మాతృదేవో భవ
పితృదేవో భవ
ఆచార్యదేవో భవ అన్నారు పెద్దలు
ఎవరికైనా అమ్మ నాన్నల తర్వాత గురువే దైవం.
మనమందరం ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం గురువులే..
అందుకే మనం ఆ గురువులని ఎప్పుడూ పూజించాలి, గౌరవించాలి..
మంచి చెడులని చెప్పి అజ్ఞానాన్ని తొలగించి, మంచి అనే మార్గంలో మనల్ని నడిపించే బోధన చేసిన గురువులు దేవునితో సమానం..
"గు" అంటే అంధకారం అని
"రు" అంటే దానిని నిర్మూలించే పరబ్రహ్మం అని అర్థం.
అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చే వ్యక్తులే నిజమైన గురువులు..
గురువులను గౌరవిచే శిష్యులు,
శిష్యులపై ప్రేమామృతం కురిపించే గురువులు నెలకొన్న విధ్యావ్యవస్థ భారతీయుల విద్యకు అద్దం పట్టగలదు.
గురువులలో సేవాభావం, తాత్వికత నిబధ్దత ఉండాలి..
విశ్వ విఖ్యాత తాత్వికుడు ఆదర్శ ఉపాధ్యాయుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని భవనలు అధ్యాపక లోకాని స్పూర్తి కావాలని కోరుకుంటూ
అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

No comments:
Post a Comment