల్లింది. గోల్కొండ ప్రభువులైన కుతుబ్‌ షాలు కళంకారీ ఉత్పత్తులను ఎక్కువగా కోరే పర్షియన్‌ వర్తకులతో వ్యాపార సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు.

ARTICLE ON ANCIENT INDIAN TRADITION AND CULTURE ABOUT PAGATI VESHAGALLU


కనుమరుగువుతున్న పగటి వేషాలు
కుల సంబంధమైన పగటివేషాలు సంఘంలోని అనేక కులాల వారి జీవనవిధానాన్ని వ్యంగ్యంగా ప్రదర్శిస్తాయి. ప్రతీ కులాన్ని గురించి తెలియచేస్తూ ఆ కులాలపై సమాజం యొక్క అభిప్రాయాలను విమర్శిస్తాయి. పగటివేషాల లక్ష్యం వ్యంగ్యమే. వీరికి రంగస్థలం అంటూ లేదు. ఇంటిగడప, వీధులు, సందులు, గొందులు, అన్ని వీరి రంగస్థలాలే. ప్రదర్శన సమయాల్లో ప్రేక్షకులు, ప్రదర్శకుల మధ్య వ్యత్యాసముండదు. పగటి వేషాల్లోనే ప్రత్యేకత, ప్రావీణ్యత కలిగిన వేషం అర్థనారీశ్వర వేషం. ఒక వ్యక్తి మధ్యలో తెర కట్టుకొని ఒకవైపు నుండి పార్వతి, మరోవైపునుండి శివుడుగా అలంకరణ చేసుకొని ప్రదర్శనలిస్తాడు.

జానపదుడి వీధి ప్రదర్శన-పగటివేషాలు జానపదకళలు ఆదరణ తక్కువ కావడంచేత చాలా కళలు భిక్షుక వృత్తిగా మారిపోయాయి. బుర్రకథ, వీధినాటకం, యక్షగానం వంటి కళారూపాలు భిక్షుకవృత్తిగా మారిపోయిన దశ కనిపిస్తోంది. అలాంటి కళారూపాలలో పగటివేషాలు ఒకటి. చాలా జానపద కళారూపాలు మతపరంగానో, కులపరంగానో, వాయిద్యాలపేరతోనో పిలువబడితే కేవలం ప్రదర్శనా సమయాన్ని బట్టి పిలువబడేది పగటివేషాలు కళ. అనేకమైన వేషాలు ప్రదర్శింపబడడంచేత, కేవలం పగటిపూటనే ప్రదర్శింపబడడంచేత ఇవి పగటివేషలయ్యాయి. పగటి వేషాలనే పైటేషాలని కూడా అంటారు. పగటి వేషాలు జానపద కళారూపాల్లో ప్రముఖమైనవి. యక్షగానం, వీధినాటకాలనుండి బ్రోకెన్‌ డౌన్‌ మిత్‌ అన్న వాదం ప్రకారం వీధినాటకాలే పగటివేషాలుగా మారాయని పరిశోధకుల అభిప్రాయం. ప్రదర్శించే వేళను బట్టి, సమయాన్ని బట్టి వీటికి పగటివేషాలని పేరు వచ్చింది. కేవలం పగటిపూట మాత్రమే వీటిని ప్రదర్శిస్తారు. పగటివేషాలను, సంచారి పగటి వేషాలని, స్థానిక పగటివేషాలని విభజించవచ్చు. సంచారి పగటివేషాల వాళ్ళు దాదాపు సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తుంటారు. వీళ్ళనే బహురూపులు అనికూడా అంటారు. పగటివేషాల ప్రదర్శన ఒక ఊళ్లో నెలల పాటు ఉంటుంది. ప్రతి రోజు ప్రదర్శించి తరువాత చివరి రోజున సంభావనలు తీసుకుంటారు. జానపద కళలూ చాలా వరకు యాచక వృత్తిగా మారిపోయాయి. అట్లా మారిన వాటిలో పగటివేషాలు ఒకటి. వచ్చిన సంభావన అందరూ సమానంగా పంచుకుంటారు. వీరు ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ద వహిస్తారు. సంభాషణలు, వీరు చెప్పే పద్యాలు రక్తి కట్టిస్తాయి. ప్రాచీన కాలంలో అనేక పగటివేషాలు ప్రదర్శింపబడేవి. కానీ ఇప్పుడు అన్ని వేషాలు వేయడం లేదు. కారణం జీవన విధానంలో వచ్చిన మార్పులేనని వీరు చెబుతారు. 

