కళంకారీ కళ
శ్రీకాళహస్తిలో ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఉన్న ఆధారాలను బట్టి, 13 - 19వ శతాబ్దాల్లో కోరమాండల్ తీరం వెంబడి వస్త్ర వ్యాపారం బాగా జరిగేది. ఈ కళ ఎక్కువగా హిందూ సాంప్రదాయాన్నే ప్రతిబింబిస్తుంది. ఇక్కడి కళాకారులు ఇప్పటికీ రామాయణం, మహాభారతం, శివపురాణాల నుంచి పాత్రలను చిత్రిస్తూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.కోరమాండల్ తీరం వెంబడి ఉన్న ముఖ్యమైన మచిలీపట్నం ఓడరేవు ద్వారా ఈ కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలకూ వ్యాపించాయి. మచిలీపట్నం ఓడరేవుకు సౌకర్యాలు సరిగా లేకపోయినా గోల్కొండ ప్రభువులతో సంబంధాలు ఉండటంవలన అది ముఖ్యమైన ఓడరేవుగా విలసిల్లింది. గోల్కొండ ప్రభువులైన కుతుబ్ షాలు కళంకారీ ఉత్పత్తులను ఎక్కువగా కోరే పర్షియన్ వర్తకులతో వ్యాపార సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు.
No comments:
Post a Comment