ఒకప్పుడు బోడి బాపనమ్మ వేషం వేసేవారు. కానీ ఉదయమే ఈ విధవ మోహం చూడలేమని ఈ వేషంతో మా యింటి వద్దకు రావద్దని చెప్పడం మూలాన ఈ వేషం వేయడంలేదని కళాకారులు వివరించారు. అలాగే కులాలకు, మతాలకు చెందిన సాత్తని వేషం, బ్రాహ్మణ వేషం వంటివి వేయడంలేదు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్థనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. ఈ వేషం మేకప్‌ వేయడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుందని, సాయంకాలం దాకా ఈ మేకప్‌ ఉండాలి కాబట్టి ప్రత్యేకమైన రంగులు వాడతామని కళాకారులు చెబుతారు. ఒకే వ్యక్తి స్ర్తీ , పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం అంటే సామాన్య విషయం కాదు. పగటి వేషాలు చారిత్రకత జనవ్యవహారంలో...వాడుకలో ఉన్న కథలను బట్టి పగటివేషాలు రాజు కళింగ గంగుకథ, సంబెట గురవ రాజు కథ, విజయనగర రాజుల కథలు ప్రస్తావనలోకొస్తాయి. పగటి వేషాలకు సైతం చారిత్రకాధారాలున్నాయి. శాతవాహనుల పరిపాలనా కాలం నుండే ఈ కళారూపం ఉందని, హాలుని గాధాసప్తశతిలో దీని ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది.

పగటివేషాలు - వర్గీకరణ : ఇతివృత్తం ఆధారంగా పగటి వేషాలను ఐదు విధాలుగా విభజించవచ్చు. 
1. మతపరమైనవి: ఆదిబైరాగి వేషం, చాతాది వైష్ణవ వేషం, కొమ్ము దాసరి వేషం, హరిదాసు వేషం, ఫకీరు వేషం, సహెబుల వేషం. 
2. కులపరమైనవి: బుడబుక్కల వేషం, సోమయాజులు-సోమిదేవమ్మ వేషం, బోడి బ్రాహ్మణ స్ర్తీ వేషం, వీరబాహు వేషం, గొల్లబోయిడు వేషం, కోయవాళ్ళ వేషం, దేవరశెట్టి వేషం, దేవాంగుల వేషం, ఎరుకలసోది వేషం వంటివి. 
3. పురాణపరమైనవి: జంగం దేవర వేషం, శక్తి లేదా శూర్పణఖ వేషం, అర్థనారీశ్వర వేషం వంటివి. 
4.జంతు ప్రదర్శన పరమైనవి: గంగిరెద్దుల వేషం, పాములోళ్ల వేషం తదితరములు...
5. ఇతరములు: పిట్టలదొర వేషం, చిట్టి పంతులు వేషం లాంటివి.


DETAILED ARTICLE ON ANDHRA TRADITIONAL JANTA KOLATAM



కోలాటం మన సంప్రదాయం
లయ ప్రకారం రెండు భాగాలుగా నిలబడిన కేంద్రం నుంచి మరో కేంద్రానికి ఒకరి తర్వాత మరొకరు వరస క్రమంలో తిరగడంతో ఈ తాళ్ళన్నీ అల్లబడిన జడలాగా ఎంతో సుందరంగా కనబడుతుంది. ఈ జడకోపు కోలాటం ఓ అద్భుతమైన నాట్య విశేషం.

ఒక రకమైన సాంప్రదాయక సామూహిక ఆట. కోల మరియు ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధం... ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అనే అర్ధంగా భావించవచ్చు. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కర్రముక్కలు పట్టుకొని పదం పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతికర్ర ముక్కలను వేరొకరి చేతికర్ర ముక్కలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు మరియు స్ర్తీలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ప్రదర్శనలు ప్రసిద్ధంగా జరిగినట్లు అబ్దుల్‌ రజాక్‌ అనే చరిత్రకారుడు వర్ణించాడు. విజయనగర శిధిలాలపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల శిల్పాలను నేటికీ మనం చూడవచ్చు. జడకొప్పు కోలటంతో గ్రామదేవతలైన ఊరడమ్మ , గడి మైశమ్మ , గంగాదేవి , కట్టమైసమ్మ , పోతలింగమ్మ , పోలేరమ్మలకు ప్రార్థనలు నిర్వహిస్తారు.

దాండియా: దసరా నవరాత్రుల సంబరాలలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన దాండియా కూడా కోలాటంలాగానే రంగురంగుల కర్రలతో రాధాకృష్ణుల గీతాలతో నృత్యాలు చేస్తారు. ఎక్కువగా ఉత్తరభారతదేశంలో ఈ దాండియా ఆట ప్రాచుర్యం పొందింది. శ్రీకృష్ణుడు బృందావన గోపికలతో ఎంతో హృద్యంగా దాండియా ఆడినట్లు వారి నమ్మకం. ఆంధ్రాలో కోలాటం నృత్యరీతి చాలా ప్రాచీనమైనది. నాడు రాజులు, మహరాజులు కళాపోషకులుగా ఉండి ఈ నృత్యాన్ని ఆదరించేవారు. కాలక్రమేణా ఈ నృత్యానికి ఆదరణ నెమ్మదిగా తగ్గిపోతోంది. ఇప్పటికీ సంప్రదాయనృత్యాలలో భాగంగా ఈ కోలాట నృత్యాన్ని అభినయిస్తుంటారు. 

ఆట విధానం : కోలాటం పట్ల ఆసక్తి ఉన్న కొందరు ఒక బృందంగా ఏర్పడి, ఈ నృత్యాన్ని చేస్తారు. కళాకారులందరూ వర్తులాకారంగా నిలబడి ఇష్ట దేవతా ప్రార్ధన చేసిన అనంతరం ఆట ప్రారంభిస్తారు. బృందం నాయకుణ్ణి కోలన్న పంతులనీ, అయ్యగారనీ పిలుస్తారు. ఇరవై నుంచి నలభై మంది ఆటగాళ్ళు ఇందులో ఉంటారు. ఆటగాళ్ళ సంఖ్య మాత్రం ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉంటుంది.

Friday, 11 July 2014

ARTICLE ON TELUGU CULTURE AND TRADITIONAL PADAHARANALA TELUGU AMMAI - TELUGU TRADITIONAL BEAUTY



పదహారణాల తెలుగమ్మాయి అంటే..!?  

అది తెలుసుకోవాలంటే ముందు పదహారణాలు అంటే ఏంటో పరిశీలిద్దాం.

భారత దేశంలో ఒకప్పుడు అణాలు ఉండేవి అని మన అందరికి తెలుసు. ఆ తరువాతి కాలంలో రూపాయి ప్రవేశపెట్టబడింది. రూపాయి అంటే వంద పైసలు. మరి అణాలను పైసలుగా, పైసలను అణాలుగా మార్చలంటే ఒక భాజకం ఉండాలి కదా, అది ఒక అణా = 6.25 పైసలు.


మనలో చాలా మందికి తెలిసిన కొన్ని పదాలు పరిశీలిస్తే. (భావితరాలకు తెలిసే అవకాశంలేదు, ఎందుకంటే అవి వాడుకలోంచి వెళ్ళిపోయాయి)

చారాణా (చార్, అణా) = 4 * 6.25 =25 పైసలు

ఆటాణా (ఆట్, అణా) = 8 * 6.25 = 50 పైసలు

బారాణా (బారహ్, అణా) = 12 * 6.25 = 75 పైసలు


లెక్క సరిపోయింది కదా. ఇక పదహారణాలు అంటే 16 * 6.25 = 100 పైసలు. 

అంటే నిండు రూపాయి. లేదా నూటికి నూరు శాతం (100%). 99.9999..% కూడా 100% కి సమానం కాదు. 

ఇక పదహారణాల తెలుగమ్మాయంటే నూటికి నూరుశాతం తెలుగమ్మాయి, నిండైన తెలుగమ్మాయి, సంపూర్ణమైన తెలుగమ్మాయి అని చెప్పుకోవచ్చు. తన భాషలో, భావనలో, నడకలో, నడతలో, ఆహార్యంలో, వస్త్ర ధారణలొ, ఇలా ప్రతివిషయంలో తెలుగుదనాన్ని మాత్రమే నింపుకున్న అమ్మాయి మాతమే పదహారణాల తెలుగమ్మాయి అనడానికి అర్హత కలిగిన అమ్మాయి. ఏ ఒక్క విషయంలో తెలుగుదనం లేకున్నా తనకు పదహారణాలు తెలుగమ్మయి అని పిలవబడటానికి అర్హత లేదు.

Thursday, 6 February 2014

THE IMPORTANCE OF WEARING METTELU BY WOMEN


మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి....

నన్నయ తిక్కన కాలంలో పురుషులు కూడా కాళివేళ్లకు మట్టెలు ధరించెడివారు. అరుదుగా ఈ కాలంలో కూడా అక్కడక్కడ కొందరు పురుషులు సకృత్తుగా మట్టెలు పెట్టుకోవడం కనిపిస్తుంది.

వివాహిత స్త్రీలు కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవడం ఆచారం. వాడుకలో 'మెట్టెలు'గా ఉన్న ఈ పదం నిజానికి 'మట్టెలు'. కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది. 

కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. ఇలా అనుకోవడానికి కారణం ఓ పురాణగథ.

దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయణి, తన కాలివేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి, అందులో తాను దహనమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. దీనిని అనుసరించే పై నమ్మకం ఏర్పడింది. అందుకే వివాహిత స్త్రీలు మెట్టెలు పెట్టుకునే ఆచారం వచ్చింది.


It is worn as a symbol of married state by Hindu women
 and is called bichiya in Hindi, mettelu in Telugu, 
metti in Tamil & kalungura in Kannada.

Tuesday, 14 January 2014

ARTICLE IN TELUGU ON THE HISTORY AND TRADITIONAL IMPORTANCE OF INDIAN MUGGU / KOLAM / RANGAVALLI


మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి? ఏ ముగ్గును ఎక్కడ,ఎప్పుడు వేయాలి?

ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.

అంతేకాదండోయ్! మనం ముగ్గులు రోజు వేయలేక పేంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

Saturday, 11 January 2014

SCIENTIFIC REASON / IMPORTANCE OF INDIAN CULTURE / MUGGU / KOLAM / RANGAVALLI - THE IMPORTANCE OF MUGGULU FOR WOMEN - HEALTHY REASONS FOR WOMEN ON MUGGULU




మన హిందూ సంప్రదాయంలో ప్రతి రోజు స్త్రీలు ఉదయం ఇళ్ళముందు ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేయమని చెప్పడానికి ఆరోగ్య కారణాలున్నాయి.

శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో అనేకానేక వెన్ను సమస్యలకు దారి తీస్తుంది. రాత్రంతా పడుకున్న సమయంలో వెన్ను నిటారుగా ఉంటుంది. ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం సత్ఫలితాలనిస్తుందని గమనించారు మన పెద్దలు. ఉదయమే నడుముకు సంబంధించిన వ్యాయామంలో భాగమే స్త్రీలు ముగ్గు వేయడం.

ముగ్గులు వేయాలంటే నడుమువంచాలి. చుక్కలు పెడతారు, అవి కలపడానికి అటు, ఇటు చేతులు, నడుము కదపాలి. ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయమం చేసినవారవుతారు. దీని కారణంగా దీర్ఘకాలంలో నడుము నొప్పులు రావు. అందుకే ఉదయమే ముగ్గులు వేయడం మన సంప్రదాయంలో భాగంగా పెట్టారు.

ఈనాటి కాలంలో ఒక్కసారి గమనిస్తే, మనమూ, మన పిల్లలు కూడా శరీరంలో అన్ని భాగాలకు తగిన వ్యాయామం అందివ్వడంలేదు. పిల్లలు పొద్దున బడికి వెళ్తే, ఏ రాత్రో ఇంటికి వస్తున్న రోజులివి. ఇంట్లో సౌకర్యాలు అన్ని ఉండడం వల్ల అసలు నడుము ఒంచి పని చేసే అవకాశం ఉండడంలేదు. ఇది దీర్ఘకాలంలో వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలను కారణం అవుతుంది. వారు ఆ కాలంలో ఆలోచించి వాడుకలోకి తెచ్చిన ఈ సంప్రదాయం ఈ కాలం వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పెయింట్లు పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాం.

స్త్రీలే వేయాలా అంటే కాదు అనే చెప్పాలి. గర్భగుడిలో భగవంతుని వద్దకు పూజారి మాత్రమే వెళ్తాడు. దేవుడి వద్ద శుభరపరిచి, ఆయనే వేస్తారు(ఎందుకంటే గర్భ గుడిలోనికి పూజారి తప్ప వేరేవారు ప్రవేశించరు కనుక). అలాగే సూర్య భగవనుడికి సంబంధించిన పూజలు చేసే సమయంలో, ఇతర దేవతాపూజలలోనూ కొన్ని రకాల యంత్రాలను వేయవలసి ఉంటుంది. అప్పుడు కూడా ఉపాసకులే వేస్తారు.

స్త్రీలకు సృజనాత్మకత ఎక్కువ. వారిలోని సృజనాత్మకతను బయట ప్రపంచానికి తెలియపరుస్తుంది ముగ్గు.